వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్లో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో 6 వికెట్ల తేడాతో భారత్ ఓటమి చవిచూసింది. దీంతో ఆరోసారి ఆస్ట్రేలియా ఛాంపియన్స్‌గా అవతరించగా.. భారత్ మరోసారి రన్నరప్‌గా నిలిచింది. ఇక ఛాంపియన్స్‌గా నిలిచిన ఆస్ట్రేలియాకు పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది అభినందనలు తెలిపాడు.
"వన్డే ప్రపంచకప్-2023 విజేతగా నిలిచిన ఆస్ట్రేలియాకు నా అభినందనలు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మెరుగైన ప్రదర్శరన కనబరిచింది. టీమిండియాకు అదృష్టం కలిసిరాలేదు. కానీ టోర్నీ మొత్తం భారత్ అద్భుతంగా ఆడింది" అని ట్విటర్‌లో అఫ్రిది పోస్ట్ చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ విఫలమైంది.
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 240 పరుగులకే ఆలౌటైంది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి(54), కేఎల్ రాహుల్(66) పరుగులు చేశారు. అనంతరం 241 పరుగుల లక్ష్యాన్ని 43 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆసీస్ విజేతగా నిలవడంలో ట్రావిడ్ హెడ్ కీలక పాత్ర పోషించాడు. హెడ్ అద్బుతమైన సెంచరీతో (120 బంతుల్లో 137 పరుగులు) ఆరోసారి తన జట్టును ఛాంపియన్స్‌గా నిలిపాడు.
చదవండి: AUS vs PAK: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్.. పాక్ జట్టు ప్రకటన! యువ సంచలనం ఎంట్రీ
Comments
Please login to add a commentAdd a comment