భారత్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని టీమిండియా అద్భుతమైన విజయంతో ఆరంభించిన సంగతి తెలిసిందే. పెర్త్‌లో జరిగిన మొదటి టెస్ట్‌లో ఆస్ట్రేలియాను 295 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
ఇక ఇదే జోరును డిసెంబర్ 6న ఆడిలైడ్ వేదికగా ప్రారంభం కానున్న పింక్‌బాల్ టెస్టు(సెకెండ్ మ్యాచ్)లో కనబరచాలని భారత జట్టు పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌కు టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులోకి వచ్చాడు.
మరోవైపు బొటనవేలు గాయం కారణంగా మొదటి టెస్టుకు దూరమైన యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ సైతం సెకెండ్ టెస్టులో ఆడే అవకాశముంది.ఈ నేపథ్యంలో ఆడిలైడ్ టెస్టుకు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌ను భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఎంచుకున్నాడు.
"సెకెండ్ టెస్టులో భారత్ ఖచ్చితంగా రెండు మార్పులు చేస్తుందని నేను భావిస్తున్నాను. రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ ఇద్దరూ తుది జట్టులోకి రానున్నారు. ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు ఎంట్రీతో దేవ్‌దత్త్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ బెంచ్‌కే పరిమితవ్వాల్సిందే.
అదే విధంగా రోహిత్, గిల్ తిరిగి రావడంతో భారత బ్యాటింగ్ ఆర్డర్ మారే అవకాశముంది. యధావిధిగా రాహుల్ స్థానంలో రోహిత్ శర్మ ఓపెనర్‌గా, ఫస్ట్ డౌన్‌లో గిల్ బ్యాటింగ్‌కు రానున్నారు. రాహుల్ ఆరో స్ధానంలో బ్యాటింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు వాషింగ్టన్ సుందర్ స్ధానంలో రవీంద్ర జడేజాకు జట్టు మేనెజ్‌మెంట్ చోటు ఇచ్చే అవకాశముందని" 7 క్రికెట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు.
ఆసీస్‌తో రెండో టెస్టుకు గవాస్కర్ ఎంచుకున్న భారత తుది జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
చదవండి: IND vs AUS: టీమిండియాతో రెండు టెస్టు.. ఆస్ట్రేలియాకు భారీ షాక్
Comments
Please login to add a commentAdd a comment