ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో 6 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి భారత్ దూసుకువెళ్లింది. 115 స్వల్ప లక్క్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 26. 4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. చతేశ్వర్ పూజారా(27), శ్రీకర్ భరత్(23) ఆఖరి వరకు ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు.
ఆస్ట్రేలియా బౌలర్లలో లియోన్ రెండు వికెట్లు, మర్ఫీ ఒక వికెట్ సాధించారు. ఇక అంతకముందు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 113 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో 7 వికెట్లతో రవీంద్ర జడేజా ఆసీస్ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు అశ్విన్ మూడు వికెట్ల పడగొట్టాడు. ఆసీస్ బ్యాటర్లో హెడ్ 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 263 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. అనంతరం టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్ 262 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌కు కేవలం ఒక్క పరుగు మాత్రమే లీడ్ లభించింది. ఇక ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో కూడా స్పిన్నర్లే పూర్తి అధిపత్యం చెలాయించారు.
►115 స్వల్ప లక్క్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 69 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన కోహ్లి.. స్టంపౌట్‌గా వెనుదిరిగాడు.
►115 స్వల్ప లక్క్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 11 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసింది. క్రీజులో పూజారా(12), విరాట్ కోహ్లి ఉన్నారు. రెండో వికెట్‌గా రోహిత్ రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు.
115 స్వల్ప లక్క్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా లంచ్ విరామానికి వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(21), పూజారా ఉన్నారు.
రవీంద్ర జడేజా మ్యాజిక్.. 113 పరుగులకే కుప్పకూలిన ఆసీస్
భారత స్పిన్నర్ల దాటికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 113 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో 7 వికెట్లతో రవీంద్ర జడేజా ఆసీస్ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు అశ్విన్ మూడు వికెట్ల పడగొట్టాడు. ఆసీస్ బ్యాటర్లో హెడ్ 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో మిగిలిన ఒక్క పరుగు అధిక్యంతో కలిపి భారత్ ముందు కేవలం 115 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది.
పీకల్లోతు కష్టాల్లో ఆస్ట్రేలియా.. 95 పరుగులకే 7 వికెట్లు
రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా పీకల్లోతు కష్టాల్లో పడింది. కేవలం 95 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. భారత స్పిన్నర్ల దాటికి ఆసీస్ బ్యాటర్లు విలవిల్లాడుతున్నారు. 24 ఓవర్‌లో జడేజా వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు సాధించాడు. తొలి బంతికి హ్యాండ్ కాంబ్‌ను పెవిలియన్‌కు పంపగా.. రెండో బంతికి కమ్మిన్స్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
అశ్విన్ మ్యాజిక్..
రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ వరుసక్రమంలో వికెట్లు కోల్పోతుంది. జడేజా బౌలింగ్‌లో లబుషేన్ క్లీన్ బౌల్డ్ కాగా.. అశ్విన్ బౌలింగ్‌లో మాట్ రెన్ షా ఎల్బీగా వెనుదిరిగాడు. 23 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 99/5. క్రీజులో హ్యాండ్ కాంబ్, క్యారీ ఉన్నారు.
మూడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
85 పరుగుల వద్ద ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన స్మిత్ అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. క్రీజులో లబుషేన్, రెన్‌షా ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్
ఢిల్లీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు మూడో రోజు ఆట ప్రారంభమైంది. ఆదిలోనే ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రెవిస్ హెడ్‌ను అశ్విన్ పెవిలియన్‌కు పంపాడు. 43 పరుగులు చేసిన ట్రెవిస్ హెడ్ వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులో లబుషేన్, స్మిత్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment