ఆస్ట్రేలియా-భారత్ మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభానికి మరో ఐదు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. నవంబర్ 22న పెర్త్ వేదికగా తొలి టెస్టుతో ఈ ప్రతిష్టాత్మక సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు మొదటి టెస్టు కోసం తీవ్రంగా శ్రమిస్తోంది.
న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్ అయిన భారత జట్టు ఆసీస్ పర్యటనను విజయంతో ప్రారంభించాలని భావిస్తోంది. అయితే తొలి టెస్టుకు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటుపై ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది.
ఈ క్రమంలో పెర్త్ టెస్టు కోసం భారత ప్లేయింగ్ ఎలెవన్‌ను టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఎంచుకున్నాడు. తొలి టెస్టులో భారత ఓపెనర్‌గా శుబ్‌మన్ గిల్‌ను రవిశాస్త్రి ఎంపిక చేశాడు. అదే విధంగా కేఎల్ రాహుల్ ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్ రావాలని అతడు సూచించాడు. మరోవైపు ధ్రువ్ జురెల్‌కు సైతం శాస్త్రి చోటిచ్చాడు.
"తొలి టెస్టులో భారత ఓపెనర్‌గా శుబ్‌మన్ గిల్‌ను ప్రమోట్ చేయాలి. అతడికి ఓపెనర్‌గా అనుభవం ఉంది. గత ఆస్ట్రేలియా పర్యటనలో అతడు టీమిండియా ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. ఒకవేళ గిల్ జట్టులో లేకపోయింటే ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాల్సి ఉండేది.
రోహిత్ బ్యాకప్‌గా ఎంపికైన ఈశ్వరన్ పెద్దగా రాణించలేకపోయాడు. ఆస్ట్రేలియా-ఎతో జరిగిన సిరీస్‌లో ఈశ్వరన్ కనీసం హాఫ్ సెంచరీ మార్క్‌ను దాటలేకపోయాడు. అయితే నెట్స్‌లో ఎలా బ్యాటింగ్ చేస్తున్నాడో జట్టు మేనెజ్‌మెంట్‌కే తెలియాలి.
తుది జట్టులో అశ్విన్ లేదా జడేజాకు చోటు ఇవ్వాలా అన్న చర్చ నడుస్తోంది. నేను అయితే జడేజాతోనే వెళ్తాను. ఎందుకంటే అతడు ఫీల్డింగ్‌తో పాటు బ్యాటింగ్ కూడా అద్బుతంగా చేయగలడు. అశ్విన్‌కు ఓవర్సీస్‌లో పెద్దగా రికార్డు లేదు" అని ఐసీసీ రివ్యూలో శాస్త్రి పేర్కొన్నాడు.
రవిశాస్త్రి ఎంచుకున్న భారత తుది జట్టు ఇదే
శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా/వాషింగ్టన్ సుందర్, నితీష్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్.
చదవండి: #Tilak Varma: తిలక్ వర్మ సరికొత్త చరిత్ర.. విరాట్ కోహ్లి ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్
Comments
Please login to add a commentAdd a comment