రోహిత్‌ శర్మ- గిల్‌ అరుదైన రికార్డు.. వరల్డ్‌కప్‌ చరిత్రలోనే | Rohit Sharma and Shubman Gill becomea Highest opening stand for India in the ODI World Cup Final | Sakshi
Sakshi News home page

ODI World Cup Final: రోహిత్‌ శర్మ- గిల్‌ అరుదైన రికార్డు.. వరల్డ్‌కప్‌ చరిత్రలోనే

Published Sun, Nov 19 2023 2:55 PM | Last Updated on Sun, Nov 19 2023 3:32 PM

Rohit Sharma and Shubman Gill becomea Highest opening stand for India in the ODI World Cup Final - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023 ఫైనల్లో అహ్మదాబాద్‌ వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌ టీమిండియా బ్యాటింగ్‌ను ఆ‍హ్హనించాడు. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్‌ చేస్తున్న భారత్‌ 11 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు నష్టపోయి 81 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ(47), శుబ్‌మన్‌ గిల్‌(4), శ్రేయస్‌ అయ్యర్‌(4) పరుగులకే ఔటయ్యారు.

రోహిత్‌-గిల్‌ జోడీ అరుదైన ఘనత..
కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన ఘనత సాధించారు. వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీ ఫైనల్లో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన భారత ఓపెనింగ్‌ జోడీగా వీరిద్దరూ చరిత్రకెక్కారు. ఈ ఫైనల్‌ మ్యాచ్‌లో వీరిద్దరూ తొలి వికెట్‌కు 30 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

అంతకుముందు ఈ రికార్డు మాజీ ఓపెనర్లు వీరేంద్ర సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉండేది. 2003 వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఈ ఓపెనింగ్‌ జోడీ తొలి వికెట్‌కు 4 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తాజా మ్యాచ్‌తో ఈ రికార్డును గిల్‌-రోహిత్‌ బ్రేక్‌ చేశారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement