వరల్డ్‌కప్ సన్నాహాకాల్లో భాగంగా భారత్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా మరో ఓటమి చవిచూసింది. ఇండోర్ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో 99 పరుగుల తేడాతో ఆసీస్ పరాజయం పాలైంది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో ఆసీస్ కోల్పోయింది. 317 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఆసీస్ విఫలమైంది.
రైట్ హ్యాండర్‌గా మారిన డేవిడ్ భాయ్..
ఇక ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ రైట్ హ్యాండ్ బ్యాటింగ్ చేసి అందరని ఆశ్చర్యపరిచాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 13 ఓవర్ వేసిన రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో వార్నర్ రైట్ హ్యాండ్ బ్యాటర్‌గా అవతారమెత్తాడు. రైట్ హ్యాండర్‌గా మారడమే కాకుండా అద్భుతమైన బౌండరీ కూడా సాధించాడు. ఆ ఓవర్‌లో వార్నర్ 6 పరుగులు రాబట్టుకున్నాడు.
అ తర్వాత 15 ఓవర్ వేసిన అశ్విన్ బౌలింగ్‌లోనే స్విచ్ హిట్‌కు ప్రయత్నించిన వార్నర్.. ఎల్బీ డబ్ల్యూ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. వార్నర్ ఔట్ కాగానే అశ్విన్ ఒక్కసారిగా నవ్వుకున్నాడు. కాగా వార్నర్ రైట్ హ్యాండ్ బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వార్నర్ ఈ మ్యాచ్‌లో 53 పరుగులు చేశాడు.
చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన అశ్విన్.. తొలి భారత బౌలర్‌గా! దరిదాపుల్లో ఎవరూ లేరు
Two wickets in an over for @ashwinravi99 💪💪
— BCCI (@BCCI) September 24, 2023
David Warner and Josh Inglis are given out LBW!
Live - https://t.co/OeTiga5wzy… #INDvAUS @IDFCFIRSTBank pic.twitter.com/z62CFHTgq1
Comments
Please login to add a commentAdd a comment