బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి రెండు టెస్టుల్లో ఘన విజయం సాధించిన టీమిండియా.. ఇప్పుడు మూడో టెస్టులోనూ అదే ఫలితాన్ని రిపీట్ చేయాలని ఊవ్విళ్లూరుతోంది. మరోవైపు తొలి రెండు టెస్టుల్లో ఘోర పరాభావం చవిచూసిన ఆస్ట్రేలియా కనీసం మూడో టెస్టులోనైనా పోటీ ఇవ్వాలని భావిస్తోంది. కాగా ఇరు జట్ల మధ్య మూడో టెస్టు మార్చి1 నుంచి ఇండోర్ వేదికగా ప్రారంభం కానుంది.
ఇక ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే నేరుగా ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఇది ఇలా ఉండగా.. మూడో టెస్టుకు ముందు భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఇండోర్ టెస్టులో అశ్విన్ మరో 9 వికెట్లు సాధిస్తే.. బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలుస్తాడు. ఇప్పటివరకు బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో అశ్విన్ 103 వికెట్లు తీశాడు.
ఇక ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో భారత దిగ్గజం అనిల్ కుంబ్లే 111 వికెట్లతో తొలి స్థానంలో ఉన్నాడు. మరో 9 వికెట్లు అశూ సాధిస్తే.. కుంబ్లేను అధిగమించి అగ్ర స్థానానికి చేరుకుంటాడు. ఇక ఈ సిరీస్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. తొలి రెండు టెస్టుల్లో ఏకంగా 14 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుత అశ్విన్ జోరును చూస్తుంటే కుంబ్లే రికార్డును ఈజీగా బ్రేక్ చేసే అవకాశం ఉంది.
చదవండి: Virat Kohli: ఎన్నో విజయాలు అందించా.. అయినా ఫెయిల్యూర్ కెప్టెన్ అంటూ!
Comments
Please login to add a commentAdd a comment