ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూటో టెస్టులో టీమిండియా ఓటమి దిశగా ప్రయాణిస్తోంది. రెండో రోజు ఆటలో భాగంగా భారత్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో కేవలం 163 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆసీస్ ముందు కేవలం 76 పరుగుల లక్ష్యాన్నే మాత్రమే టీమిండియా నిర్దేశించింది. ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్ 8 వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించాడు.
ఈ క్రమంలో లియాన్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా లియాన్ చరిత్ర సృష్టించాడు. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 57వ ఓవర్‌లో ఉమేష్ యాదవ్‌ను ఔట్ చేసిన లియాన్.. ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో నాథన్ ఇప్పటివరకు 112 వికెట్లు పడగొట్టాడు. కాగా ఇప్పటివరకు ఈ రికార్డు భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే(111) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో కుంబ్లే రికార్డును లియాన్ బ్రేక్ చేశాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు..
నాథన్ లయన్- 112 వికెట్లు
అనిల్ కుంబ్లే- 111 వికెట్లు
రవిచంద్రన్ అశ్విన్- 106 వికెట్లు
హర్భజన్ సింగ్- 95 వికెట్లు
రవీంద్ర జడేజా- 84 వికెట్లు
చదవండి: IND Vs AUS: టీమిండియా నిలబెట్టుకుంటే.. 141 ఏళ్ల రికార్డు బద్దలు!
Comments
Please login to add a commentAdd a comment