Nathan Lyon
-
టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్ల వీరులు.. ఏడో స్థానానికి ఎగబాకిన అశ్విన్
టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అశ్విన్ ఏడో స్థానానికి ఎగబాకాడు. న్యూజిలాండ్‌తో ఇవాళ (అక్టోబర్ 24) మొదలైన రెండో టెస్ట్‌లో మూడు వికెట్లు తీసిన అశ్విన్ తన వికెట్ల సంఖ్యను 531కి పెంచుకున్నాడు. ఈ క్రమంలో అశ్విన్ ఆసీస్ స్పిన్ లెజెండ్ నాథన్ లయోన్ను (530) అధిగమించాడు. టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మురళీథరన్ (800), షేన్ వార్న్ (708), జేమ్స్ ఆండర్సన్ (704), అనిల్ కుంబే (619), స్టువర్ట్ బ్రాడ్ (604), గ్లెన్ మెక్‌గ్రాత్ (563) అశ్విన్ కంటే ముందున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న న్యూజిలాండ్ 54 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అశ్విన్.. టామ్ లాథమ్ (15), విల్ యంగ్ (18), డెవాన్ కాన్వే (76) వికెట్లు పడగొట్టాడు. రచిన్ రవీంద్ర (43), డారిల్ మిచెల్ (12) క్రీజ్‌లో ఉన్నారు.కాగా, ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేసింది. కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్ స్థానాల్లో శుభ్‌మన్ గిల్, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్‌దీప్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు న్యూజిలాండ్ సైతం నేటి మ్యాచ్ కోసం ఓ మార్పు చేసింది. పేసర్ మ్యాట్ హెన్రీ స్థానంలో మిచెల్ సాంట్నర్ తుది జట్టులోకి వచ్చాడు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో న్యూజిలాండ్ తొలి టెస్ట్‌లో నెగ్గిన విషయం తెలిసిందే.తుది జట్లు..భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్‌కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రాన్యూజిలాండ్: టామ్ లాథమ్(కెప్టెన్), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్(వికెట్‌కీపింగ్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, అజాజ్ పటేల్, విలియం ఒరూర్కేచదవండి: WTC: చరిత్ర సృష్టించిన అశ్విన్ -
WTC: చరిత్ర సృష్టించిన అశ్విన్
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ)లో ఆస్ట్రేలియా క్రికెటర్ నాథన్ లియోన్ పేరిట ఉన్న రికారుర్డు బద్దలు కొట్టాడు. డబ్ల్యూటీసీలో అత్యధిక వికెట్ల వీరుడిగా అవతరించాడు.న్యూజిలాండ్‌తో రెండో టెస్టు సందర్భంగా అశ్విన్ ఈ అరుదైన ఘనత సాధించాడు. కాగా డబ్ల్యూటీసీ 2023-25 సీజన్లో భాగంగా మూడు టెస్టులు ఆడేందుకు కివీస్ జట్టు భారత పర్యటనకు వచ్చింది. బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో పర్యాటక న్యూజిలాండ్ టీమిండియాను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది.తొలుత నాథన్ లియోన్ రికార్డు సమం చేసిఈ క్రమంలో భారత్- కివీస్ మధ్య పుణె వేదికగా గురువారం రెండో టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, కెప్టెన్, ఓపెనర్ టామ్ లాథమ్(15)ను ఆదిలోనే పెవిలియన్‌కు పంపాడు రవిచంద్రన్ అశ్విన్. కివీస్ ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ ఆఖరి బంతికి లాథమ్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) కాగా డబ్ల్యూటీసీలో అశూకు ఇది 187వ వికెట్. తద్వారా డబ్ల్యూటీసీలో అత్యధిక వికెట్ల వీరుడిగా ఉన్న ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ రికార్డును సమం చేశాడు. అయితే, కాసేపటికే లియోన్‌ను అధిగమించాడు అశూ. 24వ ఓవర్లో కివీస్ మరో వన్‌డౌన్ బ్యాటర్ విల్ యంగ్‌ను అవుట్ చేశాడు. లీడింగ్ వికెట్ టేకర్‌గా అవతరించిఈ క్రమంలో 188 వికెట్లతో అశ్విన్ డబ్ల్యూటీసీ లీడింగ్ వికెట్ టేకర్‌గా అవతరించాడు. ఇక మొదటి రోజు ఆటలో భోజన విరామ సమయానికి న్యూజిలాండ్ 31 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. ఓపెనర్ డెవాన్ కాన్వే 47, రచిన్ రవీంద్ర 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్‌కు రెండు వికెట్లు దక్కాయి.చదవండి: IND Vs NZ 2nd Test: న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్.. టీమిండియాలో మూడు మార్పులు -
పొదల్లోకి వెళ్లిన బంతి.. నవ్వులు పూయించిన ఆసీస్ స్టార్ ప్లేయర్( వీడియో)
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా జట్టు ఇప్పటినుంచే సన్నాహాకాలు ప్రారంభించింది. దేశీవాళీ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్ 2024-25 సీజన్లో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, స్టార్క్, హాజిల్‌వుడ్ మినహా మిగితా ఆసీస్ అగ్రశ్రేణి ఆటగాళ్లంతా పాల్గోంటున్నారు.అయితే ఈ టోర్నీలో భాగంగా సిడ్నీ వేదికగా న్యూ సౌత్ వేల్స్, సౌత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ నాథన్ లియాన్ గల్లీ క్రికెట్ మాదరి బంతిని పొదల్లో వెతుకుతూ నవ్వులు పూయించాడు. ఈ మ్యాచ్‌లో న్యూ సౌత్ వేల్స్‌కు లియాన్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.అసలేం జరిగిందంటే?సౌత్ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 56 ఓవర్ వేసిన లియాన్ బౌలింగ్‌లో ఆఖరి బంతికి క్యారీ భారీ సిక్సర్ బాదాడు. దెబ్బకు బంతి మైదానం వెలుపుల ఉన్న పొదల్లో పడింది. ఈ క్రమంలో న్యూ సౌత్ వేల్స్ ఫీల్డర్లు బంతిని ఆ పొదల్లో వెతకడం ప్రారంభించారు. కానీ బంతి కన్పించలేదు. దీంతో బంతిని వెతికేందుకు లియాన్ స్వయంగా రంగంలోకి దిగాడు. అయితే అతడికి ఓ బంతి దొరికింది. కానీ లియాన్‌కు దొరికింది రెడ్ బాల్ కాదు వైట్ బాల్. దీంతో అందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఇంతకుముందు ఎప్పుడో కన్పించకుండా పోయిన బంతి ఇప్పుడు నాథన్‌కు దొరింది. కానీ తాజాగా పోయిన బంతి మాత్రం వారికి దొరకలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతుంది. కాగా ఎటువంటి సంఘటనలు ఎక్కువగా గల్లీ క్రికెట్లో జరుగుతూ ఉంటాయి. View this post on Instagram A post shared by cricket.com.au (@cricketcomau) -
బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్.. అశ్విన్ ముందు ప్రపంచ రికార్డు
త్వరలో బంగ్లాదేశ్‌తో జరుగబోయే టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఓ ప్రపంచ రికార్డు ఊరిస్తుంది. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో అశ్విన్ 14 వికెట్లు పడగొడితే.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక వికెట్ల వీరుడిగా అవతరిస్తాడు. ప్రస్తుతం డబ్ల్యూటీసీలో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ అత్యధిక వికెట్ల వీరుడిగా ఉన్నాడు. లియోన్ డబ్ల్యూటీసీలో 43 మ్యాచ్‌లు ఆడి 187 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్.. 35 మ్యాచ్‌ల్లో 174 వికెట్లు తీసి మూడో హైయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. ఆసీస్ పేసర్ పాట్ కమిన్స్ ఈ జాబితాలో రెండో స్థానంలో (42 మ్యాచ్‌ల్లో 175 వికెట్లు) ఉన్నాడు. బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో అశ్విన్ 26 వికెట్లు సాధిస్తే.. డబ్ల్యూటీసీలో 200 వికెట్ల మార్కును తాకిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. బంగ్లాతో టెస్ట్ సిరీస్‌లో అశ్విన్ 14 వికెట్లు తీస్తే అత్యధిక వికెట్లు సాధించిన టెస్ట్ బౌలర్ల జాబితాలో లియోన్‌తో సమానంగా ఏడో స్థానంలో నిలుస్తాడు. టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో లంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీథరన్ (800) అగ్రస్థానంలో ఉండగా.. షేన్ వార్న్ (708), ఆండర్సన్ (704), కుంబ్లే (619), స్టువర్ట్ బ్రాడ్ (604), మెక్‌గ్రాత్ (563) టాప్-6లో ఉన్నారు. ఈ జాబితాలో అశ్విన్ (516) ప్రస్తుతం తొమ్మిదో స్థానంలో ఉన్నాడు.కాగా, బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ సెప్టెంబర్ 19న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ చెన్నై వేదికగా.. రెండో మ్యాచ్ కాన్పూర్ వేదికగా (సెప్టెంబర్ 27 నుంచి) జరుగనున్నాయి. టెస్ట్ సిరీస్ అనంతరం భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కూడా జరుగనుంది. మూడు టీ20లు గ్వాలియర్, ఢిల్లీ, హైదరాబాద్ వేదికలుగా అక్టోబర్ 6, 9, 12 తేదీల్లో జరుగనున్నాయి.తొలి టెస్ట్‌కు భారత జట్టు..రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, రిషబ్ పంత్, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్‌దీప్, యశ్ దయాల్, జస్ప్రీత్ బుమ్రాచదవండి: ట్రిపుల్ సెంచరీకి చేరువలో కుల్దీప్ -
Ind vs Aus: ఆ ముగ్గురు బ్యాటర్లు ప్రమాదకరం: ఆసీస్ బౌలర్
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 సీజన్లో భాగంగా టీమిండియా వరుస సిరీస్‌లతో బిజీ కానుంది. సెప్టెంబరు 19 నుంచి బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌లు ఆడిన అనంతరం.. న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ రెండు సిరీస్‌లు స్వదేశంలోనే జరుగనుండటం రోహిత్ సేనకు సానుకూలాంశం. అయితే, ఆ తర్వాతే భారత జట్టుకు సిసలైన సవాల్ ఎదురుకానుంది.బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ) ఆడేందుకు టీమిండియా నవంబరులో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఇందులో భాగంగా డబ్ల్యూటీసీ డిఫెండింగ్ చాంపియన్ ఆసీస్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ మెగా సిరీస్ ఆరంభానికి రెండు నెలలకు పైగా వ్యవధి ఉన్నప్పటికీ.. ఇప్పటి నుంచే అంచనాలు మొదలయ్యాయి.ఆ ముగ్గురు బ్యాటర్లను కట్టడి చేయగలిగితేనేఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. బీజీటీలో టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్ నుంచి తమకు ప్రమాదం పొంచి ఉందని నాథన్ పేర్కొన్నాడు. ఈ ముగ్గురు బ్యాటర్లను కట్టడి చేయగలిగితే తాము సులువుగానే పైచేయి సాధించవచ్చని అభిప్రాయపడ్డాడు. తమ బౌలింగ్ విభాగం వీరిని సమర్థవంతంగా ఎదుర్కోగలదని ధీమా వ్యక్తం చేశాడు.ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్... ఈ ముగ్గురే మాకు టీమిండియాతో సిరీస్‌లో కీలకం కానున్నారు. అయితే, వీరితో పాటు యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా నుంచి మాకు సవాల్ ఎదురయ్యే అవకాశం ఉంది. వీరందరి కలయికతో టీమిండియా బ్యాటింగ్ లైనప్ పటిష్టంగానే కనిపిస్తోంది.కఠిన సవాల్‌కు సిద్ధంకాబట్టి మేము కఠిన సవాల్‌కు సిద్ధంగా ఉండాలి. మా బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగానే ఉంది. వాళ్లను అడ్డుకునేందుకు మా వాళ్లు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు’’ అని నాథన్ లియోన్ పేర్కొన్నాడు. కాగా 2014 తర్వాత ఆస్ట్రేలియా ఒక్కసారి కూడా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ గెలవలేకపోయింది. ఇక 2017 నుంచి సొంతగడ్డపై రెండు, ఆసీస్ మట్టిపై రెండుసార్లు సిరీస్ గెలిచి టీమిండియా జోష్‌లో ఉంది. చదవండి: 147 ఏళ్ల చరిత్రలో తొలిసారి: కోహ్లి మరో 58 రన్స్ చేశాడంటే! -
భారత్, న్యూజిలాండ్ కాదు.. ఆ రెండు జట్లు మధ్యే వరల్డ్‌కప్ ఫైనల్
ఐపీఎల్-2024 ముగిసిన వెంటనే అభిమానులను అలరించేందుకు మరో క్రికెట్ పండగ సిద్దమైంది. టీ20 వరల్డ్‌కప్-2024కు మరో రెండు రోజుల్లో తెరలేవనుంది. జూన్ 1 నుంచి అమెరికా, కరేబియన్ దీవుల వేదికగా ఈ మెగా టోర్నీ షురూ కానుంది. ఇప్పటికే ఈ టోర్నీకి సంబంధించి వార్మాప్ మ్యాచ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. అయితే ప్రధాన టోర్నీ ఆరంభానికి కేవలం రెండు మాత్రమే ఉన్నందన మాజీలు, వెటరన్ క్రికెటర్లు ఏ జట్టు ఫైనల్‌కు చేరుతుందో, ఏ జట్టు సెమీస్‌కు వెళ్తుందో అంచనా వేస్తున్నారు.తాజాగా ఈ జాబితాలో ఆస్ట్రేలియా వెటరన్ స్పిన్నర్ నాథన్ లియాన్ చేరాడు. ఈ మెగా టోర్నీలో ఫైనల్‌కు చేరే జట్లను లియాన్ ఎంచుకున్నాడు. ఫైనల్ పోరులో ఆసీస్-పాకిస్తాన్ జట్లు తలపడతాయని లియాన్ జోస్యం చెప్పాడు. తాజాగా లియాన్ ప్రైమ్ వీడియో స్పోర్ట్స్ ఆస్ట్రేలియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా పొట్టి ప్రపంచకప్ ఫైనల్‌కు చేరే జట్లు ఏవన్న ప్రశ్న లియాన్‌కు ఎదురైంది. లియాన్ వెంటనే ఆస్ట్రేలియా, పాకిస్తాన్ అని సమాధనమిచ్చాడు."టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌కు ఆస్ట్రేలియా చేరుతుందన్న నమ్మకం నాకు ఉంది. మా జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. ఇక నా వరకు అయితే ఫైనల్‌కు చేరే మరోజట్టు పాకిస్తాన్. విండీస్, యూఎస్ పరిస్థితుల్లో పాకిస్తాన్ బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణిస్తుందని నేను భావిస్తున్నాను. అంతేకాకుండా జట్టులో నాణ్యమైన స్పిన్నర్లు, బాబర్ ఆజాం వరల్డ్‌క్లాస్ క్రికెటర్లు ఉన్నారని" అని ప్రైమ్ వీడియో స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లియాన్ పేర్కొన్నాడు. కాగా ఫైనల్ చేరే జట్ల జాబితాలో టీమిండియాని ఎంచుకోపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. -
చరిత్ర సృష్టించిన నాథన్ లియోన్.. ప్రపంచంలో తొలి క్రికెటర్‌గా!
వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో 172 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆసీస్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తన స్పిన్ మయాజాలంతో కివీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు పడగొట్టిన లియోన్.. కివీస్ పతనాన్ని శాసించాడు. అతడి స్పిన్ దాటికి న్యూజిలాండ్ కేవలం 196 పరుగులకే కుప్పకూలింది. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 10 వికెట్లను లియోన్ సాధించాడు. ఇక ఈ మ్యాచ్‌లో సంచలన ప్రదర్శన కనబరిచిన లియోన్ ఓ అరుదైన రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలోనే అత్యధిక సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్న తొలి బౌలర్‌గా నాథన్ నిలిచాడు. డబ్ల్యూటీసీలో ఇప్పటివరకు ఈ ఆసీస్ దిగ్గజం 10 సార్లు 5 వికెట్ల హాల్ సాధించాడు. కాగా ఇప్పటివరకు ఈ రికార్డు భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేరిట ఉండేది. అశ్విన్ 9 సార్లు ఈ ఫీట్ సాధించాడు. తాజా మ్యాచ్‌తో అశ్విన్ రికార్డును లియోన్ బ్రేక్ చేశాడు. -
తిరుగులేని ఆసీస్.. ఏకంగా 172 పరుగుల తేడాతో ఘన విజయం
వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో 172 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 369 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్.. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ దాటికి 196 పరుగులకే కుప్పకూలింది. లియోన్ 6 వికెట్లతో చెలరేగాడు. 111/3 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన కివీస్.. అదనంగా 85 పరుగులు చేసి ఆలౌటైంది. న్యూజిలాండ్ బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(59) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో లియోన్‌తో పాటు హాజిల్‌వుడ్ రెండు, హెడ్, గ్రీన్ తలా వికెట్ పడగొట్టారు. అంతకుముందు ఆసీస్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే కుప్పకూలింది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌కు 204 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. దీంతో కివీస్ ముందు 369 పరుగులు భారీ టార్గెట్‌ను ఆస్ట్రేలియా ఉంచింది. కాగా మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులకు ఆలౌట్ అయింది. కామెరాన్ గ్రీన్ (174 నాటౌట్; 23 ఫోర్లు, 5 సిక్స్‌లు), హాజల్‌వుడ్ (22; 4 ఫోర్లు) పదో వికెట్‌కు 116 పరుగులు జోడించడం విశేషం. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ 43.1 ఓవర్లలో 179 పరుగులకే కుప్పకూలింది. న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా స్కోర్లు: ఆస్ట్రేలియా- 383 & 164 న్యూజిలాండ్- 179 & 196 ఫలితం: 172 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం -
టెస్ట్ క్రికెట్లో కొనసాగుతున్న నాథన్ లయోన్ హవా.. వాల్ష్ రికార్డు బద్దలు
టెస్ట్ క్రికెట్లో ఆసీస్ వెటరన్ స్పిన్నర్ నాథన్ లయోన్ హవా కొనసాగుతుంది. తాజాగా అతను దిగ్గజ పేసర్, విండీస్ మాజీ బౌలర్ కోట్నీ వాల్ష్ రికార్డును బద్దలు కొట్టాడు. వాల్ష్ 1984-2001 మధ్యలో 128 టెస్ట్‌లు ఆడి 519 వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన లయెన్.. తన టెస్ట్ వికెట్ల కౌంట్‌ను 521కి పెంచుకున్నాడు. టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో లయోన్.. వాల్ష్‌ను అధిగమించి, ఏడో స్థానానికి ఎగబాకాడు. ఇటీవలే టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా టెస్ట్‌ల్లో 500 వికెట్ల మార్కును తాకాడు. ప్రస్తుతం అతను 507 వికెట్లతో అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో మురళీథరన్ (800) టాప్‌లో ఉండగా.. షేన్ వార్న్ (708), ఆండర్సన్ (698), అనిల్ కుంబ్లే (619), స్టువర్ట్ బ్రాడ్ (604), మెక్‌గ్రాత్ (563) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఆసీస్-న్యూజిలాండ్ మ్యాచ్ విషయానికొస్తే.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా సెకెండ్ ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 13 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 217 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఉస్మాన్ ఖ్వాజా (5), నాథన్ లయోన్ (6) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. కెమరూన్ గ్రీన్ (174 నాటౌట్) భారీ శతకంతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులకు ఆలౌటైంది. మ్యాట్ హెన్రీ 5 వికెట్లతో రాణించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్.. ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో 179 పరుగులకే ఆలౌటైంది. లయోన్ 4, హాజిల్‌వుడ్ 2, స్టార్క్, కమిన్స్, మార్ష్ తలో వికెట్ పడగొట్టారు. కివీస్ ఇన్నింగ్స్‌లో గ్లెన్ ఫిలిప్స్ (71) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
క్యూరేటర్ నుంచి ఆసీస్ స్పిన్ లెజెండ్‌గా.. ఏకంగా షేన్ వార్న్ సరసన!
ఆస్ట్రేలియాలోని అడిలైడ్ ఓవల్ మైదానం.. తర్వాతి మ్యాచ్ కోసం క్యురేటర్ల బృందం పిచ్ తయారు చేస్తోంది. అందులో ఒక 24 ఏళ్ల కుర్రాడు అమితోత్సాహంతో అందరికంటే వేగంగా చకచకా పని పూర్తి చేస్తున్నాడు. ముఖ్యంగా పిచ్ చివర్లో స్టంప్స్ వద్ద స్పిన్ బంతి టర్నింగ్‌కు సంబంధించి సహచరులకు ప్రత్యేక సూచనలు ఇస్తూ వాటరింగ్ చేయిస్తున్నాడు. అతను కొన్నాళ్ల క్రితమే ఆ మైదానానికి బదిలీపై వచ్చాడు. అంతకు ముందు నాలుగేళ్ల పాటు కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్ గ్రౌండ్లోనూ ఇదే పని చేశాడు. పిచ్ తయారీపై బేసిక్స్ నేర్చుకొని అక్కడే పూర్తి స్థాయిలో శిక్షణ కూడా పొందాడు. అయితే క్యురేటర్‌గా అనుభవం మాత్రమే కాదు ఒక ఆటగాడి తరహాలో అతనికి ఉన్న పరిజ్ఞానం, విశ్లేషణ అడిలైడ్‌లోని కోచ్‌లను ఆకర్షించింది. అనంతరం జట్లు ప్రాక్టీస్‌కు సిద్ధమైనప్పుడు నెట్ బౌలర్లు తక్కువ పడటంతో నువ్వు బౌలింగ్ చేయగలవా అని కోచ్ డారెన్ బెరీ ఈ కుర్రాడిని అడిగాడు. కచ్చితంగా అని బదులిచ్చిన అతను వెంటనే బంతితో బరిలోకి దిగిపోయాడు. అతని స్పిన్ బౌలింగ్ శైలి, టర్నింగ్ రాబడుతున్న తీరు కోచ్‌ను అమితాశ్చర్యానికి గురి చేశాయి. అతని వివరాలను తెలుసుకోగా.. తాను అప్పటికే చాలా చోట్ల క్రికెట్ ఆడానని, అయితే అవేవీ గుర్తింపు పొందిన స్థాయిలో కాదని ఆ బౌలర్ చెప్పాడు. దాంతో నీకు తగిన అవకాశం కల్పిస్తానన్న కోచ్ బెరీ మాట తప్పలేదు. అతని ప్రతిభ గురించి అందరికీ చెప్పి అడిలైడ్ టి20 టీమ్ రెడ్బ్యాక్స్లోకి ఎంపిక చేశాడు. అంతే.. ఆ తర్వాత అతను వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. తొలి అవకాశాన్ని అద్భుతంగా వాడుకొని సత్తా చాటడంతో వరుసగా మ్యాచ్‌లు దక్కాయి. ఆపై ఫార్మాట్ మారి ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడే అవకాశమూ లభించింది. దానిని అందిపుచ్చుకొని ఆ బౌలర్ ఉవ్వెత్తున ఎగశాడు. ఏడు నెలల వ్యవధిలోనే జాతీయ జట్టుకు ఎంపికై సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత పుష్కరకాలంగా ఎన్నో ఘనతలను తన పేరిట లిఖించుకున్న ఆ బౌలర్ పేరే నాథన్ లయన్. క్యురేటర్‌గా మొదలై టెస్టుల్లో 500 వికెట్ల అరుదైన మైలురాయిని సాధించిన ఆటగాడిగా గుర్తింపు పొందడం వరకు ఆఫ్‌స్పిన్నర్ లయన్ సాగించిన ప్రయాణం స్ఫూర్తిదాయకం. స్టూవర్ట్ మెక్‌గిల్, మైకేల్ బీర్, డోహర్తి, క్రేజా, మెక్‌గెయిన్, హారిట్జ్, స్టీవ్ స్మిత్, హాగ్, హాలండ్, వైట్, కాసన్.. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా 11 మందితో కూడిన జట్టు ఇది. ఆల్‌టైమ్ గ్రేట్ స్పిన్నర్ షేన్ వార్న్ రిటైర్మెంట్ తర్వాత ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ కోసం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అన్వేషణ సుదీర్ఘంగా సాగింది. ఆ ప్రయత్నంలో భాగంగా వారు ప్రయత్నించిన 11 మంది స్పిన్నర్ల పేర్లు ఇవి. కానీ ఇందులో ఏ ఒక్కరూ ప్రతిభపరంగా వార్న్ దరిదాపుల్లోకి రావడం అటుంచి.. కనీసం పోలికకు కూడా అర్హత లేని స్థాయి వారిది. అందుకే ఎన్ని అవకాశాలు కల్పించినా ప్రతిభను చూపించలేక అతి తక్కువ సమయంలోనే కనుమరుగైపోయారు. వార్న్ స్థాయిలో కాకపోయినా, కనీసం ఉపఖండంలో సిరీస్‌లు ఆడేందుకు వెళ్లినప్పుడు అక్కడి పరిస్థితులకు తగినట్లుగా కొంతయినా ప్రభావం చూపించేవాడు ఉంటే చాలని ఆసీస్ క్రికెట్ భావించినా.. అది కూడా సాధ్యం కాలేదు. దాంతో ఇక స్పిన్నర్ల వేటను మానేసి ఆస్ట్రేలియా జట్టు ప్రపంచవ్యాప్తంగా ఏ మైదానంలో ఆడినా తమ పేసర్ల బలాన్ని నమ్ముకుంటూ బరిలోకి దిగుతూ వచ్చింది. అలాంటి సమయంలో నాథన్ లయన్ వచ్చాడు. ఎలాంటి గందరగోళం లేకుండా సంప్రదాయ స్పిన్ బౌలింగ్, క్లాసికల్‌గా బంతిని ఫ్లయిట్ చేయడానికి ఇష్టపడే స్పిన్నర్‌గా లయన్ వెలుగులోకి వచ్చాడు. ఇలాంటి స్పిన్నర్లు సాధారణంగా ఉపఖండంలోనే గుర్తింపు దక్కించుకుంటారు. కానీ ఆసీస్‌కు లయన్ రూపంలో అలాంటి ఆటగాడు దక్కాడు. అందుకే వారు అతడిని కళ్లకు అద్దుకొని జట్టులోకి తీసుకున్నాడు. లయన్ కూడా తన ఎంపికకు న్యాయం చేస్తూ వారిని ఎప్పుడూ నిరాశపరచలేదు. అటు ఉపఖండం పిచ్‌లపై కూడా సత్తా చాటడంతో పాటు స్పిన్‌ను ఏమాత్రం అనుకూలించని ఆసీస్ మైదానాల్లోనూ ప్రత్యర్థులపై చెలరేగి తాను లేకుండా ఆసీస్ జట్టు టెస్టు మ్యాచ్ ఆడలేని స్థాయికి చేరుకున్నాడు. వార్న్‌కు సరైన వారసుడినని నిరూపించుకుంటూ 12 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ తర్వాత ఏకంగా 500 టెస్టు వికెట్లతో ఇప్పుడు శిఖరాన నిలిచాడు లయన్. అలా మొదలైంది.. 2011, సెప్టెంబర్ 1.. గాలేలో శ్రీలంకతో తొలి టెస్టు. లయన్ తొలిసారి అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్‌కు దిగాడు. రౌండ్ ద వికెట్‌గా వచ్చి బంతిని సంధించాడు. గ్రిప్, ఫ్లయిట్, టర్న్, బౌన్స్.. అనూహ్యంగా వచ్చిన బంతిని ఆడలేక లంక దిగ్గజం సంగక్కర గందరగోళానికి గురయ్యాడు. బ్యాట్‌ను తాకిన బంతి స్లిప్స్‌లో కెప్టెన్ క్లార్క్ చేతుల్లో పడింది. అంతే.. అటు లయన్‌తో పాటు ఇటు ఆసీస్ బృందంలో సంబరాలు. టెస్టు క్రికెట్లో వేసిన తొలి బంతికే వికెట్ తీసిన అత్యంత అరుదైన జాబితాలో లయన్‌కు చోటు లభించింది. ఈ మ్యాచ్‌లో ఆరు వికెట్లతో అతనికి ఘనారంభం దొరికింది. అద్భుతంగా మొదలైన కెరీర్ ఆపై మరిన్ని ఘనతల దిశగా సాగింది. నాలుగేళ్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా తరఫున వికెట్లపరంగా అత్యుత్తమ ఆఫ్‌స్పిన్నర్‌గా లయన్ గుర్తింపు తెచ్చేసుకున్నాడు. యాషెస్‌తో మేలిమలుపు.. ఆటలో ఎంత సత్తా ఉన్నా, అద్భుతాలు చేసే నైపుణ్యం ఉన్నా ఆటగాళ్లకు తగిన అవకాశం, సరైన వేదిక ఎంతో ముఖ్యం. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెటర్లకు సంబంధించి యాషెస్ సిరీస్ అలాంటిదే. ఈ చిరకాల ప్రత్యర్థుల జట్లలో ఎంతో మంది ఆటగాళ్లను యాషెస్ సిరీస్ హీరోలను చేస్తే, మరెంతో మందిని జీరోలను చేస్తుంది. వరుస అవకాశాలు దక్కించుకుంటున్న క్రమంలో 2011 యాషెస్ సిరీస్ కోసం లయన్‌కు చాన్స్ లభించింది. ఎంతో ఉత్సాహంతో తన టాలెంట్ చూపించేందుకు లయన్ సిద్ధం కాగా, వేర్వేరు పరిస్థితులను కారణాలుగా చూపుతూ టీమ్ మేనేజ్మెంట్ తొలి రెండు టెస్టుల్లో అతడిని ఎంపిక చేయకుండా పక్కన పెట్టింది. అయితే తర్వాతి మూడు టెస్టుల్లో అవకాశం సాధించి కీలక దశలో తొమ్మిది వికెట్లు పడగొట్టిన లయన్ రెండు టెస్టుల్లో ఇంగ్లండ్‌ను కట్టడి చేసి ఆసీస్‌ను ఓటమి బారి నుంచి తప్పించాడు. ఆ తర్వాత కొన్ని నెలలకే జరిగిన రిటర్న్ యాషెస్ సిరీస్‌తో లయన్ విలువేమిటో ఆసీస్ మేనేజ్మెంట్కు బాగా తెలిసొచ్చింది. సొంత గడ్డపై 19 వికెట్లతో సత్తా చాటిన లయన్ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నాడు. ఆ వెంటనే దక్షిణాఫ్రికాకు వెళ్లి అక్కడా తన స్పిన్ పదును చూపించడంలో అతను సఫలమయ్యాడు. ఆ తర్వాత 2022లో గాయం కారణంగా ఒక మ్యాచ్ దూరమయ్యే వరకు లయన్ లేకుండా ఆస్ట్రేలియా ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడలేదంటే అతిశయోక్తి కాదు. ఆసీస్ దిగ్గజంగా ఎదిగి.. షేన్‌వార్న్ తర్వాత ఆస్ట్రేలియా అత్యుత్తమ స్పిన్నర్‌గా లయన్‌కు ఎప్పుడో గుర్తింపు దక్కింది. స్పిన్నర్లకు వికెట్లే దక్కవని భావించే ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజీలండ్లాంటి దేశాల్లో కూడా అతను పెద్ద సంఖ్యలో వికెట్లు పడగొట్టాడు. కానీ ఏదో అసంతృప్తి. అతడిని ప్రత్యేకంగా నిలబెట్టే మరి కొన్ని ప్రదర్శనలు కావాలి. ఒక స్పిన్నర్ గుర్తింపు దక్కించుకునేందుకు భారత్‌కంటే సరైన వేదిక ఏముంటుంది. భారత గడ్డపై సత్తా చాటి స్పిన్‌కు అనుకూలించే మైదానాలే అయినా భారతీయేతర స్పిన్నర్లు ఎవరూ ఇక్కడ తమదైన ముద్ర వేయలేకపోయారు. ఇక్కడా రాణిస్తే అతని కీర్తి రెట్టింపవుతుంది. లయన్ సరిగ్గా అదే చేసి చూపించాడు. భారత గడ్డపై ఆడిన 11 టెస్టుల్లో కేవలం 27.35 సగటుతో 56 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు సాధించిన విదేశీ బౌలర్‌గా నిలిచాడు. అతని కెరీర్ సగటు (30.85) కంటే ఇది తక్కువ కావడం విశేషం. షేన్ వార్న్ సరసన లయన్ కెరీర్లో మూడు అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనలు (8/50, 8/64, 7/94) భారత దేశంలోనే వచ్చాయి. లయన్ సాధించిన ఈ తొలి 8 వికెట్ల ప్రదర్శనకు బెంగళూరు వేదికైంది. సొంత గడ్డపై కంటే విదేశాల్లోనే ఎక్కువ వికెట్లు (258) సాధించిన అరుదైన బౌలర్ల జాబితాలో లయన్ కూడా ఉన్నాడు. కాగా స్వదేశంలో ఇటీవల పాకిస్తాన్ మూడో టెస్టు(2024) సందర్భంగా 250 వికెట్ల మైలురాయి అందుకుని షేన్ వార్న్ సరసన నిలిచాడు లయన్. ఆసీస్ ఓడిన మ్యాచ్‌లలో తీసిన వికెట్లకంటే (138) ఆ జట్టు గెలిచిన మ్యాచ్‌లలో అతను పడగొట్టిన వికెట్లు (301) అతని విలువను చూపిస్తూ దిగ్గజ స్థాయిని అందించాయి. ఆస్ట్రేలియా జట్టు అవసరాలు, కూర్పు కారణంగా లయన్ వన్డే కెరీర్ 29 మ్యాచ్‌లకే పరిమితం అయినా.. టెస్టుల్లో అతని కీర్తి శాశ్వతం. 36 ఏళ్ల వయసులోనూ అద్భుత ఫామ్‌తో చెలరేగుతున్న లయన్ టెస్టు క్రికెట్లో మున్ముందు మరిన్ని రికార్డులు నెలకొల్పడం ఖాయం. -మొహమ్మద్ అబ్దుల్ హాది -
నేను ఎదుర్కొన్న అత్యుత్తమ బ్యాటర్లు వీరే: ఆసీస్ స్టార్ స్పిన్నర్
గత కొన్నేళ్లుగా టెస్టుల్లో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నాడు ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్. ఆసీస్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో స్పిన్ బౌలర్‌గా చరిత్రకెక్కిన అతడు.. మరో నాలుగేళ్ల పాటు కెరీర్ కొనసాగించాలని భావిస్తున్నాడు. సొంతగడ్డపై పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా 500 వికెట్ల క్లబ్లో చేరిన ఈ ఆఫ్ స్పిన్నర్.. ఈ ఘనత సాధించిన ఓవరాల్ బౌలర్ల జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. అదే విధంగా ఈ మైలురాయి అందుకున్న స్పిన్నర్ల జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక సుదీర్ఘ కెరీర్లో ఎంతో మంది బ్యాటర్లను ఎదుర్కొన్న నాథన్ లియోన్.. ముగ్గురు మాత్రం తనకు కఠిన సవాల్ విసిరారని పేర్కొన్నాడు. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ సహా రికార్డుల వీరుడు విరాట్ కోహ్లి, సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ తాను ఫేస్ చేసిన బౌలర్లలో అత్యుత్తమ బ్యాటర్లు అని తెలిపాడు. కాగా కోహ్లి- లియోన్ ముఖాముఖి పోరులో రన్మెషీన్దే పైచేయి కావడం విశేషం. టెస్టుల్లో ఇప్పటి వరకు కోహ్లి లియోన్ బౌలింగ్‌లో కేవలం ఏడుసార్లు అవుట్ కాగా.. 75కు పైగా సగటుతో పరుగులు సాధించాడు. అదే విధంగా వన్డేల్లో లియోన్ బౌలింగ్‌లో 96కు పైగా స్ట్రైక్‌రేటుతో 100 పరుగులు సాధించిన కోహ్లి.. ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. మరోవైపు.. టెస్టుల్లో లియోన్‌పై డివిలియర్స్‌ది కూడా పైచేయే! అతడి బౌలింగ్‌లో 171 సగటుతో 342 పరుగులు సాధించిన ఏబీడీ.. కేవలం రెండుసార్లు వికెట్ సమర్పించుకున్నాడు. అయితే, టెండుల్కర్‌కు మాత్రం నాథన్ లియోన్ బౌలింగ్‌లో మెరుగైన రికార్డు లేదు. టెస్టుల్లో ఈ ఆఫ్ స్పిన్నర్ బౌలింగ్‌లో కేవలం సగటు 29 కలిగి ఉన్న సచిన్ నాలుగుసార్లు అవుటయ్యాడు. కాగా నాథన్ లియోన్ తదుపరి పాకిస్తాన్‌తో మూడో టెస్టు సందర్భంగా మైదానంలో దిగనున్నాడు. సిడ్నీ వేదికగా బుధవారం నుంచి ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన నాథన్ లియోన్.. తాను ఎదుర్కొన్న గొప్ప బ్యాటర్ల జాబితాలో ముందుగా విరాట్ కోహ్లి పేరు చెప్పాడు. సచిన్ టెండుల్కర్, ఏబీ డివిలియర్స్‌లను అవుట్ చేసేందుకు కూడా తానెంతో కష్టపడాల్సి వచ్చేదని ఈ సందర్భంగా వెల్లడించాడు. చదవండి: Aus Vs Pak: నా రికార్డు బ్రేక్ చేసే సత్తా అతడికే ఉంది: ఆసీస్ దిగ్గజ బౌలర్ -
Aus Vs Pak: వార్నర్ ఫేర్వెల్ టెస్టు.. ఆస్ట్రేలియా తుది జట్టు ప్రకటన
Australia vs Pakistan, 3rd Test: సొంతగడ్డపై పాకిస్తాన్‌తో మూడో టెస్టుకు ఆస్ట్రేలియా తుదిజట్టును ప్రకటించింది. తొలి రెండు మ్యాచ్‌లలో ఆడిన జట్టుతోనే ఆఖరి టెస్టులో బరిలోకి దిగనున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ మంగళవారం ధ్రువీకరించాడు. స్వదేశంలో పాకిస్తాన్‌పై టెస్టుల్లో రెండు దశాబ్దాలకు పైగా ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటూ ఆసీస్ మరోసారి సిరీస్ గెలిచిన విషయం తెలిసిందే. పెర్త్ టెస్టులో పర్యాటక పాక్‌ను 360 పరుగుల తేడాతో చిత్తు చేసిన కంగారూ జట్టు.. బాక్సింగ్ డే టెస్టులోనూ విజయం సాధించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది. వార్నర్ ఫేర్వెల్ టెస్టు ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో టెస్టు జరుగనుంది. ప్రఖ్యాత సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో బుధవారం (జనవరి 3) నుంచి ఐదు రోజుల మ్యాచ్ మొదలు కానుంది. ఆసీస్ దిగ్గజ బౌలర్ గ్లెన్ మెగ్రాత్ సతీమణి జ్ఞాపకార్థం పింక్ టెస్టుగా నిర్వహించనున్న ఈ మ్యాచ్ సందర్భంగా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన కెరీర్లో ఆఖరి టెస్టు ఆడనున్నాడు. తన రెగ్యులర్ జోడీ ఉస్మాన్ ఖవాజాతో కలిసి ఓపెనింగ్ చేయనున్నాడు. మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్ తమ స్థానాలు నిలబెట్టుకోగా.. నెట్స్‌లో శ్రమిస్తున్న ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ మరోసారి బెంచ్‌కే పరిమితం కానున్నాడు. మరో ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ సూపర్ ఫామ్‌లో ఉన్న కారణంగా గ్రీన్‌ను పక్కనపెట్టక తప్పలేదు. 👀 #AUSvPAK https://t.co/YcZvY1CYlM — cricket.com.au (@cricketcomau) January 1, 2024 ‘పింక్’ టెస్టులో గెలుపు ఎవరిది? ఇక బౌలింగ్ దళంలో పేస్ త్రయం ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్‌తో పాటు స్పిన్నర్ నాథన్ లియోన్ ఉండగా.. అలెక్స్ క్యారీ వికెట్ కీపర్‌గా కొనసాగనున్నాడు. కాగా ఆస్ట్రేలియా దిగ్గజ ఫాస్ట్‌బౌలర్ గ్లెన్ మెగ్రాత్ భార్య జేన్ మెగ్రాత్ రొమ్ము క్యాన్సర్‌తో మరణించింది. ఈ నేపథ్యంలో.. క్యాన్సర్ బాధితులకు అండగా నిలిచేందుకు వీలుగా.. సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ఆమె జ్ఞాపకార్థం మెగ్రాత్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశాడు. ఇందులో భాగంగా ప్రతి ఏడాది ఆసీస్ ఆడే టెస్టుల్లో ఒక మ్యాచ్‌ను పింక్ టెస్టుగా నిర్వహిస్తూ ఫండ్‌రైజింగ్ చేస్తున్నారు. కాగా ఇప్పటికే సిరీస్ కోల్పోయిన పాకిస్తాన్ ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. పాకిస్తాన్‌తో మూడో టెస్టుకు ఆస్ట్రేలియా తుదిజట్టు: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), నాథన్ లియోన్, జోష్ హాజిల్‌వుడ్. చదవండి: Aus Vs Pak: నా రికార్డు బ్రేక్ చేసే సత్తా అతడికే ఉంది: ఆసీస్ దిగ్గజ బౌలర్ -
Aus Vs Pak: నా రికార్డు బద్దలు కొట్టే సత్తా అతడికే ఉంది: ఆసీస్ దిగ్గజం
Australia vs Pakistan, 3rd Test: ఆస్ట్రేలియా ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియోన్ ఆట తీరుపై బౌలింగ్ దిగ్గజం గ్లెన్ మెగ్రాత్ ప్రశంసలు కురిపించాడు. ఆసీస్ తరఫున తాను నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టగల సత్తా లియోన్‌కు ఉందన్నాడు. కాగా పాకిస్తాన్‌తో సొంతగడ్డపై టెస్టు సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకున్న కంగారూ జట్టు.. నామమాత్రపు ఆఖరి మ్యాచ్‌కు సిద్ధమైంది. ఆమె జ్ఞాపకార్థం ‘పింక్’ టెస్టు నిర్వహణ ఇరుజట్ల మధ్య బుధవారం (జనవరి 3) నుంచి ‘పింక్ టెస్టు’ ఆరంభం కానుంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ ఇందుకు వేదిక. కాగా బ్రెస్ట్ క్యాన్సర్‌తో మరణించిన గ్లెన్ మెగ్రాత్ సతీమణి జ్ఞాపకార్థం ప్రతి ఏడాది పింక్ టెస్టును నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా సిడ్నీలో తాజాగా జరుగనున్న మ్యాచ్ 16వది. ఈ టెస్టు సందర్భంగా మెగ్రాత్ ఫౌండేషన్ విరాళాల సేకరణ చేపట్టనుంది. ఈ సందర్భంగా గ్లెన్ మెగ్రాత్ ప్రసంగిస్తూ.. నాథన్ లియోన్ బౌలింగ్ నైపుణ్యాలను కొనియాడాడు. ‘‘ప్రతి రికార్డును ఎవరో ఒకరు బ్రేక్ చేస్తారు. ఒకవేళ లియోన్ నన్ను దాటేస్తే అంతకంటే సంతోషం ఉండదు. అతడు అసాధారణ బౌలర్. అలా అయితే అతడికి తిరుగే ఉండదు లియోన్‌కు ఆల్ ది బెస్ట్. ఒకవేళ నాతో పాటు షానో(షేన్ వార్న్) రికార్డును కూడా అధిగమిస్తే అతిడికి తిరుగే ఉండదు. లియోన్ బౌలింగ్ నైపుణ్యాలు అద్భుతం. పరిస్థితులకు తగ్గట్లుగా ఆడటం అతడికి అలవాటు’’ అని మెగ్రాత్ పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియా తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన ఫాస్ట్ బౌలర్‌గా గ్లెన్ మెగ్రాత్ ఘనత సాధించాడు. నేటికీ అతడి రికార్డు చెక్కుచెదరకుండా ఉంది. ఆసీస్ తరఫున 124 టెస్టులు ఆడిన రైటార్మ్ పేసర్ మెగ్రాత్ 563 వికెట్లు తీశాడు. 500 వికెట్ల క్లబ్లో నాథన్ లియోన్ మరోవైపు.. ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియోన్ ఇటీవలే 500 వికెట్ల క్లబ్లో చేరాడు. పాకిస్తాన్‌తో పెర్త్ టెస్టు సందర్భంగా ఈ మైలురాయిని చేరుకున్నాడు. తాజా పింక్ టెస్టుకు ముందు అతడి ఖాతాలో మొత్తంగా 505 వికెట్లు ఉన్నాయి. సుమారు మరో నాలుగేళ్ల పాటు టెస్టు క్రికెట్ ఆడే సత్తా ఉన్న లియోన్ ఇంకో 59 వికెట్లు తీస్తే .. ఆసీస్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఓవరాల్ బౌలర్ల జాబితాలో మెగ్రాత్‌ను అధిగమిస్తాడు. ఇదిలా ఉంటే.. ఆసీస్ దిగ్గజ దివంగత స్పిన్నర్ షేన్ వార్న్ టెస్టుల్లో 708 వికెట్లు తీసి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. చదవండి: IPL 2024: హార్దిక్ పాండ్యా దూరం! ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా బుమ్రా? -
బాబర్ విఫలం.. కమిన్స్ జోరు! రెండో రోజు ఆసీస్‌దే పైచేయి!
Australia vs Pakistan, 2nd Test Day 2: పాకిస్తాన్‌తో రెండో టెస్టులో ఆస్ట్రేలియా తిరిగి పుంజుకుంది. రెండో రోజు ఆట ముగిసే సరికి పర్యాటక జట్టుపై పైచేయి సాధించింది. కాగా మెల్బోర్న్ వేదికగా మంగళవారం ఆసీస్- పాకిస్తాన్ మధ్య బాక్సింగ్ డే టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 66 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా 187 పరుగులు చేసింది. టీ విరామానికి 37 నిమిషాల ముందు వర్షం రావడంతో ఆటకు మూడు గంటలపాటు అంతరాయం ఏర్పడింది. దాంతో తొలి రోజు 66 ఓవర్లు మాత్రమే సాధ్యమయ్యాయి. ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (38; 3 ఫోర్లు), ఉస్మాన్ ఖవాజా (42; 5 ఫోర్లు) తొలి వికెట్‌కు 90 పరుగులు జోడించారు. స్టీవ్ స్మిత్ (26; 2 ఫోర్లు) తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. ఆట ముగిసే సమయానికి లబుషేన్ (44 బ్యాటింగ్; 3 ఫోర్లు), ట్రావిస్ హెడ్ (9 బ్యాటింగ్; 1 ఫోర్) క్రీజులో ఉన్నారు. పాక్ బౌలర్లు హసన్ అలీ, ఆమెర్ జమాల్, ఆగా సల్మాన్ ఒక్కోవికెట్ తీశారు. ఈ నేపథ్యంలో రెండో రోజు ఆట మొదలుపెట్టిన కంగారూ జట్టును పాక్ బౌలర్లు కట్టడి చేశారు. 187/3 ఓవర్‌నైట్ స్కోరుతో మొదలుపెట్టిన ఆస్ట్రేలియాను 318 పరుగులకు ఆలౌట్ చేశారు. ఆతిథ్య ఆసీస్ రెండో రోజు కేవలం 131 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ జోష్‌లో బ్యాటింగ్ మొదలుపెట్టిన పాకిస్తాన్‌కు ఆదిలోనే షాకిచ్చాడు ఆసీస్ వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్. పది పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్‌ను అవుట్ చేశాడు. అయితే, మరో ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ అర్ధ శతకం(62)తో మెరిశాడు. వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ షాన్ మసూద్(54)తో కలిసి మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలో ప్యాట్ కమిన్స్ షఫీక్‌ను, లియోన్ మసూద్‌ను అవుట్ చేసి ఈ జోడీని విడగొట్టారు. ఇక ఈ మ్యాచ్‌లోనూ బాబర్ ఆజం పూర్తిగా విఫలమయ్యాడు. కమిన్స్ అద్భుత బంతితో బాబర్(1)ను బౌల్డ్ చేయగా.. సౌద్ షకీల్‌ను 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జోష్ హాజిల్‌వుడ్ పెవిలియన్‌కు చేర్చాడు. ఇక మరోసారి బంతితో మ్యాజిక్ చేసిన కమిన్స్.. ఆగా సల్మాన్(9)ను అవుట్ చేశాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సరికి మళ్లీ ఆస్ట్రేలియా ఆధిక్యంలోకి వచ్చింది. మొత్తంగా 55 ఓవర్ల ఆటలో ఆరు వికెట్ల నష్టానికి పాకిస్తాన్ 194 పరుగులు చేసింది. మహ్మద్ రిజ్వాన్ 29, ఆమిర్ జమాల్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్‌కు మూడు, నాథన్ లియోన్‌కు రెండు, జోష్ హాజిల్‌వుడ్‌కు ఒక వికెట్ దక్కాయి. చదవండి: Virat Kohli: ఓసారి మా అక్క నన్ను బాగా కొట్టింది.. రూ. 50 నోటు చూడగానే చించేసి! -
AUS VS PAK 1st Test: 500 వికెట్ల క్లబ్లో చేరిన లియోన్
మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా 360 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఆటగాళ్లు అన్ని విభాగాల్లో సత్తా చాటి పాక్‌ను మట్టికరిపించారు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్ 500 వికెట్ల అరుదైన క్లబ్లో చేరాడు. సుదీర్ఘ ఫార్మాట్లో లియోన్ సహా కేవలం ఎనిమిది మంది మాత్రమే ఈ ఘనతను సాధించారు. ఈ జాబితాలో లంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీథరన్ (133 టెస్ట్‌ల్లో 800 వికెట్లు) అగ్రస్థానంలో ఉండగా.. షేన్ వార్న్ (708), జేమ్స్ ఆండర్సన్ (690), అనిల్ కుంబ్లే (619), స్టువర్ట్ బ్రాడ్ (604), గ్లెన్ మెక్‌గ్రాత్ (563), కోట్నీ వాల్ష్ (519) లియోన్ కంటే ముందు 500 వికెట్ల క్లబ్లో చేరిన వారిలో ఉన్నారు. FIVE HUNDRED! #AUSvPAK #PlayOfTheDay @nrmainsurance pic.twitter.com/DyDC5hUdTJ — cricket.com.au (@cricketcomau) December 17, 2023 సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఫహీమ్ అష్రాఫ్ వికెట్ పడగొట్టడం ద్వారా లియోన్ ఈ లెజెండరీ క్లబ్లో చేరాడు. 36 ఏళ్ల లియోన్ 123 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించి ఆసీస్ తరఫున ఈ ఫీట్ సాధించిన మూడో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. లియోన్‌కు ముందు వార్న్, మెక్‌గ్రాత్ ఆసీస్ తరఫున 500 వికెట్ల క్లబ్లో చేరారు. లియోన్ తన 500 వికెట్ డీఆర్ఎస్కు వెళ్లి సాధించడం విశేషం. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 5 వికెట్లు (తొలి ఇన్నింగ్స్‌లో 3, సెకెండ్ ఇన్నింగ్స్‌లో 2) సాధించిన లియోన్ ఆసీస్ గెలుపులో తనవంతు పాత్ర పోషించాడు. Nathan Lyon is an All-time legend of Test cricket. 🫡 pic.twitter.com/qjP4wYv5lg — Johns. (@CricCrazyJohns) December 17, 2023 మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 487 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 233/5 చేయగా.. పాక్ రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 271, 89 పరుగులు చేసి చిత్తుగా ఓడింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో డేవిడ్ వార్నర్ 164 పరుగులతో చెలరేగిపోగా.. మిచెల్ మార్ష్ 90 పరుగులు చేసి ఔటయ్యాడు. పాక్ అరంగేట్రం బౌలర్ ఆమిర్ జమాల్ 6 వికెట్లు పడగొట్టాడు. పాక్ తొలి ఇన్నింగ్స్‌లో ఇమామ్ ఉల్ హాక్ (62) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖ్వాజా (90), మిచెల్ మార్ష్ (63 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించగా.. పాక్ బౌలర్లలో ఖుర్రమ్ 3 వికెట్లతో పర్వాలేదనిపించాడు. అనంతరం పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో సౌద్ షకీల్ (24), బాబర్ ఆజమ్ (14), ఇమామ్ ఉల్ హాక్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. స్టార్క్, హాజిల్‌వుడ్ చెరో 3 వికెట్లతో సత్తా చాటారు. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ మెల్బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి ప్రారంభమవుతుంది. -
Aus Vs Pak: ఆస్ట్రేలియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్‌గా వరల్డ్‌కప్ హీరో
Australia vs Pakistan, 1st Test: పాకిస్తాన్‌తో తొలి టెస్టుకు ఆస్ట్రేలియా తమ తుది జట్టును ప్రకటించింది. షాన్ మసూద్ బృందంతో తలపడబోయే జట్టులో వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్‌కు చోటిచ్చినట్లు తెలిపింది. కాగా మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకుంది. కంగారూ వంటి పటిష్ట జట్టుతో పోరుకు సన్నద్ధమయ్యే క్రమంలో ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ కూడా ఆడింది. కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇదిలా ఉంటే.. గురువారం (డిసెంబరు 14) నుంచి అసలైన సిరీస్ ఆరంభం కానుంది. వైస్ కెప్టెన్‌గా వరల్డ్‌కప్-2023 హీరో పెర్త్‌లో జరుగనున్న ఈ మ్యాచ్‌కు సంబంధించిన తమ తుది జట్టు ఇదేనంటూ ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బుధవారం వివరాలు వెల్లడించాడు. వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్ హీరో ట్రవిస్ హెడ్ ఈ మ్యాచ్‌లో తనకు డిప్యూటీగా వ్యవహరించనున్నట్లు తెలిపాడు. మర్ఫీకి బైబై.. లియోన్ ఇన్ మాజీ సారథి స్టీవ్ స్మిత్‌తో కలిసి హెడ్.. కో-వైస్ కెప్టెన్‌గా ఉంటాడని కమిన్స్ పేర్కొన్నాడు. కాగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌తో నాథన్ లియోన్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. యువ స్పిన్నర్ టాడ్ మర్ఫీ స్థానాన్ని అతడు భర్తీ చేయనున్నాడు. ఇక పాక్‌తో తొలి టెస్టులో ఆస్ట్రేలియా ముగ్గురు పేసర్లు, ఒక స్పిన్నర్‌తో బరిలోకి దిగనుంది. అదే విధంగా ఆల్‌రౌండర్ స్లాట్‌లో కామెరాన్ గ్రీన్‌తో పోటీ పడ్డ మిచెల్ మార్ష్వైపే మేనేజ్మెంట్ మొగ్గు చూపడంతో అతడు ఈ మ్యాచ్‌లో భాగం కానున్నాడు. ఇదిలా ఉంటే.. స్టార్ బ్యాటర్ ట్రవిస్ హెడ్ వైస్ కెప్టెన్ అయినప్పటికీ.. ఒకవేళ కమిన్స్ గైర్హాజరైతే ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్‌కే తొలి ప్రాధాన్యం ఉంటుంది. పాకిస్తాన్‌తో తొలి టెస్టుకు ఆస్ట్రేలియా తుది జట్టు ఇదే: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), నాథన్ లియాన్, జోష్ హాజిల్‌వుడ్. చదవండి: Ind vs SA: అందుకే ఓడిపోయాం.. మాకు ఇదొక గుణపాఠం: సూర్యకుమార్ -
యాషెస్ మూడో టెస్ట్ చాలా ప్రత్యేకం.. ఆ ఇద్దరూ లేకుండా 6037 రోజుల తర్వాత..!
హెడింగ్లే వేదికగా ఇవాల్టి నుంచి (జులై 6) ప్రారంభంకానున్న యాషెస్ సిరీస్ మూడో టెస్ట్ మ్యాచ్ పలు ప్రత్యేకతలను సంతరించుకుంది. ఈ మ్యాచ్ ఆసీస్ స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్‌కు వందో టెస్ట్ మ్యాచ్ కాగా.. ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్, ఆసీస్ స్టార్ స్పిన్నర్ నాథన్ లయోన్ లేకుండా 6037 రోజుల తర్వాత ఓ యాషెస్ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఆండర్సన్, లయోన్ లేకుండా 2006 డిసెంబర్ 26న చివరిసారిగా ఓ యాషెస్ టెస్ట్ మ్యాచ్ జరిగింది. కాగా, రెండో టెస్ట్ సందర్భంగా గాయపడినందున నాథన్ లయోన్ సిరీస్ మొత్తానికే దూరం కాగా, తొలి రెండు టెస్ట్‌ల్లో రాణించికపోవడంతో ఆండర్సన్‌ను ఇంగ్లీష్ మేనేజ్మెంట్ పక్కన పెట్టింది (మూడో టెస్ట్‌కు). ఇదిలా ఉంటే, లార్డ్స్‌లో ముగిసిన రెండో టెస్ట్‌లో పర్యాటక ఆస్ట్రేలియా 43 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 371 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 327 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఆసీస్ 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. బెన్ స్టోక్స్ (214 బంతుల్లో 155; 9 ఫోర్లు, 9 సిక్స్‌లు) వీరోచితంగా పోరాడినప్పటికీ ఇంగ్లండ్‌ను గెలిపించలేకపోయాడు. మ్యాచ్ ఆఖరి రోజు జానీ బెయిర్‌స్టో స్టంపౌట్ వివాదాస్పదమైంది. -
Ashes Series 2023: గెలుపు జోష్‌లో ఉన్న ఆసీస్‌కు భారీ షాక్.. ఇకపై కష్టమే..!
5 మ్యాచ్‌ల యాషెస్ సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. రెండో టెస్ట్ సందర్భంగా తీవ్రంగా గాయపడిన (కాలు బెణికింది) వారి తురుపు ముక్క, స్టార్ స్పిన్నర్ నాథన్ లయోన్ సిరీస్ మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అధికారికంగా ప్రకటించింది. లయోన్ లేని లోటు ఆసీస్‌కు ఎదరుదెబ్బగా పరిగణించబడుతుంది. లయోన్ స్థానంలో సీఏ ఎవరిని కొత్తగా ఎంపిక చేయలేదు. మూడో టెస్ట్‌కు లయోన్ స్థానంలో టాడ్ మర్ఫీ తుది జట్టులో ఉంటాడని తెలుస్తోంది. ఈ ఏడాది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మర్ఫీ ప్రతిభను (4 టెస్ట్‌ల్లో 14 వికెట్లు) పరిగణలోకి తీసుకుని సీఏ అతనివైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ అయిన మర్ఫీ.. ఆసీస్ తరఫున ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లు ఆడాడు. ఆసీస్-ఇంగ్లండ్‌ల మధ్య మూడో టెస్ట్ హెడింగ్లే వేదికగా జులై 6 నుంచి మొదలు కానుంది. కాగా, రెండో టెస్ట్, రెండో రోజు ఆటలో బెన్ డకెట్ క్యాచ్ అందుకోబోతూ నాథన్ లయోన్ కాలు బెణికింది. యాదృచ్చికంగా ఈ మ్యాచ్ లయోన్‌కు తన కెరీర్లో వరుసగా వందో టెస్ట్ మ్యాచ్. గాయపడిన అనంతరం లయోన్ బరిలోకి దిగనప్పటికీ..నాలుగో రోజు జట్టు కోసం పెద్ద సాహసమే చేశాడు. కుంటుతూనే బ్యాటింగ్‌కు వచ్చి తన జట్టుకు అతి మూల్యమైన పరుగులు సమకూర్చాడు. ఈ మ్యాచ్‌లో లయోన్ లేకపోయినా ఆసీస్ 43 పరుగుల తేడాతో గెలుపొందింది. స్టోక్స్ పోరాటం వృధా.. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో ఆసీస్ అంతిమంగా విజయం సాధించినప్పటికీ.. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (214 బంతుల్లో 155; 9 ఫోర్లు, 9 సిక్స్‌లు) వారికి ముచ్చెమటలు పట్టించి, మూడు చెరువుల నీళ్లు తాపించాడు. వీరోచితమైన ఇన్నింగ్స్‌తో తన జట్టును గెలిపించినంత పని చేశాడు. ఆసీస్ నిర్ధేశించిన 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒక్కడే అద్భుతమైన పోరాటం చేశాడు. జట్టులో డకెట్్ (83) మినహా మిగతా వారెవ్వరి నుంచి సహకారం లభించకపోవడంతో ఇంగ్లండ్ 327 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. -
నాథన్ లయోన్‌కు నీరాజనాలు.. గాయాన్ని లెక్క చేయకుండా, కుంటుతూనే బరిలోకి..!
యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ రెండో రోజు ఆటలో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయోన్ గాయపడ్డ విషయం తెలిసిందే. గాయం తీవ్రత అధికంగా ఉండటంతో అతను డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితమయ్యాడు. అయితే నాలుగో రోజు ఆటలో ఆసీస్‌కు లయోన్ అవసరం పడటంతో అతను ఏమాత్రం సంకోచించకుండా ప్యాడ్లు కట్టుకుని బ్యాటింగ్ చేసేందుకు బరిలోకి దిగి అభిమానుల మనసులను గెలుచుకున్నాడు. లయోన్ కమిట్మెంట్కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. 👏 @NathLyon421.#LoveLords | #Ashes pic.twitter.com/yx5l8w2Vu1 — Lord's Cricket Ground (@HomeOfCricket) July 1, 2023 అతను నొప్పిని భరిస్తూ కుంటుతూ మైదానంలోకి వస్తుంటే, స్టేడియంలో ఉన్న ప్రేక్షకులంతా లేచి నిలబడి చప్పట్లతో ప్రశంసించారు. లయోన్ ఔటై పెవిలియన్‌కు వెళ్తున్న సమయంలోనూ ప్రేక్షకులు చప్పట్లతో స్టేడియాన్ని మార్మోగించారు. ఆట పట్ల లయోన్‌కు ఉన్న డెడికేషన్, తాను చేయగలిగే కొన్ని పరుగులైన జట్టుకు ఉపయోగపడతాయన్న అతని కమిట్మెంట్కు నెటిజన్లు నీరాజనాలు పలుకుతున్నారు. లయోన్ కుంటుతూ మైదానంలోకి వస్తున్న వీడియో నెట్టింట వైరలవుతుంది. Here he comes! #Ashes pic.twitter.com/2t954CNI7g — cricket.com.au (@cricketcomau) July 1, 2023 కాగా, ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 11వ నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగిన లయోన్.. బౌండరీ సాయంతో 4 పరుగులు చేసి ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. అనంతరం ఆసీస్ నిర్ధేశించిన 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసి విజయానికి 257 పరుగుల దూరంలో ఉంది. అదే ఆసీస్ గెలవాలంటే 6 వికెట్లు అవసరం. క్రీజ్‌లో డకెట్ (50), స్టోక్స్ (29) ఉన్నారు. స్కోర్ వివరాలు.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్ (స్టీవ్ స్మిత్ 110, ట్రవిస్ హెడ్ 77, డేవిడ్ వార్నర్ 66; రాబిన్సన్ 3/100, టంగ్ 3/98) ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 325 ఆలౌట్ (డకెట్ 98, బ్రూక్ 50; స్టార్క్ 3/88, హెడ్ 2/17) ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 279 ఆలౌట్ (ఖ్వాజా 77; బ్రాడ్ 4/65) ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్: 114/4 (డకెట్ 50 నాటౌట్; కమిన్స్ 2/20) (నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి) -
Ashes 2023: నాథన్ లియోన్‌కు గాయం.. ఆసీస్‌కు ఊహించని షాక్!
ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ నాథన్ లియోన్ తీవ్రంగా గాయపడ్డాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆటలో లియోన్ ఫీల్డింగ్ చేస్తూ బౌండరీ లైన్ వద్ద గాయపడ్డాడు. రెండో సెషన్లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 37వ ఓవర్లో ఇది జరిగింది. ఈ క్రమంలో నొప్పి తీవ్రంగా ఉండడంతో వెంటనే మైదానాన్ని వీడాడు. ఆ తర్వాతి సెషన్‌కు లియోన్ మళ్లీ మైదానంలో అడుగుపెట్టలేదు. ఇది ఆస్ట్రేలియాకు ఊహించని షాక్ అని చెప్పొచ్చు. రెండో టెస్టులో లియోన్ 13 ఓవర్లు వేసి ఒక వికెట్ కూడా పడగొట్టాడు. మరో నాలుగు వికెట్లు తీస్తే 500వికెట్ల మార్క్‌ను అందుకునే అవకాశం ఉంది. ఇక లియోన్‌కు లార్డ్స్ టెస్టు వందోది అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లియోన్ గాయంపై స్టీవ్ స్మిత్ స్పందింస్తూ.. ''నాథన్ కచ్చితంగా ఎలా ఉన్నాడో తెలియదు.. అతని గాయం తీవ్రమైతే మాత్రం తమ జట్టుకు భారీ నష్టం మిగలనుంది. అతని లోటును తీర్చడం చాలా కష్టం. ఏం జరగాలని ఉంటే అది జరుగుతుంది.''అంటూ తెలిపాడు. తాజాగా మూడోరోజు ఆటకు ఇరుజట్లు సిద్ధమవుతున్నా వేళ ఆడమ్ వైట్ అనే వ్యక్తి తన ట్విటర్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టేడియానికి వస్తున్న వీడియోనూ షేర్ చేశాడు. ఈ వీడియోలో నాథన్ లియోన్ రెండు స్రెచర్ల సాయంతో నడుస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. దీన్నిబట్టి లియోన్‌కు గాయం తీవ్రత ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే రెండో టెస్టుకు లియోన్ దూరమైనట్లే. నాథన్ లియోన్ స్థానంలో టాడ్ మార్ఫీ! ఒకవేళ నాథన్ గాయంతో యాషెస్ సిరీస్ కు దూరమైతే అతని స్థానంలో టాడ్ మార్ఫీని మూడో టెస్టులోకి తీసుకొనే అవకాశం ఉంది. లియోన్ 30 యాషెస్ టెస్టుల్లో 29.41 సగటుతో 110 వికెట్లు పడగొట్టాడు. ఇక ఇప్పటివరకు 122 టెస్టుల్లో 31.01 సగటుతో 496 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 23సార్లు ఐదు వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. నాలుగు మ్యాచుల్లో 10 వికెట్లు తీసి ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక లార్డ్స్ టెస్టు రసవత్తరంగా మారింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ రెండోరోజు ఆట ముగిసేసమయానికి 61 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ 45, బెన్ స్టోక్స్ 17 పరుగులతో ఆడుతున్నారు. ఇంగ్లండ్ ప్రస్తుతం 138 పరుగులు వెనుకబడి ఉంది. The Australians have arrived 80 minutes before play as Nathan Lyon struggles with his team mates on crutches following his calf injury yesterday. @SEN_Cricket pic.twitter.com/a1lRWLIofm — Adam White (@White_Adam) June 30, 2023 చదవండి: అతడి గురించి మీకేం తెలుసు? ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వరా?: గంగూలీ ఆగ్రహం #Ashes2023: 58 గంటల ప్రయాణం.. తీరా వస్తే టికెట్ దొరకలేదు; కట్‌చేస్తే -
చరిత్ర సృష్టించనున్న నాథన్ లయోన్.. తొలి బౌలర్‌గా అరుదైన ఘనత
యాషెస్ సిరీస్ 2023లో భాగంగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మకమైన లార్డ్స్ మైదానంలో ఇవాళ (జూన్ 28) ప్రారంభంకానున్న రెండో టెస్ట్ మ్యాచ్ ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయోన్‌కు చిరకాలం గుర్తుండిపోతుంది. కేవలం ఈ మ్యాచ్‌లో ఆడటం ద్వారానే అతను చరిత్ర సృష్టించనున్నాడు. టెస్ట్ క్రికెట్లో వరుసగా 100 మ్యాచ్‌లు ఆడిన తొలి బౌలర్‌గా అరుదైన ఘనత సాధించనున్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఏ ఇతర బౌలర్‌కు ఈ ఫీట్‌ను సాధించలేదు. ఓవరాల్‌గా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ సర్ అలిస్టర్ కుక్ వరుసగా 159 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. అతని తర్వాత ఆసీస్ ఆల్‌రౌండర్ అలెన్ బోర్డర్ (153), ఆసీస్ మార్క్ వా (107), ఇండియా సునీల్ గవాస్కర్ (106), కివీస్ బ్రెండన్ మెక్కల్లమ్ (101) ఉన్నారు. ఓవరాల్‌గా చూస్తే.. లయోన్ తన కెరీర్ మొత్తంలో 121 టెస్ట్‌లు ఆడాడు. ఇందులో 23 ఐదు వికెట్ల ఘనతలు, 4 పది వికెట్ల ఘనతల సాయంతో 495 వికెట్లు పడగొట్టాడు. తన కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయే లార్డ్స్ టెస్ట్‌లో లయోన్ మరో 5 వికెట్లు పడగొడితే.. 500 వికెట్ల మైలురాయిని కూడా చేరుకుంటాడు. ఇదిలా ఉంటే, యాషెస్ సిరీస్ 2023 తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా చిరస్మరణీయ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బజ్‌బాల్ అప్రోచ్ అంటూ బొక్కబోర్లా పడింది. స్వయంకృతాపరాధంగానే ఆ జట్టు ఓడింది. తొలి ఇన్నింగ్స్‌లో మరిన్ని పరుగులు చేసే అవకాశం ఉన్నా ఆ జట్టు ఓవరాక్షన్ చేసి చేతులు కాల్చుకుంది. మరి ఈ మ్యాచ్‌లో అయిన ఇంగ్లండ్ ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడుతుందో లేక మరోసారి బజ్‌బాల్ అంటూ హడావుడి చేస్తుందో వేచి చూడాలి. -
సిరాజ్ అరుదైన ఘనత.. స్వదేశం కంటే విదేశాల్లోనే అదుర్స్
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ టెస్టుల్లో 50 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా నాథన్ లియాన్‌ను క్లీన్‌బౌల్డ్ చేయడం ద్వారా సిరాజ్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఇక మ్యాచ్‌లో సిరాజ్ నాలుగు వికెట్లతో మెరిశాడు. కాగా 19 టెస్టుల్లో సిరాజ్ ఈ ఘనత సాధించాడు. ఓవరాల్‌గా టీమిండియా తరపున టెస్టుల్లో 50 వికెట్లు తీసిన 42వ బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఇక టీమిండియా తరపున అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు. బుమ్రా 11 టెస్టుల్లోనే 50 వికెట్ల మార్క్ అందుకున్నాడు. కాగా సిరాజ్‌కు టెస్టుల్లో స్వదేశం కంటే విదేశాల్లోనే మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు తీసిన 50 వికెట్లలో 41 వికెట్లు విదేశాల్లో వచ్చినవే. ఇందులో 18 వికెట్లు(ఏడు టెస్టుల్లో) ఆస్ట్రేలియా గడ్డపై, 20 వికెట్లు(ఆరు టెస్టుల్లో) ఇంగ్లండ్ గడ్డపై తీశాడు. ఇక సిరాజ్ ఖాతాలో ఒకే ఒక్క ఐదు వికెట్ల హాల్ ఉండగా.. అది కూడా ఆసీస్ గడ్డపైనే(2021లో బ్రిస్బేన్‌లో) వచ్చింది. Mohammed Siraj completes 5️⃣0️⃣ Test wickets in just 19 Test matches. One of the most improved players in recent times.@mdsirajofficial | #WTC2023Final pic.twitter.com/nwE4lhS6pW — CricTracker (@Cricketracker) June 8, 2023 చదవండి: సిరాజ్‌కు కోపం తెప్పించిన స్మిత్ చర్య -
Ind Vs Aus: ఆస్ట్రేలియా రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా! ఇంకా..
India Vs Australia 4th Test Day 4 Records: నాలుగో టెస్టులో నాలుగో రోజు నాలుగో శతకం నమోదైన విషయం తెలిసిందే. ఒక టెస్టులో నాలుగు సెంచరీలు కొత్తేం కాదు... కానీ ఈ ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో మాత్రం ఇది గొప్ప విశేషం. ఎందుకంటే ఇంతకుముందు జరిగిన మూడు టెస్టులు కూడా మూడో రోజుల్లోనే ముగిశాయి. స్పిన్నర్లు తిప్పేసిన ఆ మ్యాచ్‌ల్లో బ్యాటర్లు విలవిలలాడారు. గత మ్యాచుల్ని శాసించిన బౌలర్లపై ఇరు జట్ల బ్యాటర్లు సెంచరీలతో విరుచుకుపడ్డారు. మరి టీమిండియాకు అనుకూలంగా మారిన నాలుగో రోజు ఆటలో విశేషాలు, నమోదైన ప్రధాన రికార్డులన్నీ ఒకేచోట చూసేద్దామా?! 1205 రోజుల తర్వాత... భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి... సుదీర్ఘ టెస్టు సెంచరీ నిరీక్షణకు తెరదించాడు. ఆఖరి టెస్టులో మూడంకెల స్కోరు ముచ్చట తీర్చుకున్నాడు. ఓవర్‌నైట్ స్కోరు 289/3 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆదివారం ఆట ప్రారంభించిన భారత్‌కు జడేజా (84 బంతుల్లో 44; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రూపంలో గట్టిదెబ్బే తగిలింది. బ్యాటింగ్‌కు కలిసొచ్చే పిచ్‌పై కోహ్లికి జతయిన ఆంధ్ర క్రికెటర్ శ్రీకర్ భరత్ (44; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) జతయ్యాడు. ‘రన్ మెషిన్’ అండతో భరత్ భారీ సిక్సర్లతో అలరించాడు. 363/4 వద్ద లంచ్‌కు వెళ్లొచ్చాక ఎంతో ఓపిగ్గా ఆడిన కోహ్లి 241 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 2019లో నవంబర్ 23న క్రికెట్ మక్కా ఈడెన్ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌పై కోహ్లి 27వ టెస్ట్ శతకం సాధించాడు. మళ్లీ 43 టెస్టుల తర్వాత భారత గడ్డపైనే 28వ సెంచరీ చేసి 1205 రోజుల నిరీక్షణకు ముగింపు పలికాడు. ఐదో వికెట్‌కు 84 పరుగులు జోడించాక లయన్ బౌలింగ్‌లో భరత్... హ్యాండ్స్కాంబ్ చేతికి చిక్కాడు. అనంతరం అక్షర్ పటేల్ కూడా పట్టుదలతో ఆడటంతో ఆస్ట్రేలియాకు కంగారు తప్పలేదు. ఇద్దరి జోడీ కుదరడంతో భారత్ భారీస్కోరుకు బాటపడింది. మూడో సెషన్లో టీమిండియా 500 మార్క్‌ను అందుకోగా, కోహ్లి 150 పరుగులు పూర్తయ్యాయి. కాసేపటికే అక్షర్ 95 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. అక్షర్‌ను స్టార్క్ బౌల్డ్ చేయడంతో ఆరో వికెట్‌కు 162 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత కాసేపటికే భారత్ 571 పరుగుల వద్ద ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆడిన ఆసీస్ ఆట నిలిచే సమయానికి వికెట్ నష్టపోకుండా 3 పరుగులు చేసింది. నాలుగో రోజు ప్రధాన రికార్డులు 75: టీమిండియా స్టార్, రన్‌మెషీన్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్లో 75వ సెంచరీ నమోదు చేశాడు. టెస్టుల్లో అతడికి ఇది 28వ శతకం. భారత గడ్డపై లియోన్ చరిత్ర భారత గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన విదేశీ జట్టు బౌలర్‌గా నాథన్ లయన్ గుర్తింపు పొందాడు. భారత్‌లో 11 టెస్టులు ఆడిన లయన్ 56 వికెట్లు పడగొట్టాడు. డెరిక్ అండర్వుడ్ (ఇంగ్లండ్; 16 టెస్టుల్లో 54 వికెట్లు) పేరిట ఉన్న రికార్డును లయన్ బద్దలు కొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ కొట్టిన సిక్స్‌లు. 10: ఆస్ట్రేలియాపై ఓ టెస్ట్ ఇన్నింగ్స్‌లో భారత్ కొట్టిన అత్యధిక సిక్స్‌లు ఇవే. 1986లో ముంబైలో, 2013లో చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్‌ల్లో భారత్ ఎనిమిది చొప్పున సిక్స్‌లు కొట్టింది. మూడో జట్టుగా భారత్ ఓ టెస్ట్ మ్యాచ్‌లో తొలి ఆరు వికెట్లకు 50 అంతకంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యాలు నమోదు చేసిన మూడో జట్టుగా భారత్ నిలిచింది. గతంలో ఆస్ట్రేలియా (1960లో వెస్టిండీస్‌పై), పాకిస్తాన్ (2015లో బంగ్లాదేశ్‌పై) ఈ ఘనత సాధించాయి. ఆస్ట్రేలియా రికార్డు బద్దలు నరేంద్ర మోదీ స్టేడియంలో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా ఆస్ట్రేలియా 480 పరుగులతో చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, నాలుగో టెస్టు నాలుగో రోజు ఆట సందర్భంగా టీమిండియా ఆసీస్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. తొలి ఇన్నింగ్స్‌లో 571 పరుగులు సాధించిన భారత్.. పర్యాటక జట్టు పేరిట ఉన్న ఘనతను కనుమరుగు చేసింది. అయ్యర్ అవుట్! భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ నాలుగో రోజు బ్యాటింగ్‌కు దిగలేదు. వెన్నునొప్పితో బాధపడిన అతనికి స్కానింగ్ కూడా తీశారు. ముందు జాగ్రత్తగా జట్టు మేనేజ్మెంట్ అతన్ని ఆడించలేదు. మూడో రోజు ఆటలోనే అతనికి నొప్పి మొదలైనట్లు తెలిసింది. గాయం తీవ్రత దృష్ట్యా అతను ఈ నెల 17 నుంచి జరిగే మూడు వన్డేల సిరీస్‌కు కూడా దూరమయ్యే అవకాశాలున్నాయి. చదవండి: Virat Kohli: ఎవరికీ అందనంత ఎత్తులో! ఇక కోహ్లి సాధించాల్సింది అదొక్కటే Virat Kohli 75th Century: కింగ్ ఈజ్ బ్యాక్.. ఆ ఇద్దరు దిగ్గజాల తర్వాత కోహ్లికే సాధ్యమైంది! -
IND VS AUS 4th Test: చరిత్ర సృష్టించిన నాథన్ లియోన్
ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ నాథన్ లియోన్ చరిత్ర సృష్టించాడు. భారతగడ్డపై అత్యధిక వికెట్లు (టెస్ట్‌ల్లో) పడగొట్టిన విదేశీ బౌలర్‌గా ఇంగ్లండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ డెరెక్ అండర్వుడ్ (16 టెస్ట్‌ల్లో 54 వికెట్లు) పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో కేఎస్ భరత్ (44) వికెట్ పడగొట్టడం ద్వారా లియోన్ ఈ రేర్ ఫీట్ సాధించాడు. ప్రస్తుతం లియోన్ ఖాతాలో 55 వికెట్లు (11 టెస్ట్‌ల్లో) ఉన్నాయి. భారతగడ్డపై లియోన్ ఐదుసార్లు ఐదు వికెట్ల ఘనతను, ఓ సారి 10 వికెట్లు ఫీట్‌ను సాధించాడు. లియోన్, అండర్వుడ్ తర్వాత భారత గడ్డపై అత్యధిక టెస్ట్ వికెట్లు పడగొట్టిన విదేశీ బౌలర్ల జాబితాలో రిచీ బెనాడ్ (52), కోట్నీ వాల్ష్ (43), ముత్తయ్య మురళీథరన్ (40) మూడు నుంచి ఐదు స్థానాల్లో నిలిచారు. భారత్‌పై అత్యంత విజయవంతమైన స్పిన్నర్‌గా.. ప్రస్తుత భారత పర్యటనలో చెలరేగిపోతున్న నాథన్ లియోన్.. పలు ఆసక్తికర రికార్డులను తన పేరిట లిఖించుకుంటున్నాడు. భారతగడ్డపై అత్యధిక వికెట్లు పడగొట్టిన విదేశీ బౌలర్ రికార్డుతో పాటు భారత్‌పై అత్యంత విజయవంతమైన స్పిన్నర్‌గానూ రికార్డు నెలకొల్పాడు. మొత్తంగా భారత్‌పై 26 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన లియోన్.. 9 సార్లు ఐదు వికెట్ల ఘనతతో పాటు 2 సార్లు 10 వికెట్ల ఘనత సాధించి 115 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. భారతపై ఏ స్పిన్నర్ ఇన్ని వికెట్లు పడగొట్టలేదు. అలాగే భారత్‌పై అత్యధిక ఫైఫర్లు సాధించిన బౌలర్‌గాను లియోన్ రికార్డు నెలకొల్పాడు. భారత్‌పై అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో లియోన్‌కు ముందు ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ (139) మాత్రమే ఉన్నాడు. BGT-2023లో భీకర ఫామ్‌లో ఉన్న లియోన్.. 4 టెస్ట్‌ల్లో 21 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా లియోన్ ఖాతాలో 480 వికెట్లు (119 టెస్ట్‌ల్లో) ఉన్నాయి. ఇందులో 23 సార్లు ఐదు వికెట్ల ఘనత, 4 సార్లు 10 వికెట్ల ఘనత సాధించాడు. టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో లియోన్ ప్రస్తుతం 9వ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో మురళీథరన్ (800) అగ్రస్థానంలో ఉండగా.. షేన్ వార్న్ (708), ఆండర్సన్ (685), అనిల్ కుంబ్లే (619), స్టువర్ట్ బ్రాడ్ (576), మెక్‌గ్రాత్ (563), వాల్ష్ (519) వరుసగా 2 నుంచి 8 స్థానాల్లో ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. భారత్-ఆసీస్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ డ్రా దిశగా సాగుతోంది. నాలుగో రోజు మూడో సెషన్ సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 519 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (169), అక్షర్ పటేల్ (57) క్రీజ్‌లో ఉన్నారు. భారత ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ (128) సెంచరీ చేయగా.. అంతకుముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 482 పరుగులకు ఆలౌటైంది. ఉస్మాన్ ఖ్వాజా (180), గ్రీన్ (114) సెంచరీలతో కదంతొక్కగా.. అశ్విన్ 6 వికెట్లతో ఆసీస్ వెన్ను విరిచాడు. -
Shane Warne: అప్పుడే ఏడాది గడిచిపోయిందా? నమ్మలేకున్నా!
Shane Warne Death Anniversary: ‘‘అత్యంత విచారకరం. అప్పుడే ఏడాది గడిచిపోయిందంటే నిజంగా నమ్మలేకపోతున్నా’’ అంటూ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ దివంగత షేన్ వార్న్‌ను గుర్తు చేసుకున్నాడు. కాలం గిర్రున తిరిగిపోయిందని.. వార్న్ లేడన్న నిజాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని విచారం వ్యక్తం చేశాడు. అద్భుతమైన బంతులతో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టే వార్న్ లేనిలోటు ఎవరూ పూడ్చలేరన్నాడు. ‘మాంత్రికుడు’ మరో లోకానికి.. ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ఈ లోకాన్ని వీడి నేటికి సరిగ్గా ఏడాది. థాయ్‌లాండ్‌లో ఉన్న సమయంలో గుండెపోటుకు గురైన అతడు హఠాన్మరణం చెందాడు. ఛాతీ నొప్పితో కుప్పకూలిన వార్న్.. థాయ్‌లాండ్ పర్యటనలోనే కన్నుమూశాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అతడి అంత్యక్రియలు నిర్వహించింది. వార్న్‌ను కడసారి చూసుకునేందుకు తరలివచ్చిన అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. క్రికెట్ అంటే పిచ్చి ఈ నేపథ్యంలో షేన్ వార్న్‌ను గుర్తు చేసుకున్న మార్క్ టేలర్.. వైడ్ వరల్డ్ ఆఫ్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. స్పిన్ మాంత్రికుడి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఇండియాలో బంతి అద్భుతంగా టర్న్ అవుతున్న సందర్భాల్లో కచ్చితంగా వార్న్ మనందరికీ మరీ మరీ గుర్తుకువస్తాడు. తన స్పిన్ మాయాజాలంతో వార్న్ చేసిన అద్భుతాలు, మైదానంలో వదిలిన జ్ఞాపకాలు అలాంటివి. అతడు లేని లోటు ఎన్నటికీ ఎవ్వరూ పూడ్చలేరు. అతడి అభిప్రాయాలన్నింటితో నేను ఏకీభవించకపోవచ్చు. కానీ ఆట పట్ల వార్న్‌కు ఉన్న ప్రేమ, అంకితభావానికి మాత్రం ఫిదా కాకుండా ఉండలేం’’ అని మార్క్ టేలర్ చెప్పుకొచ్చాడు. కాగా ఆస్ట్రేలియా తరఫున 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు తీసి వార్న్ ‘ఆల్‌టైమ్ గ్రేట్’ బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి టైటిల్ గెలిచిన సారథిగానూ రికార్డులకెక్కాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఇక ప్రస్తుతం టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆసీస్ వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్ వార్న్ పేరిట ఉన్న పలు రికార్డులు బద్దలు కొడుతూ సత్తా చాటుతున్నాడు. ఇదిలా ఉంటే.. మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకుంది. మరోవైపు.. తొలి రెండు టెస్టుల్లో గెలిచిన టీమిండియా ప్రస్తుతం 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది. చదవండి: Ind Vs Aus: ఇండోర్ పిచ్ పరమ చెత్తగా ఉంది.. అతడు లేడు కాబట్టే ఇలా: టీమిండియా దిగ్గజం నోరు మూసుకుని ఆటపై దృష్టి పెట్టండి.... టీమిండియాపై ఆసీస్ మాజీ కెప్టెన్ ఘాటు వ్యాఖ్యలు