ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ నాథన్ లియోన్ తీవ్రంగా గాయపడ్డాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆటలో లియోన్ ఫీల్డింగ్ చేస్తూ బౌండరీ లైన్ వద్ద గాయపడ్డాడు. రెండో సెషన్‌లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 37వ ఓవర్‌లో ఇది జరిగింది. ఈ క్రమంలో నొప్పి తీవ్రంగా ఉండడంతో వెంటనే మైదానాన్ని వీడాడు.
ఆ తర్వాతి సెషన్‌కు లియోన్ మళ్లీ మైదానంలో అడుగుపెట్టలేదు. ఇది ఆస్ట్రేలియాకు ఊహించని షాక్ అని చెప్పొచ్చు. రెండో టెస్టులో లియోన్ 13 ఓవర్లు వేసి ఒక వికెట్ కూడా పడగొట్టాడు. మరో నాలుగు వికెట్లు తీస్తే 500వికెట్ల మార్క్‌ను అందుకునే అవకాశం ఉంది. ఇక లియోన్‌కు లార్డ్స్ టెస్టు వందోది అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
లియోన్ గాయంపై స్టీవ్ స్మిత్ స్పందింస్తూ.. ''నాథన్ కచ్చితంగా ఎలా ఉన్నాడో తెలియదు.. అతని గాయం తీవ్రమైతే మాత్రం తమ జట్టుకు భారీ నష్టం మిగలనుంది. అతని లోటును తీర్చడం చాలా కష్టం. ఏం జరగాలని ఉంటే అది జరుగుతుంది.''అంటూ తెలిపాడు. తాజాగా మూడోరోజు ఆటకు ఇరుజట్లు సిద్ధమవుతున్నా వేళ ఆడమ్ వైట్ అనే వ్యక్తి తన ట్విటర్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టేడియానికి వస్తున్న వీడియోనూ షేర్ చేశాడు. ఈ వీడియోలో నాథన్ లియోన్ రెండు స్రెచర్‌ల సాయంతో నడుస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. దీన్నిబట్టి లియోన్‌కు గాయం తీవ్రత ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే రెండో టెస్టుకు లియోన్ దూరమైనట్లే.
నాథన్ లియోన్ స్థానంలో టాడ్ మార్ఫీ!
ఒకవేళ నాథన్ గాయంతో యాషెస్ సిరీస్ కు దూరమైతే అతని స్థానంలో టాడ్ మార్ఫీని మూడో టెస్టులోకి తీసుకొనే అవకాశం ఉంది. లియోన్ 30 యాషెస్ టెస్టుల్లో 29.41 సగటుతో 110 వికెట్లు పడగొట్టాడు. ఇక ఇప్పటివరకు 122 టెస్టుల్లో 31.01 సగటుతో 496 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 23సార్లు ఐదు వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. నాలుగు మ్యాచుల్లో 10 వికెట్లు తీసి ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఇక లార్డ్స్ టెస్టు రసవత్తరంగా మారింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ రెండోరోజు ఆట ముగిసేసమయానికి 61 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ 45, బెన్ స్టోక్స్ 17 పరుగులతో ఆడుతున్నారు. ఇంగ్లండ్ ప్రస్తుతం 138 పరుగులు వెనుకబడి ఉంది.
The Australians have arrived 80 minutes before play as Nathan Lyon struggles with his team mates on crutches following his calf injury yesterday. @SEN_Cricket pic.twitter.com/a1lRWLIofm
— Adam White (@White_Adam) June 30, 2023
చదవండి: అతడి గురించి మీకేం తెలుసు? ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వరా?: గంగూలీ ఆగ్రహం
#Ashes2023: 58 గంటల ప్రయాణం.. తీరా వస్తే టికెట్ దొరకలేదు; కట్‌చేస్తే
Comments
Please login to add a commentAdd a comment