యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌట్ అయింది. 278/4 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ మరో 47 పరుగులు మాత్రమే జత చేసి మిగతా ఆరు వికెట్లను కోల్పోయింది. దీంతో ఆసీస్‌కు 91 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించినట్లయింది.
ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో బెన్ డకెట్ 98 పరుగులు చేసి రెండు పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. హ్యారీ బ్రూక్ 50, జాక్ క్రాలీ 48, ఓలీ పోప్ 42 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీయగా.. ట్రెవిస్ హెడ్, హాజిల్‌వుడ్ తలా రెండు వికెట్లు తీయగా.. పాట్ కమిన్స్, నాథన్ లియోన్, కామెరాన్ గ్రీన్ తలా ఒక వికెట్ తీశారు.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా లంచ్ విరామ సమయానికి ఆరు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 12 పరుగులు చేసింది. ఆసీస్ ప్రధాన స్పిన్నర్ నాథన్ లియోన్ సేవలను కోల్పోయినప్పటికి ట్రెవిస్ హెడ్ సహా పేస్ బౌలర్లు ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేయడంలో కీలకపాత్ర పోషించారు.
చదవండి: Dhananjaya-De-Silva: దెబ్బకొట్టిన నెదర్లాండ్స్; కెరీర్ బెస్ట్ ప్రదర్శనతో పరువు నిలిపాడు
Comments
Please login to add a commentAdd a comment