Ben Duckett
-
క్రికెట్ చరిత్రలోనే సూపర్ క్యాచ్.. వీడియో వైరల్
బిగ్ బాష్ లీగ్ 2024-25 సీజన్లో సంచలన క్యాచ్ నమోదైంది. ఈ లీగ్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మెల్బోర్న్ స్టార్స్ బ్యాటర్ బెన్ డకెట్ కళ్లు చెదిరే క్యాచ్‌తో మెరిశాడు. అడిలైడ్ బ్యాటర్ డి'ఆర్సీ షార్ట్‌ను అద్బుతమైన క్యాచ్‌తో డకెట్ పెవిలియన్‌కు పంపాడు. అడిలైడ్ ఇన్నింగ్స్ 15వ ఓవర్ వేసిన పీటర్ సిడిల్ నాలుగో బంతిని షార్ట్‌కు ఫుల్లర్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ డెలివరీని షార్ట్ కవర్స్ పై నుంచి షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. షాట్ కూడా సరిగ్గా కనక్ట్ అయినప్పటికి.. ఎక్స్ట్రా కవర్స్‌లో ఉన్న డకెట్ అద్బుతం చేశాడు. డకెట్ గాల్లోకి జంప్ చేస్తూ ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. అతడి క్యాచ్‌ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇందకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.కాగా ఫీల్డింగ్‌లో అదరగొట్టిన డకెట్.. బ్యాటింగ్‌లో మాత్రం నిరాశపరిచాడు. తొలి బంతికే ఔటయ్యి గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మెల్బోర్న్ స్టార్స్‌పై 15 పరుగుల తేడాతో అడిలైడ్ స్ట్రైకర్స్ ఘన విజయం సాధించింది.చదవండి: SA vs PAK: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్.. ప్రపంచంలోనే తొలి జట్టుగాOne of the best catches you will ever see in the BBL! 😱Ben Duckett takes a SCREAMER! @BKTtires #GoldenMoment #BBL14 pic.twitter.com/JLhu3BQ0DZ— KFC Big Bash League (@BBL) December 20, 2024 -
PAK VS ENG 2nd Test: బెన్ డకెట్ వరల్డ్ రికార్డు
ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ ఆటగాడు బెన్ డకెట్ వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన డకెట్ టెస్ట్ క్రికెట్ అత్యంత వేగంగా (బంతుల పరంగా) 2000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా నిలిచాడు. డకెట్ తన 27 మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్లో 2293 బంతులు ఎదుర్కొని 2000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ ఆటగాడు టిమ్ సౌథీ పేరిట ఉండేది. సౌథీ 2418 బంతుల్లో 2000 పరుగులు పూర్తి చేశాడు.టెస్ట్‌ల్లో బంతుల పరంగా వేగవంతమైన 2000 పరుగులు..బెన్ డకెట్ 2293 బంతులుటిమ్ సౌథీ 2418 బంతులుఆడమ్ గిల్‌క్రిస్ట్ 2483 బంతులుసర్ఫరాజ్ అహ్మద్ 2693 బంతులువీరేంద్ర సెహ్వాగ్ 2759 బంతులురిషబ్ పంత్ 2797 బంతులుమ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 366 పరుగులకు ఆలౌటైంది. అరంగేట్రం బ్యాటర్ కమ్రాన్ గులామ్ సెంచరీతో (118) కదంతొక్కగా.. సైమ్ అయూబ్ అర్ద సెంచరీతో (77) రాణించాడు. పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ 7, షాన్ మసూద్ 3, సౌద్ షకీల్ 4, మహ్మద్ రిజ్వాన్ 41, అఘా సల్మాన్ 31, ఆమెర్ జమాల్ 37, సాజిద్ ఖాన్ 2, నౌమన్ అలీ 32, జహిద్ మహమూద్ 2 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ నాలుగు వికెట్లు పడగొట్టగా..బ్రైడన్ కార్స్ మూడు, మాథ్యూ పాట్స్ రెండు, షోయబ్ బషీర్ ఓ వికెట్ దక్కించుకున్నారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. బెన్ డకెట్ సెంచరీతో (114) కదంతొక్కగా.. జాక్ క్రాలే 27, ఓలీ పోప్ 29, జో రూట్ 34, హ్యారీ బ్రూక్ 9, బెన్ స్టోక్స్ ఒక్క పరుగు చేశారు. జేమీ స్మిత్ (12), బ్రైడన్ కార్స్ (2) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్.. పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 127 పరుగులు వెనుకపడి ఉంది. పాక్ బౌలర్లలో సాజిద్ ఖాన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. నౌమన్ అలీ రెండు వికెట్లు దక్కించుకున్నాడు.చదవండి: రెండో స్థానానికి ఎగబాకిన బ్రూక్.. టాప్ ప్లేస్‌ను సుస్థిరం చేసుకున్న రూట్ -
బెన్ డకెట్ సెంచరీ.. అయినా కష్టాల్లో ఇంగ్లండ్
ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ జట్టు ఉన్నట్లుండి కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ దిశగా సాగుతున్న సమయంలో సాజిద్ ఖాన్ (పాక్ స్పిన్నర్) ఇంగ్లండ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. ఇంగ్లండ్ స్కోర్ 124/1 వద్ద ఉన్న సమయంలో సాజిద్ ఖాన్ వరుసగా ఓలీ పోప్ (29), జో రూట్ (34), సెంచరీ హీరో బెన్ డకెట్ (114), హ్యారీ బ్రూక్ (9) వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్ 14 పరుగుల వ్యవధిలో నాలుగు కీలకమైన వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ స్కోర్ 239/6గా ఉంది. జేమీ స్మిత్ (12), బ్రైడన్ కార్స్ (2) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్.. పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 127 పరుగులు వెనుకపడి ఉంది.బెన్ డకెట్ సెంచరీబెన్ డకెట్ 120 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. డకెట్‌కు టెస్ట్‌ల్లో ఇది నాలుగో సెంచరీ. ఓపెనర్‌గా బరిలోకి దిగిన డకెట్ ఆది నుంచి పాక్ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. డకెట్ తన ఇన్నింగ్స్‌లో మొత్తం 16 బౌండరీలు బాదాడు.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 366 పరుగులకు ఆలౌటైంది. అరంగేట్రం బ్యాటర్ కమ్రాన్ గులామ్ సెంచరీతో (118) కదంతొక్కగా.. సైమ్ అయూబ్ అర్ద సెంచరీతో (77) రాణించాడు. పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ 7, షాన్ మసూద్ 3, సౌద్ షకీల్ 4, మహ్మద్ రిజ్వాన్ 41, అఘా సల్మాన్ 31, ఆమెర్ జమాల్ 37, సాజిద్ ఖాన్ 2, నౌమన్ అలీ 32, జహిద్ మహమూద్ 2 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ నాలుగు వికెట్లు పడగొట్టగా..బ్రైడన్ కార్స్ మూడు, మాథ్యూ పాట్స్ రెండు, షోయబ్ బషీర్ ఓ వికెట్ దక్కించుకున్నారు.చదవండి: ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్‌గా వరల్డ్‌కప్ విన్నర్ -
ENG vs PAK: పాక్‌తో అట్లుంటది మరి (వీడియో)
ముల్తాన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్‌కు ఇంగ్లండ్ ధీటుగా బదులిస్తోంది. రెండో రోజు లంచ్ సమయానికి ఇంగ్లండ్ 2 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఉన్న స్టార్ ప్లేయర్లు జో రూట్(72), బెన్ డకెట్(80) సెంచరీల వైపు అడుగులు వేస్తున్నారు. ఇక మూడో రోజు ఆట సందర్భంగా పాకిస్తాన్ టీమ్ మరోసారి తమ పరువు పోగొట్టుకుంది. ఓ చెత్త రివ్యూ తీసుకుని నవ్వులు పాలు అయింది.అసలేం జరిగిందంటే?ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ 39 ఓవర్ వేసిన పాక్ పేసర్ అమీర్ జమాల్ తొలి బంతిని గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. అయితే బంతి కాస్త బ్యాట్‌కు దగ్గర వెళ్తూ వికెట్ కీపర్ చేతికి వెళ్లింది. వెంటనే వికెట్ కీపర్‌తో పాటు బౌలర్ క్యాచ్‌కు అప్పీల్ చేశారు. అంపైర్ నాటౌట్ అంటూ తల ఊపాడు. వికెట్ కీపర్ రిజ్వాన్ కూడా అంత స్పష్టంగా అప్పీల్ చేయలేదు. ఎందుకంటే కనీసం బ్యాట్‌కు తాకిన శబ్ధం కూడా రాలేదు. కానీ జమాల్ మాత్రం రివ్యూకు వెళ్లాలని కెప్టెన్ మసూద్‌కు సూచించాడు. మసూద్ ముందు వెనక ఆలోచించకుండా వెంటనే డీఆర్ఎస్కు సిగ్నల్ చేశాడు. అయితే రిప్లేలో బంతికి, బ్యాట్‌కు మధ్య చాలా గ్యాప్ ఉన్నట్లు తేలింది. దీంతో థర్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని ఈజీగా ప్రకటించాడు. బిగ్ స్క్రీన్‌పై రిప్లే చూసిన అభిమానులతో పాటు ఇంగ్లండ్ ఆటగాళ్లు నవ్వుకున్నారు. ఇందుకు సబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు పాక్‌తో అట్లుంటది మరి అని కామెంట్లు చేస్తున్నారు. కాగా పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగుల భారీ స్కోర్ సాధించింది.చదవండి: CT 2025: పాక్‌కు బిగ్ షాక్.. భారత్ ఫైనల్ చేరితే వేదిక మారే ఛాన్స్! ఎక్కడంటే? pic.twitter.com/d1uBa82Nh4— Jatin malu (Ja3) (@jatin_malu) October 9, 2024 -
బెన్ డకెట్ సెంచరీ.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..?
బ్రిస్టల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నిర్ణయాత్మక ఐదో వన్డేలో ఇంగ్లండ్ జట్టు భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 49.2 ఓవర్లలో 309 పరుగులకు ఆలౌటైంది. బెన్ డకెట్ (91 బంతుల్లో 107; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు సెంచరీతో కదంతొక్కాడు. హ్యారీ (52 బంతుల్లో 72; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), ఫిలిప్ సాల్ట్ (27 బంతుల్లో 45; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్‌లతో అలరించారు. విల్ జాక్స్ (0), జేమీ స్మిత్ (6), లియామ్ లివింగ్‌స్టోన్ (0), జేకబ్ బేథెల్ (13), బ్రైడన్ కార్స్ (9), మాథ్యూ పాట్స్ (6) విఫలం కాగా.. ఆఖర్లో ఆదిల్ రషీద్ అత్యంత కీలకమైన ఇన్నింగ్స్ (25 బంతుల్లో 36; 4 ఫోర్లు) ఆడాడు. రషీద్ ఈ పరుగులు స్కోర్ చేయకుండి ఉంటే ఇంగ్లండ్ 300 పరుగుల మార్కును తాకేది కాదు. ఆసీస్ బౌలర్లలో ట్రవిస్ హెడ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. మ్యాక్స్‌వెల్, ఆరోన్ హార్డీ, ఆడమ్ జంపా తలో రెండో వికెట్లు దక్కించుకున్నారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇరు జట్లు చెరో రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. చదవండి: ENG VS AUS 5th ODI: జంపాకు చుక్కలు చూపించిన బ్రూక్.. వీడియో -
ENG VS AUS 5th ODI: జంపాకు చుక్కలు చూపించిన బ్రూక్.. వీడియో
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నిర్ణయాత్మక ఐదో వన్డేలో ఇంగ్లండ్ జట్టు భారీ స్కోర్ దిశగా సాగుతోంది. 33 ఓవర్ల అనంతరం ఇంగ్లండ్ స్కోర్ 231/5గా ఉంది. బెన్ డకెట్ (88 బంతుల్లో 101), జాకబ్ బెథెల్ (15 బంతుల్లో 6) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు ఫిలిప్ సాల్ట్ (27 బంతుల్లో 45; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), బెన్ డకెట్ మెరుపు ఆరంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 58 పరుగులు జోడించారు. అనంతరం సాల్ట్ ఆరోన్ హార్డీ బౌలింగ్‌లో ఔట్ కాగా.. విల్ జాక్స్ క్రీజ్‌లోకి వచ్చాడు. జాక్స్ వచ్చీ రాగనే హార్డీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యి డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ దశలో డకెట్‌కు కెప్టెన్ బ్రూక్ జత కలిశాడు. వీరిద్దరు భారీ షాట్లతో చెలరేగి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.Harry Brook toying with Azam Zampa. pic.twitter.com/LFuqt2BTLL— Mufaddal Vohra (@mufaddal_vohra) September 29, 2024జంపాకు చుక్కలు చూపించిన బ్రూక్బ్రూక్ ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపాకు పట్టపగలే చుక్కలు చూపించాడు. బ్రూక్ తన ఇన్నింగ్స్‌లో 52 బంతులు ఎదుర్కొని 72 పరుగులు చేయగా.. అందులో మెజార్టీ శాతం పరుగులు జంపా బౌలింగ్‌లోనే సాధించాడు. బ్రూక్ తన ఇన్నింగ్స్‌లో ఏడు సిక్సర్లు, రెండు బౌండరీలు సాధించగా.. కేవలం జంపా బౌలింగ్‌లోనే ఓ బౌండరీ, ఆరు సిక్సర్లు కొట్టాడు. ఈ ఆరు సిక్సర్లు, ఓ బౌండరీ కేవలం 13 బంతుల వ్యవధిలో సాధించాడు. Harry Brook brings up his fifty with a six!!pic.twitter.com/rHltKptBTz— Mufaddal Vohra (@mufaddal_vohra) September 29, 2024జంపా బౌలింగ్‌లో బ్రూక్ విధ్వంసం ఓ రేంజ్లో సాగింది. మరో ఎండ్‌లో డకెట్ తన వన్డే కెరీర్లో రెండో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతను టెయిలెండర్ బెథెల్ సహకారంతో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. బ్రూక్ ఔటైన అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన జేమీ స్మిత్ (6), లివింగ్‌స్టోన్ (0) విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో హార్డీ, జంపా తలో రెండు వికెట్లు పడగొట్టగా.. మ్యాక్స్‌వెల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.బ్రూక్ ఇన్నింగ్స్‌లో విశేషాలు..బ్రూక్ కేవలం 39 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడుబ్రూక్ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ మార్కును తాకాడుఈ సిరీస్‌లో బ్రూక్‌కు ఇదివరకు మూడో ఫిఫ్టి ప్లస్ స్కోర్ (110, 87, 72)ఆస్ట్రేలియాపై ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ల్లో అత్యధిక పరుగులు (312) చేసిన కెప్టెన్‌గా రికార్డుగతంలో ఈ రికార్డు విరాట్ కోహ్లి (310) పేరిట ఉండేదిడకెట్ ఇన్నింగ్స్‌లో విశేషాలు..డకెట్‌కు వన్డేల్లో ఇది రెండో సెంచరీడకెట్ తన తొలి సెంచరీని (ఐర్లాండ్) సైతం ఇదే గ్రౌండ్లో (బ్రిస్టల్) చేశాడుఈ సిరీస్‌లో డకెట్‌కు ఇది మూడో ఫిఫ్టి ప్లస్ స్కోర్ (95, 63, 101)చదవండి: రాణించిన హోప్, హెట్‌మైర్.. సరిపోని డుప్లెసిస్ మెరుపులు -
లబుషేన్ ప్రపంచ రికార్డు.. వన్డే చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా
ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌తో వన్డేలో ఆల్‌రౌండ్ ప్రతిభతో అదరగొట్టిన అతడు.. ప్రపంచంలో ఇంతవరకు ఏ క్రికెటర్‌కూ సాధ్యం కాని అత్యంత అరుదైన ఘనత సాధించాడు. కాగా పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడేందుకు ఆసీస్ జట్టు ఇంగ్లండ్‌కు వెళ్లింది.హెడ్ విధ్వంసకర శతకం.. లబుషేన్ అజేయ హాఫ్ సెంచరీఇందులో భాగంగా మూడు టీ20ల సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకున్న కంగారూ టీమ్.. గురువారం నుంచి ఐదు వన్డేల సిరీస్ మొదలుపెట్టింది. ఈ క్రమంలో నాటింగ్‌హామ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఏడు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఓపెనర్ ట్రవిస్ హెడ్ (129 బంతుల్లో 154 నాటౌట్) విధ్వంసకర శతకంతో ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.మొత్తంగా 129 బంతులు ఎదుర్కొని 20 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో ఇంగ్లండ్ బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. అతడికి తోడుగా ఐదో నంబర్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ సైతం రాణించాడు. 61 బంతుల్లో ఏడు ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 77 పరుగులతో అజేయంగా నిలిచి.. ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చడంలో హెడ్‌కు సహకరించాడు.మూడు వికెట్లు తీసిన లబుషేన్ఇక అంతకు ముందు.. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య ఇంగ్లండ్ 49.4 ఓవర్లలో 315 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ స్పిన్నర్ ఆడం జంపా మూడు వికెట్లతో చెలరేగగా.. రైటార్మ్ లెగ్‌బ్రేక్ స్పిన్ బౌలింగ్ చేయగల లబుషేన్ సైతం మూడు వికెట్లు పడగొట్టాడు. ట్రవిస్ హెడ్ రెండు, డ్వార్షుయిస్, మాథ్యూ షార్ట్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.నాలుగు క్యాచ్‌లతో మెరిసిన లబుషేన్ఇక ఈ మ్యాచ్‌లో బెన్ డకెట్ (91 బంతుల్లో 95; 11 ఫోర్లు), కెప్టెన్ హ్యారీ బ్రూక్(31 బంతుల్లో 39; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రూపంలో కీలక వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టిన లబుషేన్.. జోఫ్రా ఆర్చర్(4) వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు.. డకెట్, బ్రూక్, జాకబ్ బెతెల్ (34 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్), ఆదిల్ రషీద్(0) క్యాచ్‌లు కూడా తానే అందుకున్నాడు.𝐃𝐮𝐜𝐤𝐞𝐭𝐭 𝐦𝐮𝐬𝐭 𝐛𝐞 𝐠𝐮𝐭𝐭𝐞𝐝 😤Catching practice for Labuschagne off his own bowling 😎Watch #ENGvAUS LIVE on #SonyLIV 🍿 pic.twitter.com/p0IxZKhQZY— Sony LIV (@SonyLIV) September 19, 2024 వన్డే చరిత్రలోనే తొలి క్రికెటర్గాఅలా మూడు వికెట్లు పడగొట్టడంతో పాటు నాలుగు క్యాచ్‌లు అందుకుని.. లక్ష్య ఛేదనలో 77 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు లబుషేన్. తద్వారా ఈ కుడిచేతి వాటం ఆటగాడు ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఒక వన్డే మ్యాచ్‌లో అర్ధ శతకం బాదడంతో పాటు.. మూడు వికెట్లు తీసి.. మూడు కంటే ఎక్కువ క్యాచ్‌లు అందుకున్న తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ఇదీ 30 ఏళ్ల లబుషేన్ సాధించిన అత్యంత అరుదైన ఘనత!!.. ఇక ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే లీడ్స్ వేదికగా శనివారం జరుగనుంది. చదవండి: IND vs BAN: బుమ్రా సూపర్ బాల్.. బంగ్లా బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో -
చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్.. టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టి
ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా వెస్టిండీస్‌తో ఇవాళ (జులై 18) మొదలైన టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. కేవలం 4.2 ఓవర్లలో 50 పరుగుల మార్కును తాకింది. టెస్ట్‌ల్లో అత్యంత వేగవంతమైన టీమ్ ఫిఫ్టి ఇదే. గతంలోనూ ఈ రికార్డు ఇంగ్లండ్ పేరిటే ఉండింది. 1994లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 4.3 ఓవర్లలో 50 పరుగుల మార్కును తాకింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో టాప్-3 టీమ్ ఫాస్టెస్ట్ ఫిఫ్టిలు ఇంగ్లండ్ పేరిటే నమోదై ఉన్నాయి. 2002లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 5 ఓవర్లలో ఫిఫ్టి కొట్టింది. టెస్ట్‌ల్లో ఇది మూడో వేగవంతమైన టీమ్ ఫిఫ్టి.Fifty-up in five overs!PS: First innings in a Test match 🤯pic.twitter.com/lPQnv883iv— CricTracker (@Cricketracker) July 18, 2024ప్రస్తుత మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. టెస్ట్‌ల్లో ఇంగ్లండ్ తరఫున ఇది మూడో వేగవంతమైన అర్ద సెంచరీ. 1981-82లో ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో ఇయాన్ బోథమ్ 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. ఇంగ్లండ్ తరఫున రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ జానీ బెయిర్‌స్టో పేరిట రికార్డై ఉంది. 2022లో న్యూజిలాండ్‌పై బెయిర్‌స్టో 30 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. టెస్ట్‌ల్లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డు పాక్ మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ పేరిట ఉంది. 2014లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మిస్బా కేవలం 21 బంతుల్లోనే అర్ద సెంచరీ బాదాడు.26 ఓవర్లలో 134/2ఈ మ్యాచ్‌లో డకెట్ మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో ఇంగ్లండ్ భారీ స్కోర్‌కు పునాది వేసుకుంది. డకెట్ ఓవరాల్‌గా 59 బంతులు ఎదుర్కొని 14 ఫోర్ల సాయంతో 71 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇంగ్లండ్ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయినప్పటికీ (జాక్ క్రాలే డకౌట్).. డకెట్, ఓలీ పోప్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. 26 ఓవర్ల తర్వాత (లంచ్ బ్రేక్) ఇంగ్లండ్ స్కోర్ 134/2గా ఉంది. పోప్ (47), రూట్ (13) క్రీజ్‌లో ఉన్నారు. క్రాలే వికెట్ అల్జరీ జోసఫ్‌కు.. డకెట్ వికెట్ షమార్ జోసఫ్‌కు దక్కింది. -
బెన్ డకెట్ మెరుపు హాఫ్ సెంచరీ
ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా వెస్టిండీస్‌తో ఇవాళ (జులై 18) మొదలైన టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ 32 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. టెస్ట్‌ల్లో ఇంగ్లండ్ తరఫున ఇది మూడో వేగవంతమైన అర్ద సెంచరీ. 1981-82లో ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో ఇయాన్ బోథమ్ 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. ఇంగ్లండ్ తరఫున రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ జానీ బెయిర్‌స్టో పేరిట రికార్డై ఉంది. 2022లో న్యూజిలాండ్‌పై బెయిర్‌స్టో 30 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. టెస్ట్‌ల్లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డు పాక్ మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ పేరిట ఉంది. 2014లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మిస్బా కేవలం 21 బంతుల్లోనే అర్ద సెంచరీ బాదాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. డకెట్ మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో భారీ స్కోర్‌కు పునాది వేసుకుంది. డకెట్ ఓవరాల్‌గా 59 బంతులు ఎదుర్కొని 14 ఫోర్ల సాయంతో 71 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇంగ్లండ్ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయినప్పటికీ (జాక్ క్రాలే డకౌట్).. డకెట్, ఓలీ పోప్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. 26 ఓవర్ల తర్వాత (లంచ్ బ్రేక్) ఇంగ్లండ్ స్కోర్ 134/2గా ఉంది. పోప్ (47), రూట్ (13) క్రీజ్‌లో ఉన్నారు. క్రాలే వికెట్ అల్జరీ జోసఫ్‌కు.. డకెట్ వికెట్ షమార్ జోసఫ్‌కు దక్కింది. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇది రెండో మ్యాచ్. లార్డ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 114 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్‌కు చివరి మ్యాచ్.ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ అరంగేట్రం పేసర్ గస్ అట్కిన్సన్ చెలరేగిపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఏడు, సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో అదరగొట్టాడు. కెరీర్లో చివరి మ్యాచ్ ఆడిన ఆండర్సన్ పర్వాలేదనిపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఒకటి, సెకెండ్ ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు.ఇంగ్లండ్ ప్లేయింగ్ XI: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, మార్క్ వుడ్, షోయబ్ బషీర్వెస్టిండీస్ ప్లేయింగ్ XI: క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), మికిల్ లూయిస్, కిర్క్ మెకెంజీ, అలిక్ అథనాజ్, కవెమ్ హాడ్జ్, జాషువా డ సిల్వా (వికెట్‌కీపర్), జేసన్ హోల్డర్, గుడకేష్ మోటీ, అల్జరీ జోసెఫ్, షమర్ జోసెఫ్, జేడెన్ సీల్స్ -
అయ్యో పాపం.. స్పిన్ వలలో చిక్కి క్లీన్‌బౌల్డ్! ఐదేసిన కుల్దీప్
ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో టీమిండియా బౌలర్ కుల్దీప్ యాదవ్ అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఈ చైనామన్ స్పిన్నర్ దెబ్బకు ఇంగ్లిష్ జట్టు టాపార్డర్ కుదేలైంది. కాగా ధర్మశాల వేదికగా భారత్- ఇంగ్లండ్ మధ్య తాజా సిరీస్‌లో ఆఖరిదైన మ్యాచ్ గురువారం మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో 18వ ఓవర్ ఆఖరి బంతికి ఓపెనర్ బెన్ డకెట్ రూపంలో ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అతడు ఇచ్చిన క్యాచ్‌ను శుబ్‌మన్ గిల్ అద్భుత రీతిలో ఒడిసిపట్టాడు. దీంతో 27 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద డకెట్ వెనుదిరిగాడు. అయితే, మరో ఓపెనర్ జాక్ క్రాలే మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. కానీ అతడికి జతైన వన్‌డౌన్ బ్యాటర్ ఒలీ పోప్(11)ను మాత్రం కుల్దీప్ త్వరగానే పెవిలియన్‌కు పంపగలిగాడు. 25.3వ ఓవర్లో పోప్ స్టంపౌట్ కావడంతో కుల్దీప్‌నకు రెండో వికెట్ దక్కింది. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) ఆ తర్వాత జో రూట్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న క్రాలే అర్థ శతకం పూర్తి చేసుకుని జోరు కనబరిచాడు. అయితే, కుల్దీప్ మరోసారి తన స్పిన్ మాయాజాలంతో దెబ్బకొట్టి క్రాలే(79)ను బౌల్డ్ చేశాడు. ఫలితంగా ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) ఇలా టాపార్డర్‌లో మూడు వికెట్లను తానే దక్కించుకున్న కుల్దీప్ యాదవ్.. ఇంగ్లండ్ వందో టెస్టు వీరుడు జానీ బెయిర్ స్టో(29) వికెట్‌ను కూడా తన ఖాతాలోనే వేసుకున్నాడు. అనంతరం బెన్ స్టోక్స్(0) రూపంలో ఐదో వికెట్‌ను కూడా దక్కించుకున్నాడు. కుల్దీప్ స్పిన్ మ్యాజిక్కు ఇంగ్లండ్ బ్యాటర్లు అవుటైన తీరుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. -
రిషభ్ పంత్ అని ఓ కుర్రాడు ఉండేవాడు: రోహిత్ కౌంటర్ అదుర్స్
రాజ్‌కోట్ టెస్టులో యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్‌ను ఉద్దేశించి ఇంగ్లండ్ బ్యాటర్ బెన్ డకెట్ చేసిన వ్యాఖ్యలకు టీమిండియా సారథి రోహిత్ శర్మ దిమ్మదిరిగేలా కౌంటర్ ఇచ్చాడు. రిషభ్ పంత్ పేరును ప్రస్తావిస్తూ.. ఇంగ్లిష్ జట్టుకు తమ స్థాయి ఏమిటో గుర్తుచేశాడు. కాగా ఓపెనర్‌గా భారత టెస్టు జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్న యశస్వి జైస్వాల్.. ఇంగ్లండ్‌పై వరుస డబుల్ సెంచరీలు బాదిన విషయం తెలిసిందే. సొంతగడ్డపై జరుగుతున్న తాజా సిరీస్‌లో.. ‘బజ్‌బాల్’ను తలదన్నేలా ధనాధన్ ఇన్నింగ్స్ ఆడుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రాజ్‌కోట్ వేదికగా యశస్వి జైస్వాల్ ఆడిన ఇన్నింగ్స్(151 బంతుల్లో 153 పరుగులు)ను ఉద్దేశించి ఇంగ్లండ్ బ్యాటర్ బెన్ డకెట్ ‘‘ప్రత్యర్థి జట్టు కూడా దూకుడుగా ఆడుతోందంటే అందులో మాకూ కొంత క్రెడిట్ దక్కుతుంది. టెస్టు క్రికెట్లో మాలాగే వాళ్లూ ఆడుతున్నారు’’ అని పేర్కొన్నాడు. తాజాగా ఈ విషయం గురించి రోహిత్ శర్మకు ప్రశ్న ఎదురైంది. ధర్మశాల టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో డకెట్ వ్యాఖ్యలపై స్పందించాల్సిందిగా కోరగా.. ‘‘మా జట్టులో రిషభ్ పంత్ అని ఓ కుర్రాడు ఉండేవాడు. బహుశా బెన్ డకెట్ అతడి ఆట తీరును చూసి ఉండడు’’ అని రోహిత్ శర్మ డకెట్పై వ్యంగ్యస్త్రాలు సంధించాడు. విదేశీ గడ్డపై కూడా దూకుడైన ఆటకు పంత్ మారుపేరు అన్న విషయాన్ని గుర్తుచేస్తూ హిట్‌మ్యాన్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ ఇప్పటికే 3-1తో కైవసం చేసుకుంది. ఇరుజట్ల మార్చి 7 నుంచి నామమాత్రపు ఐదో టెస్టు ఆరంభం కానుంది. ఇదిలా ఉంటే.. యశస్వి జైస్వాల్ ఇప్పటి వరకు జరిగిన నాలుగు మ్యాచ్‌లలో కలిపి 655 పరుగులతో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. చదవండి: Sarfaraz Khan: వారిని డబ్బు అడుగుతున్న సర్ఫరాజ్ తండ్రి?! నిజం ఇదీ -
అది జైస్వాల్ పెంపకంలోనే ఉంది: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
India vs England, 3rd Test- Yashasvi Jaiswal: సొంతగడ్డపై ఆకాశమే హద్దుగా చెలరేగుతూ రికార్డులు కొల్లగొడుతున్నాడు టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్. బజ్‌బాల్ అంటూ దూకుడు ప్రదర్శిస్తున్న ఇంగ్లండ్ జట్టుకు చెమటలు పట్టిస్తూ.. ప్రత్యర్థి వ్యూహాన్ని తిప్పికొడుతున్నాడు. వరుస డబుల్ సెంచరీలతో ‘బజ్‌బాల్’ పగిలి రీసౌండ్ వచ్చేలా బ్యాట్‌తో మోత మోగిస్తున్నాడు. హైదరాబాద్‌లో ‘జైస్బాల్’తో అలరించిన యశస్వి.. వైజాగ్ టెస్టు సందర్భంగా తన కెరీర్లో తొలి ద్విశతకం బాదాడు. రాజ్‌కోట్‌లోనూ అదే జోరు కొనసాగిస్తూ 214 పరుగులతో అజేయంగా నిలిచాడు. తద్వారా జట్టు భారీ విజయంలో యశస్వి జైస్వాల్ కీలక పాత్ర పోషించి నీరాజనాలు అందుకుంటున్నాడు. అయితే, ఇదే మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ విధ్వంసకర సెంచరీ బాదాడు. తొలి ఇన్నింగ్స్‌లో 151 బంతుల్లో 23 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 153 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘ప్రత్యర్థి జట్టు కూడా దూకుడుగా ఆడటం చూస్తుంటే.. అందులో మేమూ కొంత క్రెడిట్ తీసుకోవాల్సిందే అనిపిస్తుంది. టెస్టు క్రికెట్లో మా మాదిరిగానే వాళ్లూ ఆడుతున్నారు’’ అని డకెట్ పేర్కొన్నాడు. మండిపడ్డ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అయితే, డకెట్ వ్యాఖ్యలపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుసేన్ ఘాటు విమర్శలు చేశాడు. ‘‘జైస్వాల్ మమ్మల్ని చూసే అలా ఆడటం నేర్చుకున్నాడని అన్నట్లుగా ఆ కామెంట్ ఉంది. నిజానికి తను మీ నుంచి నేర్చుకునే స్థితిలో లేడు. కష్టపడటం అతడి పెంపకంలోనే ఉంది. బాల్యం నుంచే సవాళ్లు ఎదుర్కొని ఐపీఎల్ దాకా చేరుకున్నాడు. అక్కడ మరింతగా రాటుదేలాడు. గట్టిగా మాట్లాడితే.. నేను కూడా తన నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్తాను. ఇదంతా చూస్తుంటే.. బజ్‌బాల్‌ను మీరే తక్కువ చేసి మాట్లాడినట్లు అనిపిస్తోంది. దూకుడైన ఆటలో ఇంగ్లండ్ మరింత మెరుగుపడాలనుకుంటే విమర్శలకు దూరంగా ఉంటే మంచిది. అదే విధంగా జైస్వాల్‌ను చూసి మీరు కూడా నేర్చుకోండి’’ నాసిర్ హుసేన్ డకెట్ తీరును విమర్శించాడు. స్కై స్పోర్ట్స్ పాడ్‌కాస్ట్ సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ఇదిలా ఉంటే.. స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-1తో ముందంజలో ఉంది. ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 23 నుంచి నాలుగో టెస్టు ఆరంభం కానుంది. చదవండి: IND vs ENG: నాలుగో టెస్టు.. భారత తుది జట్టు ఇదే! సెంచరీల వీరుడి అరంగేట్రం? -
రెప్పపాటులో జరిగిన అద్భుతం.. జురెల్ స్కిల్ చూడాల్సిందే!
India Wicket-Keeper Dhruv Jurel Inflicts Stunning Run-Out: ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో ఓటమి గాయాలను చెరిపేసేలా టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. హైదరాబాద్‌లో ఎదురైన పరాభవానికి విశాఖపట్నంలో బదులు తీర్చుకున్న రోహిత్ సేన.. రాజ్‌కోట్‌లో చారిత్రాత్మక గెలుపుతో అభిమానులను ఖుషీ చేసింది. ఇంగ్లండ్‌ను ఏకంగా 434 పరుగుల తేడాతో చిత్తు చేసి భారత టెస్టు చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ(214)కు తోడు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(5 వికెట్లు) బంతితో మాయాజాలం చేయడంతో ఈ గెలుపు సాధ్యమైంది. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో మూడో టెస్టు సందర్భంగా భారత్ తరఫున ఇద్దరు యువ ఆటగాళ్లు సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ వరుస అర్ధ శతకాలతో(62, 68) సత్తా చాటితే.. ఉత్తరప్రదేశ్ క్రికెటర్ ధ్రువ్ జురెల్ బ్యాటింగ్(తొలి ఇన్నింగ్స్‌లో- 46), వికెట్ కీపింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో ప్రమాదకర బ్యాటర్, ఓపెనర్ బెన్ డకెట్(4)ను రనౌట్ చేసిన తీరు హైలైట్‌గా నిలిచింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను గట్టెక్కించాలని కంకణం కట్టుకున్న డకెట్.. భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా (6.1వ ఓవర్లో) బౌలింగ్‌లో మిడ్ వికెట్ మీదుగా బంతిని తరలించగా.. మహ్మద్ సిరాజ్ బాల్‌ను ఆపాడు. Super Jurel 🦸♂️ with some 🔝glove-work 🔥👌#IDFCFirstBankTestSeries #INDvENG #BazBowled #JioCinemaSports pic.twitter.com/dTlzQZXKAn — JioCinema (@JioCinema) February 18, 2024 ఈ క్రమంలో మరో ఎండ్‌లో ఉన్న జాక్ క్రాలే పరుగుకు నిరాకరించగా.. డకెట్ వెంటనే వెనక్కి వెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ అంతలోనే సిరాజ్ వేసిన బంతిని అందుకున్న వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ మెరుపు వేగంతో స్టంప్‌ను ఎగురగొట్టాడు. రెప్పపాటులో జరిగిన ఈ అద్భుతం కారణంగా డకెట్ 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. జురెల్ స్కిల్స్‌కు అద్దం పట్టే వీడియోను అభిమానులు నెట్టింట షేర్ చేస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. డకెట్ తొలి ఇన్నింగ్స్‌లో విధ్వంసకర శతకం(153)తో విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. చదవండి: సర్ఫరాజ్ ఒక్కడేనా.. ఈ ‘వజ్రాన్ని’ చూడండి! (ఫొటో గ్యాలరీ కోసం క్లిక్ చేయండి) -
Ind vs Eng 3rd Test: ముగిసిన మూడో రోజు ఆట.. 322 పరుగుల ఆధిక్యంలో భారత్
Ind vs Eng 3rd Test Day 3 Updates: టీమిండియా- ఇంగ్లండ్ మధ్య రాజ్‌కోట్ టెస్టులో మూడో రోజు ఆట ఆరంభమైంది. 207/2 ఓవర్ నైట్ స్కోరుతో శనివారం ఆట మొదలుపెట్టింది ఇంగ్లండ్. ఈ మ్యాచ్‌లో టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌట్ కాగా.. మూడో రోజు ఆటలో ఇంగ్లండ్ 319 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. మూడో రోజు ముగిసిన ఆట.. మూడో రోజు ఆటలో ఇంగ్లీష్ జట్టుపై టీమిండియా పైచేయి సాధించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 2 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. క్రీజులో శుబ్‌మన్ గిల్(65), కుల్దీప్ యాదవ్(3) పరుగులతో ఉన్నారు. అదే విధంగా యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్(104) సెంచరీతో మెరిశాడు. అయితే వెన్ను నొప్పి కారణంగా ఆట మధ్యలోనే రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం 322 పరుగుల భారీ అధిక్యంలో భారత్ కొనసాగుతోంది. కాగా అంతకముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 319 పరుగులకు ఆలౌటైంది. జైశ్వాల్ రిటైర్డ్ హార్ట్.. టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సెంచరీతో చెలరేగిన యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. వెన్ను నొప్పి కారణంగా జైశ్వాల్ మూడో రోజు ఆట ఆఖరి సెషన్లో మైదానాన్ని వీడాడు. జైశ్వాల్(104) పరుగులు చేశాడు. 47 ఓవర్లకు భారత్ స్కోర్: 190/1. టీమిండియా ప్రస్తుతం 321 పరుగుల అధిక్యంలో కొనసాగుతోంది. శుబ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ.. జైశ్వాల్‌తో పాటు క్రీజులో ఉన్న మరో టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. రెండో వికెట్‌కు వీరిద్దరూ ఇప్పటివరకు 153 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో భారత్ స్కోర్: 184/1. భారత్ ప్రస్తుతం 310 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. జైశ్వాల్ సూపర్ సెంచరీ.. ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో జైశ్వాల్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. 121 బంతుల్లో జైశ్వాల్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. జైశ్వాల్‌కు ఇది మూడో టెస్టు సెంచరీ. జైశ్వాల్ ప్రస్తుతం 102 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అతడితో పాటు గిల్(45) పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. 41 ఓవర్లకు టీమిండియా స్కోర్: 171/1. భారత్ ప్రస్తుతం 297 పరుగుల అధిక్యంలో కొనసాగుతోంది. హాఫ్ సెంచరీతో చెలరేగిన జైశ్వాల్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో యశస్వీ జైశ్వాల్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 80 బంతుల్లో 5 ఫోర్లు, రెండు సిక్స్‌లతో జైశ్వాల్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. యశస్వీ తనదైన స్టైల్లో సిక్స్ కొట్టి అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. 30 ఓవర్లకు భారత్ స్కోర్: 116/1, క్రీజులో జైశ్వాల్(65)తో పాటు శుబ్‌మన్ గిల్(26) ఉన్నారు. నిలకడగా ఆడుతున్న గిల్, జైశ్వాల్.. టీమిండియా యువ ఆటగాళ్లు శుబ్‌మన్ గిల్(8), యశస్వీ జైశ్వాల్(23) నిలకడగా ఆడుతున్నారు. 19 ఓవర్లకు భారత్ స్కోర్: 50/1 టీ విరామానికి భారత్ స్కోర్: 44/1 16 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 44 పరుగులు చేసింది. క్రీజులో యశస్వీ జైశ్వాల్(19), శుబ్‌మన్ గిల్(5) పరుగులతో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 170 పరుగుల అధిక్యంలో కొనసాగుతోంది. తొలి వికెట్ కోల్పోయిన భారత్ 11.3: జో రూట్ బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్‌గా రోహిత్ శర్మ(19) వెనుదిరిగాడు. ఫలితంగా టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. గిల్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 34-1(12). జైస్వాల్ 10 పరుగులతో ఆడుతున్నాడు. బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియా యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ భారత రెండో ఇన్నింగ్స్ ఆరంభించారు. స్కోరు: 13/0 (4) ఈ క్రమంలో మూడో రోజు ఆటలో భాగంగా తమ స్కోరుకు 112 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో 319 పరుగుల వద్ద మొదటి ఇన్నింగ్స్ ముగిసింది. టీమిండియా కంటే ఇంగ్లండ్ ఇంకా 126 పరుగులు వెనుకబడి ఉంది. ►టీమిండియా తొలి ఇన్నింగ్స్- 445 ►ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్- 319 పదో వికెట్ డౌన్ 71.1: సిరాజ్ బౌలింగ్ ఆండర్సన్ బౌల్డ్. పదో వికెట్‌గా ఆండర్సన్ వెనుదిరగడంతో... ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌కు తెర పడింది. 71.1 ఓవర్లలో 319 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. మరో షాక్.. తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 70.2: జడేజా బౌలింగ్‌లో టామ్ హార్లే(9)ను వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ స్టంపౌట్ చేశాడు. ఆండర్సన్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 314/9 (70.2) ఎనిమిదో వికెట్ డౌన్ 69.5: సిరాజ్ బౌలింగ్‌లో రెహాన్ అహ్మద్ బౌల్డ్(6). ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్. మార్క్ వుడ్ క్రీజులోకి వచ్చాడు. హార్లే తొమ్మిది పరుగులతో ఉన్నాడు. ఇంగ్లండ్ స్కోరు: 314-8(70) వరుస షాకులు.. ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ స్టోక్స్ అవుటైన మరుసటి బంతికే బెన్ ఫోక్స్ కూడా పెవిలియన్ చేరాడు. సిరాజ్ బౌలింగ్‌లో రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో ఇంగ్లండ్ ఏడో వికెట్ కోల్పోయింది. రెహాన్ అహ్మద్ , టామ్ హార్లే క్రీజులో ఉన్నారు. స్కోరు: 299/7 (65.3).టీమిండియా కంటే 146 పరుగులు వెనుకబడి ఉంది. భోజన విరామం తర్వాత వికెట్ బెన్ స్టోక్స్ రూపంలో ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో బుమ్రాకు క్యాచ్ ఇచ్చి స్టోక్స్ 41 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. నిలకడగా ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఇంగ్లండ్ 61వ ఓవర్ పూర్తయ్యేసరికి స్టోక్స్ 39, ఫోక్స్ ఆరు పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ క్రమంలో భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ 5 వికెట్ల నష్టానికి 290 పరుగుల వద్ద నిలిచింది. 56వ ఓవర్ ముగిసే సరికి ఇలా ఆచితూచి ఆడుతున్న స్టోక్స్, ఫోక్స్. ఇంగ్లండ్ స్కోరు: 275/5 (56). స్టోక్స్ 28, ఫోక్స్ రెండు పరుగులతో ఆడుతున్నారు. ఐదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 50.1: ఎట్టకేలకు సెంచరీ వీరుడు బెన్ డకెట్ అవుటయ్యాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు ఈ ఓపెనింగ్ బ్యాటర్. 151 బంతుల్లోనే 23 ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 153 పరుగులు చేసిన డకెట్.. శతకాన్ని ద్విశతకంగా మార్చాలని భావించగా.. కుల్దీప్ అతడి జోరుకు బ్రేక్ వేశాడు. బెన్ ఫోక్స్ క్రీజులోకి వచ్చాడు. స్టోక్స్ 20 పరుగులతో ఉన్నాడు. ఇంగ్లండ్ స్కోరు: 260-5(51) నిలకడగా ఆడుతున్న డకెట్, స్టోక్స్ 48 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 247/4 . డకెట్ 153, స్టోక్స్ ఏడు పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా కంటే ఇంగ్లండ్ ఇంకా 198 పరుగులు వెనుబడి ఉంది. నాలుగో వికెట్ డౌన్ ఆట మొదలెట్టిన కాసేపటికే భారత బౌలర్లు ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టారు. బుమ్రా రూట్‌ను అవుట్ చేయగా.. కుల్దీప్ యాదవ్ దెబ్బకు బెయిర్ స్టో పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. బెయిర్ స్టో రూపంలో ఇంగ్లండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. బెన్ స్టోక్స్ క్రీజులోకి వచ్చాడు. డకెట్ 142 పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 225-4(41) మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 207/2 ఓవర్ నైట్ స్కోరుతో శనివారం ఆట మొదలుపెట్టిన కాసేపటికే ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో జో రూట్(18) జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. జానీ బెయిర్ స్టో క్రీజులోకి వచ్చాడు. బెన్ డకెట్ 141 పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 224-3. అశ్విన్ లేకుండానే ఇక కీలక స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ లేకుండానే భారత్ శనివారం బరిలో దిగింది. ఐసీసీ నిబంధనల ప్రకారం.. కన్కషన్ సబ్‌స్టిట్యూట్(ఆటగాడి తలకు దెబ్బతగిలినపుడు), కోవిడ్-19 వంటి విపత్కర పరిస్థితుల్లో మాత్రమే మ్యాచ్ మధ్యలో వైదొలిగిన ఆటగాడి స్థానాన్ని భర్తీ చేయాలి. అది కూడా సదరు సబ్‌స్టిట్యూట్ ఫీల్డింగ్ వరకు మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది. అయితే, అశ్విన్ తన తల్లి అనారోగ్య కారణాల దృష్ట్యా వైదొలిగినందున అతడి స్థానంలో వేరే ప్లేయర్‌ను తీసుకునే అవకాశం లేదు. ఫలితంగా మూడో రోజు ఆటలో టీమిండియా పది మంది యాక్టివ్ ప్లేయర్లతో మైదానంలో దిగింది. రెండో రోజు హైలైట్స్ ►ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ మెరుపు సెంచరీ ►తొలి ఇన్నింగ్స్‌లో 207/2 ►భారత్ 445 ఆలౌట్ ►అశ్విన్‌కు 500వ వికెట్ తుదిజట్లు: భారత్ యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్(అరంగేట్రం), రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్(వికెట్ కీపర్- అరంగేట్రం), కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. ఇంగ్లండ్: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్లే, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్. -
డకెట్ ధనాధన్...
35 ఓవర్లలో 5.91 రన్‌రేట్‌తో 207 పరుగులు. పిచ్‌ను, ప్రత్యర్థిని లక్ష్య పెట్టకుండా ఇంగ్లండ్ మూడో టెస్టులోనూ తమ ‘బజ్‌బాల్’ మంత్రాన్ని చూపించింది. ఫలితంగా 445 పరుగుల భారీ స్కోరు కూడా భారత్‌కు సురక్షితం కాదనిపిస్తోంది. భారత గడ్డపై ఒక విదేశీ బ్యాటర్ ఆడిన అత్యుత్తమ ఇన్నింగ్స్‌లో ఒకటిగా నిలిచిపోయే శతకంతో ఓపెనర్ బెన్ డకెట్ చెలరేగాడు. దాంతో రెండు రోజుల ఆట తర్వాత రాజ్‌కోట్ టెస్టు సమంగా నిలిచింది. అశ్విన్ టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయిని అందుకోవడం శుక్రవారం ఆటలో గుర్తుంచుకోదగ్గ మరో హైలైట్. మూడో రోజు ఇంగ్లండ్‌ను భారత బౌలర్లు ఎలా నిలువరిస్తారన్నదే ఆసక్తికరం. రాజ్‌కోట్: భారత్‌తో మూడో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ దూకుడుగా సాగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 2 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. బెన్ డకెట్ (118 బంతుల్లో 133 బ్యాటింగ్; 21 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో సత్తా చాటాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 326/5తో ఆట కొనసాగించిన భారత్ 445 పరుగులకు ఆలౌటైంది. ధ్రువ్ జురేల్ (46), అశ్విన్ (37) ఎనిమిదో వికెట్‌కు 77 పరుగులు జత చేశారు. ఇంగ్లండ్ మరో 238 పరుగులు వెనుకబడి ఉంది. కీలక భాగస్వామ్యం... రెండో రోజు ఆరంభంలోనే భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. ఓవర్‌నైట్ స్కోరుకు మరో ఐదు పరుగులు జోడించగానే ఒకే స్కోరు వద్ద కుల్దీప్ (4), జడేజా (112) వెనుదిరిగారు. ఈ దశలో అశ్విన్, జురేల్ భాగస్వామ్యం భారత్‌ను 400 పరుగులు దాటించింది. అశ్విన్ జాగ్రత్తగా ఆడగా, అరంగేట్ర ఆటగాడు జురేల్ కొన్ని దూకుడైన షాట్లతో ఆకట్టుకున్నాడు. అయితే తన తొలి మ్యాచ్‌లో అతను అర్ధ సెంచరీని చేజార్చుకున్నాడు. ఈ భాగస్వామ్యం తర్వాత చివర్లో బుమ్రా (28 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్) కొన్ని విలువైన పరుగులు జోడించాడు. శుక్రవారం 44.5 ఓవర్లు ఆడిన భారత్ మరో 119 పరుగులు జత చేసింది. దూకుడే దూకుడు... ఇన్నింగ్స్ ఆరంభంలో డకెట్ కాస్త తడబడ్డాడు. కానీ బుమ్రా వేసిన ఐదో ఓవర్లో రెండు ఫోర్లతో ధాటిని మొదలు పెట్టిన అతను ఏ బౌలర్‌నూ వదలకుండా చివరి వరకు దూకుడు కొనసాగించాడు. సెంచరీ వరకు కూడా ఒక్క తప్పుడు షాట్ లేకుండా అతని ఇన్నింగ్స్ అద్భుతమైన స్ట్రోక్‌లతో దూసుకెళ్లింది. టీ తర్వాత తొలి ఓవర్‌నుంచి స్పిన్నర్ కుల్దీప్తో బౌలింగ్ వేయించిన ప్రణాళిక ఫలించలేదు. కుల్దీప్ తొలి 4 ఓవర్లలో డకెట్ స్వీప్, రివర్స్ స్వీప్‌లతో 7 ఫోర్లు బాదడం విశేషం. సిరాజ్ ఓవర్లో కొట్టిన రెండు ఫోర్లతో 39 బంతుల్లోనే అతని అర్ధ సెంచరీ పూర్తయింది. మరో ఎండ్‌లో దాదాపు ప్రేక్షక పాత్రకే పరిమితమైన క్రాలీ (15)ని అవుట్ చేసి ఎట్టకేలకు అశ్విన్ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. తర్వాత వచ్చి న ఒలీ పోప్ (39; 5 ఫోర్లు, 1 సిక్స్) కూడా ఇంగ్లండ్ జోరును కొనసాగించాడు. అశ్విన్ ఓవర్లో వరుస బంతుల్లో 6, 4 కొట్టి 90ల్లోకి చేరుకున్న డకెట్... సిరాజ్ ఓవర్లో బౌండరీతో 88 బంతుల్లోనే కెరీర్లో మూడో శతకాన్ని అందుకున్నాడు. చివరకు సిరాజ్ చక్కటి బంతికి పోప్ వికెట్ల ముందు దొరికిపోయాడు. ఐదు పరుగులు పెనాల్టీ... భారత బ్యాటర్లు నిబంధనలకు విరుద్ధంగా పిచ్‌పై పరుగెత్తడంతో అంపైర్లు చర్య తీసుకున్నారు. తొలి రోజు ఆటలో జడేజాను ఈ విషయంపై అంపైర్లు హెచ్చరించగా... రెండో రోజు అశ్విన్ కూడా అలాగే చేయడంతో భారత ఇన్నింగ్స్ 102వ ఓవర్లో 5 పరుగులు పెనాల్టిగా విధించారు. దాంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 5/0తో మొదలైంది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి (సి) రూట్ (బి) వుడ్ 10; రోహిత్ (సి) స్టోక్స్ (బి) వుడ్ 131; గిల్ (సి) ఫోక్స్ (బి) వుడ్ 0; పటిదార్ (సి) డకెట్ (బి) హార్ట్లీ 5; జడేజా (సి) అండ్ (బి) రూట్ 112; సర్ఫరాజ్ (రనౌట్) 62; కుల్దీప్ (సి) ఫోక్స్ (బి) అండర్సన్ 4; జురేల్ (సి) ఫోక్స్ (బి) రేహన్ 46; అశ్విన్ (సి) అండర్సన్ (బి) రేహన్ 37; బుమ్రా (ఎల్బీ) (బి) వుడ్ 26; సిరాజ్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (130.5 ఓవర్లలో ఆలౌట్) 445. వికెట్ల పతనం: 1–22, 2–24, 3–33, 4–237, 5–314, 6–331, 7–331, 8–408, 9–415, 10–445. బౌలింగ్: అండర్సన్ 25–7–61–1, వుడ్ 27.5–2– 114–4, హార్ట్లీ 40–7–109–1, రూట్ 16–3– 70–1, రేహన్ 22–2–85–2. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాసీ (సి) పటిదార్ (బి) అశ్విన్ 15; డకెట్ (బ్యాటింగ్) 133; పోప్ (ఎల్బీ) (బి) సిరాజ్ 39; రూట్ (బ్యాటింగ్) 9; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (35 ఓవర్లలో 2 వికెట్లకు) 207. వికెట్ల పతనం: 1–89, 2–182. బౌలింగ్: బుమ్రా 8–0–34–0, సిరాజ్ 10–1–54–1, కుల్దీప్ యాదవ్ 6–1–42–0, అశ్విన్ 7–0–37–1, జడేజా 4–0–33–0. అశ్విన్ @ 500 ఇంగ్లండ్ ఓపెనర్ క్రాలీని అవుట్ చేయడం ద్వారా అశ్విన్ టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. తన 98వ టెస్టులో ఈ ఘనత సాధించిన అశ్విన్... ఓవరాల్‌గా 9వ ఆటగాడిగా, అనిల్ కుంబ్లే (619) తర్వాత రెండో భారత బౌలర్‌గా నిలిచాడు. మ్యాచ్‌లు, బంతుల పరంగా చూస్తే... అత్యంత వేగంగా 500 వికెట్ల మార్క్‌ను చేరిన బౌలర్లలో అశ్విన్ రెండో స్థానంలో నిలవడం విశేషం. 2011లో విండీస్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేసిన అశ్విన్ ఇప్పటి వరకు ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు 24 సార్లు... ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు 34 సార్లు... మ్యాచ్ మొత్తంలో 10 వికెట్లు 8 సార్లు తీశాడు. టెస్టు నుంచి తప్పుకున్న అశ్విన్ రాజ్‌కోట్ టెస్టులో అనూహ్య పరిణామం సంభవించింది. తన కుటుంబంలో ఏర్పడిన అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో అశ్విన్ మూడో టెస్టు నుంచి మధ్యలోనే తప్పుకున్నాడు. -
శతక్కొట్టిన డకెట్.. భారత్‌కు ధీటుగా బదులిస్తున్న ఇంగ్లండ్
రాజ్‌కోట్ టెస్ట్‌లో పర్యాటక ఇంగ్లండ్.. టీమిండియాకు ధీటుగా బదులిస్తుంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌట్ కాగా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 2 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఓపెనర్ బెన్ డకెట్ మెరుపు సెంచరీ (118 బంతుల్లో 133 నాటౌట్; 21 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు జీవం పోశాడు. డకెట్‌తో పాటు జో రూట్ (9) క్రీజ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (15), ఓలీ పోప్ (39) ఔటయ్యారు. క్రాలే వికెట్ అశ్విన్‌కు దక్కగా.. పోప్‌ను సిరాజ్ పెవిలియన్‌కు పంపాడు. ఓవర్‌నైట్ స్కోర్ 326/5 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. మరో 119 పరుగులు జోడించి చివరి ఐదు వికెట్లు కోల్పోయింది. ఓవర్‌నైట్ బ్యాటర్, సెంచరీ హీరో రవీంద్ర జడేజా తన వ్యక్తిగత స్కోర్‌కు మరో రెండు పరుగులు మాత్రమే జోడించి 112 పరుగుల వద్ద ఔట్ కాగా.. మరో ఓవర్‌నైట్ ఆటగాడు కుల్దీప్ తన స్కోర్ మరో 3 పరుగులు జోడించి 4 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇవాళ క్రీజ్‌లో వచ్చిన అరంగేట్ర బ్యాటర్ దృవ్ జురెల్ 46 పరుగులు, అశ్విన్ 37, బుమ్రా 26 పరుగులు చేసి ఔటయ్యారు. సిరాజ్ 3 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆఖర్లో బుమ్రా బ్యాట్ ఝులిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 4, రెహాన్ అహ్మద్ 2, జేమ్స్ ఆండర్సన్, టామ్ హార్ట్లీ, జో రూట్ తలో వికెట్ పడగొట్టారు. రెండో రోజు ఆటలో జాక్ క్రాలేను ఔట్ చేయడం ద్వారా భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 500 వికెట్ల క్లబ్లో చేరాడు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్, ఇంగ్లండ్ జట్లు చెరో మ్యాచ్ గెలిచిన విషయం తెలిసిందే. -
ట్రెవిస్ హెడ్‌కు స్పిన్ బాధ్యతలు.. ఇంగ్లండ్ 325 ఆలౌట్
యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌట్ అయింది. 278/4 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ మరో 47 పరుగులు మాత్రమే జత చేసి మిగతా ఆరు వికెట్లను కోల్పోయింది. దీంతో ఆసీస్‌కు 91 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించినట్లయింది. ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో బెన్ డకెట్ 98 పరుగులు చేసి రెండు పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. హ్యారీ బ్రూక్ 50, జాక్ క్రాలీ 48, ఓలీ పోప్ 42 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీయగా.. ట్రెవిస్ హెడ్, హాజిల్‌వుడ్ తలా రెండు వికెట్లు తీయగా.. పాట్ కమిన్స్, నాథన్ లియోన్, కామెరాన్ గ్రీన్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా లంచ్ విరామ సమయానికి ఆరు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 12 పరుగులు చేసింది. ఆసీస్ ప్రధాన స్పిన్నర్ నాథన్ లియోన్ సేవలను కోల్పోయినప్పటికి ట్రెవిస్ హెడ్ సహా పేస్ బౌలర్లు ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేయడంలో కీలకపాత్ర పోషించారు. చదవండి: Dhananjaya-De-Silva: దెబ్బకొట్టిన నెదర్లాండ్స్; కెరీర్ బెస్ట్ ప్రదర్శనతో పరువు నిలిపాడు ఆసియా కప్ విజేతగా భారత్.. ఎనిమిదోసారి టైటిల్ కైవసం -
93 ఏళ్ల కిందటి బ్రాడ్‌మన్ రికార్డు బద్దలు కొట్టిన ఇంగ్లండ్ ఓపెనర్
లార్డ్స్ వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో 178 బంతుల్లో 24 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 182 పరుగులు చేసిన డకెట్.. 93 ఏళ్ల కిందట క్రికెట్ దిగ్గజం, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డాన్ బ్రాడ్‌మన్ నెలకొల్పిన ఓ రికార్డును బద్దలు కొట్టాడు. లార్డ్స్ మైదానంలో జరిగిన టెస్ట్‌ల్లో వేగవంతమైన 150 పరుగుల రికార్డు డాన్ బ్రాడ్‌మన్ పేరిట ఉండేది. 1930లో లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రాడ్‌మన్ 166 బంతుల్లో 150 పరుగులు పూర్తి చేశాడు. నిన్నటి వరకు లార్డ్స్ టెస్ట్‌ల్లో ఇదే వేగవంతమైన 150గా ఉండేది. అయితే నిన్నటి ఇన్నింగ్స్‌తో డకెట్ ఈ రికార్డును బద్దలు కొట్టి నయా రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. డకెట్ కేవలం 150 బంతుల్లోనే 150 పరుగులు పూర్తి చేసి బ్రాడ్‌మన్ రికార్డుకు ఎసరు పెట్టాడు. Ben Duckett broke Don Bradman's record for the fastest Test 150 at Lord's 🔥 #ENGvIRE pic.twitter.com/ARQcLnCtYK — ESPNcricinfo (@ESPNcricinfo) June 2, 2023 ఓవరాల్‌గా ఫాస్టెస్ట్ 150 రికార్డు విషయానికొస్తే.. ఈ రికార్డు న్యూజిలాండ్ మాజీ ఆటగాడు బ్రెండన్ మెక్కల్లమ్ పేరిట ఉంది. మెక్కల్లమ్ 2014లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 103 బంతుల్లోనే 150 రన్స్ బాదాడు. ఆతర్వాత మహేళ జయవర్ధనే 111 బంతుల్లో, రాయ్ ఫ్రెడ్రిక్స్ 113 బంతుల్లో, హ్యారీ బ్రూక్ 115 బంతుల్లో 150 పరుగులు బాదారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. రెండో ఇన్నింగ్స్‌లో సైతం తడబడుతున్న ఐర్లాండ్ ఓటమి దిశగా పయనిస్తుంది. ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 52 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసి, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 141 పరుగులు వెనుకపడి ఉంది. అంతకుముందు ఓలీ పోప్ (208 బంతుల్లో 205; 22 ఫోర్లు, 3 సిక్సర్లు) డబుల్ సెంచరీతో, బెన్ డకెట్ (178 బంతుల్లో 182; 24 ఫోర్లు, సిక్స్) భారీ శతకంతో విరుచుకుపడటంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ను 524/4 (82.4 ఓవర్లలో) స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. తద్వారా 352 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. దీనికి ముందు స్టువర్ట్ బ్రాడ్ (5/51) ఐదేయడంతో ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకు ఆలౌటైంది. చదవండి: చరిత్ర సృష్టించిన జో రూట్ -
టెస్ట్ క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని ఘట్టం
పాకిస్తాన్-ఇంగ్లండ్ జట్ల మధ్య రావల్పిండి వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ పలు ప్రపంచ రికార్డులకు వేదికైంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి రోజు అత్యధిక స్కోర్ (506/4) రికార్డుతో పాటు తొలి రోజు 500 పరుగుల సాధించిన తొలి జట్టుగా, తొలి సెషన్లో అత్యధిక పరుగులు (27 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 174 పరుగులు) చేసిన జట్టుగా ఇంగ్లండ్ టీమ్ పలు ప్రపంచ రికార్డులను తమ ఖాతాలో వేసుకుంది. వీటన్నిటికీ మించి తొలి రోజు ఏకంగా నలుగురు ఇంగ్లండ్ బ్యాటర్లు సెంచరీలు నమోదు చేశారు. ఇలా తొలి రోజు నలుగురు బ్యాటర్లు శతక్కొట్టడం టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే ప్రధమం. ఓపెనర్లు బెన్ డకెట్ (106 బంతుల్లో 101 నాటౌట్; 14 ఫోర్లు), జాక్ క్రాలే (106 బంతుల్లో 120 నాటౌట్; 21 ఫోర్లు), ఓలీ పోప్ (104 బంతుల్లో 108; 14 ఫోర్లు), హ్యారీ బ్రూక్ (81 బంతుల్లో 101 నాటౌట్) సెంచరీలతో విరుచుకుపడ్డారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్.. ఇంగ్లండ్ భారీ స్కోర్‌కు (657) ధీటుగా జవాబిస్తుంది. ఆ జట్టు ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్ (203 బంతుల్లో 114; 13 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇమామ్ ఉల్ హాక్ (207 బంతుల్లో 121; 15 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ బాబర్ ఆజమ్ (168 బంతుల్లో 136; 19 ఫోర్లు, సిక్స్) శతకాలతో విరుచుకుపడ్డారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో తొలి ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు సాధిస్తే.. పాక్ టాప్-4 బ్యాటర్లలో ముగ్గురు శతకొట్టారు. ఫలితంగా మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 499 పరుగులు చేసింది. కాగా, ఇదే టెస్ట్ మ్యాచ్‌లో పై పేర్కొన్న రికార్డులతో పాటు టెస్ట్ క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని ఓ అత్యంత అరుదైన రికార్డు నమోదైంది. ఓ టెస్ట్ మ్యాచ్‌లో ఇరు జట్లకు చెందిన ఓపెనర్లు (బెన్ డకెట్, జాక్ క్రాలే, అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హాక్) తొలి ఇన్నింగ్స్‌లో శతకాలు బాదడం ఇదే తొలిసారి. అలాగే ఓ టెస్ట్ మ్యాచ్‌లో తొలి వికెట్‌కు రెండు డబుల్ హండ్రెడ్ పార్ట్నర్షిప్లు నమోదు కావడం కూడా ఇదే తొలిసారి. 1948లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్-ఇంగ్లండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లకు చెందిన నలుగురు ఓపెనర్లు సెంచరీలు సాధించారు. అయితే, ఆ నలుగురు ఓపెనర్లలో ఒకరు రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించారు. -
17 ఏళ్ల తర్వాత తొలి టెస్టు మ్యాచ్.. 657 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్
రావల్పిండి వేదికగా పాకిస్తాన్‌తో జరగుతోన్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ భారీ స్కోర్ సాధించింది. 101 ఓవర్లలో ఇంగ్లండ్ 657 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జాక్ క్రాలీ(122), బెన్ డక్కట్ (107), ఓలీ పోప్(108), హ్యారీ బ్రూక్ (153) సెంచరీలతో చెలరేగారు. 506/4 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ మరో 151 పరుగులు చేసి ఆలౌటైంది. పాకిస్తాన్ బౌలర్లలో స్పిన్నర్ జహీద్ ఆహ్మద్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. నషీం షా మూడు వికెట్లు, మహ్మద్ అలీ రెండు, హారీష్ రఫ్ ఒక్క వికెట్ సాధించారు. కాగా 17 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై తొలి టెస్టు మ్యాచ్ ఇంగ్లండ్ ఆడుతోంది. అయితే ఈ చారిత్రత్మక టెస్టు తొలి రోజు పాకిస్తాన్ బౌలర్లకు ఇంగ్లండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. టీ20 తరహాలో ఆడిన ఇంగ్లీష్ బ్యాటర్లు తొలి రోజు ఏకంగా 506 పరుగులు రాబట్టారు. ఇక తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన పాకిస్తాన్ లంచ్ సమయానికి వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసింది. చదవండి: IPL Mini Auction: రూ.2 కోట్ల కనీస ధర కలిగిన ఆటగాళ్లు వీరే! ఒక్క భారత క్రికెటర్ కూడా -
Pak Vs Eng: పాక్‌కు దిమ్మతిరిగిపోయింది! టీమిండియా రికార్డు బద్దలు.. ఇంకా
Pakistan vs England, 1st Test: మ్యాచ్‌కు ముందు రోజు ఇంగ్లండ్ జట్టులోని పలువురు క్రికెటర్లు వైరల్ ఇన్ఫెక్షన్ బారిన పడటంతో... తొలి టెస్టు నిర్ణీత సమయానికి మొదలవుతుందో లేదోనని సందేహం. అయితే గురువారం ఉదయం గం. 7:30కు తుది జట్టులో ఆడేందుకు 11 మంది కోలుకున్నారని ఇంగ్లండ్ టీమ్ మేనేజ్మెంట్ పాకిస్తాన్ బోర్డుకు సమాచారం ఇచ్చింది. దాంతో నిర్ణీత సమయానికి ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య తొలి టెస్టు మొదలైన విషయం తెలిసిందే. అయితే.. ఇలా మ్యాచ్ మొదలయిందో లేదో ఇంగ్లండ్ జట్టు తొలి ఓవర్ నుంచే పరుగుల వరద పారించింది. టెస్టు మ్యాచ్‌లో టి20 మెరుపులను చూపించింది. జీవంలేని పిచ్‌పై పాక్ బౌలర్లు తేలిపోగా... ఇంగ్లండ్ జట్టులో ఏకంగా నలుగురు బ్యాటర్లు సెంచరీల మోత మోగించారు. ఫలితంగా 145 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో మ్యాచ్ రోజే అత్యధిక పరుగులు చేసిన జట్టుగా ఇంగ్లండ్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. England tour of Pakistan, 2022-Rawalpindi: 17 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ గడ్డపై టెస్టు ఆడేందుకు వచ్చిన ఇంగ్లండ్ ఎవ్వరూ ఊహించనిరీతిలో విధ్వంసం సృష్టించింది. గురువారం మొదలైన తొలి టెస్టులో తొలి రోజు ఆటలో ఇంగ్లండ్ బ్యాటర్ల ధాటికి పలు రికార్డులు బద్దలయ్యాయి. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా... వెలుతురు మందగించి తొలి రోజు ఆటను ముగించే సమయానికి ఇంగ్లండ్ 75 ఓవర్లలో 4 వికెట్లకు 506 పరుగులు సాధించింది. దంచికొట్టిన ఓపెనర్లు ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ (111 బంతుల్లో 122; 21 ఫోర్లు), బెన్ డకెట్ (110 బంతుల్లో 107; 15 ఫోర్లు), వన్‌డౌన్ బ్యాటర్ ఓలీ పోప్ (104 బంతుల్లో 108; 14 ఫోర్లు), మిడిలార్డర్లో హ్యారీ బ్రూక్ (81 బంతుల్లో 101 బ్యాటింగ్; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలు సాధించారు. హ్యారీ బ్రూక్‌తో కలిసి బెన్ స్టోక్స్ (15 బంతుల్లో 34; 6 ఫోర్లు, 1 సిక్స్) క్రీజులో ఉన్నాడు. జో రూట్ (31 బంతుల్లో 23; 3 ఫోర్లు) ఒక్కడే తక్కువ స్కోరుకు అవుటయ్యాడు. 73 ఫోర్లు, 3 సిక్స్‌లు వెలుతురు మందగించడంతో తొలి రోజు నిర్ణీత 90 ఓవర్లకు బదులు 75 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. పూర్తి కోటా ఓవర్లు వేసిఉంటే ఇంగ్లండ్ స్కోరు 600 దాటేది. తొలి రోజు ఇంగ్లండ్ బ్యాటర్లు 73 ఫోర్లు, 3 సిక్స్‌లు కొట్టడం విశేషం. ఈ మ్యాచ్‌తో పాక్ జట్టు తరఫున హారిస్ రవూఫ్, మొహమ్మద్ అలీ, సౌద్ షకీల్, జాహిద్ మొహమ్మద్... ఇంగ్లండ్ జట్టు తరఫున లివింగ్‌స్టోన్, విల్ జాక్స్ టెస్టుల్లో అరంగేట్రం చేశారు. మరి ఈ మ్యాచ్‌లో నమోదైన రికార్డులు పరిశీలిద్దామా?! ప్రపంచ రికార్డు రావల్పిండి టెస్టులో తొలి రోజు ఇంగ్లండ్ సాధించిన పరుగులు 506. 145 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో మ్యాచ్ తొలి రోజే ఏ జట్టూ 500 పరుగులు చేయలేదు. 1910లో సిడ్నీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో తొలి రోజు ఆస్ట్రేలియా 6 వికెట్లకు 494 పరుగులు సాధించింది. 112 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న ఈ రికార్డును గురువారం ఇంగ్లండ్ జట్టు బద్దలు కొట్టింది. ఇదే తొలిసారి టెస్ట్ మ్యాచ్ తొలి రోజే ఓ జట్టు తరఫున నలుగురు బ్యాటర్లు సెంచరీలు సాధించడం ఇదే ప్రథమం. జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, హ్యారీ బ్రూక్ కలిసి ఈ ఘనత సాధించారు. టీమిండియా రికార్డు బద్దలు పాక్‌తో తొలి టెస్టు తొలి సెషన్లో (లంచ్ సమయానికి) ఇంగ్లండ్ 27 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా చేసిన పరుగులు 178. గతంలో ఏ జట్టూ తొలి సెషన్లో ఇన్ని పరుగులు చేయలేదు. 2018లో అఫ్గానిస్తాన్‌తో బెంగళూరులో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో తొలి సెషన్లో భారత్ 27 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 158 పరుగులు చేసింది. ఈ రికార్డును ఇంగ్లండ్ సవరించింది. ఐదో క్రికెటర్‌గా ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో సౌద్ షకీల్ వేసిన 68వ ఓవర్లో హ్యారీ బ్రూక్ వరుసగా ఆరు ఫోర్లు కొట్టి ఈ ఘనత సాధించిన ఐదో క్రికెటర్‌గా నిలిచాడు. గతంలో సందీప్ పాటిల్ (భారత్; 1982లో బాబ్ విల్లిస్ (ఆస్ట్రేలియా) బౌలింగ్‌లో), గేల్ (విండీస్;20 04లో హోగార్డ్ (ఇంగ్లండ్) బౌలింగ్), శర్వాణ్ (వెస్టిండీస్; 2006లో మునాఫ్ పటేల్ (భారత్) బౌలింగ్‌లో), జయసూర్య (శ్రీలంక; 2007లో అండర్సన్ (ఇంగ్లండ్) బౌలింగ్‌లో) ఈ ఘనత సాధించారు. చదవండి: IND vs BAN: టీమిండియాతో వన్డే సిరీస్.. బంగ్లాదేశ్‌కు ఊహించని షాక్! ఇక అంతే సంగతి BCCI Chief Selector:టీమిండియా చీఫ్ సెలక్టర్ రేసులో మాజీ స్పీడ్ స్టర్..! Harry Brook gets to his first 💯 in his second Test #PAKvENG | #UKSePK pic.twitter.com/fE7u8IeYm5 — Pakistan Cricket (@TheRealPCB) December 1, 2022 Given out on review ☝️ Mohammad Ali has his first Test scalp 👏#PAKvENG | #UKSePK pic.twitter.com/eGXqxedHmB — Pakistan Cricket (@TheRealPCB) December 1, 2022 The century moment for Ollie Pope 👍#PAKvENG | #UKSePK pic.twitter.com/fwv0r0QgMS — Pakistan Cricket (@TheRealPCB) December 1, 2022 -
టెస్ట్ మ్యాచా లేక టీ20నా.. ఇంగ్లండ్ బ్యాటర్ల మహోగ్రరూపం, ఒకే రోజు నలుగురు సెంచరీలు
3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు 17 ఏళ్ల సుదర్ఘీ విరామం తర్వాత పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ క్రికెట్ జట్టు.. రావల్పిండి వేదికగా ఇవాళ (డిసెంబర్ 1) మొదలైన తొలి టెస్ట్‌లో పరుగుల వరద పారించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆ టీమ్.. టీ20 తరహాలో బ్యాటింగ్ చేసి రికార్డు స్కోర్ సాధించింది. ఏకంగా నలుగురు బ్యాటర్లు శతకాలు సాధించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 506 పరుగుల అత్యంత భారీ స్కోర్ నమోదు చేసింది. తొలి రోజు 75 ఓవర్ల పాటు ఆట సాగగా.. ఇంగ్లండ్ బ్యాటర్లు 6.75 రన్‌రేట్ చొప్పున పరుగులు పిండుకున్నారు. ఇంగ్లండ్ బ్యాటర్ల మహోగ్రరూపం ధాటికి విలవిలలాడిపోయిన పాక్ బౌలర్లు ప్రేక్షక పాత్రకు పరిమతమయ్యారు. ఓపెనర్లు బెన్ డకెట్ (106 బంతుల్లో 101 నాటౌట్; 14 ఫోర్లు), జాక్ క్రాలే (106 బంతుల్లో 120 నాటౌట్; 21 ఫోర్లు), ఓలీ పోప్ (104 బంతుల్లో 108; 14 ఫోర్లు), హ్యారీ బ్రూక్ (81 బంతుల్లో 101 నాటౌట్) సెంచరీలతో విరుచుకుపడ్డారు. సెంచరీకి ముందు హ్యారీ బ్రూక్.. సౌద్ షకీల్ వేసిన ఇన్నింగ్స్ 68వ ఓవర్లో 6 బౌండరీలు బాదగా.. ఆట కాసేపట్లో ముగుస్తుందనగా కెప్టెన్ స్టోక్స్ (15 బంతుల్లో 34 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్) పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఒక్క రూట్ (31 బంతుల్లో 23; 3 ఫోర్లు) మినహాయించి అందరూ టీ20ల్లోలా రెచ్చిపోయారు. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసిన వారికి కచ్చితంగా టీ20 మ్యాచ్ చూసిన అనుభూతే కలిగి ఉంటుంది. పాక్ బౌలర్లలో మహ్మద్ అలీ (5.6) మినహా అందరూ 6కు పైగా ఎకనామీతో పరుగులు సమర్పించుకున్నారు. రెండో రోజు ఆటలో ఇంగ్లండ్ బ్యాటర్లను ఆపడం పాక్ బౌలర్లకు సాధ్యమవుతుందో లేదో వేచి చూడాలి. -
శతకాలతో చెలరేగిన ఇంగ్లండ్ ఓపెనర్లు.. పాక్ బౌలర్లకు చుక్కలు
3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు 17 ఏళ్ల సుదర్ఘీ విరామం తర్వాత పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ క్రికెట్ టీమ్.. రావల్పిండి వేదికగా ఇవాళ (డిసెంబర్ 1) మొదలైన తొలి టెస్ట్‌లో పరుగుల వరద పారిస్తుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లండ్ భారీ స్కోర్ దిశగా పయనిస్తుంది. ఓపెనర్లు బెన్ డకెట్ (106 బంతుల్లో 101 నాటౌట్; 14 ఫోర్లు), జాక్ క్రాలే (106 బంతుల్లో 120 నాటౌట్; 21 ఫోర్లు) సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరూ వన్డేల తరహాలో బ్యాటింగ్ చేస్తూ పాక్ బౌలర్లను చుక్కలు చూపిస్తున్నారు. 35 ఓవర్ల తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ స్కోర్ 227/0గా ఉంది. పాక్ బౌలర్లు ఎంత ప్రయత్నించినా ఒక్క వికెట్ కూడా దక్కంచుకోలేకపోయారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్ టీమ్‌లో గుర్తు తెలియని వైరస్ కలకలం రేపిన విషయం తెలిసిందే. కెప్టెన్ బెన్ స్టోక్స్ సహా 14 మంది ఆటగాళ్లు వైరస్ బారిన పడి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, కీటన్ జెన్నింగ్స్, ఓలీ పోప్, జోరూట్ మినహా ఆటగాళ్లంతా వైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది. అయితే అస్వస్థతను జయించి బెన్ డకెట్ సెంచరీ సాధించడం విశేషం. డకెట్‌కు ఇది టెస్ట్‌ల్లో తొలి శతకం.