బిగ్ బాష్ లీగ్ 2024-25 సీజన్‌లో సంచలన క్యాచ్ నమోదైంది. ఈ లీగ్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్ బ్యాటర్ బెన్ డకెట్ కళ్లు చెదిరే క్యాచ్‌తో మెరిశాడు. అడిలైడ్ బ్యాటర్ డి'ఆర్సీ షార్ట్‌ను అద్బుతమైన క్యాచ్‌తో డకెట్ పెవిలియన్‌కు పంపాడు.
అడిలైడ్ ఇన్నింగ్స్ 15వ ఓవర్ వేసిన పీటర్ సిడిల్ నాలుగో బంతిని షార్ట్‌కు ఫుల్లర్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ డెలివరీని షార్ట్ కవర్స్ పై నుంచి షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. షాట్ కూడా సరిగ్గా కనక్ట్ అయినప్పటికి.. ఎక్స్‌ట్రా కవర్స్‌లో ఉన్న డకెట్ అద్బుతం చేశాడు.
డకెట్ గాల్లోకి జంప్ చేస్తూ ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. అతడి క్యాచ్‌ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇందకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
కాగా ఫీల్డింగ్‌లో అదరగొట్టిన డకెట్.. బ్యాటింగ్‌లో మాత్రం నిరాశపరిచాడు. తొలి బంతికే ఔటయ్యి గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మెల్‌బోర్న్ స్టార్స్‌పై 15 పరుగుల తేడాతో అడిలైడ్ స్ట్రైకర్స్ ఘన విజయం సాధించింది.
చదవండి: SA vs PAK: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
One of the best catches you will ever see in the BBL! 😱
Ben Duckett takes a SCREAMER! @BKTtires #GoldenMoment #BBL14 pic.twitter.com/JLhu3BQ0DZ— KFC Big Bash League (@BBL) December 20, 2024
Comments
Please login to add a commentAdd a comment