ముల్తాన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్‌కు ఇంగ్లండ్ ధీటుగా బదులిస్తోంది. రెండో రోజు లంచ్ సమయానికి ఇంగ్లండ్ 2 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఉన్న స్టార్ ప్లేయర్లు జో రూట్(72), బెన్ డకెట్(80) సెంచరీల వైపు అడుగులు వేస్తున్నారు. ఇక మూడో రోజు ఆట సందర్భంగా పాకిస్తాన్ టీమ్ మరోసారి తమ పరువు పోగొట్టుకుంది. ఓ చెత్త రివ్యూ తీసుకుని నవ్వులు పాలు అయింది.
అసలేం జరిగిందంటే?
ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ 39 ఓవర్ వేసిన పాక్ పేసర్ అమీర్ జమాల్ తొలి బంతిని గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. అయితే బంతి కాస్త బ్యాట్‌కు దగ్గర వెళ్తూ వికెట్ కీపర్ చేతికి వెళ్లింది. వెంటనే వికెట్ కీపర్‌తో పాటు బౌలర్ క్యాచ్‌కు అప్పీల్ చేశారు. అంపైర్ నాటౌట్ అంటూ తల ఊపాడు.
వికెట్ కీపర్ రిజ్వాన్ కూడా అంత స్పష్టంగా అప్పీల్ చేయలేదు. ఎందుకంటే కనీసం బ్యాట్‌కు తాకిన శబ్ధం కూడా రాలేదు. కానీ జమాల్ మాత్రం రివ్యూకు వెళ్లాలని కెప్టెన్ మసూద్‌కు సూచించాడు. మసూద్ ముందు వెనక ఆలోచించకుండా వెంటనే డీఆర్‌ఎస్‌కు సిగ్నల్ చేశాడు.
అయితే రిప్లేలో బంతికి, బ్యాట్‌కు మధ్య చాలా గ్యాప్ ఉన్నట్లు తేలింది. దీంతో థర్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని ఈజీగా ప్రకటించాడు. బిగ్ స్క్రీన్‌పై రిప్లే చూసిన అభిమానులతో పాటు ఇంగ్లండ్ ఆటగాళ్లు నవ్వుకున్నారు. ఇందుకు సబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు పాక్‌తో అట్లుంటది మరి అని కామెంట్లు చేస్తున్నారు. కాగా పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
చదవండి: CT 2025: పాక్‌కు బిగ్ షాక్.. భారత్ ఫైనల్ చేరితే వేదిక మారే ఛాన్స్! ఎక్కడంటే?
— Jatin malu (Ja3) (@jatin_malu) October 9, 2024
Comments
Please login to add a commentAdd a comment