ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ జట్టు ఉన్నట్లుండి కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ దిశగా సాగుతున్న సమయంలో సాజిద్ ఖాన్ (పాక్ స్పిన్నర్) ఇంగ్లండ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. ఇంగ్లండ్ స్కోర్ 124/1 వద్ద ఉన్న సమయంలో సాజిద్ ఖాన్ వరుసగా ఓలీ పోప్ (29), జో రూట్ (34), సెంచరీ హీరో బెన్ డకెట్ (114), హ్యారీ బ్రూక్ (9) వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్ 14 పరుగుల వ్యవధిలో నాలుగు కీలకమైన వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ స్కోర్ 239/6గా ఉంది. జేమీ స్మిత్ (12), బ్రైడన్ కార్స్ (2) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్.. పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 127 పరుగులు వెనుకపడి ఉంది.
బెన్ డకెట్ సెంచరీ
బెన్ డకెట్ 120 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. డకెట్‌కు టెస్ట్‌ల్లో ఇది నాలుగో సెంచరీ. ఓపెనర్‌గా బరిలోకి దిగిన డకెట్ ఆది నుంచి పాక్ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. డకెట్ తన ఇన్నింగ్స్‌లో మొత్తం 16 బౌండరీలు బాదాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 366 పరుగులకు ఆలౌటైంది. అరంగేట్రం బ్యాటర్ కమ్రాన్ గులామ్ సెంచరీతో (118) కదంతొక్కగా.. సైమ్ అయూబ్ అర్ద సెంచరీతో (77) రాణించాడు. పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ 7, షాన్ మసూద్ 3, సౌద్ షకీల్ 4, మహ్మద్ రిజ్వాన్ 41, అఘా సల్మాన్ 31, ఆమెర్ జమాల్ 37, సాజిద్ ఖాన్ 2, నౌమన్ అలీ 32, జహిద్ మహమూద్ 2 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ నాలుగు వికెట్లు పడగొట్టగా..బ్రైడన్ కార్స్ మూడు, మాథ్యూ పాట్స్ రెండు, షోయబ్ బషీర్ ఓ వికెట్ దక్కించుకున్నారు.
చదవండి: ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్‌గా వరల్డ్‌కప్ విన్నర్
Comments
Please login to add a commentAdd a comment