PAK VS ENG 2nd Test: బెన్‌ డకెట్‌ వరల్డ్‌ రికార్డు | PAK VS ENG 2nd Test: Ben Duckett Sets The Record As The Fastest To 2000 Test Runs By Balls Faced | Sakshi
Sakshi News home page

PAK VS ENG 2nd Test: బెన్‌ డకెట్‌ వరల్డ్‌ రికార్డు

Published Wed, Oct 16 2024 7:27 PM | Last Updated on Wed, Oct 16 2024 7:55 PM

PAK VS ENG 2nd Test: Ben Duckett Sets The Record As The Fastest To 2000 Test Runs By Balls Faced

ముల్తాన్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ ఆటగాడు బెన్‌ డకెట్‌ వరల్డ్‌ రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన డకెట్‌ టెస్ట్‌ క్రికెట్‌ అత్యంత వేగంగా (బంతుల పరంగా) 2000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా నిలిచాడు. డకెట్‌ తన 27 మ్యాచ్‌ల టెస్ట్‌ కెరీర్‌లో 2293 బంతులు ఎదుర్కొని 2000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్‌ ఆటగాడు టిమ్‌ సౌథీ పేరిట ఉండేది. సౌథీ 2418 బంతుల్లో 2000 పరుగులు పూర్తి చేశాడు.

టెస్ట్‌ల్లో బంతుల పరంగా వేగవంతమైన 2000 పరుగులు..
బెన్‌ డకెట్‌ 2293 బంతులు
టిమ్‌ సౌథీ 2418 బంతులు
ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ 2483 బంతులు
సర్ఫరాజ్‌ అహ్మద్‌ 2693 బంతులు
వీరేంద్ర సెహ్వాగ్‌ 2759 బంతులు
రిషబ్‌ పంత్‌ 2797 బంతులు

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 366 పరుగులకు ఆలౌటైంది. అరంగేట్రం బ్యాటర్‌ కమ్రాన్‌ గులామ్‌ సెంచరీతో (118) కదంతొక్కగా.. సైమ్‌ అయూబ్‌ అర్ద సెంచరీతో (77) రాణించాడు. పాక్‌ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్‌ 7, షాన్‌ మసూద్‌ 3, సౌద్‌ షకీల్‌ 4, మహ్మద్‌ రిజ్వాన్‌ 41, అఘా సల్మాన్‌ 31, ఆమెర్‌ జమాల్‌ 37, సాజిద్‌ ఖాన్‌ 2, నౌమన్‌ అలీ 32, జహిద్‌ మహమూద్‌ 2 పరుగులు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో జాక్‌ లీచ్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా..బ్రైడన్‌ కార్స్‌ మూడు, మాథ్యూ పాట్స్‌ రెండు, షోయబ్‌ బషీర్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. బెన్‌ డకెట్‌ సెంచరీతో (114) కదంతొక్కగా.. జాక్‌ క్రాలే 27, ఓలీ పోప్‌ 29, జో రూట్‌ 34, హ్యారీ బ్రూక్‌ 9, బెన్‌ స్టోక్స్‌ ఒక్క పరుగు చేశారు. జేమీ స్మిత్‌ (12), బ్రైడన్‌ కార్స్‌ (2) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్‌.. పాక్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఇంకా 127 పరుగులు వెనుకపడి ఉంది. పాక్‌ బౌలర్లలో సాజిద్‌ ఖాన్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా.. నౌమన్‌ అలీ రెండు వికెట్లు దక్కించుకున్నాడు.

చదవండి: రెండో స్థానానికి ఎగబాకిన బ్రూక్‌.. టాప్‌ ప్లేస్‌ను సుస్థిరం చేసుకున్న రూట్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement