రోహిత్ శర్మకు షాక్‌..! టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌? | Shreyas Iyer Joins White-Ball Captaincy Race: Reports | Sakshi
Sakshi News home page

రోహిత్ శర్మకు షాక్‌..! టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌?

Jun 7 2025 1:07 PM | Updated on Jun 7 2025 1:37 PM

Shreyas Iyer Joins White-Ball Captaincy Race: Reports

ఐపీఎల్‌-2025 సీజ‌న్‌లో పంజాబ్ కింగ్స్ తుది మెట్టుపై  బోల్తా ప‌డిన‌ప్ప‌టికి.. ఆ జ‌ట్టు సార‌థి శ్రేయ‌స్ అయ్య‌ర్ త‌న కెప్టెన్సీతో అంద‌రిని ఆక‌ట్టుకున్నాడు. త‌న అద్బుత‌మైన కెప్టెన్సీతో పంజాబ్ కింగ్స్‌ను ప‌దేళ్ల త‌ర్వాత ఫైన‌ల్‌కు చేర్చాడు. మ‌రోవైపు వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న ప‌రంగా అయ్య‌ర్ దుమ్ములేపాడు.

దీంతో అయ్య‌ర్‌కు అంత‌ర్జాతీయ క్రికెట్‌లో రివార్డు ల‌భించిన‌ట్లు తెలుస్తోంది. ఇండియ‌న్స్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ ప్రకారం.. టీమిండియా వైట్‌బాల్ కెప్టెన్సీ రేసులో శ్రేయ‌స్ ఉన్న‌ట్లు స‌మాచారం. అదేవిధంగా గ‌త కొంత‌కాలంగా కేవ‌లం వ‌న్డేల‌కే ప‌రిమితైన అయ్య‌ర్ భార‌త టీ20 జ‌ట్టులోకి పున‌రాగ‌మ‌నం చేయ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

కెప్టెన్సీ రేసులో శ్రేయస్‌..
శ్రేయ‌స్ అయ్య‌ర్ ప్ర‌స్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. కానీ ఈ ఏడాది ఐపీఎల్‌లో త‌న అద్బుత‌ ప్ర‌ద‌ర్శ‌న త‌ర్వాత అయ్య‌ర్ టీ20 సెట‌ప్‌లోకి కూడా వ‌చ్చే అవ‌కాశ‌ముంది. అంతేకాకుండా అయ్య‌ర్ ఇప్పుడు వైట్‌కెప్టెన్సీ రేసులో కూడా ఉన్నాడు అని ఓ బీసీసీఐ అధికారి ది ఇండియ‌న్స్ ఎక్స్‌ప్రెస్‌తో పేర్కొన్నారు.

కాగా ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టు టీ20 కెప్టెన్‌గా సూర్య‌కుమార్ యాద‌వ్ ఉండ‌గా.. రోహిత్ శ‌ర్మ వ‌న్డే జ‌ట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మ‌న్ గిల్ ఇటీవ‌లే నియ‌మితుడ‌య్యాడు. అయితే మూడు ఫార్మాట్ల‌కు వెర్వేరు కెప్టెన్ల‌ను నియ‌మించాల‌ని బీసీసీఐ ఆలోచిస్తున్న‌ట్లు స‌మాచారం.

ఇప్ప‌టికే టెస్టుల‌కు, టీ20ల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన రోహిత్ శ‌ర్మ త్వ‌ర‌లోనే వ‌న్డేల‌కు సైతం వీడ్కోలు ప‌లికే ఛాన్స్ ఉంది. ఒక‌వేళ రిటైర్మెంట్ ప్ర‌క‌టించికపోయినా కెప్టెన్సీ నుంచి మాత్రం త‌ప్పుకునే అవ‌కాశ‌ముంది. ఈ క్ర‌మంలో అయ్య‌ర్‌కు వ‌న్డే ప‌గ్గాలు అప్ప‌గించాల‌ని బీసీసీఐ పెద్ద‌లు యోచిస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.
చదవండి: ENG vs WI: జోస్ బ‌ట్ల‌ర్ విధ్వంసం.. విండీస్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్‌

Advertisement
 
Advertisement
Advertisement