3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు 17 ఏళ్ల సుదర్ఘీ విరామం తర్వాత పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ క్రికెట్ టీమ్.. రావల్పిండి వేదికగా ఇవాళ (డిసెంబర్ 1) మొదలైన తొలి టెస్ట్‌లో పరుగుల వరద పారిస్తుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లండ్ భారీ స్కోర్ దిశగా పయనిస్తుంది.
ఓపెనర్లు బెన్ డకెట్ (106 బంతుల్లో 101 నాటౌట్; 14 ఫోర్లు), జాక్ క్రాలే (106 బంతుల్లో 120 నాటౌట్; 21 ఫోర్లు) సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరూ వన్డేల తరహాలో బ్యాటింగ్ చేస్తూ పాక్ బౌలర్లను చుక్కలు చూపిస్తున్నారు. 35 ఓవర్ల తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ స్కోర్ 227/0గా ఉంది. పాక్ బౌలర్లు ఎంత ప్రయత్నించినా ఒక్క వికెట్ కూడా దక్కంచుకోలేకపోయారు.
ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్ టీమ్‌లో గుర్తు తెలియని వైరస్ కలకలం రేపిన విషయం తెలిసిందే. కెప్టెన్ బెన్ స్టోక్స్ సహా 14 మంది ఆటగాళ్లు వైరస్ బారిన పడి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, కీటన్ జెన్నింగ్స్, ఓలీ పోప్, జోరూట్ మినహా ఆటగాళ్లంతా వైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది. అయితే అస్వస్థతను జయించి బెన్ డకెట్ సెంచరీ సాధించడం విశేషం. డకెట్‌కు ఇది టెస్ట్‌ల్లో తొలి శతకం.
Comments
Please login to add a commentAdd a comment