ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన పాక్‌.. సిరీస్‌ కైవసం | Pakistan Beat England By 9 Wickets In Third Test | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన పాక్‌.. సిరీస్‌ కైవసం

Published Sat, Oct 26 2024 12:41 PM | Last Updated on Sat, Oct 26 2024 1:20 PM

Pakistan Beat England By 9 Wickets In Third Test

స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను పాకిస్తాన్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. రావల్పిండి వేదికగా జరిగిన నిర్ణయాత్మక మూడో టెస్ట్‌లో పాక్‌ 9 వికెట్ల తేడాతో పర్యాటక జట్టుపై ఘన విజయం సాధించింది. 

పాక్‌ గెలుపులో ఆ జట్టు స్పిన్నర్లు ప్రధాన పాత్ర పోషించారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ కోల్పోయిన 20 వికెట్లను పాక్‌ స్పిన్నర్లే పడగొట్టారు. పాక్‌ స్పిన్నర్లలో సాజిద్‌ ఖాన్‌ 10 వికెట్లు పడగొట్టగా.. నౌమన్‌ అలీ 9, జహీద్‌ మెహమూద్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 267 పరుగులకు ఆలౌటైంది. బెన్‌ డకెట్‌ (52), జేమీ స్మిత్‌ (89) అర్ద సెంచరీలతో రాణించారు. పాక్‌ బౌలర్లలో సాజిద్‌ ఖాన్‌ 6, నౌమన్‌ అలీ 3, జహీద్‌ మెహమూద్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

అనంతరం బరిలోకి దిగిన పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో 344 పరుగులకు ఆలౌటైంది. సౌద్‌ షకీల్‌ సూపర్‌ సెంచరీతో (134) పాక్‌కు గౌరవప్రదమైన స్కోర్‌ అందించాడు. ఆఖర్లో నౌమన్‌ అలీ (45), సాజిద్‌ ఖాన్‌ (48 నాటౌట్‌) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో రెహాన్‌ అహ్మద్‌ 4, షోయబ్‌ బషీర్‌ 3, అట్కిన్సన్‌ 2, జాక్‌ లీచ్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

77 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌.. నౌమన్‌ అలీ (6/42), సాజిద్‌ ఖాన్‌ (4/69) దెబ్బకు 112 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో జో రూట్‌ (33) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

అనంతరం 36 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్‌.. 3.1 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది.

చదవండి: Pak vs Eng: చెలరేగిన పాక్‌ స్పిన్నర్లు.. ఇంగ్లండ్‌కు ఘోర పరాభవం

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement