ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 366 పరుగులకు ఆలౌటైంది. అరంగేట్రం బ్యాటర్ కమ్రాన్ గులామ్ సెంచరీతో (118) కదంతొక్కగా.. సైమ్ అయూబ్ అర్ద సెంచరీతో (77) రాణించాడు. పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ 7, షాన్ మసూద్ 3, సౌద్ షకీల్ 4, మహ్మద్ రిజ్వాన్ 41, అఘా సల్మాన్ 31, ఆమెర్ జమాల్ 37, సాజిద్ ఖాన్ 2, నౌమన్ అలీ 32, జహిద్ మహమూద్ 2 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ నాలుగు వికెట్లు పడగొట్టగా..బ్రైడన్ కార్స్ మూడు, మాథ్యూ పాట్స్ రెండు, షోయబ్ బషీర్ ఓ వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 7 ఓవర్ల అనంతరం వికెట్ నష్టపోకుండా 48 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఓపెనర్లు ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. బెన్ డకెట్ 26, జాక్ క్రాలే 19 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 500కుపైగా పరుగులు చేసినప్పటికీ ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కడంతో 556 పరుగులు చేసింది.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. జో రూట్ డబుల్ సెంచరీ (262), హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీతో (317) విరుచుకుపడటంతో రికార్డు స్కోర్ (823/7 డిక్లేర్) చేసింది. 267 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ ఊహించని విధంగా పతనానికి (220 ఆలౌట్) గురై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అఘా సల్మాన్ (63), ఆమెర్ జమాల్ (55 నాటౌట్) పాక్ పతనాన్ని కాసేపు అడ్డుకున్నారు.
చదవండి: IPL 2025: ‘కమిన్స్‌ను వదిలేయనున్న సన్‌రైజర్స్! కారణం ఇదే’
Comments
Please login to add a commentAdd a comment