పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో ఓ ఆసక్తికర ఘట్టం చోటు చేసుకుంది. పాక్ తరఫున తొలిసారి ఫాస్ట్ బౌలర్లు లేకుండా స్పిన్ బౌలర్లే ఇన్నింగ్స్ మొత్తం బౌలింగ్ చేశారు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో (బౌలింగ్) ఇది జరిగింది. పాక్ జట్టులో ఓ ఫాస్ట్ బౌలర్ ఉన్నా.. అతను ఒక్క బంతి కూడా వేయలేదు.
ఇన్నింగ్స్ మొత్తంలో వేసిన 410 బంతులను స్పిన్నర్లే వేశారు. పాక్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో (తొలి ఇన్నింగ్స్) ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఓవరాల్‌గా ఇది రెండోసారి. 1882లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో (తొలి ఇన్నింగ్స్) ఆస్ట్రేలియా స్పిన్నర్లు జోయ్ పాల్మర్, ఎడ్విన్ ఇవాన్స్ ఇన్నింగ్స్ మొత్తం బౌలింగ్ చేశారు.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్ విషయానికొస్తే.. పాక్ స్పిన్నర్లు సాజిద్ ఖాన్, నౌమన్ అలీ, జహీద్ మెహమూద్ ఇన్నింగ్స్ మొత్తం బౌల్ చేసి పది వికెట్లు పడగొట్టారు. ఇందులో సాజిద్ ఖాన్ ఆరు, నౌమన్ అలీ మూడు, జహీద్ మెహమూద్ ఓ వికెట్ పడగొట్టారు. ఈ ముగ్గురు స్పిన్నర్ల ధాటికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 267 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో బెన్ డకెట్ (52), జేమీ స్మిత్ (89) అర్ద సెంచరీలతో రాణించారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. అబ్దుల్లా షఫీక్ (14), సైమ్ అయూబ్ (19), కమ్రాన్ గులామ్ (3) ఔట్ కాగా.. షాన్ మసూద్ (16), సౌద్ షకీల్ (16) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్, షోయబ్ బషీర్, అట్కిన్సన్ తలో వికెట్ పడగొట్టారు. తొలి రోజు ఆటలో మొత్తం 13 వికెట్లు పడగా.. 12 వికెట్లు స్పిన్నర్లే దక్కించుకోవడం విశేషం.
చదవండి: చరిత్ర సృష్టించిన వాషింగ్టన్.. తొలి భారత ప్లేయర్‌గా
Comments
Please login to add a commentAdd a comment