ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగబోయే రెండో టెస్ట్ కోసం పాకిస్తాన్ తుది జట్టును ఇవాళ (అక్టోబర్ 14) ప్రకటించారు. తొలి టెస్ట్ ఆడిన పాక్ జట్టులో నాలుగు మార్పులు చోటు చేసుకున్నాయి. బాబర్ ఆజమ్, నసీం షా, షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్ స్థానాల్లో కమ్రాన్ గులామ్, నౌమన్ అలీ, సాజిద్ ఖాన్, జహిద్ మెహమూద్ తుది జట్టులోకి వచ్చారు. ఈ జట్టుకు సారధిగా షాన్ మసూద్ కొనసాగుతుండగా.. వైస్ కెప్టెన్‌గా సౌద్ షకీల్ వ్యవహరించనున్నాడు.
రేపటి నుంచి (అక్టోబర్ 15) ప్రారంభం కాబోయే ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తుది జట్టును కూడా ఇవాళే ప్రకటించారు. ఇంగ్లండ్ జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. గాయం నుంచి కోలుకున్న రెగ్యులర్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తిరిగి జట్టులోకి రాగా.. పేసర్ గస్ అట్కిన్సన్ స్థానంలో మరో పేసర్ మాథ్యూ పాట్స్‌ను తుది జట్టులోకి వచ్చాడు. క్రిస్ వోక్స్ స్థానంలో బెన్ స్టోక్స్ తుది జట్టులోకి వచ్చాడు. ఓలీ పోప్ నుంచి స్టోక్స్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు.
ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్ కోసం పాక్ తుది జట్టు..
సైమ్ అయూబ్, అబ్దుల్లా షఫీక్, షాన్ మసూద్ (కెప్టెన్), కమ్రాన్ గులామ్, సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), మొహమ్మద్ రిజ్వాన్ (వికెట్‌కీపర్), సల్మాన్ అలీ అఘా, ఆమెర్ జమాల్, నౌమన్ అలీ, సాజిద్ ఖాన్, జహిద్ మెహమూద్
పాక్‌తో రెండో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టు..
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్‌కీపర్), బ్రైడన్ కార్స్, మాథ్యూ పాట్స్, జాక్ లీచ్, షోయబ్ బషీర్
కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు పాక్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 500కుపైగా పరుగులు చేసినప్పటికీ ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కడంతో 556 పరుగులు చేసింది.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. జో రూట్ డబుల్ సెంచరీ (262), హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీతో (317) విరుచుకుపడటంతో రికార్డు స్కోర్ (823/7 డిక్లేర్) చేసింది. 267 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ ఊహించని విధంగా పతనానికి (220 ఆలౌట్) గురై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అఘా సల్మాన్ (63), ఆమెర్ జమాల్ (55 నాటౌట్) పాక్ పతనాన్ని కాసేపు అడ్డుకున్నారు.
చదవండి: భారత్‌తో టెస్టు సిరీస్.. ఆసీస్ జట్టు ప్రకటన! కెప్టెన్ ఎవరంటే?
Comments
Please login to add a commentAdd a comment