అక్టోబర్‌లో పాకిస్తాన్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం 17 మంది సభ్యుల ఇంగ్లండ్ జట్టును ఇవాళ (సెప్టెంబర్ 10) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా బెన్ స్టోక్స్ ఎంపికయ్యాడు. స్టోక్స్ గాయం కారణంగా తాజాగా ముగిసిన శ్రీలంక సిరీస్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. స్టోక్స్‌తో పాటు జాక్ క్రాలే, జాక్ లీచ్, రెహాన్ అహ్మద్ ఇంగ్లండ్ జట్టులోకి పునరాగమనం చేశారు. ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో ఇద్దరు అన్ క్యాప్డ్ ప్లేయర్లు (డర్హమ్ సీమర్ బ్రైడన్ కార్స్, ఎసెక్స్ బ్యాటర్ జోర్డన్ కాక్స్) చోటు దక్కించుకున్నారు.
కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు పాక్‌లో పర్యటించాల్సి ఉంది. అయితే మ్యాచ్‌ల నిర్వహణకు వేదికలు సరిగ్గా లేవన్న కారణంగా ఈ సిరీస్‌ను యూఏఈలో నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భావిస్తుంది. వేదికల మార్పుపై ఈ వారాంతంలో పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 7 నుంచి ముల్తాన్ వేదికగా తొలి టెస్ట్.. అక్టోబర్ 15 నుంచి కరాచీ వేదికగా రెండో టెస్ట్.. అక్టోబర్ 24 నుంచి రావల్పిండి వేదికగా మూడో టెస్ట్ జరగాల్సి ఉంది.
ఇదిలా ఉంటే, ఇంగ్లండ్ జట్టు 2022లో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం పాకిస్తాన్‌లో పర్యటించింది. ఆ సిరీస్‌ను పర్యాటక ఇంగ్లండ్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.
పాకిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు..
బెన్ స్టోక్స్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, జోర్డన్ కాక్స్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జోష్ హల్, జాక్ లీచ్, ఒల్లీ పోప్, మాథ్యూ పాట్స్, జో రూట్, జేమీ స్మిత్, ఒల్లీ స్టోన్ , క్రిస్ వోక్స్
రేపటి నుంచి ఆసీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు..
ఇంగ్లండ్ జట్టు రేపటి నుంచి (సెప్టెంబర్ 11) స్వదేశంలో ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌లలో తొలుత టీ20, ఆతర్వాత వన్డే మ్యాచ్‌లు జరుగనున్నాయి.
ఆసీస్, ఇంగ్లండ్ మధ్య టీ20, వన్డే సిరీస్ షెడ్యూల్..
సెప్టెంబర్ 11- తొలి టీ20 (సౌతాంప్టన్)
సెప్టెంబర్ 13- రెండో టీ20 (కార్డిఫ్)
సెప్టెంబర్ 15- మూడో టీ20 (మాంచెస్టర్)
సెప్టెంబర్ 19- తొలి వన్డే (నాటింగ్హమ్)
సెప్టెంబర్ 21- రెండో వన్డే (లీడ్స్)
సెప్టెంబర్ 24- చెస్టర్ లీ స్ట్రీట్
సెప్టెంబర్ 27- లండన్
సెప్టెంబర్ 29- బ్రిస్టల్
Comments
Please login to add a commentAdd a comment