Zak Crawley
-
Pak vs Eng: పాకిస్తాన్‌తో తొలి టెస్టు.. బెన్ స్టోక్స్ దూరం!
పాకిస్తాన్‌తో తొలి టెస్టుకు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఈ ఆల్‌రౌండర్ ఇంకా మ్యాచ్ ఫిట్నెస్ సాధించలేదని సమాచారం. దీంతో ఒలీ పోప్ మరోసారి స్టోక్స్ స్థానంలో జట్టును ముందుకు నడిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కాగా ది హండ్రెడ్ లీగ్ 2024 సందర్భంగా బెన్ స్టోక్స్ గాయపడిన విషయం తెలిసిందే. నార్తర్న్ సూపర్చార్జెర్స్కు ప్రాతినిథ్యం వహించిన అతడు తొడకండరాల నొప్పితో జట్టుకు దూరమయ్యాడు. దీంతో స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్ కూడా ఆడలేకపోయాడు.ఈ క్రమంలో ఒలీ పోప్ సారథ్య బాధ్యతలు చేపట్టగా.. ఇంగ్లండ్ శ్రీలంకపై మూడు టెస్టుల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. అయితే, కెప్టెన్సీ పోప్ వ్యక్తిగత ప్రదర్శనపై ప్రభావం చూపగా.. అతడు విమర్శల పాలయ్యాడు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ జట్టు అక్టోబరు 7 నుంచి పాకిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ మొదలుపెట్టనుంది.ముల్తాన్ వేదికగా ఇరుజట్ల మధ్య తొలి టెస్టుఇందుకోసం ఇప్పటికే అక్కడికి చేరుకుంది. ముల్తాన్ వేదికగా ఇరుజట్ల మధ్య తొలి టెస్టు జరుగనుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలే మాట్లాడుతూ.. స్టోక్స్ గాయం గురించి అప్డేట్ ఇచ్చాడు. ‘‘ఇంకో రెండు మూడు వైద్య పరీక్షల తర్వాత అతడు మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడో లేదో తెలుస్తుంది. పూర్తిగా కోలుకున్నాడనే అనుకుంటున్నాం.రిస్క్ తీసుకోవడం అనవసరంమ్యాచ్ ఆడేందుకు తను సిద్ధంగా ఉన్నాడు. అయితే, రిస్క్ తీసుకోవడం అనవసరం. మా జట్టు పటిష్టంగా ఉంది. ఎన్నో ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఆల్రౌండర్లుగా రాణించగల సమర్థులు ఉన్నారు. అందుకే.. అతడిపై మేనేజ్మెంట్ ఒత్తిడి పెట్టదలచుకోలేదు’’ అని జాక్ క్రాలే మీడియాతో పేర్కొన్నాడు. కాగా క్రాలే సైతం చేతి వేలికి గాయంతో బాధపడుతున్నాడు. ఈ కారణంగా అతడు శ్రీలంకతో టెస్టులు మిస్సయ్యాడు. అతడి స్థానంలో డాన్ లారెన్స్ ఓపెనింగ్ చేశాడు. పాక్‌తో టెస్టులకు ఇంగ్లండ్ జట్టుబెన్ స్టోక్స్, గస్ అట్కిన్సన్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, జోర్డాన్ కాక్స్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జోష్ హల్, జాక్ లీచ్, ఓలీ పోప్, మాథ్యూ పాట్స్, రెహాన్ అహ్మద్, జో రూట్, షోయబ్ బషీర్, జేమీ స్మిత్, ఓలీ స్టోన్, క్రిస్ వోక్స్.చదవండి: ఇషాన్ కిషన్ ఆశలపై నీళ్లు చల్లిన టీమిండియా స్టార్ -
సిరాజ్‌ను ఉతికారేసిన ఇంగ్లండ్ ఓపెనర్.. రోహిత్ రియాక్షన్ వైరల్!
రాంఛీ వేదికగా ఇంగ్లండ్ జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఓ వైపు అరంగేట్ర పేసర్ ఆకాష్ దీప్ నిప్పులు చేరుగుతుంటే.. సిరాజ్ మాత్రం దారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. ఇప్పటివరకు 6 ఓవర్లు వేసిన సిరాజ్ మియా ఏకంగా 43 పరుగులిచ్చాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలే సిరాజ్‌కు చుక్కలు చూపించాడు. 7 ఓవర్ వేసిన సిరాజ్ బౌలింగ్‌లో క్రాలే వరుసగా మూడు ఫోర్లు, ఒక సిక్స్ బాది ఏకంగా 18 పరుగులు రాబట్టాడు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ ఏంటి సిరాజ్ భయ్యా అన్నట్లు రియాక్షన్ ఇచ్చాడు. ఇక టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ కాస్త తడబడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. అరంగేట్ర పేసర్ ఆకాష్ దీప్ 3 వికెట్లతో ఇంగ్లండ్ టాపర్డర్‌ను కుప్పకూల్చాడు. Crawley just Shaming Siraj like in T20 Mode.. Bazball Mode is on... 4️⃣4️⃣4️⃣6️⃣ To siraj...#BobbiAlthoff #bobbiAlthoffleak #INDvENG pic.twitter.com/wEtPPgpg3a — Muhammad Asim (@MrAsim_31) February 23, 2024 -
దురదృష్టమంటే నీదే భయ్యా.. క్లీన్ బౌల్డ్ చేసి! వీడియో వైరల్
రాంఛీ వేదికగా ఇంగ్లండ్‌తో జరగుతున్న నాలుగో టెస్టులో భారత అరంగేట్ర పేసర్ ఆకాష్ దీప్ అద్బుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరుస్తున్నాడు. తన పేస్ బౌలింగ్‌తో ఇంగ్లండ్ ఓపెనర్లను ముప్పుతిప్పులు పెడుతున్నాడు. అయితే తన తొలి మ్యాచ్‌లోనే ఆకాష్ దీప్‌ను దురదృష్టం వెంటాడింది. తృటిలో తన తొలి అంతర్జాతీయ వికెట్‌ను సాధించే అవకాశాన్ని కోల్పోయాడు. ఏం జరిగిందంటే? ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 4 ఓవర్ వేసిన ఆకాష్ ఐదో బంతిని క్రాలేకు అద్బుతమైన ఇన్ స్వింగర్‌గా సంధించాడు. ఆకాష్ వేసిన బంతికి క్రాలే దగ్గర సమాధానమే లేకుండా పోయింది. బంతిని క్రాలే అడ్డుకునే లేపే ఆఫ్ స్టంప్స్‌ను గిరాటేసింది. వెంటనే బౌలర్ ఆకాష్ సంబరాల్లో మునిగి తేలిపోయాడు. కానీ ఇక్కడే అస్సలు ట్విస్ట్ చోటు చేసుకుంది. బంతిని వేసే క్రమంలో ఆకాష్ ఫ్రంట్ లైన్‌ను దాటేశాడు. దీంతో ఆన్ ఫీల్డ్ అంపైర్ రాడ్ టక్కర్ నో బాల్‌గా ప్రకటించాడు. దీంతో ఒక్కసారిగా ఆకాష్ నిరాశకు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు దురదృష్టమంటే నీదే భయ్యా అంటూ కామెంట్లు చేస్తున్నారు. What a no ball Akash deep 😫 pic.twitter.com/rObjmSFkJn — Rishi (@EpicVirat) February 23, 2024 -
IND VS ENG 2nd Test: బెన్ స్టోక్స్ అసహనం.. టెక్నాలజీది తప్పంటూ..!
విశాఖ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ 106 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. తొలి టెస్ట్‌లో అన్ని విభాగాల్లో రాణించి టీమిండియాను ఓడించిన ఇంగ్లండ్.. ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమై ఓటమిపాలైంది. ఇంగ్లండ్ ఆటగాళ్లు తేలిపోయిన వేల బుమ్రా (9/91), యశస్వి జైస్వాల్ (209), శుభ్‌మన్ గిల్ (104) అద్భుత ప్రదర్శనలతో సత్తా చాటి టీమిండియాకు అపురూప విజయాన్ని అందించారు. ముఖ్యంగా బుమ్రా స్పిన్నర్లకు అనుకూలించే పిచ్‌పై చెలరేగి ఇంగ్లండ్ ఓటమికి ప్రధాన కారకుడయ్యాడు. Technology got it wrong on this occasion: England skipper Ben Stokes on Zak Crawley's lbw dismissal in second innings of second Test #INDvsENGTest — Press Trust of India (@PTI_News) February 5, 2024 మ్యాచ్ అనంతరం ప్రజెంటేషన్ సెర్మనీ సందర్భంగా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తమ వైఫల్యాలను అంగీకరించినప్పటికీ, ఓ విషయంలో మాత్రం తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. సహచర ఆటగాడు జాక్ క్రాలే ఎల్బీడబ్ల్యూ విషయంలో సాంకేతికతను తప్పుబడుతూ తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు. గేమ్‌లో సాంకేతికత స్పష్టంగా ఉంది. ఇది ఎప్పటికీ 100 శాతం కాకూడదనే అంపైర్ కాల్ అనే ఆప్షన్‌ను ఉంచారు. ఇలాంటి సందర్భంలో పూర్తిగా సాంకేతికతపై ఆధారపడి థర్డ్ అంపైర్ నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదన్నది నా వ్యక్తిగత అభిప్రాయమని స్టోక్స్ అన్నాడు. Review.....successful! ✅☝️ Kuldeep Yadav picks up the big wicket of Crawley to keep #TeamIndia in the driving seat 👊⚡️#BazBowled #IDFCFirstBankTestsSeries #JioCinemaSports#INDvENG pic.twitter.com/c4hMunPVSP — JioCinema (@JioCinema) February 5, 2024 ఇంతకీ ఏం జరిగిందంటే.. జాక్ క్రాలే (73) మాంచి జోరుమీదున్న సమయంలో కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో సందేహాస్పదంగా ఉన్న డీఆర్ఎస్ అప్పీల్‌ను థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. ఫీల్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా, సందర్భం సందేహాస్పదంగా ఉన్నా థర్డ్ అంపైర్ క్రాలేను ఔట్‌గా ప్రకటించడంతో వివాదం మొదలైంది. వాస్తవానికి ఇలాంటి సందర్భంలో థర్డ్ అంపైర్ అంపైర్స్ కాల్‌తో వెళ్తారు. కానీ ఈ సందర్భంలో థర్డ్ అంపైర్ అలా చేయకుండా సాంకేతికత ఆధారంగా క్రాలేను ఔట్‌గా ప్రకటించాడు. రీప్లేలో బంతి లెగ్ సైడ్ వెళ్తున్నట్లు అనిపించినా, చివరకు లెగ్ స్టంప్‌కు తగులుతున్నట్లు డీఆర్ఎస్ చూపించింది. ఈ సాంకేతికత ఆధారంగానే థర్డ్ అంపైర్ క్రాలేను ఔట్‌గా ప్రకటించాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంతో క్రాలే సహా ఇంగ్లీష్ బృందం మొత్తం ఆశ్యర్యం వ్యక్తం చేసింది. డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న ఇంగ్లండ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ సైతం థర్డ్ అంపైర్ నిర్ణయం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. -
ధోనిని గుర్తుచేసిన రోహిత్.. కేవలం 3 సెకండ్లలోనే అద్భుతం! వీడియో వైరల్
వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పట్టుబిగిస్తోంది. భారత విజయానికి 4 వికెట్ల దూరంలో నిలిచింది. నాలుగో రోజు లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ 6 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. ఇంగ్లీష్ జట్టు విజయానికి ఇంకా 205 పరుగులు కావాలి. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హిత్ శర్మ.. ఫీల్డింగ్ మార్పులతో పాటు బౌలింగ్ మార్పులు, డీఆర్ఎస్ తీసుకోవడంలోనూ అభిమానులు అకట్టుకుంటున్నాడు. నాలుగో రోజు ఆట సందర్భంగా రోహిత్ తీసుకున్న డీఆర్ఎస్.. మ్యాచ్‌ను భారత్‌వైపు మలుపు తిప్పేలా చేసింది. ఏం జరిగిందంటే? ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీ(73) దూకుడుగా ఆడుతూ భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఎటాక్‌లో తీసుకువచ్చాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 42వ వేసిన కుల్దీప్ యాదద్ బౌలింగ్‌లో ఆరో బంతిని క్రాలే.. డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్‌కు మిస్స్ అయ్యి ప్యాడ్‌కు తాకింది. వెంటనే వికెట్ కీపర్ శ్రీకర్ భరత్‌తో పాటు బౌలర్ ఎల్బీకి అప్పీలు చేశాడు. కానీ అంపైర్ మాత్రం నాటౌట్ అంటూ తల ఊపాడు. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ రివ్యూ తీసుకోవడానికి శ్రీకర్ భరత్ సలహా ఆడిగాడు. భరత్ మాత్రం లెగ్‌సైడ్ వెళ్తున్నట్లు అన్పిస్తోందనట్లు రోహిత్‌కు సూచించాడు. కానీ రోహిత్ మాత్రం తెలివగా ఆలోచించి ఆఖరి మూడు నిమిషాల్లో డీఆర్ఎస్కు వెళ్లాడు. అయితే రిప్లేలో బంతి వికెట్లను హిట్టింగ్ చేస్తున్నట్లు తేలింది. దీంతో అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఔట్‌గా ప్రకటించింది. ఇక బిగ్ స్క్రీన్‌లో వికెట్లను బంతి హిట్ చేస్తున్నట్లు కన్పించడంతో భారత ఆటగాళ్లలో సంబరాల్లో మునిగి తేలిపోయారు. ముఖ్యంగా రోహిత్ శర్మ అయితే గాల్లోకి జంప్ చేస్తూ మరి సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఎంఎస్ ధోని గుర్తు చేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. Decision overturned! ✅ Kuldeep Yadav got India the big wicket of Zak Crawley ⚡️ P.S. Do not miss Rohit Sharma's reaction 🔥#INDvsENG #KuldeepYadav #RohitSharma #Bazball pic.twitter.com/XjScpAy6YV — OneCricket (@OneCricketApp) February 5, 2024 చదవండి: ఒకే ఒక్క పరుగు.. 80 ఏళ్ల టోర్నీ చరిత్రలో ఇదే తొలిసారి -
Ind vs Eng: బ్యాటింగ్‌లో విఫలమైనా.. అద్భుత క్యాచ్‌తో మెరిసి..
India vs England, 2nd Test: ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అద్భుత క్యాచ్‌తో మెరిశాడు. బంతిని సరిగ్గా అంచనా వేసి డైవ్ చేసి మరీ ఒడిసిపట్టి భారత శిబిరంలో నవ్వులు నింపాడు. కాగా హైదరాబాద్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడిన టీమిండియా.. విశాఖపట్నంలో రెండో మ్యాచ్‌లో తలపడుతోంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్టేడియంలో శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ(209) కారణంగా తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో విఫలం అయితే, ఈ మ్యాచ్‌లో బ్యాటర్‌గా శ్రేయస్ అయ్యర్ విఫలమయ్యాడు. 59 బంతులు ఎదుర్కొన్న ఈ నాలుగో నంబర్ బ్యాటర్ కేవలం 27 పరుగులు మాత్రమే చేశాడు. తద్వారా జట్టుతో పాటు అభిమానులనూ నిరాశపరిచాడు. అయితే, రెండో రోజు ఆటలో భాగంగా శనివారం సూపర్ క్యాచ్ అందుకుని ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 23వ ఓవర్‌ను టీమిండియా స్పిన్నర్ అక్షర్ పటేల్ వేశాడు. డైవ్ చేసి.. క్యాచ్ పట్టి అతడి బౌలింగ్‌లో రెండో బంతికి ఫోర్ బాదిన ఇంగ్లిష్ ఓపెనర్ జాక్ క్రాలే.. మరుసటి బాల్‌కు కూడా షాట్ ఆడాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. ఈ క్రమంలో బంతి గాల్లోకి లేవగా బ్యాక్వర్డ్ పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న శ్రేయస్ అయ్యర్ వెనక్కి పరుగెత్తి.. డైవ్ చేసి క్యాచ్ పట్టాడు. దీంతో 76 పరుగుల వ్యక్తిగత స్కోరుతో ప్రమాదకరంగా మారుతున్న జాక్ క్రాలే కథ ముగిసింది. రెండో వికెట్ దక్కడంతో టీమిండియాలో సంబరాలు మొదలయ్యాయి. ఇక శ్రేయస్ అయ్యర్ క్యాచ్ అందుకున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందుకు స్పందించిన నెటిజన్లు.. ‘‘బ్యాటింగ్‌తో కాకపోయినా.. ఫీల్డింగ్‌తోనైనా జట్టులో చోటిచ్చినందుకు కనీస న్యాయం చేస్తున్నావు’’ అంటూ సెటైరికల్‌గా ప్రశంసిస్తున్నారు. చదవండి: Ind vs Eng: పుజారా అక్కడ దంచికొడుతున్నాడు.. జాగ్రత్త: గిల్‌కు మాజీ కోచ్ వార్నింగ్ 𝙄. 𝘾. 𝙔. 𝙈. 𝙄 That was a ripper of a catch! ⚡️ ⚡️ Follow the match ▶️ https://t.co/X85JZGt0EV #TeamIndia | #INDvENG | @ShreyasIyer15 | @IDFCFIRSTBank pic.twitter.com/JSAHGek6nK — BCCI (@BCCI) February 3, 2024 -
ప్లేయర్ ఆఫ్ ద మంత్ రేసులో మొత్తం యాషెస్ స్టార్లే.. ఒక్కరు మాత్రం..!
2023 జులై నెలకు గాను ఐసీసీ ఇవాళ (ఆగస్ట్ 7) ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ను ప్రకటించింది. ఈ జాబితాలో ఒక్కరు మినహా మొత్తం యాషెస్ 2023 స్టార్లే ఉండటం విశేషం. పురుషుల విభాగంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు జాక్ క్రాలే, క్రిస్ వోక్స్‌లతో పాటు నెదర్లాండ్స్ ఆల్‌రౌండర్ బాస్ డి లీడ్ నామినేట్ కాగా.. మహిళల విభాగంలో ఆసీస్ ప్లేయర్స్ ఆష్లే గార్డ్నర్, ఎల్లిస్ పెర్రీతో పాటు ఇంగ్లండ్ నాట్ సీవర్ బ్రంట్ నామినేట్ అయ్యింది. పై పేర్కొన్న జాబితాలో నెదర్లాండ్స్ బాస్ డి లీడ్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ అదరగొట్టగా.. మిగతా ఐదుగురు పురుషులు, మహిళల యాషెస్‌లో ఇరగదీసారు. శ్రీలంకలో జరిగిన వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో కనబర్చిన అత్యుత్తమ ఆల్‌రౌండ్ ప్రదర్శనకు (5/52, 123 (92)) గాను లీడ్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. క్రిస్ వోక్స్ (ఇంగ్లండ్).. యాషెస్ సిరీస్‌లో తొలి రెండు టెస్ట్‌లు మిస్ అయ్యి, మూడో టెస్ట్ నుంచి బరిలోకి దిగిన వోక్స్.. జులై నెలలో జరిగిన 3,4,5 యాషెస్ టెస్ట్‌ల్లో అద్భుతంగా రాణించి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు సైతం దక్కించుకున్నాడు. వోక్స్ జులైలో ఆడిన 3 మ్యాచ్‌ల్లో 18.15 సగటున 19 వికెట్లు పడగొట్టాడు. జాక్ క్రాలే (ఇంగ్లండ్).. జులైలో జరిగిన 2, 3, 4, 5 యాషెస్ టెస్ట్‌ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన క్రాలే.. ఈ నాలుగు టెస్ట్‌ల్లో 58.85 సగటున 412 పరుగులు చేశాడు. ఇందులో మాంచెస్టర్ టెస్ట్‌లో అతను చేసిన 189 పరుగుల ఇన్నింగ్స్, నిర్ణయాత్మక ఐదో టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో చేసిన 73 పరుగుల ఇన్నింగ్స్‌లు హైలైట్‌గా నిలిచాయి. ఆష్లే గార్డ్నర్ (ఆసీస్).. జూన్ నెల మహిళల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు విన్నర్ అయిన ఆష్లే గార్డ్నర్ జులైలో జరిగిన మ్యాచ్‌ల్లో 232 పరుగులతో పాటు 15 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు వరుసగా రెండో నెల కూడా నామినేట్ అయ్యింది. ఎల్లిస్ పెర్రీ (ఆసీస్).. పెర్రీ.. జులై నెలలో ఇంగ్లండ్, ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో బ్యాట్‌తో అద్భుతంగా రాణించి (4 మ్యాచ్‌ల్లో 276 పరుగులు) తొలిసారి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యింది. నాట్ సీవర్ బ్రంట్ (ఇంగ్లండ్).. మహిళల యాషెస్ సిరీస్‌లో భాగంగా జరిగిన 3 వన్డేల సిరీస్‌లో బ్రంట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. ఈ సిరీస్‌లో భాగంగా జులై నెలలో జరిగిన ఆఖరి 2 మ్యాచ్‌ల్లో ఈమె రెండు సెంచరీలు (111 నాటౌట్, 129) సాధించింది. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యింది. -
రూట్‌తో కలిసి చరిత్ర సృష్టించిన జాక్ క్రాలీ! అరుదైన రికార్డు బద్దలు
Ashes- 2023- England vs Australia, 4th Test: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీ అద్భుతం చేశాడు. బజ్‌బాల్ విధానానికి అర్థం చెబుతూ 182 బంతుల్లో 189 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 21 ఫోర్లు, 3 సిక్సర్లు ఉండటం విశేషం. మాంచెస్టర్‌లో వందకు పైగా స్ట్రైక్‌రేటుతో పరుగుల వరద పారించడం ద్వారా క్రాలీ వ్యక్తిగతంగా ఇప్పటికే ఎన్నో అరుదైన ఘనతలు సాధించాడు. ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన జో రూట్(84)తో కలిసి ఏకంగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. కాగా ఈ మ్యాచ్‌లో మొయిన్ అలీ(54)తో కలిసి రెండో వికెట్‌కు 121 పరుగులు జోడించిన క్రాలీ.. మాజీ సారథి జో రూట్‌తో కలిసి 206 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. అయితే, 178 బంతుల్లోనే ఈ మేరకు మూడో వికెట్‌కు భారీగా పరుగులు జోడించడం విశేషం. ఈ క్రమంలో క్రాలీ- రూట్ జోడీ వరల్డ్ రికార్డు సాధించింది. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ పార్ట్నర్షిప్ సాధించిన జంటగా నిలిచింది. ఈ క్రమంలో తమ సహచర ఆటగాళ్లు జానీ బెయిర్‌స్టో- బెన్‌స్టోక్స్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టింది. టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ పార్ట్నర్షిప్ నమోదు చేసిన జోడీలివే! 1.జాక్ క్రాలీ- జో రూట్: మాంచెస్టర్, 2023- ఆస్ట్రేలియా మీద 206(178) 2.జానీ బెయిర్‌స్టో- బెన్ స్టోక్స్: కేప్‌టౌన్, 2016- సౌతాఫ్రికా మీద- 399 (306) 3.ఆడం గిల్‌క్రిస్ట్- మాథ్యూ హెడెన్: పెర్త్, 2002- జింబాబ్వే మీద- 233 (203) 4.జాక్ క్రాలీ- బెన్ డకెట్- రావల్పిండి: 2022- పాకిస్తాన్ మీద- 233 (214) 5.జో బర్న్స్- డేవిడ్ వార్నర్- బ్రిస్బేన్: 2015- న్యూజిలాండ్ మీద- 237 (226) 6. ఏబీ డివిల్లియర్స్- గ్రేమ్ స్మిత్- కేప్‌టౌన్: 2005- జింబాబ్వే మీద- 217 (209). చదవండి: మొన్న రుతురాజ్ గైక్వాడ్.. ఇప్పుడు టీమిండియాకు మరో కొత్త కెప్టెన్! ఆసియా కప్-2023 ఫైనల్‌కు చేరిన పాకిస్తాన్.. A fourth Test century, coming in just 93 balls 💯 Take a bow, Zak Crawley! 👏 🏴 #ENGvAUS 🇦🇺 | @IGcom pic.twitter.com/25Nah8QBTh — England Cricket (@englandcricket) July 20, 2023 -
జాక్ క్రాలీ సంచలనం.. యాషెస్ చరిత్రలో మూడో ఇంగ్లండ్ బ్యాటర్‌గా
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్ తొలి రెండు టెస్టుల్లో ఓటమి పాలైనప్పటికి బజ్‌బాల్ దూకుడు మాత్రం వదల్లేమని తేల్చి చెప్పింది. మూడో టెస్టులో విజయం అందుకున్న ఇంగ్లండ్ ఎలాగైనా సిరీస్ కోల్పోకూడదనే పట్టుదలతో ఉంది. అందుకే మాంచెస్టర్ వేదికగా మొదలైన నాలుగో టెస్టులో ఇంగ్లండ్ మరోసారి బజ్‌బాల్ ఆటతీరును చూపించింది. ఒక్కరోజులోనే దాదాపు 400 పరుగులు మార్క్ అందుకునేలా కనిపించిన ఇంగ్లండ్ చివరకు రెండో రోజు ఆటను 4 వికెట్ల నష్టానికి 384 పరుగుల వద్ద ముగించింది. ఒకవేళ ఆసీస్ తొలి సెషన్ ఆరంభంలోనే ఔటయ్యి ఉంటే ఇంగ్లండ్ 400 పరుగులు మార్క్‌ను కూడా క్రాస్ చేసేదే. ఇక ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీ ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. వన్డే తరహాలో వేగంగా ఆడిన క్రాలీ తృటిలో డబుల్ సెంచరీ చేజార్చుకున్నప్పటికి 182 బంతుల్లో 189 పరుగులు చేశాడు. 93 బంతుల్లోనే శతకం మార్క్ సాధించిన క్రాలీ ఇన్నింగ్స్‌లో 21 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. అతనికి రూట్(95 బంతుల్లో 84 పరుగులు) జత కలవడంతో ఇంగ్లండ్ స్కోరు ఓవర్‌కు ఐదు పరుగుల రనరేట్కు తగ్గకుండా పరిగెత్తడం విశేషం. ఇక ఆస్ట్రేలియా బౌలర్లు కేవలం మూడు మెయిడెన్ ఓవర్లు మాత్రమే ఇచ్చుకున్నారంటే ఇంగ్లండ్ ఎంత ధాటిగా ఆడిందో అర్థం చేసుకోవచ్చు. ► ఈ క్రమంలో జాక్ క్రాలీ ఒక అరుదైన రికార్డు అందుకున్నాడు.యాషెస్ చరిత్రలో ఒక్క రోజు వ్యవధిలో అత్యధిక పరుగులు చేసిన మూడో ఇంగ్లండ్ బ్యాటర్‌గా జాక్ క్రాలీ నిలిచాడు. క్రాలీ ఈ మ్యాచ్‌లో 182 బంతుల్లో 189 పరుగులు చేశాడు. క్రాలీ కంటే ముందు టిప్ ఫోస్టర్(1902లో సిడ్నీ వేదికగా 214 పరుగులు) తొలి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో వాలీ హామండ్(1938లో లార్డ్స్ వేదికగా 210 పరుగులు) ఉన్నాడు.ఇక బాబ్ బార్బర్(1966లో సిడ్నీ వేదికగా 185 పరుగులు) నాలుగో స్థానంలో ఉన్నాడు. ► ఇక యాషెస్ టెస్టులో ఒక్క సెషన్లోనే సెంచరీ అందుకున్న ఆరో ఇంగ్లండ్ బ్యాటర్‌గా క్రాలీ రికార్డులకెక్కాడు. ► క్రాలీ స్ట్రైక్‌రేట్ 103 కాగా యాషెస్ చరిత్రలో ఇది రెండో బెస్ట్‌గా ఉంది. 103 స్ట్రైక్‌రేట్‌తో ఒక ఇన్నింగ్స్‌లో 150కి పైగా పరుగులు సాధించిన బ్యాటర్‌గా ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తో కలిసి క్రాలీ సంయుక్తంగా ఉన్నాడు. ► 93 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్న క్రాలీ యాషెస్ టెస్టులో వేగవంతంగా సెంచరీ సాధించిన నాలుగో ఇంగ్లండ్ బ్యాటర్‌గా నిలిచాడు. A fourth Test century, coming in just 93 balls 💯 Take a bow, Zak Crawley! 👏 🏴 #ENGvAUS 🇦🇺 | @IGcom pic.twitter.com/25Nah8QBTh — England Cricket (@englandcricket) July 20, 2023 చదవండి: 500వ మ్యాచ్‌లో రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లి -
టెస్ట్ క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని ఘట్టం
పాకిస్తాన్-ఇంగ్లండ్ జట్ల మధ్య రావల్పిండి వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ పలు ప్రపంచ రికార్డులకు వేదికైంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి రోజు అత్యధిక స్కోర్ (506/4) రికార్డుతో పాటు తొలి రోజు 500 పరుగుల సాధించిన తొలి జట్టుగా, తొలి సెషన్లో అత్యధిక పరుగులు (27 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 174 పరుగులు) చేసిన జట్టుగా ఇంగ్లండ్ టీమ్ పలు ప్రపంచ రికార్డులను తమ ఖాతాలో వేసుకుంది. వీటన్నిటికీ మించి తొలి రోజు ఏకంగా నలుగురు ఇంగ్లండ్ బ్యాటర్లు సెంచరీలు నమోదు చేశారు. ఇలా తొలి రోజు నలుగురు బ్యాటర్లు శతక్కొట్టడం టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే ప్రధమం. ఓపెనర్లు బెన్ డకెట్ (106 బంతుల్లో 101 నాటౌట్; 14 ఫోర్లు), జాక్ క్రాలే (106 బంతుల్లో 120 నాటౌట్; 21 ఫోర్లు), ఓలీ పోప్ (104 బంతుల్లో 108; 14 ఫోర్లు), హ్యారీ బ్రూక్ (81 బంతుల్లో 101 నాటౌట్) సెంచరీలతో విరుచుకుపడ్డారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్.. ఇంగ్లండ్ భారీ స్కోర్‌కు (657) ధీటుగా జవాబిస్తుంది. ఆ జట్టు ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్ (203 బంతుల్లో 114; 13 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇమామ్ ఉల్ హాక్ (207 బంతుల్లో 121; 15 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ బాబర్ ఆజమ్ (168 బంతుల్లో 136; 19 ఫోర్లు, సిక్స్) శతకాలతో విరుచుకుపడ్డారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో తొలి ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు సాధిస్తే.. పాక్ టాప్-4 బ్యాటర్లలో ముగ్గురు శతకొట్టారు. ఫలితంగా మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 499 పరుగులు చేసింది. కాగా, ఇదే టెస్ట్ మ్యాచ్‌లో పై పేర్కొన్న రికార్డులతో పాటు టెస్ట్ క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని ఓ అత్యంత అరుదైన రికార్డు నమోదైంది. ఓ టెస్ట్ మ్యాచ్‌లో ఇరు జట్లకు చెందిన ఓపెనర్లు (బెన్ డకెట్, జాక్ క్రాలే, అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హాక్) తొలి ఇన్నింగ్స్‌లో శతకాలు బాదడం ఇదే తొలిసారి. అలాగే ఓ టెస్ట్ మ్యాచ్‌లో తొలి వికెట్‌కు రెండు డబుల్ హండ్రెడ్ పార్ట్నర్షిప్లు నమోదు కావడం కూడా ఇదే తొలిసారి. 1948లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్-ఇంగ్లండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లకు చెందిన నలుగురు ఓపెనర్లు సెంచరీలు సాధించారు. అయితే, ఆ నలుగురు ఓపెనర్లలో ఒకరు రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించారు. -
Pak Vs Eng: పాక్‌కు దిమ్మతిరిగిపోయింది! టీమిండియా రికార్డు బద్దలు.. ఇంకా
Pakistan vs England, 1st Test: మ్యాచ్‌కు ముందు రోజు ఇంగ్లండ్ జట్టులోని పలువురు క్రికెటర్లు వైరల్ ఇన్ఫెక్షన్ బారిన పడటంతో... తొలి టెస్టు నిర్ణీత సమయానికి మొదలవుతుందో లేదోనని సందేహం. అయితే గురువారం ఉదయం గం. 7:30కు తుది జట్టులో ఆడేందుకు 11 మంది కోలుకున్నారని ఇంగ్లండ్ టీమ్ మేనేజ్మెంట్ పాకిస్తాన్ బోర్డుకు సమాచారం ఇచ్చింది. దాంతో నిర్ణీత సమయానికి ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య తొలి టెస్టు మొదలైన విషయం తెలిసిందే. అయితే.. ఇలా మ్యాచ్ మొదలయిందో లేదో ఇంగ్లండ్ జట్టు తొలి ఓవర్ నుంచే పరుగుల వరద పారించింది. టెస్టు మ్యాచ్‌లో టి20 మెరుపులను చూపించింది. జీవంలేని పిచ్‌పై పాక్ బౌలర్లు తేలిపోగా... ఇంగ్లండ్ జట్టులో ఏకంగా నలుగురు బ్యాటర్లు సెంచరీల మోత మోగించారు. ఫలితంగా 145 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో మ్యాచ్ రోజే అత్యధిక పరుగులు చేసిన జట్టుగా ఇంగ్లండ్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. England tour of Pakistan, 2022-Rawalpindi: 17 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ గడ్డపై టెస్టు ఆడేందుకు వచ్చిన ఇంగ్లండ్ ఎవ్వరూ ఊహించనిరీతిలో విధ్వంసం సృష్టించింది. గురువారం మొదలైన తొలి టెస్టులో తొలి రోజు ఆటలో ఇంగ్లండ్ బ్యాటర్ల ధాటికి పలు రికార్డులు బద్దలయ్యాయి. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా... వెలుతురు మందగించి తొలి రోజు ఆటను ముగించే సమయానికి ఇంగ్లండ్ 75 ఓవర్లలో 4 వికెట్లకు 506 పరుగులు సాధించింది. దంచికొట్టిన ఓపెనర్లు ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ (111 బంతుల్లో 122; 21 ఫోర్లు), బెన్ డకెట్ (110 బంతుల్లో 107; 15 ఫోర్లు), వన్‌డౌన్ బ్యాటర్ ఓలీ పోప్ (104 బంతుల్లో 108; 14 ఫోర్లు), మిడిలార్డర్లో హ్యారీ బ్రూక్ (81 బంతుల్లో 101 బ్యాటింగ్; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలు సాధించారు. హ్యారీ బ్రూక్‌తో కలిసి బెన్ స్టోక్స్ (15 బంతుల్లో 34; 6 ఫోర్లు, 1 సిక్స్) క్రీజులో ఉన్నాడు. జో రూట్ (31 బంతుల్లో 23; 3 ఫోర్లు) ఒక్కడే తక్కువ స్కోరుకు అవుటయ్యాడు. 73 ఫోర్లు, 3 సిక్స్‌లు వెలుతురు మందగించడంతో తొలి రోజు నిర్ణీత 90 ఓవర్లకు బదులు 75 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. పూర్తి కోటా ఓవర్లు వేసిఉంటే ఇంగ్లండ్ స్కోరు 600 దాటేది. తొలి రోజు ఇంగ్లండ్ బ్యాటర్లు 73 ఫోర్లు, 3 సిక్స్‌లు కొట్టడం విశేషం. ఈ మ్యాచ్‌తో పాక్ జట్టు తరఫున హారిస్ రవూఫ్, మొహమ్మద్ అలీ, సౌద్ షకీల్, జాహిద్ మొహమ్మద్... ఇంగ్లండ్ జట్టు తరఫున లివింగ్‌స్టోన్, విల్ జాక్స్ టెస్టుల్లో అరంగేట్రం చేశారు. మరి ఈ మ్యాచ్‌లో నమోదైన రికార్డులు పరిశీలిద్దామా?! ప్రపంచ రికార్డు రావల్పిండి టెస్టులో తొలి రోజు ఇంగ్లండ్ సాధించిన పరుగులు 506. 145 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో మ్యాచ్ తొలి రోజే ఏ జట్టూ 500 పరుగులు చేయలేదు. 1910లో సిడ్నీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో తొలి రోజు ఆస్ట్రేలియా 6 వికెట్లకు 494 పరుగులు సాధించింది. 112 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న ఈ రికార్డును గురువారం ఇంగ్లండ్ జట్టు బద్దలు కొట్టింది. ఇదే తొలిసారి టెస్ట్ మ్యాచ్ తొలి రోజే ఓ జట్టు తరఫున నలుగురు బ్యాటర్లు సెంచరీలు సాధించడం ఇదే ప్రథమం. జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, హ్యారీ బ్రూక్ కలిసి ఈ ఘనత సాధించారు. టీమిండియా రికార్డు బద్దలు పాక్‌తో తొలి టెస్టు తొలి సెషన్లో (లంచ్ సమయానికి) ఇంగ్లండ్ 27 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా చేసిన పరుగులు 178. గతంలో ఏ జట్టూ తొలి సెషన్లో ఇన్ని పరుగులు చేయలేదు. 2018లో అఫ్గానిస్తాన్‌తో బెంగళూరులో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో తొలి సెషన్లో భారత్ 27 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 158 పరుగులు చేసింది. ఈ రికార్డును ఇంగ్లండ్ సవరించింది. ఐదో క్రికెటర్‌గా ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో సౌద్ షకీల్ వేసిన 68వ ఓవర్లో హ్యారీ బ్రూక్ వరుసగా ఆరు ఫోర్లు కొట్టి ఈ ఘనత సాధించిన ఐదో క్రికెటర్‌గా నిలిచాడు. గతంలో సందీప్ పాటిల్ (భారత్; 1982లో బాబ్ విల్లిస్ (ఆస్ట్రేలియా) బౌలింగ్‌లో), గేల్ (విండీస్;20 04లో హోగార్డ్ (ఇంగ్లండ్) బౌలింగ్), శర్వాణ్ (వెస్టిండీస్; 2006లో మునాఫ్ పటేల్ (భారత్) బౌలింగ్‌లో), జయసూర్య (శ్రీలంక; 2007లో అండర్సన్ (ఇంగ్లండ్) బౌలింగ్‌లో) ఈ ఘనత సాధించారు. చదవండి: IND vs BAN: టీమిండియాతో వన్డే సిరీస్.. బంగ్లాదేశ్‌కు ఊహించని షాక్! ఇక అంతే సంగతి BCCI Chief Selector:టీమిండియా చీఫ్ సెలక్టర్ రేసులో మాజీ స్పీడ్ స్టర్..! Harry Brook gets to his first 💯 in his second Test #PAKvENG | #UKSePK pic.twitter.com/fE7u8IeYm5 — Pakistan Cricket (@TheRealPCB) December 1, 2022 Given out on review ☝️ Mohammad Ali has his first Test scalp 👏#PAKvENG | #UKSePK pic.twitter.com/eGXqxedHmB — Pakistan Cricket (@TheRealPCB) December 1, 2022 The century moment for Ollie Pope 👍#PAKvENG | #UKSePK pic.twitter.com/fwv0r0QgMS — Pakistan Cricket (@TheRealPCB) December 1, 2022 -
టెస్ట్ మ్యాచా లేక టీ20నా.. ఇంగ్లండ్ బ్యాటర్ల మహోగ్రరూపం, ఒకే రోజు నలుగురు సెంచరీలు
3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు 17 ఏళ్ల సుదర్ఘీ విరామం తర్వాత పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ క్రికెట్ జట్టు.. రావల్పిండి వేదికగా ఇవాళ (డిసెంబర్ 1) మొదలైన తొలి టెస్ట్‌లో పరుగుల వరద పారించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆ టీమ్.. టీ20 తరహాలో బ్యాటింగ్ చేసి రికార్డు స్కోర్ సాధించింది. ఏకంగా నలుగురు బ్యాటర్లు శతకాలు సాధించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 506 పరుగుల అత్యంత భారీ స్కోర్ నమోదు చేసింది. తొలి రోజు 75 ఓవర్ల పాటు ఆట సాగగా.. ఇంగ్లండ్ బ్యాటర్లు 6.75 రన్‌రేట్ చొప్పున పరుగులు పిండుకున్నారు. ఇంగ్లండ్ బ్యాటర్ల మహోగ్రరూపం ధాటికి విలవిలలాడిపోయిన పాక్ బౌలర్లు ప్రేక్షక పాత్రకు పరిమతమయ్యారు. ఓపెనర్లు బెన్ డకెట్ (106 బంతుల్లో 101 నాటౌట్; 14 ఫోర్లు), జాక్ క్రాలే (106 బంతుల్లో 120 నాటౌట్; 21 ఫోర్లు), ఓలీ పోప్ (104 బంతుల్లో 108; 14 ఫోర్లు), హ్యారీ బ్రూక్ (81 బంతుల్లో 101 నాటౌట్) సెంచరీలతో విరుచుకుపడ్డారు. సెంచరీకి ముందు హ్యారీ బ్రూక్.. సౌద్ షకీల్ వేసిన ఇన్నింగ్స్ 68వ ఓవర్లో 6 బౌండరీలు బాదగా.. ఆట కాసేపట్లో ముగుస్తుందనగా కెప్టెన్ స్టోక్స్ (15 బంతుల్లో 34 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్) పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఒక్క రూట్ (31 బంతుల్లో 23; 3 ఫోర్లు) మినహాయించి అందరూ టీ20ల్లోలా రెచ్చిపోయారు. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసిన వారికి కచ్చితంగా టీ20 మ్యాచ్ చూసిన అనుభూతే కలిగి ఉంటుంది. పాక్ బౌలర్లలో మహ్మద్ అలీ (5.6) మినహా అందరూ 6కు పైగా ఎకనామీతో పరుగులు సమర్పించుకున్నారు. రెండో రోజు ఆటలో ఇంగ్లండ్ బ్యాటర్లను ఆపడం పాక్ బౌలర్లకు సాధ్యమవుతుందో లేదో వేచి చూడాలి. -
శతకాలతో చెలరేగిన ఇంగ్లండ్ ఓపెనర్లు.. పాక్ బౌలర్లకు చుక్కలు
3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు 17 ఏళ్ల సుదర్ఘీ విరామం తర్వాత పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ క్రికెట్ టీమ్.. రావల్పిండి వేదికగా ఇవాళ (డిసెంబర్ 1) మొదలైన తొలి టెస్ట్‌లో పరుగుల వరద పారిస్తుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లండ్ భారీ స్కోర్ దిశగా పయనిస్తుంది. ఓపెనర్లు బెన్ డకెట్ (106 బంతుల్లో 101 నాటౌట్; 14 ఫోర్లు), జాక్ క్రాలే (106 బంతుల్లో 120 నాటౌట్; 21 ఫోర్లు) సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరూ వన్డేల తరహాలో బ్యాటింగ్ చేస్తూ పాక్ బౌలర్లను చుక్కలు చూపిస్తున్నారు. 35 ఓవర్ల తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ స్కోర్ 227/0గా ఉంది. పాక్ బౌలర్లు ఎంత ప్రయత్నించినా ఒక్క వికెట్ కూడా దక్కంచుకోలేకపోయారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్ టీమ్‌లో గుర్తు తెలియని వైరస్ కలకలం రేపిన విషయం తెలిసిందే. కెప్టెన్ బెన్ స్టోక్స్ సహా 14 మంది ఆటగాళ్లు వైరస్ బారిన పడి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, కీటన్ జెన్నింగ్స్, ఓలీ పోప్, జోరూట్ మినహా ఆటగాళ్లంతా వైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది. అయితే అస్వస్థతను జయించి బెన్ డకెట్ సెంచరీ సాధించడం విశేషం. డకెట్‌కు ఇది టెస్ట్‌ల్లో తొలి శతకం.