Ashes 2023 4th Test: Zak Crawley And Joe Root Create History With 206 Run Partnership, Video Viral - Sakshi
Sakshi News home page

Crawley And Joe Root Partnership Record: రూట్‌తో కలిసి ప్రపంచ రికార్డు సృష్టించిన జాక్‌ క్రాలీ! అత్యంత వేగంగా..

Published Fri, Jul 21 2023 7:11 PM | Last Updated on Fri, Jul 21 2023 7:38 PM

Ashes 2023 4th Test: Zak Crawley Root Create History With 206 Run Partnership - Sakshi

Ashes- 2023- England vs Australia, 4th Test: యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ జాక్‌ క్రాలీ అద్భుతం చేశాడు. బజ్‌బాల్‌ విధానానికి అర్థం చెబుతూ 182 బంతుల్లో 189 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 21 ఫోర్లు, 3 సిక్సర్లు ఉండటం విశేషం. మాంచెస్టర్‌లో వందకు పైగా స్ట్రైక్‌రేటుతో పరుగుల వరద పారించడం ద్వారా క్రాలీ వ్యక్తిగతంగా ఇప్పటికే ఎన్నో అరుదైన ఘనతలు సాధించాడు.

ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేసిన జో రూట్‌(84)తో కలిసి ఏకంగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. కాగా ఈ మ్యాచ్‌లో మొయిన్‌ అలీ(54)తో కలిసి రెండో వికెట్‌కు 121 పరుగులు జోడించిన క్రాలీ.. మాజీ సారథి జో రూట్‌తో కలిసి 206 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు.

అయితే, 178 బంతుల్లోనే ఈ మేరకు మూడో వికెట్‌కు భారీగా పరుగులు జోడించడం విశేషం. ఈ క్రమంలో క్రాలీ- రూట్‌ జోడీ వరల్డ్‌ రికార్డు సాధించింది. టెస్టు క్రికెట్‌ చరిత్రలో అత్యంత వేగంగా డబుల్‌ సెంచరీ పార్ట్‌నర్‌షిప్‌ సాధించిన జంటగా నిలిచింది. ఈ క్రమంలో తమ సహచర ఆటగాళ్లు జానీ బెయిర్‌స్టో- బెన్‌స్టోక్స్‌ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టింది.

టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా డబుల్‌ సెంచరీ పార్ట్‌నర్‌షిప్‌ నమోదు చేసిన జోడీలివే!
1.జాక్‌ క్రాలీ- జో రూట్‌: మాంచెస్టర్‌, 2023- ఆస్ట్రేలియా మీద 206(178)
2.జానీ బెయిర్‌స్టో- బెన్‌ స్టోక్స్‌: కేప్‌టౌన్‌, 2016- సౌతాఫ్రికా మీద- 399 (306)
3.ఆడం గిల్‌క్రిస్ట్‌- మాథ్యూ హెడెన్‌: పెర్త్‌, 2002- జింబాబ్వే మీద- 233 (203)

4.జాక్‌ క్రాలీ- బెన్‌ డకెట్‌- రావల్పిండి: 2022- పాకిస్తాన్‌ మీద- 233 (214)
5.జో బర్న్స్‌- డేవిడ్‌ వార్నర్‌- బ్రిస్బేన్‌:  2015- న్యూజిలాండ్‌ మీద- 237 (226)
6. ఏబీ డివిల్లియర్స్‌- గ్రేమ్‌ స్మిత్‌- కేప్‌టౌన్‌: 2005- జింబాబ్వే మీద- 217 (209).

చదవండి: మొన్న రుతురాజ్‌ గైక్వాడ్‌.. ఇప్పుడు టీమిండియాకు మరో కొత్త కెప్టెన్‌!
ఆసియా కప్‌-2023 ఫైనల్‌కు చేరిన పాకిస్తాన్‌..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement