బర్మింగ్‌హమ్: టెస్టు క్రికెట్‌ను కొత్త పుంతలు తొక్కిస్తున్న ఇంగ్లండ్ జట్టు మరో కొత్త సాహసాన్ని ప్రదర్శించింది. ‘బాజ్‌బాల్’ అంటూ దూకుడైన ఆటను ప్రదర్శిస్తూ వచి్చన ఆ జట్టు యాషెస్ సిరీస్‌లోనూ తమ శైలిని చూపించింది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్, టాప్ బ్యాటర్ ఒకరు అజేయ సెంచరీతో ఇంకా క్రీజ్‌లోనే ఉన్నా మొదటి రోజే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి ఆశ్చర్యపర్చింది. ఆ్రస్టేలియాతో శుక్రవారం ప్రారంభమైన మొదటి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌ను ఇంగ్లండ్ 8 వికెట్ల నష్టానికి 393 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.
జో రూట్ (152 బంతుల్లో 118 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) కెరీర్‌లో 30వ సెంచరీతో చెలరేగాడు. జానీ బెయిర్‌స్టో (78 బంతుల్లో 78; 5 ఫోర్లు), జాక్ క్రాలీ (73 బంతుల్లో 61; 7 ఫోర్లు) కీలక అర్ధ సెంచరీలు సాధించారు. ‘యాషెస్’లో రూట్‌కు ఇది నాలుగో సెంచరీ కాగా... 2015 తర్వాత మొదటిది. రూట్, బెయిర్‌స్టో ఆరో వికెట్‌కు 121 పరుగులు జోడించారు.
78 ఓవర్లే ఆడిన ఇంగ్లండ్ ఓవర్‌కు 5.03 రన్‌రేట్‌తో పరుగులు సాధించడం విశేషం. ఆసీస్ బౌలర్లలో లయన్‌కు 4 వికెట్లు దక్కాయి. అయితే ఇంగ్లండ్ ఆశించినట్లుగా వికెట్ మాత్రం దక్కలేదు. 4 ఓవర్లే ఆడిన ఆ్రస్టేలియా ఆట ముగిసే సమయానికి వికెట్ కోల్పోకుండా 14 పరుగులు చేసింది. ఇంగ్లండ్ డిక్లరేషన్ ఎత్తుగడ ఎలాంటి ఫలితాన్నిస్తుందనేది ఇప్పుడే చెప్పలేకపోయినా... ఆస్ట్రేలియా పట్టుదలగా రెండు రోజులు బ్యాటింగ్ చేసి భారీ స్కోరు సాధిస్తే మాత్రం ఇంగ్లండ్‌కు ఇబ్బందులు తప్పవు.
చదవండి: షేన్ వార్న్ బయోపిక్.. శృంగార సన్నివేశం చేస్తూ ఆస్పత్రిపాలు
Comments
Please login to add a commentAdd a comment