Bazball Cricket
-
బజ్ బాల్ బద్దలైంది.. అతడే ఇంగ్లండ్ కొంపముంచాడు: సెహ్వాగ్
భారత పర్యటనను ఇంగ్లండ్ జట్టు ఘోర ఓటమితో ముగించింది. ధర్మశాల వేదికగా జరిగిన ఐదో టెస్టులో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. బాజ్ బాల్ అంటూ వీరవీగ్రుతన్న ఇంగ్లండ్ జట్టు ఆఖరి టెస్టులో కనీస పోటీ ఇవ్వలేకపోయింది. భారత దెబ్బకు ఇంగ్లండ్ బజ్ బాల్ పగిలిపోయింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్ 1-4 తేడాతో భారత్‌కు సమర్పించుకుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ బజ్ బాల్ విధానంపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శల వర్షం కురిపించాడు. "భారత్ దెబ్బకు ఇంగ్లండ్ బాజ్ బాల్ బద్దలైంది. వారు ఆప్రోచ్ సరైనది కాదు. పిచ్చికి కూడా ఓ పద్దతి ఉంటుంది. ఇంగ్లండ్ తమ స్ధాయికి తగ్గట్టు ఆడలేకపోయింది. రెండో టెస్టు ఓటమి తర్వాత ఇంగ్లండ్ జట్టు పూర్తిగా తేలిపోయింది. కెప్టెన్ స్టోక్స్ విఫలమవడం వారి కష్టాలను మరింత రెట్టింపు చేసింది. ఇంగ్లండ్ ఇంకా బజ్‌బాల్ భ్రమలోనే ఉన్నారు. వారు ఈ విధానంతోనే విజయవంతం కావాలంటే ఒక పద్దతి, ప్రణాళిక ఉండాలని" ఎక్స్‌లో సెహ్వాగ్ రాసుకొచ్చాడు. -
Rohit Sharma: స్టోక్స్‌కు ఇదే తొలిసారి.. రోహిత్ రికార్డులివే!
విరాట్ కోహ్లి, మహ్మద్ షమీ.. కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా వంటి కీలక ఆటగాళ్లు జట్టులో లేకున్నా యువ జట్టుతో టీమిండియాకు అద్భుత విజయం అందించాడు కెప్టెన్ రోహిత్ శర్మ. విరాట్, షమీ సిరీస్ మొత్తానికి.. గాయం కారణంగా రాహుల్ రెండో టెస్టు నుంచి జట్టుకు దూరం కాగా... నాలుగో టెస్టులో బుమ్రాకు విశ్రాంతినిచ్చారు. ఈ నేపథ్యంలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు మినహా అంతగా అనుభవంలేని జట్టుతో బరిలోకి దిగిన టీమిండియా.. నాలుగో టెస్టులో ఘన విజయం సాధించింది. ఆద్యంతం ఆసక్తిరేపిన ఈ రసవత్తర మ్యాచ్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్, శుబ్‌మన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్‌లో గెలుపొందింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మరో టెస్టు మిగిలి ఉండగానే సిరీస్‌ను 3-1తో గెలిచింది. సొంతగడ్డపై వరుసగా పదిహేడవ సిరీస్ విజయం సాధించింది. బజ్‌బాల్ యుగంలో తొలి కెప్టెన్‌గా ఘనత దీనికంతటికి రోహిత్ శర్మ నాయకత్వ ప్రతిభే కారణమంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. ‘బజ్‌బాల్’ యుగంలో ఇంగ్లండ్‌ను వరుసగా మూడు మ్యాచ్‌లలో ఓడించిన కెప్టెన్, బెన్ స్టోక్స్‌కు తొలి సిరీస్ పరాజయం పరిచయం చేసిన సారథి(ROHIT SHARMA BECOMES THE FIRST CAPTAIN TO WIN A TEST SERIES AGAINST BAZBALL ERA)గా అరుదైన ఫీట్ నమోదు చేశాడంటూ అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తొమ్మిది వేల పరుగులు పూర్తి చేసి ఇదిలా ఉంటే.. రాంచి టెస్టు సందర్భంగా రోహిత్ శర్మ వ్యక్తిగతంగా అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో తొమ్మిది వేల పరుగుల మార్కును అందుకున్నాడు. కాగా ఇంగ్లండ్‌తో శుక్రవారం మొదలైన నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ పూర్తిగా విఫలమయ్యాడు. కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. అయితే, మ్యాచ్ ఫలితాన్ని తేల్చే కీలకమైన రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం విలువైన అర్ధ శతకం(55) బాదాడు రోహిత్. తద్వారా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 9 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు రోహిత్ శర్మ. అదే విధంగా టెస్టు మ్యాచ్‌లో నాలుగు వేల రన్స్‌కు పైగా స్కోరు చేశాడు. తద్వారా ఈ ఘనత సాధించిన 17వ భారత బ్యాటర్‌గా నిలిచాడు. అంతేకాదు.. ఇంగ్లండ్‌పై వెయ్యి పరుగుల మార్కును కూడా దాటేశాడు హిట్‌మ్యాన్. చదవండి: Virat Kohli: టీమిండియా గెలుపుపై స్పందించిన కోహ్లి.. పోస్ట్ వైరల్ -
దుబాయ్ ట్రిప్ కొంపముంచిందా?.. బజ్‌బాల్ భయపడిందా?
బజ్‌బాల్ అంటూ విర్రవీగిన ఇంగ్లండ్ జట్టుకు టీమిండియా భయాన్ని పరిచయం చేసింది. గత కొంతకాలంగా ప్రత్యర్ధి జట్టుతో సంబంధం లేకుండా సంప్రాదాయ క్రికెట్ రూపురేఖలను మార్చేసిన ఇంగ్లీష్ జట్టు.. భారత్ ముందు మాత్రం తలవంచింది. సిరీస్ విజయమే లక్ష్యంగా భారత గడ్డపై అడుగపెట్టిన ఇంగ్లండ్.. తొలి మ్యాచ్‌లో గెలుపొంది తామే టెస్టు క్రికెట్ రారాజులమని చెప్పకనే చెప్పింది. కానీ ప్రత్యర్ధి ఎవరన్నది ఇంగ్లండ్ మర్చిపోయింది. అదే ఇంగ్లండ్ చేసిన పెద్ద తప్పు. రెండో టెస్టులో దెబ్బతిన్న సింహంలా భారత్ పంజా విసిరింది. వైజాగ్ టెస్టులో పర్యాటక జట్టును టీమిండియా చిత్తు చేసింది. విధ్వంసం సృష్టించే ఇంగ్లండ్ ఆటగాళ్ల బ్యాట్లు మూగబోయాయి. భారత పేస్ గుర్రం బుమ్రా దాటికి ఇంగ్లండ్ బ్యాటర్లు గజగజలాడారు. ప్రత్యర్ధి కెప్టెన్ బెన్ స్టోక్స్ సైతం బుమ్రా బౌలింగ్‌కు ఫిదా అయిపోయాడు. అయితే తొలి రెండు టెస్టులు ఒక లెక్క.. రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టెస్టు ఒక లెక్క. రాజ్‌కోట్‌లో రారాజు.. ఇంగ్లండ్ జట్టుకు రాజ్‌కోట్ టెస్టు ఎప్పటికి గుర్తిండిపోతుంది. టీమిండియా దెబ్బకు గత 90 ఏళ్లలో ఎన్నడూ చూడని ఓటమిని ఇంగ్లండ్ చవిచూసింది. 550 పరుగుల పైగా లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు ఏ దశలోనూ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. అస్సలు మనం చూస్తుంది ఇంగ్లండ్ జట్టునేనా అన్నట్లు ఇన్నింగ్స్ సాగింది. భారత స్పిన్ వ్యూహంలో చిక్కుకుని ఇంగ్లీష్ బ్యాటర్లు విల్లావిల్లాడారు. జడేజా, కుల్దీప్ యాదవ్ స్పిన్ దాటికి ఇంగ్లండ్ కేవలం 122 పరుగులకే కుప్పకూలింది. ఎక్కడో లోయార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన మార్క్ వుడ్(33) మినహా.. ఏ ఒక్క ఇంగ్లీష్ ఆటగాడు కూడా భారత బౌలర్లకు ఎదురుతిరగలేదు. గెలుపు విషయం పక్కన పెడితే కనీసం డ్రా అయినా చేసుకుందమన్న భావన ఏ ఒక్కరిలోనూ కన్పించలేదు. క్రీజులో కంటే డ్రెస్సింగ్ రూమ్‌లో ఉంటే బెటర్ అన్నట్లు వరుస క్రమంలో పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఎప్పుడో 1934లో టెస్టు క్రికెట్లో పరుగుల పరంగా ఘోర ఓటమిని చూవిచూసిన ఇంగ్లండ్‌కు.. మళ్లీ ఇప్పుడు భారత్ పుణ్యాన ఘోర పరభావాన్ని చవిచూసింది. కచ్చితంగా ఈ ఓటమిపై ఇంగ్లండ్ జట్టుతో పాటు మేనెజ్మెంట్ ఆత్మ పరిశీలిన చేసుకోవాలి. చిత్తుగా ఓడిన ఇంగ్లండ్ జట్టుపై ఆ దేశ మాజీలు, మీడియా సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. టెస్టు క్రికెట్‌కు వైట్‌బాల్ క్రికెట్ తేడా ఉంటుందన్న విషయాన్ని ఇంగ్లండ్ ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిదని అభిప్రాయపడుతున్నారు. బౌలింగ్‌లోనూ అదే కథ.. ఇంగ్లండ్‌కు బ్యాటింగ్ ఎంతో బలమో.. బౌలింగ్ కూడా అంతే బలం. జేమ్స్ ఆండర్సన్, మార్క్ వుడ్ వంటి పటిష్టమైన బౌలింగ్ విభాగం సైతం చేతులేత్తేసింది. ముఖ్యంగా వరల్డ్‌క్లాస్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ అయితే గల్లీ బౌలర్ కంటే దారుణంగా విఫలమయ్యాడు. టెస్టుల్లో దాదాపు 700 వికెట్లు పడగొట్టిన అండర్సన్‌ను 22 ఏళ్ల యువ ఆటగాడు జైశ్వాల్ ఊచకోత కోశాడు. భారత సెకెండ్ ఇన్నింగ్స్‌లో 13 ఓవర్లు వేసిన అండర్సన్.. 6 ఏకానమితో 78 పరుగులు సమర్పించుకున్నాడు. అతడితో పాటు మరో స్పీడ్ స్టార్ మార్క్ వుడ్ది కూడా అదే పరిస్థితి. వుడ్ కూడా తన మార్క్‌ను చూపించలేకపోయాడు. సర్ఫరాజ్ ఖాన్ వుడ్‌కు చుక్కలు చూపించాడు. ఇక స్పిన్నర్ల విషయానికి వస్తే.. అరంగేట్ర టెస్టులోనే తన స్పిన్ మాయాజాలంతో అకట్టుకున్న టామ్ హార్ట్లీ తర్వాతి మ్యాచ్‌ల్లో భారత బ్యాటర్ల ముందు దాసోహం అయ్యాడు. అడపదడపా వికెట్లు పడగొట్టి దారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. మరో స్పిన్నర్ రెహాన్ అహ్మద్ ఇంగ్లండ్ జట్టులో ఎందుకు ఉన్నాడో అర్దం కావడం లేదు. తొలి టెస్టులో కాస్త పర్వాలేదన్పించిన అహ్మద్.. ఆఖరి రెండు టెస్టుల్లో మాత్రం కనీస ప్రభావం చూపలేకపోయాడు. వికెట్లు విషయం పక్కన పెడితే పరుగులు కట్టడి చేయడంలో కూడా అహ్మద్ విఫలమయ్యాడు. అయితే సీనియర్ స్పిన్నర్ జాక్ లీచ్ లేని లోటు ఇంగ్లండ్ జట్టులో సృష్టంగా కన్పిస్తోంది. ఇక రాంఛీ వేదికగా జరగనున్న నాలుగో టెస్టులో ఇంగ్లీష్ జట్టు ఏ మెరకు పుంజుకుంటుందో మరి చూడాలి. దుబాయ్ ట్రిప్ కొంపముంచిందా? కాగా మూడో టెస్టుకు ముందు ఇంగ్లండ్ జట్టుకు పది రోజుల విశ్రాంతి లభించింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ జట్టు రీ ఫ్రెష్మెంట్ పేరిట దుబాయ్‌కు పయనమైంది. ఇదే ఇంగ్లండ్ కొంపముంచిందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఆ గ్యాప్‌లో భారత్‌లోనే ఉండి ప్రాక్టీస్ చేసి ఉంటే పరిస్ధితి మరో విధంగా ఉండేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మూడో టెస్టుకు కేవలం ఒక్కరోజు ముందే రాజ్‌కోట్‌కు చేరుకున్న ఇంగ్లండ్ జట్టు హడావుడిగా బరిలోకి దిగింది. కనీసం ప్రాక్టీస్ లేకుండానే ఆడిన ఇంగ్లండ్‌కు సరైన గుణపాఠం భారత్ చెప్పింది. ఇంతకుముందు ఏ పర్యటక జట్టు కూడా భారత్‌కు వచ్చి విశ్రాంతి పేరిట బయటకు వెళ్లింది లేదు. ఇంగ్లండ్ మాత్రం ఈ కొత్త సంప్రదాయానికి తెరలేపింది. -
భారత్ కొంపముంచిన బజ్ బాల్...!
-
బజ్‌బాల్ ఆడితే మాకే మంచిది.. రెండు రోజుల్లోనే మ్యాచ్ ఖతం చేస్తాం: సిరాజ్
భారత్- ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు హైదరాబాద్ వేదికగా గురువారం(జనవరి 25) ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు తమ ఆస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. ఇంగ్లండ్ అయితే మ్యాచ్‌కు ఒక రోజే ముందే తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది. అనూహ్యంగా ఇంగ్లీష్ జట్టు కేవలం ఒకే ఒక స్పెషలిస్ట్ పేస్ బౌలర్‌తో బరిలోకి దిగుతోంది. తొలి టెస్టుకు వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ దూరమయ్యాడు. స్పీడ్ స్టార్ మార్క్ వుడ్‌కు తుది జట్టులో ఇంగ్లండ్ మేనెజ్మెంట్ ఛాన్స్ ఇచ్చింది. ఇక మొదటి టెస్టుకు ముందు ఇంగ్లండ్ బజ్‌బాల్ క్రికెట్‌ను ఉద్దేశించి భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్ వంటి ఉపఖండ పరిస్థితులలో బాజ్‌బాల్ విధానాన్ని ఎంచుకుంటే ఇంగ్లీష్ జట్టుకు కష్టాలు తప్పవు అని సిరాజ్ హెచ్చరించాడు. "ఒక వేళ ఇంగ్లండ్ భారత పరిస్థితుల్లో బజ్‌బాల్ ఆడేందుకు ప్రయత్నిస్తే మ్యాచ్ ఒకటిన్నర రోజు లేదా రెండు రోజుల్లోనే ముగుస్తుంది. ఉపఖండంలో ఉన్న పిచ్‌లపై ప్రతి బంతిని బాదడం కుదరదు. బంతి కొన్నిసార్లు ఎక్కువగా టర్న్ అవుతోంది. మరి కొన్ని సార్లు స్ట్రైట్‌గా వస్తోంది. కాబట్టి ఇంగ్లండ్ బజ్ బాల్ ఆడితే మాకే మంచిది. ఎందుకంటే మ్యాచ్ త్వరగా ముగుస్తుందని" జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిరాజ్ పేర్కొన్నాడు. -
'బజ్‌బాల్‌తో నాకు సంబంధం లేదు.. ఏమి చేయాలో నాకు తెలుసు'
జనవరి 25 నుంచి హైదరాబాద్ వేదికగా ప్రారంభం కానునున్న భారత్ - ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టుకు సర్వం సిద్దమైంది. ఇప్పటికే భాగ్యనగరానికి చేరుకున్న ఇరు జట్లు ప్రాక్టీస్‌లో మునిగి తేలుతున్నాయి. ఇరు జట్లు కూడా విజయంతో సిరీస్‌ను ఆరంభించాలని ఊవ్విళ్లరూతున్నాయి. సొంతగడ్డపై టెస్టుల్లో ఇంగ్లండ్‌పై భారత్‌కు మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య భారత్ వేదికగా 16 సిరీస్‌లు జరగగా.. టీమిండియా 10 సిరీస్‌లలో విజయం సాధించగా, ఇంగ్లండ్ ఐదింట గెలుపొందింది. భారత గడ్డపై ఇంగ్లండ్ చివరగా టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. అయితే ఇటీవల కాలంలో ఇంగ్లండ్ టెస్టుల్లో బజ్‌బాల్ క్రికెట్ ఆడి ప్రత్యర్ది జట్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. టెస్టు క్రికెట్‌ను టీ20 మాదిరిగా ఆడుతున్న ఇంగ్లీష్ జట్టు నుంచి రోహిత్ సేనకు గట్టిపోటీ ఎదురుకానుంది. తాజాగా ఇంగ్లండ్ బాజ్‌బాల్‌పై టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్పందించాడు. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ బాజ్బాల్ను ఎదుర్కొనేందుకు తను సిద్దంగా ఉన్నాని బుమ్రా తెలిపాడు. "ఇంగ్లండ్ బజ్‌బాల్‌ను నేను పరిగణలోకి తీసుకోవడం లేదు. వారిని అడ్డుకోవడానికి ఎటువంటి వ్యూహాలు రచించడం లేదు. కానీ ఇంగ్లండ్ మాత్రం ఇటీవల కాలంలో అద్బుతమైన క్రికెట్ ఆడుతున్నారు. టెస్టు ఫార్మాట్లో దూకుడుగా ఆడి ప్రత్యర్ది జట్లపై పైచేయి సాధించారు. టెస్టు క్రికెట్‌ను ఈ విధంగా కూడా ఆడవచ్చని ప్రపంచానికి ఇంగ్లీష్ జట్టు చూపించింది. అయితే ఒక బౌలర్‌గా ఇంగ్లండ్‌పై పై చేయి సాధిస్తానని అనుకుంటున్నాను. ఎందుకంటే వారు దూకుడుగా ఆడి నన్ను అలసటకు గురి చేయలేరు. అందువల్ల నాకు ఎక్కువగా వికెట్లు తీసే ఛాన్స్ ఉంటుంది. మైదానంలోకి దిగిన ప్రతిసారి పరిస్థితులను నాకు అనుకూలంగా ఎలా మలచుకోవాలి అనేదాని గురించి ఎక్కువ ఆలోచిస్తానని" ది గార్డియన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బుమ్రా పేర్కొన్నాడు. చదవండి: AUS vs WI: పీకల దాకా తాగి ఆసుపత్రి పాలైన మాక్స్వెల్.. -
'భారత పిచ్‌లపై బజ్‌బాల్ ఆడడం అంత సులువు కాదు'
బజ్‌బాల్ ఆటతీరుతో ఇంగ్లండ్ దూకుడు మీదున్న సంగతి తెలిసిందే. కోచ్ బ్రెండన్ మెకల్లమ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ వచ్చిన తర్వాత ఈ బజ్‌బాల్ స్టైల్ తో ప్రత్యర్థులను భయపెడుతోంది ఇంగ్లండ్ టీమ్. తమ చివరి 17 టెస్టుల్లో 12 మ్యాచ్ లను గెలిచింది. ఇదే బజ్‌బాల్‌తో ఇటీవలే ఆస్ట్రేలియాతో ముగిసిన యాషెస్ టెస్టు సిరీస్‌ను ఇంగ్లండ్ 2-2తో సమం చేసింది. అయితే ఆసీస్‌తో సిరీస్‌లో ఓటములు ఎదురైనా బజ్‌బాజ్ ఆటను ఆపబోయేది లేదని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కుండబద్దలు కొట్టాడు. యాషెస్ సిరీస్‌ను 2-2తో సమం చేసినప్పటికి స్లో ఓవర్ రేట్ కారణంగా డబ్ల్యూటీసీ పాయింట్స్‌లో భారీగా కోత పడింది. దీంతో ఇంగ్లండ్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి పడిపోయింది. ఇక వచ్చే ఏడాది జనవరి వరకు ఇంగ్లండ్‌కు మళ్లీ టెస్టు సిరీస్‌లు లేవు. జనవరి-ఫిబ్రవరి నెలలో టీమిండియాకు రానున్న ఇంగ్లండ్ ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. భారత గడ్డపై కూడా బజ్‌బాల్ దూకుడును కంటిన్యూ చేస్తామని స్టోక్స్ ధీమా వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్పేన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్ బజ్‌బాల్ ఆటకు అసలు పరీక్ష భారత్‌లో ఎదురు కాబోతోందని అభిప్రాయపడ్డాడు. ఎక్కువగా స్పిన్ ట్రాక్లుండే భారత పిచ్‌లపై బజ్‌బాల్ స్టైల్ ఆలోచించడానికే కొంత ఆసక్తికరంగా ఉందన్నాడు. నాసిర్ హుస్సేన్ మాట్లాడుతూ.."బజ్‌బాల్ తర్వాతి పరీక్ష ఇండియాలోనే. భారత్ పిచ్‌ల గురించి అందరికీ తెలుసు. ఇండియాలో టెస్ట్ క్రికెట్ ఆడడం ప్రత్యర్థి దేశాలకు కఠినంగా ఉంటుంది. స్పిన్ పిచ్‌లపై బజ్‌బాల్ ప్రయోగం ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది చెప్పలేం. అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ లాంటి టాప్ క్లాస్ స్పిన్నర్లు ఉన్న టీమిండియా బౌలింగ్‌తో ఇంగ్లండ్ బజ్‌బాల్ ఆడటం అంటే మాటలు కాదు. పరిస్థితి తారుమారు అయితే ఇంగ్లండ్ ఆడాల్సిన బజ్‌బాల్‌ను టీమిండియా ఆడినా ఆశ్చర్యపోనవసరం లేదు."అని పేర్కొన్నాడు. ఇక వచ్చే ఏడాది జనవరి 29 నుంచి హైదరాబాద్, వైజాగ్, రాంచీ, రాజ్‌కోట్, ధర్మశాల వేదికల్లో ఇంగ్లండ్, టీమిండియాల మధ్య ఐదు టెస్టులు జరగనున్నాయి. చదవండి: D Gukesh: 36 ఏళ్ల ఆధిపత్యానికి తెర.. భారత చెస్‌లో 'నయా' కింగ్ ఆవిర్భావం శుభ్‌మన్ టీ20లకు పనికిరాడు.. వాళ్లకు అవకాశం ఇవ్వండి..! -
'టీమిండియా బజ్‌బాల్ ఆడితే జట్టులో ఎవరు మిగలరండి'
బజ్‌బాల్ ఆటతీరుతో టెస్టు క్రికెట్‌కు కొత్త నిర్వచనం చెప్పింది ఇంగ్లండ్ జట్టు. కెప్టెన్‌గా స్టోక్స్, హెడ్‌కోచ్‌గా బ్రెండన్ మెక్కల్లమ్ బాధ్యతలు తీసుకున్నాకా బజ్‌బాల్ ఆటకు మరింత పదును పెట్టింది. సౌతాఫ్రికా, పాకిస్తాన్లతో జరిగిన టెస్టు సిరీస్‌లో బజ్‌బాల్ దూకుడుతో సిరీస్ విజయాలను సొంతం చేసుకున్న ఇంగ్లండ్ యాషెస్ సిరీస్‌లోనూ అదే దూకుడు చూపెట్టాలని భావించింది. అయితే తొలి రెండు టెస్టుల్లో బజ్‌బాల్ ఆటతీరుతో ఇంగ్లండ్ చేతులు కాల్చుకుంది. అప్పటికే డబ్ల్యూటీసీ టైటిల్ గెలిచి డిపెండింగ్ చాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌కు ముకుతాడు వేసింది. తొలి రెండు టెస్టులను గెలిచి ఆసీస్ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఓటమిపాలైన తమ బజ్‌బాల్ దూకుడు మాత్రం ఆపమని కెప్టెన్ స్టోక్స్ కుండబద్దలు కొట్టాడు. అదే బజ్‌బాల్ ఆటతీరుతో మూడో టెస్టును గెలిచిన ఇంగ్లండ్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. నాలుగో టెస్టు డ్రాగా ముగిసినా ఐదో టెస్టు గెలిచి 2-2తో సిరీస్‌ను సమం చేసింది. ఇక వచ్చే ఏడాది టీమిండియా గడ్డపై నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ వస్తోంది. బజ్‌బాల్ ఆటతీరును టీమిండియాకు పరిచయం చేస్తామని స్టోక్స్ పేర్కొనడం ఆసక్తి కలిగించింది. అయితే ఇదే బజ్‌బాల్ స్టైల్ ను ఇండియన్ టీమ్ కూడా ఫాలో అయితే ఎలా ఉంటుందన్న సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి. ఈ విషయంపై అశ్విన్ స్పందించాడు. "మేము టెస్ట్ క్రికెట్ బాగా ఆడుతున్నాం. కానీ త్వరలోనే పరివర్తన దిశగా వెళ్తున్నాం. ఆ దశలో పరిస్థితులు అంత సులువుగా ఉండవు. కొన్ని సమస్యలు తలెత్తుతాయి. ఒకవేళ ఈ దశలో ఇండియా బజ్‌బాల్ స్టైల్ అడాప్ట్ చేసుకుందని అనుకుందాం. హ్యారీ బ్రూక్ లాగా మన ప్లేయర్స్ కూడా బ్యాట్ ఝుళిపించడానికి ప్రయత్నించారని అనుకుందాం. రెండు మ్యాచ్ లు ఓడిపోతాం. మనం ఏం చేస్తాం? బజ్‌బాల్ కు, ప్లేయర్స్ కు మద్దతిస్తామా? కనీసం నలుగురు ప్లేయర్స్ పై వేటు వేస్తాం. మన సంస్కృతి ఎప్పుడూ ఇలాగే ఉంది. ఇతరుల స్టైల్ వాళ్లకు మంచి ఫలితాలు ఇచ్చింది కదా అని మనం కాపీ చేయలేం. వాళ్లకు అది పని చేసింది ఎందుకంటే వాళ్ల మేనేజ్మెంట్, సెలక్టర్లు ఈ స్టైల్ ను ఆమోదించారు. మద్దతిచ్చారు. వాళ్ల అభిమానులు కూడా ఆమోదించారు. మనం అది చేయలేం" అని అశ్విన్ స్పష్టం చేశాడు. ఇక వన్డే వరల్డ్ కప్ పై కూడా అశ్విన్ స్పందించాడు. అభిమానులు ఇండియన్ టీమ్ కు సానుకూలంగా మద్దతివ్వాలని కోరాడు. "వరల్డ్ కప్ గెలవడం అంత సులువు కాదు. 12 ఏళ్ల తర్వాత మళ్లీ వన్డే వరల్డ్‌కప్ మన దేశంలో జరుగుతుంది. గతాన్ని గుర్తుచేయొద్దు.. అప్పుడు ధోని సేన మ్యాజిక్ చేసింది. ఇప్పుడు అదే రిపీట్ అవుతుందని కచ్చితంగా చెప్పలేం. దాదాపు ప్రతి మేజర్ టోర్నమెంట్లో మనం సెమీఫైనల్ చేరాం. ఆ రోజు సరిగా ఆడలేకపోయాం అంతే" అని అశ్విన్ అన్నాడు. -
ఆసీస్ దిగ్గజం చురకలు.. 'బజ్‌బాల్ కాదది కజ్బాల్'
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా గురువారం ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే యాషెస్ సిరీస్‌కు ముందు బజ్‌బాల్ ఆటతో ఆసీస్‌కు ముకుతాడు వేస్తామని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ప్రగల్బాలు పలికాడు. తీరా అసలు ఆట మొదలయ్యాకా సీన్ మొత్తం రివర్స్ అయింది. ఎడ్జ్‌బాస్టన్, లార్డ్స్ వేదికగా జరిగిన తొలి రెండు టెస్టుల్లో ఇంగ్లండ్ అనూహ్యంగా ఓటమిపాలైంది. ఇప్పటికే 0-2తో వెనుకబడిన ఆ జట్టు కనీసం మూడో టెస్టులోనైనా గెలిచి సిరీస్‌ను కాపాడుకోవాలని చూస్తోంది. తాజాగా మూడో టెస్టు మొదలైన నేపథ్యంలో ఆసీస్ దిగ్గజ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ ఇంగ్లండ్ జట్టుకు పరోక్షంగా చురకలు అంటించాడు.'' ఇంగ్లండ్ ఆడుతుంది బజ్‌బాల్ కాదని.. అది కజ్బాల్ అని దుయ్యబట్టాడు. బీబీసీ కాలమ్‌కు రాసిన మెక్‌గ్రాత్ పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు. ముందు జానీ బెయిర్ స్టో ఔట్ వివాదంతో మొదలుపెడతా. ఇక్కడ రెండు అంశాలు నా మదిలోకి వచ్చాయి. మొదట చూసినప్పుడు పాట్ కమిన్స్ అప్పీల్‌ను విత్‌డ్రా చేసుకుంటే బాగుంటుందనిపించింది. కానీ నిశితంగా పరిశీలించాకా ఆసీస్ కెప్టెన్ నిర్ణయం సరైందే అనిపించింది. ఇంగ్లండ్ ప్రవర్తించిన తీరు హాస్యాస్పదం అనిపించింది. ఇంగ్లండ్ బజ్‌బాల్ ఆటకు నేను అభిమానిని. ప్రత్యర్థి జట్లకు ఏ మాత్రం భయపడకుండా వారిపైనే ఒత్తిడి తెచ్చేలా ఇన్నింగ్స్‌ను ఆడడం అనే బజ్‌బాల్ కాన్సెప్ట్‌ను స్వాగతిస్తున్నా. కానీ బెయిర్ స్టో ఔట్ వివాదం కారణంగా ఇంగ్లండ్ బజ్‌బాల్ కాస్త నాకు కజ్బాల్(Casual Bowling)లా కనిపించింది.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక లార్డ్స్ టెస్టులో బెయిర్ స్టో ఔట్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. బంతి డెడ్ కాకముందే బెయిర్ స్టో క్రీజును విడవడంతో అలెక్స్ కేరీ బంతిని వికెట్లకు గిరాటేశాడు. రూల్ ప్రకారం థర్డ్ అంపైర్ బెయిర్ స్టో ఔట్ అని ప్రకటించాడు. ఇక్కడ రాజుకున్న మంట టెస్టు ముగిసినా చల్లారలేదు. ఆసీస్ జట్టు చీటింగ్ చేసి గెలిచిదంటూ ఇంగ్లండ్ అభిమానులు సహా స్థానిక మీడియా ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఆస్ట్రేలియా మీడియా కూడా ధీటుగానే బదులిచ్చింది. ఇక బెయిర్ స్టో వివాదం ఇరుదేశాల ప్రధానులు మాట మాట అనుకునే వరకు వెళ్లడం ఆసక్తి కలిగించింది. Glenn Mcgrath said "Bairstow's dismissal epitomizes what we have seen from England in this series, it has been Casual ball - CazBall if you will, not Bazball". [BBC] pic.twitter.com/bKAdHQbgJ1 — Johns. (@CricCrazyJohns) July 5, 2023 చదవండి: Ashes 2023: మూడో టెస్టు.. టాస్ గెలిచిన ఇంగ్లండ్.. బజ్‌బాల్‌ను పక్కనబెడుతుందా? -
సీన్ రివర్స్ అయినట్టుందే!.. ఇంగ్లండ్‌కు దిమ్మతిరిగే షాక్
ఇంగ్లండ్ జట్టు బజ్‌బాల్ ఆటతీరుతో వరుసగా సిరీస్‌లు గెలిచిన సంగతి తెలిసిందే. స్టోక్స్ కెప్టెన్‌గా.. మెక్కల్లమ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇంగ్లండ్ జట్టు 13 టెస్టుల్లో 11 విజయాలు సాధించింది. అన్నింటిలోనూ బజ్‌బాల్ ఆట దూకుడునే ప్రదర్శిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్లను మట్టికరిపించి సిరీస్ విజయాలను సొంతం చేసుకుంది. ఇక యాషెస్ టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు కూడా ఇంగ్లండ్ జట్టు తమ బజ్‌బాల్ దూకుడు కొనసాగుతుందని స్పష్టం చేసింది. అందుకు తగ్గట్టుగానే ఆసీస్‌తో తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌ను ఒక్కరోజులోనే డిక్లేర్ చేసింది. అయితే ప్రతీసారి మనది కాదని తెలుసుకోని ఇంగ్లండ్ ప్రపంచ టెస్టు చాంపియన్ అయిన ఆస్ట్రేలియాకు తలవంచింది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. అయితే ఇంగ్లండ్ బౌలర్లు ఐదోరోజు సూపర్‌గా బౌలింగ్ చేసినప్పటికి పాట్ కమిన్స్, నాథన్ లయోన్ల అద్బుత పోరాటం ఇంగ్లండ్‌కు విజయాన్ని దూరం చేసింది. కానీ ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాత్రం బజ్‌బాల్ ఆటను సమర్థించుకున్నాడు. ఒక్క టెస్టులో ఓడిపోయినంత మాత్రానా బజ్‌బాల్‌ను పక్కనపెట్టేదే లేదని కుండబద్దలు కొట్టాడు. సీన్ మొత్తం రివర్స్.. అయితే బుధవారం(జూన్ 28న) లార్డ్స్ వేదికగా మొదలైన రెండో టెస్టులో సీన్ మొత్తం రివర్స్ అయింది. బజ్‌బాల్ ఆటతో దూకుడు కనబరుస్తామనుకున్న ఇంగ్లండ్‌కు ఆసీస్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఎందుకంటే తొలిరోజు ఆటలో ఆస్ట్రేలియా వేగంగా ఆడింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఇలాగే ఆడుతామంటూ బజ్‌బాల్ ఆటను ఇంగ్లండ్‌కు చూపించింది. డేవిడ్ వార్నర్, ట్రెవిస్ హెడ్లు వన్డే స్టైల్లో వేగంగా ఆడితే.. స్మిత్ ఎప్పటిలాగే తన నిలకడైన ఆటను ప్రదర్శిస్తూ 85 పరుగులతో నాటౌట్‌గా నిలిచి సెంచరీకి దగ్గరయ్యాడు. ఓవర్‌కు 4.08 రన్‌రేట్‌తో 83 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. ఒక దశలో వార్నర్-లబుషేన్, ట్రెవిస్ హెడ్- స్మిత్ జోడి ఓవర్‌కు ఐదు పరుగుల చొప్పున జోడించారు. నిజంగా ఇది ఇంగ్లండ్ ఇది ఊహించలేదు. ఇక రెండోరోజు ఆటలో స్మిత్ సెంచరీ నుంచి డబుల్ సెంచరీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలెక్స్ క్యారీ, లాస్ట్ మ్యాచ్ హీరో పాట్ కమిన్స్ ఇంకా బ్యాటింగ్‌కు రావాల్సి ఉంది. తొలి సెషన్లో వీరిని ఎంత త్వరగా ఔట్ చేస్తే ఇంగ్లండ్‌కు అంత మంచిది. రెండు సెషన్ల పాటు ఆసీస్ బ్యాటింగ్ చేస్తే మాత్రం 500 స్కోరు దాటే అవకాశం ఉంది. అప్పుడు ఇంగ్లండ్‌కు కష్టాలు మొదలైనట్లే. బజ్‌బాల్‌తో ప్రత్యర్థికి చుక్కలు చూపిద్దామనుకున్న ఇంగ్లండ్‌కు ఆస్ట్రేలియానే ముచ్చెమటలు పట్టించేలా కనిపిస్తోంది. చదవండి: రూట్ అరుదైన ఘనత.. యాషెస్ చరిత్రలో మూడో ఆటగాడిగా భారత్ చేతిలో ఓడినా సరే.. మాకు అదే ముఖ్యం: పాక్ స్టార్ క్రికెటర్ -
'మ్యాచ్ పోతే పోయింది.. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు'
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. బజ్‌బాల్ క్రికెట్‌తో దూకుడు ప్రదర్శిస్తున్న ఆ జట్టుకు ఆసీస్ ముకుతాడు వేసింది. అయితే మ్యాచ్ ఓటమిపై స్టోక్స్ తనదైన శైలిలో స్పందించాడు. మ్యాచ్ ఓడిపోయామన్న బాధ ఉన్నా బజ్‌బాల్ క్రికెట్ విషయంలో వెనక్కి తగ్గేది లేదంటూ పేర్కొన్నాడు. ''మ్యాచ్ ఓడిపోయి ఉండొచ్చు.. కానీ ఒక విషయంలో సంతోషంగా ఉంది. అదేంటంటే మ్యాచ్‌ను ఆఖరి నిమిషం వరకు తీసుకెళ్లడం. ఒక గొప్ప గేమ్‌లో భాగస్వామ్యం కావడం.. మ్యాచ్‌కు హాజరైన ప్రేక్షకులు కూడా ఐదురోజుల పాటు ఎడ్జ్ ఆఫ్ సీట్ ఫీల్‌ను అనుభవించారు. ఒక టెస్టు క్రికెట్‌కు కావాల్సింది ఇదే. యాషెస్‌ను ఇరుదేశాల్లో ఎంతలా ఆదరిస్తానేది మరోసారి కనిపించింది. మ్యాచ్‌లో ఎవరో ఒకరే గెలవాలి..ఇవాళ మేం ఓటమి డెడ్‌లైన్‌ను దాటలేకపోయాం. అంతమాత్రానా మా ఆటతీరును మార్చుకోలేం. బజ్‌బాల్ క్రికెట్‌ను కంటిన్యూ చేస్తాం. ఈ మ్యాచ్‌లో మా వ్యూహాలను ఎదుర్కోవాలనే ప్లాన్‌తో ఆసీస్ వచ్చింది. మేం జస్ట్ మిస్ అయ్యాం. లేదంటే ఇక్కడ వేరే ఫలితం గురించి మాట్లాడుకునేవాళ్లం. ఈ సిరీస్‌లో ఇది తొలి మ్యాచ్ మాత్రమే. ఇంకా నాలుగు మ్యాచ్‌లు మిగిలిఉన్నాయి. చాలా క్రికెట్ ఆడాలి. ఇప్పుడు మా ఫోకస్ అంతా ఆ మ్యాచ్‌లపైనే. చేతిలో వికెట్లు ఉండి కూడా మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌ను తొలిరోజే డిక్లేర్ చేయడం వెనుక నాది ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నారు. ఈరోజు దీనికి క్లారిటీ ఇస్తున్నా. నేను ఒక కెప్టెన్‌ను కాబట్టి.. ఆ టైంలో ఆస్ట్రేలియాను మరింత ఒత్తిడిలోకి నెట్టొచ్చు అనిపించింది. అందుకే ఆ పని చేశా. ఏ ఓపెనింగ్ బ్యాటర్ కూడా ఆట ముగియడానికి 20 నిమిషాల ముందు బ్యాటింగ్‌కు వెళ్లాలని అనుకోడు. అందుకే ఆ పని చేశా. అయితే ఆ రోజు ఆసీస్ ఓపెనర్లు ఇద్దరూ ఎలాంటి పొరపాటు చేయకుండా తొలి రోజు ఆటను ముగించారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయినా కూడా.. ఇంగ్లండ్‌కు కేవలం 7 పరుగుల ఆధిక్యమే లభించింది. అదే ఇంగ్లండ్ కనుక తొలి రోజు డిక్లేర్ చేయకుండా మరికొంత సమయం ఆడి ఉంటే మరింత ఆధిక్యం లభించేదే. మేం ఆడిన విధానం, ఆసీస్ బౌలర్లపై ఎదురు దాడి చేయడం చూసి డిక్లేర్ చేయాలనే నిర్ణయం తీసుకున్నా. డిక్లేర్ చేయకపోతే ఐదో రోజు ఇంత ఎగ్జయిట్మెంట్ వచ్చేదా? చెప్పండి'' అంటూ ప్రశ్నించాడు. మ్యాచ్‌లో రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించిన ఆస్ట్రేలియా ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక ఇరుజట్ల మధ్య రెండో టెస్టు జూన్ 28 నుంచి జూలై 2 వరకు లార్డ్స్ వేదికగా జరగనుంది. చదవండి: చావుదెబ్బ కొట్టిన ఆసీస్.. రికార్డులు బద్దలైన వేళ బజ్‌బాల్ అంటూ విర్రవీగారు.. అణిచివేసిన ఆసీస్ -
బజ్‌బాల్ అంటూ విర్రవీగారు.. అణిచివేసిన ఆసీస్
ఆటలో ప్రతీరోజు మనది కాదు. ప్రయోగాలు మంచిదే అయినప్పటికి ప్రతీసారి అది మనకు కలిసి వస్తుందని చెప్పలేం. తాజాగా ఇంగ్లండ్ క్రికెట్ జట్టకు ఈ విషయం బాగా అర్థమయి ఉంటుంది. బజ్‌బాల్ అంటూ దూకుడైన ఆటతీరుతో తమకు ఎదురులేదని విర్రవీగుతున్న ఇంగ్లండ్‌ను ఆసీస్ అణిచివేసింది. అది కూడా ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో కావడంతో ఇంగ్లీష్ అభిమానులు ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. బజ్‌బాల్ క్రికెట్‌తో ఇంగ్లండ్ ఏడాది కాలంగా మంచి ఫలితాలను సాధించింది. బెన్‌స్టోక్స్ సారధ్యంలోని ఇంగ్లండ్ జట్టు కొత్తగా కనిపించింది. ఇదే బజ్‌బాల్ మంత్రంతో పాకిస్తాన్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌లను మట్టికరిపించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. కానీ జరుగుతున్నది ప్రతిష్టాత్మక యాషెస్.. అందునా ఇటీవలే ప్రపంచ టెస్టు చాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియాను ఎదుర్కోవడం అంత సులువు కాదు. ఈ విషయం తెలిసి కూడా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తొలిరోజే సాహసం చేశాడు. పూర్తి బ్యాటింగ్ చేయకుండా తొలి ఇన్నింగ్స్‌ను 8 వికెట్ల నష్టానికి 393 పరుగుల వద్ద డిక్లేర్ చేశాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌కు ధీటుగా బదులిచ్చింది. 386 పరుగులకు ఆలౌట్ కావడంతో ఇంగ్లండ్‌కు స్వల్ప ఆధిక్యం లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ బౌలర్ల దాటికి 273 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే సొంతగడ్డపై జరుగుతుండడంతో ఇంగ్లండ్‌కు కలిసొచ్చే అంశం. అయితే ఎడ్జ్‌బాస్టన్‌లో చివరి రోజు బౌలర్లకు అనుకూలిస్తుందని చెప్పారు. ఇక ఐదోరోజు ఆటలో వరుణుడు దోబుచులాడడంతో మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు కనిపించాయి. ఇంగ్లండ్ వ్యూహం బెడిసికొట్టేలా కనిపించింది. అయితే రెండో సెషన్లో కుదురుకున్న ఇంగ్లండ్ వరుసగా వికెట్లు పడగొట్టింది. అరె మళ్లీ ఇంగ్లండ్ బజ్‌బాల్ మంత్రం ఫలించిందే అనుకుంటున్న తరుణంలో పాట్ కమిన్స్, నాథన్ లియోన్లు తమ పోరాటంతో ఇంగ్లండ్‌కు విజయాన్ని దూరం చేశారు. ప్రతీసారి బజ్‌బాల్ దూకుడు పనికి రాదన్నది మరోసారి ఇంగ్లండ్‌కు అర్థమయి ఉండాలి. రెండో టెస్టు నుంచి బజ్‌బాల్ క్రికెట్‌ను పక్కనబెడతారా లేక కొనసాగిస్తారా అనేది చూడాలి. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. తొలి సెషన్లో వర్షంతో ఆటకు అంతరాయం కలగడం.. రెండో సెషన్లో పిచ్‌పై ఉన్న పదును ఉపయోగించుకొని ఇంగ్లండ్ బౌలర్లు వికెట్లతో చెలరేగారు. దీంతో ఆఖరి సెషన్లో ఎలాగైనా నిలబడి డ్రా చేసుకున్నా చాలు అనే దోరణిలో తొలుత ఆసీస్ ఆట కొనసాగింది. కానీ కెప్టెన్ పాట్ కమిన్స్ ధైర్యం ప్రదర్శించాడు. ఆరంభంలో కాస్త నిధానంగా ఆడిన కమిన్స్.. లయన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ‘డ్రా’కు అవకాశమివ్వకుండా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (73 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), నాథన్ లయన్ (28 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు) చక్కని పోరాటం చేశారు. దీంతో ఇంగ్లండ్ గెలిచేందుకు బాట వేసుకున్న ఆఖరి సెషన్లో వీళ్లిద్దరు పిచ్‌పై పరుగులతో పాగా వేశారు. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఆసీస్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు జూన్ 28 నుంచి జూలై 2 వరకు లార్డ్స్ వేదికగా జరగనుంది. Ball by ball Last 4 overs of Ashes thriller between Australia and England in first test at Edgbaston #Ashes23 pic.twitter.com/OYpoar6vhW — Spartan (@_spartan_45) June 20, 2023 చదవండి: 2005 రిపీట్ అవుతుందా? లేక ఆసీస్ షాకిస్తుందా? -
2005 రిపీట్ అవుతుందా? లేక ఆసీస్ షాకిస్తుందా?
'బజ్‌బాల్' అంటూ దూకుడు కనబరుస్తున్న ఇంగ్లండ్‌కు ఆస్ట్రేలియా ముకుతాడు వేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రసకందాయంలో పడింది. ఆటకు ఇవాళ చివరి రోజు కావడంతో ఇంగ్లండ్ విజయానికి ఏడు వికెట్లు అవసరం కాగా.. ఆసీస్ విజయానికి 174 పరుగుల దూరంలో ఉంది. అయితే చివరి రోజు బౌలర్లకు అనూకూలంగా ఉంటుందన్న అంశం ఇంగ్లండ్ బౌలర్లకు ఊరటనిచ్చే అంశం. అయితే ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేయలేం. ఇటీవలే డబ్ల్యూటీసీ ఫైనల్లో గెలిచి చాంపియన్‌గా అవతరించిన ఆసీస్ పోరాడకుండా మాత్రం ఉండదు. చేయాల్సింది 174 పరుగులే కావడం.. క్రీజులో ఉస్మాన్ ఖవాజా ఉండగా.. ట్రెవిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కేరీలు ఇంకా బ్యాటింగ్‌కు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురిని వీలైనంత త్వరగా ఔట్ చేస్తే ఇంగ్లండ్‌కు గెలిచే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ ముగ్గురిలో ఏ ఇద్దరు క్లిక్ అయినా ఆసీస్ తొలి టెస్టును కైవసం చేసుకుంటుంది. ప్రస్తుతం చూసుకుంటే ఇరుజట్లకు సమాన అవకాశాలు ఉన్నాయి. 2005 రిపీట్ అవుతుందా? అయితే 2005లో యాషెస్ సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా రెండో టెస్టు ఆడాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కేవలం రెండు పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. అప్పట్లో 282 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆసీస్ 279 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 407 పరుగులు చేయగా.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లండ్‌కు 101 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించినట్లయింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా ఇంగ్లండ్ 182 పరుగులకే కుప్పకూలింది. దీంతో 281 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆసీస్ విజయానికి కేవలం రెండు పరుగుల దూరంలో ఆగిపోయింది. ప్రధాన బ్యాటర్లంతా వెనుదిరిగినప్పటికి చివర్లో షేన్ వార్న్ 42, బ్రెట్ లీ 43 పరుగులు సంచలన ఇన్నింగ్స్ ఆడి ఆసీస్‌ను గెలిపించే ప్రయత్నం చేశారు. అయితే ఆండ్రూ ఫ్లింటాఫ్ నాలుగు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించి విజయంలో కీలకపాత్ర పోషించాడు. ప్రస్తుతం 2023లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు పరిస్థితి కూడా అచ్చం అదే పరిస్థితిని తలపిస్తుంది. బజ్‌బాల్ మంత్రంతో ఇంగ్లండ్ ఆసీస్ ఆట కట్టిస్తుందా లేక ఆసీస్ ఇంగ్లండ్‌కు షాకిస్తుందా అన్నది చూడాలి. చదవండి: #Ashes2023: ఇంగ్లండ్‌కు ఏడు వికెట్లు.. ఆసీస్‌కు 174 పరుగులు -
రెండేళ్ల వ్యవధిలో తొమ్మిది శతకాలు.. కొత్తగా కనిపిస్తున్నాడు
టెస్టు క్రికెటర్‌గా గుర్తింపు పొందిన జో రూట్ కొత్తగా కనిపిస్తున్నాడు. బజ్‌బాల్ ఆటతీరుతో ఇంగ్లండ్ దూకుడు కనబరుస్తుంటే.. రూట్ కూడా తన మార్క్ ఇన్నింగ్స్‌లతో అలరిస్తున్నాడు. టెస్టు క్రికెట్‌కు కొత్త అర్థం చెబుతున్న రూట్ సెంచరీల మీద సెంచరీలు చేసుకుంటూ పోతున్నాడు. తాజాగా యాషెస్‌లో తొలి టెస్టులోనే రూట్ సెంచరీతో మెరిశాడు. 152 బంతుల్లో 118 పరుగులు నాటౌట్‌గా నిలిచిన రూట్ ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. రూట్ టెస్టు కెరీర్లో ఇది 30వ శతకం కావడం విశేషం .టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆస్ట్రేలియా(Australia) మాజీ కెప్టెన్,ఆల్ టైమ్ గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్లలో ఒకరైన సర్ డాన్ బ్రాడ్‌మన్‌ను రూట్ అధిగమించాడు. ప్రస్తుతం రూట్ చందర్‌పాల్, మాథ్యూ హెడెన్‌లతో కలిసి 30 సెంచరీలతో సంయుక్తంగా కొనసాగుతున్నాడు. ఇక 2021 నుంచి చూసుకుంటే రూట్ ఆటతీరు ఎంత వేగంగా ఉందో అర్థమవుతుంది. 2021 నుంచి 62 ఇన్నింగ్స్‌లు ఆడిన రూట్ 58.91 సగటుతో 3299 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు ఉంటే.. 13 అర్థసెంచరీలు ఉన్నాయి. ఇక 2022 నుంచి ఇప్పటివరకు ఏడు శతకాలు బాదిన రూట్ 2వేల పరుగులు సాధించాడు. ఈ దశాబ్దంలో టెస్టుల్లో రూట్ మినహా మరే ఇతర బ్యాటర్ ఇంత వేగంగా పరుగులు చేసిన దాఖలాలు లేవు. Classic #Bazball😳 England declare on 393/8 #JoeRoot #Ashes2023 #ENGvsAUS #AUSvENG#Ashes23 #Cricket #testcricket#England #Cricketpic.twitter.com/qwo0iFfSa2 — Cricopia.com (@cric_opia) June 16, 2023 చదవండి: #Bazball: మంత్రం పనిచేస్తుందా? విఫలమవుతుందా? -
#Bazball: మంత్రం పనిచేస్తుందా? విఫలమవుతుందా?
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో మొదలైన తొలి టెస్టులో ఇంగ్లండ్ తొలిరోజే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి అందరిని ఆశ్చర్యపరించింది. కొన్నాళ్లుగా బజ్‌బాల్ ఆటతీరుతో దూకుడు ప్రదర్శిస్తున్న ఇంగ్లండ్ ఆసీస్‌తో టెస్టులోనూ అదే ఆటతీరు చూపించింది. ఇటీవలే డబ్ల్యూటీసీ చాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా ముందు కనీసం 400 పరుగులైనా ఉంచాల్సిందని అభిమానులు ఆభిప్రాయపడుతున్నారు. బజ్‌బాల్ క్రికెట్‌తో ఇంగ్లండ్‌కు అనూకూల ఫలితాలు వస్తున్నప్పటికి ప్రతీసారి ఆ మంత్రం పనిచేయకపోవచ్చు. ఒకవేళ ఆస్ట్రేలియా ఇంగ్లీష్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని రెండురోజుల పాటు బ్యాటింగ్ చేస్తే ఇంగ్లండ్‌కు కష్టాలు తప్పకపోవచ్చు. అలా గాకుండా బెన్ స్టోక్స్ నమ్మకాన్ని నిలబెడుతూ బౌలర్లు చెలరేగి ఆసీస్‌ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేస్తే మాత్రం ఇంగ్లండ్‌కు ఎదురుండదు. మరొక అంశమేమిటంటే ఇంగ్లండ్ తన దూకుడుతో మ్యాచ్‌ను మూడు రోజుల్లో ముగించే అవకాశం కూడా ఉంటుంది. అయితే అవతల ఉన్నది పటిష్టమైన ఆస్ట్రేలియా. స్మిత్, లబుషేన్, ట్రెవిస్ హెడ్లతో పాటు ఉస్మాన్ ఖవాజా, అలెక్స్ క్యారీ లాంటి ఉద్దండులైన బ్యాటర్లు ఉన్నారు. వీరందరిని ఔట్ చేయడం అంత సామాన్య విషయం కాదు. కానీ ఇంగ్లండ్ బజ్‌బాల్ మంత్రం పనిచేస్తే మాత్రం వారి విజయం ఆపడం ఎవరి తరం కాదు. చదవండి: క్రికెట్ చరిత్రలో ఆల్‌టైమ్ బెస్ట్ క్యాచ్.. వీడియో వైరల్ -
బజ్‌బాల్ దూకుడు; రూట్ సెంచరీ.. తొలి రోజే ఇన్నింగ్స్ డిక్లేర్
బర్మింగ్హమ్: టెస్టు క్రికెట్‌ను కొత్త పుంతలు తొక్కిస్తున్న ఇంగ్లండ్ జట్టు మరో కొత్త సాహసాన్ని ప్రదర్శించింది. ‘బాజ్‌బాల్’ అంటూ దూకుడైన ఆటను ప్రదర్శిస్తూ వచి్చన ఆ జట్టు యాషెస్ సిరీస్‌లోనూ తమ శైలిని చూపించింది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్, టాప్ బ్యాటర్ ఒకరు అజేయ సెంచరీతో ఇంకా క్రీజ్‌లోనే ఉన్నా మొదటి రోజే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి ఆశ్చర్యపర్చింది. ఆ్రస్టేలియాతో శుక్రవారం ప్రారంభమైన మొదటి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌ను ఇంగ్లండ్ 8 వికెట్ల నష్టానికి 393 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. జో రూట్ (152 బంతుల్లో 118 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) కెరీర్లో 30వ సెంచరీతో చెలరేగాడు. జానీ బెయిర్‌స్టో (78 బంతుల్లో 78; 5 ఫోర్లు), జాక్ క్రాలీ (73 బంతుల్లో 61; 7 ఫోర్లు) కీలక అర్ధ సెంచరీలు సాధించారు. ‘యాషెస్’లో రూట్‌కు ఇది నాలుగో సెంచరీ కాగా... 2015 తర్వాత మొదటిది. రూట్, బెయిర్‌స్టో ఆరో వికెట్‌కు 121 పరుగులు జోడించారు. 78 ఓవర్లే ఆడిన ఇంగ్లండ్ ఓవర్‌కు 5.03 రన్‌రేట్‌తో పరుగులు సాధించడం విశేషం. ఆసీస్ బౌలర్లలో లయన్‌కు 4 వికెట్లు దక్కాయి. అయితే ఇంగ్లండ్ ఆశించినట్లుగా వికెట్ మాత్రం దక్కలేదు. 4 ఓవర్లే ఆడిన ఆ్రస్టేలియా ఆట ముగిసే సమయానికి వికెట్ కోల్పోకుండా 14 పరుగులు చేసింది. ఇంగ్లండ్ డిక్లరేషన్ ఎత్తుగడ ఎలాంటి ఫలితాన్నిస్తుందనేది ఇప్పుడే చెప్పలేకపోయినా... ఆస్ట్రేలియా పట్టుదలగా రెండు రోజులు బ్యాటింగ్ చేసి భారీ స్కోరు సాధిస్తే మాత్రం ఇంగ్లండ్‌కు ఇబ్బందులు తప్పవు. చదవండి: షేన్ వార్న్ బయోపిక్.. శృంగార సన్నివేశం చేస్తూ ఆస్పత్రిపాలు -
ఓటమి నేర్పిన పాఠం.. ప్రతీసారి 'బజ్‌బాల్' పనికిరాదు
న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ను తొలిరోజునే డిక్లేర్ చేయడం చూసి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందన్న విమర్శలు వచ్చాయి. కానీ రెండో రోజుకే మ్యాచ్ ఫలితం వచ్చేసింది. తొలి టెస్టు గెలిచిన ఇంగ్లండ్‌కు బజ్‌బాల్ క్రికెట్(Bazball) బాగా ఉపయోగపడుతుందని అంతా అనుకున్నారు. ఇదే బజ్‌బాల్ క్రికెట్ మంత్రంతో వరుసగా సౌతాఫ్రికా, పాకిస్తాన్లను మట్టికరిపించింది. కానీ ప్రతీసారి అదే దూకుడు పనికి రాదని తర్వాతి టెస్టుతోనే అర్థమైంది. ఓటమి నేర్పిన పాఠంతో బజ్‌బాల్(Bazball) ఆటను పక్కనబెడితే మంచిదని కొంతమంది క్రీడానిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇక ఈసారి కూడా ఇంగ్లండ్ ఆటను వేగంగానే మొదలుపెట్టింది. రూట్, హ్యారీ బ్రూక్ శతకాలతో విరుచుకుపడడంతో 435 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆ తర్వాత న్యూజిలాండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 209 పరుగులకు ఆలౌట్ చేసి ఫాలోఆన్ కూడా ఆడించింది. ఇన్నింగ్ తేడాతో గెలవాలన్న ఇంగ్లండ్ ప్లాన్ బెడిసికొట్టింది. కేన్ విలియమ్సన్ శతకంతో మెరవగా.. టామ్ బ్లండెల్, టామ్ లాథమ్, డెవన్ కాన్వే, డారిల్ మిచెల్‌లు కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ 483 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ ముందు 258 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. బజ్‌బాల్ మంత్రంతో ఊగిపోతున్న ఇంగ్లండ్ ఆటను చూస్తే టార్గెట్ అంత కష్టమేమి అనిపించలేదు. అందుకు తగ్గట్టుగానే రూట్ తన శైలికి భిన్నంగా వేగంగా ఆడడంతో ఇంగ్లండ్ లక్ష్యం దిశగా సాగినట్లే అనిపించింది. కానీ ప్రతీసారి దూకుడు పనికిరాదన్న విషయం ఇంగ్లండ్‌కు అర్థమైంది. రూట్ మినహా మిగతావాళ్లు పెద్దగా రాణించకపోవడంతో ఇంగ్లండ్ విజయానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది. అయితే కాస్త ఓపికగా ఆడి ఉంటే మాత్రం ఇంగ్లండ్.. మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసేదే. కానీ సంప్రదాయ ఫార్మాట్లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఎవరు చెప్పలేరు. బజ్‌బాల్ అంటూ దూకుడు మంత్రం జపిస్తున్న ఇంగ్లండ్‌కు న్యూజిలాండ్ తమ ఆటతో బ్రేకులు వేసింది. దీంతో ఇంగ్లండ్ బజ్‌బాల్ క్రికెట్(Bazball Cricket)ను పక్కనబెట్టడం మంచిదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చదవండి: పరుగు తేడాతో విజయం.. 30 ఏళ్ల రికార్డు కనుమరుగు టెస్టు క్రికెట్లో సంచలనం.. పరుగు తేడాతో విజయం WHAT A GAME OF CRICKET New Zealand have won it by the barest of margins... This is test cricket at its finest ❤️ #NZvENG pic.twitter.com/cFgtFBIkR4 — Cricket on BT Sport (@btsportcricket) February 28, 2023 -
'బజ్‌బాల్' ఎలా అడ్డుకోవాలి?.. ఫ్యాన్స్‌ను వేడుకున్న కివీస్ టాప్ వెబ్సైట్
బజ్‌బాల్(Bazball) క్రికెట్‌తో ఇంగ్లండ్ చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. ఐదురోజులు జరగాల్సిన టెస్టు మ్యాచ్‌ను ఇంగ్లండ్ 'బజ్‌బాల్' ఆటతీరుతో వీలైనంత తొందరగా ముగించాలని చూస్తోంది. బ్యాటింగ్‌కు దిగితే దాటిగా ఆడడం.. బౌలింగ్ వేస్తే వేగంగా వికెట్లు తీయాలనుకోవడం.. ఇలా స్టోక్స్ సారధ్యంలోని ఇంగ్లండ్ దూసుకుపోతుంది. ఇప్పటికే పాకిస్తాన్‌ను బజ్‌బాల్ మంత్రంతో వారి గడ్డపై టెస్టు సిరీస్‌లో మట్టికరిపించింది. బజ్‌బాల్ క్రికెట్‌ను పాకిస్తాన్ జట్టుకు మొదటిసారిగా పరిచయం చేసింది. తాజాగా న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లోనే అదే దూకుడు మంత్రాన్ని కొనసాగిస్తుంది. కివీస్‌తో జరిగిన తొలి టెస్టులో స్టోక్స్ సేన 267 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి రెండు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. దీంతో ఇంగ్లండ్ బజ్‌బాల్ ఆటతీరును ఎలా అడ్డుకోవాలో కాస్త చెప్పండి అంటూ న్యూజిలాండ్‌కు చెందిన టాప్ వెబ్సైట్ స్టఫ్.కో. ఎన్జెడ్(Stuff.co.nz) క్రికెట్ అభిమానులను కోరడం ఆసక్తి కలిగించింది. ''ఇంగ్లండ్ బజ్‌బాల్ ఆటతో దూకుడు మంత్రం జపిస్తుంది. వెల్లింగ్టన్ వేదికగా మొదలుకానున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ బజ్‌బాల్ క్రికెట్‌కు ముకుతాడు వేయడానికి 400-800 పదాలతో ఒక పరిష్కార మార్గాన్ని లేదా గేమ్ స్ట్రాటజీని రాసి పంపించగలరు. మీ విలువైన సమాచారాన్ని ఈ-మెయిల్ ద్వారా అందించగలరు'' అంటూ మెయిల్ ఐడీ ఇచ్చింది. ఒకవేళ మీకు కూడా ఆసక్తి ఉంటే stuffnation@stuff.co.nzకు బజ్‌బాల్ క్రికెట్‌ను అడ్డుకునే సలహాను పంపించండి. ఇక తొలి టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలిరోజునే 325 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత న్యూజిలాండ్ తడబడినా 306 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో వేగంగా ఆడిన ఇంగ్లండ్ కివీస్ ముందు 374 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో నలుగురు హాఫ్ సెంచరీలు చేయగా.. ఓలీ పోప్ 49 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత పేస్ ద్వయం అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్లు చెరో నాలుగు వికెట్లు తీసి ఇంగ్లండ్‌కు భారీ విజయాన్ని కట్టబెట్టారు. చదవండి: Joe Root: 'రూట్' దారి తప్పింది.. 'నా రోల్ ఏంటో తెలుసుకోవాలి' 10 వికెట్ల తేడాతో విజయం.. దర్జాగా సెమీస్‌కు