సిరీస్ గెలిచిన టీమిండియా (PC: BCCI)
విరాట్ కోహ్లి, మహ్మద్ షమీ.. కేఎల్ రాహుల్, జస్‌ప్రీత్ బుమ్రా వంటి కీలక ఆటగాళ్లు జట్టులో లేకున్నా యువ జట్టుతో టీమిండియాకు అద్భుత విజయం అందించాడు కెప్టెన్ రోహిత్ శర్మ. విరాట్, షమీ సిరీస్ మొత్తానికి.. గాయం కారణంగా రాహుల్ రెండో టెస్టు నుంచి జట్టుకు దూరం కాగా... నాలుగో టెస్టులో బుమ్రాకు విశ్రాంతినిచ్చారు.
ఈ నేపథ్యంలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు మినహా అంతగా అనుభవంలేని జట్టుతో బరిలోకి దిగిన టీమిండియా.. నాలుగో టెస్టులో ఘన విజయం సాధించింది.
ఆద్యంతం ఆసక్తిరేపిన ఈ రసవత్తర మ్యాచ్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్, శుబ్‌మన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్‌లో గెలుపొందింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మరో టెస్టు మిగిలి ఉండగానే సిరీస్‌ను 3-1తో గెలిచింది. సొంతగడ్డపై వరుసగా పదిహేడవ సిరీస్ విజయం సాధించింది.
బజ్‌బాల్ యుగంలో తొలి కెప్టెన్‌గా ఘనత
దీనికంతటికి రోహిత్ శర్మ నాయకత్వ ప్రతిభే కారణమంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. ‘బజ్‌బాల్’ యుగంలో ఇంగ్లండ్‌ను వరుసగా మూడు మ్యాచ్‌లలో ఓడించిన కెప్టెన్, బెన్ స్టోక్స్‌కు తొలి సిరీస్ పరాజయం పరిచయం చేసిన సారథి(ROHIT SHARMA BECOMES THE FIRST CAPTAIN TO WIN A TEST SERIES AGAINST BAZBALL ERA)గా అరుదైన ఫీట్ నమోదు చేశాడంటూ అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
తొమ్మిది వేల పరుగులు పూర్తి చేసి
ఇదిలా ఉంటే.. రాంచి టెస్టు సందర్భంగా రోహిత్ శర్మ వ్యక్తిగతంగా అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో తొమ్మిది వేల పరుగుల మార్కును అందుకున్నాడు.
కాగా ఇంగ్లండ్‌తో శుక్రవారం మొదలైన నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ పూర్తిగా విఫలమయ్యాడు. కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. అయితే, మ్యాచ్ ఫలితాన్ని తేల్చే కీలకమైన రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం విలువైన అర్ధ శతకం(55) బాదాడు రోహిత్.
తద్వారా ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 9 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు రోహిత్ శర్మ. అదే విధంగా టెస్టు మ్యాచ్‌లో నాలుగు వేల రన్స్‌కు పైగా స్కోరు చేశాడు. తద్వారా ఈ ఘనత సాధించిన 17వ భారత బ్యాటర్‌గా నిలిచాడు. అంతేకాదు.. ఇంగ్లండ్‌పై వెయ్యి పరుగుల మార్కును కూడా దాటేశాడు హిట్‌మ్యాన్.
చదవండి: Virat Kohli: టీమిండియా గెలుపుపై స్పందించిన కోహ్లి.. పోస్ట్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment