భారత పర్యటనను ఇంగ్లండ్ జట్టు ఘోర ఓటమితో ముగించింది. ధర్మశాల వేదికగా జరిగిన ఐదో టెస్టులో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. బాజ్ బాల్ అంటూ వీరవీగ్రుతన్న ఇంగ్లండ్ జట్టు ఆఖరి టెస్టులో కనీస పోటీ ఇవ్వలేకపోయింది. భారత దెబ్బకు ఇంగ్లండ్ బజ్ బాల్ పగిలిపోయింది.
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్ 1-4 తేడాతో భారత్‌కు సమర్పించుకుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ బజ్ బాల్ విధానంపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శల వర్షం కురిపించాడు.
"భారత్ దెబ్బకు ఇంగ్లండ్ బాజ్ బాల్ బద్దలైంది. వారు ఆప్రోచ్ సరైనది కాదు. పిచ్చికి కూడా ఓ పద్దతి ఉంటుంది. ఇంగ్లండ్ తమ స్ధాయికి తగ్గట్టు ఆడలేకపోయింది. రెండో టెస్టు ఓటమి తర్వాత ఇంగ్లండ్ జట్టు పూర్తిగా తేలిపోయింది. కెప్టెన్ స్టోక్స్ విఫలమవడం వారి కష్టాలను మరింత రెట్టింపు చేసింది.
ఇంగ్లండ్ ఇంకా బజ్‌బాల్ భ్రమలోనే ఉన్నారు. వారు ఈ విధానంతోనే విజయవంతం కావాలంటే ఒక పద్దతి, ప్రణాళిక ఉండాలని" ఎక్స్‌లో సెహ్వాగ్ రాసుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment