దాదాపు నెల రోజుల సుదీర్ఘ విరామం తర్వాత భారత క్రికెట్ జట్టు తిరిగి మైదానంలో అడుగుపెట్టనుంది. బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు టీమిండియా సిద్దమవుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు సెప్టెంబర్ 19 నుంచి చెన్నై వేదికగా ఆరంభం కానుంది.
ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే చెన్నైకు చేరుకున్న టీమిండియా నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. కొత్త బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కల్ సైతం భారత జట్టుతో చేరాడు. బంగ్లా క్రికెట్ జట్టు కూడా సోమవారం(సెప్టెంబర్ 16)న భారత గడ్డపై అడుగుపెట్టే అవకాశముంది. కాగా వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ లో ఫైనల్ కు చేరాలంటే భారత్ కు ఈ సిరీస్ చాలా కీలకం. అందుకు తగ్గట్టే భారత్ తమ వ్యూహాలు రచిస్తోంది.
సెహ్వాగ్ రికార్డుపై కన్నేసిన హిట్‌మ్యాన్..
బంగ్లాతో తొలి టెస్టుకు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. చెపాక్ టెస్టులో హిట్‌మ్యాన్ మరో 7 సిక్సర్లు బాదితే టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు నమోదు చేసిన వీరేంద్ర సెహ్వాగ్ ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేస్తాడు.
సెహ్వాగ్ 103 టెస్టుల్లో 90 సిక్స్‌లు బాదగా.. రోహిత్ శర్మ 59 టెస్టు మ్యాచ్‌ల్లో ఇప్పటి వరకు 84 సిక్స్‌లు కొట్టాడు. ప్రస్తుతం ఈ జాబితాలో రోహిత్ రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. హిట్‌మ్యాన్ తర్వాతి స్ధానాల్లో 78 సిక్స్‌లతో ధోనీ, 69 సిక్స్‌లతో సచిన్, 64 సిక్స్‌లతో రవీంద్ర జడేజా వరుసగా కొనసాగుతున్నారు.
చదవండి: ఒకవేళ టీమిండియా మా దేశానికి రాకపోతే: పాక్ మాజీ క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment