వన్డే ప్రంపచకప్-2023 సన్నాహాకాలను మొదలపెట్టిన టీమిండియాకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో ఓటమిపాలైన భారత జట్టు.. మరో మ్యాచ్ మిగిలూండగానే సిరీస్‌ను అప్పగించేసింది. ఢాకా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ విరోచిత పోరాటం చేసినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు.
ఈ మ్యాచ్‌లో 69 పరుగులకే 6 వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు.. లోయార్డర్‌ను ఔట్ చేయడంలో విఫలమయ్యారు. అనంతరం బ్యాటింగ్‌లో భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఇక ఈ మ్యాచ్‌లో ఓటమిపాలై సిరీస్ కోల్పోయిన భారత జట్టుపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సెటైరికల్ ట్వీట్ చేశాడు.
"మన ఆట క్రిప్టో కరెన్సీ కంటే వేగంగా పతనమవుతుంది. జట్టును ప్రక్షాళన చేయాల్సిన సమయం అసన్నమైంది" అంటూ సెహ్వాగ్ ట్విటర్‌లో పేర్కొన్నాడు. ఇక ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో వన్డే ఛటోగ్రామ్ వేదికగా శనివారం జరగనుంది. ఈ మ్యాచ్‌కు భారత కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు పేసర్లు దీపక్ చాహర్, కుల్దీప్ సేన్ గాయం కారణంగా దూరమయ్యారు.
Cryptos se bhi tez gir rahi hai apni performance yaar. Need to shake up - wake up.
— Virender Sehwag (@virendersehwag) December 7, 2022
చదవండి: Team India Schedule: స్వదేశంలో టీమిండియా వరుస సిరీస్‌లు.. షెడ్యూల్ విడుదల
Comments
Please login to add a commentAdd a comment