వీరేంద్ర సెహ్వాగ్.. ప్రపంచ క్రికెట్‌లో పరిచయం అవసరం లేని పేరు. 14 ఏళ్ల పాటు భారత క్రికెట్‌కు సేవలు అందించిన సెహ్వాగ్.. క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. తన కెరీర్‌లో సెహ్వాగ్ ఎన్నో అద్భుత మైలురాయిలను అందుకున్నాడు. ఇప్పటికే టెస్ట్ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచూరియాన్‌గా వీరేంద్రుడు కొనసాగుతున్నాడు.
తన అంతర్జాతీయ కెరీర్‌లో 104 టెస్టులు, 251 వన్డేలు, 19 టీ20ల్లొ భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 2011 వన్డే ప్రపంచకప్, 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యునిగా సెహ్వాగ్ ఉన్నాడు. సెహ్వాగ్ ఐపీఎల్‌లో కూడా తన కంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే తాజాగా సెహ్వాగ్ ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తో చిట్ చాట్‌లో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
గతంలో బిగ్ బాష్ లీగ్ నుంచి తనకు వచ్చిన గొప్ప ఆఫర్‌ను తిరస్కరించినట్లు సెహ్వాగ్ తెలిపాడు. బిగ్ బాష్ లీగ్‌లో భారత ఆటగాళ్లు ఆడే అవకాశముందా అన్న ప్రశ్న సందర్భంగా సెహ్వాగ్ ఈ విషయాన్ని వెల్లడించాడు. గిల్‌క్రిస్ట్, సెహ్వాగ్ మధ్య జరిగిన చిట్‌చాట్‌పై ఓ లుక్కేద్దాం.
ఆడమ్ గిల్‌క్రిస్ట్: భవిష్యత్తులో భారత ఆటగాళ్లు ఐపీఎల్ కాకుండా ఇతర టీ20 లీగ్‌ల్లో ఆడే ఛాన్స్ ఉందా?
వీరేంద్ర సెహ్వాగ్: "లేదు , మాకు అవసరం లేదు. ఎందుకంటే మేము చాలా రిచ్. పేద దేశాలకు వెళ్లి ఆడము (నవ్వుతూ). నేను భారత జట్టులో చోటు కోల్పోయినప్పుడు నాకు బిగ్ బాష్ లీగ్‌లో ఆడమని ఓ ఫ్రాంచైజీ నుంచి ఆఫర్ వచ్చింది. ఎంత మొత్తం ఇస్తారని నేను ఆడిగాను. అందుకు వారి నుంచి వచ్చిన సమాధానం విని ఆశ్చర్యపోయాను.
వారు నాకు లక్ష డాలర్లు( భారత కరెన్సీలో సుమారు రూ.84 లక్షలు) ఇస్తామని చెప్పారు. వెంటనే నేను నవ్వుకుని అంతకంటే ఎక్కువ డబ్బులను నా సెలవుల్లో ఖర్చుచేస్తానని, గత రాత్రి పార్టీ బిల్లు కూడా లక్ష డాలర్లు దాటిందని వారికి చెప్పానని" సెహ్వాగ్ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment