యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో మొదలైన తొలి టెస్టులో ఇంగ్లండ్ తొలిరోజే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి అందరిని ఆశ్చర్యపరించింది. కొన్నాళ్లుగా బజ్‌బాల్ ఆటతీరుతో దూకుడు ప్రదర్శిస్తున్న ఇంగ్లండ్ ఆసీస్‌తో టెస్టులోనూ అదే ఆటతీరు చూపించింది. ఇటీవలే డబ్ల్యూటీసీ చాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా ముందు కనీసం 400 పరుగులైనా ఉంచాల్సిందని అభిమానులు ఆభిప్రాయపడుతున్నారు. బజ్‌బాల్ క్రికెట్‌తో ఇంగ్లండ్‌కు అనూకూల ఫలితాలు వస్తున్నప్పటికి ప్రతీసారి ఆ మంత్రం పనిచేయకపోవచ్చు.
ఒకవేళ ఆస్ట్రేలియా ఇంగ్లీష్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని రెండురోజుల పాటు బ్యాటింగ్ చేస్తే ఇంగ్లండ్‌కు కష్టాలు తప్పకపోవచ్చు. అలా గాకుండా బెన్ స్టోక్స్ నమ్మకాన్ని నిలబెడుతూ బౌలర్లు చెలరేగి ఆసీస్‌ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేస్తే మాత్రం ఇంగ్లండ్‌కు ఎదురుండదు. మరొక అంశమేమిటంటే ఇంగ్లండ్ తన దూకుడుతో మ్యాచ్‌ను మూడు రోజుల్లో ముగించే అవకాశం కూడా ఉంటుంది.
అయితే అవతల ఉన్నది పటిష్టమైన ఆస్ట్రేలియా. స్మిత్, లబుషేన్, ట్రెవిస్ హెడ్‌లతో పాటు ఉస్మాన్ ఖవాజా, అలెక్స్ క్యారీ లాంటి ఉద్దండులైన బ్యాటర్లు ఉన్నారు. వీరందరిని ఔట్ చేయడం అంత సామాన్య విషయం కాదు. కానీ ఇంగ్లండ్ బజ్‌బాల్ మంత్రం పనిచేస్తే మాత్రం వారి విజయం ఆపడం ఎవరి తరం కాదు.
చదవండి: క్రికెట్ చరిత్రలో ఆల్‌టైమ్ బెస్ట్ క్యాచ్.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment