
టెస్టు క్రికెటర్‌గా గుర్తింపు పొందిన జో రూట్ కొత్తగా కనిపిస్తున్నాడు. బజ్‌బాల్ ఆటతీరుతో ఇంగ్లండ్ దూకుడు కనబరుస్తుంటే.. రూట్ కూడా తన మార్క్ ఇన్నింగ్స్‌లతో అలరిస్తున్నాడు. టెస్టు క్రికెట్‌కు కొత్త అర్థం చెబుతున్న రూట్ సెంచరీల మీద సెంచరీలు చేసుకుంటూ పోతున్నాడు. తాజాగా యాషెస్‌లో తొలి టెస్టులోనే రూట్ సెంచరీతో మెరిశాడు. 152 బంతుల్లో 118 పరుగులు నాటౌట్‌గా నిలిచిన రూట్ ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి.
రూట్ టెస్టు కెరీర్‌లో ఇది 30వ శతకం కావడం విశేషం .టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆస్ట్రేలియా(Australia) మాజీ కెప్టెన్,ఆల్ టైమ్ గ్రేటెస్ట్ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన సర్ డాన్ బ్రాడ్‌మన్‌ను రూట్ అధిగమించాడు. ప్రస్తుతం రూట్ చందర్‌పాల్, మాథ్యూ హెడెన్‌లతో కలిసి 30 సెంచరీలతో సంయుక్తంగా కొనసాగుతున్నాడు.
ఇక 2021 నుంచి చూసుకుంటే రూట్ ఆటతీరు ఎంత వేగంగా ఉందో అర్థమవుతుంది. 2021 నుంచి 62 ఇన్నింగ్స్‌లు ఆడిన రూట్ 58.91 సగటుతో 3299 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు ఉంటే.. 13 అర్థసెంచరీలు ఉన్నాయి. ఇక 2022 నుంచి ఇప్పటివరకు ఏడు శతకాలు బాదిన రూట్ 2వేల పరుగులు సాధించాడు. ఈ దశాబ్దంలో టెస్టుల్లో రూట్ మినహా మరే ఇతర బ్యాటర్ ఇంత వేగంగా పరుగులు చేసిన దాఖలాలు లేవు.
Classic #Bazball😳
— Cricopia.com (@cric_opia) June 16, 2023
England declare on 393/8 #JoeRoot #Ashes2023 #ENGvsAUS #AUSvENG#Ashes23 #Cricket #testcricket#England #Cricketpic.twitter.com/qwo0iFfSa2