test centuries
-
ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురి తొలి సెంచరీలు.. అరుదైన రికార్డు
బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ను భారీస్కోరు వద్ద డిక్లేర్ చేసింది. రెండో రోజు వియాన్ ముల్డర్ (105 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) కూడా ‘శత’క్కొట్టడంతో ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం మూడు సెంచరీలు నమోదయ్యాయి. తొలి రోజే ఓపెనర్ టోని డి జోర్జి, వన్‌డౌన్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ శతకాలు బాదారు. ఓవర్‌నైట్ స్కోరు 307/2తో బుధవారం ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా 144.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 575 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.ఓవర్‌నైట్ బ్యాటర్లు జోర్జి (177; 12 ఫోర్లు, 4 సిక్స్‌లు), బెడింగ్హామ్ (59; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) మూడో వికెట్‌కు 116 పరుగులు జోడించారు. వేగంగా ఆడి అర్ధసెంచరీ సాధించిన బెడింగ్‌హామ్‌ను తైజుల్ బౌల్డ్ చేశాడు. 5 పరుగుల వ్యవధిలోనే మూడు వికెట్లుజోర్జి తన శతకాన్ని డబుల్ సెంచరీగా మలచుకోలేకపోయాడు. 141 క్రితంరోజు స్కోరుతో ఆట కొనసాగించిన అతను 36 పరుగులు జోడించి తైజుల్ బౌలింగ్‌లోనే ఎల్బీగా వెనుదిరిగాడు.తన మరుసటి ఓవర్లో కైల్ వెరియెన్ (0)ను తైజుల్ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో తొలి సెషన్లో 5 పరుగుల వ్యవధిలోనే మూడు వికెట్లు పడ్డాయి. జట్టు స్కోరు 400 పరుగులు దాటాక... రెండో సెషన్లో రికెల్టన్ (12) నహీద్ రాణా బౌలింగ్‌లో అవుటయ్యాడు. అయితే చకచకా నాలుగు వికెట్లు తీసిన ఆనందం ఆవిరయ్యేందుకు ఎంతోసేపు పట్టలేదు. రెండో సెషన్లో మరో వికెట్ పడకుండా ముల్డర్, సెనురన్ ముత్తుస్వామి (75 బంతుల్లో 68 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆరో వికెట్‌కు అబేధ్యమైన భాగస్వామ్యాన్ని నిర్మించారు. ఇద్దరు 152 పరుగులు జోడించారు.దక్షిణాఫ్రికా 575/6 డిక్లేర్డ్ ఇక టీ విరామం తర్వాత ముత్తుస్వామి అర్ధసెంచరీ, ముల్డర్ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లామ్ (5/198) ఐదు వికెట్లు తీయగలిగాడు కానీ దాదాపు 200 పరుగులు సమర్పించుకున్నాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్ ఆట ముగిసే సమయానికి 9 ఓవర్లలో 38 పరుగులే చేసి 4 కీలకమైన వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.టాప్–3 బ్యాటర్లు షాద్మన్ (0), హసన్ (10), జాకీర్ హసన్ (2) చేతులెత్తేశారు. దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ రబడ 2 వికెట్లు తీయగా, నైట్‌వాచ్‌మన్ హసన్ (3)ను స్పిన్నర్ కేశవ్ మహరాజ్ అవుట్ చేశాడు. మోమినుల్ హక్ (6 బ్యాటింగ్), కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.‘బాక్సింగ్ డే’ టెస్టులోచివరిసారి టెస్టుల్లో దక్షిణాఫ్రికా జట్టు స్కోరు 500 పరుగులు దాటిన సంవత్సరం 2020. ఆ ఏడాది సెంచూరియన్‌లో శ్రీలంక జట్టుతో జరిగిన ‘బాక్సింగ్ డే’ టెస్టులో దక్షిణాఫ్రికా 621 పరుగులకు ఆలౌటైంది.ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురి తొలి సెంచరీలు.. అరుదైన రికార్డుఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాటర్లు తమ తొలి సెంచరీని నమోదు చేయడం ఇది రెండోసారి మాత్రమే. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టులో దక్షిణాఫ్రికా తరఫున టోనీ జోర్జి, స్టబ్స్, ముల్డర్ సెంచరీలు సాధించారు. 1948లో భారత్‌తో ఢిల్లీలో జరిగిన టెస్టులో వెస్టిండీస్ తరఫున గెర్రీ గోమెజ్, రాబర్ట్ క్రిస్టియాని, క్లేడ్ వాల్కట్ తమ తొలి సెంచరీలను నమోదు చేశారు. చదవండి: India vs New Zealand: జయమా... పరాభవమా! -
బ్రాడ్‌మన్, కోహ్లిలను అధిగమించిన విలియమ్సన్
న్యూజిలాండ్ ఆటగాడు, ఆ జట్టు మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అరుదైన ఘనత సాధించాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో సెంచరీ సాధించడం ద్వారా టెస్ట్‌ల్లో 30 సెంచరీల మార్కును (97 మ్యాచ్‌ల్లో) తాకాడు. ఈ ఘనత సాధించే క్రమంలో దిగ్గజ ఆటగాళ్లు డాన్ బ్రాడ్‌మన్, విరాట్ కోహ్లిల రికార్డులను అధిగమించాడు. టెస్ట్‌ల్లో బ్రాడ్‌మన్ (52 టెస్ట్‌లు), విరాట్ కోహ్లి (113 టెస్ట్‌లు) 29 సెంచరీలు చేయగా.. తాజా సెంచరీతో కేన్ వీరిద్దరిని దాటాడు. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న ప్లేయర్లలో కేన్, ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్‌తో (137 మ్యాచ్‌లు) సమానంగా 30 సెంచరీలు కలిగి ఉన్నాడు. యాక్టివ్ క్రికెటర్లలో అత్యధిక టెస్ట్ సెంచరీ రికార్డు స్టీవ్ స్మిత్ పేరిట ఉంది. స్మిత్ ఇప్పటివరకు 32 సెంచరీలు (107 టెస్ట్‌ల్లో) చేశాడు. అన్ని ఫార్మాట్లలో అత్యధిక సెంచరీల రికార్డు (యాక్టివ్ క్రికెటర్లలో) విరాట్ కోహ్లి పేరిట ఉంది. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 80 అంతర్జాతీయ సెంచరీలు ఉన్నాయి. ఈ జాబితాలో డేవిడ్ వార్నర్ (49 సెంచరీలు), జో రూట్ (46), రోహిత్ శర్మ (46), స్టీవ్ స్మిత్ (44), కేన్ విలియమ్సన్ (43) విరాట్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుత టెస్ట్ బ్యాటర్స్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్‌గా కొనసాగుతున్న కేన్.. గత 9 టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో 5 సెంచరీలు చేయడం విశేషం. ఇదిలా ఉంటే, సౌతాఫ్రికాతో తొలి టెస్ట్‌లో కేన్ విలియమ్సన్తో (112) పాటు వన్డే వరల్డ్‌కప్ సెన్సేషన్ రచిన్ రవీంద్ర (118) కూడా సెంచరీతో కదంతొక్కాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వీరిద్దరూ అజేయ శతకాలతో ఇన్నింగ్స్‌లను కొనసాగిస్తున్నారు. న్యూజిలాండ్ స్కోర్ 2 వికెట్ల నష్టానికి 258 పరుగులుగా ఉంది. ఓపెనర్లు టామ్ లాథమ్ (20), డెవాన్ కాన్వే (1) ఔటయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో మొరేకీ, ప్యాటర్సన్ తలో వికెట్ పడగొట్టారు. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం సౌతాఫ్రికా.. న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్ కోసం క్రికెట్ సౌతాఫ్రికా ద్వితియ శ్రేణి జట్టును ఎంపిక చేసింది. -
శతకాలతో చెలరేగిన రోహిత్, జైశ్వాల్.. పట్టు బిగిస్తోన్న టీమిండియా
డొమినికాలోని విండ్సర్ పార్క్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. రెండోరోజు ఆట ముగిసేసరికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది. చిచ్చరపిడుగు యశస్వి జైశ్వాల్ అరంగేట్రం టెస్టులోనే అదరగొడుతూ అజేయ సెంచరీతో మెరవగా.. కెప్టెన్ రోహిత్ శర్మ(221 బంతుల్లో 103 పరుగులు) కూడా శతకంతో అదరగొట్టాడు. ప్రస్తుతం జైశ్వాల్ (350 బంతుల్లో 143 పరుగులు నాటౌట్), విరాట్ కోహ్లి(96 బంతుల్లో 36 పరుగులు నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఓవర్‌నైట్ స్కోరు 80/0తో రెండోరోజు ఆటను ప్రారంభించిన టీమిండియా తొలి సెషన్లో నెమ్మదిగా ఆడింది. తొలి సెషన్లో ఓపెనర్లు ఇద్దరు ఆచితూచి ఆడారు. దీంతో స్కోరుబోర్డు నెమ్మదించింది. ఈ క్రమంలో అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో పుల్ షాట్ ఆడిన జైశ్వాల్ 104 బంతుల్లో అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. లంచ్ విరామానికి టీమిండియా 146/0తో పటిష్టమైన స్థితలో నిలిచింది. ఇక లంచ్ విరామం అనంతరం టీమిండియా ఓపెనర్లు కాస్త దూకుడు చూపెట్టారు. జైశ్వాల్ 215 బంతుల్లో సెంచరీ సాధించి అరంగేట్రం టెస్టులోనే శతకం సాధించిన మూడో ఓపెనర్.. ఓవరాల్‌గా 17వ భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఆ తర్వాత కాసేపటికే కెప్టెన్ రోహిత్ శర్మ 220 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకొని టెస్టుల్లో పదో శతకాన్ని అందుకున్నాడు. సెంచరీ చేసిన మరుసటి బంతికే రోహిత్ పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. క్రీజులోకి వచ్చిన గిల్(6 పరుగులు) ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయాడు. స్పిన్నర్ వారికన్ బౌలింగ్‌లో అథనేజ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. టీ విరామానికి టీమిండియా 245/2 స్కోరు సాధించింది. చివరి సెషన్లో మరో వికెట్ పడకుండా కోహ్లి, జైశ్వాల్‌లు ఆచితూచి ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరును పెంచే ప్రయత్నం చేశారు. ఇక టీమిండియా చివరి సెషన్లో వికెట్లేమి కోల్పోకుండా 67 పరుగులు చేసింది. Kaptaan 👏 💯@ImRo45 . . #INDvWIonFanCode #WIvIND pic.twitter.com/bEGL3Ozes2 — FanCode (@FanCode) July 13, 2023 यशस्वी भवः 💯 . .#INDvWIonFanCode #WIvIND pic.twitter.com/59Uq9ik1If — FanCode (@FanCode) July 13, 2023 చదవండి: #YashasviJaiswal: అరంగేట్రంలోనే రికార్డుల మోత మోగించిన జైశ్వాల్ Ind Vs WI: అతడొక అద్భుతం... చురుకైన, తెలివైన ఆటగాడు: అశ్విన్ ప్రశంసల జల్లు -
టెస్టుల్లో 32వ సెంచరీ.. ఆస్ట్రేలియన్ దిగ్గజం సరసన
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ శతకంతో మెరిశాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో స్మిత్ 169 బంతుల్లో శతకం మార్క్ అందుకున్నాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా తాను మాత్రం ఓపికతో ఆడుతూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు ఉన్నాయి. కాగా స్మిత్‌కు తన టెస్టు కెరీర్లో ఇది 32వ శతకం కావడం విశేషం. ఈ నేపథ్యంలో టెస్టుల్లో అత్యధిక సెంచరీల విషయంలో ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ స్టీవ్ వాతో(32 టెస్టు సెంచరీలు) కలిసి సంయుక్తంగా ఉన్నాడు. ఈ జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (51 సెంచరీలు) తొలి స్థానంలో ఉండగా.. జాక్ కలీస్(45 సెంచరీలు) రెండో స్థానంలో, రికీ పాంటింగ్(41 సెంచరీలు) మూడో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా తరపున అత్యధిక టెస్టు సెంచరీలు బాదిన క్రికెటర్లలో స్మిత్.. స్టీవ్ వాతో కలిసి రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ప్రస్తుత తరంలో టెస్టుల్లో యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు స్మిత్వే కావడం విశేషం. ఈ క్రమంలో టెస్టుల్లో అత్యంత వేగంగా 32 సెంచరీలు సాధించిన తొలి బ్యాటర్‌గా స్మిత్ చరిత్ర సృష్టించాడు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి 85 పరుగులతో ఆడుతున్న స్మిత్ సెంచరీకి చేరువగా వచ్చిన సమయంలో ఒత్తిడికి గురయ్యాడు. మరోవైపు ఆసీస్ కూడా వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో స్మిత్ సెంచరీ చేస్తాడా అన్న అనుమానం వచ్చింది. కానీ కెప్టెన్ పాట్ కమిన్స్ ఒక ఎండ్‌లో నిలబడి స్మిత్ సెంచరీ అయ్యేలా చూశాడు. ప్రస్తుతం ఏడు వికెట్ల నష్టానికి 393 పరుగులు చేసిది. స్మిత్ 110 పరుగులు, పాట్ కమిన్స్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. 🚨Steve Smith is the fastest batsman to score 32nd Hundreds in Test Cricket🚨#Ashes23 #ENGvAUS#ENGvsAUS #Ashespic.twitter.com/bKwZYRL5Ez — Cricket Videos 🏏 (@Abdullah__Neaz) June 29, 2023 A fine innings comes to an end for Steve Smith 🤝 https://t.co/gywkuUUD3T pic.twitter.com/Bxn4vbbRg5 — England Cricket (@englandcricket) June 29, 2023 In 2010 - Steve Smith made his Test debut at Lord's & batted at 8. In 2023 - Steve Smith completed his 32nd Test hundred at Lord's. One of the Greatest turn-arounds in cricket history. pic.twitter.com/UjjS9cc9Oy — Johns. (@CricCrazyJohns) June 29, 2023 చదవండి: సీన్ రివర్స్ అయినట్టుందే!.. ఇంగ్లండ్‌కు దిమ్మతిరిగే షాక్ హ్యాట్రిక్ సెంచరీ.. వరల్డ్‌కప్‌కు చేర్చడమే ధ్యేయంగా పెట్టుకున్నాడా! -
రెండేళ్ల వ్యవధిలో తొమ్మిది శతకాలు.. కొత్తగా కనిపిస్తున్నాడు
టెస్టు క్రికెటర్‌గా గుర్తింపు పొందిన జో రూట్ కొత్తగా కనిపిస్తున్నాడు. బజ్‌బాల్ ఆటతీరుతో ఇంగ్లండ్ దూకుడు కనబరుస్తుంటే.. రూట్ కూడా తన మార్క్ ఇన్నింగ్స్‌లతో అలరిస్తున్నాడు. టెస్టు క్రికెట్‌కు కొత్త అర్థం చెబుతున్న రూట్ సెంచరీల మీద సెంచరీలు చేసుకుంటూ పోతున్నాడు. తాజాగా యాషెస్‌లో తొలి టెస్టులోనే రూట్ సెంచరీతో మెరిశాడు. 152 బంతుల్లో 118 పరుగులు నాటౌట్‌గా నిలిచిన రూట్ ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. రూట్ టెస్టు కెరీర్లో ఇది 30వ శతకం కావడం విశేషం .టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆస్ట్రేలియా(Australia) మాజీ కెప్టెన్,ఆల్ టైమ్ గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్లలో ఒకరైన సర్ డాన్ బ్రాడ్‌మన్‌ను రూట్ అధిగమించాడు. ప్రస్తుతం రూట్ చందర్‌పాల్, మాథ్యూ హెడెన్‌లతో కలిసి 30 సెంచరీలతో సంయుక్తంగా కొనసాగుతున్నాడు. ఇక 2021 నుంచి చూసుకుంటే రూట్ ఆటతీరు ఎంత వేగంగా ఉందో అర్థమవుతుంది. 2021 నుంచి 62 ఇన్నింగ్స్‌లు ఆడిన రూట్ 58.91 సగటుతో 3299 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు ఉంటే.. 13 అర్థసెంచరీలు ఉన్నాయి. ఇక 2022 నుంచి ఇప్పటివరకు ఏడు శతకాలు బాదిన రూట్ 2వేల పరుగులు సాధించాడు. ఈ దశాబ్దంలో టెస్టుల్లో రూట్ మినహా మరే ఇతర బ్యాటర్ ఇంత వేగంగా పరుగులు చేసిన దాఖలాలు లేవు. Classic #Bazball😳 England declare on 393/8 #JoeRoot #Ashes2023 #ENGvsAUS #AUSvENG#Ashes23 #Cricket #testcricket#England #Cricketpic.twitter.com/qwo0iFfSa2 — Cricopia.com (@cric_opia) June 16, 2023 చదవండి: #Bazball: మంత్రం పనిచేస్తుందా? విఫలమవుతుందా? -
ఆఫ్గన్‌తో ఏకైక టెస్టు.. చరిత్ర సృష్టించిన బంగ్లా బ్యాటర్
అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో బంగ్లాదేశ్ స్టార్ బ్యాటర్ నజ్ముల్ హొసెన్ షాంటో చరిత్ర సృష్టించాడు. ఇప్పటికే తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన షాంటో 175 బంతుల్లో 146 పరుగులు చేశాడు.. తాజాగా రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ మార్క్ అందుకున్నాడు. 115 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న షాంటో ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నజ్ముల్ షాంటో ఒక అరుదైన రికార్డు అందుకున్నాడు. బంగ్లాదేశ్ తరపున ఒక టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ సెంచరీలు బాదిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు. ఇంతకముందు మోమినుల్ హక్ 2018లో శ్రీలంకతో చిట్టగాంగ్ వేదికగా జరిగిన టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 176, రెండో ఇన్నింగ్స్‌లో 105 పరుగులు చేశాడు. ఇక టెస్టుల్లో అఫ్గానిస్తాన్ జట్టుపై ఒక టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు బాదిన తొలి క్రికెటర్‌గా షాంటో నిలిచాడు. ఇక ఓవరాల్ టెస్టు క్రికెట్ జాబితాలో నజ్ముల్ హొసెన్ షాంటో 91వ క్రికెటర్‌గా నిలిచాడు. ఇక టెస్టు మ్యాచ్ విషయానికి వస్తే బంగ్లాదేశ్ భారీ విజయం దిశగా అడుగులు వేస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే ఆలౌట్ అయిన ఆఫ్గన్‌ను ఫాలోఆన్ ఆడించకుండా రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న బంగ్లా మూడోరోజు ఆటలో లంచ్ విరామ సమయానికి రెండు వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. షాంటో 112, మోమినుల్ హక్ 43 పరుగులతో ఆడుతున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ 491 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆటకు ఇంకా రెండురోజులు మిగిలి ఉండడంతో బంగ్లాదేశ్ భారీ విజయాన్ని నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. చదవండి: షేన్ వార్న్ బయోపిక్.. శృంగార సన్నివేశం చేస్తూ ఆస్పత్రిపాలు -
రూట్, స్మిత్ అదరగొడుతున్నారు.. కేన్ మామ లైన్లోకి వచ్చాడు, కోహ్లి పరిస్థితి ఏంటి..?
BGT 2023 IND VS AUS 3rd Test: ప్రస్తుత క్రికెట్ జనరేషన్లో విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్ ఫాబ్ ఫోర్ బ్యాటర్లుగా కీర్తించబడుతున్న విషయం తెలిసిందే. ఈ నలుగురిలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిది అన్ని విషయాల్లో పైచేయి అన్న విషయంతో (కొద్ది రోజుల ముందు వరకు) దాదాపు అందరూ ఏకీభవించేవారు. అలాంటిది ప్రస్తుతం పరిస్థితి తారుమారైపోయింది. కోహ్లిని ఏ విషయంలో గొప్ప అని చెప్పుకోవాలో టీమిండియా ఫ్యాన్స్‌కు అర్ధం కావట్లేదు. టెక్నిక్, పరుగులు, సెంచరీలు, రికార్డులు ఇలా చెప్పుకుంటు పోతే దాదాపు అన్ని విషయాల్లో సహచరులతో పోలిస్తే కోహ్లి వెనకపడి ఉన్నాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో రూట్, స్మిత్, విలియమ్సన్తో పోలిస్తే కాస్త పర్వాలేదనిపించినా.. టెస్ట్‌ల్లో మాత్రం కోహ్లి ప్రదర్శన నానాటికి తీసికట్టుగా మారుతుందన్నది బహిరంగ రహస్యం. 2021 ఆరంభంలో కోహ్లి ఫ్యాబ్ ఫోర్ ఆటగాళ్లలో అందరికంటే అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన బ్యాటర్‌గా ఉండేవాడు. నాటికి కోహ్లి 27 సెంచరీలు చేసి ఉంటే, స్మిత్ 26, విలియమ్సన్ 24, రూట్ 17 సెంచరీలు మాత్రమే చేశారు. అదే 2023 ఫిబ్రవరి వచ్చే సరికి కోహ్లి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా అదే 27 సెంచరీల మార్కు వద్ద మిగిలిపోగా.. స్మిత్ 30, రూట్ 29, విలియమ్సన్ 26 సెంచరీల మార్కును అందుకున్నారు. వీరిలో రూట్ గత రెండేళ్ల కాలంలో ఏకంగా 12 సెంచరీలు బాదగా.. స్మిత్ మధ్యమధ్యలో మూడంకెల ఫిగర్ అందుకున్నాడు. వీరితో పోలిస్తే విలియమ్సన్, కోహ్లి పరిస్థితి దారుణంగా ఉంది. విలియమ్సన్ లేటుగా అయిన రెండేళ్ల తర్వాత.. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో సెంచరీ చేయగా.. 2021 జనవరిలో చివరి టెస్ట్ సెంచరీ చేసిన కోహ్లి దాదాపు మూడేళ్లైపోయినా ఇప్పటివరకు శతక్కొట్టలేదు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో సెంచరీలు చేసిన కోహ్లి టెస్ట్‌ల్లో మాత్రం ఈ మార్కును అందుకోలేకపోతున్నాడు. ఇదే కొనసాగితే.. విలియమ్సన్ కోహ్లిని దాటిపోయి టెస్ట్‌ల్లో కేవలం 9 సెంచరీలు మాత్రమే కలిగిన బాబర్ ఆజమ్ కూడా కోహ్లిని అధిగమించే ప్రమాదం ఉంది. ఓవరాల్‌గా చూస్తే.. సెంచరీల విషయంలో ఫాబ్ ఫోర్ ఆటగాళ్లలో కోహ్లి 74 సెంచరీలతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉండగా.. రూట్ 45, స్మిత్ 42, విలియమ్సన్ 39 సెంచరీలు చేశారు. టెస్ట్‌ల్లో కోహ్లి మూడేళ్ల సెంచరీ దాహానికి తెరదించి, ఆసీస్‌తో జరిగే మూడో టెస్ట్‌లో శతక్కొట్టాలని ఆశిద్దాం -
సెంచరీలతో చెలరేగిన స్టోక్స్, బెన్ ఫోక్స్.. పట్టు బిగిస్తున్న ఇంగ్లండ్
సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ పట్టు బిగిస్తుంది. తొలి టెస్టులో దారుణ పరాభవానికి ప్రతీకారం తీర్చుకునే పనిలో పడింది. తొలి ఇన్నింగ్స్‌లో ప్రొటిస్‌ను 151 పరుగులకే ఆలౌట్ చేసి తొలి రోజు ఆధిపత్యం ప్రదర్శించిన ఇంగ్లండ్.. రెండోరోజు ఆటలో బ్యాటింగ్‌లో దూకుడు కనబరిచింది. ముఖ్యంగా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(163 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 103 పరుగులు) చాలా రోజుల తర్వాత శతకంతో చెలరేగాడు. Photo Credit: ESPNcricinfo స్టోక్స్‌కు టెస్టుల్లో ఇది 12వ శతకం కాగా.. కెప్టెన్‌గా మాత్రం ఇదే మొదటిది. ఇక వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ కూడా సెంచరీ మార్క్‌ను(209 బంతుల్లో 104 బ్యాటింగ్, 9 ఫోర్లు)అందుకున్నాడు. కాగా బెన్ఫోక్స్కు టెస్టుల్లో ఇది రెండో సెంచరీ. సెంచరీ సాధించి స్టోక్స్ ఔటైనప్పటికి వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను నడిపిస్తున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 7 వికెట్ల నష్టానికి 395 పరుగులు చేసింది. ఇప్పటివరకు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగుల ఆధిక్యంలో ఉంది. A special first hundred as England Test captain for Ben Stokes ✨ pic.twitter.com/PiKjUGO94d — ESPNcricinfo (@ESPNcricinfo) August 26, 2022 Manchester stands up and applauds a quite magnificent Test hundred 👏 It's the first at home for Ben Foakes pic.twitter.com/cIFaWhC3YB — ESPNcricinfo (@ESPNcricinfo) August 26, 2022 -
73 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన కివీస్ బ్యాటర్.. దిగ్గజాల సరసన చోటు
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ సెంచరీల మోత మోగిస్తున్నాడు. తాజాగా లీడ్స్ వేదికగా మూడో టెస్టులోనూ సెంచరీతో మెరిసిన మిచెల్‌కు ఇది హ్యాట్రిక్ శతకం కావడం విశేషం. ఇక మూడో టెస్టులో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు ఆలౌట్ అయింది. డారిల్ మిచెల్ 109, టామ్ బ్లండన్ 55 పరుగులు, టిమ్ సౌథీ 33 పరుగులు చేశారు. ఒక దశలో 123 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన న్యూజిలాండ్‌ను మిచెల్, టామ్ బ్లండన్లు ఆదుకున్నారు. ఈ ఇద్దరు ఆరో వికెట్‌కు 120 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఈ నేపథ్యంలోనే డారిల్ మిచెల్ పలు రికార్డులు బద్దలు కొట్టాడు. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం. ►228 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసుకున్న డారిల్ మిచెల్ విదేశంలో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా మూడు టెస్టుల్లో మూడు శతకాలు నమోదు చేసిన తొలి న్యూజిలాండ్ బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ►జాక్ లీచ్ బౌలింగ్‌లో సిక్సర్ కొట్టి సెంచరీ మార్కును అందుకున్న డారిల్ మిచెల్.. 73 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రస్తుత మూడు టెస్టుల సిరీస్‌లో డారిల్ మిచెల్ ఇప్పటివరకు 482 పరుగులు సాధించాడు. అంతకముందు 1949లో బెర్ట్ సుత్క్లిఫ్ ఇంగ్లండ్‌తో సిరీస్‌లో 451 పరుగులు సాధించాడు. తాజాగా బెర్ట్ సుత్ల్కిఫ్ను అధిగమించిన డారిల్ మిచెల్ తొలి స్థానంలో నిలిచాడు. ►ఇక 21వ శతాబ్దంలో విదేశాల్లో వరుసగా హ్యాట్రిక్ సెంచరీలు నమోదు చేసిన జాబితాలో మిచెల్ నాలుగో ప్లేయర్‌గా చోటు దక్కించుకున్నాడు. ఇంగ్లండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో వరుసగా మూడు శతకాలు నమోదు చేసిన డారిల్ మిచెల్ క్రికెట్ దిగ్గజాల సరసన చోటు సంపాదించాడు. ఇంతకముందు టీమిండియా నుంచి రాహుల్ ద్రవిడ్(2002, 2011), పాకిస్తాన్ నుంచి మహ్మద్ యూసఫ్(2002), ఆస్ట్రేలియా నుంచి స్టీవ్ స్మిత్(2019లో) ఈ ఘనత సాధించారు. ►మూడు టెస్టుల సిరీస్‌లో మూడు టెస్టు మ్యాచ్‌ల్లో మూడు సెంచరీలు సాధించిన జాబితాలో డారిల్ మిచెల్ ఏడో స్థానంలో నిలిచాడు. విరాట్ కోహ్లి(2017లో శ్రీలంకపై), రాస్ టేలర్(2013లో వెస్టిండీస్‌పై) , మహ్మద్ యూసఫ్(2006లో వెస్టిండీస్‌పై), మాథ్యూ హెడెన్(2002లో సౌతాఫ్రికాపై), షోయబ్ మహ్మద్(1990లో ఆస్ట్రేలియాపై), బారింగ్టన్(1967లో పాకిస్తాన్‌పై) డారిల్ మిచెల్ కంటే ముందున్నారు. Three hundreds in three matches. Well batted, Daryl Mitchell 👏 Scorecard/clips: https://t.co/AIVHwaRwQv 🏴 #ENGvNZ 🇳🇿 pic.twitter.com/ZiDfbtgsbT — England Cricket (@englandcricket) June 24, 2022 -
WI Vs Eng 2nd Test: జో రూట్ అరుదైన సెంచరీ.. దిగ్గజాలను వెనక్కి నెట్టి..
WI Vs Eng 2nd Test- Joe Root: ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ తన కెరీర్లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. 25వ టెస్టు సెంచరీ నమోదు చేశాడు. వెస్టిండీస్‌తో బార్బడోస్‌లో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ సందర్భంగా ఈ ఫీట్ అందుకున్నాడు. తద్వారా టెస్టుల్లో 24 సెంచరీలు నమోదు చేసిన గ్రెగ్ చాపెల్, వివియన్ రిచర్డ్స్ వంటి దిగ్గజాలు, మహ్మద్ యూసఫ్, కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్ వంటి క్రికెటర్లను వెనక్కి నెట్టాడు. వీరి కంటే రూట్ ఒక అడుగు ముందు వరుసలో నిలిచాడు. ఈ క్రమంలో బ్యాట్‌తో అభివాదం చేస్తూ మైదానంలోని అభిమానులతో రూట్ తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఇందుకు స్పందనగా అతడి పేరును పాటగా ఆలపిస్తూ ఫ్యాన్స్ అభినందనలు తెలిపారు. కాగా విండీస్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ జాక్ క్రాలే డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో వనౌడౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ రూట్ 246 బంతుల్లో 119 పరుగులు(నాటౌట్) సాధించి జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. మరో ఓపెనర్ అలెక్స్ లీస్ 30 పరుగులు చేసి నిష్క్రమించగా.. క్రీజులోకి వచ్చిన డానియెల్ లారెన్స్ 91 పరుగులు చేశాడు. ఈ క్రమంలో తొలిరోజు ఆట ముగిసేసరికి ఇంగ్లండ్ 3 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. చదవండి: MS Dhoni: నెంబర్-7 మిస్టరీ వెనుక మనం ఊహించని ట్విస్ట్ IPL 2022- Suresh Raina: రైనా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఎట్టకేలకు ఐపీఎల్లో ఎంట్రీ! అయితే.. An incredible reception 👏 For our incredible leader 🙌 Scorecard: https://t.co/d2gy5BUkWH 🏝 #WIvENG 🏴 | @Root66 pic.twitter.com/eCLdTVXba2 — England Cricket (@englandcricket) March 16, 2022 View this post on Instagram A post shared by ICC (@icc) An incredible reception 👏 For our incredible leader 🙌 Scorecard: https://t.co/d2gy5BUkWH 🏝 #WIvENG 🏴 | @Root66 pic.twitter.com/eCLdTVXba2 — England Cricket (@englandcricket) March 16, 2022 -
IND Vs SA: ఏడుసార్లు పర్యటిస్తే 9 మందికి మాత్రమే సాధ్యమైంది!
Only Nine Indian Batsmen Hit Century In South Africa Tour.. సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా ఇంతవరకు టెస్టు సిరీస్‌ను గెలవలేకపోయింది. ప్రతీసారి ఎన్నో ఆశలతో ప్రొటీస్ గడ్డపై అడుగుపెట్టే టీమిండియా రిక్త హస్తాలతో వెనుదిరగాల్సి వచ్చింది. ఇక 2018లో చివరిసారి సౌతాఫ్రికాలో పర్యటించిన భారత్ 2-1 తేడాతో టెస్టు సిరీస్‌ను కోల్పోయింది. 1991 నుంచి చూసుకుంటే సౌతాఫ్రికా, భారత్‌ల మధ్య 39 టెస్టు మ్యాచ్‌లు జరగ్గా.. ఇందులో టీమిండియా 14 విజయాలు నమోదు చేయగా.. సౌతాఫ్రికా 15 విజయాలు అందుకుంది. ఇక ఇప్పటివరకు భారత్ సౌతాఫ్రికాలో ఏడుసార్లు పర్యటించగా.. ఒక్కసారి కూడా టెస్టు సిరీస్ గెలవలేదు. కేవలం మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయాలు నమోదు చేసింది. ఇక సౌతాఫ్రికా పిచ్‌లంటే బౌలర్లకు స్వర్గధామం అని చెప్పొచ్చు. కుకాబుర్రా బంతులతో స్వింగ్, సీమ్, పేస్, బౌన్స్‌లను రాబట్టే బౌలర్లు బ్యాట్స్మెన్లను ముప్పతిప్పలు పెడుతుంటారు. అలాంటి సౌతాఫ్రికా గడ్డపై మన టీమిండియా బ్యాట్స్మెన్లలో కేవలం 9 మంది మాత్రమే టెస్టుల్లో శతకాలు సాధించారు. సచిన్ టెండూల్కర్: టీమిండియా దిగ్గజ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్‌కు సౌతాఫ్రికా గడ్డపై మంచి రికార్డే ఉంది. బ్యాట్స్మన్లు సౌతాఫ్రికా పిచ్‌లపై ఒక్క సెంచరీ సాధించడానికే నానా కష్టాలు పడితే.. సచిన్ మాత్రం ఐదు సెంచరీలు సాధించాడు. ఇందులో రెండుసార్లు 150 మార్క్‌ను అందుకోగా.. 146, 111, 111 నాటౌట్ ఉన్నాయి. ఇక 1997లో కేప్‌టౌన్ వేదికగా జరిగిన టెస్టులో సచిన్ 169 పరుగులు చేయడం విశేషం. విరాట్ కోహ్లి: ఇక సచిన్ తర్వాతి స్థానంలో విరాట్ కోహ్లి ఉన్నాడు. సౌతాఫ్రికా గడ్డపై కోహ్లి ఇప్పటివరకు టెస్టుల్లో రెండు సెంచరీలు సాధించారు. ఒకసారి 153 పరుగులు.. మరొకసారి 119 పరుగులు చేశాడు. మహ్మద్ అజారుద్దీన్: 1997లో సౌతాఫ్రికా పర్యటనలో కేప్‌టౌన్ వేదికగా జరిగిన టెస్టులో టీమిండియా 58 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో సచిన్‌తో కలిసి అజారుద్దీన్ ఆరో వికెట్‌కు 222 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో అజహర్ 115 పరుగులతో మెరవగా.. సచిన్ టెండూల్కర్ 169 పరుగులతో సౌతాఫ్రికా గడ్డపై బెస్ట్ స్కోర్ సాధించాడు. రాహుల్ ద్రవిడ్: టీమిండియా వాల్‌గా పేరు పొందిన రాహుల్ ద్రవిడ్‌కు ప్రొటీస్ గడ్డపై ఒక సెంచరీ ఉంది. 1997లో జోహన్నెస్‌బర్గ్ టెస్టులో ఈ మిస్టర్ డిపెండబుల్ 148 పరుగులతో శతకం సాధించాడు. ఇక ద్రవిడ్ ప్రస్తుతం టీమిండియా హెడ్‌కోచ్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కపిల్ దేవ్: టీమిండియా దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ 1992లో పోర్ట్ ఎలిజిబెత్ వేదికగా జరిగిన టెస్టులో 129 పరుగులు చేశాడు. వీరేంద్ర సెహ్వాగ్: టీమిండియా మాజీ విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సౌతాఫ్రికా గడ్డపై ఒక టెస్టు మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. చతేశ్వర్ పుజారా: టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా సౌతాఫ్రికా గడ్డపై ఒక సెంచరీ నమోదు చేశాడు. 2013లో జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన టెస్టులో 153 పరుగులు చేశాడు. వసీమ్ జాఫర్: ప్రస్తుతం కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న వసీం జాఫర్ 2007 సౌతాఫ్రికా పర్యటనలో ఒక శతకంతో మెరిశాడు. సెంచూరియన్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో 116 పరుగులు సాధించాడు. ప్రవీణ్ ఆమ్రే: 1992 సౌతాఫ్రికా పర్యటనలో డర్బన్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో ప్రవీణ్ ఆమ్రే (103) సెంచరీతో మెరిశాడు. ► మరి మూడేళ్ల తర్వాత మళ్లీ సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న టీమిండియా మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈసారి ఏ ఆటగాడు శతకాన్ని అందుకుంటాడో చూడాలి. ఇక డిసెంబర్ 26 నుంచి ఇరుజట్ల మధ్య తొలి టెస్టు జరగనుంది. -
ENG Vs IND: బ్రాడ్‌మన్ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ
లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగోటెస్టులో రోహిత్ శర్మ సెంచరీ సాధించడం ద్వారా పలు రికార్డులు అందుకున్నాడు. విదేశాల్లో టెస్టుల్లో తొలిసారి సెంచరీ సాధించిన రోహిత్ శర్మ ఇంగ్లండ్ గడ్డపై ఒక రికార్డును అందుకున్నాడు. ఇంగ్లండ్ గడ్డపై అన్ని ఫార్మాట్లు కలిపి అత్యధిక సెంచరీలు సాధించిన జాబితాలో రోహిత్ రెండో స్థానంలో నిలిచాడు. రోహిత్ శర్మ ఇంగ్లండ్‌లో అన్ని ఫార్మాట్లు కలిపి 9 సెంచరీలు నమోదు చేశాడు. ఓవరాల్‌గా ఆసీస్ దిగ్గజ బ్యాట్స్‌మన్ డాన్ బ్రాడ్‌మన్ 11 సెంచరీలతో తొలి స్థానంలో ఉన్నాడు. విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ కూడా 9 సెంచరీలతో రోహిత్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. ఇక అంతకముందు టీమిండియా మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ 8 సెంచరీల రికార్డును రోహిత్ అధిగమించాడు. ఇక మ్యాచ్‌లో నాలుగోరోజు ఆటలో టీమిండియా వెనువెంటనే వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ బౌలర్ క్రిస్ వోక్స్ వరుస ఓవర్లలో జడేజా(17), రహానే(0) పెవిలియన్‌కు చేర్చాడు. ప్రస్తుతం 200 పరుగుల ఆధిక్యంలో ఉన్న టీమిండియా స్కోరు 299/5గా ఉంది. చదవండి: Rohith Sharma: రోహిత్ సెంచరీ.. భార్య రితికా ముద్దుల వర్షం చెప్పాడంటే చేస్తాడంతే.. అంటున్న రోహిత్ అభిమానులు -
ఇంగ్లండ్ తరపున మూడో బ్యాట్స్‌మన్‌గా.. ఓవరాల్‌గా ఐదో ఆటగాడు
లీడ్స్: ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ 2021లో అత్యద్భుత ఫామ్‌ను కనబరుస్తున్నాడు. వరుస సెంచరీలతో హోరెత్తిస్తున్న రూట్ రికార్డులను తిరగరాస్తున్నాడు. 2021లో ఇప్పటి వరకు 11 టెస్టుల్లో 21 ఇన్నింగ్స్‌లు ఆడిన అతను 69.90 సగటుతో 1398 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు ఉన్నాయి. భారత్‌పైనే 875 పరుగులు చేయగా అందులో 4 సెంచరీలు ఉన్నాయి. ఇదే జోరును అతను కొనసాగిస్తే ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగుల మొహమ్మద్ యూసుఫ్ (1788) రికార్డును అతను అధిగమించవచ్చు. ప్రస్తుత సిరీస్‌తో పాటు ఈ ఏడాది ‘యాషెస్’తో కలిపి రూట్ కనీసం మరో ఐదు టెస్టులు ఆడే అవకాశం ఉంది. అతను మరో 391 పరుగులు చేస్తే ఒక క్యాలండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలుస్తాడు. చదవండి: ఇంగ్లండ్ తరపున మూడో బ్యాట్స్‌మన్‌గా.. ఓవరాల్‌గా ఐదో ఆటగాడిగా ఇక ఇంగ్లండ్ తరపున ఒకే క్యాలండర్ ఇయర్లో ఆరు సెంచరీలు సాధించిన మూడో బ్యాట్స్‌మన్‌గా రూట్ నిలిచాడు. ఇంతకముందు వాన్(2002), డెన్నిస్ కాంప్టన్(1947) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇక టీమిండియాపై టెస్టుల్లో 8వ సెంచరీ సాధించిన ఐదో ఆటగాడిగా రూట్ నిలిచాడు. ఇంతకముందు గ్యారీ సోబర్స్, వివ్ రిచర్డ్స్, రికీ పాంటింగ్, స్టీవ్ స్మిత్ టీమిండియాపై టెస్టుల్లో ఎనిమిది సెంచరీల మార్క్‌ను అందుకున్నారు. ఇక కెప్టెన్‌గా జో రూట్ టెస్టుల్లో 12 సెంచరీలు సాధించి అలిస్టర్ కుక్ సరసన నిలిచాడు. ఇక హెడింగ్లీ టెస్టుపై ఇంగ్లండ్ పట్టు బిగించింది. తొలి రోజు తమ బౌలింగ్‌తో భారత్‌ను దెబ్బ తీసిన ఆతిథ్య జట్టు రెండో రోజు బ్యాటింగ్ జోరును చూపించింది. ఓపెనర్లు వేసిన బలమైన పునాదిపై వరుసగా మూడో టెస్టులోనూ సారథి రూట్ శతకంతో భారీ స్కోరుకు బాట వేశాడు. దాంతో ఇప్పటికే ఇంగ్లండ్ 345 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది. ఇలాంటి స్థితిలో భారత్ ఎదురీది ఎంత వరకు ఈ మ్యాచ్‌లో పోరాడగలదో చూడాలి. చదవండి: ఇంగ్లండ్ అభిమానుల ఓవరాక్షన్.. సిరాజ్‌పై బంతితో దాడి -
సచిన్ రికార్డ్ మళ్లీ బ్రేక్ చేసిన కోహ్లి
-
సచిన్ రికార్డ్ మళ్లీ బ్రేక్ చేసిన కోహ్లి
బర్మింగ్‌హామ్ : కీలక సమయంలో విదేశీగడ్డపై అద్బుత శతకం సాధించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి (225 బంతుల్లో 149; 22 ఫోర్లు, 1 సిక్స్) మరిన్ని రికార్డులు నమోదు చేశాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో శతకంతో ఈ ఫార్మాట్లో కోహ్లీ సెంచరీల సంఖ్య 22కు చేరుకుంది. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లి దాటేశాడు. 22 టెస్ట్ శతకాలకు సచిన్ 114 ఇన్నింగ్స్‌లు తీసుకోగా.. కెప్టెన్ కోహ్లి 113వ ఇన్నింగ్స్‌లో ఆ ఫీట్ సాధించాడు. ఓవరాల్‌గా అత్యంత వేగంగా ఈ ఫీట్ చేరుకున్న ఆటగాళ్లలో కోహ్లి నాలుగో స్థానంలో ఉన్నాడు. అదే విధంగా ఇంగ్లండ్ జట్టుపై 1000 పరుగులు పూర్తి చేసిన 13వ భారత క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. అయితే ఓవరాల్‌గా అత్యంత వేగవంతగా 22 టెస్ట్ శతకాలు సాధించిన క్రికెటర్ల జాబితాలో క్రికెట్ దిగ్గజం, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. కేవలం 58 ఇన్నింగ్స్‌ల్లోనే బ్రాడ్‌మన్ 22 శతకాలు చేయగా.. అనితరసాధ్యంగా ఆ రికార్డు చిరస్థాయిగా ఉండిపోయింది. సునీల్ గావస్కర్ 101 ఇన్నింగ్స్‌ల్లో, స్టీవ్ స్మిత్ 108 ఇన్నింగ్స్‌ల్లో ఈ రికార్డ్ నమోదు చేసి తొలి మూడు స్థానాల్లో నిలిచారు. కోహ్లి (113 ఇన్నింగ్స్), సచిన్ (114 ఇన్నింగ్స్‌లు) వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. కాగా, గతంలో సచిన్ వేగవంతమైన 21 సెంచరీల రికార్డును సైతం కోహ్లీ అధిగమించడం గమనార్హం. 21 టెస్ట్ శతకాలకు సచిన్ 110 ఇన్నింగ్స్‌లు ఆడగా, కోహ్లీ అప్పుడు కూడా కేవలం ఒకే ఒక్క ఇన్నింగ్స్ తక్కువ(109 ఇన్నింగ్స్)లో ఈ ఫీట్ తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. -
‘దాదా’ రికార్డు బద్దలుకొట్టిన కోహ్లీ
► లక్ష్మణ్, వెంగ్ సర్కార్ సరసన కోహ్లీ గాలే: మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు గాలేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సెంచరీల రికార్డును బద్దలుకొట్టాడు. గాలే టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి 133 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో సెంచరీ పూర్తి చేసి అజేయంగా నిలిచాడు. కోహ్లీ కెరీర్ లో ఇది 17వ శతకం కాగా, గంగూలీ పేరిట ఉన్న 16 టెస్టు సెంచరీల రికార్డును కోహ్లీ అధిగమించాడు. దాంతో పాటుగా 17 టెస్టు శతకాలు సాధించిన కోహ్లీ.. హైదరాబాద్ సొగసరి బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ (17), దిలీప్ వెంగ్ సర్కార్ (17)ల సరసన నిలిచాడు. శతకాల రికార్డులో కోహ్లీకి సమీప లక్ష్యంలో మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ (22), సెహ్వాగ్ (23) ముందున్నారు. భారత్ నుంచి సచిన్ టెండూల్కర్ (51), మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ (36), సునీల్ గవాస్కర్ (34) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. కోహ్లీ సుదీర్థకాలం తన ఫామ్‌ను కొనసాగిస్తే మరిన్ని రికార్డులు తిరగరాయడం సాధ్యమని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. -
బ్రాడ్‌మన్ తో నన్ను పోల్చవద్దు...
► టెస్టుల్లో 29వ సెంచరీ చేసిన ఇంగ్లండ్ కెప్టెన్ మాంచెస్టర్: పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ బ్యాటింగ్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఇంగ్లండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్ టెస్టు క్రికెట్ లో మరో మైలురాయిని చేరుకున్నాడు. ఆసీస్ మాజీ దిగ్గజం బ్రాడ్ మన్ రికార్డు సెంచరీలను సమం చేశాడు. శుక్రవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 89 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 314 పరుగులు సాధించింది. జో రూట్ (246 బంతుల్లో 141 బ్యాటింగ్; 18 ఫోర్లు)తో పాటు కెప్టెన్ అలిస్టర్ కుక్ (172 బంతుల్లో 105; 15 ఫోర్లు) సెంచరీలతో కదంతొక్కారు. ఇంగ్లండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్ టెస్టుల్లో 29వ శతకాన్ని నమోదుచేశాడు. ఈ సెంచరీతో క్రికెట్ ఆల్ టైమ్ దిగ్గజం, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు సర్ డాన్ బ్రాడ్‌మన్ రికార్డును కుక్ సమంచేశాడు. అయితే బ్రాడ్‌మన్ తో పోల్చి చూసేంత గొప్ప ఆటగాడిని కాదని కుక్ పేర్కొన్నాడు. ఆయనకు ఈ ఘనత సాధించేందుకు 52 టెస్టులే అవసరం కాగా, తాను మాత్రం ఈ రికార్డును అందుకోవడానికి 131 టెస్టులు ఆడానని చెప్పాడు. ఈ సెంచరీ చేయడానికి కుక్ 20 ఇన్నింగ్స్ లు ఆడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ బౌలర్లు ఆమిర్, రాహత్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. తొలి టెస్టులో ఇంగ్లండ్ ఓటమి పాలైన విషయం తెలిసిందే.