కీలక సమయంలో విదేశీగడ్డపై అద్బుత శతకం సాధించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి (225 బంతుల్లో 149; 22 ఫోర్లు, 1 సిక్స్) మరిన్ని రికార్డులు నమోదు చేశాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో శతకంతో ఈ ఫార్మాట్‌లో కోహ్లీ సెంచరీల సంఖ్య 22కు చేరుకుంది.