
లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగోటెస్టులో రోహిత్ శర్మ సెంచరీ సాధించడం ద్వారా పలు రికార్డులు అందుకున్నాడు. విదేశాల్లో టెస్టుల్లో తొలిసారి సెంచరీ సాధించిన రోహిత్ శర్మ ఇంగ్లండ్ గడ్డపై ఒక రికార్డును అందుకున్నాడు. ఇంగ్లండ్ గడ్డపై అన్ని ఫార్మాట్లు కలిపి అత్యధిక సెంచరీలు సాధించిన జాబితాలో రోహిత్ రెండో స్థానంలో నిలిచాడు. రోహిత్ శర్మ ఇంగ్లండ్‌లో అన్ని ఫార్మాట్లు కలిపి 9 సెంచరీలు నమోదు చేశాడు. ఓవరాల్‌గా ఆసీస్ దిగ్గజ బ్యాట్స్‌మన్ డాన్ బ్రాడ్‌మన్ 11 సెంచరీలతో తొలి స్థానంలో ఉన్నాడు. విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ కూడా 9 సెంచరీలతో రోహిత్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. ఇక అంతకముందు టీమిండియా మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ 8 సెంచరీల రికార్డును రోహిత్ అధిగమించాడు.
ఇక మ్యాచ్‌లో నాలుగోరోజు ఆటలో టీమిండియా వెనువెంటనే వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ బౌలర్ క్రిస్ వోక్స్ వరుస ఓవర్లలో జడేజా(17), రహానే(0) పెవిలియన్‌కు చేర్చాడు. ప్రస్తుతం 200 పరుగుల ఆధిక్యంలో ఉన్న టీమిండియా స్కోరు 299/5గా ఉంది.
చదవండి: Rohith Sharma: రోహిత్ సెంచరీ.. భార్య రితికా ముద్దుల వర్షం
Comments
Please login to add a commentAdd a comment