Photo Credit: ESPNcricinfo
సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ పట్టు బిగిస్తుంది. తొలి టెస్టులో దారుణ పరాభవానికి ప్రతీకారం తీర్చుకునే పనిలో పడింది. తొలి ఇన్నింగ్స్‌లో ప్రొటిస్‌ను 151 పరుగులకే ఆలౌట్ చేసి తొలి రోజు ఆధిపత్యం ప్రదర్శించిన ఇంగ్లండ్.. రెండోరోజు ఆటలో బ్యాటింగ్‌లో దూకుడు కనబరిచింది. ముఖ్యంగా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(163 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 103 పరుగులు) చాలా రోజుల తర్వాత శతకంతో చెలరేగాడు.
Photo Credit: ESPNcricinfo
స్టోక్స్‌కు టెస్టుల్లో ఇది 12వ శతకం కాగా.. కెప్టెన్‌గా మాత్రం ఇదే మొదటిది. ఇక వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ కూడా సెంచరీ మార్క్‌ను(209 బంతుల్లో 104 బ్యాటింగ్, 9 ఫోర్లు)అందుకున్నాడు. కాగా బెన్‌ఫోక్స్‌కు టెస్టుల్లో ఇది రెండో సెంచరీ. సెంచరీ సాధించి స్టోక్స్ ఔటైనప్పటికి వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ ఇంగ‍్లండ్ ఇన్నింగ్స్‌ను నడిపిస్తున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 7 వికెట్ల నష్టానికి 395 పరుగులు చేసింది. ఇప్పటివరకు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగుల ఆధిక్యంలో ఉంది.
A special first hundred as England Test captain for Ben Stokes ✨ pic.twitter.com/PiKjUGO94d
— ESPNcricinfo (@ESPNcricinfo) August 26, 2022
Manchester stands up and applauds a quite magnificent Test hundred 👏
— ESPNcricinfo (@ESPNcricinfo) August 26, 2022
It's the first at home for Ben Foakes pic.twitter.com/cIFaWhC3YB
Comments
Please login to add a commentAdd a comment