ఇంగ్లండ్ టెస్ట్ జట్టు సారధి బెన్ స్టోక్స్ పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే 2023 వన్డే ప్రపంచకప్ దృష్ట్యా స్టోక్స్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని బరిలోకి దిగాడు. వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ ఘోర పరాభవం నేపథ్యంలో స్టోక్స్ అప్పటి నుంచి పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు దూరంగా ఉన్నాడు. తాజాగా స్టోక్స్ లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్‌లోని మళ్లీ రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నానని క్లూ ఇచ్చాడు. ఈ విషయమై జట్టు కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ తనను సంప్రదిస్తే తాను రెడీ అంటూ సంకేతాలు పంపాడు.
రిటైర్మెంట్ విషయమై ఆటగాళ్లు మనసు మార్చుకోవడం ఇటీవలికాలంలో పరిపాటిగా మారింది. చాలా మంది క్రికెటర్లు స్టోక్స్ లాగే తొలుత రిటైర్మెంట్ ప్రకటిస్తారు.. ఆతర్వాత ఆ కారణం.. ఈ కారణం చెప్పి తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటారు. ఈ విషయాన్ని ఇటీవలే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తావించాడు. రిటైర్మెంట్‌పై యూ టర్న్ తీసుకోవడం ఆటగాళ్లకు ఫ్యాషన్‌గా మారిపోయిందని హిట్‌మ్యాన్ వ్యాఖ్యానించాడు.
స్టోక్స్ విషయానికొస్తే.. ఈ ఇంగ్లండ్ టెస్ట్ సారధి వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ దృష్ట్యా రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఐసీసీ మెగా టోర్నీ కావడంతో స్టోక్స్ ఈ టోర్నీలో పాల్గొనాలని భావిస్తుండవచ్చు. మళ్లీ ఈ టోర్నీ అయిపోయిన వెంటనే స్టోక్స్ రిటైర్మెంట్ ప్రకటించినా ఆశ్యర్యపోనక్కర్లేదు.
33 ఏళ్ల స్టోక్స్ ఫిట్‌నెస్ పరంగానూ పెద్దగా పర్ఫెక్ట్‌గా లేడు. టెస్ట్‌ల్లో కేవలం బ్యాటర్‌గా మాత్రమే కొనసాగుతున్నాడు. బౌలింగ్ చేసినా పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో అతను తిరిగి పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో బరిలోకి దిగినా పెద్దగా ప్రయోజనం ఉండదు. టెస్ట్‌ల్లో మాత్రం అతన్ని మ్యాచ్ విన్నర్‌గా తీసిపారేయడానికి వీళ్లేదు. జట్టును ఒంటిచేత్తో గెలిపించగల సామర్థ్యం అతనికి ఇంకా ఉంది.
స్టోక్స్ ఇంగ్లండ్ తరఫున 105 టెస్ట్‌లు, 114, 43 టీ20లు ఆడాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో అతను గత కొంతకాలం యాక్టివ్‌గా లేడు. మెక్‌కల్లమ్ ఇంగ్లండ్ ఫుల్‌టైమ్ హెడ్ కోచ్‌గా నియమితుడైన తర్వాత స్టోక్స్ పరిమిత ఓవర్ల ఫార్మాట్లలోకి రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నాడు.
చదవండి: మెరుగుపడిన యశస్వి, గిల్ ర్యాంక్‌లు.. తలో ఐదు స్థానాలు కోల్పోయిన రోహిత్, విరాట్
Comments
Please login to add a commentAdd a comment