England Vs South Africa
-
CT 2025: సెమీస్, ఫైనల్ చేరే జట్లు ఇవే!.. కానీ ఆ టీమ్‌తో జాగ్రత్త!
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) టోర్నమెంట్ రూపంలో మరో మెగా ఈవెంట్ క్రికెట్ ప్రేమికుల ముందుకు రానుంది. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న ఈ టోర్నీకి తెరలేవనుంది. ఎనిమిది జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. వన్డే వరల్డ్‌కప్-2023 ప్రదర్శన ఆధారంగా విజేత ఆస్ట్రేలియా, రన్నరప్ ఇండియాతో పాటు.. సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ ఈ టోర్నీకి అర్హత సాధించాయి.మరోవైపు.. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్ బరిలోకి దిగనుంది. ఈవెంట్ ఆరంభానికి సమయం సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికే ఆయా దేశాల బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి(Ravi Shastri), ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్(Ricky Ponting) చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనలిస్టులు ఎవరన్న అంశంపై తమ అంచనాలు తెలియజేశారు.సెమీస్, ఫైనల్ చేరే జట్లు ఇవే!ఐసీసీ రివ్యూ షోలో రవిశాస్త్రి మాట్లాడుతూ.. ఇంగ్లండ్, సౌతాఫ్రికా.. టీమిండియా, ఆస్ట్రేలియా సెమీ ఫైనల్‌కు చేరతాయని అభిప్రాయపడ్డాడు. ఇందుకు పాంటింగ్ బదులిస్తూ.. ‘‘ఇండియా- ఆస్ట్రేలియాను దాటుకుని వేరే జట్లు పైకి వెళ్లడం ఈసారీ కష్టమే.ఎందుకంటే.. ప్రస్తుతం ఇరు దేశాల జట్లలో నాణ్యమైన నైపుణ్యాలున్న ఆటగాళ్లు మెండుగా ఉన్నారు. ఇటీవల ఐసీసీ ఈవెంట్లలో ఈ జట్లు సత్తా చాటిన తీరే ఇందుకు నిదర్శనం. కాబట్టి ఈ రెండు ఫైనల్‌కు చేరే అవకాశం ఉంది’’ అని అంచనా వేశాడు.కానీ పాకిస్తాన్‌తో జాగ్రత్తఅయితే, ఆతిథ్య జట్టు పాకిస్తాన్‌ను కూడా తక్కువ అంచనా వేయవద్దని రిక్కీ పాంటింగ్ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ‘‘ఇటీవలి కాలంలో నిలకడగా ఆడుతున్న జట్టు ఏదైనా ఉందంటే.. అది పాకిస్తాన్. వన్డే క్రికెట్లో ప్రస్తుతం వారి ప్రదర్శన అద్బుతంగా ఉంది.ఐసీసీ వంటి ప్రధాన టోర్నమెంట్లలో వారి ఆటతీరు ఒక్కోసారి అంచనాలకు భిన్నంగా ఉంటుంది. ఈసారి మాత్రం ప్రతికూలతలన్నీ అధిగమించే అవకాశం ఉంది’’ అని రిక్కీ పాంటింగ్ మిగతా జట్లను హెచ్చరించాడు. కాగా 2017లో చివరిసారిగా చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ జరిగింది. నాటి ఫైనల్లో టీమిండియాను ఓడించి పాకిస్తాన్ టైటిల్ గెలిచింది.ఇదిలా ఉంటే.. ఈ ఐసీసీ టోర్నీలో ఆస్ట్రేలియా రెండుసార్లు చాంపియన్‌గా నిలిచింది. రిక్కీ పాంటింగ్ సారథ్యంలో 2006, 2009లొ ట్రోఫీని కైవసం చేసుకుంది. మరోవైపు.. టీమిండియా 2013లో మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది.ఇక పాకిస్తాన్లో చాంపియన్స్ ట్రోఫీ జరుగనున్న నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా అక్కడికి వెళ్లడం లేదు. ఐసీసీ అనుమతితో హైబ్రిడ్ విధానంలో దుబాయ్ వేదికగా తమ మ్యాచ్‌లు ఆడనుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌తో తమ ప్రయాణం మొదలుపెట్టనున్న రోహిత్ సేన.. తదుపరి ఫిబ్రవరి 23న దాయాది పాకిస్తాన్‌తో తలపడనుంది. అనంతరం.. మార్చి రెండున న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఆడుతుంది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా(ఫిట్నెస్ ఆధారంగా) మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్.ట్రావెలింగ్ రిజర్వ్స్: ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి, వరుణ్ చక్రవర్తి. -
సౌతాఫ్రికాతో ఆల్ ఫార్మాట్ సిరీస్‌లకు ఇంగ్లండ్ జట్ల ప్రకటన
నవంబర్ 24 నుంచి సౌతాఫ్రికాతో జరుగబోయే ఆల్ ఫార్మాట్ సిరీస్‌ల కోసం ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్లను ఇవాళ (నవంబర్ 8) ప్రకటించారు. ఈ సిరీస్‌లలో తొలుత టీ20లు, తర్వాత వన్డేలు, ఆతర్వాత ఏకైక టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. మూడు ఫార్మాట్లలో ఇంగ్లండ్ జట్టుకు హీథర్ నైట్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో అరంగేట్రం ఆల్‌రౌండర్ పైజ్ స్కోల్ఫీల్డ్ను టీ20 జట్టుకు ఎంపిక చేశారు. ఫాస్ట్ బౌలర్ లారెన్ ఫైలర్ మూడు ఫార్మాట్ల జట్లలో చోటు దక్కించుకుంది. 19 ఏళ్ల యంగ్ ప్రామిసింగ్ క్రికెటర్ ఫ్రేయా కెంప్ తొలిసారి టెస్ట్ జట్టులో చోటు దక్కించుకుంది. మైయా బౌచియర్ ఈ సిరీస్‌లో తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. తొలుత టీ20 జట్టు నవంబర్ 16న సౌతాఫ్రికాకు బయల్దేరుతుంది. ఆ తర్వాత నవంబర్ 27న వన్డే, టెస్ట్ జట్లు టీ20 జట్టుతో కలుస్తాయి.షెడ్యూల్..నవంబర్ 24- తొలి టీ20 (ఈస్ట్ లండన్)నవంబర్ 27- రెండో టీ20 (బెనోని)నవంబర్ 30- మూడో టీ20 (సెంచూరియన్)డిసెంబర్ 4- తొలి వన్డే (కింబర్లీ)డిసెంబర్ 8- రెండో వన్డే (డర్బన్)డిసెంబర్ 11- మూడో వన్డే (పోచెఫ్స్రూమ్)డిసెంబర్ 15 నుంచి 18 వరకు- ఏకైక టెస్ట్ మ్యాచ్ (బ్లోంఫోంటెయిన్)ఇంగ్లండ్ మహిళల టీ20 జట్టు: హీథర్ నైట్ (కెప్టెన్), లారెన్ బెల్, మైయా బౌచియర్, చార్లీ డీన్, సోఫియా డంక్లీ, సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ ఫైలర్, సారా గ్లెన్, బెస్ హీత్, అమీ జోన్స్, ఫ్రెయా కెంప్, పైజ్ స్కోల్ఫీల్డ్, నాట్ స్కివర్-బ్రంట్, లిన్సే స్మిత్, డాని వ్యాట్ హాడ్జ్ఇంగ్లండ్ మహిళల వన్డే జట్టు: హీథర్ నైట్ (కెప్టెన్), టామీ బ్యూమాంట్, లారెన్ బెల్, మైయా బౌచియర్, అలిస్ క్యాప్సే, కేట్ క్రాస్, చార్లీ డీన్, సోఫియా డంక్లీ, సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ ఫైలర్, సారా గ్లెన్, అమీ జోన్స్, ఫ్రెయా కెంప్, నాట్ స్కివర్-బ్రంట్, డాని వ్యాట్ హాడ్జ్ఇంగ్లండ్ మహిళల టెస్టు జట్టు: హీథర్ నైట్ (కెప్టెన్), టామీ బ్యూమాంట్, లారెన్ బెల్, మైయా బౌచియర్, కేట్ క్రాస్, చార్లీ డీన్, సోఫియా డంక్లీ, సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ ఫైలర్, అమీ జోన్స్, ఫ్రెయా కెంప్, నాట్ స్కివర్-బ్రంట్, డాని వ్యాట్ హాడ్జ్ -
సౌతాఫ్రికాపై ప్రతీకారం తీర్చుకున్న ఇంగ్లండ్
గత టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన అనూహ్య పరాజయానికి ఇంగ్లండ్ మహిళల జట్టు బదులు తీర్చుకుంది. చివరి ఓవర్ వరకు ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌లో సఫారీ జట్టును ఓడించి ఈ టోర్నీలో ఇంగ్లండ్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది.ఫలితంగా గ్రూప్ ‘బి’లో తమ అగ్రస్థానాన్ని ఇంగ్లండ్ పటిష్టపర్చుకుంది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. కెప్టెన్ లారా వోల్వార్ట్ (39 బంతుల్లో 42; 3 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సోఫీ ఎకెల్‌స్టోన్ (2/15)తో పాటు ఇతర బౌలర్లు ప్రత్యర్థిని నిలువరించారు. అనంతరం ఇంగ్లండ్ 19.2 ఓవర్లలో 3 వికెట్లకు 125 పరుగులు సాధించి గెలిచింది. నాట్ సివర్ బ్రంట్ (36 బంతుల్లో 48 నాటౌట్; 6 ఫోర్లు), డానీ వ్యాట్ (43 బంతుల్లో 43; 4 ఫోర్లు) మూడో వికెట్‌కు 55 బంతుల్లో 64 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. రాణించిన కెప్టెన్దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ వోల్వార్ట్ మినహా మిగతా వారెవ్వరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చలేదు. తొలి వికెట్‌కు వోల్వార్ట్, తజ్మీన్ బ్రిట్స్ (19 బంతుల్లో 13; 1 ఫోర్)తో కలిసి 31 బంతుల్లో 31 పరుగులు జోడించడంతో జట్టుకు మెరుగైన ఆరంభం లభించింది. ఆ తర్వాత అనేక్ బాష్ (26 బంతుల్లో 18; 1 ఫోర్) కూడా కొద్దిసేపు కెప్టెన్‌కు అండగా నిలిచింది. 10 ఓవర్లు ముగిసేసరికి సఫారీ టీమ్ స్కోరు 54 పరుగులకు చేరింది. ఈ దశలో ఇంగ్లండ్ స్పిన్నర్లు ప్రత్యరి్థని కట్టడి చేయడంలో సఫలమయ్యారు. అనంతరం వేగంగా ఆడే ప్రయత్నంలో ఉన్నవోల్వార్ట్ను ఎకెల్‌స్టోన్(Sophie Ecclestone) చక్కటి బంతితో బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ పైచేయి సాధించింది. కెప్టెన్ వెనుదిరిగిన తర్వాత మిగిలిన 26 బంతుల్లో దక్షిణాఫ్రికా 36 పరుగులు చేసింది. మరిజాన్ కాప్ (17 బంతుల్లో 26; 3 ఫోర్లు), ఇన్నింగ్స్ చివర్లో డెర్క్సెన్ (11 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ప్రదర్శన దక్షిణాఫ్రికాకు గౌరవప్రదమైన స్కోరును అందించాయి.కీలక భాగస్వామ్యం... షార్జా మైదానంలో గత నాలుగు మ్యాచ్‌లతో పోలిస్తే మెరుగైన స్కోరును దక్షిణాఫ్రికా నమోదు చేయగా... దానిని ఛేదించే లక్ష్యంతో ఇంగ్లండ్ బరిలోకి దిగింది. ఆరంభంలోనే మయా బౌచర్ (20 బంతుల్లో 8; 1 ఫోర్) వెనుదిరిగినా... వ్యాట్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది. అలైస్ క్యాప్సీ (16 బంతుల్లో 19; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించినా ఎక్కువ సేపు నిలవలేదు. ఈ దశలో వ్యాట్, బ్రంట్ భాగ స్వామ్యం జట్టును గెలుపు దిశగా నడిపించింది.ఈ ఇద్దరు సీనియర్ల జోడీని విడదీసేందుకు సఫారీ బౌలర్లు ఎంత శ్రమించినా లాభం లేకపోయింది. 11–15 ఓవర్ల మధ్యలో 39 పరుగులు చేసిన ఇంగ్లండ్ చివరి 5 ఓవర్లలో 31 పరుగులు చేయాల్సిన స్థితిలో నిలిచింది. అయితే చివర్లో కొంత ఒత్తిడి ఎదురైనా ఇంగ్లండ్ గెలుపు గీత దాటింది. విజయానికి 11 పరుగుల దూరంలో వ్యాట్ వెనుదిరగ్గా... బ్రంట్ మిగిలిన పనిని పూర్తి చేసింది. సఫారీ ఫీల్డర్లు మూడు క్యాచ్‌లు వదిలేయడం కూడా ఇంగ్లండ్‌కు కలిసొచ్చింది. మంగళవారం జరిగే గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టుతో న్యూజిలాండ్ తలపడుతుంది. ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా స్కోర్లువేదిక- షార్జాటాస్- సౌతాఫ్రికా.. బ్యాటింగ్సౌతాఫ్రికా స్కోరు: 124/6 (20)ఇంగ్లండ్ స్కోరు: 125/3 (19.2)ఫలితం: సౌతాఫ్రికాపై ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం.చదవండి: IPL 2025: ఐపీఎల్లో విలువ పెరిగింది -
ఇంగ్లండ్-సౌతాఫ్రికా సూపర్-8 పోరు.. తుది జట్లు ఇవే
టీ20 వరల్డ్ కప్-2024లో కీలక సమరానికి సమయం అసన్నమైంది. ఈ మెగా టోర్నీ సూపర్-8లో భాగంగా సెయింట్ లూసియా వేదికగా ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. సౌతాఫ్రికా మాత్రం తమ తుది జట్టులో ఒక మార్పు చేసింది.స్పిన్నర్ షంమ్సీ స్ధానంలో ఒట్నీల్ బార్ట్‌మాన్ తుది జట్టులోకి వచ్చాడు. ఇక ఇరు జట్లు ఇప్పటికే సూపర్-8 రౌండ్లో చెరో విజయం సాధించాయి. తుది జట్లుదక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నార్ట్జే, ఒట్నీల్ బార్ట్మన్ఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(కెప్టెన్/ వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్, జానీ బెయిర్‌స్టో, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, రీస్ టోప్లీ -
టీ20 వరల్డ్‌కప్‌లో నేటి (జూన్ 21) మ్యాచ్.. ఇంగ్లండ్‌తో సౌతాఫ్రికా 'ఢీ'
టీ20 వరల్డ్‌కప్ 2024లో ఇవాళ (జూన్ 21) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. సూపర్-8 గ్రూప్-2లో భాగంగా సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. సెయింట్ లూసియా వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. భారతకాలమానం రాత్రి 8 గంటలకు ప్రారంభంకానుంది. గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్, సౌతాఫ్రికా ఇదివరకే చెరో మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇంగ్లండ్.. వెస్టిండీస్‌పై, సౌతాఫ్రికా.. యూఎస్ఏపై గెలిచి చెరో రెండు పాయింట్లు ఖాతాలో వేసుకున్నాయి. ఈ టోర్నీలో ఇప్పటివరకు అజేయంగా ఉన్న సౌతాఫ్రికా.. తాజాగా జరిగిన మ్యాచ్‌లో విండీస్‌పై గెలిచి ఇంగ్లండ్ మరో గెలుపుపై ధీమాగా ఉన్నాయి. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో సౌతాఫ్రికా, ఇంగ్లండ్ ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. సౌతాఫ్రికా 4, ఇంగ్లండ్ 2 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. ఇరు జట్లు చివరిసారి తలపడిన మ్యాచ్‌లో (2022) ఇంగ్లండ్‌దే పైచేయిగా నిలిచింది.ప్రస్తుత ఫామ్ ప్రకారం చూస్తే.. సౌతాఫ్రికాతో పోలిస్తే ఇంగ్లండ్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ జట్టులో ఓపెనర్లు సాల్ట్, బట్లర్ మంచి ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్ పరంగా చూస్తే.. ఇంగ్లండ్ కంటే సౌతాఫ్రికా కాస్త మెరుగ్గా కనిపిస్తుంది. ఆ జట్టు పేసర్లు ఓట్నీల్, రబాడ భీకర ఫామ్‌లో ఉన్నారు.వాతావరణం విషయానికొస్తే.. నేటి మ్యాచ్‌కు వర్షం నుంచి ఎలాంటి ముప్పు ఉండదు. మ్యాచ్ జరిగే సమయానికి వాతావరణం ఆహ్లాదంగా ఉండే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా సవ్యంగా సాగనుంది.పిచ్ విషయానికొస్తే.. సెయింట్ లూసియా పిచ్ బ్యాటర్లకు అనుకూలించే అవకాశం ఉంది. ప్రస్తుత ప్రపంచకప్‌లో నమోదైన టాప్ స్కోర్లలో మెజార్టీ శాతం ఇక్కడ నమోదైనవే. ఈ వికెట్‌పై బౌలర్లు గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదు.తుది జట్లు (అంచనా).. ఇంగ్లండ్: ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (కెప్టెన్/వికెట్‌కీపర్), మొయిన్ అలీ, జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, రీస్ టాప్లీసౌతాఫ్రికా: క్వింటన్ డికాక్ (వికెట్‌కీపర్), రీజా హెండ్రిక్స్, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే, ఒట్నీల్ బార్ట్‌మన్ -
ఓటమి బాధలో ఉన్న ఇంగ్లండ్‌కు భారీ షాక్.. ఇక కష్టమే
వన్డే ప్రపంచకప్-2023లో వరుస అపజయాలతో సతమతమవుతున్న ఇంగ్లండ్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ రీస్ టోప్లీ గాయం కారణంగా టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టోప్లీ చూపుడు వేలికి గాయమైంది. దీంతో అతడు ఫీల్డ్‌ను వదిలి వెళ్లిపోయాడు. అయితే ఫిజియో వద్ద చికిత్స తీసుకుని టోప్లీ తిరిగి మళ్లీ మైదానంలోకి వచ్చాడు. నొప్పితో బాధపడుతుంటానే 6 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఓవరాల్‌గా 8.5 ఓవర్లు బౌలింగ్ చేసిన టోప్లీ 88 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అయితే దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ అనంతరం టోప్లీని స్కాన్ కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే స్కానింగ్‌లో ఎడమ చూపుడు ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. దీంతో అతడు టోర్నీ నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు దృవీకరించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్, సర్రే సీమర్ రీస్ టాప్లీ చేతి వేలికి గాయమైంది. దీంతో వన్డే ప్రపంచకప్ మధ్యలో నుంచి తప్పుకున్నాడు. టోప్లీ రాబోయే 24 గంటల్లో తిరిగి యూకేకు రానున్నాడు అని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా దక్షిణాఫ్రికా చేతిలో 229 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. ఇప్పటివరకు ఈ టోర్నీలో ఆడిన 4 మ్యాచ్‌ల్లో కేవలం ఒక మ్యాచ్‌లో ఇంగ్లీష్ జట్టు విజయం సాధించింది. ఇంగ్లండ్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తొమ్మిదవ స్ధానంలో ఉంది. చదవండి: WC 2023: చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. తొలి భారత బౌలర్‌గా -
దక్షిణాఫ్రికా చేతిలో ఇంగ్లండ్ ఘోర ఓటమి.. ఏకంగా 229 పరుగుల తేడాతో
వన్డే ప్రపంచకప్-2023లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు మరో ఘోర పరాభవం ఎదురైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా వాంఖడే వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 229 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘోర ఓటమి చవిచూసింది. 400 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 170 పరుగులకు కుప్పకూలింది. ఆఖరిలో రీస్ టాప్లే బ్యాటింగ్‌కు రాకపోవడంతో 170 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. కాగా భారీ లక్ష్య ఛేదనలో మొదటి నుంచే సఫారీ పేసర్లు ఇంగ్లండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. క్రమం తప్పకుండా వికెట్లు పడగొడుతూ ఇంగ్లండ్‌ను తిరిగి కోలుకోకుండా చేశారు. ఇంగ్లండ్ టాపర్డర్, మిడిలార్డర్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఇక దక్షిణాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కోయెట్జీ 3 వికెట్లు పడగొట్టగా.. మార్కో జాన్సెన్, లుంగీ ఎంగిడీ తలా రెండు వికెట్ల, సాధించారు. రబాడ, కేశవ్ మహారాజ్‌కు చెరో వికెట్ దక్కింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో మార్క్ వుడ్(43) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. క్లాసెన్ విధ్వంసం.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోర్ సాధించింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఇంగ్లీష్ బౌలర్లను ఊచకోత కోశారు. ప్రోటీస్ బ్యాటర్లలో హెన్రిస్ క్లాసన్ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. 67 బంతులు ఎదుర్కొన్న క్లాసెన్ 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 109 పరుగులు చేశాడు. అతడితో పాటు ఓపెనర్ రీజా హెండ్రిక్స్(85), మార్కో జాన్సెన్(75) రాస్సీ వాన్ డెర్ డస్సెన్(60), పరుగులతో అదరగొట్టారు. ఇంగ్లండ్ బౌలర్లలో టాప్లీ 3 వికెట్లు పడగొట్టగా.. రషీద్, గుస్ అట్కిన్సన్ రెండు వికెట్లు సాధించారు. సెంచరీతో చెలరేగిన క్లాసెన్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. చదవండి: WC 2023 NZ vs ENG: న్యూజిలాండ్‌తో మ్యాచ్.. టీమిండియాకు మరో భారీ షాక్! -
క్లాసెన్ విధ్వంసకర శతకం.. ఇంగ్లండ్ టార్గెట్ 400 పరుగులు
వన్డే ప్రపంచకప్-2023లో ముంబై వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ప్రోటీస్ బ్యాటర్లు ఇంగ్లండ్ బౌలర్ల భరతం పట్టారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ప్రోటీస్ బ్యాటర్లలో హెన్రిస్ క్లాసన్ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. 67 బంతులు ఎదుర్కొన్న క్లాసెన్ 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 109 పరుగులు చేశాడు. అతడితో పాటు ఓపెనర్ రీజా హెండ్రిక్స్(85), మార్కో జాన్సెన్(75) రాస్సీ వాన్ డెర్ డస్సెన్(60), పరుగులతో అదరగొట్టారు. ఇంగ్లండ్ బౌలర్లలో టాప్లీ 3 వికెట్లు పడగొట్టగా.. రషీద్, గుస్ అట్కిన్సన్ రెండు వికెట్లు సాధించారు. View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: నెదర్లాండ్స్ చేతిలో చిత్తుగా ఓడిన సౌతాఫ్రికాకు మరో షాక్!
ICC ODI WC 2023: వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా ఇంగ్లండ్‌తో మ్యాచ్ నేపథ్యంలో సౌతాఫ్రికాకు ఎదురుదెబ్బ తగిలింది. అనారోగ్యం కారణంగా కెప్టెన్ తెంబా బవుమా జట్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో ఎయిడెన్ మార్కరమ్ సౌతాఫ్రికా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు. కాగా పటిష్ట ప్రొటిస్ జట్టు గత మ్యాచ్‌లో అనూహ్య రీతిలో నెదర్లాండ్స్ చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ధర్మశాలలో అక్టోబరు 17 వర్షం కారణంగా 43 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో 38 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. ఈ క్రమంలో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌తో శనివారం నాటి మ్యాచ్‌కు ముందు తెంబా బవుమా జట్టుకు దూరమయ్యాడు. రీజా హెండ్రిక్స్ అతడి స్థానంలో తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. కాగా నెదర్లాండ్స్ చేతిలో ఓటమి తప్ప కెప్టెన్‌గా బవుమా మిగతా మ్యాచ్‌లలో విజయవంతమయ్యాడు. అయితే, బ్యాటర్‌గా మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. శ్రీలంక, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ జట్లతో మ్యాచ్‌లలో వరుసగా 8, 35, 11 పరుగులు మాత్రమే సాధించాడు. ఈ క్రమంలో అనారోగ్యం కారణంగా జట్టుకు దూరమైన వన్‌డౌన్ బ్యాటర్ బవుమా స్థానంలో వచ్చిన హెండ్రిక్స్ ఏ మేరకు రాణిస్తాడో చూడాలి! ఇక ఇంగ్లండ్‌తో ముంబై మ్యాచ్‌లో టాస్ ఓడిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. చదవండి: ఇలాంటి బ్యాటర్‌ను చూడలేదు.. మొన్నటి దాకా మావాళ్లు తోపులు అన్నారు.. ఇప్పుడు: రమీజ్ రాజా View this post on Instagram A post shared by ICC (@icc) -
T20 WC: సఫారీల చరిత్రలో తొలిసారి.. ఫైనల్లో ఆసీస్‌తో పోరుకు సై
ICC Womens T20 World Cup 2023- SA_W Vs Eng_ W: ఐసీసీ టోర్నీల్లో ఆరంభ దశలో రాణించడం, అసలు మ్యాచ్‌లకు వచ్చేసరికి బోర్లా పడటం దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు అలవాటే. పురుషులతో పాటు మహిళల టీమ్‌లోనూ ఇది చాలాసార్లు కనిపించింది. ఇప్పుడు వీటికి ముగింపు పలుకుతూ దక్షిణాఫ్రికా మహిళల టీమ్ టి20 ప్రపంచకప్‌లో ఫైనల్లోకి ప్రవేశించింది. పురుషుల, మహిళల జట్లను కలిపి చూస్తే ఏ ఫార్మాట్లోనైనా సఫారీ టీమ్(సీనియర్) ఐసీసీ టోర్నీలో ఫైనల్ చేరడం ఇదే మొదటిసారి కావడం విశేషం. సొంతగడ్డపై లీగ్ దశలో తొలి మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో అనూహ్యంగా ఓడిన తర్వాత కోలుకున్న టీమ్ ఇప్పుడు తుది సమరానికి సిద్ధమైంది. కేప్‌టౌన్‌లో శుక్రవారం జరిగిన రెండో సెమీస్‌లో దక్షిణాఫ్రికా 6 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. బ్రిట్స్ హాఫ్ సెంచరీ ముందుగా దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ తజ్మీన్ బ్రిట్స్ (55 బంతుల్లో 68; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), లౌరా వాల్వర్ట్ (44 బంతుల్లో 53; 5 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 82 బంతుల్లో 96 పరుగులు జోడించారు. అనంతరం ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 158 పరుగులే చేయగలిగింది. నాట్ సీవర్ (34 బంతుల్లో 40; 5 ఫోర్లు) టాప్ స్కోరర్. షబ్నిమ్ ఇస్మాయిల్ (3/27), అయబొంగ ఖాక (4/29) ఇంగ్లండ్‌ను దెబ్బ తీశారు. షబ్నిమ్ వేసిన చివరి ఓవర్లో విజయానికి 13 పరుగులు అవసరం కాగా, ఇంగ్లండ్ 6 పరుగులే చేయగలిగింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా తలపడుతుంది. కాగా భారత జట్టుతో జరిగిన తొలి సెమీస్‌లో గెలుపొంది ఆసీస్ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. చదవండి: Ind Vs Aus: మూడో టెస్టుకు కమిన్స్ దూరం.. బీసీసీఐ ట్వీట్! గ్రేట్ అంటున్న ఫ్యాన్స్ Ind Vs Aus: అంత సిల్లీగా అవుటవుతారా? అవునా అలా అన్నాడా? ఇంగ్లండ్ మాజీ కెప్టెన్‌కు హర్మన్ కౌంటర్.. View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
దక్షిణాఫ్రికా గడ్డపై అర్చర్ సరికొత్త చరిత్ర.. 30 ఏళ్ల రికార్డు బద్దలు
దక్షిణాఫ్రికా గడ్డపై ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోప్రా అర్చర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. దక్షిణాఫ్రికాలో ప్రోటీస్ జట్టుపై వన్డేల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా అర్చర్ నిలిచాడు. కింబర్లీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో అర్చర్ దుమ్మురేపాడు. ఈ మ్యాచ్‌లో 9.1 ఓవర్లు బౌలింగ్ చేసిన జోఫ్రా.. 40 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఈ అరుదైన ఘనతను అర్చర్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు పాకిస్తాన్ దిగ్గజం వసీం అక్రమ్ పేరిట ఉండేది. 1993లో దక్షిణాఫ్రికాలో ప్రోటీస్‌తో జరిగిన ఓ వన్డేలో అక్రమ్ 16 పరుగులకే 5 వికెట్లు సాధించాడు. తాజా మ్యాచ్‌తో 30 ఏళ్ల అక్రమ్ రికార్డును అర్చర్ బ్రేక్ చేశాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన రెండో మ్యాచ్‌లోనే అర్చర్ ఈ ఘనత సాధించడం విశేషం. ఇక అర్చర్‌కు వన్డేల్లో ఇదే కెరీర్ బెస్ట్ కూడా. తొలి ఇంగ్లండ్ బౌలర్‌గా.. అదే విధంగా విదేశీ గడ్డపై వన్డేల్లో అత్యుత్తమ గణంకాలు నమోదు చేసిన తొలి ఇంగ్లండ్ బౌలర్‌గా అతడు నిలిచాడు.అంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ ఆల్ రౌండర్ క్రిస్ వోక్స్ పేరిట ఉండేది. 2001లో ఆస్ట్రేలియాతో జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో క్రిస్ వోక్స్ 45 పరుగులిచ్చి 6 వికెట్లు సాధించాడు. తాజా మ్యాచ్‌లో 40 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టిన అర్చర్.. 12 ఏళ్ల వోక్స్ రికార్డు బ్రేక్ చేశాడు. చదవండి: IND vs NZ: 'తీవ్రంగా నిరాశపరిచాడు.. స్పిన్నర్లను ఎదుర్కోవడం నేర్చుకోవాలి’ -
తిట్టినోళ్లే మెచ్చుకున్నారు.. శెభాష్ జోఫ్రా ఆర్చర్
ఇంగ్లండ్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ తాను ఫామ్‌లోకి వస్తే ఎలా ఉంటుందో సౌతాఫ్రికా జట్టుకు రుచి చూపించాడు. గాయంతో ఆటకు దూరమైన ఆర్చర్ దాదాపు రెండేళ్ల తర్వాత ఇంగ్లండ్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. అయితే తొలి వన్డేలో 10 ఓవర్లు బౌలింగ్ చేసిన ఆర్చర్ 81 పరుగులిచ్చి ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. అతని కెరీర్లో కూడా ఇవే అత్యంత చెత్త గణాంకాలు. రీఎంట్రీలో చెత్త ప్రదర్శనపై విమర్శలు రావడంతో కెప్టెన్ బట్లర్ ఆర్చర్‌ను తర్వాతి మ్యాచ్‌కు పక్కనబెట్టాల్సి వచ్చింది. అయితే ఆర్చర్ ఆ మాత్రానికే కుంగిపోలేదు. రెండేళ్ల పాటు ఆటకు దూరంగా ఉన్న అతను ఇలాంటి ఇబ్బందులను చాలానే ఎదుర్కొన్నాడు. ఇంతలో ఇంగ్లండ్ వరుసగా రెండో వన్డేలోనూ ఓటమిపాలై సిరీస్‌ను సౌతాఫ్రికాకు కోల్పోయింది. కనీసం మూడో వన్డేలోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని ఇంగ్లండ్ భావించింది. దీంతో జోఫ్రా ఆర్చర్‌ను మళ్లీ తుది జట్టులోకి తీసుకున్నాడు బట్లర్. ఆర్చర్‌పై ఉన్న నమ్మకంతోనే అతన్ని తుది టీంలోకి ఎంపిక చేశామని టాస్ సమయంలో బట్లర్ పేర్కొన్నాడు. బట్లర్ మాటలను ఆర్చర్ నిజం చేసి చూపించాడు. రెండేళ్ల పాటు ఆటకు దూరమైన ఆర్చర్ రెండు మ్యాచ్‌ల వ్యవధిలోనే తన పేస్ పదునును తిరిగి అందుకున్నాడు. 9.1 ఓవర్లలో 40 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లతో సౌతాఫ్రికాను శాసించాడు. ఆర్చర్ వన్డే కెరీర్లో ఇదే బెస్ట్ స్పెల్‌గా నిలిచిపోనుంది. తొలి వన్డేలో ధారాళంగా పరుగులిచ్చుకొని తిట్టించుకున్న ఆర్చర్.. వారి నోటితోనే మళ్లీ మెచ్చుకునేలా చేశాడు. ఒక్క మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రానా తనను తక్కువ చేసి చూడొద్దని పరోక్షంగా హెచ్చరించాడు. ఇక కీలకమైన వన్డే వరల్డ్‌కప్‌కు ముందు ఆర్చర్ ఫామ్‌లోకి రావడం ఇంగ్లండ్‌కు సానుకూలమని చెప్పొచ్చు. ఒక్కసారి అతను ఫామ్‌లోకి వచ్చాడంటే ఆపడం ఎవరి తరం కాదు. అందుకే మ్యాచ్‌లో బట్లర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచినప్పటికి తన అవార్డును ఆర్చర్‌కు ఇచ్చి అతనిపై ఉన్న గౌరవాన్ని పరోక్షంగా చాటుకున్నాడు. చదవండి: శతకాలతో చెలరేగిన బట్లర్, మలాన్.. ఇంగ్లండ్‌కు ఓదార్పు విజయం 'ఆ విషయాలు పెద్దగా పట్టించుకోను.. భవిష్యత్తుకు డోకా లేనట్లే' -
అన్నా.. ఏందన్నా ఇది! ఇలాంటి షాట్ ఎవరూ ట్రై చేసి ఉండరు! వైరల్
South Africa vs England, 3rd ODI- Moeen Ali: ఇంగ్లండ్- సౌతాఫ్రికా మధ్య జరిగిన మూడో వన్డేలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ ఒంటిచేత్తో షాట్‌కు యత్నించి విఫలమయ్యాడు. స్విచ్ హిట్ బాదాలని ప్రయత్నించిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. ఫెయిలయ్యాడు. ఆ తర్వాత మళ్లీ అలాంటి షాట్ ఆడేందుకు ట్రై చేయలేదు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. కాగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్ ప్రస్తుతం సౌతాఫ్రికాలో పర్యటిస్తోంది. ఈ క్రమంలో తొలి రెండు మ్యాచ్‌లలో గెలుపొందిన ఆతిథ్య ప్రొటిస్ జట్టు.. సిరీస్‌ను కైవసం చేసుకుంది. అదరగొట్టిన మలన్, బట్లర్, అలీ ఇక నామమాత్రపు మూడో వన్డేలో పర్యాటక ఇంగ్లండ్‌కు ఊరట విజయం దక్కింది. డేవిడ్ మలన్ 118 పరుగులు, జోస్ బట్లర్ 131 పరుగులతో చెలరేగడంతో 59 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గెలుపొందింది. వీరికి తోడు మొయిన్ అలీ 41 రన్స్‌తో రాణించాడు. దీంతో బట్లర్ బృందం క్లీన్‌స్వీప్ గండం నుంచి గట్టెక్కింది. ఇదేం షాట్ భయ్యా అయితే, ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో 44వ ఓవర్ మూడో బంతికి తబ్రేజ్ షంసీ బౌలింగ్‌లో మొయిన్ అలీ రివర్స్ హిట్‌కు యత్నించిన తీరు ఆశ్చర్యపరిచింది. షంసీ వేసిన షార్ట్‌బాల్‌ను కుడిచేతితో బౌండరీకి తరలించాలని భావించిన ఈ లెఫ్టాండర్ పూర్తిగా విఫలమయ్యాడు. ఇక తర్వాతి బంతికి మాత్రం భారీ సిక్సర్ బాది చైనామన్ స్పిన్నర్ షంసీకి షాకిచ్చాడు. సోషల్ మీడియాలో వైరల్ సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో చూసిన నెటిజన్లు .. ‘‘అన్నా ఏందన్నా ఇది! బహుశా ఎవరూ కూడా మరీ ఇంత వింతైన షాట్ ట్రై చేసి ఉండరు. మేమైతే ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు అలీ భాయ్!’’ అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కాగా మూడో వన్డేలో బట్లర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా అందుకున్నాడు. ఇదిలా ఉంటే.. అలీ ఈ మ్యాచ్‌లో 23 బంతుల్లో 41 పరుగులతో అద్భుతంగా రాణించాడు. రెండు ఓవర్లు బౌలింగ్ చేసి 29 పరుగులు ఇచ్చాడు. వికెట్ మాత్రం తీయలేకపోయాడు. చదవండి: IND vs NZ: గంటకు 150 కి.మీ. వేగం.. సర్కిల్ బయటపడ్డ బెయిల్స్! ఉమ్రాన్‌తో అట్లుంటది మరి! Suryakumar: ఒకే స్టైల్లో రెండు స్టన్నింగ్ క్యాచ్‌లు.. 'స్కై' అని ఊరికే అనలేదు What was Brother Moeen doing 😂😂😂 pic.twitter.com/8NcE1OW285 — Taimoor Zaman (@taimoorze) February 1, 2023 Imagine he made contact with this shot. One-handed reverse Slap from Moeen Ali😂😭 #EngvSa #SAvENG pic.twitter.com/ioHJwv5e6U — Shaharyar Ejaz 🏏 (@SharyOfficial) February 1, 2023 -
శతకాలతో చెలరేగిన బట్లర్, మలాన్.. ఇంగ్లండ్‌కు ఓదార్పు విజయం
సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్‌కు ఓదార్పు విజయం లభించింది. ఇప్పటికే సౌతాఫ్రికా సిరీస్‌ను చేజెక్కించుకున్న సంగతి తెలిసిందే. బుధవారం జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ 59 పరుగుల తేడాతో గెలుపును అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. కెప్టెన్ జాస్ బట్లర్, ఓపెనర్ డేవిడ్ మలాన్‌లు శతకాలతో విరుచుకుపడడంతో నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 346 పరుగుల భారీ స్కోరు చేసింది. బట్లర్(127 బంతుల్లో 131, ఆరు ఫోర్లు, 7 సిక్సర్లు), డేవిడ్ మలాన్(114 బంతుల్లో 118, ఏడు ఫోర్లు, ఆరు సిక్సర్లు) చెలరేగగా.. చివర్లో మొయిన్ అలీ 23 బంతుల్లో 41 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 43.1 ఓవర్లలో 287 పరుగులకు ఆలౌటైంది. హెన్రిచ్ క్లాసెన్ 80 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రీజా హెండ్రిక్స్ 52, టెంబా బవుమా 35 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ ఆరు వికెట్లతో టాప్ లేపగా.. ఆదిల్ రషీద్ మూడు వికెట్లు తీశాడు. ఇక ప్లేయర్ ఆఫ్ మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును జాస్ బట్లర్ దక్కించుకున్నాడు. ఇంగ్లండ్ ఈ సిరీస్‌తో ఏదైనా లాభపడిందంటే అది ఆర్చర్ రూపంలో మాత్రమే. గాయంతో చాలాకాలం పాటు జట్టుకు దూరమైన జోఫ్రా ఆర్చర్ రీఎంట్రీ మ్యాచ్‌లో దారుణంగా విఫలమయ్యాడు. అయితే తన విలువేంటో మూడో వన్డేలో చూపించాడు. ఆరు వికెట్లతో ప్రొటిస్ నడ్డి విరిచాడు. కీలకమైన వన్డే వరల్డ్‌కప్‌కు ముందు ఆర్చర్ ఫామ్‌లోకి రావడం ఇంగ్లండ్‌కు శుభసూచకం అని చెప్పొచ్చు. -
బట్లర్‌కు ఇదేమి కొత్త కాదు..
ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్ చర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఇంగ్లండ్ సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ప్రొటిస్ 2-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఆదివారం జరిగిన రెండో వన్డేలో సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా సూపర్ సెంచరీతో జట్టుకు విజయం అందించి సిరీస్‌ను గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ విషయం పక్కనబెడితే.. సౌతాఫ్రికా బ్యాటర్ వాండర్ డసెన్‌ను బట్లర్ తన వెకిలి చేష్టలతో చిరాకు తెప్పించాడు దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో బట్లర్.. ''నీ సమస్యేంటి రాసీ.. ప్రతీసారి నీ గురించి రావడం లేదు.. బంతిని అందుకోవడానికి ప్రయత్నిస్తున్నా.. నిన్ను కాదు'' అంటూ పేర్కొన్నాడు. దానికి డసెన్.. ''ఏం జరిగిందో నేను చూశాను'' అంటూ ధీటుగా బదులిచ్చాడు. ఆ తర్వాత ఇద్దరు వాగ్వాదానికి దిగడం స్టంప్‌మైక్‌లో రికార్డయింది. ఇదంతా గమనించిన అంపైర్ ఇక చాలు ఆపండి అనగానే ఇద్దరు సైలెంట్ అయిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇలాంటివి బట్లర్‌కు కొత్తేమి కాదు. ఇంతకముందు కూడా తన కవ్వింపు చర్యలతో బ్యాటర్‌ను ఇబ్బంది పెట్టాడు. 2020లో సౌతాఫ్రికా, ఇంగ్లండ్ మధ్య టెస్టు మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో క్రీజులో ఉన్న ఫిలాండర్‌తో బట్లర్ మాటల యుద్ధానికి దిగాడు. ఫీల్డర్ బంతిని అందుకొని ఫిలాండర్ వైపు విసిరాడు. ఈ క్రమంలో బంతిని అందుకున్న బట్లర్.. ఫిలాండర్‌ను చూస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అప్పట్లో ఈ వీడియో బాగా పాపులర్ అయింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది. జాస్ బట్లర్ 94 నాటౌట్, హ్యారీ బ్రూక్ 80, మొయిన్ అలీ 51 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రాకా 49.1 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. టెంబా బవుమా 109 పరుగులు చేయగా.. డేవిడ్ మిల్లర్ 58 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 👀 Jos Buttler is at it again.#SAvsENG | #Proteas https://t.co/d4724m1ws7 pic.twitter.com/TSn9OdaK3M — PEAK (@ThePeakSA) January 29, 2023 చదవండి: ILT20 2023: తిరిగిస్తాడనుకుంటే పారిపోయాడు -
ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం.. సిరీస్ సొంతం
బ్లూమ్‌ఫోంటైన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో 5 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో ప్రొటీస్ సొంతం చేసుకుంది. 343 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 49.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. ప్రోటీస్ విజయంలో ఆ జట్టు కెప్టెన్ టెంబా బావుమా కీలక పాత్ర పోషించాడు. 102 బంతులు ఎదుర్కొన్న బావుమా 14 ఫోర్లు, 1 సిక్స్‌తో 109 పరుగులు చేశాడు. అదే విధంగా డెవిడ్ మిల్లర్ కూడా 58 పరుగులతో ఆజేయం నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ స్టోన్, రషీద్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. సామ్ కుర్రాన్ ఒక్క వికెట్ సాధించాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 342 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్(80), జోస్ బట్లర్(94 నాటౌట్), మొయిన్ అలీ(51) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. ప్రోటిస్ బౌలర్లలో నోర్జే రెండు వికెట్లు సాధించగా.. పార్నెల్, ఎంగిడీ, మార్క్రమ్, జానెసన్ తలా వికెట్ పడగొట్టారు. ఇక ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో వన్డే కింబర్లీ వేదికగా ఫిబ్రవరి 1న జరగనుంది. చదవండి: Gongadi Trisha: శెభాష్ బిడ్డా! మ్యాచ్‌ను మలుపు తిప్పిన త్రిష.. భద్రాచలంలో సంబరాలు -
బొత్తిగా ఆసక్తి లేనట్టుంది.. ఆ మాత్రం దానికి అంపైరింగ్ ఎందుకు?
క్రికెట్లో ఆటగాళ్లతో పాటు అంపైర్ల పాత్ర కూడా చాలా కీలకం. బౌలర్ ఎన్ని బంతులు వేస్తున్నాడు.. బ్యాటర్లు ఎన్ని పరుగులు తీశారు.. వైడ్ బాల్స్, నో బాల్స్, సిక్సర్లు, బౌండరీలు, క్యాచ్‌లు, ఎల్బీలు ఇలా చెప్పుకుంటూ పోతే ఫీల్డ్ ఉన్న ఇద్దరు అంపైర్లు చాలా బిజీగా ఉంటారు. ఒక్కోసారి ఆటగాళ్ల మధ్య గొడవలు జరిగితే రాజీ కుదర్చడం కూడా అంపైర్ల బాధ్యత. బాధ్యతతో కూడిన అంపైరింగ్‌లో నిర్లక్ష్యం వహించడం ఎప్పుడైనా చూశారా. చూడకపోతే మాత్రం సౌతాఫ్రికా, ఇంగ్లండ్ మ్యాచ్‌ను రీక్యాప్ చేయండి. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. లెగ్ అంపైర్ మరాయిస్ ఎరాస్మస్ బౌలర్ వేసిన బంతిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకోవడం కనిపించింది. ఇందులో మరొక విషమేంటంటే.. ఆ సమయంలో ఎరాస్మస్ వెనక్కి తిరిగి చేతితో ఏదో లెక్కబెడుతున్నట్లు కనిపించింది. అప్పటికే అన్రిచ్ నోర్ట్జే బంతి వేయడం.. క్రీజులో ఉన్న జేసన్ రాయ్ షాట్ ఆడడం జరిగిపోయాయి. ఇంగ్లండ్ బ్యాటర్లు పరిగెత్తే సమయంలో అంపైర్ ఎరాస్మస్ అప్పుడే మేల్కొన్నట్లు ముందుకు తిరగడం స్పష్టంగా కనిపిస్తుంది. ఇదంతా 24వ ఓవర్లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోనూ ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియోనూ చూసిన అభిమానులు వినూత్న రీతిలో స్పందించారు. ''వన్డే క్రికెట్‌పై బొత్తిగా ఆసక్తి లేనట్టుంది.. అంపైర్ పని కాకుండా అంత బిజీగా ఏం చేస్తున్నాడబ్బా.. పట్టించుకోవడం లేదు కాబట్టే ప్రతీది థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేస్తున్నారనుకుంటా.. గుత్కా సుప్రీమసీ అంటూ కామెంట్స్ చేశారు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో సౌతాఫ్రికా 27 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. వాండర్ డుసెన్ (117 బంతుల్లో 111 పరుగులు, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీతో మెరవగా.. డేవిడ్ మిల్లర్ 53 పరుగులతో రాణించాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 44.2 ఓవర్లలో 271 పరుగులకు ఆలౌటై 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఓపెనర్ జేసన్ రాయ్(91 బంతుల్లో 113 పరుగులు, 11 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు సెంచరీ వృథాగా మారింది. డేవిడ్ మలన్(59 పరుగులు)మినహా మిగతావారు చెప్పుకోదగ్గ ప్రదర్శన నమోదు చేయలేకపోయారు. ప్రొటిస్ బౌలర్లలో అన్రిచ్ నోర్ట్జే నాలుగు వికెట్లు పడగొట్టగా.. సిసందా మగల మూడు, కగిసో రబడా రెండు, తబ్రెయిజ్ షంసీ ఒక వికెట్ తీశాడు. pic.twitter.com/KKPnERRMuw — 🗂️ (@TopEdgeCricket2) January 27, 2023 చదవండి: 'ప్రయోగాలకు స్వస్తి పలకండి'.. బీసీసీఐపై ఫ్యాన్స్ ఆగ్రహం -
రెండేళ్ల తర్వాత పునరాగమనం.. వన్డే కెరీర్లో చెత్త రికార్డు
ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ దాదాపు రెండేళ్ల తర్వాత జాతీయ జట్టులో పునరాగమనం చేశాడు. అయితే రీఎంట్రీలో ఆర్చర్ నాసిరకం బౌలింగ్ ప్రదర్శించాడు. 10 ఓవర్లు వేసిన ఆర్చర్ 81 పరుగులు సమర్పించుకొని కేవలం ఒకే ఒక్క వికెట్ పడగొట్టాడు. ఆర్చర్ వన్డే కెరీర్లోనే ఇవి అత్యంత చెత్త గణాంకాలుగా నమోదయ్యాయి. 678 రోజుల తర్వాత తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఆర్చర్ ఒక ఓవర్లో 20 పరుగులకు పైగా సమర్పించుకున్నాడు. ఒక వన్డే మ్యాచ్‌లో ఆర్చర్ ఒక ఓవర్లో ఇన్ని పరుగులు ఇచ్చుకోవడం కూడా ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే లాంగ్ గ్యాప్ తర్వాత క్రికెట్ ఆడడంతో ఆర్చర్ బౌలింగ్ లైనప్ కాస్త గాడిన పడాల్సి ఉంది. అయితే వేన్ పార్నెల్ రూపంలో ఒక వికెట్ తీయడం ఆర్చర్‌కు కాస్త ఊరట అని చెప్పొచ్చు. ఇక 2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ జట్టుకు ఆర్చర్ కీలక బౌలర్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. అప్పటిలోగా మునుపటి ఫామ్ అందుకుంటాడని ఈసీబీ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో జరగనున్న మెగా టోర్నీకి భారత్ ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సొంతగడ్డపై వన్డే సిరీస్ ఆడుతున్న ఇంగ్లండ్‌కు సౌతాఫ్రికా షాక్ ఇచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. వాండర్ డుసెన్ (117 బంతుల్లో 111 పరుగులు, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీతో మెరవగా.. డేవిడ్ మిల్లర్ 53 పరుగులతో రాణించాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 44.2 ఓవర్లలో 271 పరుగులకు ఆలౌటై 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఓపెనర్ జేసన్ రాయ్(91 బంతుల్లో 113 పరుగులు, 11 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు సెంచరీ వృథాగా మారింది. డేవిడ్ మలన్(59 పరుగులు)మినహా మిగతావారు చెప్పుకోదగ్గ ప్రదర్శన నమోదు చేయలేకపోయారు. ప్రొటిస్ బౌలర్లలో అన్రిచ్ నోర్ట్జే నాలుగు వికెట్లు పడగొట్టగా.. సిసందా మగల మూడు, కగిసో రబడా రెండు, తబ్రెయిజ్ షంసీ ఒక వికెట్ తీశాడు. A message from Jofra to you! 🗣 pic.twitter.com/Kj2S7mE0VA — England Cricket (@englandcricket) January 27, 2023 చదవండి: ఏ మాత్రం తగ్గని ధోని మేనియా 'గడిచిన 18 నెలలు కష్టకాలంగా అనిపించింది' -
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్.. దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన! స్టార్ బ్యాటర్ వచ్చేశాడు
ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్ కోసం 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ సౌతాఫ్రికా ప్రకటించింది. ఈ జట్టుకు టెంబా బావుమా సారథ్యం వహించనున్నాడు. అదే విధంగా ఆల్‌రౌండర్లు మార్కో జాన్సెన్, సిసంద మగలకు వన్డే జట్టులో చోటు దక్కింది. ఇక గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న ప్రోటీస్ స్టార్ బ్యాటర్ వాన్ డెర్ డస్సెన్ ఈ సిరీస్‌తో పునరాగమనం చేయనున్నాడు. ఇక ఈ సిరీస్‌కు ఎంపికైన ప్రోటీస్ సీనియర్ ఆటగాళ్లు క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహారాజ్, జన్నెమాన్ మలన్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్ ప్రస్తుతం సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా ఉన్నారు. అయితే సిరీస్ సమయానికి వీరంతా జట్టుతో కలవనున్నారు. ఇక జనవరి 27న బ్లోమ్‌ఫోంటెయిన్ వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ఆరంభం కానుంది. కాగా భారత్ వేదికగా ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించాలంటే ఈ సిరీస్ ప్రోటీస్‌కు చాలా కీలకం. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ప్రోటీస్ జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, సిసంద మగలా, కేశవ్ మహరాజ్, జన్నెమాన్ మలన్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్గిడి, అన్రిచ్ నోర్జే, వేన్ పార్నెల్, షమ్సీ, వాన్ డెర్ డస్సెన్ చదవండి: IND vs NZ: నేను అనుకున్నది జరగలేదు.. అతడు మాత్రం భయపెట్టాడు: రోహిత్ శర్మ -
అరివీర భయంకరుడు వచ్చేస్తున్నాడు.. ఇంగ్లండ్‌ను ఆపడం కష్టమే..!
Jofra Archer Returns To England ODI Squad: ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు శుభవార్త అందింది. గాయం కారణంగా దాదాపు రెండేళ్ల పాటు జట్టుకు దూరంగా ఉన్న స్టార్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. వచ్చే ఏడాది జనవరిలో (27, 29, ఫిబ్రవరి 1) సౌతాఫ్రికాతో జరిగే 3 వన్డేల సిరీస్ కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఎంపిక చేసిన 14 మంది సభ్యుల బృందంలో జోఫ్రా చోటు దక్కించుకున్నాడు. జోఫ్రా.. 2021 మార్చిలో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ (ఇండియాపై) ఆడాడు. మోచేయి, వెన్నెముక సర్జరీలు చేయించుకున్న జోఫ్రా.. సుదీర్ఘకాలం తర్వాత ఇటీవలే ఓ వార్మప్ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. ఇంగ్లండ్ లయన్స్-ఇంగ్లండ్ టెస్ట్ టీమ్ మధ్య జరిగిన ఆ మ్యాచ్‌లో లయన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన జోఫ్రా మునుపటి వేగాన్ని కొనసాగిస్తూ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ ప్రదర్శన ఆధారంగా ఈసీబీ జోఫ్రాను సౌతాఫ్రికా పర్యటనకు ఎంపిక చేసింది. కాగా, జోఫ్రా అంతర్జాతీయ క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇవ్వనుండటంతో ముంబై ఇండియన్స్ జట్టు కూడా సంబురాల్లో మునిగిపోయింది. 2022 ఐపీఎల్ మెగా వేలంలో ముంబై ఫ్రాంచైజీ.. జోఫ్రా గాయం కారణంగా అందుబాటులో ఉండడని తెలిసినా 8 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. జోఫ్రా గాయాల నుంచి కోలుకోవడంతో ఐపీఎల్ 2023 సీజన్ బరిలోకి దిగడం దాదాపుగా ఖరారైంది. ఇదిలా ఉంటే, ఫార్మాట్లకతీతంగా వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇంగ్లండ్.. జోఫ్రా చేరికతో మరింత బలపడుతుంది. ఇదివరకే పటిష్టమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ కలిగిన ఇంగ్లండ్ టీమ్.. జోఫ్రా ఎంట్రీతో పట్టపగ్గాల్లేకుండా పోతుంది. ఫార్మాట్ ఏదైనా ఇకపై ఇంగ్లండ్‌ను ఆపడం కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బెన్ స్టోక్స్ నేతృత్వంలోని ఇంగ్లండ్ టెస్ట్ టీమ్ తాజాగా పాక్‌ను వారి సొంతగడ్డపై 3-0 తేడాతో టెస్ట్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి చరిత్ర సృష్టించింది. అంతకుముందు జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో బట్లర్ సేన.. ఇదే పాక్‌ను ఫైనల్లో మట్టికరిపించి రెండోసారి జగజ్జేతగా అవతరించింది. సౌతాఫ్రికా టూర్‌కు ఇంగ్లండ్ జట్టు.. జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, మొయిన్ ఆలీ, హ్యారీ బ్రూక్, సామ్ కర్రన్, బెన్ డక్కెట్, డేవిడ్ మలాన్, ఆదిల్ రషీద్, జేసన్ రాయ్, ఫిలిప్ సాల్ట్, ఓల్లీ స్టోన్, రీస్ టాప్లే, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్ -
నాకసలు ఈ జాబ్ అవసరమే లేదు.. నేనిది కోరుకోలేదు: ఇంగ్లండ్ కోచ్ మెకల్లమ్
England vs South Africa, 3rd Test: బ్రెండన్ మెకల్లమ్.. ఈ న్యూజిలాండ్ దిగ్గజ క్రికెటర్ ఇంగ్లండ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఆ జట్టు ఇంతవరకు ఒక్క టెస్టు సిరీస్ కూడా ఓడిపోలేదు. కొత్త కెప్టెన్ బెన్‌స్టోక్స్ సారథ్యంలో మే నుంచి వరుస విజయాలు సాధిస్తోంది. బజ్‌బాల్ విధానంతో దూకుడైన ఆట కనబరుస్తూ స్వదేశంలో సంచలనాలు నమోదు చేసింది. తాజాగా దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను కూడా సొంతం చేసుకుంది. లండన్ వేదికగా ముగిసిన ఆఖరి టెస్టులో తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ కోచ్ మెకల్లమ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నాకసలు ఈ జాబ్ అవసరమే లేదు! ఈ మేరకు స్కై స్పోర్ట్స్‌తో మాట్లాడిన బ్రెండన్ మెకల్లమ్.. ‘‘నిజానికి నాకసలు ఇంగ్లండ్ కోచ్‌గా జాబ్ అవసరమే లేదు! అయితే.. ఆ పదవి నన్ను వరించింది. నాకిది నచ్చింది. ఇప్పుడు నా పనిని ప్రేమిస్తున్నాను. ఇంతకు ముందెన్నడూ నాకు ఇలాంటి అనుభవం లేదు. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. ఇక్కడ ప్రతిభకు కొదువ లేదు. ఆట పట్ల వారి అంకితభావాన్ని దగ్గరగా గమనిస్తున్నా. ముఖ్యంగా స్టోక్స్‌తో కలిసి పనిచేయడాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నా. తనొక అద్భుతమైన మనిషి. తనకెవ్వరూ సాటిరారు. తను గొప్ప నాయకుడు. కెప్టెన్‌గా సరైన వ్యక్తి’’ అని చెప్పుకొచ్చాడు. కేకేఆర్‌ను వీడి.. ఇంగ్లండ్ కోచ్‌గా.. తాము ఇలాగే వరుస సిరీస్‌లు గెలుస్తూ అభిమానులకు ఆనందం పంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని పేర్కొన్నాడు. టెస్టు క్రికెట్లోని అసలైన మజాను ప్రేక్షకులకు అందిస్తామని తెలిపాడు. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మెకల్లమ్ కోచ్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. అయితే, ఇంగ్లండ్‌కు మార్గదర్శనం చేసే క్రమంలో అతడు కేకేఆర్‌కు దూరం కాగా.. 2023 సీజన్‌కు గానూ చంద్రకాంత్ పండిట్‌ను తమ హెడ్‌కోచ్‌గా నియమించుకుంది కోల్‌కతా ఫ్రాంఛైజీ. చదవండి: T20 WC: నేనైతే వాళ్లిద్దరిని సెలక్ట్ చేసేవాడిని! నువ్వొక మాజీ కెప్టెన్.. కానీ ఏం లాభం? క్రికెట్ సౌతాఫ్రికాకు భారీ షాక్ -
Eng Vs SA: దక్షిణాఫ్రికాపై ఇంగ్లండ్ ఘన విజయం.. ఏకంగా..
South Africa tour of England, 2022 - England vs South Africa, 3rd Test: దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. కాగా లండన్‌లోని కెనింగ్టన్ వేదికగా సెప్టెంబరు 8న ఆరంభమైన ఆఖరి టెస్టులో టాస్ గెలిచిన ఆతిథ్య ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. 118 పరుగులకే ఆలౌట్! ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన పర్యాటక ప్రొటిస్ జట్టుకు ఇంగ్లండ్ బౌలర్లు రాబిన్సన్, స్టువర్ట్ బ్రాడ్ చుక్కలు చూపించారు. రాబిన్సన్ ఐదు వికెట్లు, బ్రాడ్ నాలుగు వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా జట్టు 118 పరుగులకే కుప్పకూలింది. మ్యాచ్‌తో పాటు సిరీస్ కూడా సొంతం! ఇక ఇంగ్లండ్ 158 పరుగులకు ఆలౌట్ అయింది. ఇదిలా ఉంటే.. బ్రాడ్ మరోసారి మూడు వికెట్లతో రెచ్చిపోవడం.. ఇందుకు కెప్టెన్ బెన్‌స్టోక్స్ కూడా జత కావడంతో దక్షిణాఫ్రికా 169 పరుగులకే రెండో ఇన్నింగ్స్‌ను ముగించింది. లక్ష్య ఛేదనకు దిగిన ఆతిథ్య ఇంగ్లండ్ కేవలం ఒకే ఒక వికెట్ నష్టపోయి.. ఆఖరి రోజు జయభేరి మోగించింది. సిరీస్‌ను సైతం సొంతం చేసుకుంది. రాబిన్సన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్‌తో పాటు ప్రొటిస్ బౌలర్ కగిసొ రబడ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రబడ మొత్తంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. టీ20 సిరీస్ ప్రొటిస్ది.. టెస్టు సిరీస్ ఇంగ్లండ్‌ది! మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడే నిమిత్తం దక్షిణాఫ్రికా ఇంగ్లండ్ పర్యటనకు వచ్చింది. ఇందులో భాగంగా మొదటి వన్డేలో పర్యాటక ప్రొటిస్ విజయం సాధించగా.. రెండో మ్యాచ్‌లో ఇంగ్లంఢ్ గెలుపొందింది. ఆఖరి వన్డేలో ఫలితం తేలలేదు. ఇక టీ20 సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-1తో కైవసం చేసుకోగా.. ఆఖరి రెండు టెస్టుల్లో ఓటమి పాలై.. టెస్టు సిరీస్‌ను 2-1తో ఆతిథ్య జట్టుకు సమర్పించుకుంది. చదవండి: ఇండియా నుంచి వచ్చారా? హ్యాపీగా ఉన్నారనుకుంటా: రమీజ్ రాజా దురుసు ప్రవర్తన SL Vs Pak: పాక్‌తో ఫైనల్! అప్పుడు వాళ్లు అలా.. ఇప్పుడు మేమిలా: దసున్ షనక -
దక్షిణఫ్రికాతో మూడో టెస్టు.. విజయం దిశగా ఇంగ్లండ్!
లండన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టులో ఇంగ్లండ్ విజయానికి చేరువైంది. మ్యాచ్ నాలుగో రోజు 130 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 17 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 97 పరుగులు సాధించింది. ఓపెనర్లు అలెక్స్ లీస్ (32 బ్యాటింగ్), జాక్ క్రాలీ (57 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. నేడు మరో 33 పరుగులు చేస్తే ఇంగ్లండ్ గెలుస్తుంది. అంతే కాకుండా మూడు టెస్టుల సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంటుంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 154/7తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ మరో నాలుగు పరుగులు జోడించి 158 పరుగులవద్ద ఆలౌటైంది. 40 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా 169 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లు బ్రాడ్ (3/45), స్టోక్స్ (3/39), అండర్సన్ (2/37), ఒలీ రాబిన్సన్ (2/40) రాణించారు. చదవండి: Asia Cup 2022 Final: అలా అయితే రాజపక్స 70 పరుగులకు విలువే ఉండేది కాదు! కానీ..: పాక్ మాజీ కెప్టెన్ -
నిప్పులు చెరిగిన పేసర్లు.. ఒకే రోజు 17 వికెట్లు
లండన్: ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా మధ్య మూడో టెస్టును బౌలర్లు శాసిస్తున్నారు. రెండు రోజులు ఆలస్యంగా మొదలైన మూడో టెస్టులో ఒక్క మూడో రోజు ఆటలోనే 17 వికెట్లు కూలాయి. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 36.2 ఓవర్లలో 118 పరుగులకే ఆలౌటైంది. జాన్సెన్ (30; 4 ఫోర్లు), జొండో (23; 1 ఫోర్, 1 సిక్స్) కాసేపు ఆడారు. మిగిలిన వారిని రాబిన్సన్ (5/49), స్టువర్ట్ బ్రాడ్ (4/41) జంటగా పడగొట్టేశారు. తర్వాత తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ ఆట నిలిచే సమయానికి 33.4 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఒలీ పోప్ (67; 13 ఫోర్లు) రాణించడంతో ప్రస్తుతం ఇంగ్లండ్ 36 పరుగుల ఆధిక్యంలోనే ఉంది. జాన్సెన్ 4, రబడ 2 వికెట్లు తీశాడు. తొలి రోజు ఆట వర్షార్పణం కాగా... రెండో రోజు క్వీన్ ఎలిజబెత్–2 మృతికి సంతాప సూచకంగా ఆటను రద్దు చేశారు. మూడో రోజు ఉదయం ఇరు జట్ల ఆటగాళ్లు బ్రిటన్ రాణికి నివాళులు అర్పించాకే ఆట మొదలైంది. -
118 పరుగులకే కుప్పకూలిన సౌతాఫ్రికా
ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో ప్రారంభమైన మూడో టెస్టులో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 118 పరుగులకే కుప్పకూలింది. ఓలి రాబిన్సన్ ఐదు, స్టువర్ట్ బ్రాడ్ నాలుగు వికెట్లతో ప్రొటిస్‌ను శాసించారు. సౌతాఫ్రికా బ్యాటర్లలో మార్కో జాన్సెన్ 30 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. జోండో 23 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్ల దాటికి సౌతాఫ్రికా బ్యాటర్స్‌లో ఆరుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ టీ విరామ సమయానికి 2 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. ఓలి పోప్ 38, జో రూట్ 23 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు అలెక్స్ లీస్ 13, జాక్ క్రాలీ 5 పరుగులు చేసి ఔటయ్యారు. ఇక మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇరుజట్లు చెరో మ్యాచ్ గెలవడంతో సిరీస్‌లో 1-1తో సమంగా ఉన్నాయి. -
ఆండర్సన్ ఖాతాలో మరో అరుదైన రికార్డు.. పేసర్లలో మొనగాడిగా..!
James Andersdon: దక్షిణాఫ్రికాతో తాజాగా ముగిసిన రెండో టెస్ట్‌లో ఆతిధ్య ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 85 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ పేసర్లు జేమ్స్ ఆండర్సన్ (6/62), ఓలీ రాబిన్సన్ (5/91), స్టువర్ట్ బ్రాడ్ (4/61), బెన్ స్టోక్స్ (4/47) చెలరేగి సఫారీలను రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 330 పరుగులకే (151, 179) పరిమితం చేయగా.. బెన్ స్టోక్స్ (103), బెన్ ఫోక్స్ (113 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ను 415/9 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్ట్‌లో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 12 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, సఫారీలతో జరిగిన రెండో టెస్ట్‌లో 6 వికెట్లతో సత్తా చాటిన ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో సఫారీ ప్లేయర్ సైమన్ హార్మర్ వికెట్ పడగొట్టడం ద్వారా ఆండర్సన్ అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు (951, టెస్ట్‌ల్లో 664, వన్డేల్లో 269, టీ20ల్లో 18) సాధించిన పేస్ బౌలర్‌గా సరికొత్త రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ పేరిట ఉండేది. మెక్‌గ్రాత్.. అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం 949 వికెట్లు సాధించాడు. తాజాగా ఆండర్సన్.. మెక్‌గ్రాత్ రికార్డు బద్దలు కొట్టి ప్రపంచ క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన పేస్ బౌలర్‌గా అవతరించాడు. 40 ఏళ్ల ఆండర్సన్ మరో 5 వికెట్లు సాధిస్తే.. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల (పేసర్లు, స్పిన్నర్లు) జాబితాలో దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లేను (955 వికెట్లు) వెనక్కు నెట్టి మూడో స్థానానికి ఎగబాకుతాడు. ఇంగ్లండ్-సఫారీల మధ్య నిర్ణయాత్మకమైన మూడో టెస్ట్ కెన్నింగ్స్టన్ ఓవల్ వేదికగా సెప్టెంబర్ 8న ప్రారంభమవుతుంది. చదవండి: జేమ్స్ అండర్సన్ అరుదైన ఘనత.. తొలి క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు -
సెంచరీలతో చెలరేగిన స్టోక్స్, బెన్ ఫోక్స్.. పట్టు బిగిస్తున్న ఇంగ్లండ్
సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ పట్టు బిగిస్తుంది. తొలి టెస్టులో దారుణ పరాభవానికి ప్రతీకారం తీర్చుకునే పనిలో పడింది. తొలి ఇన్నింగ్స్‌లో ప్రొటిస్‌ను 151 పరుగులకే ఆలౌట్ చేసి తొలి రోజు ఆధిపత్యం ప్రదర్శించిన ఇంగ్లండ్.. రెండోరోజు ఆటలో బ్యాటింగ్‌లో దూకుడు కనబరిచింది. ముఖ్యంగా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(163 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 103 పరుగులు) చాలా రోజుల తర్వాత శతకంతో చెలరేగాడు. Photo Credit: ESPNcricinfo స్టోక్స్‌కు టెస్టుల్లో ఇది 12వ శతకం కాగా.. కెప్టెన్‌గా మాత్రం ఇదే మొదటిది. ఇక వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ కూడా సెంచరీ మార్క్‌ను(209 బంతుల్లో 104 బ్యాటింగ్, 9 ఫోర్లు)అందుకున్నాడు. కాగా బెన్ఫోక్స్కు టెస్టుల్లో ఇది రెండో సెంచరీ. సెంచరీ సాధించి స్టోక్స్ ఔటైనప్పటికి వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను నడిపిస్తున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 7 వికెట్ల నష్టానికి 395 పరుగులు చేసింది. ఇప్పటివరకు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగుల ఆధిక్యంలో ఉంది. A special first hundred as England Test captain for Ben Stokes ✨ pic.twitter.com/PiKjUGO94d — ESPNcricinfo (@ESPNcricinfo) August 26, 2022 Manchester stands up and applauds a quite magnificent Test hundred 👏 It's the first at home for Ben Foakes pic.twitter.com/cIFaWhC3YB — ESPNcricinfo (@ESPNcricinfo) August 26, 2022 -
ముప్పతిప్పలు పెట్టి తెలివైన బంతితో బోల్తా కొట్టించాడు..
సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ బౌలర్లు ప్రొటిస్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఇంగ్లండ్ బౌలర్ల దాటికి తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 151 పరుగులకే ఆలౌట్ అయింది. రబడా 36 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్ 3, బ్రాడ్ 3, బెన్ స్టోక్స్ రెండు వికెట్లు తీశారు. ఈ విషయం పక్కనబెడితే.. ఇంగ్లండ్ సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్.. దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్‌ను ఔట్ చేసిన విధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఎల్గర్ ఔట్ అనుకుంటే పొరపాటే.. ఎల్గర్‌ను పెవిలియన్‌కు చేర్చే క్రమంలో స్టువర్ట్ బ్రాడ్ సెట్ చేసుకున్న బౌలింగ్ హైలైట్ అని చెప్పొచ్చు. అప్పటికే అండర్సన్ సరేల్ ఎర్వీ(3)ని ఇన్నింగ్స్‌ల ఐదో ఓవర్లో వెనక్కి పంపించాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ డీన్ ఎల్గర్‌కు స్టువర్ట్ బ్రాడ్ ఇన్నింగ్స్ 13వ ఓవర్లో ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించి చివరకు తెలివైన బంతితో బోల్తా కొట్టించాడు. ఆ ఓవర్లో ఎల్గర్ ఔటైన ఐదో బంతి వరకు దాదాపు అన్నీ ఒకే విధంగా ఉండడం విశేషం. ఆ ఓవర్లో తొలి నాలుగు బంతుల్లో రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ఎల్గర్.. చివరకు ఐదో బంతికి దొరికిపోయాడు. గుడ్‌లెంగ్త్‌తో రౌండ్ ది వికెట్ వేసిన బంతిని ఎల్గర్ టచ్ చేయగా నేరుగా బెయిర్‌స్టో చేతుల్లో పడింది. Some over. 🏴 #ENGvSA 🇿🇦 | @StuartBroad8 pic.twitter.com/4LZg4bwXBP — England Cricket (@englandcricket) August 25, 2022 చదవండి: ENG Vs SA 2nd Test: చెలరేగిన ఇంగ్లండ్ బౌలర్లు.. సౌతాఫ్రికా 151 ఆలౌట్ James Anderson: జేమ్స్ అండర్సన్ అరుదైన ఘనత.. తొలి క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు -
చెలరేగిన ఇంగ్లండ్ బౌలర్లు.. సౌతాఫ్రికా 151 ఆలౌట్
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న ఇంగ్లండ్ గురువారం ప్రారంభమైన రెండో టెస్టులో మాత్రం అదరగొట్టింది. ఇంగ్లండ్ పేసర్లు చెలరేగడంతో దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 151 పరుగులకే ఆలౌటైంది. ప్రొటీస్ బ్యాటర్లలో కగిసో రబడా 36 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవడం విశేషం. వెరిన్నే, కీగన్ పీటర్సన్ తలా 21 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ చెరో మూడు వికెట్లు తీయగా.. కెప్టెన్ బెన్‌స్టోక్స్ 2 వికెట్లు, ఓలి రాబిన్సన్, జాక్ లీచ్ చెరొక వికెట్ తీశారు. ఇదే మ్యాచ్‌లో ఇంగ్లండ్ వెటరన్ స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్ టెస్టుల్లో మరో అరుదైన ఘనత సాధించాడు. స్వదేశంలో వంద టెస్టులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా జేమ్స్ అండర్స్‌న్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అండర్సన్ తర్వాతి స్థానంలో టీమిండియా దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(స్వదేశంలో 94 టెస్టులు) రెండో స్థానంలో ఉండగా.. ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్(స్వదేశంలో 92 టెస్టులు) మూడో స్థానంలో.. ఇక నాలుగో స్థానంలో ఇంగ్లండ్ సీనియర్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్(స్వదేశంలో 91 టెస్టులు) ఉన్నాడు. చదవండి: Asia Cup 2022: పాక్ క్రికెటర్‌పై పుజారా ప్రశంసల వర్షం James Anderson: జేమ్స్ అండర్సన్ అరుదైన ఘనత.. తొలి క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు -
జేమ్స్ అండర్సన్ అరుదైన ఘనత.. తొలి క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు
ఇంగ్లండ్ వెటరన్ స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్ టెస్టుల్లో మరో అరుదైన ఘనత సాధించాడు. స్వదేశంలో వంద టెస్టులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా జేమ్స్ అండర్స్‌న్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు ద్వారా అండర్సన్ ఈ ఫీట్ సాధించాడు. అండర్సన్ తర్వాతి స్థానంలో టీమిండియా దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(స్వదేశంలో 94 టెస్టులు) రెండో స్థానంలో ఉండగా.. ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్(స్వదేశంలో 92 టెస్టులు) మూడో స్థానంలో.. ఇక నాలుగో స్థానంలో ఇంగ్లండ్ సీనియర్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్(స్వదేశంలో 91 టెస్టులు) ఉన్నాడు. అండర్సన్ తర్వాత స్వదేశంలో వంద టెస్టులు ఆడే అవకాశం ప్రస్తుతం స్టువర్ట్ బ్రాడ్‌కు మాత్రమే ఉంది. ఇటీవలే 40వ పడిలో అడుగుపెట్టిన అండర్సన్.. వయసు మీద పడుతున్నా బౌలింగ్‌లో మాత్రం పదును అలాగే ఉండడం విశేషం. ఇక 19 ఏళ్ల కెరీర్లో అండర్సన్ ఇంగ్లండ్ తరపున 174 టెస్టులాడి 658 వికెట్లు సాధించాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో అండర్సన్ ప్రస్తుతం మూడో స్థానంలో ఉండగా.. తొలి స్థానంలో లంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్(800 వికెట్లు) ఉండగా.. రెండో స్థానంలో ఆసీస్ దివంగత దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్(708 వికెట్లు) ఉన్నాడు. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ ఇన్నింగ్స్ 12 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే గురువారం ప్రారంభమైన రెండో టెస్టును మాత్రం పాజిటివ్ నోట్‌తో ఆరంభించింది. లంచ్ విరామం అనంతరం సౌతాఫ్రికా 92 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. జేమ్స్ అండర్సన్ 3 వికెట్లు, స్టోక్స్, బ్రాడ్ తలా రెండు వికెట్లు తీశారు. 19 years after his Test debut at Lord's, James Anderson has another milestone at home 🏴 pic.twitter.com/kMh7aFSh10 — ESPNcricinfo (@ESPNcricinfo) August 25, 2022 చదవండి: Asia Cup 2022: 'దీపక్ చహర్ గాయపడలేదు.. ఆ వార్తలు నమ్మకండి' SA vs ENG: దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు.. జట్టును ప్రకటించిన ఇంగ్లండ్ -
దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు.. జట్టును ప్రకటించిన ఇంగ్లండ్
దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో ఘోర పరాజయం పాలైన ఇంగ్లండ్.. ఇప్పడు రెండో టెస్టుకు సిద్దమైంది. గరువారం మాంచెస్టర్ వేదికగా ప్రోటీస్-ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు జరగనుంది. కాగా ఈ టెస్టు కోసం ఇంగ్లండ్ తమ తుది జట్టును బుధవారం ప్రకటించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగనుంది. తొలి టెస్టుకు దూరమైన ఓలీ రాబిన్సన్ తుది జట్టులోకి వచ్చాడు. అదే విధంగా గత కొన్ని మ్యాచ్‌ల నుంచి వరుసగా విఫలమవుతున్న ఓపెనర్ జాక్ క్రాలీకీ మళ్లీ చోటుదక్కడం గమానార్హం. ఇక తొలి టెస్టులో విజయం సాధించిన ప్రోటీస్.. ఈ మ్యాచ్‌లో కూడా గెలుపొంది సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. కాగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రోటీస్ జట్టు 1-0తో అధిక్యంలో ఉంది. దక్షిణాఫ్రికాతో రెండో టెస్టుకు ఇంగ్లండ్ జట్టు: అలెక్స్ లీస్, జాక్ క్రాలే, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), ఆలీ రాబిన్సన్, జాక్ లీచ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్ చదవండి: Asia Cup 2022: ఆసియా కప్ టోర్నీలో పాల్గొనబోయే టీమ్‌లు.. అన్ని జట్ల ఆటగాళ్ల వివరాలు -
లార్డ్స్‌లో బ్రాడ్ వందో వికెట్ వెనుక పెద్ద కథే!
ఇటీవలే సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌ల మధ్య లార్డ్స్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 12 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. ఇదే మ్యాచ్‌లో ఇంగ్లండ్ సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ప్రొటిస్ బ్యాటర్ కైల్ వెరిన్నేను ఔట్ చేయడం ద్వారా లార్డ్స్ వేదికలో వందో వికెట్ సాధించాడు. టెస్టు మ్యాచ్‌లో ఒకే వేదికలో వంద వికెట్లు సాధించిన ఇంగ్లండ్ రెండో బౌలర్‌గా బ్రాడ్ నిలిచాడు. బ్రాడ్ లార్డ్స్‌లో వందో వికెట్ సాధించడం వెనుక ఒక చిన్న కథ దాగుంది. అయితే అది బ్రాడ్ వెర్షన్ కాదు.. బ్రాడ్ ఖాతాలో వందో వికెట్‌గా వెనుదిరిగిన కైల్ వెరిన్నే వెర్షన్లో. విషయంలోకి వెళితే.. లార్డ్స్‌లో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌ను చూడడానికి వికెట్ కీపర్ కైల్ వెరిన్నే తాత(Grand Father)కూడా వచ్చారు. స్టాండ్స్‌లో కూర్చొని మ్యాచ్ ఆస్వాధిస్తున్న ఆయన సౌతాఫ్రికా బ్యాటింగ్ సమయంలో ఉన్నట్టుండి అనారోగ్యానికి గురయ్యారు. అతని పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో వెంటనే మెడికల్ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో ఉన్న తన తాత పరిస్థితిని సౌతాఫ్రికా క్రికెట్ సిబ్బంది వెరిన్నేకు వివరించారు. వాస్తవానికి వెరిన్నే ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు రావాలి. అప్పటికే సరెల్ ఎర్వీని బెన్ స్టోక్స్ ఔట్ చేయడంతో ఐదో వికెట్ కోల్పోయింది. వెరిన్నే బ్యాటింగ్‌కు వెళ్లాల్సి ఉండగా.. అతని స్థానంలో మార్కో జాన్సెన్ను పంపించారు. ఇక వెరిన్నేను ఏడో స్థానంలో బ్యాటింగ్ రావాలని చెప్పింది. ఈలోగా వెరిన్నేకు తన తాతను చూసేందుకు వెళ్లమని చెప్పారట. అలా ఆసుపత్రిలో ఉన్న తాతను చూసి వెరిన్నే తిరిగి వచ్చాడు. తాత ఆలోచనలతో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కైల్ వెరిన్నే ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోయాడు. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో వెరిన్నే వెనుదిరిగాడు. కాగా అతని రూపంలో బ్రాడ్‌కు లార్డ్స్‌లో వందో వికెట్ లభించింది. ఇలా తన తాతపై ప్రేమతో మ్యాచ్‌లో సరిగ్గా ఆడలేకపోయానని మ్యాచ్ ముగిసిన అనంతరం చెప్పుకొచ్చాడు. ఇదీ బ్రాడ్‌కు లార్డ్స్‌లో వందో వికెట్ దక్కడం వెనుక ఉన్న అసలు కథ. ఇక ఇప్పటికే మూడు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచిన సౌతాఫ్రికా మాంచెస్టర్ వేదికగా గురువారం నుంచి రెండో టెస్టు ఆడనుంది. వెరిన్నే తాత పరిస్థితి బాగానే ఉండడంతో అతను రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడని సీఎస్ఏ(క్రికెట్ సౌతాఫ్రికా) ప్రకటించింది.మ్యాచ్ విషయానికి వస్తే.. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 12 పరుగుల తేడాతో దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో కగిసో రబడా దాటికి ఇంగ్లండ్ 165 పరుగులకే ఆలౌట్ అయింది. ఓలీ పోప్ 73 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రబడాకు ఐదు వికెట్లు దక్కాయి. ఇక దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్ళో 326 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం 161 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 149 పరుగులకే ఆలౌట్ కావడంతో ఇన్నింగ్స్ తేడాతో సౌతాఫ్రికా భారీ విజయాన్ని మూటగట్టుకుంది. #ENGvSA#StuartBroad became only the fourth bowler to take 100 Test wickets at a single venue after Muttiah Muralitharan, Rangana Herath, and James Anderson. READ: https://t.co/SKde9eqsWT 🎥: (@englandcricket)pic.twitter.com/dJP0YwWXbJ — Express Sports (@IExpressSports) August 19, 2022 చదవండి: ఇంగ్లండ్ బౌలర్ అరుదైన ఫీట్.. టెస్టు క్రికెట్లో నాలుగో బౌలర్‌గా SA Vs ENG: ఇంగ్లండ్ జట్టుకు ఘోర పరాభవం.. 19 ఏళ్ల తర్వాత తొలి సారిగా! రీఎంట్రీ ఇవ్వనున్న ఆసీస్ వివాదాస్పద క్రికెటర్ -
అద్భుత విన్యాసం.. వికెట్లే కాదు క్యాచ్‌లు కూడా బాగా పట్టగలడు
ఇంగ్లండ్ సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అద్భుత విన్యాసంతో మెరిశాడు. సౌతాఫ్రికాతో తొలి టెస్టులో బ్రాడ్ ఈ విన్యాసం చేశాడు. విషయంలోకి వెళితే.. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో కగిసో రబడా ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. మాథ్యూ పాట్ బౌలింగ్‌లో రబడా మిడ్‌ఫీల్డ్ దిశగా బౌండరీ కొట్టే ప్రయత్నం చేశాడు. కానీ అక్కడుంది ఎవరు.. ఆరు అడుగులు ఆరు అంగుళాల స్టువర్ట్ బ్రాడ్. ఒక్కసారిగా గాల్లోకి ఎగిరిన బ్రాడ్ ఒకవైపుగా డైవ్‌చేస్తూ ఒంటిచేత్తో ఎవరు ఊహించని విధంగా స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. తన మెరుపు విన్యాసంతో జట్టు ఆటగాళ్లతో పాటు ప్రత్యర్థి జట్టును కూడా నోరెళ్లబెట్టేలా చేశాడు. బ్రాడ్ విన్యాసం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇదే టెస్టులో బ్రాడ్.. ప్రొటిస్ బ్యాటర్ వెరిన్నేను ఔట్ చేయడం ద్వారా లార్డ్స్ వేదికలో 100వ వికెట్ సాధించాడు. తద్వారా టెస్టుల్లో ఒకే వేదికపై వంద వికెట్లు సాధించిన ఇంగ్లండ్ రెండో బౌలర్‌గా.. ఓవరాల్‌గా నాలుగో బౌలర్‌గా ఘనత సాధించాడు. బ్రాడ్ ఇంత మంచి ఫీట్ అందుకున్నా ఇంగ్లండ్ మాత్రం తొలి టెస్టులో ఘోర పరాజయం పాలైంది. ఏకంగా ఇన్నింగ్స్ 12 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 తేడాతో దక్షిణాఫ్రికా ఆధిక్యంలో నిలిచింది. ఓవర్‌నైట్ స్కోర్ 289/7తో మూడో రోజు ఆటను ప్రారంభించిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులకు ఆలౌటైంది.దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ప్రోటీస్‌కు 161 పరుగల లీడ్ లభించింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో సారెల్ ఎర్వీ (73) అర్ధ సెంచరీ చేయగా, ఎల్గర్ (47), కేశవ్ మహరాజ్ (41) పరుగులతో రాణించారు. అనంతరం 161 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 149 పరుగులకే ఆలౌట్ అయి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. Oh Broady! 😱 Live clips: https://t.co/2nFwGblL1E 🏴 #ENGvSA 🇿🇦 | @StuartBroad8 pic.twitter.com/SCkwjfD7g5 — England Cricket (@englandcricket) August 19, 2022 చదవండి: Asia Cup 2022: కెప్టెన్‌గా షనక.. ఆసియాకప్‌కు జట్టును ప్రకటించిన శ్రీలంక ఇంగ్లండ్ జట్టుకు ఘోర పరాభవం.. 19 ఏళ్ల తర్వాత తొలి సారిగా! -
ఇంగ్లండ్ జట్టుకు ఘోర పరాభవం.. 19 ఏళ్ల తర్వాత తొలి సారిగా!
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 12 పరుగుల తేడాతో ప్రోటీస్ జయభేరి మోగించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 తేడాతో దక్షిణాఫ్రికా ఆధిక్యంలో నిలిచింది. ఓవర్‌నైట్ స్కోర్ 289/7తో మూడో రోజు ఆటను ప్రారంభించిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ప్రోటీస్‌కు 161 పరుగల లీడ్ లభించింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో సారెల్ ఎర్వీ (73) అర్ధ సెంచరీ చేయగా, ఎల్గర్ (47), కేశవ్ మహరాజ్ (41) పరుగులతో రాణించారు. అనంతరం 161 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 149 పరుగులకే ఆలౌట్ అయి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఇక అంతకుముందు రబడా ఐదు వికెట్లతో చేలరేగడంతో ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 165 పరుగులకే కుప్పకూలింది. కాగా లార్డ్స్‌లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోవడం 19 ఏళ్ల తర్వాత ఇదే తొలి సారి . అంతకుముందు 2003లో కూడా దక్షిణాఫ్రికాపై ఇన్నింగ్స్ 92 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. 🚨 RESULT | SOUTH AFRICA WIN BY AN INNINGS AND 12 RUNS An exceptional performance from start to finish by the entire team‼️ The bowlers sealing the victory by skittling England for 149 in the second innings to take a 1-0 lead in the 3-match series 👌#ENGvSA #BePartOfIt pic.twitter.com/WJd1eJ8P86 — Cricket South Africa (@OfficialCSA) August 19, 2022 చదవండి:ENG-W vs IND-W: ఇంగ్లండ్ కెప్టెన్‌కు సర్జరీ.. భారత్‌తో సిరీస్‌కు దూరం! -
పాపం ప్రోటీస్ కెప్టెన్.. దురదృష్టం వెంటాడితే ఇలాగే ఉంటుంది!
లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా పట్టు బిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులకు ఆలౌటైన ప్రోటిస్.. 161 పరుగుల లీడ్ సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లండ్ 93 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అంతకుముందు దక్షిణాఫ్రికా బౌలర్లు చేలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 165 పరుగులకే కుప్పకూలింది. ఇక ఇది ఇలా ఉండగా.. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ దురదృష్టకర రీతిలో ఔటయ్యాడు. 47 పరుగులతో నిలకడగా ఆడుతున్న ఎల్గర్‌ను లైన్ లంగ్త్ బాల్‌తో జేమ్స్ అండర్సన్ బోల్తా కొట్టించాడు. ప్రోటిస్ ఇన్నింగ్స్ 23 ఓవర్లో జేమ్స్ అండర్సన్ వేసిన బంతిని ఎల్గర్ లెగ్ సైడ్ డిఫెన్స్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే బంతి నేరుగా తన థై ప్యాడ్‌కు తగిలి వికెట్ల వైపు దూసుకెళ్లింది. ఎల్గర్ బంతిని ఆపే ప్రయ్నతం చేసినా అప్పటికే అది వికెట్లను గీరాటేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు దురదృష్టమంటే ఎల్గర్దే అంటూ కామెంట్లు చేస్తున్నారు. A much-needed wicket! 💪 Live clips: https://t.co/2nFwGblL1E 🏴 #ENGvSA 🇿🇦 | #RedforRuth pic.twitter.com/Y4LqxanBX1 — England Cricket (@englandcricket) August 18, 2022 చదవండి: Asia Cup 2022 Ind Vs Pak: ‘భారత్‌తో మ్యాచ్‌లో కచ్చితంగా పాకిస్తాన్‌దే విజయం! ఎందుకంటే.. మాకు’! -
ఇంగ్లండ్ బౌలర్ అరుదైన ఫీట్.. టెస్టు క్రికెట్లో నాలుగో బౌలర్‌గా
ఇంగ్లండ్ సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ లార్డ్స్ వేదికగా అరుదైన ఫీట్ సాధించాడు. సౌతాఫ్రికాతో తొలి టెస్టులో కైల్ వెరిన్నేను ఔట్ చేయడం ద్వారా లార్డ్స్‌లో 100వ వికెట్ అందుకున్నాడు. ఈ నేపథ్యంలో లార్డ్స్ వేదికలో వంద వికెట్ల మైలురాయిని అందుకున్న రెండో ఇంగ్లండ్ బౌలర్‌గా బ్రాడ్ నిలచాడు. ఇంతకముందు ఇంగ్లండ్ స్టార్ జేమ్స్ అండర్సన్(117 వికెట్లు) ఈ ఘనత అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఒకే వేదిక(క్రికెట్ గ్రౌండ్లో)పై 100 వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా స్టువర్ట్ బ్రాడ్ నిలిచాడు. ఈ జాబితాలో ముత్తయ్య మురళీధరన్ ఏకంగా మూడు వేదికల్లో మూడుసార్లు వంద వికెట్ల మార్క్‌ను అందుకొని తొలి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత జేమ్స్ అండర్సర్, రంగనా హెరాత్‌లు ఉన్నారు. తాజాగా వీరి సరసన స్టువర్ట్ బ్రాడ్ చేరాడు. టెస్టుల్లో ఒకే వేదికలో 100 వికెట్లు తీసిన బౌలర్లు: ►ముత్తయ్య మురళీధరన్-( సింహాళి స్పోర్ట్స్‌క్లబ్, కొలంబో.. 166 వికెట్లు, అసిగిరియా స్టేడియం, కాండీ.. 117 వికెట్లు, గాలే స్టేడియం..111 వికెట్లు) ►జేమ్స్ అండర్సన్(లార్డ్స్ స్టేడియం.. 117 వికెట్లు) ►రంగనా హెరాత్(గాలె స్టేడియం.. 102 వికెట్లు) ►స్టువర్ట్ బ్రాడ్ (లార్డ్స్ స్టేడియం.. 102 వికెట్లు) ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికాకు భారీ ఆధిక్యం లభించింది. మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి సఫారీ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. దాంతో దక్షిణాఫ్రికా ప్రస్తుతం 124 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. సారెల్ ఎర్వీ (73) అర్ధ సెంచరీ చేయగా, ఎల్గర్ (47), కేశవ్ మహరాజ్ (41), మార్కో జాన్సెన్ (41 బ్యాటింగ్) రాణించారు. బెన్ స్టోక్స్‌కు 3 వికెట్లు దక్కాయి. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 116/6తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 165 పరుగులకు ఆలౌటైంది. ఒలీ పోప్ (73) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పేస్ బౌలర్ రబడాకు 5 వికెట్లు దక్కగా, నోర్జే 3 వికెట్లు తీశాడు. #ENGvSA#StuartBroad became only the fourth bowler to take 100 Test wickets at a single venue after Muttiah Muralitharan, Rangana Herath, and James Anderson. READ: https://t.co/SKde9eqsWT 🎥: (@englandcricket)pic.twitter.com/dJP0YwWXbJ — Express Sports (@IExpressSports) August 19, 2022 🚨 Milestone Alert 🚨 Stuart Broad completed 1️⃣0️⃣0️⃣ Test wickets at Lord's 🤯🏴 A special achievement by a special bowler 🙌#stuartbroad #England #ENGvSA #CricketTwitter pic.twitter.com/J4ZyuP2igG — Sportskeeda (@Sportskeeda) August 19, 2022 చదవండి: అభిమానం పరాకాష్టకు.. చెమట వాసనను ఆస్వాదించిన వేళ SA Vs ENG: రబడా పాంచ్ పటాకా.. భారీ ఆధిక్యం దిశగా సౌతాఫ్రికా -
SA Vs ENG: రబడా పాంచ్ పటాకా..
లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికాకు భారీ ఆధిక్యం లభించింది. మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి సఫారీ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. దాంతో దక్షిణాఫ్రికా ప్రస్తుతం 124 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. సారెల్ ఎర్వీ (73) అర్ధ సెంచరీ చేయగా, ఎల్గర్ (47), కేశవ్ మహరాజ్ (41), మార్కో జాన్సెన్ (41 బ్యాటింగ్) రాణించారు. బెన్ స్టోక్స్‌కు 3 వికెట్లు దక్కాయి. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 116/6తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 165 పరుగులకు ఆలౌటైంది. ఒలీ పోప్ (73) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పేస్ బౌలర్ రబడాకు 5 వికెట్లు దక్కగా, నోర్జే 3 వికెట్లు తీశాడు. -
నిప్పులు చెరిగిన సఫారీ పేసర్లు.. పేక మేడలా కూలిన ఇంగ్లీష్ బ్యాటర్లు
లండన్: దక్షిణాఫ్రికాతో బుధవారం (ఆగస్ట్ 17) మొదలైన తొలి టెస్టులో ఇంగ్లండ్ జట్టు తడబడింది. లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో తొలి రోజు 32 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 116 పరుగులు సాధించింది. ఒలీ పోప్ (61; 4 ఫోర్లు) అజేయ అర్ధ సెంచరీతో రాణించి ఇంగ్లండ్ పాలిట ఆపద్భాందవుడయ్యాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో పోప్‌తో పాటు కెప్టెన్ స్టోక్స్ (20) మాత్రమే రెండంకెల స్కోర్ చేశాడు. ఆట ముగిసే సమయానికి పోప్‌కు జతగా బ్రాడ్ (0) క్రీజ్‌లో ఉన్నాడు. నిప్పులు చెరిగిన పేసర్లు.. పిచ్ పేసర్లకు అనుకూలిస్తుందని అంచనా వేసిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్.. టాస్ గెలిచాక ఏమాత్రం సంకోచించకుండా తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. సఫారీ పేసర్లు కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ.. ఆట ఆరంభం నుంచే చెలరేగిపోయారు. 3వ ఓవర్లోనే ఓపెనర్ అలెక్స్ లీస్ (5)ను, ఆ తర్వాత 9వ ఓవర్లో మరో ఓపెనర్ జాక్ క్రాలే (9) రబాడ పెవిలియన్‌కు పంపాడు. ఆతర్వాత మరింత రెచ్చిపోయిన పేసర్లు నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లీష్ బ్యాటర్లపై విరుచుకుపడ్డారు. జో రూట్ (8)ను మార్కో జన్సెన్.. బెయిర్‌స్టో (0), బెన్ ఫోక్స్ (6), స్టోక్స్ (20)లను నోర్జే అద్భుతమైన బంతులతో పెవిలియన్‌కు సాగనంపారు. ముఖ్యంగా భీకరమైన ఫామ్‌లో ఉన్న బెయిర్‌స్టోను నోర్జే క్లీన్ బౌల్డ్ చేసిన వైనం తొలి రోజు మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. Anrich Arno Nortje -
కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు.. మరోసారి నిరూపితం
కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఒక దశలో అనుకూలంగా కనిపించేదంతా రివర్స్ అయిపోతుంటుంది. తాజాగా ఇంగ్లండ్ విధ్వంసకర ఆటగాడు జానీ బెయిర్ స్టో విషయంలో ఇదే జరిగింది. ఈ మధ్యకాలంలో బెయిర్ స్టో టెస్టులను కూడా టి20 స్టైల్లో ఆడుతున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్, భారత్‌లతో జరిగిన టెస్టు సిరీస్‌ల్లో ఇదే దూకుడు కనబరిచిన బెయిర్ స్టో మ్యాచ్ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ముఖ్యంగా లక్ష్య ఛేదనలో చెలరేగిపోతున్న బెయిర్ స్టో సెంచరీలతో కథం తొక్కాడు. అయితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు అని మరోసారి నిరూపితం అయింది. తాజాగా లార్డ్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో బెయిర్ స్టో డకౌట్‌గా వెనుదిరిగాడు. ప్రొటిస్ పేసర్ అన్రిచ్ నోర్ట్జే వేసిన బంతి బెయిర్ స్టోను క్లీన్‌బౌల్డ్ చేసింది. గుడ్‌లెంగ్త్‌తో వచ్చిన బంతి మిడిల్ స్టంప్‌ను గిరాటేయగా.. వికెట్ మొత్తం బయటటికి వచ్చింది. నోర్ట్జే ఎంత వేగంతో బంతిని వేశాడనేది దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. కాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక సౌతాఫ్రికాతో తొలి టెస్టును ఇంగ్లండ్ ఫేలవంగా ఆరంభించింది. తొలి సెషన్లోనే ఐదు కీలక వికెట్లు కోల్పోయింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా అందుకు తగ్గ ఫలితం సాధించింది. పేసర్లు నోర్ట్జే, రబాడలు పిచ్‌పై ఉన్న తేమను సద్వినియోగం చేసుకొని వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ ఇంగ్లండ్‌ను ముప్పతిప్పలు పెట్టారు. వర్షం అంతరాయంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి ఇంగ్లండ్ 6 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. ఓలీ పోప్(61 బ్యాటింగ్).. ఒక్కడే ప్రొటిస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా స్టువర్ట్ బ్రాడ్(0) క్రీజులో ఉన్నాడు. Anrich Arno Nortje -
టాప్ స్కోరర్‌గా నిలిచి.. అంత గుడ్డిగా ఎలా ఔటయ్యాడు!
దక్షిణాఫ్రికా జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. ఇప్పటికే వన్డే, టి20 సిరీస్‌లు ముగియగా.. ఆగస్టు 17 నుంచి మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆరంభం కానుంది. కాగా టెస్టు సిరీస్‌కు ముందు సౌతాఫ్రికా ఇంగ్లండ్ లయన్స్‌తో నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక బ్యాటింగ్‌లో ప్రొటిస్‌కు మంచి ప్రాక్టీస్ లభించింది. సౌతాప్రికా తొలి ఇన్నింగ్స్‌లో 433 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా తరపున కాయా జోండో 86 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. వాండర్డుసెన్ 75, వెరిన్నె 62, మార్కో జాన్సెన్(54 నాటౌట్), సరెల్ ఎర్వీ 42 పరుగులు చేశారు. అయితే ప్రొటిస్ తరపున టాప్ స్కోరర్‌గా నిలిచిన కాయా జోండో ఔటైన విధానం మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతసేపు నిలకడగా ఆడిన కాయా.. బంతి అంచనా వేయడంలో పొరబడి గుడ్డిగా ఔటవ్వడం ఆశ్చర్యపరిచింది. ఇంగ్లండ్ లయన్స్ పేసర్ సామ్ కుక్ ఆఫ్‌స్టంప్ ఔట్‌సైడ్ దిశగా బంతిని వేయగా.. జోండో బంతిని వదిలేద్దామనుకున్నాడు. కానీ బంతి అనూహ్యంగా ఆఫ్‌స్టంప్ లైన్ మీదుగా వెళ్లి వికెట్లను గిరాటేసింది. దీంతో కాయాకు కాసేపటి వరకు ఏం జరిగిందో అర్థం కాలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను సౌతాఫ్రికా 1-1తో సమం చేసింది. ఆ తర్వాత జరిగిన టి20 సిరీస్‌ను మాత్రం 2-1తో దక్షిణాఫ్రికా సొంతం చేసుకుంది. ఇక మూడు టెస్టుల సిరీస్ ఇంగ్లండ్‌కు కీలకం కానుంది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో ప్రస్తుతం సౌతాఫ్రికా టాప్‌లో కొనసాగుతుండగా.. ఇంగ్లండ్ మాత్రం ఏడో స్థానంలో ఉంది. Little Chef with the early breakthrough 💪 Lions live stream ➡️ https://t.co/nvDuR1FMzE pic.twitter.com/w0c8bxLYpH — England Cricket (@englandcricket) August 10, 2022 చదవండి: Rishabh Pant-Uravasi Rautela: బాలీవుడ్ హీరోయిన్‌కు పంత్ దిమ్మతిరిగే కౌంటర్ CWG 2022: కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొన్న ఇద్దరు పాకిస్థానీ బాక్సర్ల అదృశ్యం -
దేశం కోసం ఆడేందుకు కీలక లీగ్ నుంచి తప్పుకున్న బెయిర్‌స్టో
డబ్బులొచ్చే టోర్నీల కన్నా దేశం కోసం ఆడటమే ముఖ్యమని నిరూపించాడు ఇంగ్లండ్ విధ్వంసకర వీరుడు జానీ బెయిర్‌స్టో. ఇటీవలి కాలంలో ఫార్మాట్లకతీతంగా చెలరేగిపోతున్న బెయిర్‌స్టో.. త్వరలో దక్షిణాఫ్రికాతో జరుగబోయే టెస్ట్ సిరీస్ కోసం స్వదేశంలో జరిగే 'హండ్రెడ్ లీగ్'లో ఆడే అవకాశాన్ని వదులుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో బిజీ షెడ్యూల్ కారణంగా అలసిపోయానని, మున్ముందు కూడా చాలా హెవీ షెడ్యూల్ ఉన్నందున రెస్ట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నానని, అందుకే హండ్రెడ్ లీగ్‌కి దూరంగా ఉండాలని అనుకుంటున్నానని బెయిర్‌స్టో వెల్లడించాడు. బెయిర్‌స్టో.. ఇవాల్టి (ఆగస్ట్ 3) నుంచి ప్రారంభం కానున్న హండ్రెడ్ లీగ్ రెండో ఎడిషన్‌లో కార్డిఫ్ ఫ్రాంచైజీ అయిన వెల్ష్ ఫైర్‌కు ఆడాల్సి ఉండింది. వెల్ష్ ఫైర్ ఇవాల్టి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సౌత్ బ్రేవ్‌ను ఢీకొట్టాల్సి ఉంది. హండ్రెడ్ లీగ్‌లో మొత్తం ఎనిమిది జట్లు (ట్రెంట్ రాకెట్స్, నార్తర్న్ సూపర్‌చార్జర్స్, బర్మింగ్‌హామ్ ఫీనిక్స్, సౌత్ బ్రేవ్, వెల్ష్ ఫైర్, ఓవల్ ఇన్విన్సిబుల్స్, మాంచెస్టర్ ఒరిజినల్, లండన్ స్పిరిట్) ఒకదానితో ఒకటి తలపడతాయి. ఒక్కో ఇన్నింగ్స్‌లో 100 బాల్స్ చొప్పున సాగే ఈ టోర్నీ.. టీ20 తరహాలో ప్రజాధరణ పొందలేకపోయింది. ఇదిలా ఉంటే, ఆగస్ట్ 17 నుంచి దక్షిణాఫ్రికాతో జరుగనున్న మూడు టెస్ట్‌ల సిరీస్ కోసం (తొలి రెండు టెస్ట్‌లకు) ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నిన్న (ఆగస్ట్ 2) జట్టును ప్రకటించింది. 14 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో బెయిర్‌స్టో సహా బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలీ, బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), జాక్ లీచ్, అలెక్స్ లీస్, క్రెయిగ్ ఓవర్టన్, మాథ్యూ పాట్స్, ఆలీ పోప్, ఆలీ రాబిన్సన్, జో రూట్ ఉన్నారు. చదవండి: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్.. జట్టును ప్రకటించిన ఇంగ్లండ్! -
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్.. జట్టును ప్రకటించిన ఇంగ్లండ్!
దక్షిణాఫ్రికాతో తొలి రెండు టెస్టులకు 14 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. ఇక గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న పేసర్ ఓలీ రాబిన్సన్ను ఈ సిరీస్‌కు ఇంగ్లండ్ సెలక్టర్లు ఎంపిక చేశారు. రాబిన్సన్ చివరగా ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాపై ఆడాడు. అదే విధంగా కొవిడ్ కారణంగా న్యూజిలాండ్‌తో అఖరి రెండు టెస్టులకు దూరమైన వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ కూడా ఈ సిరీస్‌తో తిరిగి జట్టులోకి రానున్నాడు. దీంతో వికెట్ కీపర్ సామ్ బిల్లింగ్స్ వేటు పడింది. ఇక ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్‌లో ఘోర పరాభావం, విండీస్ పర్యటనలో ఓటమి చవిచూసిన తర్వాత ఇంగ్లండ్ టెస్టుల్లో అద్భుతంగా రాణిస్తోంది. నూతన కెప్టెన్ బెన్ స్టోక్స్, కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ నేతృత్వంలో ఇంగ్లండ్ జట్టు విజయాలతో దూసుకుపోతుంది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన ఇంగ్లండ్.. భారత్‌తో జరిగిన ఏకైక టెస్టులోను తమ జోరును కొనసాగించింది. ఇక స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఇంగ్లండ్ మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. ఇరు జట్లు మధ్య లార్డ్స్ వేదికగా ఆగస్టు17 జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికాతో టెస్టులకు ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమ్స్ ఆండర్సన్, జానీ బెయిర్‌స్టో, స్టువర్ట్ బ్రాడ్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలీ, బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), జాక్ లీచ్, అలెక్స్ లీస్, క్రెయిగ్ ఓవర్టన్, మాథ్యూ పాట్స్, ఆలీ పోప్, ఆలీ రాబిన్సన్, జో రూట్. చదవండి: Rohit Sharma Retired-Hurt: రోహిత్ శర్మ రిటైర్డ్ హర్ట్.. బీసీసీఐ కీలక అప్డేట్.. ఆసియా కప్‌కు దూరమయ్యే చాన్స్ -
Eng VS SA: ఒంటిచేత్తో అవలీలగా! ఇలాంటి క్యాచ్ ఎప్పుడూ చూసి ఉండరు!
England vs South Africa, 3rd T20I: ఇంగ్లండ్‌తో మూడో టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా యువ ఆటగాడు ట్రిస్టన్ స్టబ్స్ అద్భుత క్యాచ్‌తో మెరిశాడు. కళ్లు చెదిరే రీతిలో ఒంటిచేత్తో బంతిని ఒడిసి పట్టి ప్రత్యర్థి బ్యాటర్ ఆట కట్టించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా దక్షిణాఫ్రికా ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఇరు జట్ల మధ్య ఆదివారం ఆఖరి టీ20 జరిగింది. సౌతాంప్టన్ వేదికగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్ హెండ్రిక్స్(70 పరుగులు)కు తోడు మార్కరమ్ అజేయ అర్ధ శతకంతో రాణించడంతో ప్రొటిస్ భారీ స్కోరు చేయగలిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన బట్లర్ బృందానికి దక్షిణాఫ్రికా బౌలర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా తబ్రేజ్ షంసీ 5 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనం శాసించాడు. దీంతో 16.4 ఓవర్లకే ఇంగ్లండ్ కథ ముగిసిపోయింది. 90 పరుగుల తేడాతో మూడో టీ20లో గెలిచి.. దణాఫ్రికా సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో జానీ బెయిర్‌స్టో 27 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ప్రొటిస్ బౌలర్ షంసీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. హైలెట్ క్యాచ్.. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ టాపార్డర్ కుప్పకూలిన వేళ.. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు మొయిన్ అలీ. అతడైనా జట్టును ఆదుకుంటాడని భావిస్తే.. పదో ఓవర్లోనే అవుటయ్యాడు. మార్కరమ్ బౌలింగ్‌లో బంతిని అలీ గాల్లోకి లేపగానే.. స్టబ్స్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా దూసుకువచ్చాడు. గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో బంతిని ఒడిసిపట్టాడు. అసాధ్యమనుకున్న క్యాచ్‌ను విజయవంతంగా అందుకుని ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. సంచలన క్యాచ్‌తో మ్యాచ్‌లో హైలెట్‌గా నిలిచాడు. One of the best catches you'll ever see 👏 Scorecard/clips: https://t.co/kgIS4BWSbC 🏴 #ENGvSA 🇿🇦 pic.twitter.com/FBlAOf3HUM — England Cricket (@englandcricket) July 31, 2022 ఇందుకు సంబంధించిన వీడియోను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇలాంటి అత్యుత్తమ క్యాచ్ ఎప్పుడూ చూసి ఉండరు అని పేర్కొంది. ఇందుకు.. నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. సూపర్మాన్ అంటూ స్టబ్స్‌ను కొనియాడుతున్నారు. కాగా.. ఈ మ్యాచ్‌లో బ్యాటర్‌గా మాత్రం స్టబ్స్ విఫలమయ్యాడు. 4 బంతుల్లో 8 పరుగులు చేసి అవుటయ్యాడు. అయితే, మొదటి టీ20 మ్యాచ్‌లో మాత్రం అతడి అద్భుత ఇన్నింగ్స్‌ను ఎవరూ అంత తేలికగా మర్చిపోలేరు. ఈ మ్యాచ్‌లో స్టబ్స్ 28 బంతుల్లోనే రెండు ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 72 పరుగులు చేశాడు. కానీ జట్టును గెలిపించలేకపోయాడు. చదవండి: IND VS WI: రెండో టీ20కి ముందు రోహిత్‌ను ఊరిస్తున్న ప్రపంచ రికార్డు India Probable XI: అలా అయితే అయ్యర్‌పై వేటు తప్పదు! ఓపెనర్‌గా మళ్లీ అతడే!? -
బట్లర్ సేనకు చుక్కలు చూపించిన షంషి.. మరో సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్
టెస్ట్‌ల్లో వరుస విజయాలతో అదరగొడుతున్న ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ పరిమిత ఓవర్ల ఫార్మాట్లో మాత్రం దారుణంగా విఫలమవుతుంది. జోస్ బట్లర్ కెప్టెన్సీ చేపట్టాక ఆ జట్టు పరిస్థితి మరింత దిగజారింది. ఇటీవల టీమిండియా చేతిలో వన్డే, టీ20 సిరీస్ కోల్పోయిన ఇంగ్లీష్ జట్లు.. తాజాగా దక్షిణాఫ్రికా చేతిలో టీ20 సిరీస్‌లో కూడా ఓటమిపాలైంది. 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి టీ20 గెలిచిన బట్లర్ టీమ్.. ఆతర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై 2-1తేడాతో సిరీస్‌ను చేజార్చుకుంది. ఆదివారం (జులై 31) జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20ల్లో సఫారీ జట్టు 90 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. సఫారీ స్పిన్నర్ తబ్రేజ్ షంషి (5/24) తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్ ఆటగాళ్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. టాస్ ఓడినప్పటికీ ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ టీమ్.. నిర్ణీత ఓవర్లలో 191 పరుగుల భారీ స్కోర్ చేసింది. రీజా హెండ్రిక్స్ (50 బంతుల్లో 70; 9 ఫోర్లు), ఎయిడెన్ మార్క్రమ్ (36 బంతుల్లో 51 నాటౌట్; 5 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించగా.. రొస్సో (18 బంతుల్లో 31; 6 ఫోర్లు), కెప్టెన్ మిల్లర్ (9 బంతుల్లో 22; 3 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టు భారీ స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించారు. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లే (3/25) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేదనలో ఇంగ్లండ్ జట్టుకు షంషి చుక్కలు చూపించాడు. ఫలితంగా ఆ జట్టు 16.4 ఓవర్లలో 101 పరుగులకే చాపచుట్టేసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జేసన్ రాయ్ (17), జోస్ బట్లర్ (14), జానీ బెయిర్‌స్టో (27), క్రిస్ జోర్డాన్ (14) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. ఆ జట్టులో అరివీర భయంకర హిట్టర్లు ఉన్నా షంషి మాయాజాలం ముందు అంతా తేలిపోయారు. షంషికి మరో ఎండ్‌లో కేశవ్ మహారాజ్ (2/21), ఫెలుక్వాయో (1/23), మార్క్రమ్ (1/5) సహకరించడంతో సఫారీ టీమ్ వారి స్వదేశంలోనే ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. కాగా, ఈ సిరీస్‌కు ముందు జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ 1-1తో డ్రా ముగిసిన విషయం తెలిసిందే. వర్షం కారణంగా నిర్ణయాత్మక మూడో మ్యాచ్ రద్దు కావడంతో ఫలితం ఎటు తేలకుండా నిలిచిపోయింది. ఈ పర్యటనలో తదుపరి 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభంకానుంది. ఆగస్ట్ 17, 25, సెప్టెంబర్ 8 తేదీల్లో మూడు టెస్ట్‌లు ప్రారంభమవుతాయి. చదవండి: ఐదేసిన మొసద్దెక్.. జింబాబ్వేపై ప్రతీకారం తీర్చుకున్న బంగ్లా -
ఆరేళ్ల తర్వాత జట్టులోకి.. కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్; ఇంగ్లండ్‌పై ప్రతీకారం
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టి20లో ఓటమికి దక్షిణాఫ్రికా ప్రతీకారం తీర్చుకుంది. కార్డిఫ్ వేదికగా గురువారం రాత్రి జరిగిన రెండో టి20లో ప్రొటిస్ 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సౌతాఫ్రికా బ్యాటర్ రిలీ రొసోవ్(55 బంతుల్లో 96 నాటౌట్, 10 ఫోర్లు, 5 సిక్సర్లు) కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అతనికి రీజా హెండ్రిక్స్(32 బంతుల్లో 53 పరుగులు, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌తో సహకరించాడు. కాగా రిలీ రోసోవ్ ఆరేళ్ల తర్వాత మళ్లీ సౌతాఫ్రికా తరపున బరిలోకి దిగాడు. 2016లో ఆఖరుసారి దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించిన రొసోవ్ 36 వన్డేల్లో 1239 పరుగులు, 17 టి20ల్లో 427 పరుగులు చేశాడు. వీరిద్దరి దాటికి ఇంగ్లండ్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకోగా.. దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 16.4 ఓవర్లలో 149 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జానీ బెయిర్ స్టో 30 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. జాస్ బట్లర్ 29 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఫెక్యుల్వాయో, తబ్రెయిజ్ షంసీలు చెరో మూడు వికెట్లు తీయగా.. ఎంగిడి 2, రబాడ, కేశవ్ మహరాజ్ తలా ఒక వికెట్ తీశారు. కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న రొసోవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ విజయంతో సౌతాఫ్రికా సిరీస్‌ను 1-1తో సమం చేసింది. సిరీస్‌లో చివరిదైన మూడో టి20 జూలై 31(ఆదివారం) జరగనుంది. చదవండి: Chess Olympiad: భారత్‌పై విషం చిమ్మిన పాకిస్తాన్.. Gustav McKeon: 18 ఏళ్ల వయసులో అదిరిపోయే రికార్డులు.. ఎవరీ క్రికెటర్? -
ఇంగ్లండ్‌కు చుక్కలు చూపించిన దక్షిణాఫ్రికా యువ ఆటగాడు.. ఫుల్ జోష్‌లో ముంబై!
బుధవారం బ్రిస్టల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరగిన తొలి టీ20లో దక్షిణాఫ్రికా 41 పరుగుల తేడాతో ఓటమి చెందింది. అయితే ప్రోటిస్ పరాజయం పాలైన ప్పటికీ ఆ జట్టు యువ ఆల్ రౌండర్ ట్రిస్టన్ స్టబ్స్ మాత్రం ఇంగ్లండ్‌కు వణుకు పుట్టించాడు. 21 ఏళ్ల స్టబ్స్ కేవలం 28 బంతుల్లోనే 72 పరుగులు సాధించి ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు, 8 సిక్స్‌లు ఉన్నాయి. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా తరపున ఇంగ్లండ్‌పై అర్ధశతకం సాధించిన అతి పిన్న వయస్కుడిగా స్టబ్స్ నిలిచాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. బెయిర్ స్టో(90), మొయిన్ అలీ(52) పరుగులతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 234 పరుగులు చేసింది. అనంతరం 235 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రోటిస్ 86 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన స్టబ్స్ ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోశాడు. స్టుబ్స్ చెలరగేడంతో ఇంగ్లండ్ ఒక దశలో ఓడిపోయేలా కనిపించింది. అయితే గ్లెసిన్ బౌలింగ్ స్టబ్స్ ఔట్ కావండంతో విజయం ఇంగ్లండ్ సొంతమైంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు స్టబ్స్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ ఏడాది సీజన్ మధ్యలో గాయపడిన టైమల్ మిల్స్ స్థానంలో స్టబ్స్‌ను ముంబై భర్తీ చేసుకుంది. కాగా ఒకటెండ్రు మ్యాచ్‌ల్లో అవకాశం లభించినా స్టబ్స్ ఉపయోగించుకోలేకపోయాడు. అయితే వచ్చే ఏడాది సీజన్లో మాత్రం స్టబ్స్ దుమ్ము రేపుతాడని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. స్టబ్స్ తుపాన్ ఇన్నింగ్స్‌తో ముంబై ఫుల్ జోష్‌లో ఉంటుందని మరి కొంత మంది అభిప్రాయపడుతున్నారు. చదవండి: ENG vs SA: టీ20ల్లో మొయిన్ అలీ అరుదైన రికార్డు.. ఇంగ్లండ్ తొలి ఆటగాడిగా! Stubbs-Brevis-David 🔥🔥🔥 Future of MI Verma agar 2 overs daalega aur David bhi waise hi karega toh inn 3 logon ko le sakte hai. Warna Daniel Sams toh hai hi https://t.co/3R2ARqz1gf — Vinesh Prabhu (@vlp1994) July 28, 2022 -
టీ20ల్లో మొయిన్ అలీ అరుదైన రికార్డు.. ఇంగ్లండ్ తొలి ఆటగాడిగా!
బుధవారం బ్రిస్టల్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 16 బంతుల్లోనే 2 ఫోర్లు, 6 సిక్సర్లతో అలీ హాఫ్ సెంచరీ సాధించాడు. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ సాధించిన ఇంగ్లండ్ ఆటగాడిగా అలీ రికార్డులకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్‌పై 17 బంతుల్లో అర్థసెంచరీ సాధించిన లియామ్ లివింగ్‌స్టోన్ పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్ రికార్డును అలీ బద్దలు కొట్టాడు. ఇక ఈ ఘనత సాధించిన జాబితాలో మూడో స్ధానంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఉన్నాడు. అతడు న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాపై 21 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సౌతాఫ్రికాపై ఇంగ్లండ్ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జానీ బెయిర్ ప్టో(90) పరుగులతో చేలరేగగా.. మొయిన్ అలీ(52) పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇక 235 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 193 పరుగులకే పరిమితమైంది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ట్రిస్టన్ స్టాబ్స్( 28 బంతుల్లో 72 పరుగులు), రీజా హెండ్రిక్స్(57) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో రిచర్డ్ గ్లెసన్ 3, రీస్ టోప్లీ, ఆదిల్ రషీద్ రెండు వికెట్లు తీయగా.. మొయిన్ అలీ ఒక వికెట్ పడగొట్టాడు. చదవండి: Shikhar Dhawan: ప్రపంచకప్ జట్టులో ధావన్ ఉండాలి! అవసరం లేదు! -
మెయిన్ అలీ, బెయిర్ స్టోల విధ్వంసం.. తొలి టి20లో ఇంగ్లండ్ ఘన విజయం
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టి20లో ఇంగ్లండ్ శుభారంభం చేసింది. బుధవారం బ్రిస్టల్ వేదికగా జరిగిన తొలి టి20లో ఇంగ్లండ్ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోరు చేసింది. జానీ బెయిర్ స్టో 53 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సర్లతో 90 పరుగులు విధ్వంసం సృష్టించగా.. మెయిన్ అలీ 18 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 52 పరుగులతో ప్రొటీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. అంతకముందు డేవిడ్ మలాన్ కూడా 23 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేయగలిగింది. ట్రిస్టన్ స్టబ్స్ 28 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్సర్లతో 72 పరుగులు, రీజా హెండ్రిక్స్ 33 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 57 పరుగులు చేసినప్పటికి మిగతావారు రాణించడంలో విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో రిచర్డ్ గ్లెసన్ 3, రీస్ టోప్లీ, ఆదిల్ రషీద్ రెండు వికెట్లు తీయగా.. మొయిన్ అలీ ఒక వికెట్ తీశాడు. బ్యాటింగ్‌లో హాఫ్ సెంచరీ.. బౌలింగ్‌లో ఒక వికెట్ తీసిన మొయిన్ అలీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇరుజట్ల మధ్య రెండో టి20 గురువారం(జూలై 28న) జరగనుంది. చదవండి: రోహిత్ శర్మ రికార్డు బద్దలు.. కివీస్ తరపున తొలి ఆటగాడిగా -
డికాక్ ఆశలపై నీళ్లు చల్లిన వరుణుడు..
ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మూడో వన్డే వర్షం కారణంగా రద్దు అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా 27.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. డికాక్ (76 బంతుల్లో 92 పరుగులు నాటౌట్, 13 ఫోర్లు) దూకుడుగా ఆడగా.. మార్క్రమ్ 24 పరుగులతో ఆడుతున్నారు. ఈ సమయంలో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. అయితే ఆ తర్వాత పలుమార్లు అంపైర్లు పరిశీలించారు. మ్యాచ్ 20 ఓవర్లకు కుదించి ఆడిద్దామనుకున్నా వర్షం తెరిపినివ్వకపోవడంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. అయితే మ్యాచ్‌లో దూకుడుగా ఆడిన దక్షిణాఫ్రికా బ్యాటర్ క్వింటన్ డికాక్ సెంచరీ దిశగా పయనించాడు. కేవలం 8 పరుగుల దూరంలో ఉండగా డికాక్ సెంచరీ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో ఇరుజట్లు చెరొక మ్యాచ్ గెలవడంతో సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా వాండర్ డుసెన్ ఎంపికయ్యాడు. చదవండి: Nathan Lyon Wedding: లేటు వయసులో ఘాటైన ప్రేమ.. గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లాడిన ఆసీస్ స్టార్ -
ఇంగ్లండ్ కెప్టెన్ అద్బుత విన్యాసం.. మార్క్రమ్ డైమండ్ డక్
సౌతాఫ్రికా, ఇంగ్లండ్ మధ్య శుక్రవారం జరిగిన రెండో వన్డేలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్ అద్బుత విన్యాసం అబ్బురపరిచింది. ఐడెన్ మార్ర్కమ్ను ఔట్ చేసే క్రమంలో బట్లర్ అమాంతం డైవ్ చేస్తూ త్రో వేసిన విధానం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 4వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. డేవిడ్ విల్లే వేసిన ఆ ఓవర్లో ఐదో బంతిని క్లాసెన్ డిఫెన్స్ ఆడాడు. అయితే క్విక్ సింగిల్ కోసం ప్రయత్నించిన మార్క్రమ్ అనవసరంగా పరిగెత్తాడు. అప్పటికే క్లాసెన్ వద్దని వారించినా మార్ర్కమ్ వినకుండా సగం క్రీజు దాటేశాడు. అప్పటికే చిరుత వేగంతో పరిగెత్తుకొచ్చిన జాస్ బట్లర్ అమాంతం డైవ్ చేస్తూ బంతిని వికెట్లకు విసిరాడు. అంతే సెకన్ల వ్యవధిలో బంతి వికెట్లను గిరాటేయడంతో మార్క్రమ్ రనౌట్ అయ్యాడు. కాగా ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే మార్ర్కమ్ డైమండ్ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఇంగ్లండ్ 118 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా 29 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు 28.1 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌటైంది. జట్టులో ఏ ఒక్క ఆటగాడు చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయినా, ఆఖర్లో లివింగ్‌స్టోన్ (26 బంతుల్లో 38; ఫోర్, 3 సిక్సర్లు), సామ్ కర్రన్ (18 బంతుల్లో 35; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపుల సాయంతో ఇంగ్లండ్ భారీ స్కోర్ సాధించగలిగింది. సఫారీ బౌలర్లలో ప్రిటోరియస్ (4/36), నోర్జే (2/53), షంషి (2/39), కెప్టెన్ కేశవ్ మహారాజ్ (1/29)లు వికెట్లు సాధించారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లీష్ బౌలర్లు మూకుమ్మడిగా రెచ్చిపోవడంతో సఫారీ జట్టు 20.4 ఓవర్లలో కేవలం 83 పరుగులకే కుప్పకూలింది. View this post on Instagram A post shared by We Are England Cricket (@englandcricket) చదవండి: కెరీర్లో సవాళ్లు సహజం.. నేను ఇప్పుడే అలాంటి నిర్ణయం తీసుకోను! ఎందుకంటే! -
కెరీర్లో సవాళ్లు సహజం.. నేను ఇప్పుడే అలాంటి నిర్ణయం తీసుకోను!
ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో బిజీ షెడ్యూల్ ఆటగాళ్ల మానసిక పరిస్థితిపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న అంశం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి ఇవ్వకుండా వరుస సిరీస్‌లు నిర్వహించడంపై ఐసీసీతో పాటు ఆయా దేశాల క్రికెట్ బోర్డులపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో స్పందించిన విధానం ఆసక్తికరంగా మారింది. ‘‘సహజంగానే కెరీర్లో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. అయితే, నేను మాత్రం వీలైనంత ఎక్కువ కాలం అన్ని ఫార్మాట్లలో ఆడేందుకు ప్రయత్నిస్తాను. కొన్నిసార్లు వివిధ కారణాల వల్ల కొన్ని పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. నా వరకైతే సమీప భవిష్యత్తులో నేను అలాంటి నిర్ణయమేదీ తీసుకోబోను. వీలైనంత కాలం ఆడుతూనే ఉంటాను’’ అని బెయిర్‌స్టో చెప్పుకొచ్చాడు. మూడు ఫార్మాట్ల జట్లలోనూ భాగం కావడం తనకిష్టమని, తద్వారా ఆటలో కొత్తదనం ఆస్వాదించే అవకాశం దొరుకుతుందని వ్యాఖ్యానించాడు. కాగా స్వదేశంలో న్యూజిలాండ్ టెస్టు సిరీస్, టీమిండియాతో రీషెడ్యూల్డ్ టెస్టు మ్యాచ్‌లో అద్భుత సెంచరీలతో ఆకట్టుకున్నాడు బెయిర్‌స్టో. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక టీమిండియాతో టీ20, వన్డే సిరీస్ ముగిసిన అనంతరం బెయిర్‌స్టో ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగమయ్యాడు. ఇందులో భాగంగా శుక్రవారం నాటి రెండో వన్డేలో 27 బంతుల్లో 28 పరుగులు సాధించాడు. ఇక వర్షం కారణంగా 29 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో మ్యాచ్‌లో ఇంగ్లండ్ 118 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది. చదవండి: Shikhar Dhawan- Nicholas Pooran: సెంచరీ చేజారినందుకు బాధగా ఉంది! అసలైన గెలుపు మాదే! Sanju Samson: సంజూ ఆ బంతిని ఆపకపోయి ఉంటే.. టీమిండియా ఓడిపోయేదే! నువ్వు సూపర్! -
సఫారీల భరతం పట్టిన ఇంగ్లండ్ బౌలర్లు.. రెండో వన్డేలో బట్లర్ సేన ఘన విజయం
పర్యాటక దక్షిణాఫ్రికా చేతిలో తొలి వన్డేలో ఎదురైన పరాభవానికి ఇంగ్లండ్ జట్టు ప్రతీకారం తీర్చుకుంది. ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో 118 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. వర్షం కారణంగా 29 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు 28.1 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌటైంది. జట్టులో ఏ ఒక్క ఆటగాడు చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయినా, ఆఖర్లో లివింగ్‌స్టోన్ (26 బంతుల్లో 38; ఫోర్, 3 సిక్సర్లు), సామ్ కర్రన్ (18 బంతుల్లో 35; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపుల సాయంతో ఇంగ్లండ్ భారీ స్కోర్ సాధించగలిగింది. సఫారీ బౌలర్లలో ప్రిటోరియస్ (4/36), నోర్జే (2/53), షంషి (2/39), కెప్టెన్ కేశవ్ మహారాజ్ (1/29)లు వికెట్లు సాధించారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లీష్ బౌలర్లు మూకుమ్మడిగా రెచ్చిపోవడంతో సఫారీ జట్టు 20.4 ఓవర్లలో కేవలం 83 పరుగులకే కుప్పకూలింది. ఆదిల్ రషీద్ (3/29), మొయిన్ అలీ (2/22), రీస్ టాప్లే (2/17), డేవిడ్ విల్లే (1/9), సామ్ కర్రన్ (1/5) సఫారీల భరతం పట్టారు. వీరి ధాటికి సఫారీల ఇన్నింగ్స్‌లో ఏకంగా నాలుగురు బ్యాటర్లు డకౌటయ్యారు. హెన్రిచ్ క్లాసెన్ (40 బంతుల్లో 33), డేవిడ్ మిల్లర్ (12), ప్రిటోరియస్ (17) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే హెడింగ్లే వేదికగా జులై 24న జరుగనుంది. చదవండి: Ind Vs WI: సంజూ ఆ బంతిని ఆపకపోయి ఉంటే.. టీమిండియా ఓడిపోయేదే! -
వన్డేలకు రిటైర్మెంట్ ఇస్తే.. టీ20ల నుంచి కూడా తప్పించారు!
Ben Stokes ODI Retirement- Eng Vs SA ODI Series: ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్, వన్డే వరల్డ్‌కప్-2019లో తమ జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు బెన్‌స్టోక్స్. ఇటీవలే అతడు ఇంగ్లండ్ టెస్టు జట్టు పగ్గాలు చేపట్టి స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌ను గెలవడంతో పాటు రీషెడ్యూల్డ్ టెస్టులో టీమిండియాను ఓడించి కెప్టెన్‌గా మధుర జ్ఞాపకాలు మిగుల్చుకున్నాడు. అందుకే ఇలా! అయితే, అనూహ్యంగా వన్డేలకు గుడ్‌బై చెబుతూ స్టోక్స్ తీసుకున్న నిర్ణయం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తీరిక లేని షెడ్యూల్ కారణంగా.. మూడు ఫార్మాట్లలో ఆడటం కష్టమవుతోందన్న కారణంగానే తాను వన్డే ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు స్పష్టం చేశాడు 31 ఏళ్ల స్టోక్స్. అంతేకాదు.. తాము కూడా మనుషులమేమని, పెట్రోల్ పోస్తే పరిగెత్తే కార్లు కాదని.. విశ్రాంతి లేకుండా ఆడటం ఎవరితరం కాదని ఇంగ్లండ్ బోర్డుకు చురకలంటించాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ నాసిర్ హుస్సేన్ సహా పలువురు మాజీ ఆటగాళ్లు ఐసీసీ, క్రికెట్ బోర్డుల తీరును తప్పుబడుతున్నారు. విశ్రాంతి లేకుండా ఆడిస్తే ఆటగాళ్లకు పిచ్చెక్కిపోయి ఇలాగే రిటైర్మెంట్ ప్రకటిస్తారంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ‘‘అప్పట్లో ఓసారి.. షెడ్యూల్ భయంకరంగా ఉంది.. నా వల్ల కాదని చెప్పాను. అందుకే వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాను. అయితే, ఈసీబీ నన్ను టీ20లు కూడా ఆడకుండా నిషేధం విధించింది’’ అంటూ పీటర్సన్ ఇంగ్లండ్ బోర్డు తీరును ఎండగట్టాడు. I once said the schedule was horrendous and I couldn’t cope, so I retired from ODI cricket & the ECB banned me from T20s too………….🤣 — Kevin Pietersen🦏 (@KP24) July 19, 2022 కాగా ఇంగ్లండ్ తరఫున 104 టెస్టులు, 136 వన్డేలు, 37 టీ20 మ్యాచ్‌లు ఆడాడు పీటర్సన్. ఈ మూడు ఫార్మాట్లలో వరుసగా 8181, 4440, 1176 పరుగులు సాధించాడు. అయితే, ఈసీబీతో అతడికి విభేదాలు తలెత్తగా బోర్డుపై తీవ్ర విమర్శలు చేసిన పీటర్సన్ ఆటకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో తాజా ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక 2013లో తన ఆఖరి వన్డే, టీ20 మ్యాచ్‌లు ఆడిన పీటర్సన్.. 2014లో చివరిసారిగా ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్ ఆడాడు. స్టోక్స్ విషయానికొస్తే.. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో మంగళవారం(జూలై 18 )జరిగిన మొదటి వన్డే అతడికి చివరిది. ఈ మ్యాచ్‌లో స్టోక్స్ 5 పరుగులు మాత్రమే చేశాడు. టీమిండియాతో పరిమిత ఓవర్ల సిరీస్ ముగిసిన రోజు వ్యవధిలోనే ఇంగ్లండ్ ప్రొటిస్‌తో పోరుకు సిద్ధమైంది. వన్డేలతో పాటు టీ20, టెస్టు సిరీస్ ఆడనుంది. చదవండి: Eng Vs SA 1st ODI Series 2022: అదరగొట్టిన ప్రొటిస్ బౌలర్లు.. ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం! ఏకంగా.. 604 runs and 15 wickets on a sweltering day in Durham! Full highlights: https://t.co/AOpGzaJerX 🏴 #ENGvSA 🇿🇦 pic.twitter.com/VDjYwdNb0L — England Cricket (@englandcricket) July 20, 2022 -
Eng Vs SA: అదరగొట్టిన ప్రొటిస్ బౌలర్లు.. పాపం స్టోక్స్.. ఆఖరి మ్యాచ్‌లో ఇలా!
South Africa tour of England, 2022- ODI Series: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికా తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. ప్రొటిస్ జట్టు 62 పరుగుల తేడాతో ఆతిథ్య ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. కాగా ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికా జూలై 19 నుంచి సెప్టెంబరు 12 వరకు మూడు వన్డేలు, మూడు టీ20లు, మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఇందులో భాగంగా చెస్టర్ లీ స్ట్రీట్‌లోని రివర్సైడ్ వేదికగా ఇరు జట్ల మధ్య మంగళవారం (జూలై 19) మొదటి వన్డే జరిగింది. అర్ధ శతకాలతో అదరగొట్టి.. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ జానేమన్ మలన్ అర్ధ శతకం(57)తో రాణించగా.. మరో ఓపెనర్ క్వింటన్ డికాక్(19 పరుగులు) మాత్రం నిరాశపరిచాడు. ఇక మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రాసీ వాన్ డర్ డసెన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో 117 బంతులు ఎదుర్కొన్న అతడు 10 ఫోర్ల సాయంతో 133 పరుగులు సాధించాడు. ఇక ఎయిడెన్ మార్కరమ్ సైతం హాఫ్ సెంచరీ(77)తో చెలరేగాడు. మిల్లర్ 12 పరుగులతో అజేయంగా నిలవగా.. క్లాసెన్ 12 పరుగులు చేశాడు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో ప్రొటిస్ జట్టు 5 వికెట్ల నష్టానికి 333 పరుగులు చేసింది. దెబ్బ కొట్టిన నోర్జే.. లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు జేసన్ రాయ్(43), జానీ బెయిర్ స్టో(63) శుభారంభం అందించారు. ఇక జో రూట్ సైతం 86 పరుగులతో రాణించి ఇంగ్లండ్ శిబిరంలో జోష్‌ను రెట్టింపు చేశాడు. బెన్ స్టోక్స్(5), జోస్ బట్లర్(12) సహా ఇతర ఆటగాళ్లు చేతులెత్తేసినా 45వ ఓవర్ వరకు పట్టుదలగా నిలబడ్డాడు. Rooty being Rooty 😍 Scorecard & Videos: https://t.co/42BkBONmvP 🏴 #ENGvSA 🇿🇦 pic.twitter.com/pdV63bgu77 — England Cricket (@englandcricket) July 19, 2022 అయితే, అన్రిచ్ నోర్జే తన తన అద్భుతమైన బంతితో రూట్‌ను బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ పరాజయం ఖరారైంది. 46.5 ఓవర్లలోనే ఇంగ్లండ్ కథ ముగిసిపోయింది. ఆతిథ్య జట్టు 271 పరుగులకు ఆలౌట్ కావడంతో కేశవ్ మహరాజ్ బృందం 62 పరుగులతో జయకేతనం ఎగురవేసింది. ODI half-century number 36 for @root66 👏 Scorecard & Videos: https://t.co/42BkBONmvP 🏴 #ENGvSA 🇿🇦 | @IGcom pic.twitter.com/9p4lXcfLTb — England Cricket (@englandcricket) July 19, 2022 ఇక ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బౌలర్లు.. కెప్టెన్ కేశవ్ మహరాజ్ ఒకటి, లుంగి ఎంగిడి ఒకటి, తబ్రేజ్ షంసీ రెండు, మార్కరమ్ రెండు వికెట్లు తీయగా.. నోర్జే 8.5 ఓవర్ల బౌలింగ్‌లో 53 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ప్రొటిస్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన డసెన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కాగా ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్‌కు ఇదే ఆఖరి వన్డే కావడం గమనార్హం. 2019 వన్డే వరల్డ్‌కప్ హీరో స్టోక్స్ ఇలా ఓటమితో వన్డే కెరీర్ ముగించడం గమనార్హం. ❤️ 🏴 #ENGvSA 🇿🇦 | @benstokes38 pic.twitter.com/teNgTVlV7T — England Cricket (@englandcricket) July 19, 2022 🚨 RESULT | SOUTH AFRICA WIN BY 62 RUNS A solid collective effort by the bowling unit - led by Anrich Nortje (4/53) - backed up the efforts of the batters as the #Proteas dismiss England for 271 after setting the hosts a target of 334#ENGvSA #BePartOfIt pic.twitter.com/hegYbqKnKf — Cricket South Africa (@OfficialCSA) July 19, 2022 ఇంగ్లండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా 2022 మొదటి వన్డే: ►వేదిక: చెస్టెర్-లీ-స్ట్రీట్ ►టాస్: దక్షిణాఫ్రికా- బ్యాటింగ్ ►దక్షిణాఫ్రికా స్కోరు: 333/5 (50) ►ఇంగ్లండ్ స్కోరు: 271 (46.5) ►విజేత: 62 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా గెలుపు ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: వాన్ డర్ డసెన్(117 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 133 పరుగులు) ►3 మ్యాచ్‌ల వన్డే సిరీస్: 1-0తో ముందంజలో పర్యాటక దక్షిణాఫ్రికా చదవండి: Ben Stokes: 'కార్లు కాదు పరిగెత్తడానికి.. రిటైర్మెంట్తోనైనా మేల్కొనండి' -
క్లాసెన్ సుడిగాలి శతకం.. సౌతాఫ్రికా భారీ స్కోర్
ఇంగ్లండ్ గడ్డపై రెండు నెలల పాటు సాగే సుదీర్ఘ పర్యటనలో భాగంగా సౌతాఫ్రికా ఇవాళ (జులై 14) ఇంగ్లండ్ లయన్స్‌ను రెండో వార్మప్ మ్యాచ్‌లో ఢీకొంది. తొలి మ్యాచ్‌లో లయన్స్ చేతిలో 6 వికెట్ల తేడాతో పరాజయంపాలైన ప్రొటీస్.. ఈ మ్యాచ్‌లో కోలుకున్నట్లు కనిపించింది. ఈ 50 ఓవర్స్ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ టీమ్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 360 పరుగుల భారీ స్కోర్ చేసింది. వికెట్‌కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ సుడిగాలి శతకంతో (85 బంతుల్లో 123; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడగా.. వాన్ డెర్ డస్సెన్ (61), ఫెలుక్వాయో (67) అర్ధసెంచరీలతో రాణించారు. ఇదిలా ఉంటే, జులై 19న ఇంగ్లండ్‌తో జరిగే తొలి వన్డేతో దక్షిణాఫ్రికా సిరీస్ మొదలవుతుంది. జులై 22, 24 తేదీల్లో రెండు, మూడు వన్డేలు, ఆతర్వాత 27, 28, 31 తేదీల్లో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్.. ఆగస్ట్ 17-సెప్టెంబర్ 12 వరకు 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరుగనుంది. ఈ పర్యటనలో సౌతాఫ్రికా మూడు ఫార్మాట్లకు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లతో బరిలోకి దిగనుండటం విశేషం. టెస్ట్‌లకు డీన్ ఎల్గర్, వన్డేలకు కేశవ్ మహారాజ్, టీ20లకు డేవిడ్ మిల్లర్లు సౌతాఫ్రికా కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. చదవండి: డోపింగ్‌కు పాల్పడ్డ బంగ్లాదేశ్ పేసర్‌పై వేటు -
క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త నిర్ణయానికి 30 ఏళ్లు..
ఒక బంతి.. 22 పరుగులు.. క్రికెట్ చరిత్రలోనే అదో చెత్త నిర్ణయంగా మిగిలిపోయింది. ఈ ఒక్క మ్యాచ్‌తో దురదృష్టానికి దగ్గరగా.. అదృష్టానికి దూరంగా నిలిచిపోయింది సౌతాఫ్రికా. నిషేధం తర్వాత ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు ఆ మ్యాచ్ ఒక చీకటి రోజు. 1992 వన్డే ప్రపంచకప్ సందర్భంగా ఇది చోటు చేసుకుంది. ఈ నిర్ణయాన్ని ఆటగాళ్లో లేక కోచ్ లో తీసుకోలేదు. సాక్ష్యాత్తు అంపైర్లే లెక్కలు వేసి మరి దక్షిణాఫ్రికాను ఇంటి దారి పట్టేలా చేశారు. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఆ ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్ తో సఫారీ టీం తలపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 6 వికెట్లకు 252 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా జట్టు టార్గెట్ వైపు దూసుకెళ్లింది. సౌతాఫ్రికా విజయ సమీకరణం 13 బంతుల్లో 22 పరుగులుగా ఉంది. అంటే ఓవర్ కు 11 పరుగులు చొప్పున రాబట్టాలి. అయితే ఇక్కడే ట్విస్ట్ మొదలైంది. వర్షం రావడంతో మ్యాచ్ ను అంపైర్లు నిలిపివేశారు. గ్రౌండ్ సిబ్బంది పిచ్ ను కవర్ చేస్తుండగా... ఇరు జట్ల ప్లేయర్స్ డగౌట్ కు చేరుకున్నారు. 10 నిమిషాల పాటు కురిసిన వాన అనంతరం నిలిచిపోయింది. కాసేపటికి మైదానంలోకి ఆటగాళ్లు వచ్చేశారు. క్రీజులో ఉన్న సఫారీ బ్యాటర్లు బ్రియాన్ మెక్ మిలన్, డేవిడ్ రిచర్డ్ సన్ టార్గెట్ ను కొట్టేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇంతలోనే పెద్ద ట్విస్ట్ సఫారీ జట్టును కనీసం పోరాడేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా చేసింది. మైదానంలో ఉన్న స్క్రీన్ పై సౌతాఫ్రికా గెలవాలంటే 1 బంతికి 22 పరుగులు చేయాల్సిందిగా డిస్ ప్లే అయ్యింది. అంతే క్రీజులో ఉన్న సఫారీ బ్యాటర్లు ఏం చేయకుండా అదొక్క బంతిని ఎదుర్కొని పెవిలియన్ బాట పట్టారు. పాపం అంపైర్లు తీసుకున్న తెలివి తక్కువ నిర్ణయంతో సౌతాఫ్రికా సెమీస్ నుంచి ఇంటి దారి పట్టాల్సి వచ్చింది. 10 నిమిషాల వర్షానికి 12 బంతుల కొత విధించిన అంపైర్లు ఒక్క పరుగు కూడా తగ్గించకపోవడంపై అప్పట్లో పెద్ద దుమారమే లేచింది. అప్పట్లో ఉన్న వర్షం నిబంధనలపై క్రికెట్ అభిమానులతో పాటు విశ్లేషకులు కూడా దుమ్మెత్తి పోశారు. దాంతో ఆ నిబంధనను ఐసీసీ తొలగించింది. 1997 నుంచి డక్ వర్త్ లూయిస్ పద్ధతిని అమల్లోకి వచ్చింది. ఈ మ్యాచ్ సరిగ్గా మార్చి 22 ,1992న జరగ్గా.. సరిగ్గా నేటితో 30 ఏళ్లు పూర్తైంది. చదవండి: IPL 2022: టీమిండియా కెప్టెన్సీపై రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు ICC Womens WC 2022: టీమిండియా సెమీస్‌కు చేరాలంటే..? -
ఇంగ్లండ్‌కు మరో పరాభవం.. వరుసగా మూడో మ్యాచ్‌లో..!
మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు మరో పరాభవం ఎదురైంది. మెగా టోర్నీలో వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఓటమిపాలై, క్వార్టర్స్ చేరుకునే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, వెస్టిండీస్ చేతిలో ఓడిన ఇంగ్లండ్, ఇవాళ (మార్చి 14) దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో పరాజయంపాలై మరోసారి భంగపడింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి దక్షిణాఫ్రికా ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. ఓపెనర్ బ్యూమోంట్ (62), వికెట్ కీపర్ జోన్స్ (53) అర్ధ శతకాలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. సఫారీ బౌలర్ కాప్ (5/45) ఇంగ్లండ్ పతనాన్ని శాసించింది. #TeamSouthAfrica win a thriller ✨ Their unbeaten run in the tournament continues, as #TeamEngland remain winless. #CWC22 pic.twitter.com/4M2zQgumTO — ICC Cricket World Cup (@cricketworldcup) March 14, 2022 అనంతరం 236 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆదిలోనే ఓపెనర్ లిజెల్లె లీ (9) వికెట్ కోల్పోయినప్పటికీ.. లారా వొల్వార్డ్ (77), తజ్మిన్ బ్రిట్స్ (23), కెప్టెన్ సూన్ లుస్ (36), మరిజన్నె కాప్ (32)ల బాధ్యాతయుతమైన ఇన్నింగ్స్‌ల కారణంగా మరో నాలుగు బంతులు ఉండగానే విజయతీరాలకు చేరింది. ఆఖర్లో త్రిష చెట్టి (11), షబ్రిమ్ ఇస్మాయిల్ (5)లు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి జట్టును గెలిపించారు. ఆల్‌రౌండ్ పెర్ఫార్మెన్స్తో అదరగొట్టిన కాప్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకుంది. ఇంగ్లండ్‌పై ఈ విజయంతో దక్షిణాఫ్రికా పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. తొలి స్థానంలో ఆసీస్ ఉండగా టీమిండియా మూడో స్థానంలో, ఆతరువాత న్యూజిలాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్ జట్లు వరుసగా నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో నిలిచాయి. మెగా టోర్నీలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడిన పాక్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. చదవండి: Virat Kohli: ‘కోహ్లిని మళ్లీ టెస్టు కెప్టెన్ చేయండి...’! -
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా సెమీస్‌కు.. దక్షిణాఫ్రికా కొంపముంచిన బంగ్లా ఇన్నింగ్స్!
దక్షిణాఫ్రికాతో చివరి లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయ లక్ష్యం 190 పరుగులు... 87 పరుగులు చేస్తే సెమీస్‌కు ఇంగ్లండ్... 10.4వ ఓవర్లో ఆ పరుగు వచ్చేసింది... 106 పరుగులు చేస్తే గ్రూప్‌లో అగ్రస్థానం... 12.1వ ఓవర్లో అదీ జరిగిపోయింది... 132 పరుగులు చేస్తే ఆసీస్‌కు సెమీస్ అవకాశం... 15.2వ ఓవర్లో ఆ స్కోరు రావడంతో కంగారూ టీమ్‌లో ఆనందం...చివరి మ్యాచ్‌లో గెలిచినా దురదృష్టం వెంటాడటంతో సఫారీ జట్టు మరోసారి ఐసీసీ టోర్నీ నుంచి ఉత్త చేతులతో నిష్క్రమించింది. టి20 ప్రపంచకప్‌లో మాజీ చాంపియన్ ఇంగ్లండ్ గ్రూప్–1 టాపర్‌గా సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. హోరాహోరీగా సాగిన చివరి లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడినా రన్‌రేట్ ఆధారంగా ఇంగ్లండ్‌కు అగ్రస్థానం దక్కగా... అదే తరహాలో మెరుగైన రన్‌రేట్‌తో రెండో స్థానంలో నిలిచి ఆస్ట్రేలియా కూడా సెమీస్‌కు అర్హత పొందింది. ఈ మూడు టీమ్‌లు 4 విజయాలు, 8 పాయింట్లతో సమానంగా నిలవగా... పోటీలో దక్షిణాఫ్రికా వెనకబడిపోయింది. ముఖ్యంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 85 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు 13.3 ఓవర్లు తీసుకోవడం చివరకు దక్షిణాఫ్రికాను బాగా దెబ్బ తీసింది. తాజా ఫలితంతో సెమీస్‌లో పాకిస్తాన్‌తో ఆస్ట్రేలియా పోరు ఖాయమైపోయింది. (చదవండి: T20 WC 2021: అతి పెద్ద సిక్స్ కొట్టిన రసెల్.. వీడియో వైరల్) షార్జా: టోర్నీ ఆరంభం నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన ఇంగ్లండ్‌కు చివరి లీగ్ మ్యాచ్‌లో చుక్కెదురైంది. శనివారం జరిగిన పోరులో దక్షిణాఫ్రికా 10 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వాన్ డర్ డసెన్ (60 బంతుల్లో 94 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు) అద్భుతంగా ఆడగా... మార్క్రమ్ (25 బంతుల్లో 52 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) కూడా దూకుడైన అర్ధ సెంచరీ సాధించాడు. క్వింటన్ డి కాక్ (27 బంతుల్లో 34; 4 ఫోర్లు) కూడా రాణించాడు. అనంతరం ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 179 పరుగులు సాధించింది. మొయిన్ అలీ (27 బంతుల్లో 37; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), డేవిడ్ మలాన్ (26 బంతుల్లో 33; 3 ఫోర్లు, సిక్స్), లివింగ్ స్టోన్ (17 బంతుల్లో 28; ఫోర్, 3 సిక్స్‌లు), బట్లర్ (15 బంతుల్లో 26; 3 ఫోర్లు, సిక్స్), జేసన్ రాయ్ (15 బంతుల్లో 20 రిటైర్డ్‌హర్ట్; 4 ఫోర్లు) తలా కొన్ని పరుగులు జోడించారు. కగిసో రబడ (3/48) ఇన్నింగ్స్ చివరి ఓవర్లో తొలి మూడు బంతులకు మూడు వికెట్లు (వోక్స్, మోర్గాన్, జోర్డాన్) తీసి ‘హ్యాట్రిక్’ సాధించడం విశేషం. అంతర్జాతీయ టి20ల్లో హ్యాట్రిక్ తీసిన తొలి దక్షిణాఫ్రికా బౌలర్‌గా రబడ గుర్తింపు పొందాడు. (చదవండి: Harbhajan Singh: 'చెత్త వాగుడు ఆపండి'.. భజ్జీ వార్నింగ్) వార్నర్ వీరవిహారం అబుదాబి: ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డేవిడ్ వార్నర్ (56 బంతుల్లో 89 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌కు తోడు మిచెల్ మార్ష్ (32 బంతుల్లో 53; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా అర్ధ సెంచరీ సాధించడంతో ఆస్ట్రేలియాకు చివరి లీగ్ మ్యాచ్‌లో విజయం దక్కింది. ఈ పోరులో ఆసీస్ 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. కెప్టెన్ పొలార్డ్ (31 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలవగా... ఎవిన్ లూయిస్ (26 బంతుల్లో 29; 5 ఫోర్లు), హెట్‌మైర్ (28 బంతుల్లో 27; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. జోష్ హాజల్‌వుడ్ (4/39) విండీస్‌ను దెబ్బ తీశాడు. అనంతరం ఆస్ట్రేలియా 16.2 ఓవర్లలో 2 వికెట్లకు 161 పరుగులు సాధించింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన విండీస్ చివరకు ఒకే ఒక విజయంతో టోర్నీని ముగిచింది. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ కెరీర్‌కు డ్వేన్ బ్రావో గుడ్‌బై చెప్పగా... క్రిస్ గేల్ కూడా తన ఆఖరి ప్రపంచకప్ మ్యాచ్ ఆడేశాడు. (చదవండి: అజహరుద్దీన్-సంగీతల బ్రేకప్ లవ్‌స్టోరీ) స్కోరు వివరాలు వెస్టిండీస్ ఇన్నింగ్స్: గేల్ (బి) కమిన్స్ 15; లూయిస్ (సి) స్మిత్ (బి) జంపా 29; పూరన్ (సి) మార్ష్ (బి) హాజల్‌వుడ్ 4; ఛేజ్ (బి) హాజల్‌వుడ్ 0; హెట్‌మైర్ (సి) వేడ్ (బి) హాజల్‌వుడ్ 27; పొలార్డ్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) స్టార్క్ 44; బ్రావో (సి) వార్నర్ (బి) హాజల్‌వుడ్ 10; రసెల్ (నాటౌట్) 18; హోల్డర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1–30, 2–35, 3–35, 4–70, 5–91, 6–126, 7–143. బౌలింగ్: స్టార్క్ 4–0–33–1, హాజల్‌వుడ్ 4–0–39–4, కమిన్స్ 4–0–37–1, మ్యాక్స్‌వెల్ 1–0–6–0, మార్ష్ 3–0–16–0, జంపా 4–0–20–1. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: డేవిడ్ వార్నర్ (నాటౌట్) 89; ఫించ్ (బి) హొసీన్ 9; మిచెల్ మార్ష్ (సి) హోల్డర్ (బి) గేల్ 53; మ్యాక్స్‌వెల్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (16.2 ఓవర్లలో 2 వికెట్లకు) 161. వికెట్ల పతనం: 1–33, 2–157. బౌలింగ్: హొసీన్ 4–0–29–1, రోస్టన్ ఛేజ్ 1.2–0–17–0, జేసన్ హోల్డర్ 2–0–26–0, డ్వేన్ బ్రావో 4–0–36–0, వాల్ష్ 2–0–18–0, ఆండ్రీ రసెల్ 2–0–25–0, గేల్ 1–0–7–1. -
T20 WC: ఆస్ట్రేలియా.. లేదంటే దక్షిణాఫ్రికా... ఇంగ్లండ్‌పైనే ఆసీస్ ఆశలు!
T20 WC 2021 Aus Vs WI And Eng Vs SA Who Will Enter Semis After England: టి20 ప్రపంచకప్ సూపర్–12 గ్రూప్–1 లీగ్ మ్యాచ్‌లకు నవంబరు 6తో తెరపడనుంది. వరుసగా నాలుగు విజయాలతో ఇంగ్లండ్ ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకోగా... మరో సెమీఫైనల్ బెర్త్ కోసం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా పోటీపడనున్నాయి. శనివారం నాటి చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌తో ఆస్ట్రేలియా... ఇంగ్లండ్‌తో దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఆరు పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. అయితే రన్‌రేట్ విషయంలో దక్షిణాఫ్రికా (0.742)కంటే ఆస్ట్రేలియా (1.031) చాలా మెరుగ్గా ఉంది. మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించినా ఆస్ట్రేలియాకు సెమీస్ బెర్త్ అనేది రాత్రి ఇంగ్లండ్–దక్షిణాఫ్రికా మ్యాచ్ ముగిసిన తర్వాతే ఖరారవుతుంది. విండీస్‌పై ఆస్ట్రేలియా గెలిచినా... ఆసీస్ జట్టు రన్‌రేట్‌ను దాటి ముందుకెళ్లాలంటే ఎంత తేడాతో ఇంగ్లండ్‌పై నెగ్గాల్సి ఉంటుందో దక్షిణాఫ్రికాకు తెలుస్తుంది. ఒకవేళ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తమ మ్యాచ్‌ల్లో గెలిస్తే ఇంగ్లండ్‌తో సమంగా ఎనిమిది పాయింట్లతో నిలుస్తాయి. అయితే ఇంగ్లండ్ రన్‌రేట్ చాలా మెరుగ్గా ఉండటంతో ఆ జట్టుకు వచ్చిన ముప్పేమీ లేదు. ఈ పరిస్థితిలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లలో మెరుగైన రన్‌రేట్ ఉన్న జట్టుకు రెండో సెమీస్ బెర్త్ లభిస్తుంది. ఒకవేళ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా రెండు జట్లూ తమ చివరి లీగ్ మ్యాచ్‌ల్లో ఓడిపోతే రన్‌రేట్ ఆధారంగానే రెండో సెమీస్ బెర్త్ ఖరారుకానుంది. జంపా మ్యాజిక్... బంగ్లాదేశ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా (5/19) మాయాజాలానికి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 15 ఓవర్లలో 73 పరుగులకే కుప్పకూలింది. ఆ్రస్టేలియా కేవలం 6.2 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి 78 పరుగులు చేసి గెలిచింది. 89 బంతులు మిగిలి ఉండగా లక్ష్యాన్ని ఛేదించడంతో ఆస్ట్రేలియా రన్‌రేట్ –0.627 నుంచి 1.031కు ఎగబాకడం విశేషం. కెప్టెన్ ఆరోన్ ఫించ్ (20 బంతుల్లో 40; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఓటమితో బంగ్లాదేశ్ సూపర్–12 దశలో ఒక్క విజయం లేకుండానే నిష్క్రమించింది. శ్రీలంక... విజయంతో ముగింపు గ్రూప్–1లోనే భాగంగా జరిగిన మరో మ్యాచ్‌లో శ్రీలంక 20 పరుగుల ఆధిక్యంతో రెండుసార్లు చాంపియన్ వెస్టిండీస్‌ను ఓడించి తమ టి20 ప్రపంచకప్‌ను విజయంతో ముగించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 3 వికెట్లకు 189 పరుగులు సాధించింది. ఓపెనర్ నిశాంక (41 బంతుల్లో 51; 5 ఫోర్లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ చరిత్ అసలంక (41 బంతుల్లో 68; 8 ఫోర్లు, సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులు చేసి ఓడిపోయింది. గేల్ (1), లూయిస్ (8), రసెల్ (2), పొలార్డ్ (0), డ్వేన్ బ్రావో (2) విఫలమయ్యారు. నికొలస్ పూరన్ (34 బంతుల్లో 46; 6 ఫోర్లు, సిక్స్)... హెట్‌మైర్ (54 బంతుల్లో 81 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) పోరాడినా ఫలితం లేకపోయింది. లంక బౌలర్లలో బినూరా ఫెర్నాండో, చమిక కరుణరత్నే, హసరంగ రెండేసి వికెట్లు తీశారు. చదవండి: T20 world Cup 2021: 6.3 ఓవర్లలోనే కొట్టేశారు.. అయిననూ సెమీస్ ఆశలన్నీ అఫ్గనిస్తాన్పైనే!? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1981407197.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మా ఆటగాళ్లకు వైరస్ లేదు: ఈసీబీ
కేప్‌టౌన్ : దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ జట్టులో ఇద్దరు ఆటగాళ్లకు వైరస్ లక్షణాలు లేవని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) స్పష్టం చేసింది. బయో బబుల్‌లో ఉన్నప్పటికీ వీరితో పాటు బస చేసిన హోటల్ సిబ్బందికి కరోనా సోకినట్లు వార్తలొచ్చాయి. ఈ గందరగోళంలోనే మూడు వన్డేల సిరీస్ పూర్తిగా రద్దయింది. అయితే కరోనా అనుమానితుల్ని మిగతా ఆటగాళ్లకు దూరంగా ఐసోలేషన్‌లో ఉంచారు. ఈసీబీ వైద్యబృందం వారి నమూనాల్ని మరోసారి స్వతంత్ర వైరాలజీ ల్యాబ్‌లో పరీక్షించింది. అయితే వైరస్ జాడ లేదని తెలియడంతో ఈసీబీ, దక్షిణాఫ్రికా క్రికెట్ వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి. ఇప్పుడు ఆ ఇద్దరు ఆటగాళ్లు ఐసోలేషన్ నుంచి విడుదలయ్యారు. జట్టుతో కలిసి గురువారం స్వదేశానికి పయనం కానున్నారు. -
ఇంగ్లండ్‌కు ఊహించని షాక్
నాలుగు టెస్టుల సిరీస్ కోసం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు ప్రధాన బౌలర్ జేమ్స్ అండర్స్‌న్ పక్కటెముకల గాయం కారణంగా మిగతా సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అధికారికంగా ప్రకటించింది. ‘ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో జరగబోయే మిగతా టెస్టులకు అందుబాటులో ఉండటం లేదు’అంటూ ఈసీబీ ట్వీట్ చేసింది. రెండో టెస్టు సందర్భంగా అండ్సన్ కాస్త ఇబ్బంది పడ్డాడని, మ్యాచ్ అనంతరం ఎమ్మారై స్కాన్ తీయించగా అతడి పక్కటెముకల్లో చిన్న పగుళు ఏర్పడినట్లు డాక్టర్లు చెప్పారని ఈసీబీ తెలిపింది. అంతేకాకుండా అతడికి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో అతడిని మిగతా టెస్టులకు దూరమవుతున్నాడని పేర్కొంది. అయితే ఆ గాయం తీవ్రత, ఎంతకాలం విశ్రాంతి అనే దానిపై స్పష్టత రావాల్సివుంది. ఇక ఇంగ్లండ్ బౌలింగ్ దళానికి నాయకత్వం వహిస్తున్న జిమ్మీ మిగతా టెస్టులకు దూరమవడం ఇంగ్లండ్‌కు పెద్ద ఎదురుదెబ్బ అని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తొలి టెస్టులో ఓటమి అనంతరం రెండో టెస్టులో అనూహ్యంగా పుంజుకున్న ఇంగ్లీష్ జట్టు ప్రొటీస్ జట్టుపై ఘనవిజయాన్ని అందుకుంది. ఇదే ఊపులో మూడో టెస్టు కూడా గెలిచేసి సిరీస్‌పై భరోసాగా ఉండాలనే ఆలోచనలో ఉంది. ఇలాంటి తరుణంలో జిమ్మీ దూరమవడం ఆ జట్టును కలవరానికి గురిచేస్తోంది. దక్షిణాఫ్రికా అంటేనే ఫాస్ట్ పిచ్‌లకు స్వర్గధామం. ఇలాంటి తరుణంలో ప్రధాన బౌలర్ గైర్హాజరిలో మిగతా బౌలర్లతో ఇంగ్లండ్ ఎలా నెట్టుకొస్తుందో చూడాలి. ఇక కేప్‌టౌన్‌లో టెస్టులో ఘోర ఓటమి తర్వాత దక్షిణాఫ్రికా ఆత్మవిమర్శ చేసుకుంటోంది. గత మ్యాచ్ తప్పిదాలను మరలా పునరావృతం కాకుండా జాగ్రత్తగా ఆడాలని డుప్లెసిస్ సేన భావిస్తోంది. -
‘438’.. సీన్ రిపీట్ అవుతుందా?
‘438’ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ నంబర్‌పై తీవ్ర చర్చ జరుగుతోంది. క్రికెట్ అభిమానులకు ముఖ్యంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఫ్యాన్స్ మరిచిపోని నంబర్ ‘438’. ఎందుకంటే టీ20 ఫార్మట్ అంతగా ఎస్టాబ్లిష్ కాకముందే వన్డే చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో రికార్డు స్కోర్ నమోదు చేసింది దక్షిణాఫ్రికా జట్టు. కేప్‌టౌన్ వేదికగా ఆసీస్ విసిరిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ప్రొటీస్ జట్టు అందరినీ షాక్‌కు గురిచేస్తూ 438 పరుగులు సాధించి అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అదెప్పుడో 2006లో జరిగింది కదా మళ్లీ ఇప్పుడు ఎందుకు ఆ చర్చ అనుకుంటున్నారా? అయితే అదే మ్యాజిక్ ఫిగర్ దక్షిణాఫ్రికాను మరోసారి ఊరిస్తోంది. దీంతో సోషల్ మీడియా వేదికగా ‘438’ మరోసారి తెరపైకి వచ్చింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భాగంగా ఆతిథ్య సఫారీ లక్ష్యం 438 పరుగులు. పర్యాటక ఇంగ్లండ్ జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌ను 391/8 వద్ద డిక్లెర్డ్ చేసింది. దీంతో 46 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని డుప్లెసిస్ సేన ముందు ఇంగ్లండ్ 438 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచింది. ఇక నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ప్రొటీస్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ఎల్గర్(34), హమ్జా(15) అంతగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం క్రీజులో మలాన్(63 బ్యాటింగ్), నైట్ వాచ్‌మన్ కేశవ్ మహారాజ్(2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. సఫారీ జట్టు గెలవాలంటే ఆట చివరి రోజు 312 పరుగులు సాధించాలి. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. అయితే గెలుపు కోసం పోరాడటంతో పాటు ఓడిపోకుండా జాగ్రత్తగా ఆడాలని ప్రొటీస్ జట్టు భావిస్తోంది. ఇక ఈ మ్యాచ్‌లో తప్పక గెలిచి నాలుగు టెస్టుల సిరీస్‌ను 1-1తో లెవల్ చేయాలని రూట్ సేన ఉవ్విళ్లూరుతోంది. అయితే కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫికా ‘438’ సీన్ మరోసారి రిపీట్ చేస్తుందని ఆ దేశ అభిమానులు ఆశిస్తున్నారు. అంతేకాకుండా ఆనాటి మ్యాచ్‌కు సంబంధించి మధురస్మృతులను గుర్తుచేసుకుంటున్నారు. దీనిలో భాగంగా ఆనాటి మ్యాచ్‌కు సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తున్నారు. ఇక ఆ మ్యాచ్‌లో అప్పటి సారథి రికీ పాంటింగ్ (164) భారీ సెంచరీ సాధించడంతో ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 434 పరుగులు చేసింది. అనంతరం హెర్షల్ గిబ్స్(175), స్మిత్(90)తో పాటు బౌచర్(50 నాటౌట్) రాణించడంతో దక్షిణాఫ్రికా 49.5 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 438 పరుగులు సాధించి విజయాన్ని అందుకుని ఛేజింగ్‌లో సరికొత్త చరిత్రను సృష్టించిన విషయం తెలిసిందే. -
ఇడియట్.. దేవుడికి సంబంధమేంటి?
దక్షిణాఫ్రికా స్పీడ్ గన్ డేల్ స్టెయిన్‌కు ఓ నెటిజన్ కోపం తెప్పించాడు. దీంతో ఆ నెటిజన్ను స్టెయిన్ కడిగిపారేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇంగ్లండ్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వరుస ఓటములు, వివాదాలతో సతమవుతున్న ప్రొటీస్ జట్టుకు ఈ విజయం ఎంతో ఊరట కలిగించింది. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డులో, జట్టులో కొన్ని సంస్కరణల అనంతరం స్వదేశంలో జరుగుతున్న తొలి టెస్టులో విజయం సాధించడం పట్ల ఆదేశ తాజా, మాజీ క్రికెటర్లు, ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో డుప్లెసిస్ సేనపై ప్రశంసల జల్లులు కురిపిస్తూ స్టెయిన్ ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్‌పై ఓ నెటిజన్ అత్యుత్సాహాన్ని ప్రదర్శించి స్టెయిన్ ఆగ్రహానికి గురయ్యాడు. గెలిచింది స్వదేశంలో కదా లెక్కలోకి రాదు అంటూనే దేవుడి దయతో మ్యాచ్ గెలిచారనే అనే అర్థంలో రీట్వీట్ చేశాడు. దీంతో స్టెయిన్‌కు చిర్కెత్తుకొచ్చింది. ఆ నెటిజన్ భారత్‌కు చెందిన వాడని గుర్తించిన ఈ ప్రొటీస్ బౌలర్ అతడికి గట్టి కౌంటర్ ఇచ్చాడు. ‘అయితే టీమిండియా కూడా భారత్‌లో గెలిచినవి లెక్కలోకి రావా? అయినా మా గెలుపుకు దేవుడితో సంబంధం ఏంటి? ఇడియట్’అంటూ స్టెయిన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు స్టెయిన్‌కు అండగా నిలుస్తుండగా.. మరికొందరు ఇడియట్ అనడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్లో భాగంగా దక్షిణాఫ్రికాకు ఇదే తొలి విజయం కావడం విశేషం. -
‘దయచేసి బాగా ఆడండ్రా నాయన’
లండన్: ఒకసారి కాదు...రెండు సార్లు కాదు... ప్రతీ ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా గెలుపు ఆశలు ఏదో కారణంతో కుప్పకూలిపోవడం రొటీన్‌గా మారిపోయింది. 1992 నుంచి అన్ని ప్రపంచ కప్‌లలో గెలుపు అవకాశాలు కనిపిస్తూ చివరకు ఓడి ‘చోకర్స్’గా సఫారీ జట్టు ముద్ర వేసుకుంది. 2015 సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడి గుండె బద్దలైన క్షణాన సఫారీ జట్టు ఆటగాళ్లంతా చిన్నపిల్లల్లా రోదించారు. అయితే ఈ సారి ఎలాగైన మెరుగైన ప్రదర్శన చేసి టైటిల్ గెలవాలని ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన సఫారీ జట్టుకు తొలి మ్యాచ్‌లోనే ఘోర పరాభావం ఎదురైంది. ఏకంగా 104 పరుగుల తేడాతో సఫారీ జట్టును ఆతిథ్య ఇంగ్లండ్ చిత్తుచిత్తుగా ఓడించింది. అయితే మ్యాచ్ అనంతరం దక్షిణాఫ్రికా సారథి డుప్లెసిస్ తమ ఆటగాళ్ల ప్రదర్శనపై అసహనం వ్యక్తం చేశాడు. ఇలాంటి ప్రదర్శనతో కప్ గెలవడం కాదుకదా లీగ్ కూడా దాటలేమని తోటి ఆటగాళ్లను హెచ్చరించాడు. ‘ఇంగ్లండ్ అన్ని రంగాల్లో మా కంటే మెరుగైన ప్రదర్శన కనబర్చింది. తొలుత మా బౌలింగ్ దారుణంగా విపలమైంది. ఎన్గిడి పర్వాలేదనిపించినా ధారాళంగా పరుగులు ఇచ్చాడు. మా ఫీల్డింగ్ కూడా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. బ్యాటింగ్‌లో నాతో సహా అందరం దారుణంగా విఫలమయ్యాం. ఇలా అయితే లీగ్ కూడా దాటలేం. ఇప్పటికైనా మేల్కోండి. ఆటగాళ్లందరిని ఒకటే కోరుకుంటున్నాను దయచేసి బాగా ఆడి మెరుగైన ప్రదర్శన ఇవ్వండి’అంటూ డుప్లెసిస్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక సఫారీ జట్టు ప్రదర్శనపై ఆ జట్టు అభిమానులు, మాజీ ఆటగాళ్లు దుమ్మెత్తిపోస్తున్నారు. -
ప్రపంచకప్ తొలి విజయం ఇంగ్లండ్‌దే
లండన్: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2019ను ఇంగ్లండ్ విజయంతో ఆరంభించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 104 పరుగుల తేడాతో ఆతిథ్య ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఇంగ్లండ్.. సఫారీ జట్టును చిత్తుచిత్తుగా ఓడించింది. 312 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన డుప్లెసిస్ సేన 207 పరుగులకే కుప్పకూలింది. ఐపీఎల్ హీరో జోఫ్రా ఆర్చర్(3/27), ఫ్లంకెట్(2/37), స్టోక్స్(2/12)లు దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించారు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో డికాక్(68), డసెన్(50) ఫర్వాలేదనిపించారు. ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు ఆమ్లా(13), డుప్లెసిస్(5), డుమినీ(8)లు పూర్తిగా నిరాశపరిచారు. ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న బెన్ స్టోక్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఒత్తిడిలో సఫారీ చిత్తుచిత్తు.. మామూలుగానే ఐసీసీ టోర్నీల్లో ఒత్తిడికి చిత్తయ్యే అలవాటున్న సఫారీ జట్టు.. ఇంగ్లండ్ మ్యాచ్‌లోనూ అదే పంథాను కొనసాగించింది. భారీ ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికాకు సరైన శుభారంభం లభించలేదు. ఆరంభంలోనే హషీమ్ ఆమ్లా (13) హెల్మెట్ గ్రిల్స్‌కు బంతి బలంగా తాకడంతో రిటైర్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. మార్కమ్ (11)ను ఔట్ చేసి జోఫ్రా ఆర్చర్ వికెట్ల వేటను ఆరంభించాడు. సఫారీ సారథి డుప్లెసిస్ (5)నూ అతడే పెవిలియన్ పంపించి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాడు. ఈ క్రమంలో క్వింటన్ డికాక్ (68), రసి వాన్ డెర్ డసెన్ (50) క్రీజులో నిలిచారు. 4వ వికెట్‌కు 85 పరుగుల భాగస్వామ్యం అందించారు. అర్ధశతకం సాధించిన డికాక్‌ను ప్లంకెట్ కీలక సమయంలో ఔట్ చేశాడు. అప్పుడు స్కోరు 129/2. ఆచితూచి పరుగులు సాధిస్తున్న డసెన్ నిలిచినా మరోవైపు డుమిని (8), ప్రిటోరియస్ (1) వెంటవెంటనే ఔటయ్యారు. అర్ధశతకం తర్వాత డసెన్‌ను జట్టు స్కోరు 167 వద్ద జోఫ్రా పెవిలియన్ పంపాడు. అండిలె ఫెలుక్వాయో (24) కాసేపు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టులో జేసన్ రాయ్(54: 53 బంతుల్లో 8 ఫోర్లు), జో రూట్(51: 59 బంతుల్లో 5 ఫోర్లు), ఇయాన్ మోర్గాన్(57: 60 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు), బెన్ స్టోక్స్( 89: 79 బంతుల్లో 9 ఫోర్లు)లు రాణించి జట్టు మూడొందలకు పైగా స్కోరు సాధించడంలో తోడ్పడ్డారు. ఇంగ్లండ్ ఓపెనర్ బెయిర్ స్టో తొలి ఓవర్లోనే డకౌట్‌గా పెవిలియన్ చేరినప్పటికీ జేసన్ రాయ్, జో రూట్లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఈ జోడి రెండో వికెట్‌కు 106 పరుగులు సాధించిన తర్వాత జేసన్ రాయ్ పెవిలియన్ చేరగా, ఆపై స్వల్ప వ్యవధిలో రూట్ కూడా ఔటయ్యాడు. ఆ తరుణంలో మోర్గాన్-బెన్ స్టోక్స్‌ల జోడి ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టే బాధ్యతను తీసుకుంది. వీరిద్దరూ మరో 106 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసి గాడిలో పెట్టారు. కాగా, మోర్గాన్ నాల్గో వికెట్‌గా ఔటైన తర్వాత జోస్ బట్లర్(18), మొయిన్ అలీ(3)లు నిరాశపరచడంతో ఇంగ్లండ్ తడబడినట్లు కనిపించింది. అయితే బెన్ స్టోక్స్ సమయోచితంగా బ్యాటింగ్ చేసి జట్టును మూడొందలకు చేర్చిన తర్వాత పెవిలియన్ చేరాడు. స్కోరును పెంచే క్రమంలో స్టోక్స్ 49 ఓవర్ చివరి బంతికి ఔటయ్యాడు. చివరి ఓవర్లో జోఫ్రా ఆర్చర్(7 నాటౌట్), ప్లంకెట్(9 నాటౌట్)లు 11 పరుగులు సాధించడంతో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. సఫారీ బౌలర్లలో ఎన్గిడి మూడు వికెట్లు సాధించగా,రబడా, తాహీర్‌లకు తలో రెండు వికెట్లు లభించాయి. ఫెహ్లుకోవియా వికెట్ తీశాడు. -
దక్షిణాఫ్రికాకు షాక్.. ఆమ్లా రిటైర్డ్ హర్ట్
లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న వరల్డ్‌కప్ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్ హషీమ్ ఆమ్లా గాయపడ్డాడు. ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ వేసిన నాల్గో ఓవర్ ఐదో బంతిని పుల్ షాట్ ఆడబోయి ఆమ్లా గాయపడ్డాడు. దాంతో రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్ చేరాడు. ఆర్చర్ వేసిన సదరు బంతి 145 కి.మీ వేగంతో దూసుకొచ్చి ఆమ్లా హెల్మెట్‌ను బలంగా తాకింది. ఈ క్రమంలోనే మైదానంలో కొన్ని నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తొలుత ఆమ్లా హెల్మెట్‌ను మార్చడం కోసం సంకేతాలు ఇవ్వడంతో మోరిస్ కొన్ని హెల్మెట్లను మైదానంలోకి తీసుకొచ్చాడు. అయితే ఆ హెల్మెట్లు ఆమ్లాకు సరిపోలేదు. అదే సమయంలో దక్షిణాఫ్రికా ఫిజియో కూడా మైదానంలోకి వచ్చి ఆమ్లాను పరీక్షించాడు. బంతి తగిలిన చోట కొద్దిపాటి వాపు కూడా రావడంతో ఆమ్లా మైదానాన్ని వీడాడు. ఇలా ఆమ్లా మైదానాన్ని వీడటం దక్షిణాఫ్రికా శిబిరాన్ని ఆందోళనకు గురి చేసింది. ఇంకా ఆమ్లా గాయంపై స్పష్టత రాలేదు. (ఇక్కడ చదవండి: మోర్గాన్.. తొలి ఇంగ్లండ్ క్రికెటర్‌గా) ఇంగ్లండ్ నిర్దేశించిన 312 పరుగుల లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను డీకాక్, ఆమ్లాలు ఆరంభించారు. ఆమ్లా రిటైర్డ్ హర్ట్ కాగా, దక్షిణాఫ్రికా పది ఓవర్లలోపే రెండు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. మర్కరమ్(11), డుప్లెసిస్(5)లు నిరాశపరిచారు. ఫలితంగా సఫారీలు 44 పరుగుల వద్ద రెండో వికెట్‌ను నష్టపోయారు. దక్షిణాఫ్రికా కోల్పోయిన తొలి రెండు వికెట్లను జోఫ్రా ఆర్చర్ తన ఖాతాలో వేసుకున్నాడు. -
ఇంగ్లండ్‌కు ఆదిలోనే షాక్
-
తొలి ఓవర్లోనే ఇంగ్లండ్‌కు షాక్
లండన్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఆరంభపు మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు ఆదిలోనే షాక్ తగలింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ తొలి ఓవర్లోనే ఓపెనర్ బెయిర్ స్టో వికెట్‌ను కోల్పోయింది. ఒక బంతిని మాత్రమే ఎదుర్కొన్న బెయిర్ స్టో పరుగులేమీ చేయకుండా గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. తొలి ఓవర్‌ను అందుకున్న దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్.. బెయిర్ స్టోను పెవిలియన్‌కు చేర్చాడు. తాహీర్ వేసిన గుడ్ లెంగ్త్ బంతికి తడబడిన బెయిర్ స్టో.. సఫారీ కీపర్ డీకాక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దాంతో ఇంగ్లండ్ పరుగు మాత్రమే చేసి తొలి వికెట్‌ను నష్టపోయింది. ఇంగ్లండ్ జట్టుకు కీలక ఆటగాడైన బెయిర్ స్టో డకౌట్‌గా పెవిలియన్ చేరడంతో ఆ జట్టు శిబిరంలో నిరాశ నెలకొంది. (ఇక్కడ చదవండి: పన్నెండో ప్రపంచ యుద్ధం) ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను జేసన్ రాయ్, బెయిర్ స్టోలు ఆరంభించారు. అదే సమయంలో సఫారీ స్టార్ స్పిన్నర్ తాహీర్‌కు తొలి ఓవర్‌ను అప్పచెప్పాడు డుప్లెసిస్. తనపై పెట్టుకున్న కెప్టెన్ అంచనాలను నిజం చేస్తూ తాహీర్ ఆదిలోనే కీలక వికెట్‌ను తీసి దక్షిణాఫ్రికాకు శుభారంభం అందించాడు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : ఇంగ్లండ్‌కు ఆదిలోనే షాక్ -
అదిరే ఆరంభం ఎవరిదో?
లండన్: వన్డే వరల్డ్‌కప్ సమరానికి రంగం సిద్ధమైంది. కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగనున్న ఆరంభపు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ ముందుగా ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. అటు బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ఇరు జట్లు బలంగా ఉండటంతో గెలుపు ఎవరిది అనే దానిపై ఆసక్తి నెలకొంది. సొంత గడ్డపై జరుగుతున్న ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుండగా, సంచలనాలకు మారుపేరైన సఫారీలు శుభారంభం చేయాలని భావిస్తున్నారు. ఎన్నోసార్లు అందినట్లే అంది చేజారిన కప్‌పై ఆతిథ్య ఇంగ్లండ్ ఈసారి చాలా ఆశలే పెట్టుకుంది. జట్టంతా బలంగా ఉన్నా... ముఖ్యంగా ఓపెనర్ జేసన్ రాయ్, కీపర్ బట్లర్, ఆల్‌రౌండర్ స్టోక్స్ వారి బ్యాటింగ్ ఆర్డర్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. రాయ్, బట్లర్ విధ్వంసక బ్యాటింగ్‌కు పెట్టింది పేరు. సెంచరీల మీద సెంచరీలు బాదుతూ అద్భుతమైన ఫామ్‌లోనూ ఉన్నారు. పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్‌గా స్టోక్స్‌పై ఇంగ్లండ్ భారీ ఆశలు పెట్టుకుంది. (ఇక్కడ చదవండి: పన్నెండో ప్రపంచ యుద్ధం) ఇక ప్రపంచ కప్‌లో దురదృష్టం వెంటాడే దక్షిణాఫ్రికా పెద్ద స్టార్లంటూ ఎవరూ లేకుండా ఈసారి బరిలో దిగుతోంది. ఆమ్లా, తాహిర్, మిల్లర్ వంటివారున్నా... కెప్టెన్ డు ప్లెసిస్, బ్యాట్స్‌మన్ డికాక్, పేసర్లు స్టెయిన్, రబడల పైనే ఎక్కువ అంచనాలున్నాయి. ఐపీఎల్లో అదరగొట్టిన డికాక్, డు ప్లెసిస్ ఫామ్ చాటుకున్నారు. గాయం బెడద లేకుంటే.... వేగం, కచ్చితమైన యార్కర్లు వేసే రబడ ఎంత వరకూ ప్రభావం చూపుతాడో చూడాలి. తుది జట్లు దక్షిణాఫ్రికా డుప్లెసిస్(కెప్టెన్), హషీమ్ ఆమ్లా, డీకాక్, మర్కరమ్, వాన్ డెర్ డస్సెన్, జేపీ డుమినీ, డ్వైన్ ప్రిటోరియస్, ఫెహ్లుకోవాయా, కగిసో రబడా, లుంగి ఎన్గిడి, ఇమ్రాన్ తాహీర్ ఇంగ్లండ్ ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), జేసన్ రాయ్, జోనీ బెయిర్ స్టో, జో రూట్, జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, అదిల్ రషీద్, లియామ్ ప్లంకెట్, జోఫ్రా ఆర్చర్