దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు.. జట్టును ప్రకటించిన ఇంగ్లండ్‌ | England announce their playing XI for the second Test against South Africa | Sakshi
Sakshi News home page

SA vs ENG: దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు.. జట్టును ప్రకటించిన ఇంగ్లండ్‌

Published Wed, Aug 24 2022 8:30 PM | Last Updated on Wed, Aug 24 2022 8:33 PM

England announce their playing XI for the second Test against South Africa - Sakshi

దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో ఘోర పరాజయం పాలైన ఇంగ్లండ్.. ఇప్పడు రెండో టెస్టుకు సిద్దమైంది. గరువారం మాంచెస్టర్‌ వేదికగా ప్రోటీస్‌-ఇంగ్లండ్‌ మధ్య రెం‍డో టెస్టు జరగనుంది. కాగా ఈ టెస్టు కోసం ఇంగ్లండ్‌ తమ తుది జట్టును బుధవారం ప్రకటించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగనుంది. తొలి టెస్టుకు దూరమైన ఓలీ రాబిన్సన్ తుది జట్టులోకి వచ్చాడు.

అదే విధంగా గత కొన్ని మ్యాచ్‌ల నుంచి వరుసగా విఫలమవుతున్న ఓపెనర్‌ జాక్‌ క్రాలీకీ మళ్లీ చోటుదక్కడం గమానార్హం. ఇక తొలి టెస్టులో విజయం సాధించిన ప్రోటీస్‌.. ఈ మ్యాచ్‌లో కూడా గెలుపొంది సిరీస్‌ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. కాగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రోటీస్‌ జట్టు 1-0తో అధిక్యంలో ఉంది.

దక్షిణాఫ్రికాతో రెండో టెస్టుకు ఇంగ్లండ్‌ జట్టు:  అలెక్స్ లీస్, జాక్ క్రాలే, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్‌), బెన్ ఫోక్స్ (వికెట్‌ కీపర్‌), ఆలీ రాబిన్సన్, జాక్ లీచ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్
చదవండి:
 Asia Cup 2022: ఆసియా కప్‌ టోర్నీలో పాల్గొనబోయే టీమ్‌లు.. అన్ని జట్ల ఆటగాళ్ల వివరాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement