Robinson
-
Vivianne Robinson: ఒలింపిక్స్ ఇంటిపేరయింది
మనసు ఉంటే మార్గమే కాదు ‘మనీ’ కూడా ఉంటుంది. ‘అదెలా!’ అని ఆశ్చర్యపడితే... వివియానా రాబిన్సన్ గురించి తెలుసుకోవాల్సిందే. ‘ఒలింపిక్స్’ అనే మాట వినబడగానే ఆమె ఒళ్లు పులకించి΄ోతుంది. ప్రపంచ సంగ్రామ క్రీడను టీవీలో కాదు ప్రత్యక్షంగా చూడాలనేది ఆమె కల. అలా కల కని ఊరుకోలేదు. ఒక్కసారి కాదు ఏడుసార్లు ఒలింపిక్స్ వెళ్లింది... అలా అని ఆమె సంపన్నురాలేం కాదు. చాలా సామాన్యురాలు.ఒలింపిక్స్‌పై ఆసక్తి రాబిన్సన్కు 1984 ఒలింపిక్స్ సమయం లో మొదలైంది. ఆమె తల్లి ‘యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా’లో అథ్లెట్లకు ట్రాన్స్‌లేటర్‌గా ఉండేది. తల్లి నోటినుంచి ఒలింపిక్స్‌కు సంబంధించి ఎన్నో విషయాలు, విశేషాలు వినేది. ఆ ఆసక్తి రాబిన్సన్ను అట్లాంటా ఒలింపిక్స్‌కు వెళ్లేలా చేసింది.‘ఇప్పటిలా అప్పట్లో అథ్లెట్స్‌కు హైసెక్యూరిటీ ఉండేది కాదు. దీంతో ఎంతోమంది అథ్లెట్స్‌తో మాట్లాడే అవకాశం దొరికేది. కాని ఇప్పుడు సమీపంలోకి కూడా వెళ్లే పరిస్థితి లేదు’ అని ఆరోజులను గుర్తు చేసుకుంటుంది రాబిన్సన్.లాస్ ఏంజెల్స్, అట్లాంటా, సిడ్నీ, ఏథెన్స్, లండన్, రియో డి జెనీరోలతో పాటు తాజాగా ప్యారిస్ ఒలిపింక్స్‌కు కూడా వెళ్లింది.స్థలం కొనడానికో, ఇల్లు కొనడానికో, భవిష్యత్ అవసరాల కోసమో సాధారణంగా డబ్బు పొదుపు చేస్తారు. కాని రాబిన్సన్ మాత్రం ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకొని డబ్బు పొదుపు చేస్తుంది. రోజుకు రెండు ఉద్యోగాలు చేసింది. ప్రస్తుత ప్యారిస్ ఒలింపిక్స్ కోసం కూడా ఎప్పటినుంచో పొదుపు మంత్రం పాటించింది.ఒలింపిక్ థీమ్డ్ ట్రాక్సూట్తో ప్యారిస్‌లో టూరిస్ట్‌లు, వాలెంటీర్లకు ప్రత్యేక ఆకర్షణగా మారింది రాబిన్సన్. ఎంతోమంది ఆమెతో కలిసి సెల్ఫీలు దిగుతున్నారు. కొందరు ఆమె పాపులర్ టిక్‌టాక్ వీడియోల గురించి మాట్లాడుతుంటారు.‘సాధారణ దుస్తుల్లో కంటే ఇలాంటి దుస్తుల్లో కనిపించడం వల్ల నాతో మాట్లాడటానికి ఉత్సాహం చూపుతారు’ అంటుంది తన ప్రత్యేక వేషధారణ గురించి చెబుతూ. ఒలింపిక్స్ పుణ్యమా అని ప్రఖ్యాత అథ్లెట్లతో పాటు టామ్ క్రూజ్, లేడీ గాగా లాంటి సెలబ్రిటీ ఆర్టిస్ట్‌లతో కూడా మాట్లాడే అవకాశం వచ్చింది.ఆరంభంలో ఉన్న ఉత్సాహం ఆ తరువాత ఉండక΄ోవచ్చు. అయితే 66 సంవత్సరాల వయసులోనూ రాబిన్సన్ కు ఒలిపింక్స్పై ఆసక్తి తగ్గలేదు.‘డబ్బును పొదుపు చేస్తూ నేను బతికి ఉన్నంత వరకు ఒలింపిక్స్‌కు వెళుతూనే ఉంటాను’ అంటుంది మెరిసే కళ్లతో రాబిన్సన్. అయితే నెక్స్›్టఒలింపిక్స్ కోసం ఆర్థికరీత్యా రాబిన్సన్ అంతగా కష్టపడక్కర్లేదు. ఎందుకంటే తన హోమ్టౌన్ లాస్ ఏంజెల్స్‌లోనే అవి జరగనున్నాయి.వివియానా రాబిన్సన్ పేరుతో ఎంతోమంది ్రపొఫెసర్లు, రచయితలు, రకరకాల వృత్తుల వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో ‘ఒలింపిక్స్’ అనేది రాబిన్సన్ ఇంటి పేరు అయింది. ఆటల ప్రేమికులు, గూగుల్ లాంటి సెర్చ్ ఇంజిన్లకు వివియానా రాబిన్సన్ అనే కంటే ‘ఒలింపిక్స్ రాబిన్సన్’ అంటేనే సుపరిచితం.ఒలింపిక్స్ డైరీస్ఒక్కసారి ఒలింపిక్స్‌కు వెళ్లొస్తేనే ఆ అనుభవం ‘ఆహా ఓహో’ అనిపిస్తుంది. అలాంటిది ఏడుసార్లు వెళ్లడం అంటే అంతులేని అనుభూతి. అలాంటి అనుభూతిని సొంతం చేసుకుంది రాబిన్సన్. అథ్లెట్లకు లక్ష్యం మాత్రమే, వాలెంటీర్లకు వారు చేస్తున్న పని మాత్రమే కనిపిస్తుంది. అయితే ప్రేక్షకులుగా వెళ్లాలనుకునే వారికి మాత్రం 360 డిగ్రీల కోణంలో ఒలింపిక్స్ అనుభూతి సొంతం అవుతుంది. ఏడు ఒలింపిక్‌ల జ్ఞాపకాల సంపదను వృథా చేయవద్దు అంటున్నారు రాబిన్సన్ స్నేహితులు. సామాన్య ప్రేక్షకురాలిగా తాను చూసిన అనుభవాలను గ్రంథస్తం చేస్తే అదొక విలువైన గ్రంథం అవుతుంది. డైరీలలో దాగి ఉన్న ఆమె ఒలింపిక్ అనుభవాలు ఏదో ఒకరోజు పుస్తకరూపం దాల్చుతాయని ఖాయంగా చెప్పవచ్చు. -
పాపం బాబర్ ఆజం.. ఇంగ్లండ్ బౌలర్ దెబ్బకు మైండ్ బ్లాంక్! వీడియో వైరల్
ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో 26 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. కీలకమ్యాచ్‌లో పరాజయం పాలైన పాకిస్తాన్ 2-0 తేడాతో చారిత్రాత్మక టెస్టు సిరీస్‌ను కోల్పోయింది. ఇక ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బౌలర్ ఓలీ రాబిన్సన్ సంచలన బంతితో మెరిశాడు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంను రాబిన్సన్ అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆఫ్ సైడ్ పడిన బంతి అద్భుతంగా టర్న్ అవుతూ స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో బాబర్ ఒక్క సారిగా షాక్‌కు గురయ్యాడు. ఇక కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన ఆజం నిరాశతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో టెస్టు కరాచీ వేదికగా డిసెంబర్ 17 నుంచి ప్రారంభం కానుంది. చదవండి: ENG vs PAK: ఇదేం బుద్ధి? స్టోక్స్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వని పాక్ క్రికెటర్! వీడియో వైరల్ -
దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు.. జట్టును ప్రకటించిన ఇంగ్లండ్
దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో ఘోర పరాజయం పాలైన ఇంగ్లండ్.. ఇప్పడు రెండో టెస్టుకు సిద్దమైంది. గరువారం మాంచెస్టర్ వేదికగా ప్రోటీస్-ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు జరగనుంది. కాగా ఈ టెస్టు కోసం ఇంగ్లండ్ తమ తుది జట్టును బుధవారం ప్రకటించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగనుంది. తొలి టెస్టుకు దూరమైన ఓలీ రాబిన్సన్ తుది జట్టులోకి వచ్చాడు. అదే విధంగా గత కొన్ని మ్యాచ్‌ల నుంచి వరుసగా విఫలమవుతున్న ఓపెనర్ జాక్ క్రాలీకీ మళ్లీ చోటుదక్కడం గమానార్హం. ఇక తొలి టెస్టులో విజయం సాధించిన ప్రోటీస్.. ఈ మ్యాచ్‌లో కూడా గెలుపొంది సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. కాగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రోటీస్ జట్టు 1-0తో అధిక్యంలో ఉంది. దక్షిణాఫ్రికాతో రెండో టెస్టుకు ఇంగ్లండ్ జట్టు: అలెక్స్ లీస్, జాక్ క్రాలే, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), ఆలీ రాబిన్సన్, జాక్ లీచ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్ చదవండి: Asia Cup 2022: ఆసియా కప్ టోర్నీలో పాల్గొనబోయే టీమ్‌లు.. అన్ని జట్ల ఆటగాళ్ల వివరాలు -
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్.. జట్టును ప్రకటించిన ఇంగ్లండ్!
దక్షిణాఫ్రికాతో తొలి రెండు టెస్టులకు 14 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. ఇక గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న పేసర్ ఓలీ రాబిన్సన్ను ఈ సిరీస్‌కు ఇంగ్లండ్ సెలక్టర్లు ఎంపిక చేశారు. రాబిన్సన్ చివరగా ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాపై ఆడాడు. అదే విధంగా కొవిడ్ కారణంగా న్యూజిలాండ్‌తో అఖరి రెండు టెస్టులకు దూరమైన వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ కూడా ఈ సిరీస్‌తో తిరిగి జట్టులోకి రానున్నాడు. దీంతో వికెట్ కీపర్ సామ్ బిల్లింగ్స్ వేటు పడింది. ఇక ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్‌లో ఘోర పరాభావం, విండీస్ పర్యటనలో ఓటమి చవిచూసిన తర్వాత ఇంగ్లండ్ టెస్టుల్లో అద్భుతంగా రాణిస్తోంది. నూతన కెప్టెన్ బెన్ స్టోక్స్, కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ నేతృత్వంలో ఇంగ్లండ్ జట్టు విజయాలతో దూసుకుపోతుంది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన ఇంగ్లండ్.. భారత్‌తో జరిగిన ఏకైక టెస్టులోను తమ జోరును కొనసాగించింది. ఇక స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఇంగ్లండ్ మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. ఇరు జట్లు మధ్య లార్డ్స్ వేదికగా ఆగస్టు17 జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికాతో టెస్టులకు ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమ్స్ ఆండర్సన్, జానీ బెయిర్‌స్టో, స్టువర్ట్ బ్రాడ్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలీ, బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), జాక్ లీచ్, అలెక్స్ లీస్, క్రెయిగ్ ఓవర్టన్, మాథ్యూ పాట్స్, ఆలీ పోప్, ఆలీ రాబిన్సన్, జో రూట్. చదవండి: Rohit Sharma Retired-Hurt: రోహిత్ శర్మ రిటైర్డ్ హర్ట్.. బీసీసీఐ కీలక అప్డేట్.. ఆసియా కప్‌కు దూరమయ్యే చాన్స్ -
Ashes 2021-22 Live: స్పిన్ బౌలింగ్ చేసిన ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్.. వీడియో వైరల్
ఆడిలైడ్ వేదికగా జరుగుతున్న యాషెస్ రెండో టెస్ట్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ ఓలీ రాబిన్సన్ సన్ గ్లాసెస్ పెట్టుకుని స్పిన్ బౌలింగ్ చేస్తూ అందరనీ ఆశ్చర్యపరుస్తూ స్పిన్ బౌలింగ్ చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకుండానే ఇంగ్లండ్ బరిలోకి దిగింది. దీంతో ఆ జట్టు కెప్టెన్ జో రూట్ పార్ట్ టైమ్ స్పిన్నర్‌గా బౌలింగ్ చేస్తున్నాడు. అయితే రూట్ గాయం కారణంగా 4వ రోజు మొదటి సెషన్లో ఫీల్డ్‌లోకి రాలేదు. దీంతో రాబిన్సన్ స్పిన్నర్‌గా అవతారం ఎత్తాడు. స్పిన్ బౌలింగ్ చేసిన రాబిన్సన్ను క్రికెట్ దిగ్గజాలు షేన్ వార్న్,స్టీవ్ వా ప్రశంసించారు. ఇక రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా పట్టు బిగిస్తుంది. రెండో ఇన్నింగ్స్‌లో 230-9 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన అధిక్యంతో కలుపుకుని 468 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందు ఉంచింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 473 పరుగుల సాధిచంగా, ఇంగ్లండ్ 236 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకు 237 పరుగుల ఆధిక్యం ఆసీస్‌కు లభించింది. ఆస్ట్రేలియా విజయానికి 7 వికెట్ల దూరంలో ఉండగా, ఇంగ్లండ్ ఇంకా 391 పరుగులు వెనుకబడి ఉంది, మ్యాచ్ ప్రస్తుతం జరుగుతోంది. చదవండి: IPL 2022: ఒడిశా ఆటగాడికి బంఫర్ ఆఫర్.. ఏకంగా చెన్నై సూపర్ కింగ్స్‌కు! England pacer Ollie Robinson bowling off spin 🤯😂 #Ashes #Ashes2021pic.twitter.com/ado3C7MC0V — CRICKET VIDEOS 🏏 (@AbdullahNeaz) December 19, 2021 -
Eng Vs IND: 5 వికెట్లతో చెలరేగిన రాబిన్సన్.. వీడియోలు
లీడ్స్: లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా పోరాటం ముగిసింది. నాలుగు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్లు ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో భారత్ జట్టుని ఓడించింది. ఓవర్‌నైట్ స్కోరు 215/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా 278 పరుగులకే ఆలౌటైంది. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌ని ఇంగ్లండ్ 1-1తో సమం చేసింది. కాగా ఇంగ్లండ్ విజయంలో ఫాస్ట్ బౌలర్ ఓలీ రాబిన్సన్ కీలక పాత్ర పోషించాడు. టీమిండియా మిడిలార్డర్‌ను కుప్పకూల్చాడు. 5 వికెట్లతో చెలరేగిన రాబిన్సన్ భారత పతనాన్ని శాసించాడు. ఈ సిరీస్‌లో రెండో 5 వికెట్ల హాల్ సాధించాడు. పుజారా వికెట్‌తో కథ మొదలు మ్యాచ్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే చతేశ్వర్ పుజారా (91) ఓలి రాబిన్సన్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయి శతకం చేజార్చుకున్నాడు. తర్వాత కొద్దిసేపటికే కోహ్లీ ఔట్ అయ్యాడు. ఇక అక్కడినుంచి భారత్ వికెట్ల పతనం మొదలైంది. ఇంగ్లండ్ పేసర్ల ధాటికి ఒక్కరు కూడా క్రీజులో నిలవలేకపోయారు. అజింక్య రహానే (10), రిషబ్ పంత్ (1), మహ్మద్ షమీ (6), ఇషాంత్ శర్మ (2), రవీంద్ర జడేజా (30), మహమ్మద్ సిరాజ్ (0) కనీస పోరాటం చేయకుండా వెనుదిరిగారు. జస్ప్రీత్ బుమ్రా (1) నాటౌట్‌గా నిలిచాడు. చివర్లో జడేజా (30) కొద్ది సేపు బౌండరీలతో అలరించినా ఫలితం లేకుండా పోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో రాబిన్సన్ ఐదు వికెట్లు తీయగా,క్రెయిగ్ ఓవర్టన్ మూడు వికెట్లు తీశాడు. జేమ్స్ అండర్సన్, మొయిన్ అలీ చెరో వికెట్ ఖాతాలో వేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో మొత్తం 7 వికెట్లు తీసిన రాబిన్సన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. లండన్ వేదికగా సెప్టెంబర్ 2 నుంచి నాలుగో టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. చదవండి: చరిత్ర సృష్టించిన ఆండర్సన్.. ఆ ఘనత సాధించిన ఒకే ఒక్కడు YESSSS Robbo!! Scorecard/Videos: https://t.co/UakxjzUrcE 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/gs7dV73IE3 — England Cricket (@englandcricket) August 28, 2021 COME OOOOON!!! 🦁 Scorecard & Clips: https://t.co/UakxjzUrcE 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/5y1atU7ZhF — England Cricket (@englandcricket) August 28, 2021 The winning moment!! 🙌https://t.co/UakxjzUrcE 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/zHsifDHw7q — England Cricket (@englandcricket) August 28, 2021 For his match haul of 7️⃣ wickets, Ollie Robinson is named Player of the Match 💥#WTC23 | #ENGvIND pic.twitter.com/W2K7AqkX0K — ICC (@ICC) August 28, 2021 A gorgeous delivery from Moeen Ali. #ENGvIND pic.twitter.com/POKvjpxxfc — Wisden (@WisdenCricket) August 28, 2021 -
తొమ్మిదేళ్ల కిందట ట్వీట్లు.. ఇప్పుడు శిక్ష!
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం న్యూజిలాండ్ సిరీస్‌లో రాణిస్తున్న ఆల్‌రౌండర్ ఓలీ రాబిన్సన్ను అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం ప్రకటించింది. ఈ మేరకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఒక ప్రకటన రిలీజ్ చేసింది. అయితే ఇందుకు కారణం గతంలో అతను చేసిన ఫ్రస్ట్రేషన్ ట్వీట్లే. లండన్: ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ రాబిన్సన్ 2012-13లో తన ట్విట్టర్ అకౌంట్లో జాత్యాంహకార, సెక్సీయెస్ట్ ట్వీట్లు చేశాడు. కానీ, ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. కాగా, న్యూజిలాండ్ సిరీస్‌కు రాబిన్సన్ ఎంపిక కాగానే కొందరు అప్పటి ట్వీట్లను తెరపైకి తీసుకొచ్చారు. దీంతో పెద్ద రచ్చే అయ్యింది. ఇక జూన్ 3న ప్రారంభమైన తొలి టెస్ట్(మ్యాచ్ డ్రా అయ్యింది)కి ముందే ఈ వివాదంపై స్పందించిన రాబిన్సన్.. ‘‘నేను చేసిన పనికి బాధపడుతున్నా. అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు నేను సిగ్గుపడుతున్నాను’’ అని రాబిన్సన్ బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పాడు. నా కెరీర్ అత్యంత ఘోరమైన దశలో ఉన్నప్పుడు ఫ్రస్ట్రేషన్లో ఆ ట్వీట్లు చేశా, ఇంగ్లీష్ కౌంటీ యార్క్‌షైర్ నన్ను యుక్తవయసులో తరిమేసింది. ఆ ట్వీట్లు ఇప్పటికీ ఉన్నాయో లేదో నాకు తెలియదు. ప్రజలకు, నా సహచర ఆటగాళ్లకు.. అందరికీ క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను’’ అని రాబిన్సన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. కమిటీ రిపోర్ట్ ఆధారంగానే.. న్యూజిలాండ్‌తో గత బుధవారం ఆరంభమైన తొలి టెస్టుతో ఇంగ్లండ్ టీమ్‌లోకి అరంగేట్రం చేసిన రాబిన్సన్.. రెండు ఇన్నింగ్స్‌ల్లో 7 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లో 42 పరుగులు చేశాడు. అయితే మ్యాచ్ జరుగుతుండగానే ఈసీబీ అతని ట్వీట్స్‌పై విచారణ కోసం ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీని నియమించే ముందు ‘రేసిజం కామెంట్లను ఏమాత్రం సహించబోము’’ అని ఈసీబీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కమిటీ అందించిన రిపోర్ట్ ప్రకారం.. రాబిన్సన్పై క్రమశిక్షణ చర్యల కింద ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి సస్పెండ్ చేస్తూ ఈసీబీ నిర్ణయం తీసుకుంది. దాంతో.. ఈ టాలెంటెడ్ ఆల్‌రౌండర్ కెరీర్ సంగ్ధిగ్దంలో పడినట్లయ్యింది. చదవండి: ఏడేళ్ల గ్యాప్ తర్వాత టెస్ట్ -
యోగిబాబు కామెడీ హైలెట్‌గా..!
నాడైనా, నేడైనా, ఏనాడైనా కామెడీ చిత్రాలకు కాసుల వర్షం కురుస్తుంది. నేల విడిసిన సాము కాకపోతే వినోదభరిత చిత్రాలకు ప్రేక్షకులు విజయాలను అందించడం ఖాయం. అలాంటి చిత్రంగా కడలై పోడ ఒరు పొన్ను వేణుం ఉంటుందంటున్నారు ఆ చిత్ర దర్శకుడు ఆనంద్‌రాజన్. ఆర్జీ మీడియా పతాకంపై డీ.రాబిన్సన్ నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రంలో యోగిబాబు కామెడీ హైలైట్‌గా ఉంటుందంటున్నారు దర్శకుడు ఆనంద్‌రాజన్. దీని గురించి ఆయన తెలుపుతూ నటుడు యోగిబాబును మరో కోణంలో చూపించే చిత్రంగా కడలై పోడ ఒరు పొన్ను వేణుం ఉంటుందన్నారు. సాధారణంగా కామెడీని వృత్తి గా చేసే యోగిబాబు, ఈ చిత్రంలో ఆయన చేసే వృత్తే కామెడీగా ఉంటుందన్నారు. ఆ వృత్తిలో ఆయనకు కుడి ఎడమగా యువతులు పని చేస్తుంటారని వారిని ప్రేమలో దించడానికి యోగిబాబు చేసే ప్రయత్నాలు వినోదభరితంగా ఉంటాయని చెప్పారు. అలా యోగిబాబు చేతిలో చిక్కిన హీరో ఆజార్ ఆయన నుంచి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు జాలీగా ఉంటాయన్నారు. బుల్లితెరపై ప్రాచుర్యం పొం దిన నటుడు ఆజార్ వెండితెరకు పరిచయం అవుతున్న ఈ చిత్రం ఆయనకు మంచి పేరు తెచ్చి పెడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇందులో సాజిత్, మన్సూర్అలీఖా న్, సెంథిల్, స్వామినాథన్, దీనా, మనోహర్, కాజల్ ముఖ్య పాత్రల్లో నటించినట్లు చెప్పారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ త్వరలోనే నిర్వహించనున్నట్లు దర్శకుడు ఆనంద్‌రాజన్ తెలిపారు. దీనికి జిపిన్ సంగీతం, జే.హరీశ్ ఛాయాగ్రహణను అందిస్తున్నారు. -
ఐదు నిమిషాల్లో లక్షాధికారి
మల్లాది వెంకట కృష్ణమూర్తి క్రైమ్ కథలు - 11 రాబిన్సన్ తన మేనల్లుడితో కోపంగా చెప్పాడు. ‘‘థామస్! నీ గురించే నేను మాట్లాడేది. నీ ప్రవర్తన, నీ మిత్రులు, నీ జీవితం విధానం నాకు నచ్చలేదు. మీ నాన్న నీ ఎస్టేట్‌కి నన్ను ధర్మకర్తగా నియమించాడు. విల్లు రాయబోయే ముందు మనం ముగ్గురం ఈ విషయం స్పష్టంగా మాట్లాడుకున్నాం. నీకు ఏడాదికి పదివేల డాలర్లు సరిపోతుంది. నీకు ముప్ఫై ఐదో యేడు వచ్చేదాకా నువ్వు ఆ ఆస్తిని ముట్టుకోలేవు.’’ ‘‘సారీ అంకుల్. నేను చాలా మారాను’’ థామస్ తనలోని కోపాన్ని బయటికి కనపడనివ్వకుండా జవాబు చెప్పాడు. ‘‘కాని నీలో నాకామార్పు కనపడడం లేదు. ఇంకో ఏడేళ్లదాకా నీకు ఏటా పదివేల డాలర్లు మించి అదనంగా ఏం ఇవ్వను. నీకు ఏడాదికి పదివేలు చాలలేదంటే, ఖర్చు చేయడానికి నీకు చాలా తీరిక ఉందని అర్థం. కాబట్టి ఉద్యోగంలో చేరు. కొంత ఆదాయం రావడమే కాక, ఖర్చు చేయడానికి సమయం కూడా బాగా తగ్గుతుంది’’ రాబిన్సన్ కోపంగా చెప్పాడు. తన అంకుల్ని హత్య చేయాలన్న ఆలోచన థామస్‌కి ఆ క్షణంలో కలిగింది. రెండు వారాలపాటు రాబిన్సన్ రొటీన్‌ని పరిశీలిస్తూ ఆయన్ని ఎలా చంపాలా అని ఆలోచించాడు. ఇంట్లో ఆయన ఎప్పుడూ ఒంటరిగా ఉండడు. పనివాళ్లు ఇద్దరైనా ఆయనతో ఉంటారు. అరవై ఏళ్లొచ్చినా ఇంకా బ్రహ్మచారే కాబట్టి బయటి క్లబ్లో, రెస్టారెంట్లో, పార్టీల్లో ప్రతి చోటా ఒకరిద్దరు మిత్రులు తప్పనిసరిగా ఆయన వెంట ఉంటారు. రాత్రి పడకగదిలో ఒంటరిగా ఉంటాడు. కాని తొమ్మిది దాటాక తను ఆ ఇంట్లో ఉండకూడదనే నియమాన్ని విధించాడు. బహుశ తనకి ఇప్పుడు కలిగిన ఈ ఆలోచన ఆయనకి ఎప్పుడో తట్టి, తన జాగ్రత్త కోసం ఆ నియమం విధించాడని థామస్‌కి అనిపించింది. రెండు వారాల తర్వాత తన అంకుల్ సహజ మరణం పొందాలి తప్ప చంపడం కష్టం అనుకున్నాడు. ఒకవేళ విజయవంతంగా చంపినా అనుమానం ముందుగా తనమీదకే మళ్లుతుందని కూడా థామస్‌కి తెలుసు. ఆయన మరణం వల్ల లాభం పొందేది ప్రపంచంలో తనొక్కడే అని అందరికీ తెలుసు. ఓ సాయంత్రం అతని సమస్యని థామస్ ప్రియురాలు ఫిలిన్ శ్రద్ధగా విన్నది. ఆమెది ఆకర్షణీయమైన పర్సనాలిటీ. సైకాలజీలో కాలేజీ డిగ్రీ ఉంది. థామస్ చేసిన ప్రతిపాదనకి ఆమె షాక్ అవలేదు. రాబిన్సన్ని చంపడం తమ సమస్యకి పరిష్కారం అని అంగీకరించింది. ‘‘లేదా నేను ఆఫీసులో గుమస్తాగా ఇంకో ఏడేళ్లు జీవించాలి. చంపటం దారుణం. కాని భావి జీవితం ఆనందకరంగా సాగాలంటే ఒకటి, రెండు తప్పులు చేయక తప్పదు. కాబట్టి నీ సహాయం కావాలి’’ కోరాడు. ‘‘అలాగే. తన మిత్రుల శవపేటికలని మోయడం మీ అంకుల్ హాబీ. ఓ తెలివైన అమ్మాయి ఆయన్ని తన శవపేటికలోకి పంపగలదు’’ ఫిలిన్ చెప్పింది. ‘‘ఎవరు?’’ ‘‘నాలాంటిది. నేను మూడు నెలల్లో ఆ పని చేయగలను. ఈ ముసలి బ్రహ్మచారుల గురించి నాకు బాగా తెలుసు. కాని అందువల్ల నాకు అదనపు లాభం ఏమిటి?’’ ‘‘నువ్వు ధనవంతురాలివైన విధవరాలివి అవుతావు. ఆయన పేరగల ఇన్స్యూరెన్స్ నామినేషన్లో నా పేరు కొట్టేసి మీ పెళ్లవగానే నీ పేరుని పెడతాడు అని హామీ.’’ ‘‘ఏడాదికి ఏభైవేల డాలర్లతో ఎలా జీవించగలను? అది షాంపేన్కి మాత్రమే సరిపోతుంది. ఆయన పోతే నీకెంత లాభం వస్తుంది?’’ ‘‘ఏభై లక్షల డాలర్లు. కాని అది మా నాన్న ఆస్తి తప్ప ఆయనది కాదని నీకు తెలుసు.’’ ‘‘ఆయన పోయిన ఆరు నెలలకి నువ్వు నన్ను పెళ్లిచేసుకుంటానని మాట ఇస్తావా మరి?’’ ఫిలిన్ కోరింది. ‘‘నువ్వు లేకుండా నేను జీవించలేను. జీసస్మీద ఒట్టు. నేను ప్రతీ ఆదివారం చర్చికి వెళ్తూంటాను’’ థామస్ అబద్ధం ఆడాడు. ఆ తర్వాతి సంఘటనలు థామస్ ఎదురు చూసిన దానికన్నా వేగంగా జరిగిపోయాయి. ఓ రోజు థామస్ సెంట్రల్ పార్క్‌లో రాబిన్సన్కి ఫిలిన్ని పరిచయం చేశాడు. కొద్దినిమిషాల తర్వాత సెల్‌ఫోన్ మోగింది. మాట్లాడి అర్జెంట్ పనిమీద వెళ్లాలని చెప్పి థామస్ వెళ్లిపోయాడు. ఫిలిన్ ఆయన్ని తన మాటలతో కూడా ఆకర్షించింది. వారంలో రాబిన్సన్ ఆమెని నాటకశాలకి తీసుకెళ్లాడు. రెండు వారాల తర్వాత ఒంటరిగా నివసించే ఆమె అపార్ట్మెంట్కి వెళ్లాడు. నెలన్నర తర్వాత వారి పెళ్లి నిశ్చయం అయింది. ఈ నెలన్నర థామస్‌కి ఫోన్ ద్వారా ఫిలిన్ తను సాధించే అభివృద్ధిని వివరిస్తూనే ఉంది. పెళ్లయ్యాక నూతన దంపతులు యూరప్‌కి హనీమూన్‌కి వెళ్లివచ్చారు. పెళ్లయిన రాబిన్సన్ నిత్యం షేర్ బ్రోకర్ల ఆఫీసులకి వెళ్లడం, క్లబ్‌కి, రెస్టారెంట్లకి వెళ్లడం ఆగిపోయాయి. మంచి భర్తలా ఆయన తన సమయాన్ని తన భార్యతోనే ఇంట్లో గడుపుతున్నాడు. ఆయన థామస్‌ని తన ఇంటికి పెళ్లయ్యాక మొదటిసారి ఆహ్వానించాడు. అంకుల్ని చూసి థామస్ ఆశ్చర్యపోయాడు. ఆయనలో కొత్త శక్తి కనిపించింది. ఇదివరకటి కంటే ఉత్సాహంగా ఉన్నాడు. ఓ పదిహేనేళ్లు వయసు తగ్గినట్లుగా, ఇంకో పాతికేళ్లు జీవించేట్లుగా కూడా కనిపించాడు. కాని ఫిలిన్కి పదేళ్లు పెరిగినట్లుగా కనిపించింది. కళ్లకింద వలయాలు. గోళ్లకి రంగు వేసుకోలేదు. ఐనా ఉత్సాహంగానే కనిపించింది. ఏభై లక్షల డాలర్లకి తను వారసుడైతే తన భార్యగా ఆమె పనికిరాదని థామస్ ఆరోజే నిర్ణయించు కున్నాడు. వారిద్దరి మధ్య కొన్ని నిమిషాల ఏకాంతమే దొరికింది. ‘‘మనం ఆ పని త్వరగా చేయాలి థామస్. నేను మీ అంకుల్ని ఎక్కువ కాలం భరించలేను. లేదా నేను సహజ మరణాన్ని పొందుతాను. నేను వంట నేర్చుకోవాల్సి వచ్చింది. అంట్లు తోమాలి’’ ఆవేదనగా చెప్పింది. తన పథకాన్ని వివరించింది. కార్ పార్క్‌లో దొంగిలించిన లెసైన్స్ ప్లేట్లని తన కారుకి అమర్చుకుని థామస్ గురువారం రాత్రి పదకొండున్నరకి తన అంకుల్ ఇంటికి కొద్దిదూరంలో కారు ఆపాడు. కారు దిగి వంటగది వెనక తలుపులోంచి లోపలికి వెళ్లాడు. ఫిలిన్ చెప్పినట్లుగానే లోపల గడియ పెట్టలేదు. ‘‘లేవండి. కింద చప్పుడైంది’’ ఫిలిన్ భర్తని నిద్రలేపింది. ఆయనకీ చప్పుడు వినిపించడంతో డ్రాయర్లోని రివాల్వర్ని అందుకుని తలుపు తెరుచుకుని బయటికి వచ్చాడు. ఆయన మొదటి మెట్టుమీద ఉండగా చీకట్లో దాక్కున్న థామస్ వెనక నుంచి ఆయన తలమీద సుత్తితో బలంగా మోదాడు. ఆయన పెద్దగా మూలుగుతూ మెట్లమీంచి కిందికి దొర్లిపోయాడు. మూలుగు సన్నగా వినిపిస్తోంది. తర్వాతి పథకం అంతా థామస్ అనుకున్నట్లుగానే జరిగింది- కొంతదాకా. థామస్ కొంత విలువైన సామానుని తీసుకుని, కిటికీ అద్దం బయటినుంచి పగలగొట్టి పారిపోవాలి. తద్వారా దొంగమీదకి అనుమానం మళ్లుతుంది. ఫిలిన్ వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తుంది. కాని ఏభై లక్షల వారసుడయ్యాక మళ్లీ ఫిలిన్ మరణిస్తే పోలీసులకి తనమీద అనుమానం కలగచ్చు. దొంగ కేవలం భర్తనే చంపి భార్యని ఎందుకు చంపకుండా వెళ్తాడు? తనామెని పెళ్లి చేసుకోకపోతే జీవితాంతం తనని బ్లాక్ మెయిల్ చేయచ్చు. అతని పథకం కొంతదాకానే జరిగింది. ఫిలిన్ చేతిలోని తనకి గురిపెట్టబడ్డ రివాల్వర్ని చూసి ఆశ్చర్యపోయాడు. ‘‘నన్ను చంపి ఏమిటి ప్రయోజనం?’’ అడిగాడు. ‘‘ఏభై లక్షల డాలర్లు.’’ ‘‘కాని మా నాన్న ఆ ట్రస్ట్‌ని నాకు రాశాడు. నీకు కాదు.’’ ‘‘కావచ్చు. నీ తర్వాత ఎవరికి వెళ్తుంది? నీ అంకులే నీ వారసుడు. ఆయన తర్వాత? ఆయన వారసురాలైన నాకు.’’ ‘‘నా అంకుల్ ముందు చచ్చాడు. తర్వాత నేను చస్తే, ఇక ఆయన నా ఆస్తికి వారసుడు ఎలా అవుతాడు?’’ ‘‘ఆయన కన్నా ముందుగా నువ్వు చస్తావు. తర్వాత ఆయన. పది క్షణాల తర్వాత చచ్చినా సరే, నీ ఆస్తికి నీ అంకుల్ వారసుడై చస్తాడు.’’ ‘‘మూర్ఖురాలా! కాని అది ఎలా ఋజువు చేయగలవు?’’ ‘‘మావారి అరుపు విని వస్తే, చేతిలో సుత్తితో చీకట్లో కనపడ్డ వ్యక్తిని రెండుసార్లు కాల్చి చంపాను. తర్వాత మావారి దగ్గరికి వెళ్తే డాక్టర్‌కి ఫోన్ చేయమని చెప్పారు. ఫోన్ చేసి, ఆయన ఇంకా జీవించే ఉన్నారని, వెంటనే రమ్మని చెప్తాను. వారు రావడానికి పది క్షణాల ముందే పోయారని చెప్తాను.’’ ‘‘ఇదన్యాయం ఫిలిన్.’’ థామస్ దీనంగా అర్థించాడు. ‘‘నువ్వు నీ అంకుల్‌కి ఏభై లక్షలకోసం ఏం చేశావో అదే పాఠాన్ని నేను నేర్చుకున్నాను థామస్ గుర్తుందా? ‘చంపటం దారుణం. కాని భావి జీవితం ఆనందకరంగా సాగాలంటే ఒకటి, రెండు తప్పులు చేయక తప్పదు’ అని నువ్వే బోధించావు. గుడ్ బై!’’ ఫిలిన్ చేతిలోని రివాల్వర్ రెండుసార్లు పేలింది. గురి తప్పకుండా రెండూ అతని గుండెని ఛేదించాయి. తర్వాత ఆమె టెలిఫోన్ వైపు నడిచింది. - (జేమ్స్ క్రాన్ కథకి స్వేచ్ఛానువాదం)