నాడైనా, నేడైనా, ఏనాడైనా కామెడీ చిత్రాలకు కాసుల వర్షం కురుస్తుంది. నేల విడిసిన సాము కాకపోతే వినోదభరిత చిత్రాలకు ప్రేక్షకులు విజయాలను అందించడం ఖాయం. అలాంటి చిత్రంగా కడలై పోడ ఒరు పొన్ను వేణుం ఉంటుందంటున్నారు ఆ చిత్ర దర్శకుడు ఆనంద్‌రాజన్. ఆర్‌జీ మీడియా పతాకంపై డీ.రాబిన్సన్ నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది.
ఈ చిత్రంలో యోగిబాబు కామెడీ హైలైట్‌గా ఉంటుందంటున్నారు దర్శకుడు ఆనంద్‌రాజన్. దీని గురించి ఆయన తెలుపుతూ నటుడు యోగిబాబును మరో కోణంలో చూపించే చిత్రంగా కడలై పోడ ఒరు పొన్ను వేణుం ఉంటుందన్నారు. సాధారణంగా కామెడీని వృత్తి గా చేసే యోగిబాబు, ఈ చిత్రంలో ఆయన చేసే వృత్తే కామెడీగా ఉంటుందన్నారు. ఆ వృత్తిలో ఆయనకు కుడి ఎడమగా యువతులు పని చేస్తుంటారని వారిని ప్రేమలో దించడానికి యోగిబాబు చేసే ప్రయత్నాలు వినోదభరితంగా ఉంటాయని చెప్పారు.
అలా యోగిబాబు చేతిలో చిక్కిన హీరో ఆజార్ ఆయన నుంచి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు జాలీగా ఉంటాయన్నారు. బుల్లితెరపై ప్రాచుర్యం పొం దిన నటుడు ఆజార్ వెండితెరకు పరిచయం అవుతున్న ఈ చిత్రం ఆయనకు మంచి పేరు తెచ్చి పెడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇందులో సాజిత్, మన్సూర్‌అలీఖా న్, సెంథిల్, స్వామినాథన్, దీనా, మనోహర్, కాజల్ ముఖ్య పాత్రల్లో నటించినట్లు చెప్పారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ త్వరలోనే నిర్వహించనున్నట్లు దర్శకుడు ఆనంద్‌రాజన్ తెలిపారు. దీనికి జిపిన్ సంగీతం, జే.హరీశ్ ఛాయాగ్రహణను అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment