తమ్ముడి ప్రేమ కోసం యువతి కుటుంబాన్ని ఒప్పించిన యోగి బాబు Actor Yogi Babu helps his brother Vijayan with his love marriage. Sakshi
Sakshi News home page

తమ్ముడి ప్రేమ కోసం యువతి కుటుంబాన్ని ఒప్పించిన యోగి బాబు

Published Sat, Jun 8 2024 10:28 AM | Last Updated on Sat, Jun 8 2024 12:22 PM

Yogi Babu Brother Love Marriage

తమిళ చిత్రసీమలో చాలా కష్టపడి విజయం సాధించిన ప్రముఖ హాస్య నటుల్లో యోగి బాబు ఒకరు. కమెడియన్ గానే కాకుండా కథానాయకుడిగా పలు చిత్రాల్లో రాణిస్తున్నాడు. తాను కథానాయకుడిగా నటించిన చిత్రాలకు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చినా.. ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే కథానాయకుడిగా నటిస్తానని చెబుతూ ఇతర చిత్రాల్లో హాస్య పాత్రల్లో ఆయన నటిస్తున్నాడు.

సినిమా కెరియర్‌ ప్రారంభంలో ఛాన్స్‌ల కోసం వెతుకుతున్న సమయంలో భోజనానికి కూడా ఇబ్బంది పడ్డాడు. ఎలాగైనా తన కుటుంబాన్ని మంచి ఉన్నత స్థానంలో ఉంచాలని ఆయన నిరంతరం శ్రమించాడు. తన కలలను నిజం చేసుకున్న యోగిబాబు.. నేడు చెన్నైలోనే చాలా స్థలాలు, ఇళ్లు ఉన్నాయి. కోట్లలో రెమ్యునరేషన్‌ తీసుకునే స్థాయికి ఎదిగాడు. ఆర్థికంగా బాగా స్థిరపడిన తర్వాత యోగి బాబు 2020లో భార్గవిని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ జంటకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. గతేడాదే యోగి బాబు తన బిడ్డ మొదటి పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నాడు.

అయితే, ఈ నేపథ్యంలో యోగి బాబు ఇంట్లో మరో విచిత్రం చోటుచేసుకుంది. నటుడు యోగిబాబు తమ్ముడు విజయన్‌ ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన మైసూర్‌కు చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. తమిళ చిత్రసీమలో దర్శకుడిగా ఎదగాలని విజయన్‌ ఉన్నాడు. ఈ క్రమంలో యోగి బాబు కాల్‌షీట్‌తో సహా  ఆయనకు సంబంధించిన అన్ని వ్యవహారాలను విజయన్‌ చూసుకునేవాడు.  అతడికి ఫేస్‌బుక్ ద్వారా ఓ అమ్మాయి పరిచయం కావడం ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమలో పడటం జరిగింది. అయితే, వీరిద్దరీ సామాజిక వర్గాలు వేర్వేరు కావడంతో పెళ్లిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

దీంతో యోగి బాబు నేరుగా మహిళ కుటుంబీకులను సంప్రదించి వారిని ఒప్పించి పెళ్లికి ఏర్పాట్లు చేశారు. జూన్ 3వ తేదీన యోగి బాబు స్వగ్రామం సెయ్యర్‌లో వీరి వివాహం చాలా సింపుల్‌గా రహస్యంగా జరింపించారు. ఈ వివాహానికి బంధువులు, స్నేహితులు మాత్రమే హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే, ఈ ఫోటోలు ఆయన ఫ్యాన్స్‌ నెట్టింట షేర్‌ చేస్తున్నారు. తమ్ముడి ప్రేమ వివాహాన్న దగ్గరుండి జరిపించిన యోగిబాబును వారందరూ ప్రశంసిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement