తొమ్మిదేళ్ల కిందట ట్వీట్లు.. ఇప్పుడు శిక్ష! | Racist And Sexist Tweets ECB Suspends Ollie Robinson | Sakshi
Sakshi News home page

ఫ్రస్ట్రేషన్​ ట్వీట్లపై రాబిన్​సన్​ సారీ.. పట్టించుకోని బోర్డు​

Published Mon, Jun 7 2021 2:03 PM | Last Updated on Mon, Jun 7 2021 2:14 PM

Racist And Sexist Tweets ECB Suspends Ollie Robinson - Sakshi

ఇంగ్లండ్​ క్రికెట్​ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం న్యూజిలాండ్ సిరీస్​లో రాణిస్తున్న ఆల్‌రౌండర్ ఓలీ రాబిన్‌సన్‌ను అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం ప్రకటించింది. ఈ మేరకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఒక ప్రకటన రిలీజ్ చేసింది. అయితే ఇందుకు కారణం గతంలో అతను చేసిన ఫ్రస్ట్రేషన్​ ట్వీట్లే.  

లండన్​: ఇంగ్లండ్​ ఆల్​రౌండర్​ రాబిన్​సన్​ 2012-13లో తన ట్విట్టర్​ అకౌంట్​లో జాత్యాంహకార, సెక్సీయెస్ట్ ట్వీట్లు చేశాడు. కానీ, ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు.  కాగా, న్యూజిలాండ్‌ సిరీస్​కు రాబిన్​సన్​ ఎంపిక కాగానే కొందరు అప్పటి ట్వీట్లను తెరపైకి తీసుకొచ్చారు. దీంతో పెద్ద రచ్చే అయ్యింది. ఇక జూన్ 3న ప్రారంభమైన తొలి టెస్ట్(మ్యాచ్​ డ్రా అయ్యింది)కి ముందే ఈ వివాదంపై స్పందించిన రాబిన్​సన్.. ‘‘నేను చేసిన పనికి బాధపడుతున్నా. అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు నేను సిగ్గుపడుతున్నాను’’ అని రాబిన్‌సన్‌ బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పాడు.  

నా కెరీర్​ అత్యంత ఘోరమైన దశలో ఉన్నప్పుడు ఫ్రస్ట్రేషన్​లో ఆ ట్వీట్లు చేశా, ఇంగ్లీష్ కౌంటీ యార్క్‌షైర్ నన్ను యుక్తవయసులో తరిమేసింది. ఆ ట్వీట్లు ఇప్పటికీ ఉన్నాయో లేదో నాకు తెలియదు. ప్రజలకు, నా సహచర ఆటగాళ్లకు.. అందరికీ క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను’’ అని రాబిన్‌సన్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

కమిటీ రిపోర్ట్​ ఆధారంగానే..
న్యూజిలాండ్‌తో గత బుధవారం ఆరంభమైన తొలి టెస్టుతో ఇంగ్లండ్​ టీమ్‌లోకి అరంగేట్రం చేసిన రాబిన్సన్.. రెండు ఇన్నింగ్స్‌ల్లో 7 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లో 42 పరుగులు చేశాడు. అయితే మ్యాచ్‌ జరుగుతుండగానే ఈసీబీ అతని ట్వీట్స్‌పై విచారణ కోసం ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీని నియమించే ముందు ‘రేసిజం కామెంట్లను ఏమాత్రం సహించబోము’’ అని ఈసీబీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కమిటీ అందించిన రిపోర్ట్ ప్రకారం.. రాబిన్సన్‌‌పై క్రమశిక్షణ చర్యల కింద ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి సస్పెండ్ చేస్తూ ఈసీబీ నిర్ణయం తీసుకుంది. దాంతో.. ఈ టాలెంటెడ్​ ఆల్​రౌండర్​ కెరీర్​ సంగ్ధిగ్దంలో పడినట్లయ్యింది.

చదవండి: ఏడేళ్ల గ్యాప్​ తర్వాత టెస్ట్​

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement