racism
-
కాంగ్రెస్‌కు శామ్ పిట్రోడా రాజీనామా
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి శామ్ పిట్రోడా బుధవారం(మే8) సాయంత్రం రాజీనామా చేశారు. పిట్రోడా రాజీనామా చేసిన వెంటనే పార్టీ దానిని ఆమోదించింది. భారత్‌లోని వివిధ ప్రాంతాల వారి శరీర రంగులపై పిట్రోడా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా ఉంటారనడంపై దుమారం రేగింది. పిట్రోడా వ్యాఖ్యలతో తమ పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. పిట్రోడా వ్యాఖ్యలను ప్రధాని మోదీ కూడా ఎన్నికల ప్రచార సభలో ప్రస్తావించడంతో వివాదం పెద్ద దైంది. మొత్తం వ్యవహారం పిట్రోడా రాజీనామాతో క్లైమాక్స్‌కు చేరింది. -
UK Prime Minister: చిన్నతనంలో వివక్షకు గురయ్యా: సునాక్
లండన్: చిన్నతనంలో జాతి వివక్షకు గురయినట్లు భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ వెల్లడించారు. ఇంగ్లిష్ ఉచ్చారణలో యాస లేకుండా తన తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పారు. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను వెల్లడించారు. ‘చిన్నప్పుడు జాతి వివక్షకు గురయ్యా. నాతోబుట్టువుల నుద్దేశించి కొందరు చేసిన వెటకారం, వెక్కిరింపులను ప్రత్యక్షంగా చూశా. ఎంతో బాధేసింది’అని సునాక్ బాల్యాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. ఇప్పుడు తన పిల్లలు జాతి వివక్షను ఎదుర్కోవడం లేదని అన్నారు. తన భారతీయ వారసత్వం గురించి చెబుతూ సునాక్... ఆకారం, రూపం ఒక అవరోధంగా మారకూడదని తల్లిదండ్రులు తమకు చెప్పేవారన్నారు. భారతీయ తరహా యాస బయటపడకుండా మాట్లాడాలని వారు పదేపదే చెప్పేవారు. మేం మాట్లాడే భాషపై వారు ప్రత్యేకంగా దృష్టి పెట్టేవారు. అలా, సరైన అభ్యాసంతో బ్రిటిష్ యాసను మేం సరిగ్గా అనుకరించ గలిగేవాళ్లం. అది చూసి మా అమ్మ చాలా సంతోషించారు’అని సునాక్ అన్నారు. జాత్యహంకార ధోరణి ఏ రూపంలోనిదైనా ఆమోదం యోగ్యం కాదని రిషిసునాక్ చెప్పారు. -
మిస్ జపాన్‌గా ‘ఉక్రెయిన్’ యువతి!
టోక్యో: ఆమె పేరు కరోలినా షినో. వయసు 26 ఏళ్లు. ప్రఖ్యాత మోడల్. తాజాగా జరిగిన మిస్ నిప్పన్ (జపాన్ పాత పేరు) పోటీల్లో విజేతగా నిలిచింది. ఆమె మిస్ జపాన్ కిరీటం నెగ్గడంపై దేశమంతటా విపరీతమైన చర్చ జరుగుతోంది. ఆమె జన్మతః ఉక్రేనియన్ కావడమే ఇందుకు కారణం! షినోకు ఐదేళ్ల వయసులో ఆమె తల్లి ఓ జపనీయున్ని పెళ్లాడింది. ఆ వెంటనే తల్లితో పాటు ఆమె ఉక్రెయిన్ వీడి జపాన్ వచ్చేసింది. గతేడాదే షినోకు జపాన్ పౌరసత్వం కూడా లభించింది. తాను నూరుపాళ్లు జపాన్ పౌరురాలినేనని షినో చెబుతోంది. ‘‘కాకపోతే ఆ గుర్తింపు కోసం ఏళ్ల తరబడి పోరాడాల్సి వచి్చంది. పదేపదే జాతి వివక్షను ఎదుర్కొన్నా. మిస్ జపాన్ కిరీటం దక్కినందున ఆ అవమానాలకు ఇకనైనా తెర పడుతుందనే అనుకుంటున్నా’’ అంటూ ఆశాభావం వెలిబుచ్చింది. జపాన్ భిన్న జాతులకు ఆలవాలం. గతంలోనూ విదేశీ మూలాలున్న పలువురు మిస్ జపాన్ కిరీటం నెగ్గారు. -
భారతీయ యాసను వెక్కిరించిన కానిస్టేబుల్
లండన్: ఫిర్యాదు చేసేందుకు ఫోన్ చేసిన ఒక మహిళ భారతీయ యాసను వెక్కిరించిన పోలీస్ కానిస్టేబుల్‌ను బ్రిటన్ క్రమశిక్షణా ట్రిబ్యూనల్ విధుల నుంచి తప్పించింది. గత ఏడాది నవంబర్ 29వ తేదీ జరిగిన ఘటన తాలూకు కేసులో పోలీసు ప్యాట్రిక్ హ్యారిసన్‌ను దోషిగా తేలుస్తూ లండన్‌లోని ట్రిబ్యూనల్ తీర్పుచెప్పింది. గత నెలలో తీర్పువెలువగా వివరాలు తాజాగా బహిర్గతమయ్యాయి. వెస్ట్ యార్క్‌షైర్ పోలీస్ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేసే ప్యాట్రిక్ ఘటన జరిగిన రోజు లండన్‌లోని ఫోర్స్ కాల్సెంటర్లో విధుల్లో ఉన్నాడు. తనపై ఒకరు విద్వేష నేరానికి పాల్పడ్డారంటూ ఒక మహిళ ఈ కాల్‌సెంటర్‌కు ఫోన్‌చేసి ఫిర్యాదుచేసింది. ఫిర్యాదును పట్టించుకోకుండా ప్యాట్రిక్ ఆమె మాట్లాడే భారతీయ యాసను వెక్కిరించడం మొదలెట్టాడు. అసలది విద్వేష నేరమని ఎందుకు అనుకుంటున్నావ్? అని భారతీయ యాసను అనుకరిస్తూ వెటకారంగా మాట్లాడాడు. ఫోన్ కట్‌చేశాక ఆమె ఫిర్యాదుచేస్తుందేమోనని భయపడ్డాడు. ఆమెకు వేరే నంబర్ నుంచి ఫోన్ చేసి ఆమె ఏం అనుకుందోనని ఆరాతీశాడు. ప్యాట్రక్ చర్యతో విసిగిపోయిన ఆమె ‘టెల్ మామా’కు ఫిర్యాదుచేసింది. బ్రిటన్‌లో ముస్లింవ్యతిరేక ఘటనలపై ప్రభుత్వం ‘టెల్ మామా(ఎంఏఎంఏ–మెజరింగ్ యాంటీ ముస్లిం అటాక్స్) ప్రాజెక్ట కింద చర్యలు తీసుకుంటోంది. ఈ ఉదంతంలో ప్యాట్రిక్ వైఖరిని ట్రిబ్యూనల్ తీవ్రంగా తప్పుబట్టింది. ‘15 ఏళ్లపాటు విధుల్లో ఉంటూ కూడా అధికారం, హోదాను మరిచి మహిళతో అనుచితంగా మాట్లాడాడు. ఈయన వైఖరితో ప్రజల్లో పోలీసుల పట్ల నమ్మకం, విశ్వాసం తగ్గిపోతాయి. ఇది మొత్తం పోలీసు వ్యవస్థకే అప్రతిష్ట. జాతి వివక్ష, ఇస్లామోఫోబియా దేశవ్యాప్తంగా పోలీసుల్లో గూడుకట్టుకోవడం ఆందోళనకరం’’ అని ట్రిబ్యూనల్ ఆగ్రహం వ్యక్తంచేసింది. అతడిని విధుల నుంచి తప్పించింది. -
‘మెటా’పై తీవ్ర ఆరోపణలు! కేసు వేసిన ఉద్యోగిని
Lawsuit on Meta: యూఎస్ టెక్ దిగ్గజం మెటా (Meta) జాతి వివక్షకు పాల్పడుతోందని, ఆసియన్లను చిన్నచూపు చూస్తోందని ఆరోపిస్తూ వైష్ణవి జయకుమార్ అనే సింగపూర్‌కు చెందిన భారతీయ సంతతి ఉద్యోగిని కాలిఫోర్నియా పౌర హక్కుల విభాగంలో దావా వేశారు. 2020 జనవరిలో మెటా కంపెనీలో చేరిన ఆమె అంతకు ముందు డిస్నీ, గూగుల్, ట్విటర్ సంస్థల్లో పనిచేశారు. ప్రమోషన్లలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించినందుకు తనను తక్కువ అనుభవం ఉన్న ఉద్యోగుల కింద చేర్చి అవకాశాలు లేకుండా చేశారని వైష్ణవి వాపోయారు. ఆసియన్ మహిళ అయిన తనపై ఎలా జాతి వివక్ష చూపారో వైష్ణవీ జయకుమార్ ఇటీవలి లింక్డ్ఇన్ పోస్ట్‌లో రాశారు. గత నెలలో మాస్ లేఆఫ్‌ల రూపంలో తనను ఉద్యోగం నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. మెటా కంపెనీలో యూత్ పాలసీ హెడ్‌గా ఉన్న వైష్ణవీ జయకుమార్ మెటా యాప్‌లన్నింటిలో వయసు ఆధారిత పాలసీలు, ఉత్పత్తి లక్షణాలపై పనిచేసే బృందానికి నాయకత్వం వహించేవారు. మొదటి రెండేళ్లు అంతా బాగానే జరిగిందని, ఆ తర్వాత ప్రమోషన్ గురించి అడిగినప్పుడు జాతి వివక్షను ఎదుర్కొన్నట్లు వైష్ణవి పేర్కొన్నారు. తన మేనేజర్ ఉన్నట్టుండి జాతి వివక్ష చూపడం ప్రారంభించారని చెప్పుకొచ్చారు. తనకు ఇతర అభ్యర్థుల కంటే ఎక్కువ అనుభవం ఉన్నప్పటికీ నాయకత్వ బాధ్యతలకు తాను సీనియర్ని కానంటూ యాజమాన్యానికి తప్పుడు నివేదిక ఇచ్చారని వాపోయారు. ఎగ్జిక్యూటివ్ స్థాయిలో 25 శాతమే.. వైష్ణవీ జయకుమార్ తన దావాలో ఆసియా, పసిఫిక్ ద్వీపవాసుల నిపుణుల నెట్వర్క్ ‘అసెండ్’ 2022లో చేసిన ఒక అధ్యయనాన్ని ప్రస్తావించారు. దాని ప్రకారం మెటా కంపెనీలోని మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 49 శాతం మంది ఆసియన్లు ఉంటే ఎగ్జిక్యూటివ్ స్థాయిలో 25 శాతం మంది మాత్రమే ఆసియన్లు ఉన్నారు. 2022 చివరి నాటికి మెటా కంపెనీ 11,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. ఈ ఏడాది మార్చిలో మరో రౌండ్ మాస్ లేఆఫ్‌లలో మరో 10,000 మందికి ఉద్వాసన పలికింది. సిలికాన్ వ్యాలీలో దీర్ఘకాలంగా ఉన్న జాతి వివక్షకు వ్యతిరేకంగా చర్య తీసుకోవాలని కోరుతూ టెక్ పరిశ్రమలో ఆసియా అమెరికన్లు దాఖలు చేసిన అనేక వ్యాజ్యాలలో వైష్ణవీ జయకుమార్ వేసిన దావా కూడా ఒకటి. అయితే ఈ ఆరోపణలపై మెటా కంపెనీ వర్గాల నుంచి ఇంతవరకు ఎటువంటి వివరణ రాలేదు. ఇదీ చదవండి: ఎలాన్ మస్క్‌పై కోర్టులో దావా: ఇష్టమొచ్చినట్లు తొలగించడం కాదు.. కట్టు రూ. 4వేల కోట్లు! -
విస్తుపోయే నిజాలు.. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు క్షమాపణ
క్రికెట్ ప్రపంచాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) క్షమాపణ కోరడం ఆసక్తి కలిగించింది. ఇంగ్లండ్ క్రికెట్లో జాతి వివక్ష ఎదుర్కొన్న ప్రతీ బాధితుడు లేదా బాధితురాలికి ప్రత్యేకంగా క్షమాపణ కోరుతూ సోమవారం రాత్రి ఈసీబీ లేఖను విడుదల చేసింది. జాతి వివక్షపై ఇండిపెండెంట్ కమీషన్ ఫర్ ఈక్విటీ ఇన్ క్రికెట్(ICEC) నివేదికను ఈసీబీకి సమర్పించింది. ఈ రిపోర్టులో వివక్ష వల్ల ఎదుర్కొన్న దుష్ప్రవర్తనకు సంబంధించి విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. మార్పులకు సంబంధించి 44 ప్రతిపాదనలను ఐసీఈసీ రిపోర్టులో పొందుపరిచింది. నివేదిక ప్రకారం.. '' ఇంగ్లండ్ క్రికెట్లో వివక్ష జరిగిన మాట నిజమే. బ్లాక్‌లైవ్ మ్యాటర్స్, మీటూ తరహాలో ఇక్కడా నల్లవారికి అవమానాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో 85 శాతం భారత సంతతికి చెందిన బాధితులే ఉండడం గమనార్హం. ఇది తీవ్రమైన చర్యగా భావిస్తున్నాం. నిర్మాణాత్మక, సంస్థాగత జాత్యహంకారం, లింగవివక్ష-వర్గ-ఆధారిత వివక్ష నుంచి విముక్తి పొందలేకపోయారు.'' అంటూ ఐసీఈసీ తన రిపోర్టులో పేర్కొంది. కాగా రిపోర్టును పరిశీలించిన ఈసీబీ తప్పుకు క్షమాపణ కోరుతూ తక్షణమే మార్పులు చేపడతామని తెలిపింది. ''క్రికెట్ అనేది అందరి గేమ్. ఇక్కడ వివక్షకు తావులేదు. ఇలాంటివి మళ్లీ జరగకుండా త్వరలోనే కొత్త చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఐసీఈసీ పేర్కొన్న విధంగా జాతి వివక్ష పేరుతో మహిళలకు, నల్ల జాతీయులకు జరిగిన అవమానాలను పట్టించుకోలేదు. అందుకు క్షమాపణ కోరుతున్నాం. ఇలాంటివి ఉపేక్షించం. ఐసీఈసీ పేర్కొన్న 44 రికమెండేషన్స్‌ను పరిశీలించాం. వచ్చే మూడు నెలల్లో ICEC ప్రతిపాదించిన 44 సిఫార్సులకు ఒక బలమైన ప్రణాళికను రూపొందించడానికి ప్రయత్నిస్తాం.'' అంటూ ఈసీబీ చైర్మన్ రిచర్డ్ థాంప్సన్ పేర్కొన్నారు. Read our response to the Independent Commission for Equity in Cricket which finds evidence of discrimination across the game. We apologise unreservedly for the experiences of those who have faced discrimination in cricket. https://t.co/vOpqMLmuoK — England and Wales Cricket Board (@ECB_cricket) June 26, 2023 చదవండి: #RohitSharma: 'పోటీ తీవ్రంగా ఉంది.. అంత సులభం కాదు; కష్టపడతాం' -
దిష్టిబొమ్మ దహనం.. ఐదు లక్షల జరిమానా; రెండేళ్ల నిషేధం
బ్రెజిల్ స్టార్, రియల్ మాడ్రిడ్ ఫుట్‌బాలర్ వినిషియస్ జూనియర్‌కు అభిమానుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. స్పానిష్ లీగ్‌లో భాగంగా మే21న జరిగిన మ్యాచ్‌లో వినిషియస్‌కు వ్యతిరేకంగా కొంతమంది అభిమానులు దిష్టిబొమ్మను దహనం చేయడంతో పాటు ''Go Back To Your Country'' అంటూ నినాదాలు చేశారు. అయితే ఈ ఘటనపై స్పెయిన్ యాంటీ వయొలెన్స్ కమీషన్ సీరియస్ అయింది. లైవ్ మ్యాచ్ సమయంలో ఒక సాకర్ ప్లేయర్‌పై జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడంతో పాటు దిష్టిబొమ్మ దహనం చేసినందుకు 60,001 యూరోలు (భారత కరెన్సీలో దాదాపు రూ. ఐదు లక్షల జరిమానా, రెండేళ్ల నిషేధం విధించింది. నల్లజాతీయుడైన వినిషియస్ జూనియర్ కు ఈ వివక్ష కొత్తేం కాదు. ఐదేళ్ల క్రితం బ్రెజిల్ నుంచి స్పెయిన్‌కు వచ్చినప్పటి నుంచి అతను జాతి వివక్షను ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఈ ఏడాది జనవరిలో రియల్ మాడ్రిడ్, అట్లెటికో మాడ్రిడ్ మధ్య మ్యాచ్‌లోనూ జూనియర్ వినిషియస్ వివక్షకు గురయ్యాడు. స్పానిష్ క్లబ్ అయిన వెలెన్సియా నినాదాలు చేసిన ముగ్గురు అభిమానులకు జరిమానా విధించడంతో పాటు ఒక ఏడాది స్టేడియంలోకి అడుగుపెట్టకుండా నిషేధించింది. అయితే తాజాగా ఏడుగురు అభిమానులు జూనియర్ వినిషయస్కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో అతని కళ్ల ముందే దిష్టిబొమ్మను తగలబెట్టడం ఎంతో బాధించింది. Ya que los que deberían no te explican qué es y qué puede hacer @LaLiga en los casos de racismo, hemos intentado explicártelo nosotros, pero no te has presentado a ninguna de las dos fechas acordadas que tú mismo solicitaste. Antes de criticar e injuriar a @LaLiga, es necesario… https://t.co/pLCIx1b6hS pic.twitter.com/eHvdd3vJcb — Javier Tebas Medrano (@Tebasjavier) May 21, 2023 Vinicius Jr ALL GOALS AND ASSISTS so far this season, let me know if i missed anything.pic.twitter.com/QY3IMI6ygW — Druchk (@andruchk) May 28, 2023 చదవండి: వివాదంలో గుజరాత్ టైటాన్స్ క్రికెటర్ యష్ దయాల్ -
ఐదేళ్ల వయసులో జాతి వివక్ష.. కట్‌చేస్తే స్టార్ క్రికెటర్ హోదా
ఉస్మాన్ ఖవాజా.. ఆస్ట్రేలియా క్రికెటర్‌గా మాత్రమే చాలా మందికి పరిచయం. కానీ ఖవాజా క్రికెటర్‌గా మాత్రమే గాక సోషల్ యాక్టివిస్ట్ కూడా. ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్లో కొనసాగుతున్న నల్లజాతీయ క్రికెటర్ అతను. ఖవాజా ఐదేళ్ల వయసులో అతని కుటుంబం ఆస్ట్రేలియాకు వలస వచ్చింది. ఖవాజా తండ్రి కర్రీ మేకర్‌గా పనిచేసి కుటుంబాన్ని పోషించాడు. తన ఐదేళ్ల వయసులో ఖవాజా .. 'Fuking Curry Maker Son' అంటూ జాతి వివక్షకు గురయ్యాడు. అలా జాతి వివక్షను తొలిసారిగా ఎదుర్కొన్న ఉస్మాన్ ఖవాజా ఆ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నాడు. ఖవాజా ఒక క్రికెటర్‌గా రాణిస్తూనే నల్లజాతీయులపై జరిగిన వివక్షకు వ్యతిరేకంగా నిలబడి తన పోరాటాన్ని కొనసాగించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఖవాజా పౌండేషన్ పేరుతో చారిటీ సంస్థను స్థాపించి మైనారిటీలకు, వలసదారులకు, శరణార్థులకు, మానసికంగా కుంగిపోయిన చిన్నారులకు ఆశ్రయం కల్పించాడు. అలా కర్రీ మేకర్ కొడుకు ఇవాళ స్టార్ క్రికెటర్ హోదా సంపాదించాడు. వ్యక్తిగతంగాను నలుగురికి సహాయపడే పనులు చేస్తూ జీవితంలో ముందుకు సాగుతున్నాడు. ఆస్ట్రేలియా టెస్టు ఓపెనర్‌గా రాణిస్తున్న ఉస్మాన్ ఖవాజా టీమిండియాతో జరగనున్న బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో జట్టుకు కీలకం కానున్నాడు. గాయం కారణంగా కొంతకాలం ఆటకు దూరమైన ఖవాజా గతేడాది నుంచి టెస్టుల్లో స్థిరమైన ప్రదర్శన కనబరుస్తూ వస్తున్నాడు. ఇటీవలే ఆస్ట్రేలియన్ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. అయితే వీసా సమస్య కారణంగా జట్టుతో పాటు రాలేకపోయిన ఖవాజా ఒకరోజు ఆలస్యంగా భారత్ గడ్డపై అడుగుపెట్టాడు. వచ్చీ రాగానే ప్రాక్టీస్‌లో తలమునకలయ్యాడు. పశ్చిమాసియా మూలాలున్న క్రికెటర్ కావడంతో ఖవాజా స్పిన్‌ను సమర్థంగా ఆడగలడు. ఇదే అతన్ని ఈ టెస్టు సిరీస్‌కు ప్రత్యేకంగా నిలబెట్టింది. భారత్ లాంటి ఉపఖండపు పిచ్‌లపై ఖవాజా లాంటి బ్యాటర్ సేవలు చాలా అవసరం. ఫిబ్రవరి 9న నాగ్‌పూర్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. ఇప్పటికే ఇరుజట్లు తమ ప్రాక్టీస్‌ను ప్రారంభించాయి.ఈ టెస్టు సిరీస్ టీమిండియాకు చాలా కీలకం. ఇప్పటికే డబ్ల్యూటీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరుకుంది. ఆసీస్‌తో సిరీస్‌ను టీమిండియా గెలిస్తేనే డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే చాన్స్ ఉంటుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 10 టెస్టుల్లో గెలుపు, ఒక ఓటమి, నాలుగు డ్రాలతో కలిపి 75.56 పర్సంటైల్ పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. ఐదు టెస్టుల్లో గెలుపు, నాలుగింటిలో ఓటమి, ఒక డ్రాతో కలిపి 58.93 పర్సంటైల్ పాయింట్లతో టీమిండియా రెండో స్థానంలో ఉంది. The two facets of the Usman Khawaja Foundation: 1: Allowing kids from low socio-economic backgrounds to play sport for free 2: Giving grants, scholarships and things needed for kids' education Both close to Khawaja's ❤️ pic.twitter.com/REQ6CzAQcP — 7Cricket (@7Cricket) January 30, 2023 చదవండి: భారత్‌తో తొలి టెస్టు.. ఆస్ట్రేలియాకు బిగ్‌షాక్! భార్యకు చిత్రహింసలు.. మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీపై ఎఫ్ఐఆర్ నమోదు -
ఫస్ట్‌క్లాస్ టికెటెలా కొన్నాడో?
ముంబై: లండన్ హిత్రూ విమానాశ్రయంలో తనకు జాతి వివక్ష అనుభవం ఎదురైందని ప్రముఖ బాలీవుడ్ నటుడు సతీశ్ షా చెప్పారు. ఫస్ట్‌క్లాస్‌లో ప్రయాణానికి టికెటెలా కొన్నాడంటూ ఇద్దరు ఎయిర్‌పోర్టు సిబ్బంది తనను ఉద్దేశించి మాట్లాడుకున్నారని తెలిపారు. భారతీయుడిని కాబట్టి కొన్నానంటూ నవ్వుతూ బదులిచ్చానని వెల్లడించారు. సతీశ్ ట్వీట్ వైరల్‌గా మారింది. 12,000 లైక్‌లు రాగా 1,300 మంది రీట్వీట్ చేశారు. భారతీయుడిని కాబట్టి ఖరీదైన టికెట్ కొన్నానంటూ సతీశ్ షా జవాబు చెప్పడం పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు. బ్రిటిషర్లు భారత్‌ను 200 ఏళ్లపాటు పాలించకపోతే ఇప్పుడు భారతీయులకు ఇంగ్లాండ్ ఒక కాలనీగా మారి ఉండేదని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డారు. సతీశ్ షా ను హిత్రూ విమానాశ్రయం ట్విట్టర్లో క్షమాప ణ కోరింది. ఆ సంఘటనకు సంబంధించిన ఇతర వివరాలు ఉంటే ఇవ్వాలని విన్నవించింది. -
బకింగ్‌హాం ప్యాలెస్ రేసిజం ఉదంతం: నేనూ రేసిజం బాధితున్నే.. రిషి సునాక్
లండన్: జాత్యహంకార భూతం తననూ బాధించిందని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ వెల్లడించారు. భారత మూలాలున్న ఆయన బ్రిటన్‌లోనే పుట్టి పెరగడం తెలిసిందే. ‘‘బాల్యంలో, పెరిగి పెద్దవుతున్న దశలో నేను రేసిజాన్ని ఎదుర్కొన్నా. అయితే ఈ సామాజిక సమస్యను ఎదుర్కొనే విషయంలో నాటితో పోలిస్తే బ్రిటన్ ఇప్పుడు ఎంతో ప్రగతి సాధించింది’’ అని అభిప్రాయపడ్డారు. బకింగ్‌హాం ప్యాలెస్‌లో తాజాగా రేసిజం ఉదంతం వెలుగులోకి రావడం తెలిసిందే. దివంగత రాణి ఎలిజబెత్ 2 సన్నిహితురాలు, ప్రిన్స్ విలియం గాడ్‌మదర్ లేడీ సుసాన్ హసీ ప్యాలెస్‌లో పని చేస్తున్న ఒక ఆఫ్రికన్ ఉద్యోగిని పదేపదే ఆమె స్వస్థలం గురించి గుచ్చిగుచ్చి ప్రశ్నించారు. ‘‘నేను బ్రిటిషర్నే అని ఎన్నిసార్లు చెప్పినా ఆఫ్రికాలో ఎక్కడి నుంచి వచ్చానంటూ సుసాన్ నన్ను పదేపదే నిలదీసింది. నా జుట్టును పక్కకు తోసి మరీ నా నేమ్ బ్యాడ్జ్‌ను పట్టి పట్టి చూసింది. ఇది నన్నెంతో బాధించింది’’ అంటూ సదరు ఉద్యోగి ట్వీట్ చేయడంతో వివాదం రేగింది. చివరికి సుసాన్ క్షమాపణలు చెబుతూ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇది చాలా బాధపడాల్సిన విషయమని బకింగ్‌హాం ప్యాలెస్ పేర్కొంది. జాత్యహంకారానికి బ్రిటిష్ సమాజంలో స్థానం లేదంటూ ప్రిన్స్ విలియం దంపతులు కూడా ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో రిషి మీడియాతో మాట్లాడుతూ తన వ్యక్తిగత అనుభవాన్ని వివరించారు. ‘‘రేసిజం ఎక్కడ కన్పించినా తీవ్రంగా వ్యతిరేకించాల్సిందే. దాన్ని తుదముట్టించే దిశగా చేయాల్సింది ఇంకా ఎంతో ఉంది. గతం నుంచి పాఠాలు నేర్చుకుంటూ మెరుగైన భవిష్యత్తు దిశగా సాగాలి’’ అన్నారు. -
ఇండియాకు వెళ్లిపో.. ప్రమీలా జయపాల్‌పై దూషణ పర్వం
సియాటెల్: ఇండో-అమెరికన్ కాంగ్రెస్ఉమెన్ ప్రమీలా జయపాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఫోన్ చేసి మరీ ఓ వ్యక్తి ఆమెను దూషించాడు. అంతేకాదు జాతివివక్ష, జాత్యాహంకారం ప్రదర్శిస్తూ.. ఆమెను ఇండియాకు వెళ్లిపోవాలంటూ బెదిరించాడు. ఇందుకు సంబంధించి ఐదు ఆడియో క్లిప్పులను అమెరికా చట్టసభ్యురాలైన ఆమె తన ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. మరీ అభ్యంతకరంగా, పరుష పదజాలంతో ప్రమీలా జయపాల్‌ను దూషించాడు ఆ వ్యక్తి. అంతేకాదు పుట్టిన దేశానికే వెళ్లిపోవాలంటూ ఆమెను బెదిరించాడు కూడా. ఇదిలా ఉంటే.. ఈ మధ్యకాలంలో అమెరికాలో స్థిరపడిన భారతీయులపై జాత్యహంకారం ప్రదర్శిస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఘటనలపై చర్యలు చేపడుతున్నప్పటికీ.. పరిస్థితుల్లో మార్పు మాత్రం రావడం లేదు. Typically, political figures don't show their vulnerability. I chose to do so here because we cannot accept violence as our new norm. We also cannot accept the racism and sexism that underlies and propels so much of this violence. pic.twitter.com/DAuwwtWt7B — Rep. Pramila Jayapal (@RepJayapal) September 8, 2022 చెన్నైలో పుట్టిన ప్రమీలా(55).. సియాటెల్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అమెరికా ప్రతినిధుల సభ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న తొలి ఇండో-అమెరికన్(డెమొక్రటిక్ పార్టీ తరపున) కూడా ఈమెనే. అయితే ఆమెకు ఇలాంటి అనుభవం ఎదురు కావడం మొదటిసారేం కాదు. ఈ ఏడాది సమ్మర్లో.. సియాటెల్‌లోని ఆమె ఇంటి బయట గన్‌తో ఓ వ్యక్తి వీరంగం వేశాడు. ప్రమీలా కుటుంబ సభ్యుల్ని దూషిస్తూ.. బెదిరింపులకు దిగాడు. దుండగుడ్ని బ్రెట్ ఫోర్సెల్ (49)గా గుర్తించి.. పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదీ చదవండి: ఆ డాక్టర్ ఏకంగా హౌస్ కీపర్‌ని పెళ్లి చేసుకుంది! -
పరాన్నజీవులూ, వెళ్లిపొండి.. అమెరికన్ జాత్యహంకార వ్యాఖ్యలు
లండన్: అమెరికాలో భారతీయ మహిళలపై జాత్యహంకార వివక్ష ఘటన మరవకముందే పోలండ్‌లోనూ అలాంటి ఉదంతమే వెలుగు చూసింది. రాజధాని వార్సాలో ఓ షాపింగ్ మాల్ వద్ద అమెరికా పర్యాటకుడు ఒక భారతీయుడిని జాత్యహంకార ప్రశ్నలతో వేధిస్తూ తీసిన వీడియో వైరల్‌గా మారింది. ‘‘నేను అమెరికా పౌరుడిని. అందుకే అమెరికాలో మాత్రమే ఉంటాను. అమెరికా మీ వాళ్లతో నిండిపోతోంది. నువ్వెందుకు పోలండ్ వచ్చావు? పోలండ్‌ను సైతం భారతీయులతో నింపేస్తారా? మీ సొంత దేశానికి పోరెందుకు? మా దేశాలను ఎందుకు ముంచెత్తుతున్నారు? మీకు భారతదేశముందిగా. మీ దేశాన్ని ఎందుకు సుసంపన్నం చేసుకోరు? కష్టపడి సంపన్నంగా మార్చుకున్న మా దేశాలకు ఎందుకొస్తున్నారు? పోలండ్‌లోనూ స్థిరపడటం ఈజీ అనుకుంటున్నారా? మీ సొంత దేశానికెందుకు వెళ్లరు? మీరంతా మా జాతిని నాశనం చేస్తున్నారు. నువ్వో ఆక్రమణదారువు. పరాయిదేశంలో బతికే పరాన్నజీవివి. ఇక్కడి నుంచి వెళ్లిపో. మీరు మా యూరప్‌లో ఉండొద్దు. పోలండ్ పోలిష్ జాతీయులదే’’ అంటూ వాగ్వాదానికి దిగాడు. అతన్ని ‘గోయిమ్ టీవీ’ అనే విద్వేష గ్రూప్‌నకు సారథ్యం వహిస్తున్న జాన్ మినడియో జూనియర్‌గా గుర్తించారు. -
మహిళపై జాత్యాంహకార వివక్ష కలకలం! కేటీఆర్ ఆగ్రహం!
ప్రపంచంలోనే అతి పెద్ద ఫర్నీచర్ అమ్మకాల సంస్థ ఐకియా వివాదంలో చిక్కుకుంది. ఐకియా సిబ్బంది జాత్యంహకార వ్యాఖ్యలకు పాల్పడ్డారు. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐకియా తీరును తప్పుబట్టారు. ఐకియా బాధితులకు క్షమాపణలు చెప్పాలని ఆదేశించారు. నితిన్ సేథి జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఈ తరుణంలో ఆదివారం రోజు నితిన్ సేథి భార్య, మణిపూర్‌కు చెందిన అకోలిజం సునీతా గచ్చిబౌలీ ఐకియా స్టోర్‌కి వచ్చారు. కావాల్సిన వస్తువుల్ని కొనుగోలు చేసి తిరిగి వెళుతుండగా కౌంటర్లో ఉన్న సిబ్బంది తమపై జాత్యంహకార వ్యాఖ్యలు చేసినట్లు బాధితురాలు ట్వీట్ చేసింది. I was one of the many who bought stuffs at @IKEAIndia Hyderabad today. but i was the only one whose purchased items were checked one by one. if this is not #racism then what is it? the senior staffs there were far from helpful. does @IKEA endorse such behavior? https://t.co/DAeYW6hP2E — akoijam sunita (@akoi_Jam) August 28, 2022 'ఈరోజు హైదరాబాద్ ఐకియా స్టోర్ సిబ్బంది నేను మాత్రమే కొనుగోలు చేసిన వస్తువులను ఒక్కొక్కటిగా తనిఖీ చేశారు. అక్కడి సిబ్బంది సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇది జాత్యహంకారం కాకపోతే అది ఏమిటి? అని ప్రశ్నించారు.పైగా పేరుతో పిలిచి అవమానించారని అన్నారు. @IKEA ఇటువంటి సిబ్బంది ప్రవర్తనను సమర్థిస్తారా? అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. నాభార్యకు అవమానం జరిగింది నితిన్ సేథి సైతం ఐకియా స్టోర్‌లో తన భార్య సునీతాకు జరిగిన అవమానంపై ట్వీట్ చేశారు. నా భార్య షాపింగ్ బ్యాగ్‌లను తనిఖీ చేసే వ్యక్తి..ఈ వస్తువుల్ని మేం కూడా కొన్నాం అంటూ నవ్వాడు. మమ్మల్ని ఒంటరిగా ఉంచారు. అడిగితే సమాధానం ఇవ్వలేదు. పట్టించుకోలేదు. పైగా ఐకియా స్టోర్‌లో పనిచేసే సూపర్ వైజర్లు..అవునా కావాలంటే పోలీసుల్ని పిలవండి. మేం వారితో మాట్లాడతామని అన్నారు. ఇది ఇక్కడితో ముగియలేదు. ప్రజలు ఎదుర్కొంటున్న రోజువారీ జాత్యహంకారం అంటూ ట్వీట్ చేశారు. This is appalling and absolutely unacceptable @IKEAIndia Please ensure a proper apology is issued & more importantly educate, sensitise & train your staff to respect all your customers graciously Hope you will make amends asap https://t.co/l84GimoIrM — KTR (@KTRTRS) August 29, 2022 కేటీఆర్ ఆగ్రహం ఈ ట్వీట్ వైరల్ కావడంతో మంత్రి కేటీఆర్ స్పందించారు. ఐకియా సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నితిన్ సేథికి క్షమాణలు చెప్పాలని, కస్టమర్లతో ఎలా వ్యవహరించాలో సిబ్బందికి అవగాహన కల్పించాలని యాజమాన్యానికి సూచిస్తూ ట్వీట్ చేశారు. కేటీఆర్ ట్వీట్, నితిన్ సేథి ట్వీట్‌పై ఐకియా యాజమాన్యం స్పందించింది. స్టోర్ల వద్ద సమానత్వం మానవ హక్కుగా భావిస్తాం. ఇక్కడ జాత్యహంకారం, పక్షపాతాలకు తావులేదని తెలిపింది. బాధితులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని ట్వీట్ చేసింది. -
రాస్ టేలర్ సంచలన ఆరోపణలు.. కివీస్‌కున్న ట్యాగ్‌లైన్ ఉత్తదేనా!
న్యూజిలాండ్‌కు క్రికెట్లో ఎలాంటి వివాదాలు లేని జట్టు అనే పేరుంది. అందుకు తగ్గట్లే జట్టులోని ఆటగాళ్లు తమ హుందాతనాన్ని చూపిస్తారు. ఇప్పటివరకు కివీస్ ఆటగాళ్లు ప్రత్యర్థి ఆటగాళ్లతో గొడవ పడ్డ దాఖలాలు కానీ.. కవ్వింపు చర్యలకు పాల్పడడం గానీ ఎరిగింది లేదు. ఒకవేళ జరిగినా కూడా గుర్తుంచుకునేంత పెద్దవి కావు. అలాంటి న్యూజిలాండ్‌కు "కూల్ జట్టు" అనే ట్యాగ్‌లైన్ ఉంది. ఇటీవలే కివీస్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్ తన 16 ఏళ్ల కెరీర్‌కు ముగింపు పలికాడు. తాజాగా తన ఆటోబయోగ్రఫీ ద్వారా న్యూజిలాండ్ క్రికెట్‌పై ఒక బాంబు పేల్చాడు. డ్రెస్సింగ్‌రూమ్‌లో తోటి ఆటగాళ్లచే తాను వివక్ష ఎదుర్కొన్నట్లు "రాస్ టేలర్ బ్లాక్ అండ్ వైట్"లో సుధీర్ఘంగా పేర్కొన్నాడు. టేలర్ వ్యాఖ్యలు ప్రస్తుతం కివీస్ క్రికెట్లో సంచలనం కలిగిస్తోంది. టేలర్ వ్యాఖ్యలతో కివీస్‌కున్న ట్యాగ్‌లైన్ ఉత్తదేనా అనిపిస్తుంది. "నా 16 ఏళ్ల కెరీర్ అంతా సక్రమంగా జరిగిందనేది మాత్రమే బయట ప్రపంచానికి తెలుసు. కానీ డ్రెస్సింగ్ రూమ్‌లో మీకు తెలియని వివక్ష ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నా. కివీస్ క్రికెట్‌కు మంచి పేరు ఉంది. దానిని నేను చెడగొట్టదలచుకోలేను. కానీ సొంతజట్టుకు చెందిన కొందరు క్రికెటర్లు.. నా మొహం గురించి కామెంట్ చేసేవారు. నువ్వు న్యూజిలాండ్‌కు ఆడుతున్నప్పటికి నీలో ఆసియా మూలాలు కనిపిస్తున్నాయి. పొరపాటు మా దేశంలో క్రికెట్ ఆడుతున్నావనుకుంటా అని పేర్కొనేవాళ్లు. రాస్.. నువ్వు సగం మాత్రమే మంచోడివి.. మిగతా సగం ఏంటనేది నువ్వే నిర్ణయించుకో అని ఒక తోటి క్రికెటర్ హేళన చేసేవాడు. ఇదంతా డ్రెస్సింగ్‌రూమ్ వరకు మాత్రమే పరిమితం. మళ్లీ మైదానంలోకి వచ్చామంటే అంతా మాములే. అందుకే న్యూజిలాండ్ క్రికెట్లో వివక్ష ఎక్కడా కంటికి కనబడదు.. కానీ అంతా తెరవెనుక జరుగుతుంది. అందుకే మా డ్రెస్సింగ్‌రూమ్‌ను నేను ఒక బారోమీటర్‌గా అభివర్ణిస్తున్నా. మొదట్లో అలా అంటుంటే ఏదో సరదాకు అంటున్నారులే అని అనుకునేవాడిని.. కొన్నాళ్లు పోయిన తర్వాత కూడా అదే పనిగా మాట్లాడడంతో వివక్షకు గురవుతున్నానని అర్థమయింది. జట్టులో నన్ను చాలా మంది భారతీయ లేదా ఆసియా మూలాలు ఉన్న క్రికెటర్‌గా చూసేవారు. ఎందుకంటే పసిఫిక్ మహాసముద్రానికి దగ్గరగా ఉండే న్యూజిలాండ్ ప్రాంతంలో నా మూలాలున్న ఆటగాళ్లు చాలా తక్కువగా ఆడిన సందర్భాలు ఉన్నాయి. అందుకే డ్రెస్సింగ్‌రూమ్‌లో వివక్ష ఎదుర్కొన్నప్పటికి ఆ విషయాలను ఇన్నేళ్ల కెరీర్లో ఎప్పటికి బయటికి చెప్పలేకపోయాను'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక 2006లో న్యూజిలాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేసిన రాస్ టేలర్... అనతి కాలంలోనే జట్టుకు నమ్మదగిన ప్లేయర్ గా మారిపోయాడు. బౌలర్ ఎవరైనా సరే బుల్లెట్ లాంటి షాట్లతో బౌండరీలకు పంపడం రాస్ టేలర్ ప్రత్యేకత.బంగ్లాదేశ్‌తో ఈ ఏడాది ఆరంభంలో జరిగిన టెస్టు సిరీస్ అనంతరం తన 16 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. టేలర్ కెరీర్ ను 2011 వన్డే ప్రపంచకప్ మార్చేసింది. అప్పటి వరకు సాధారణ ప్లేయర్ గా ఉన్న అతడిని హీరోగా మార్చేసింది. భారత్ వేదికగా జరిగిన 2011 ప్రపంచకప్ తర్వాత నుంచి రాస్ టేలర్ ను ఏ బౌలర్ కూడా అంత తక్కవగా అంచనా వేయలేదు. ఆ ప్రపంచకప్ లో రాస్ టేలర్... 324 పరుగులు చేశాడు. ముఖ్యంగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుత బ్యాటింగ్ తో మెరిశాడు. జట్టు 175 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన స్థితి నుంచి 302/7కు చేర్చడంలో అసమాన పోరాటాన్ని ప్రదర్శించాడు. ఆ మ్యాచ్ లో టేలర్ 131 పరుగులతో అజేయంగా నిలిచాడు. 38 ఏళ్ళ రాస్ టేలర్ తన కెరీర్ లో 112 టెస్టు మ్యాచ్ లు, 236 వన్డేలు, 102 టి20లు ఆడాడు. టెస్టుల్లో 19 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలతో 7,683 పరుగులు చేశాడు. ఇక వన్డేల్లో 21 సెంచరీలు 51 అర్ధ సెంచరీలతో 8,607 పరుగులు సాధించాడు. టి20ల్లోనూ అదరగొట్టిన టేలర్ 7 అర్థ సెంచరీలతో 1,909 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ లోని మూడు ఫార్మాట్లలోనూ 100 మ్యాచ్ లు ఆడిన తొలి ప్లేయర్‌గా రాస్ టేలర్ నిలిచాడు. చదవండి: Sourav Ganguly Resign: దాదాకు తప్పని ఫేక్‌న్యూస్ గోల.. ఇది వారి పనేనా? SA vs ENG: టాప్ స్కోరర్‌గా నిలిచి.. అంత గుడ్డిగా ఎలా ఔటయ్యాడు! -
Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రేసులో జాతివివక్షా..?
లండన్: బ్రిటన్ ప్రధాని రేసులో జాతివివక్షకు తావే లేదని అభిప్రాయపడ్డారు భారత సంతతికి చెందిన రిషి సునాక్. కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల్లో ఏ ఒక్కరు కూడా లింగం, జాతిని చూసి ఓటు వేయరని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరు సరైన అభ్యర్థి అని నిర్ణయించుకునేందుకు ఇది కారణంగా ఉండదన్నారు. ది డైలీ టెలిగ్రాఫ్‌కు ఆదివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమేరకు తెలిపారు. ప్రధాని ఎన్నికల్లో రిషి సునాక్ ఒకవేళ ఓడిపోతే బ్రిటన్‌లో జాతివివక్ష ఉందని అందరూ అనుకుంటారని భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త రామి రేంజర్ గతవారం ఓ వీడియోలో వ్యాఖ్యానించారు. రిషి దీనిపైనే స్పందిస్తూ.. అసలు జాతివివక్షకు అవకాశమే లేదన్నారు. రిచ్మాండ్ నుంచి టోరీ సభ్యులే తనను ఎంపీగా గెలిపించారని, ప్రధాని రేసులో ఎక్కువ మంది ఎంపీలు తనకే మద్దతుగా నిలిచారని రిషి గుర్తు చేశారు. అలాంటప్పుడు జాతివివక్షకు ఆస్కారం ఎలా ఉంటుందన్నారు. బ్రిటన్ ప్రధాని పదవికి ఎవరు సమర్థవంతులు అనే విషయం గురించి చర్చించే క్రమంలో ఇలాంటి ప్రశ్నలు వచ్చి ఉంటాయన్నారు. బ్రిటన్ ప్రధాని పదవికి లిజ్ ట్రస్, రిషి సునాక్ పోటీ పడుతున్న విషయం తెలిసిందే. 1.75లక్షల మందికిపైగా టోరీ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొని వీరిద్దరిలో ఒకరిని ప్రధానిగా ఎన్నుకోనున్నారు. సెప్టెంబర్ 5 వరకు ఈ బ్యాలెట్ ఓటింగ్ జరుగుతుంది. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. అయితే ఇప్పటివరకు నిర్వహించిన సర్వేల్లో లిజ్ ట్రస్‌కే విజయావకాశాలు ఎక్కువని తేలింది. 90 శాతం ఆమే గెలుస్తుందని, రిషి సునాక్‌కు 10శాతమే అవకాశాలున్నాయని ప్రీ పోల్ సర్వేలు అంచనా వేశాయి. రిషి కూడా తాను రేసులో వెనుకంజలో ఉన్నట్లు అంగీకరించారు. అయినా చివరి ఓటు వరకు పోరాడుతానని స్పష్టం చేశారు. చదవండి: బోరిస్‌కు ఎందుకు వెన్నుపోటు పొడిచారు? రిషికి ఇబ్బందికర ప్రశ్నలు -
క్రికెట్లో అలజడి.. స్కాట్లాండ్ బోర్డు మూకుమ్మడి రాజీనామా
ఐసీసీ(ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్)లో అసోసియేట్ దేశంగా ఉన్న స్కాట్లాండ్ క్రికెట్లో ఆదివారం అలజడి రేగింది. స్కాట్లాండ్ క్రికెట్ బోర్డుకు ఒకేసారి ఆరుగురు మూకుమ్మడి రాజీనామా సమర్పించారు. క్రికెటర్లపై జాత్యంహకార వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు రావడంతో బోర్డు సభ్యులు క్రికెట్ స్కాట్లాండ్ బోర్డుకు ఆదివారం రాజీనామా సమర్పించారు. విషయంలోకి వెళితే.. ఇటీవలే స్కాట్లాండ్ లీడింగ్ ఆల్‌టైమ్ లీడింగ్ క్రికెటర్ మజిద్ హక్ స్కై స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో స్కాట్లాండ్ బోర్డు తమపై చూపిన వివక్ష గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్కాట్లాండ్ క్రికెట్ బోర్డు 'సంస్థాగతంగా జాత్యహంకారంగా' ముద్రపడిందంటూ సంచలన ఆరోపణలు చేశాడు. మజిద్‌తో పాటు తాను కూడా జాత్యహంకారానికి గురయ్యానని మరో క్రికెటర్ ఖాసిం షేక్ కూడా ఇంటర్య్వూలొ పేర్కొన్నాడు. మా శరీరం రంగు వేరు కావడంతో జట్టు మొత్తంలో మమ్మల్ని వేరుగా చూసేవారని తెలిపాడు. క్రికెటర్లు చేసిన సంచలన ఆరోపణలపై స్కాట్లాండ్ ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. వారి నివేదికలో ఆటగాళ్లు చేసిన ఆరోపణలు నిజమేనని తేలింది. కాగా కమిటీ అందించిన నివేదిక పూర్తి సారాంశాన్ని సోమవారం బహిర్గతం చేయనుంది. అయితే ఈలోగాతాము చేసిన తప్పుకు చింతిస్తున్నామని.. బోర్డులో ఉన్న సభ్యులందరం రాజీనామా చేస్తున్నట్లు బోర్డుకు సంబంధించిన ఒక అధికారి తెలిపారు. ఈ మేరకు బోర్డు డైరెక్టర్లు ఆదివారం ఉదయం తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారికి రాజీనామా లేఖను పంపారు. "బోర్డు ఆఫ్ క్రికెట్ స్కాట్లాండ్ రాజీనామా చేసింది. మేము తక్షణమే అమలులోకి వచ్చేలా చూస్తాం. ఇకపై @sportscotland భాగస్వామ్యంతో పని చేస్తాము. రాబోయే రోజుల్లో క్రీడకు తగిన పాలన, నాయకత్వం, మద్దతు ఉండేలా చూస్తాము. స్కాట్లాండ్ క్రికెట్ చిన్నదే కావొచ్చు.కానీ జాత్యంహంకార వ్యాఖ్యలకు పాల్పడితే మా దగ్గర కఠిన శిక్షలు ఉంటాయి. తమ తప్పు తెలుసుకొని బోర్డు సభ్యులు ముందే రాజీనామా చేశారు. ఇది అందరికి ఒక గుణపాఠం. ఇలాంటివి జరగకుండా చూసుకుంటాం.'' అని క్రికెట్ స్కాట్లాండ్ ఆదివారం ట్వీట్ చేసింది. NEWS UPDATE | The Board of Cricket Scotland has resigned. We will work in partnership with @sportscotland with immediate effect to ensure appropriate governance, leadership & support is in place for sport in the days ahead. Find out more ➡️ https://t.co/S6AF7EyE4A pic.twitter.com/qa2Y0ybcNP — Cricket Scotland (@CricketScotland) July 24, 2022 చదవండి: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. ఇకపై విదేశీ లీగ్‌లలో భారత క్రికెటర్లు..? -
Ind Vs Eng: టీమిండియా ఫ్యాన్స్‌కు చేదు అనుభవం.. అసభ్య పదజాలంతో దూషిస్తూ..
India Vs England 5th Test Day 4: ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో టీమిండియా రీషెడ్యూల్డ్ మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన భారత అభిమానులకు చేదు అనుభవం ఎదురైంది. నాలుగో రోజు ఆట కొనసాగుతున్న సమయంలో కొంతమంది టీమిండియా ఫ్యాన్స్‌ను ఉద్దేశించి జాతి వివక్షపూరిత వ్యాఖ్యలు చేశారు. అసభ్యకర రీతిలో వారిని దూషించారు. ఈ మేరకు ఓ ట్విటర్ యూజర్ సోషల్ మీడియా వేదికగా తమకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. ఇంగ్లండ్ అభిమానులు తమను ఉద్దేశించి జాతి వివక్షపూరిత వ్యాఖ్యలతో దూషించారని ఆరోపించారు. ఈ విషయం గురించి అక్కడున్న వాళ్లకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. తమతో పాటు అక్కడున్న మహిళలు, చిన్నారుల భద్రత కూడా ప్రమాదంలో పడిందని, సిబ్బందిలో ఒక్కరు కూడా తమకు సహాయం చేయడానికి ముందుకు రాలేదని ఆరోపించారు. నాగరిక సమాజంలో ఇలాంటివి అస్సలు ఆమోదయోగ్యం కాదంటూ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, భారత క్రికెట్ నియంత్రణ మండలిని ట్యాగ్ చేస్తూ తమ ఆవేదనను పంచుకున్నారు. ఈ విషయంపై స్పందించిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు.. ‘‘టెస్టు మ్యాచ్ సందర్భంగా కొంతమంది జాతి వివక్ష ప్రదర్శిస్తూ అసభ్య పదజాలం వాడినట్లు మా దృష్టికి వచ్చింది. ఇందుకు మేము చింతిస్తున్నాం. ఎడ్జ్‌బాస్టన్ అధికారులతో మేము మాట్లాడుతున్నాం. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపిస్తాం. క్రికెట్లో జాతి వివక్షకు తావు లేదు’’ అని ట్వీట్ చేసింది. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు స్కోర్లు: ►టీమిండియా తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్ ►ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 284 ఆలౌట్ ►టీమిండియా రెండో ఇన్నింగ్స్: 245 ఆలౌట్ ►ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 259/3. చదవండి: Dutee Chand: మసాజ్ చేయమని బెదిరించేవారు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన భారత మహిళా అథ్లెట్ Racist behaviour at @Edgbaston towards Indian fans in block 22 Eric Hollies. People calling us Curry C**ts and paki bas****s. We reported it to the stewards and showed them the culprits at least 10 times but no response and all we were told is to sit in our seats. @ECB_cricket pic.twitter.com/GJPFqbjIbz — Lacabamayang!!!!!!! (@AnilSehmi) July 4, 2022 We are very concerned to hear reports of racist abuse at today's Test match. We are in contact with colleagues at Edgbaston who will investigate. There is no place for racism in cricket — England and Wales Cricket Board (@ECB_cricket) July 4, 2022 -
సోషల్‌గా జర జాగ్రత్త! ఉద్యోగాలకే ఎసరు
మీరు ఉద్యోగులా? లేక కొలుకు కోసం వెదుకులాటలో ఉన్నారా? అయితే సోషల్ మీడియా వాడకంలో కాస్త జాగ్రత్త. అవి ఉన్నదే అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించేందుకు కదా అంటారా? అలాంటి మాటలు వాదనకే బాగుంటాయి. సోషల్ మీడియాలో పెడుతున్న కామెంట్లు చాలామంది కొలువులకు ఎసరు పెడుతున్నాయి. పనిష్మెంట్ బదిలీలకు, ప్రమోషన్ల నిలిపివేతకు కారణమవుతున్నాయి. వివాదాస్పద కామెంట్లు పెట్టేవారికి ఉద్యోగాలిచ్చేందుకు కంపెనీలు ముందుకు రావడం లేదు కూడా... ప్రభుత్వ విధానాలను సోషల్ మీడియాలో విమర్శించినందుకు గత అక్టోబర్‌లో ఢిల్లీలో ఓ కానిస్టేబుల్ ఉద్యోగం కోల్పోయాడు. కేంద్ర మంత్రిపై విమర్శలు చేసినందుకు కర్ణాటకలో తాజాగా ఓ టీచర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. సోషల్ మీడియాలో పెట్టే కామెంట్ల ప్రకంపనలు చాలా దూరం ప్రయాణిస్తున్నాయి. ఉద్యోగులు, ఉద్యోగార్థుల ‘సోషల్’ లైఫ్ మీద యాజమాన్యాలు, కంపెనీల నిఘా కొన్నేళ్లుగా బాగా పెరిగింది. అభ్యంతరకర, వివాదాస్పద కామెంట్లు చేస్తే ఉపాధికే ఎసరొస్తోంది. మరీ ముఖ్యంగా జాతి వివక్ష, జాతీయ భద్రత, ఉగ్రవాదం, తీవ్రవాదం వంటివాటిపై సోషల్ మీడియాలో అస్సలు మాట్లాడకూడదని ఓ అంతర్జాతీయ అధ్యయనంలో తేలింది. ఈ మధ్య కాలంలో 28 శాతం మంది ఇలాంటి వాటిపై వ్యాఖ్యల వల్లే వీధిన పడ్డారట. వ్యక్తుల ఇష్టాయిష్టాలపై అనుచిత వ్యాఖ్యలు, మహిళలను ద్వేషించడం వల్ల 12 శాతం మంది ఉద్యోగాలకు ఎసరొచ్చిందట. ఆఫీసుల్లో గొడవలు పడి 17 శాతం, సోషల్ మీడియాలో కుళ్లుజోకులు, కనీస మానవత్వం లేని ప్రవర్తనతో 16 శాతం, బూతులు, హింసకు దిగుతామనే బెదిరింపులతో 8 శాతం, రాజకీయ విమర్శలతో 5 శాతం మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు!! సోషల్ మీడియా పోస్టులు, వ్యాఖ్యలతో ఉద్యోగాలు కోల్పోయిన ఉదంతాలపై వచ్చిన వందలాది వార్తా కథనాల ఆధారంగా జరిగిన అధ్యయనంలో తేలిన విషయాలివి. మన దేశంలోనూ రాజకీయ విమర్శలు చేసినందుకు సామాజిక కార్యకర్తలు జైలుపాలవడం, కొందరిపై భౌతికదాడులు జరగడం తెలిసిందే. ఉద్యోగార్థులపై సోషల్ నిఘా గత పదేళ్లలో ఆధారంగా ఉద్యోగుల ఎంపికలో సోషల్ మీడియా పోస్టులు, వ్యాఖ్యలను లోతుగా గమనించే ధోరణి పెరిగిందని వాషింగ్టన్ పోస్టు వెల్లడించింది. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఆపిల్ వంటి దిగ్గజాలు జాతి వివక్ష, వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేస్తే ఎంత టాలెంటున్నా ఉద్యోగాలివ్వడం లేదు. ‘సోషల్’ హిస్టరీ బాగా లేకపోవడం వల్ల కంపెనీకి ఎంతో ఉపయోగపడతారనుకున్న ప్రతిభావంతులను కూడా వదులుకోవాల్సి వస్తోంది. ఇది బాధాకరమే అయినా తప్పడం లేదు. పని చేసే చోట ఇబ్బందులు రాకూడదు కదా! అందుకే నాయకత్వ స్థానాల్లో ఉండేవారికి ఎలాంటి బలహీనతలూ ఉండొద్దన్న నియమాన్ని కచ్చితంగా పాటిస్తున్నాం’’ అని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వర్ణవివక్షపై జరిగిన ఓ సదస్సులో బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ‘సేజ్ పబ్’ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం కంపెనీల మానవ వనరుల విభాగాలు ఏయే అంశాలను గమనిస్తున్నాయంటే... ► ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాంలో ఎలాంటి పోస్టులు పెడుతున్నారు? ► ఏ అంశాలపై ఎక్కువగా స్పందిస్తున్నారు? ► సొంతగా ఏమైనా బ్లాగులు రన్ చేస్తున్నారా? ► వీటితో పాటు పలు ఇతర అంశాలపైనా నిఘా పెడుతున్నారు. ► పోలీసు (20%), టీచర్లు (24%), ప్రభుత్వోద్యోగులు (14%), ఆతిథ్య, రిటైల్ రంగాల్లో ఈ ధోరణి ఎక్కువగా ఉందట. ► వివాదాస్పద వ్యాఖ్యలు, పోస్టులతో ఉద్యోగాలు పోతాయని మన దేశంలో 40 శాతం మందికి భయమున్నట్టు గతేడాది ఓ అధ్యయనంలో తేలింది.నే పలు సోషల్ మీడియా పోస్టులను డిలీట్ చేసినట్లు చాలామంది అంగీకరించారు. ► పని చేస్తున్న కంపెనీ, సంస్థపై సోషల్ మీడియాలో చెడుగా రాశామని 25.7 శాతం మంది ఒప్పుకున్నారు. ► సోషల్ మీడియా పోస్టుల వల్ల తమకేమీ కాదని 46.9 శాతం మంది నమ్ముతున్నారు. భిన్నాభిప్రాయాలు సోషల్ మీడియా పోస్టులకు కెరీర్‌తో ముడి పెట్టడం సబబా అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. బికినీతో ఫొటో దిగి ఇన్‌స్టాలో పెట్టినందుకు ఒకరి ఉద్యోగం పోయింది. ఇది వ్యక్తిగత జీవితంలోకి అనుచితంగా చొరబడటమేనన్న వాదన ఉంది. సున్నిత అంశాలపై వివాదాస్పదంగా పోస్టులు పెట్టకపోవడమే మేలన్నది 2021 గ్రహీత సాహిత్య నోబెల్ గ్రహీత అబ్దుల్ రజాక్ గుర్మా వంటివారి అభిప్రాయం. ఇది యువతలో అభద్రతా భావం పెంచుతున్న వాదనతో గూగుల్ హెచ్ఆర్ విభాగం హెడ్ ప్రీతి నారాయణ్ అంగీకరించారు. కానీ విశృంఖలతకు ఎక్కడో ఒకచోట ఫుల్ స్టాప్ పడాల్సిందేనని అభిప్రాయపడ్డారు. :::కంచర్ల యాదగిరిరెడ్డి -
బుసకొట్టిన జాతి విద్వేషం
బఫెలో/షికాగో(యూఎస్): అమెరికాలో జాతి విద్వేషం మరోసారి బుసలు కొట్టింది. నల్లజాతి ప్రజలే లక్ష్యంగా 18 ఏళ్ల శ్వేతజాతి యువకుడు తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 10 మంది బలయ్యారు. ముగ్గురు గాయపడ్డారు. బఫెలో నగరంలోని టాప్స్ ఫ్రెండ్లీ మార్కెట్లో శనివారం ఈ దారుణం జరిగింది. ఇది జాతి విద్వేషపూరిత హింసాత్మక తీవ్రవాదమేనని పోలీసు అధికారులు అన్నారు. టాప్స్ ఫ్రెండ్లీ మార్కెట్లో ప్రధానంగా నల్ల జాతీయులు షాపింగ్ చేస్తుంటారు. ఇందులో పనిచేసే వారంతా నల్లజాతి కార్మికులే. సైనిక దుస్తులు, తూటా కవచం, హెల్మెట్ కెమెరా ధరించి వచ్చిన యువకుడు మార్కెట్ బయట హఠాత్తుగా రైఫిల్‌తో నలుగురిపై కాల్పులు జరిపాడు. లోపలికి వెళ్లి కనిపించినవారిపై బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఎదురు కాల్పులు జరిపిన సెక్యూరిటీ గార్డునూ కాల్చేశాడు. ఇదంతా ‘ట్విచ్’ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో ప్రత్యక్ష ప్రసారమైంది! పోలీసులు రంగంలోకి దిగి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. 11 మంది నల్ల జాతీయులపై, ఇద్దరు శ్వేత జాతీయులపై కాల్పులు జరిపాడని చెప్పారు. అతడిని న్యూయార్క్‌లోని కాంక్లిన్‌కు చెందిన పేటన్ గెన్డ్రాన్గా గుర్తించారు. హత్య కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. శ్వేతజాతి అహంకారంతో అమాయకులను బలితీసుకున్న వ్యక్తి జీవితాంతం జైల్లోనే ఉండాలని కోరుకుంటున్నట్లు స్థానిక గవర్నర్ కాథీ హోచుల్ చెప్పారు. ఘటనపై అధ్యక్షుడు జో బైడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారన్నారు. షికాగో కాల్పుల్లో బాలుడి మృతి అమెరికాలో షికాగోలోనూ దారుణం జరిగింది. మిలీనియం పార్కులో శనివారం దుండగుడి కాల్పుల్లో 16 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఇద్దరు అనుమానితులను పట్టుకుని రెండు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. -
దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్‌కు క్లీన్చిట్
జాతి వివక్ష ఆరోపణల నుంచి దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్‌కు విముక్తి లభించింది. అతనితో పాటు ప్రస్తుత కోచ్, మాజీ వికెట్ కీపర్ మార్క్ బౌచర్, ఏబీ డివిలియర్స్‌లకు కూడా క్లీన్చిట్ ఇచ్చారు. స్మిత్ తదితరులు జట్టులోని నల్లజాతి క్రికెటర్లపై వివక్షకు పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలు లభించలేదని... ఎన్సెబెజా నేతృత్వంలోని సోషల్ జస్టిస్ అండ్ నేషన్ బిల్డింగ్ కమిటీ తమ నివేదికలో పేర్కొంది. -
ఆ క్లబ్లో నల్లజాతి క్రికెటర్లకు చోటు లేదా? ఇదేం వివక్ష
వర్ణవివక్షకు క్రికెట్ కూడా అతీతం కాదని మరోసారి నిరూపితమైంది. ఇంగ్లండ్‌లోని మిడిలెసెక్స్ కౌంటీ క్రికెట్ క్లబ్లో నల్లజాతీయులకు చోటు లేకుండా చేస్తున్నారంటూ హంప్‌షైర్ మాజీ క్రికెటర్ జాన్ హోల్డర్ పేర్కొన్నాడు. మిర్రర్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో హోల్డర్.. మిడిలెసెక్స్లో జరుగుతున్న దారుణాల గురించి వివరించాడు. ''మిడిలెసెక్స్ ఛైర్మన్ మైక్ ఓ ఫెరల్.. తన క్లబ్లో నల్లజాతీయుల క్రికెటర్లకు చోటు కల్పించడం లేదు. క్లబ్ మొత్తాన్ని తెల్లజాతీయ క్రికెటర్లతో నింపేద్దామనుకున్నాడు. అనుకున్నట్లుగానే ఆ క్లబ్లో ఇప్పుడు దాదాపు తెల్లజాతీయులే ఎక్కువగా ఉన్నారు. దీంతో ఛైర్మన్ మైక్ ఫెరల్ కామెంట్స్ నాకు కొత్తగా ఏం అనిపించలేదు. ఆ క్లబ్ తరపున ఆడుతున్న నా స్నేహితుడు.. సహచర క్రికెటర్ ఇది చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంత వివక్ష ఎందుకు.. నల్లజాతీయులు చేసిన పాపం ఏంటి..'' అంటూ హోల్డర్ అసహనం వ్యక్తం చేశాడు. చదవండి: Rovman Powell: 10 సిక్సర్లతో విండీస్ బ్యాటర్ విధ్వంసం మిడిలెసెక్స్ కౌంటీ ఛైర్మన్ మైక్ ఓ ఫెరల్; జాన్ హోల్డర్.. మాజీ హంప్‌షైర్ క్రికెటర్ ''మిడిలెసెక్స్ ఛైర్మన్ మైక్ ఓ ఫెరల్ ఇచ్చిన స్టేట్మెంట్ పూర్తి చెత్తగా అనిపించింది. 15 ఏళ్ల వయసులో 1960లో నేను ఇంగ్లండ్‌లో అడుగుపెట్టినప్పుడు అచ్చం ఇలాంటి వివక్షనే ఎదుర్కొన్నా. ఫుట్‌బాల్‌లో రాణిద్దామని ఎన్నో ఆశలతో వచ్చా. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత వర్ణ వివక్షపై విపరీతమైన ప్రచారం ఉండేది. నల్లజాతీయులు ఆటలో పాల్గొంటే క్రీడాస్పూర్తి దెబ్బతింటుందని.. మ్యాచ్‌లు ఓడిపోయే అవకాశాలు ఎక్కువంటూ అనవసర ప్రచారాలు చేసేవారు. చదవండి: పీటర్సన్ సునామీ ఇన్నింగ్స్.. 9 ఫోర్లు, 7 సిక్స్‌లు.. కేవలం 38 బంతుల్లోనే కానీ ఇంగ్లీష్ ఫుట్‌బాల్ ఇప్పుడు ఎలా ఉందో మీ అందరికి తెలిసిందే. కాలం మారడంతో పాటు ఫుట్‌బాల్‌ను కూడా పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు చూసుకుంటే ఇంగ్లీష్ ఫుట్‌బాల్ క్లబ్స్‌లో ఎక్కడా చూసినా నల్లజాతీయులే ఎక్కువగా కనిపిస్తున్నారు.''అని చెప్పుకొచ్చాడు. కాగా మైక్ ఓ ఫెరల్ చేసిన కామెంట్లపై అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో దెబ్బకు దిగివచ్చాడు. తాను చేసిన కామెంట్స్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొంటూ.. నల్లజాతీయులను క్షమాపణ కోరడం విశేషం. -
శ్వేత దేశపు నాణేంపై నల్ల జాతి మ(తె)గువ
వర్ణ వివక్షకు కేరాఫ్ అయిన అగ్రరాజ్యంలో.. ఓ అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. మొట్టమొదటిసారి ఓ నల్ల జాతి మగువ ముఖచిత్రంతో అమెరికన్ కాయిన్ విడుదల చేశారు. అమెరికన్ ఉమెన్ క్వార్టర్స్ ప్రోగ్రాంలో భాగంగా అమెరికాలో జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన ఆఫ్రో-అమెరికన్ రైటర్ మయా అంజెలు ముఖచిత్రంతో కాయిన్‌ను విడుదల చేశారు. ఏడేళ్ల వయసులో తల్లి ప్రియుడి చేతిలో అఘాయిత్యానికి గురై.. చావు దెబ్బలు తింది మయా అంజెలు. చివరికి బంధువుల చొరవతో ప్రాణాలతో బయటపడిన ఆ చిన్నారి.. ఆరేళ్లపాటు మూగదానిగా ఉండిపోయింది. ఆ చేదు అనుభవం నుంచి బయటపడేందుకు ఆ చిన్నవయసు నుంచే అక్షరాల్ని ఆశ్రయించింది. కాలక్రమంలో ఆఫ్రో-అమెరికన్ రచయితగా, జాతి-వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన యోధురాలిగా మయా అంజెలుకు ఒక పేరు దక్కింది. ఉద్వేగంగా సాగే ఆమె రచనలు ప్రముఖులెందరినో ప్రభావితం చేశాయి కూడా. ఆమె ఆత్మకథ I Know Why the Caged Bird Sings ద్వారా ఎన్నో సమస్యల గురించి చర్చించారామె. 1993లో బిల్‌క్లింటన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా స్వయంగా కవిత వినిపించి.. ఆ అరుదైన గౌరవం అందుకున్న తొలి బ్లాక్ లేడీగా గౌరవం అందుకుంది. తన జీవిత కాలంలో 30కి పైగా అత్యున్నత డాక్టరేట్లు అందుకున్న మయా అంజెలు.. 2010లో అధ్యక్షుడు బరాక్ ఒబామా చేతుల మీదుగా ‘స్వేచ్ఛా’ మెడల్‌ను సైతం స్వీకరించింది. 2014లో 86 ఏళ్ల వయసులో ఆమె అనారోగ్యంతో కన్నుమూసింది. మయా అంజెలుతో పాటు చైనా సంతతికి చెందిన హాలీవుడ్ నటి అన్నా మే వాంగ్, అమెరికా తొలి మహిళా వ్యోమగామి సాలీ రైడ్ ముఖ చిత్రాల మీదుగా కూడా కాయిన్స్ రిలీజ్ చేసింది అమెరికా మింట్. -
జాతి వివక్ష పోరాట యోధుడు అస్తమయం
జొహన్నెస్‌బర్గ్/న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాలో జాతి వివక్షపై అవిశ్రాంత పోరాటం సాగించిన హక్కుల నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత డెస్మండ్ టుటు(90) అస్తమించారు. ఆర్చ్‌బిషప్ డెస్మండ్ టుటు ఆదివారం వేకువజామున కేప్‌టౌన్‌లోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా ప్రకటించారు. గతంలో క్షయవ్యాధికి గురైన డెస్మండ్ టుటు, ప్రొస్టేట్ కేన్సర్ బారినపడి 1997లో శస్త్రచికిత్స చేయించుకున్నారు. అనంతరం పలు అనారోగ్య సమస్యలు ఆయన్ను చుట్టుముట్టాయి. బ్రిటిషర్ల హయాంలో నల్లజాతి ప్రజల హక్కుల కోసం, అన్యాయాలకు గురైన వారి తరఫున డెస్మండ్ టుటు తీవ్రంగా పోరాడారు. నల్ల జాతీయుల పాలన మొదలైన తర్వాత కూడా అన్యాయాలను, అక్రమాలను ఖండించడంలో ఆయన వెనుకాడలేదు. అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్‌లో కొనసాగుతూనే పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వ సంస్థలను కొల్లగొడుతున్న తీరుపై గళమెత్తారు. ఆర్చ్‌బిషప్ టుటు మృతిపై భారత ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆర్చి బిషప్ టుటును ‘ఆఫ్రికా పీస్ బిషప్’గా నోబెల్ ఇన్స్టిట్యూట్ అభివర్ణించింది. దక్షిణాఫ్రికా నల్లజాతి ప్రజలపై బ్రిటిషర్లు దారుణాలకు పాల్పడినప్పటికీ బిషప్ టుటు మాత్రం అహింసాయుత విధానాలకే కట్టుబడి ఉన్నారని కొనియాడింది. మండేలాతో విడదీయరాని మైత్రి మొదట జొహన్నెస్‌బర్గ్ ఆర్చ్‌బిషప్‌గా ఉన్న టుటు తర్వాత కేప్‌టౌన్ బిషప్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆ పదవులు నిర్వహిస్తూనే స్థానిక నల్లజాతి వారిపై శ్వేత జాతీయుల దురాగతాలను ఖండించడంలో వెనుకాడలేదు. జొహన్నెస్‌బర్గ్ ఆర్చ్‌బిషప్‌గా కొనసాగుతున్న సమయంలోనే 1984లో ఆయన్ను నోబెల్ శాంతి బహుమతి వరించింది. బ్రిటిషర్ల హయాంలో జాతి వివక్షకు గురైన వారికి న్యాయం చేసే లక్ష్యంతో 1995లో టుటు నేతృత్వంలో ‘ట్రూత్ అండ్ రికన్సిలియేషన్ కమిషన్’ను మండేలా నియమించారు. టుటు, మండేలా మధ్య అనుబంధాన్ని వివరిస్తూ మండేలా ఫౌండేషన్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘1950లలో పాఠశాలలో చదువుకునే రోజుల్లో జరిగిన వక్తృత్వ పోటీల సమయంలో మండేలా, టుటు తొలిసారి కలుసుకున్నారు. ఇద్దరూ జాతి వివక్షపై ప్రజల తరఫున పోరాటం సాగించారు. ఇది నచ్చని బ్రిటిషర్లు వారిద్దరూ కలుసుకోకుండా దాదాపు 4 దశాబ్దాలపాటు పలు అవాంతరాలు కల్పించారు. చివరికి మండేలా 27 ఏళ్లపాటు జైలు జీవితం గడిపి విడుదలయ్యాకే టుటుతో నేరుగా మాట్లాడగలిగారు. చెరసాల నుంచి విడుదలైన మండేలా మొదటగా వెళ్లి ఆ రోజు గడిపింది టుటు నివాసంలోనే’అని తెలిపింది. మండేలా 2013లో తుదిశ్వాస విడిచే వరకు టుటుతో అనునిత్యం మాట్లాడుకుంటూనే ఉన్నారంటూ వారి మధ్య ఉన్న గాఢమైత్రిని గుర్తు చేసింది. -
‘మండేలా’ తాళం చెవి వేలం ఆపండి
జొహన్నస్‌బర్గ్: జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమ నాయకుడు నెల్సన్ మండేలా 18 ఏళ్లపాటు కారాగార శిక్ష అనుభవించిన జైలు గది తాళం చెవిని వేలం వేయడాన్ని దక్షిణాఫ్రికా ప్రభుత్వం తీవ్రంగా ఆక్షేపించింది. నల్లజాతి సూరీడు, దక్షిణాఫ్రికాలో ప్రజాస్వామ్య బద్ధంగా అధ్యక్షుడైన తొలి నాయకుడు జైలు జీవితం గడిపిన గది తాలూకూ వస్తువులన్నీ జాతి సంపదలని దక్షిణాఫ్రికా ప్రకటించింది. అమెరికాలో జనవరి 28న జరగనున్న ఓ ప్రైవేట్ వేలంపాటలో ఆ తాళం చెవికి ధర కట్టడాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేసింది. అసలు తమ ప్రభుత్వాన్ని సంప్రదించకుం డా వేలంవేయడ మేంటని దక్షిణాఫ్రికా క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి నాథి ఎంతెత్వా ప్రశ్నించారు. మండేలాకు చెందిన కళ్లద్దాలు, పెన్నులు, అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్, ఐక్యరాజ్యసమితి నుంచి అందుకున్న జ్ఞాపికలూ వేలానికి పెట్టారు. ఈ మొత్తం ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తామన్నారు. వేలానికి పెట్టిన మండేలా వస్తువులను తిరిగి దేశానికి తెస్తామన్నారు. మండేలాకు విధించిన 27 ఏళ్ల కారాగార శిక్షలో 18 ఏళ్లు రాబిన్ ద్వీపంలోని జైలులో ఒకే గదిలో గడిపారు. ఆ కాలంలో ఆ జైలుకు జైలర్‌గా క్రిస్టో బ్రాండ్ ఉన్నాడు. మండేలాకు, క్రిస్టోకు మంచి స్నేహం కుదిరింది. ఆ తర్వాత క్రిస్టో .. రాబిన్ ద్వీపానికి టూర్ గైడ్‌గా మారాడు. ప్రస్తుతం ఆ జైలును పురావస్తుశాలగా మార్చారు. అయితే, మండేలా ఉన్న గది తాళం చెవి డూప్లికేట్ ఒకటి క్రిస్టో చెంతకు చేరింది. ఆ డూప్లికేట్ కీను అమెరికాకు చెందిన గెన్సీస్ ఆక్షన్స్ అనే వేలం సంస్థకు విక్రయించాడు. నోబెల్ శాంతి పురస్కార గ్రహీత, మహోన్నతమైన మండేలా గడిపిన గది తాలూకు కీ కావడంతో అది రూ.10 కోట్లకుపైగా ధర పలకవచ్చని ప్రాథమిక అంచనాలున్నాయి. గది మాస్టర్ కీ(అసలైన తాళం చెవి) జైలులోనే ఉందని, డూప్లికేట్‌కు ఒడిగట్టిన అధికారులు ఎవరనేది తేలుస్తామని మంత్రి చెప్పారు. -
జాతి వివక్ష.. 9 ఏళ్ల తర్వాత పుజారాకు క్షమాపణ
Jack Brooks Apologises Cheteshwar Pujara Over Racism.. టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారాను సోమర్సెట్ బౌలర్ జాక్ బ్రూక్స్ క్షమించమని కోరాడు. 2012లో పుజారా యార్క్‌షైర్‌కు ఆడుతున్న సందర్భంలో జాక్ బ్రూక్.. పుజారాకు 'స్టీవ్' అని నిక్‌నేమ్ పెట్టాడు.దీంతో పాటు పుజారాను అవమానిస్తూ వివక్షపూరిత వ్యాఖ్యలు చేసినందుకు సిగ్గుపడుతున్నానంటూ పేర్కొన్నాడు. ఇక స్టీవ్ అంటే పనివాడని అర్థం. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్య్వూలో జాక్ బ్రూక్స్ మాట్లాడాడు. చదవండి: Syed Mustaq Ali T20 Trophy: ఆఖరి బంతికి ఊహించని ట్విస్ట్.. సూపర్ ఓవర్ ద్వారా సెమీస్‌కు '2012లో పుజారాపై నేను చేసిన వ్యాఖ్యలు వివక్షపూరితంగా ఉన్నాయి. ఆ సమయంలో ఏం ఆలోచించకుండా ట్విటర్లో అతనిపై విరుచుకుపడ్డా. స్టీవ్ అని నిక్‌నేమ్‌తో పిలిచి అతన్ని అవమానించాను. తాజాగా ఈ విషయంలో పుజారాను క్షమాపణ కోరుతున్నా. అంతేగాక నా ట్వీట్‌ను చూసిన వారిని కూడా క్షమాపణ అడుగుతున్నా. కొద్దిరోజుల క్రితం యార్క్‌షైర్ క్రికెట్ కౌంటీ క్లబ్ అండర్-19 కెప్టెన్ అజీం రఫిక్ దాఖలు చేసిన ఫిర్యాదుపై అక్కడి కమిటీ దర్యాప్తు ప్రారంభించింది. అయితే ఇందులో అనేక కీలక విషయాలు వెల్లడయ్యాయి. యార్క్‌షైర్ కౌంటీలో తెల్ల జాతీయులు నల్లజాతీయులతో కావాలనే వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని వెల్లడవుతోంది. అందులో భారత క్రికెటర్ చటేశ్వర్ పుజారా కూడా ఉన్నట్లు తేలింది. అజీం రఫీక్ వెళ్లిన తర్వాత యార్క్‌షైర్ నుంచి వెళ్లిపోయిన తర్వాత పుజారా చేరాడు. దీంతో అతను యార్క్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహించిన సమయంలో ఇంగ్లీష్ ఆటగాళ్లు పుజారాను స్టీవ్ అని పిలిచేవారు. కానీ పుజారా వీటిని పట్టించుకోకుండా తన పనిని చూసుకొని వెళ్లిపోయేవాడని రఫీక్ తాజా ఇంటర్య్వూలో పేర్కొన్నాడు. చదవండి: మార్క్ చాప్మన్ అరుదైన రికార్డు.. ఆ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా -
టెస్లాకు వెయ్యికోట్ల జరిమానా, 'మై లార్డ్'..ఒక్కసారి ఆలోచించండి
టెస్లాలో జాత్యంహాకర దాడుల అంశంపై ఎలన్ మస్క్ శాన్ ఫ్రాన్సిస్కోలోని ఫెడరల్ కోర్ట్‌ను ఆశ్రయించారు. టెస్లా కంపెనీలో జాత్యంహాకర దాడులపై నమోదైన కేసు విషయంలో కోర్టులోని జ్యూరీ బృందం ఇచ్చిన తీర్పుపై పున:పరిశీలించాలని కోరారు. బాధితుడికి అనుకూలంగా తీర్పు టెస్లా కంపెనీ ఫ్రీమాంట్ ప్లాంట్‌లో ఓవెన్ డియాజ్ అనే నల్లజాతీయుడు 2015 నుంచి 2016 వరకు పనిచేశాడు. పనిచేస్తోన్న సమయంలో మాజీ కాంట్రాక్ట్ ఎలివేటర్ ఆపరేటర్ వైట్ అమెరికన్లు తనని నిగ్గర్ (అమెరికన్లు నల్లజాతీయుల్ని వ్యతిరేకించడం) అని ఏడిపించాడు. వర్క్‌ప్లేస్‌లో జాత్యహంకార వ్యంగ్యంగా బొమ్మల్ని గీసారని, బాత్రూమ్ స్టాల్లో నల్లజాతియుల్ని దూషించేలా స్లోగన్లు రాశారని, గోబ్యాక్ ఆఫ్రికా అంటూ వేధించారని ఆరోపించాడు. అయితే జాత్యంహకార వ్యాఖ్యలపై క్షోభకు గురైన ఓవెన్ డియాజ్ కోర్డును ఆశ్రయించాడు. దీంతో విచారణ చేపట్టిన కోర్ట్ అక్టోబర్ 4న ఓవెన్ డియాజ్కు అనుకూలంగా తుది తీర్పును వెలువరించింది. 137మిలియన్ల నష్టపరిహారం ఈ ఏడాది అక్టోబర్ 4న శాన్ ఫ్రాన్సిస్కోలోని ఫెడరల్ జ్యూరీ సభ్యులు ఇచ్చిన తీర్పులో టెస్లా కాలిఫోర్నియా ఫ్యాక్టరీలో జాత్యహంకార వేధింపులను కంపెనీ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. నల్లజాతీయుడు ఓవెన్ డియాజ్కు $137 మిలియన్లు చెల్లించాలని ఆదేశించింది. అయితే ఆ తీర్పుపై తాజాగా టెస్లా కోర్ట్ తీర్పును సవాలు చేసింది. కోర్టు తీర్పు టెస్లాను అస్థిరపరిచేలా ఉందని, నిర్ణయాన్ని పున:పరిశీలించాలని న్యాయమూర్తిని కోరింది. ప్రత్యామ్నాయంగా న్యాయస్థానం విధించిన $137(భారత కరెన్సీలో రూ.10,17,98,67,200.00) మిలియన్ల నష్టపరిహారం కాకుండా $300,000 డాలర్లు చెల్లిస్తామని వాదించినట్లు బ్లూమ్‌బెర్గ్ తన కథనంలో తెలిపింది. అంతేకాదు టెస్లా డియాజ్ ఫిర్యాదు పై తమ సంస్థ కార్మికులను క్రమశిక్షణగా ఉంచుతుందని, ఫిర్యాదు దారుడు చేసిన ఆరోపణల్లో ఆధారాలు లేవని బ్లూమ్ బెర్గ్ పేర్కొంది. చదవండి: ఎలన్ మస్క్ కంపెనీ బలుపు చేష్టలు..టెస్లాకు భారీ షాక్! -
యార్క్‌షైర్ కౌంటీపై వేటు
లండన్: జాతి వివక్షపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కన్నెర్ర చేసింది. కుప్పలుతెప్పలుగా ఆరోపణలు వస్తున్నా... చర్యలు చేపట్టకుండా ఉదాసీనంగా వ్యవహరించిన యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ (వైసీసీసీ)పై సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో ఆ జట్టు కౌంటీలకు దూరమవడంతో పాటు క్లబ్‌కు చెందిన హెడింగ్లీ స్టేడియంలో ఇకపై అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు జరగవు. వచ్చే ఏడాది లీడ్స్‌లోని హెడింగ్లీ స్టేడియంలో పలు మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. న్యూజిలాండ్‌తో మూడో టెస్టు, దక్షిణాఫ్రికాతో వన్డే, యాషెస్ సిరీస్‌లో ఒక టెస్టు మ్యాచ్‌ను అక్కడి నుంచి తప్పిస్తారు. వైసీసీసీకి చెందిన మాజీ క్రికెటర్ అజీమ్ రఫీక్ (2008–2018) ఏళ్ల తరబడి వర్ణ వివక్షకు గురయ్యాడు. ఇస్లాం మతానికి చెందిన తను పదేపదే వివక్షకు గురయ్యానని, సహచరులు తనను బయటివాడిగానే చూసేవారని, దీనిపై క్లబ్‌కు 43 సార్లు ఫిర్యాదు చేశానని రఫిక్ గతేడాది ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఈసీబీ రంగంలోకి దిగింది. కమిటీ విచారణలో యార్క్‌షైర్ ఉదాసీనత వెలుగులోకి వచ్చింది. వెంటనే ఈసీబీ కఠిన చర్యలకు ఉపక్రమించింది. -
బాలీవుడ్లో నెపోటిజం కాదు.. జాత్యాహంకారం ఉంది: నటుడు
వైవిధ్యమైన పాత్రలతో బాలీవుడ్లో తనదైన ముద్ర వేసుకున్న నటడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. ఆయన ఇటీవల సుధీర్ మిశ్రా దర్శకత్వంలో చేసిన ‘సీరియస్ మెన్’లో తన నటనకు గానూ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డు నామినేషన్ పొందాడు. ఈ తరుణంలో ఆయన బాలీవుడ్ చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ చిత్ర పరిశ్రమలో నెపోటిజం (బంధుప్రీతి) కంటే ఎక్కువగా రేసిజం (జాత్యాహంకారం) సమస్య ఉందని ఓ ఇంటర్వూలో తెలిపాడు. నవాజ్ మాట్లాడుతూ.. ‘సీరియస్ మెన్’ తర్వాత మరో మంచి సినిమాలో లీడ్ రోల్ వస్తే అదే ఇందిరా తివారికి విక్టరీ అని చెప్పాడు. అంతేకాకుండా..‘ బాలీవుడ్లో తెల్లగా ఉండేవాళ్లతో పాటు నల్లగా ఉండేవారు కూడా హీరోయిన్లు చేయాలని కోరుకుంటున్నా. మంచి సినిమాలు రావాలంటే ఇదే కాకుండా పరిశ్రమలో ఉన్న పక్షపాతాలు అన్ని పోవాలి. నేను చాలా సంవత్సరాలుగా దానికి వ్యతిరేకంగా పోరాడాను. ఎందుకంటే నేను పొట్టిగా ఉంటాను. నా పరిస్థితి బానే ఉంది కానీ ఈ రకమైన భేషజాల వల్ల ఎంతో మంది గ్రేట్ యాక్టర్స్ బలైపోయారు’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఆయన నటించిన ‘సీరియస్ మెన్’లో లీడ్ రోల్లో నటించిన ఇందిరా తివారి పొట్టిగా, నల్లగా ఉంటుంది. ఈ తరుణంలో ఆయన బాలీవుడ్ గురించి చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. చదవండి: ఇప్పటికీ కుల వివక్షకు గురవుతున్నా! -
వందేళ్ల తర్వాత న్యాయం.. తిరిగి వచ్చిన రూ.555 కోట్ల ఆస్తి
వాషింగ్టన్: ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్తులు, డబ్బులు ఒకసారి మన చేయి జారిపోతే.. తిరిగి దక్కించుకోవడం చాలా కష్టం. మనకు ఎంతోకొంత అదృష్టం ఉండి.. ఎదుటివారి నిజాయతీపరులైతే తప్ప మన సొమ్ము మనకు దక్కదు. ఇప్పుడు మనం చదవబోయే వార్తలో బాధితులు అదృష్టంతులనే చెప్పవచ్చు. శతాబ్దం తర్వాత వారికి న్యాయం జరిగింది. వందేళ్ల క్రితం కొందరు అమెరికా అధికారులు.. నల్లజాతీయుల కుటుంబానికి చెందిన భూమిని ఆక్రమించుకున్నారు. ఇన్నేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఆ నల్ల జాతీయుల కుటుంబానికి న్యాయం జరిగింది. అమెరికా అధికారులు ఆక్రమించిన భూమిని తిరిగి వారికి అప్పగించారు. ఇప్పుడు దాని విలువ 555 కోట్ల రూపాయలకు పైనే ఉంది. వందేళ్ల తర్వాత ఇంత విలువైన న్యాయం జరగడంతో ఆ కుటుంబం తెగ సంతోషపడుతుంది. ఆ వివరాలు.. సుమారు వందేళ్ల క్రితం అనగా 1900 సంవత్సరం ప్రారంభంలో తెల్ల జాతీయులకు, నల్ల జాతీయులకు మధ్య తీవ్ర ఘర్షణలు చెలరేగాయి. జాత్యాంకార విద్వేషం రగులుతున్న సమయం. ఈ క్రమంలో దక్షిణ కాలిఫోర్నియాలో ఉంటున్న బ్రూస్ కుటుంబం మొదటి సారి నల్ల జాతీయుల కోసం ఆ ప్రాంతంలోని బీచ్‌లో 1912లో వెస్ట్‌కోస్ట్ రిసార్ట్ స్థాపించారు. దీనిలో లాడ్జ్, కేఫ్, డ్యాన్స్ హాల్, డ్రెస్సింగ్ టెంట్లు ఉన్నాయి. ఇక ఇది దక్షిణ కాలిఫోర్నియా ట్రేడ్‌మార్క్ బీచ్‌లలో ఒకటిగా ఉంది. ప్రస్తుతం ఈ రిసార్ట్ మల్టీ మిలియన్ డాలర్ల విలువ చేసే ఇళ్ల సముదాయల మధ్యన ఉంది. (చదవండి: డార్నెల్లా ఫ్రెజర్.. నిప్పులా ఉద్యమాన్ని రాజేసింది!) బ్రూస్ కుటుంబం ఇలా నల్ల జాతీయుల కోసం రిసార్ట్ స్థాపించడం నచ్చని శత్రువర్గీయులు.. దానికి నిప్పు పెట్టడానికి కూడా ప్రయత్నించారు. అంతేకాక 1920వ ప్రాంతంలో బ్రూస్ కుటుంబం నుంచి రిసార్ట్, అది ఉన్న స్థలాన్ని ఆక్రమించడం కోసం అక్కడ ఓ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం మాన్హాటన్ బీచ్ సిటీ కౌన్సిల్ బ్రూస్ కుటుంబం నుంచి భూమిని సేకరించేందుకు ప్రముఖ డొమైన్‌ని ఆహ్వానించింది. (చదవండి: జాత్యహంకారం.. కెమెరాకు చిక్కిన ప్లేయర్) అలా 1924 ప్రాంతంలో అక్రమంగా ఆక్రమించిన ఈ స్థలాన్ని ప్రస్తుతం అనగా సుమారు వందేళ్ల తర్వాత 2021లో తిరిగి బ్రూస్ వారసులకు తిరిగి అప్పగించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా గతంలో జరిగిన తప్పును సరిదిద్దే ప్రయత్నం ఇది అంటూ కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ ట్వీట్ చేశారు. బ్రూస్ వారసులు, ఆ దంపతుల మునిమనడికి భూమిని పునరుద్ధరించడానికి అనుమతించే బిల్లుపై గవర్నర్ గావిన్ న్యూసమ్ సంతకం చేశారు. ప్రస్తుతం ఈ భూమి విలువ 75 మిలియన్ డాలర్లు(5,55,84,64,125 రూపాయలు). ఈ విషయం తెలిసిన నెటిజనులు.. ఇనేళ్ల తర్వాత అయినా న్యాయం జరిగింది.. అది కూడా చాలా ఖరీదైన న్యాయం అంటూ కామెంట్ చేస్తున్నారు. The Bruce family was stripped of their property in 1924 because of hatred and racism. It’s past time to right that wrong. Today, by returning the property CA took another step toward addressing systemic racism and set a path forward for other states & our nation to do the same. pic.twitter.com/Dz9GXze5bL — Gavin Newsom (@GavinNewsom) September 30, 2021 చదవండి: జాత్యహంకారానికి టీకా లేదా? -
జాత్యహంకారానికి టీకా లేదా?
కాలం మారినా వెనుకటి సహజగుణాన్ని వదులుకోవడం ఎవరికైనా కష్టమే. దానికి ఆభిజాత్యం కూడా తోడైతే ఇక చెప్పేది ఏముంది! రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం కాలగతిలో కుంచించుకుపోయినా, వలస పాలనా వ్యవస్థ తాలూకు ఆలోచనలు, అవశేషాలు బ్రిటన్ పాలకులను ఇంకా వదిలిపెట్టినట్టు లేవు. ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనాకు టీకాలపై బ్రిటన్ వైఖరి ఆ అనుమానమే రేకెత్తిస్తోంది. బ్రిటన్‌కు వచ్చే భారతీయ ప్రయాణికుల విషయంలో ఆ దేశం పెట్టిన తాజా నిబంధనలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. భారత్‌లో రెండు డోసుల కోవిషీల్డ్ టీకా వేయించుకున్నప్పటికీ, వారెవరినీ రోగ నిరోధక శక్తి ఉన్నవారిగా బ్రిటన్‌లో పరిగణించబోరట. అలాంటి వారు తమ దేశానికి వస్తే 10 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సిందేనని బ్రిటన్ తాజా షరతు. దీంతో, విద్య, వైద్య, వ్యాపారాది అవసరాల నిమిత్తం బ్రిటన్ వెళ్ళే భారతీయ విద్యార్థులు, వృత్తి నిపుణులు పలువురికి చిక్కులు తప్పవు. పూర్తిగా టీకాలు వేసుకున్నా సరే, మీ టీకాలు పనికి రావని చెప్పడం అక్షరాలా జాత్యహంకారమే అంటూ విమర్శలు చెలరేగుతున్నది అందుకే. టీకా పూర్తిగా వేసుకున్నా సరే భారతీయులు క్వారంటైన్లో ఉండాలన్న బ్రిటన్ టీకా విధానం ‘పూర్తిగా దుర్విచక్షణ విధానం’ అని భారత ప్రభుత్వం పేర్కొంది. బ్రిటన్ తాజా నిర్ణయానికి తర్కం లేదు. సరికదా కనీసం శాస్త్రీయ కారణాలైనా లేవు. కోవిషీల్డ్ టీకా ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడ్డదేమీ కాదు. సాక్షాత్తూ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సహకారంతో తయారైన బ్రిటన్ ఉత్పత్తి ఆస్ట్రాజెనెకా టీకాకు అది మరో పేరు. మరో రూపం. ఆక్స్ఫర్డ్, ఆస్ట్రాజెనెకాలు సాంకేతిక విజ్ఞానాన్ని బదలాయించడంతో, అక్కడి టీకాకు లైసెన్సు తీసుకొని, ఇక్కడ భారత్‌లో కోవిషీల్డ్ పేరిట సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) తయారుచేసింది. అంటే, అది భారత్‌లో తయారైన బ్రిటన్ టీకా. పైపెచ్చు, భారత్‌లో తయారైన ఈ కోవిషీల్డ్ టీకాలలో 50 లక్షల టీకాలను మళ్ళీ అదే బ్రిటన్ అభ్యర్థన మేరకు, ఆ దేశ ఆరోగ్య అవసరాల నిమిత్తం అందజేశాం. వాటన్నిటినీ బ్రిటన్ తమ దేశపౌరులకు శుభ్రంగా వినియోగించుకుంది. కానీ, ఇప్పుడు అదే టీకాలు వేసుకున్న భారతీయ ప్రయాణికులను మాత్రం అసలు టీకాలే వేసుకోని వ్యక్తులుగా భావిస్తామంటోంది. ఇది ఏ రకంగా చూసినా అసమంజసం. వలసవాద బ్రిటన్ వదిలిపెట్టని జాత్యహంకారానికి నిదర్శనం. మరోపక్క టీకా వేసుకున్న భారతీయులకూ, ఇతర దేశస్థులకూ ఈ నవంబర్ నుంచి విమాన ప్రయాణ అనుమతులిస్తున్నట్టు అమెరికా ప్రకటించడం గమనార్హం. అమెరికా సహా ఇతర దేశాలు వేటికీ లేని ఈ టీకా దుర్విచక్షణ లేనిపోని భయాలతో బ్రిటన్ బుర్రలో మొలవడం ఆశ్చర్యకరం. ఏ దేశానికి ఆ దేశం యథేచ్ఛగా నిర్ణయం తీసుకొనే అధికారాన్ని కాదనలేం. కానీ ప్రపంచమొక కుగ్రామమై, పరస్పరం ఆధారపడ్డ వేళ ఈ వైఖరి సరికాదు. దీన్ని తక్షణమే వదిలిపెట్టాలని మంగళవారం బ్రిటన్‌కు, భారత్ స్పష్టం చేసింది అందుకే. బ్రిటన్ షరతులు సడలించిందా సరే! లేదంటే ప్రతిస్పందన చర్యలకు భారత్ సిద్ధం. బహుశా, బ్రిటన్ ఆ పరిస్థితి తీసుకురాకపోవచ్చు. కోవిడ్ టీకాల ఉత్పత్తిలో ప్రపంచ దేశాల్లో భారత్ ముందు వరుసలో నిలిచింది. అంతేకాక, 95కి పైగా దేశాలకు ఎగుమతి కూడా చేస్తోంది. ఇక, ప్రపంచవ్యాప్తంగా 560 కోట్ల డోసుల కోవిడ్ టీకాలు వేసినట్టు ఇటీవలి లెక్క. అందులో ప్రతి ఏడింటిలో ఒకటి భారత్‌లో వేసినదే. అలా భారత్‌లో వేసిన డోసుల్లోనూ అత్యధికం కోవిషీల్డ్ టీకాలే. ప్రపంచమే అంగీకరించిన ఆ టీకాను వేసుకున్న భారతీయుల్ని తాము మాత్రం అంగీకరించబోమని బ్రిటన్ అనడం మూర్ఖత్వానికి పై మెట్టు. కరోనాపై అభివృద్ధి చెందిన దేశాల వైఖరిలో కొన్ని అంశాలు అందరినీ ఇరుకున పెడుతున్నాయి. ముఖ్యంగా, అంతగా అభివృద్ధి చెందని దేశాలపై ఆ వైఖరి దుర్విచక్షణ పూరితంగా కనిపిస్తోంది. మచ్చుకు, చైనా టీకాలు వేటినీ రోగనిరోధకతకు అంగీకారయోగ్యమైనవిగా భావించేది లేదని యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఒక విధానం పెట్టుకుంది. ఆ విధానాన్ని పునరాలోచించుకోవాల్సి ఉంది. ఇప్పటివరకు కేవలం చైనా వారి సినోవాక్ టీకానే ఈయూ అంగీకరిస్తోంది. అదీ ఈయూలో 8 దేశాలే ఆ టీకాకు ఓకే అంటున్నాయి. ఇది సమర్థనీయం కాదు. అత్యవసర వినియోగానికి తాను అనుమతించిన టీకాలన్నిటినీ ప్రయాణికుల విషయంలో గుర్తించాలని ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ ఎప్పుడో చెప్పింది. అలా ఆ సంస్థ ఆమోదం పొందిన అధీకృత టీకాలలో చైనా టీకాలూ ఉన్నాయి. అయినా సరే, ఇప్పటికీ ఈయూ లాంటివి చైనా టీకాలను పట్టించుకోవట్లేదన్నది చేదు నిజం. అలాగే, ఆస్ట్రాజెనెకా తెచ్చుకున్న ఆమోదంతో సంబంధం లేకుండా, అదే టీకాకు కోవిషీల్డ్ స్వతంత్రంగా దరఖాస్తు చేసుకొని, ఆరోగ్యసంస్థ గ్రీన్‌సిగ్నల్ పొందింది. అంటే, ఆ టీకాను 95 దేశాలకు పైగా ఎగుమతి చేసుకోవచ్చు. ఇవన్నీ తెలిసి కూడా బ్రిటన్ ఇప్పుడిలా ప్రవర్తించడం విస్మయం రేపుతోంది. ఇలా కొన్ని టీకాల పట్ల దుర్విచక్షణ వల్ల అనవసరంగా ‘‘రెండంచెల విధానం తయారు అవుతుంద’’న్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆవేదన. నిజానికి, అభివృద్ధి చెందిన దేశాలు అనుసరించే ఈ తప్పుడు వైఖరి వల్ల మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో ప్రపంచంలో అసమానతలు పెరుగుతాయి. ఈయూ మొదలు తాజా షరతుల బ్రిటన్ దాకా దేశాలన్నీ ఆ కీలక అంశం గుర్తించాలి. తక్షణ దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. ఎందుకంటే, ఇది వ్యక్తిగతం కాదు... ఓ మహమ్మారిపై కలసికట్టుగా చేయాల్సిన ప్రపంచ పోరాటం. -
Facebook: ‘మనుషుల్ని కోతుల్లాగా..’! ఫేస్బుక్లో దుమారం
సోషల్ మీడియా దిగ్గజ ప్లాట్‌ఫామ్ ఫేస్బుక్ వివాదంలో చిక్కుకుంది. రేసిజం సంబంధిత ఫీచర్‌ను ఎంకరేజ్ చేయడం ద్వారా నెటిజన్స్ నుంచి విమర్శలు ఎదుర్కొంది. అయితే నష్టనివారణ కోసం క్షమాపణలు చెప్పినప్పటికీ.. నెటిజన్స్ ఆగ్రహం మాత్రం చల్లారడం లేదు. విషయం ఏంటంటే.. ఓ బ్రిటిష్ టాబ్లాయిడ్‌కు చెందిన వీడియో(జూన్ 2020లోది) ఒకటి ఈ మధ్య ఫేస్బుక్లో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో నల్ల జాతీయులను ఉద్దేశించి.. ‘ఇలాంటి కోతుల వీడియోలు మరిన్ని కోరుకుంటున్నారా?’ అంటూ యూజర్లను కోరింది ఫేస్బుక్. అంతే.. ఇది జాత్యంహాకార వ్యవహారమేనంటూ ఫేస్బుక్ తీరును దుమ్మెత్తిపోస్తున్నారు కొందరు. ఇది కచ్చితంగా పొరపాటే. జరిగిన దానికి క్షమాపణలు చెప్తున్నాం అని ఫేస్బుక్ ప్రకటించింది. ఆ టాపిక్‌ను డిసేబుల్ చేయడంతో పాటు పొరపాటు ఎక్కడ జరిగిందనేదానిపై దర్యాప్తు చేయిస్తామని ఓ ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉంటే ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌పై మేధావులు, మానవ హక్కుల సంఘాల నుంచి తీవ్ర ఎత్తున్న అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రైమేట్స్‌లో కోతులు, చింపాంజీలు, గొరిల్లాతో పాటు మనుషులు కూడా ఉంటారని, బహుశా ఆ ఉద్దేశంతో అలా రికమండేషన్ వచ్చి ఉంటుందని కొందరు టెక్నికల్ నిపుణులు చెప్తున్నారు. అయినప్పటికీ ఇది ముమ్మాటికీ రేసిజం వ్యవహారామేనని ఫేస్‌బుక్‌పై దావాకి సిద్ధం అవుతున్నారు మనోభావాలు దెబ్బతిన్న కొందరు. చదవండి: భారత్ కొత్త ఐటీ చట్టాలపై పోరుకు రెడీ -
'నా ప్రవర్తనకు సిగ్గుపడుతున్నా.. క్షమించండి'
డర్బన్: తాను క్రికెట్ ఆడే రోజుల్లో జాతివివక్షకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ మార్క్ బౌచర్ స్పందించాడు. తన ప్రవర్తనపై బౌచర్ క్షమాపణలు చెప్పాడు. విషయంలోకి వెళితే.. దక్షిణాఫ్రికాకు క్రికెట్ ఆడుతున్న సమయంలో బౌచర్ నల్లజాతీయ సహచరులను ఉద్దేశించి పాటలు పాడి, వారిని మారుపేర్లతో పిలిచి అవమానించాడు. తాజాగా దక్షిణాఫ్రికా క్రికెటర్ పాల్ అడమ్స్.. తాను జాతి వివక్షకు గురయ్యానంటూ ఆరోపణలు చేశాడు. ఈ అంశానికి సంబంధించి బౌచర్ 14 పేజీలతో కూడిన ప్రమాణ పత్రాన్ని దక్షిణాఫ్రికా సోషల్ జస్టిస్ అండ్ నేషన్ బిల్డింగ్ కమిటీకి సమర్పించాడు. చదవండి: WI Vs PAK: చెలరేగిన షాహిన్ అఫ్రిది.. విండీస్ 150 ఆలౌట్ ''ఆరోజుల్లో నేను నల్లజాతీయులపై ప్రవర్తించిన తీరుకు సిగ్గుపడుతున్నా.. ఆరోజు నేను ఆరోపణలు చేసినవారిలో పాల్ అడమ్స్ కూడా ఉన్నాడు. అడమ్స్‌ను మారుపేరుతో పిలుస్తూ పాటలు పాడాను.. ఇది బాధాకరం. ఈ విషయంలో మరింత సున్నితంగా వ్యవహరించాల్సింది. ఏది ఏమైనా నా అమర్యాద ప్రవర్తనకు క్షమాపణలు చెబుతున్నా. ఆ కాలంలో జట్టు, సహాయ సిబ్బంది, సెలక్టర్లు, సీఎస్ఏ మరింత సున్నితంగా వ్యవహరించాల్సింది. జట్టు సభ్యులందరూ స్వేచ్చగా మాట్లాడే వాతావరణం కల్పించాల్సింది'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మార్క్ బౌచర్ దక్షిణాఫ్రికా తరపున 147 టెస్టుల్లో 5515 పరుగులు, 295 వన్డేల్లో 4686 పరుగులు, 25 టీ20ల్లో 268 పరుగులు చేశాడు. వికెట్ కీపర్‌గా 532 క్యాచ్‌లు.. 555 స్టంపింగ్స్ చేశాడు. 2012లో సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో వికెట్ బెయిల్ కంటికి తగలడంతో దురదృష్టవశాత్తూ ఆటకు దూరమవ్వాల్సి వచ్చింది. ప్రస్తుతం బౌచర్ సౌతాఫ్రికా క్రికెట్ ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. చదవండి: Ajinkya Rahane: ‘నా గురించి చర్చించడం మంచిదేగా’ -
తనను జట్టులోకి తీసుకుంటే రిటైరవుతామని బెదిరించారు..
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా క్రికెట్లో జాతి వివక్ష కొత్తేమీ కాదు. ఇప్పటికే జాత్యాహంకారం కారణంగా ఆ దేశ క్రికెట్ జట్టు అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఆ దేశ దిగ్గజ ఆటగాళ్లపై ఇలాంటి ఆరోపణలు రావడం ఆ దేశ క్రికెట్లో సంచలనం రేపుతోంది. సఫారీ లెజెండరీ క్రికెటర్ ఏబీ డివిల్లియర్స్, ఆ దేశ మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్‌లపై అదే దేశానికి చెందిన నల్లజాతి క్రికెటర్, వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్ తమి సోలెకిలే జాత్యాంహంకార ఆరోపణలు చేశాడు. గతంలో (2011-2015) ఐదేళ్ల పాటు తాను నేషనల్ కాంట్రాక్ట్ దక్కించుకున్న సమయంలో నాటి కెప్టెన్ గ్రేమ్ స్మిత్, ఏబీడీలు తనకు సరైన అవకాశాలు ఇవ్వకుండా తన ఎదుగుదలను అడ్డుకున్నారని, తనను జట్టులోకి తీసుకుంటే రిటైరవుతామని కూడా బెదిరించారని సోలికెలే ఆరోపించాడు. ఆ ఇద్దరు తనను తొక్కేశారని, అందువల్లే బ్యాకప్ ప్లేయర్‌గా మిగిలిపోయానని పేర్కొన్నాడు. 160 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన తనకు, కేవలం మూడు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కిందని వాపోయాడు. నాడు కెప్టెన్‌గా గ్రేమ్ స్మిత్ లేకపోయి ఉంటే, తాను మరిన్ని మ్యాచ్‌లు ఆడేవాడినని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. గ్రేమ్ స్మిత్‌కు నేను జట్టులో ఉండటం అస్సలు ఇష్టం లేదని జాతీయ సెలక్షన్ కన్వీనర్స్ ఆండ్రూ హడ్సన్, లిండా జోండిలతో కలిసి న్యాయస్థానం ముందు ఆరోపణలు చేశాడు. 2013లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ సమయంలో రెగ్యులర్ వికెట్ కీపర్ మార్క్ బౌచర్ కంటి గాయంతో బాధపడుతున్నాడని, తనకు తుది జట్టులో చోటు ఖాయమని సెలక్టర్ హడ్సన్ చెప్పాడని పేర్కొన్నాడు. అయితే, అప్పటివరకు ఎన్నడూ వికెట్ కీపింగ్ చేయని ఏబీ డివిల్లియర్స్, నాకు జట్టులో చోటు దక్కకూడదనే ఉద్దేశంతో వికెట్ కీపింగ్ చేయడానికి రెడీ అయ్యాడని ఆరోపించాడు. గ్రేమ్ స్మిత్, ఏబీడీలకు నల్ల జాతీయులతో కలిసి డ్రెసింగ్ రూమ్ షేర్ చేసుకోవడమన్నా, వారితో మాట్లాడటమన్నా అస్సలు ఇష్టం ఉండదని వ్యాఖ్యానించాడు. నేను తన జట్టులో ఉండడం గ్రేమ్ స్మిత్‌కు ఇష్టం లేదని స్వయానా సెలక్టర్లే తనతో చెప్పినట్లు తెలిపాడు. కాగా, తమీ సోలెకిలే తన ఐదేళ్ల కాంట్రాక్ట్‌లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా సహా పలు విదేశీ టూర్లకు ఎంపికయ్యాడు. -
నువ్వేం మనిషివి.. సిగ్గులేకుండా సంబురాలా?
నాటకీయ పరిణామాల నడుమ బ్రిటిష్ప్రి రేస్ నెగ్గిన ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్ లూయిస్ హామిల్టన్‌పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. రెడ్‌బుల్ రేసర్ మాక్స్ వెర్స్టాపెన్ని ఢీ కొట్టాడని, అతను ఆస్పత్రి పాలైతే.. లూయిస్ గెలిచి సంబురాలు చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని హామిల్టన్‌ను నిలదీస్తున్నారు. ఆదివారం బ్రిటిష్ గ్రాండ్‌ప్రి రేసులో విజేతగా నిలిచాడు మెర్సెడెస్ రైడర్ లూయిస్ హామిల్టన్. అయితే తొలి ల్యాప్‌లోనే రెడ్‌బుల్ రైడర్ మాక్స్ వెర్స్టాపెన్ను ప్రమాదకరమైన మలుపుతో ఢీకొట్టడం, ఆపై వెర్స్టాపెన్ను ఆస్పత్రికి తరలించడంతో వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో లూయిస్‌కు పది సెకండ్ల పెనాల్టీ విధించారు. అయినప్పటికీ లూయిస్ రేస్ నెగ్గి, సంబురాలు చేసుకున్నాడు. అయితే తాను ఆస్పత్రి పాలైన టైంలో వేడుకలు చేసుకోవడం సరికాదని వ్యాఖ్యానించాడు వెర్స్టాపెన్. ‘లూయిస్ తీరు సరికాదు. అమానుషం. స్పోర్టివ్ స్ఫూర్తికి విరుద్ధం. ఆటగాళ్లు వ్యవహరించాల్సిన తీరు అది కానేకాద’ని అసహనం వ్యక్తం చేశాడు. మరోవైపు సిగ్గులేకుండా క్రాష్‌కి పాల్పడి.. గెలుపు సంబురాలు చేసుకున్నాడని, అదసలు గెలుపే కాదని పలువురు కామెంట్లు చేస్తున్నారు. What a crash! @SkySports @SkySportsF1 @SilverstoneUK @redbullracing @Max33Verstappen @F1 #f1 #BritishGrandPrix #maxverstappen #RedBullRacing #britishgp #formula1 pic.twitter.com/zpFHwUwiEG — Killian Connolly (@Kill_Connolly) July 18, 2021 మొత్తం లక్షా నలభై వేలమంది వ్యూయర్స్ మధ్య ఆదివారం బ్రిట్రిష్ గ్రాండ్‌ప్రి జరిగింది. అయితే పోల్ పొజిషన్‌తో రేసును ఆరంభించిన వెర్స్టాపెన్, లూయిస్ ఢీ కొట్టడంతో తొలి ల్యాప్‌లోనే వైదొలిగాడు. ఆ వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఇక 52 ల్యాప్‌ల రేసును 58 నిమిషాల 23.284 సెకన్లలో పూర్తి చేశాడు లూయిస్. తద్వారా బ్రిటిష్ గ్రాండ్‌ప్రిలో వరుసగా మూడో ఏడాది.. ఓవరాల్‌గా ఏనిమిదో సారి విజేతగా నిలిచాడు. Glad I’m ok. Very disappointed with being taken out like this. The penalty given does not help us and doesn’t do justice to the dangerous move Lewis made on track. Watching the celebrations while still in hospital is disrespectful and unsportsmanlike behavior but we move on pic.twitter.com/iCrgyYWYkm — Max Verstappen (@Max33Verstappen) July 18, 2021 జాతి వివక్ష మరోవైపు రెడ్‌బుల్ ఈ విజయాన్ని క్రూరత్వంగా వర్ణిస్తోంది. హామిల్టన్‌కు పెనాల్టీ సరిపోయే శిక్ష కాదని చెబుతోంది. ఇదిలా ఉంటే లూయిస్ హామిల్టన్‌పై సోషల్ మీడియాలో జాతి వివక్ష కామెంట్లు మొదలయ్యాయి. కోతి(మంకీ) ఎమోజీలను ఉంచుతున్నారు చాలామంది. మరోవైపు మెర్సడెస్ ఈ కామెంట్లను ఖండిస్తోంది. వర్ణ వివక్షకు తాము వ్యతిరేకమని, టాలెంట్ ఉన్న ఆటగాళ్లను ప్రోత్సహించడమే మా పని అంటూ పేర్కొంది. -
జాతీయ గీతానికి అవమానం! ఆమెది తలపొగరేనా?
ఆమెది మామూలు తలపొగరు కాదు. తిక్క కుదర్చాల్సిందే. ఇంతకు ముందు కూడా ఇలాగే చేసింది. జాతీయ గీతం అంటే ఆమెకు లెక్కే లేదు. దేశమంటే గౌరవమూ లేదు. ముందు ఆమెను ఒలింపిక్స్‌కు పోనివ్వకుండా అడ్డుకోండి.. ఇది యూఎస్ ఒలింపిక్స్ కమిటీకి చేరుతున్న ఫిర్యాదులు. హామర్ థ్రో క్రీడాకారిణిగా ఒలింపిక్స్‌కు వెళ్లబోతున్న గ్వెన్ బెర్రీని.. అక్కడి ప్రజలు అడ్డుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చిందంటే.. న్యూయార్క్: శనివారం నాడు యూఎస్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఒలింపిక్ ట్రయల్స్ జరిగాయి. హమర్ థ్రో విభాగంలో మూడో ప్లేస్‌లో నిలిచింది 32 ఏళ్ల గ్వెన్ బెర్రీ. ఆపై మెడల్స్ బహుకరణ తర్వాత.. జాతీయ గీతం ప్రదర్శించిన టైంలో పోడియం వద్ద ఆమె తలబిరుసు ప్రదర్శించింది. ఆ టైంలో ఆమె మిగతా ఆటగాళ్లకు వ్యతిరేక దిశలో నిలబడింది. పైగా ఏ మాత్రం గౌరవం లేకుండా.. నడుం మీద చెయ్యి వేసుకుంది. జాతీయ గీతం అంటే ఏ మాత్రం పట్టనట్లుగా వ్యవహరించింది. అంతకు ముందు నెత్తి మీద నల్ల గుడ్డతో నిరసన కూడా వ్యక్తం చేసింది. అందుకే ఆమె మీద అమెరికన్లు మండిపడుతున్నారు. నాకంత ఓపిక లేదు దీనిపై బెర్రీ వివరణ ఇచ్చుకుంది. ఐదు నిమిషాలు తమను ఎండలో ఎదురుచూసేలా చేశారని, అందుకే అలా చేశానని చెప్పింది. ఇక బెర్రీ చేష్టలపై దుమారం చెలరేగింది. రాజకీయ నేతలంతా ఆమెపై విరుచుకుపడ్డారు. మరోవైపు శాంతియుత నిరసన ప్రదర్శన కావడంతో వైట్ హౌజ్ కూడా ఆమె తప్పును మన్నించినట్లు ప్రకటించింది. అయినా విమర్శలు మాత్రం ఆగట్లేదు. ఆమెను ఒలింపిక్స్‌కు వెల్లనీయకుండా అడ్డుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తూ యూఎస్ ఒలింపిక్స్ కమిటీకి పలువురు మెయిల్స్ పెడుతున్నారు. “I’m here to represent those … who died due to systemic racism. That’s why I’m going. The anthem doesn’t speak for me, it never has.” - @MzBerryThrows Gwen, you got so much love coming from me 🤍 https://t.co/haoDJdavO8 — Morolake Akinosun™ (@MsFastTwitch) June 29, 2021 కొనసాగుతున్న నిరసన కానీ, ఆమె ఉద్దేశం అది కానే కాదు. అది నిరసన. నల్ల జాతీయలపై అమెరికాలో జరుగుతున్న దాడులు, కొనసాగుతున్న వివక్షకు వ్యతిరేకంగానే ఆమె ఆ పని చేసింది. ఆ టీ షర్ట్ మీద యాక్టివిస్ట్ అథ్లెట్ అని రాసి ఉంటుంది. పైగా బెర్రీకి ఇది కొత్తేం కాదు. ఇంతకు ముందు 2019లో పాన్ అమెరికన్ గేమ్స్ సందర్భంగా జాతీయ గీతం ప్రదర్శితమైన సందర్భంలో పిడికిలిని బిగించి తన ఉద్దేశ్యాన్ని చాటింది. ఆ టైంలో ఆమె చేష్టలతో స్పాన్సర్షిప్ కంపెనీలు దూరమయ్యాయి. 12 నెలల పాటు ఆమెపై వేటు పడింది. అయినా ఆమె జాతి వివక్ష వ్యతిరేక నిరసనలు ఆపనంటోంది బెర్రీ. తాజా పరిణామాల నేపథ్యంలో ‘నాతో ఆటలు ఆపండి’అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిందామె. ఇక జాతి.. వర్ణ వివక్షలకు వ్యతిరేకంగా, సామాజిక న్యాయం కోసం ఇలాంటి శాంతియుత ప్రదర్శనలకు అమెరికాలో అనుమతి ఉందని, అందుకే ఆమెపై ఎలాంటి చర్యలు ఉండబోవని యూఎస్ ఒలింపిక్ కమిటీ స్పష్టం చేసింది. దీంతో ఆమె ఒలింపిక్స్ ప్రయాణం సాఫీగా సాగనుంది. కానీ, టోక్యో ఒలింపిక్స్ వేదికపై మాత్రం ఇలాంటివి కుదరవు. రూల్ నెంబర్ 50 ప్రకారం.. ఎలాంటి నిరసనలకు అంతర్జాతీయ ఆటల పోటీల్లో చోటు లేదు. చదవండి: ఎట్టకేలకు దిగొచ్చిన ఫేస్బుక్ -
‘యూకేలో పెరిగితే ఇంతకాలం బతికేవాడిని కాను’
జోహెన్నెస్‌బర్గ్: మాజీ వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ మైకెల్ హోల్డింగ్ జాత్యహంకార ధోరణిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అదృష్టవశాత్తు తాను ఇంగ్లండ్‌లో పెరగలేదని.. లేదంటే యువకుడిగా ఉన్నప్పుడే తాను మరణించేవాడినని పేర్కొన్నాడు. యవ్వనంలో ఉండగా తాను చాలా దూకుడుగా వ్యవహరిచేంవాడినని.. ఆ సమయంలో తాను ఇంగ్లండ్‌లో ఉంటే కచ్చితంగా ఈపాటికే మరణించేవాడినన్నాడు మైకెల్. అమెరికాలో చోటు చేసుకున్న జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతం తర్వాత వచ్చిన బ్లాక్‌లైవ్స్ మ్యాటర్ ఉద్యమంలో మైకెల్ చురుకుగా వ్యవహరిస్తున్నాడు. జాత్యాహంకార ధోరణిపై మైకెల్ ‘‘వై వీ నీల్, హౌ వి రైజ్’’ అనే పుస్తకాన్ని రాశాడు. త్వరలోనే ఇది విడుదల కానుంది. ఈ క్రమంలో మైకెల్ మాట్లాడుతూ.. ‘‘నేను జమైకాలో పెరిగాను. కనుక ఎప్పుడు జాత్యహంకారాన్ని చవి చూడలేదు. కానీ అక్కడ నుంచి వేరే దేశాలకు వెళ్లిన ప్రతి సారి నేను నేను దాన్ని ఎదుర్కొన్నాను. ప్రతిసారి నాకు నేను సర్ది చెప్పుకునేవాడిని.. ఇది నీ దేశం కాదు.. త్వరలోనే నీవు నీ స్వస్థలం వెళ్తావు. అక్కడ నీకు ఇలాంటి చెడు అనుభవాలు ఎదురుకావని నాకు నేనే నచ్చచెప్పుకునేవాడిని’’ అని తెలిపాడు. ‘‘ఇక యువకుడిగా ఉన్నప్పుడు నేను చాలా దూకుడుగా ఉండేవాడిని. నేను న్యూజిలాండ్ (1980) లో ఉండగా మైదానం నుంచి ఒక స్టంప్‌ను బయటకు తన్నాను. అదృష్టం కొద్ది నేను ఇంగ్లండ్‌లో పెరగలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే ఆనాటి నా ప్రవర్తన తర్వాత నేను ఇంతకాలం బతికి ఉండేవాడినే కాదు” అని హోల్డింగ్ ది టెలిగ్రాఫ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. “ఈ విషయంలో నేను ఓ స్టాండ్ తీసుకుంటే నా కెరీర్ ఇప్పుడున్నంత కాలం ఉండేది కాదు. అలానే నాకు ఈ సుదీర్ఘ టెలివిజన్ కెరీర్ కూడా ఉండేది కాదు. తమ హక్కుల కోసం నిలబడి అన్యాయాన్ని ఎదిరించిన నల్లజాతీయులు బాధితులవుతున్నారని మేము చరిత్ర ద్వారా తెలుసుకున్నాము. ఒకవేళ నేను కూడా ఈ జాత్యహంకార ధోరణి గురించి మాట్లాడి ఉంటే వారు ‘మరో యువకుడు మనల్ని ఎదరిస్తున్నాడు.. అతనిని వదిలించుకోండి’ అని చెప్పేవారు. అప్పుడు నేను పేడ కుప్పలో మరొక వ్యక్తిగా ఉండేవాడిని” అన్నాడు హోల్డింగ్. -
జాత్యహంకారం.. కెమెరాకు చిక్కిన ప్లేయర్
బెల్గ్రేడ్: జాత్యంహకారం, సెక్సీయెస్ట్ కామెంట్ల నేపథ్యంలో ఆటగాళ్లపై వేటు పడుతున్న ఘటనలు ఈమధ్య వరుసగా జరుగుతున్నాయి. అంతేకాదు పాత ఘటనల్ని సైతం తవ్వి తీసి.. విమర్శిస్తున్నారు. ఈ తరుణంలో సెర్బియన్ వాలీబాల్ ప్లేయర్ ఒకరు.. కోర్టులోనే జాత్యహంకార ధోరణిని ప్రదర్శించి వేటుకి గురైంది. జూన్ 1న థాయ్‌లాండ్, సెర్బియా మహిళా జట్ల మధ్య వాలీబాల్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ మధ్యలో సంజా జుర్డ్జెవిక్ అనే సెర్బియన్ ప్లేయర్.. థాయ్‌లాండ్ ఆటగాళ్లను వెక్కిరిస్తూ సైగ చేసింది. ఇది థాయ్ ఆటగాళ్లు పట్టించుకోకపోయినా.. ఆమె అలా చేసినప్పుడు స్క్రీన్ షాట్స్ వైరల్ అయ్యాయి. దీంతో అగ్గిరాజుకుంది. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తడంతో సంజా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వివరణ ఇచ్చుకుంది. తాను మ్యాచ్ ముగిశాకే థాయ్‌లాండ్ టీంకు క్షమాపణలు చెప్పానని, ఇప్పుడు మరోసారి చెప్తున్నానని ప్రకటించింది. అయినా వివాదం చల్లారక పోవడంతో ఆమెపై రెండు మ్యాచ్‌ల నిషేధంతో పాటు 16 వేల పౌండ్ల ఫైన్ కూడా విధించింది ఇంటర్నేషనల్ వాలీబాల్ ఫెడరేషన్. ఈ జరిమానాను యాంటీ డిస్క్రిమినేషన్ ఛారిటీకి లేదంటే ఏదైనా ఎడ్యుకేషనల్ సొసైటీకి డొనేట్ చేయాలని వెల్లడించింది. మరోవైపు ఈ ఘటనపై సెర్బియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ కూడా క్షమాపణలు చెప్పింది.ఇంతకుముందు 2017లో సెర్బియన్ వాలీబాల్ టీం యూరోపియన్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ తర్వాత.. ఇలాంటి చేష్టలకే పాల్పడి విమర్శలు ఎదుర్కొంది. 2008లో స్పానిష్ బాస్కెట్‌బాల్ టీం, 2017లో అర్జెంటీనా ఫుట్‌బాల్ టీం. చైనా వాళ్లను అవహేళన చేస్తూ కళ్లను చిన్నవి చేసి ఫొటోలు దిగి విమర్శలపాలయ్యాయి. చదవండి: ఫ్రస్ట్రేషన్ ట్వీట్లపై సారీ! -
జాతి వివక్ష: చిక్కుల్లో పడిన మోర్గాన్, బట్లర్
లండన్: సోషల్ మీడియా వేదికగా చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలు ఇంగ్లండ్ క్రికెట్‌ను కుదిపేస్తున్నాయి. ఇంగ్లండ్ యువ బౌలర్ ఓలీ రాబిన్సన్ ఎనిమిదేళ్ల కిందట చేసిన జాతి వివక్ష ట్వీట్లను సీరియస్‌గా తీసుకున్న ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేసింది. అతని ట్వీట్స్‌పై విచారణ ప్రారంభించిన ఈసీబీ పలువురు ఇంగ్లండ్ క్రికెటర్లు గతంలో చేసిన పాత ట్వీట్లను వెలికితీస్తోంది. ఇప్పుడు ఈ వివాదం ప్రస్తుత ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మెర్గాన్‌తో పాటు వికెట్ కీపర్ జోస్ బట్లర్‌లను చిక్కుల్లో పడేలా చేసింది. దీనిపై టెలిగ్రాఫ్ పత్రిక ఒక కథనం విడుదల చేసింది. టెలిగ్రాఫ్ కథనం ప్రకారం.. ఐపీఎల్లో కోల్‌కతా కెప్టెన్‌గా ఉన్న ఇయాన్ మోర్గాన్, రాజస్థాన్ రాయల్స్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ కూడా గతంలో ఇండియన్స్‌ను వెక్కిరిస్తూ పలు ట్వీట్లు చేశారు. మోర్గాన్, బట్లర్ ఇద్దరూ సర్ అనే పదం పదే పదే వాడుతూ ఇండియన్స్‌ను వెక్కిరించారు. కావాలని తప్పుడు ఇంగ్లిష్ వాడుతూ చేసిన ఆ ట్వీట్లు ఇండియన్స్‌ను వెక్కిరించేలాగానే ఉన్నట్లు ఈసీబీ భావిస్తోంది. 2018 ఐపీఎల్ సందర్భంగా వీళ్లు ఈ ట్వీట్లు చేశారు. బట్లర్ ఆ ట్వీట్లను తొలగించినా.. వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్ బయటకు వచ్చింది. విచారణ పూర్తయిన తర్వాత ఈ ఇద్దరిపై చర్యలు తీసుకోవాలో వద్దో నిర్ణయిస్తామని ఈసీబీ చెప్పినట్లు టెలిగ్రాఫ్ వెల్లడించింది. రాబిన్సన్ను సస్పెండ్ చేసిన తర్వాత వీళ్ల పాత ట్వీట్లు కూడా వైరల్ అయ్యాయి. మరోవైపు ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్‌పైనా విచారణ జరిగే అవకాశం ఉంది. 2010లో అతడు తన సహచర బౌలర్ బ్రాడ్ హెయిర్‌కట్‌పై స్పందిస్తూ.. 15 ఏళ్ల లెస్బియన్లా కనిపిస్తున్నాడంటూ అండర్సన్ ట్వీట్ చేశాడు. దీనిపై అండర్సన్ స్పందిస్తూ.. ఎప్పుడో పదేళ్ల కిందట అలా చేశానని, ఇప్పుడు తానో వ్యక్తిగా మారిపోయానని, తప్పులు జరుగుతూనే ఉంటాయని ఈ మధ్యే వివరణ ఇచ్చుకున్నాడు. చిలికి చిలికి గాలి వానలా మారుతున్న ఈ వివాదం ఎంతవరకు వెళుతుందో చూడాలి. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడుతుంది. మొదటి టెస్టు డ్రాగా ముగియగా.. రెండో టెస్టు జూన్ 10 నుంచి ప్రారంభం కానుంది. అనంతరం ఇంగ్లండ్ జట్టు టీమిండియాతో ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 14వరకు ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. చదవండి: జాతి వివక్ష: మరో ఇంగ్లండ్ క్రికెటర్‌పై వేటు పడనుందా! కేన్ విలియమ్సన్ మోచేతికి గాయం.. కివీస్‌లో కలవరం -
జాతి వివక్ష: మరో ఇంగ్లండ్ క్రికెటర్‌పై వేటు పడనుందా!
లండన్: జాతి వివక్ష, విద్వేష, లైంగిక వ్యాఖ్యలకు సంబంధించి ట్వీట్లు చేశాడన్న కారణంతో క్రికెటర్ ఓలీ రాబిన్సన్ను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) సోమవారం అంతర్జాతీ క్రికెట్ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఎనిమిదేళ్ల క్రితం తెలియక చేసిన పని రాబిన్సన్ ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడు. తాజాగా ఈ అంశంపై విచారణ చేపట్టిన ఈసీబీ మరో ఇంగ్లండ్ ఆటగాడిని విచారించినట్లు సమాచారం. అయితే ఆ ఆటగాడు ఎవరనేది మాత్రం ఈసీబీ వెల్లడించలేదని ప్రముఖ స్పోర్ట్స్ పత్రిక విజ్డెన్ తెలిపింది. జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన ఆ క్రికెటర్ అండర్ 16 కేటగిరిలో ఉన్నాడని విజ్డెన్ పేర్కొంది. ఇదే అంశంపై ఈసీబీ అధికార ప్రతినిధి స్పందిస్తూ..'' ఓలి రాబిన్సన్పై చర్య అనంతరం జాతి వివక్ష, లైంగిక పరమైన ట్వీట్స్ చేసిన మరో ఆటగాడికి సంబంధించి మాకు సమాచారం అందింది. ఇప్పటికే ఆ దిశగా చర్యలు చేపట్టి సదరు ఆటగాడిని విచారిస్తున్నాం. నిజానిజాలు తెలియనందున ఇప్పుడే ఏం చెప్పలేం. త్వరలోనే అన్ని విషయాలు వివరిస్తాం '' అని తెలిపారు. ఇక రాబిన్సన్ 2012-13లో 19 ఏళ్ల వయసులో జాతి వివక్ష, లైంగిక పరమైన ట్వీట్స్ చేసినట్లు తేలడంతో ఈసీబీ అతన్ని అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేసింది. కాగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో తన మొదటి టెస్టులోనే రాబిన్సన్ ఆకట్టుకున్నాడు. బౌలింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి ఏడు వికెట్లు తీయడంతో పాటు.. బ్యాటింగ్‌లో 42 పరుగులు చేశాడు. ఇక న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ డ్రాతో గట్టెక్కింది. కివీస్ నిర్దేశించిన 273 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆఖరి రోజు ఆట ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. ఓపెనర్ డామినిక్ సిబ్లీ 60 పరుగులు చేసి నాటౌట్‌గా నిలువగా, కెప్టెన్ జో రూట్ (40) పర్వాలేదనిపించాడు. ఇక అరంగేట్రంలోనే ద్విశతకంతో అదరగొట్టిన కివీస్ ఆటగాడు డెవాన్ కాన్వేను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది. ఇరు జట్ల మధ్య చివరిదైన రెండో టెస్టు, జూన్ 10 నుంచి బర్మింగ్‌హామ్ వేదికగా జరగనుంది. చదవండి: తొమ్మిదేళ్ల కిందట ట్వీట్లు.. ఇప్పుడు శిక్ష! -
తొమ్మిదేళ్ల కిందట ట్వీట్లు.. ఇప్పుడు శిక్ష!
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం న్యూజిలాండ్ సిరీస్‌లో రాణిస్తున్న ఆల్‌రౌండర్ ఓలీ రాబిన్సన్ను అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం ప్రకటించింది. ఈ మేరకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఒక ప్రకటన రిలీజ్ చేసింది. అయితే ఇందుకు కారణం గతంలో అతను చేసిన ఫ్రస్ట్రేషన్ ట్వీట్లే. లండన్: ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ రాబిన్సన్ 2012-13లో తన ట్విట్టర్ అకౌంట్లో జాత్యాంహకార, సెక్సీయెస్ట్ ట్వీట్లు చేశాడు. కానీ, ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. కాగా, న్యూజిలాండ్ సిరీస్‌కు రాబిన్సన్ ఎంపిక కాగానే కొందరు అప్పటి ట్వీట్లను తెరపైకి తీసుకొచ్చారు. దీంతో పెద్ద రచ్చే అయ్యింది. ఇక జూన్ 3న ప్రారంభమైన తొలి టెస్ట్(మ్యాచ్ డ్రా అయ్యింది)కి ముందే ఈ వివాదంపై స్పందించిన రాబిన్సన్.. ‘‘నేను చేసిన పనికి బాధపడుతున్నా. అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు నేను సిగ్గుపడుతున్నాను’’ అని రాబిన్సన్ బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పాడు. నా కెరీర్ అత్యంత ఘోరమైన దశలో ఉన్నప్పుడు ఫ్రస్ట్రేషన్లో ఆ ట్వీట్లు చేశా, ఇంగ్లీష్ కౌంటీ యార్క్‌షైర్ నన్ను యుక్తవయసులో తరిమేసింది. ఆ ట్వీట్లు ఇప్పటికీ ఉన్నాయో లేదో నాకు తెలియదు. ప్రజలకు, నా సహచర ఆటగాళ్లకు.. అందరికీ క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను’’ అని రాబిన్సన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. కమిటీ రిపోర్ట్ ఆధారంగానే.. న్యూజిలాండ్‌తో గత బుధవారం ఆరంభమైన తొలి టెస్టుతో ఇంగ్లండ్ టీమ్‌లోకి అరంగేట్రం చేసిన రాబిన్సన్.. రెండు ఇన్నింగ్స్‌ల్లో 7 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లో 42 పరుగులు చేశాడు. అయితే మ్యాచ్ జరుగుతుండగానే ఈసీబీ అతని ట్వీట్స్‌పై విచారణ కోసం ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీని నియమించే ముందు ‘రేసిజం కామెంట్లను ఏమాత్రం సహించబోము’’ అని ఈసీబీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కమిటీ అందించిన రిపోర్ట్ ప్రకారం.. రాబిన్సన్పై క్రమశిక్షణ చర్యల కింద ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి సస్పెండ్ చేస్తూ ఈసీబీ నిర్ణయం తీసుకుంది. దాంతో.. ఈ టాలెంటెడ్ ఆల్‌రౌండర్ కెరీర్ సంగ్ధిగ్దంలో పడినట్లయ్యింది. చదవండి: ఏడేళ్ల గ్యాప్ తర్వాత టెస్ట్ -
డార్నెల్లా ఫ్రెజర్.. నిప్పులా ఉద్యమాన్ని రాజేసింది!
ధైర్యం ఏ రూపంలో ఉంటుంది? ఘనమా? ద్రవమా? వాయువా? శబ్దమా? నిశ్శబ్దమా? ఇవన్నీ కలిసిన రూపమా? అయితే ఆ రూపానికి డార్నెల్లా ఫ్రెజర్ అని పేరు పెట్టాలి. తెల్లజాతి పోలీసు మోకాలి కింద బిగుసుకుపోతున్న గొంతుతో ఊపిరందక 9 నిముషాల పాటు ‘ఐ కాంట్ బ్రీత్’ అని మూలుగుతూ గిలగిల కొట్టుకుంటున్న నల్లజాతి మనిషి జార్జి ఫ్లాయిడ్‌ను తన ఫోన్లో షూట్ చేసిన 17 ఏళ్ల నల్ల అమ్మాయే డార్నెల్లా ఫ్రెజర్. కళ్ల ముందరి ఘాతుకానికి ఆ అమ్మాయి హృదయం చెంపల మీదకు ద్రవీభవించింది. ఆవేదన ఆమె గుండెల్లో ఘనీభవించింది. గొంతులోంచి పోతున్నది తన ప్రాణవాయువే అని ఆమెకు అనిపించింది. శబ్దానికి ముందరి నిశ్శబ్దంలా ఇంటికి వెళ్లి ఆ రోజు అర్ధరాత్రి దాటాక ఆ వీడియోను ఫేస్బుక్ లో అప్ లోడ్ చేసింది డార్నెల్లా. మొన్న మంగళవారం ఆ వీడియో సాక్ష్యంతో కోర్టు ఆ పోలీసు అధికారిని దోషిగా నిర్ధారించింది. అతడికి 40 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఏడాదిగా జరుగుతున్న ఈ కేసు విచారణకు కీలక సాక్ష్యాన్ని అందజేసి నల్లజాతి ఉద్యమానికి మళ్లీ కాస్త ఊపిరి తెచ్చింది డార్నెల్లా ఫ్రెజర్. డార్నెల్లా ఫ్రేజర్ కనుక ఆ రోజు పాదరసంలా ఆలోచించి ఉండకపోతే డెరెక్ చావిన్ ఈరోజుకీ మినియాపొలిస్ పోలీస్ ఆఫీసర్‌గానే కొనసాగుతూ ఉండేవారు. ∙∙ ఈ స్టోరీ.. పై వాక్యంతో తప్ప ఇక ఎలానూ ప్రారంభం అవడానికి లేదు. సుమారు ఏడాదిగా అత్యున్నతస్థాయి పోలీస్ ఆఫీసర్ డెరెక్ చావిన్‌పై జరుగుతున్న విచారణ మంగళవారం ముగిసింది. కోర్టు అతడికి 40 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది! విచారణలో నల్లజాతి పౌరుడు జార్జి ఫ్లాయిడ్ దుర్మరణానికి ఈ తెల్ల పోలీసు కారణమైనట్లు నిరూపించే ఏ ఒక్క గట్టి సాక్ష్యాధారమూ లేకపోయింది. ఆఖరుగా మిగిలింది పద్దెనిమిదేళ్ల నల్లజాతి టీనేజర్ డార్నెల్లా ఫ్రేజర్ అప్రయత్నంగా తన సెల్ ఫోన్లోంచి ఆనాటి ఘటనను షూట్ చేసిన వీడియో క్లిప్పింగ్! కోర్టు హాల్లో ఆ క్లిప్‌ను ప్రదర్శించారు. జార్జి ఫ్లాయిడ్ గొంతును మోకాలితో తొక్కుతున్నప్పుడు తన సెల్‌ఫోన్ లోంచి షూట్ చేస్తున్న డార్లెల్లా, ఆమె కజిన్ (కుడి వైపు నుంచి మూడు, రెండు స్థానాల్లో). సీసీ ఫుటేజ్ అందులో డెరెక్ చావిన్ తొమ్మిది నిముషాల పాటు జార్జి ఫ్లాయిడ్ గొంతు మీద మోకాలిని అదిమిపట్టి ఉంచడం డార్నెల్లా తీసిన పది నిముషాల వీడియోలో మొత్తం రికార్డయి ఉంది. డార్నెల్లా వీడియో తీస్తున్నప్పటి వీడియో ఫుటేజ్‌ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి తెప్పించుకుని జడ్జి చూశారు. 2020 మే 25న ఆ ఘటన జరగడానికి కొద్ది నిముషాల ముందు వరకు జార్జి ఫ్లాయిడ్ ఎవరో, డార్నెల్లా ఫ్రేజర్ ఎవరో ప్రపంచానికి తెలియదు. ఒకరికొకరు కూడా తెలియని సాధారణ పౌరులు. ఆ సాయంత్రం.. మినియాపొలిస్ నగరంలోని చికాగో అవెన్యూలో.. 38వ వీధిలో ఉన్న ‘కప్ ఫుడ్స్’ షాపింగ్ మాల్కి తొమ్మిదేళ్ల వయసున్న తన కజిన్‌తో కలిసి వచ్చింది డార్నెల్లా. అక్కడికి దగ్గర్లోనే ఒక అపార్ట్మెంట్లో ఉంటారు వాళ్లు. వచ్చిన కొద్ది నిముషాలకు నలుగురు పోలీసులు ఒక నల్లజాతి వ్యక్తిని (జార్జి ఫ్లాయిడ్) పెడరెక్కలు విరిచి తీసుకెళ్లడం ఆ కూడలి లో ఉన్నవారు చూశారు. ఆ పోలీసులలో ఒకరైన డెరెక్ చావిన్.. జార్జి ఫ్లాయిడ్‌ని కింద పడేసి, అతడి గొంతుపై తన మోకాలును నొక్కిపెట్టాడు. అప్పుడు చూసింది డార్నెల్లా.. తనకు ఐదడుగుల దూరంలో ఆ దృశ్యాన్ని. జార్జి ఊపిరి అందక విలవిల్లాడుతున్నాడు. ‘ఐ కాంట్ బ్రీత్. లీవ్ మీ’ అంటున్నాడు. పోలీస్ ఆఫీసర్ వినడం లేదు. దారుణం అనిపించింది డార్నెల్లాకు. వెంటనే తన సెల్ ఫోన్ తీసి షూట్ చేయడం మొదలు పెట్టింది. జరుగుతున్న ఒక అన్యాయాన్ని మాత్రమే తను షూట్ చేస్తున్నానని అనుకుంది కానీ.. నల్లజాతిపై అమెరికన్ల జాత్యహంకారానికి వ్యతిరేకంగా అప్పటికే కొనసాగుతున్న ‘బ్లాక్ లైవ్స్ మేటర్’ అనే ఒక ఉద్యమానికి తనొక చోదకశక్తి కాబోతున్నానని అప్పుడు ఆమె అనుకోలేదు. చివరికి నేరస్థుడైన ఆ పోలీస్ ఆఫీసర్ కు శిక్ష పడేందుకు కూడా డార్నెల్లానే కారణం అయింది. అయితే కోర్టు తీర్పును డార్నెల్లా.. జార్జి ఫ్లాయిడ్‌కి జరిగిన న్యాయంగానే చూస్తోంది తప్ప, పోలీస్ ఆఫీసర్‌కు పడిన శిక్షగా కాదు. ‘‘థ్యాంక్యూ గాడ్. థ్యాంక్యూ థ్యాంక్యూ థ్యాంక్యూ. జార్జి ఫ్లాయిడ్.. నీకు న్యాయం జరిగింది’’ అని బుధవారం ఆమె తన ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. జార్జి ఫ్లాయిడ్‌ను మోకాలితో తొక్కుతున్న పోలీస్ అధికారి డెరెక్ చావిన్. ఇతడిపై నేరం రుజువైంది. ఏడాది క్రితం జార్జి ఫ్లాయిడ్ ఊపిరిపోతున్న క్షణాలను చిత్రీకరించిన రోజు డార్నెల్లాకు ఆ రాత్రి నిద్రపట్టలేదు. బాగా పొద్దుపోయేవరకు మేల్కొని ఆలోచిస్తూనే ఉంది. ఆమె హృదయం ఆక్రోశిస్తోంది. ఆమె నేత్రాలు వర్షిస్తున్నాయి. ఆమె పిడికిళ్లు బిగుసుకుంటున్నాయి. పోలీసులైతే మాత్రం ఇంత అమానుషమా అనిపించింది. తను తీసిన వీడియోను ఏం చేయాలో తోచలేదు. కళ్ల ముందే ఒక మనిషి చనిపోవడాన్ని తీసిన వీడియో అది! అది తన దగ్గరుంది. కొన్ని గంటల మౌనం తర్వాత ఫేస్ బుక్ ఓపెన్ చేసి వీడియోను అప్లోడ్ చేసింది. ‘‘ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను’’ అని రెండు ముక్కలు రాసింది. కొన్నాళ్ల వరకు ఆ వీడియోను ఎవరూ నమ్మలేదు. జార్జి ఫ్లాయిడ్ మరణానంతరం నల్లజాతి ఉద్యమకారులు ఆయనపై వేసిన పోస్టర్లలో ఒకటి. అది నిజం అని తెలిశాక ఒక్కసారిగా ప్రఖ్యాత అమెరికన్ న్యూస్ చానళ్లు సి.ఎన్.ఎన్., ఎ.బి.సి., ఫాక్స్, ఎన్.బి.సి., సి.బి.ఎస్. డార్నెల్లా కోసం వచ్చాయి. ఆ వీడియో రేపిన భావోద్వేగాలు అమెరికాలోని యాభై నగరాలలో, ప్రపంచ దేశాలలో జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమానికి ఆజ్యం అయ్యాయి. ఐక్యరాజ్య సమితి సైతం జార్జి ఫ్లాయిడ్ హత్యోదంతాన్ని నిరాకరించ తగని, నిర్లక్ష్యం చేయకూడని పరిణామంగా పరిగణించింది. నల్లజాతి ఉద్యమ భాషలో నిప్పు రవ్వ అని జార్జి ఫ్లాయిడ్ ను అంటున్నాం కానీ.. నిప్పులా ఉద్యమాన్ని రాజేసింది మాత్రం డార్నెల్లా ప్రేజరేనన్నది కాదనలేని సత్యం. లేత మనసుకు అయిన గాయం కన్నీటిగా ఉబికి, జ్వలించింది. ఉద్యమజ్వాల అయింది. తాజాగా కోర్టు తీర్పు రాగానే అమెరికా అధ్యక్షుడు జార్జి బైడెన్ ‘బ్రేవ్ యంగ్ ఉమన్’ అని డార్నెల్లాను అభినందించారు! -
మేఘన్ జాతివివక్ష ప్రకంపనలు
లండన్: ప్రిన్స్ హ్యారీతో వివాహమయ్యాక బ్రిటన్ రాచకుటుంబంలో జాతి వివక్షని ఎదుర్కొంటూ ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని నటి మేఘన్ మార్కెల్ ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రకంపనలు సృష్టిస్తోంది. మేఘన్ వెల్లడించిన విషయాలు బ్రిటన్ రాచకుటుంబాన్నే సంక్షోభంలో పడేశాయి. ఈ సంక్షోభ నివారణకు రాణి ఎలిజెబెత్–2 ఒక ప్రకటన కూడా సిద్ధం చేశారని , కానీ ఇంకా దానిని విడుదల చేయడానికి ముందు వెనుక ఆలోచిస్తున్నారంటూ బ్రిటన్‌లో ఓ వర్గం మీడియా కథనాలు ప్రసారం చేసింది. ప్రిన్స్ హ్యారీ, మేఘన్ ఆ ఇంటర్వ్యూలో తమకి పుట్టబోయే బిడ్డపై కూడా రాచకుటుంబం చర్చించుకుందని, ఆ బిడ్డ నల్లగా పుడతాడని, అందుకే ప్రిన్స్ హోదా, భద్రత కూడా ఇవ్వకూడదని నిర్ణయించుకుందని వెల్లడించారు. మేఘన్ జాతి వివక్ష ఆరోపణలపై స్పందించాల్సిందిగా బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌ను అడగ్గా ‘‘నాకు రాణి పట్ల అమితమైన గౌరవ భావం ఉంది. కామన్వెల్త్ దేశాలన్నింటినీ ఏకం చేసి ఉంచినందుకు ఆమెను ఎప్పటికీ ఆరాధిస్తాను’’అని జాన్సన్ పేర్కొన్నారు. ‘‘రాచకుటుంబ విషయాలపై తాను ఎప్పుడూ వ్యాఖ్యానించనని, ఇప్పుడు కూడా దానికే కట్టుబడి ఉంటాను’’అని జాన్సన్ మాట్లాడేందుకు నిరాకరించారు. మరోవైపు ప్రతిపక్ష లేబర్ పార్టీ నాయకుడు సర్ కేర్ స్టార్మర్ ఇది అత్యంత తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని అన్నారు. తూర్పు లండన్‌లో ఒక పాఠశాలని దర్శించడానికి వచ్చిన ఆయన దగ్గర మీడియా ఈ అంశాన్ని ప్రస్తావించగా ‘‘రాచకుటుంబం ఇలాంటి సంక్షోభంలో చిక్కుకోవడం అత్యంత విచారకరం. మేఘన్ చెప్పిన జాతివివక్ష, ఆమె మానసిక ఆరోగ్యమనేవి అత్యంత తీవ్రమైన అంశాలు. రాచకుటుంబం కంటే ఇవి పెద్ద విషయాలు. 21వ శతాబ్దాంలో బ్రిటన్‌లో జాతివివక్షకు సంబంధించిన ఎన్నో ఘటనలు జరుగుతూనే ఉన్నాయి’’అని స్టార్మర్ వ్యాఖ్యానించారు. మరోవైపు మేఘన్ తండ్రి థామస్ మార్కెల్ కొన్ని సంవత్సరాల తర్వాత తన కుమార్తె ఇలా మాట్లాడడం చూస్తున్నానని అన్నారు. స్పందించిన బకింగ్హమ్ ప్యాలెస్ ప్రకంపనలకు కారణమైన ప్రిన్స్ హ్యారీ దంపతుల ఇంటర్వ్యూపై బిట్రన్ రాణి ఎలిజబెత్ ఎట్టకేలకు మౌనం వీడారు. హ్యారీ, మేఘన్ దంపతులు గడిచిన రెండేళ్లలో ఎదుర్కొన్న ఇబ్బందులు తెలిసి ఆవేదన చెందుతున్నామనీ, వీటిని వ్యక్తిగతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొంటూ బకింగ్హమ్ ప్యాలెస్ నుంచి మంగళవారం ఒక ప్రకటన విడుదలయింది. ముఖ్యంగా వర్ణ వివక్షపై వ్యక్త పరిచిన అంశాలు తీవ్రమైనవని పేర్కొంది. తమ కుటుంబానికి హ్యారీ, మేఘన్ దంపతులు ఎప్పటికీ అత్యంత ప్రియమైన వారిగానే ఉంటారని తెలిపింది. చదవండి: (ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా) -
అమ్మమ్మను కోల్పోయిన బాధలో ఉంటే.. జాతి వివక్ష వ్యాఖ్యలా..?
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల తల్లి ఎలాన్ చైనా జాతీయురాలన్న సంగతి తెలిసిందే. కొన్నిరోజుల కిందట ఎలాన్ తల్లి చైనాలో మరణించారు. ఈ విషయాన్ని జ్వాల సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ట్విటర్లో తన అమ్మమ్మ మరణ వార్తను తెలుయజేస్తూ.. "చైనీస్ న్యూ ఇయర్ రోజున అమ్మమ్మ మరణించింది. అంతకుముందు అమ్మ ప్రతి నెలా చైనాకు వెళ్లి అమ్మమ్మను చూసొచ్చేది. అయితే, కోవిడ్ కారణంగా ఈ ఏడాది అమ్మ వెళ్లలేదు" అంటూ పోస్ట్ చేసింది. దీనిపై స్పందించిన కొందరు నెటిజన్లు.. చైనీస్ వైరస్ అనకుండా కోవిడ్ అని ఎందుకు అంటున్నావంటూ జ్వాలను ప్రశ్నించడం మొదలెట్టారు. దీనిపై బాధతో ఆమె స్పందిస్తూ.. ఓపక్క అమ్మమ్మను కోల్పోయిన బాధలో మేముంటే, కొందరు జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడం బాధ కలిగించిందన్నారు. అసలు మనం బతుకుతున్నది సమాజంలోనేనా.. అలాగైతే సానుభూతి ఎక్కడ.. మనం ఎటువైపు పయనిస్తున్నాం.. ఇది సిగ్గుపడాల్సిన విషయం అంటూ ఆమె ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు విస్మయానికి గురి చేస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. Ammaama passed away in China on d eve of CNY!My mom use 2 visit her every month but for past year she couldn’t because of https://t.co/pvd6Pcfvsj dis covid has made us realise how important it is 2 be in present do whatever v can for our loved ones whenever v can! Happy new year pic.twitter.com/EUyEqNDopj — Gutta Jwala (@Guttajwala) February 12, 2021 I am mourning the loss of my grand mom who passed away in China and to my surprise I get racist replies....and I am asked why I say covid and not Chinese virus.... What has happened to us as a society...where’s the empathy...where r we headed...and there r defenders?? Shameful! — Gutta Jwala (@Guttajwala) February 12, 2021 -
ఇవే బైడెన్ ప్రాథమ్యాలు..!
వాషింగ్టన్: అమెరికాను అత్యుత్తమంగా తీర్చిదిద్దే లక్ష్యంతో దేశాధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా ఎన్నిౖకైన కమల హ్యారిస్ పనిచేయాలనుకుంటున్నారని ఆయన బృందం వెల్లడించింది. కోవిడ్–19 నియంత్రణ, మళ్లీ అభివృద్ధి పట్టాల పైకి ఆర్థిక రంగం, వ్యవస్థీకృత జాతి వివక్ష, ఆర్థిక అసమానతల అంతం, వాతావరణ మార్పు సమస్యకు పరిష్కారం.. ఇవే బైడెన్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని వివరించింది. అధికార మార్పిడి విధుల్లో ఉన్న బైడెన్ బృందం ఈ విషయాన్ని తమ వెబ్సైట్లో పోస్ట్ చేసింది. ఈ లక్ష్యాల సాధనకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. సమగ్ర వ్యూహంతో ఈ లక్ష్యాలను సాధించాలని బైడెన్ భావిస్తున్నారని పేర్కొంది. కరోనా వైరస్ కారణంగా తలెత్తిన ప్రజారోగ్య సంక్షోభం, ఆర్థిక సంక్షోభాల నుంచి దేశాన్ని గట్టెక్కించడం తక్షణ విధిగా బైడెన్ భావిస్తున్నారని పేర్కొంది. వైరస్ వల్ల కుదేలైన కుటుంబాలను, చిన్న వ్యాపారాలను, బాధితులను, కోవిడ్–19పై పోరాడుతున్న యోధులను పరిరక్షించడానికి ప్రాథాన్యం ఇస్తున్నట్లు వివరించింది. కరోనా నియంత్రణ తరువాత.. మంచి వేతనాలు లభించే లక్షలాది ఉద్యోగాల కల్పన బైడెన్ ప్రభుత్వ తదుపరి లక్ష్యమని తెలిపింది. అత్యుత్తమ అమెరికాను నిర్మించే దిశగా దేశంలోని ఉద్యోగులకు, కార్మికులకు అవసరమైన అన్ని హక్కులు, సదుపాయాలను కల్పించాలని సంకల్పించినట్లు వెల్లడించింది. ఒకవైపు కరోనాను నియంత్రిస్తూనే, మరోవైపు, ఆర్థిక కార్యకలాపాల పునః ప్రారంభం జరిగేలా, ఆర్థిక వృద్ధికి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. వ్యవస్థీకృత జాతి వివక్ష, ఆర్థిక అసమానతల తొలగింపు బైడెన్ ప్రభుత్వ మూడో లక్ష్యమని వివరించింది. అమెరికా సమాజంలో భాగమైన బ్లాక్స్, బ్రౌన్స్ సంక్షేమం, వారి అభివృద్ధి కేంద్రంగా ఆర్థిక వృద్ధి సాగాలనేది నూతన ప్రభుత్వ ఆలోచన అని పేర్కొంది. దేశంలోని అన్ని వర్గాల సమ్మిళిత అభివృద్ధి లక్ష్యంగా పాలన సాగుతుందన్నారు. వాతావరణ మార్పును ఎదుర్కొనే విషయంలో అమెరికా ప్రపంచానికి నాయకత్వం వహిస్తుందని స్పష్టం చేసింది. బైడెన్‌కు ఇప్పుడే ‘విషెస్’ చెప్పం! మాస్కో/బీజింగ్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటన వెలువడేవరకు జో బైడెన్‌కు శుభాకాంక్షలు తెలపకూడదని రష్యా, చైనా నిర్ణయించాయి. అమెరికా చట్టాలు, నిబంధనల ప్రకారం బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికయినట్లు స్పష్టమైన తరువాతే తాము స్పందిస్తామని తెలిపాయి. ఎన్నికలపై తలెత్తిన న్యాయ వివాదాలు పరిష్కారమై, ఫలితాన్ని అధికారికంగా ప్రకటించిన తరువాతే బైడెన్‌ను రష్యా అధ్యక్షుడు పుతిన్ అభినందిస్తారని సోమవారం రష్యా ప్రకటించింది. బైడెన్ విజయం అనంతరం ఆయనకు శుభాకాంక్షలు తెలపని దేశాల్లో చైనా, రష్యాతోపాటు బ్రెజిల్, టర్కీ, మెక్సికో ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమల ఎన్నిక కావడంపై చైనా అధికారికంగా స్పందించలేదు ఈ విషయంలో అంతర్జాతీయ సంప్రదాయాలను పాటిస్తామంది. అక్కడి మీడియా మాత్రం వారి ఎన్నికను నిర్ధారిస్తూ పలు విశ్లేషణాత్మక కథనాలను ప్రచురించింది. -
బైడెన్ వైపే ముస్లింలు..
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల్లో 69 శాతం ముస్లిం ఓటర్లు బైడెన్‌కి ఓటు వేయగా, కేవలం 17 శాతం మంది మాత్రమే డొనాల్డ్‌కు ఓటు వేసినట్లు అమెరికాలోని ముస్లిం సివిల్ లిబర్టీస్ సంస్థ ద కౌన్సిల్ ఆఫ్ ఇస్లామిక్ రిలేషన్స్(సీఏఐఆర్) బుధవారం విడుదల చేసిన ఎగ్జిట్ ఫలితాల్లో పేర్కొంది. నమోదు చేసుకున్న 844 ముస్లిం ఓటర్ల కుటుంబాల్లో 84 శాతం మంది అత్యధికంగా ఓట్లు వేసినట్లు సీఏఐఆర్ సంస్థ తెలిపింది. 2016 అధ్యక్ష ఎన్నికల్లో 13 శాతం ముస్లిం ఓట్లను మాత్రమే దక్కించుకున్న ట్రంప్, ఈ ఎన్నికల్లో మరో నాలుగు శాతం ఓట్లను అదనంగా సాధించగలిగారు. ఊహలకు భిన్నంగా.. ట్రంప్, బైడెన్ మధ్య హోరాహోరీగా సాగిన ఎన్నికల ఫలితాలు మీడియా అంచనాలకు భిన్నంగా వస్తుండడంతో, మీడియా సహనం పాటించాలని భావిస్తున్నారు. ముందస్తు ఓటింగ్ వల్ల కౌంటింగ్ ప్రక్రియ అస్తవ్యస్తం అయ్యే అవకాశం ఉందని, అందువల్ల ఎటువంటి అభిప్రాయాలకూ రావద్దని మీడియా సంస్థలు తెలిపాయి. ఫలితాలన్నీ అసందిగ్ధంగా ఉన్నాయని, ఎవరు గెలుస్తారో ఇప్పటికిప్పుడే చెప్పలేమని సీబీఎస్ న్యూస్ ఎనలిస్ట్ జాన్డికర్సన్ అన్నారు. సంవత్సరానికి పైగా ప్రచారంలో తలమునకలైన జర్నలిస్టులు, వ్యాఖ్యాతలు కూడా ఫలితాలను ఊహించలేకపోవడం గమనార్హం. (చదవండి: బైడెన్‌కే ‘లిటిల్ ఇండియా’ ఓట్లు) జాత్యహంకారమున్నా అట్లాంటా: అగ్రరాజ్యం అమెరికాలో జాత్యహంకారాన్ని సమర్థిస్తూ నల్లజాతి ప్రజలను తరచూ తిట్టిపోసే మర్జోరీ టేలర్ గ్రీన్ ఈ ఎన్నికల్లో గెలుపొందారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి అయిన ఆమె నార్త్‌వెస్ట్ జార్జియా స్థానం నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. వ్యాపారవేత్త అయిన టేలర్ గ్రీన్ కొత్తగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. అనతి కాలంలోనే ట్రంప్ దృష్టిలో పడ్డారు. ఆమెను ట్రంప్ ‘ఫ్యూచర్ రిపబ్లికన్ స్టార్’అని వర్ణించడం గమనార్హం. ఆమె జాత్యహంకారాన్ని సమర్థిస్తూ ఆన్లైన్లో వీడియోలు విడుదల చేస్తుంటారు. నల్లజాతి, హిస్పానిక్ ప్రజలను దూషిస్తుంటారు. వారు ముఠాలు కడుతుంటారని, మాదక ద్రవ్యాల బానిసలని విమర్శిస్తుంటారు. -
మమ్మల్ని బయటకు గెంటేశారు: అనన్య బిర్లా
వాషింగ్టన్: ‘‘స్కోపారెస్టారెంట్ నిర్వాహకులు నన్ను, నా కుటుంబాన్ని బయటకు గెంటేశారు. జాతి వివక్ష ప్రదర్శించారు. ఇది నిజంగా విషాదకరం. కస్టమర్ల పట్ల ఇలాంటి వైఖరి సరైంది కాదు. మీ రెస్టారెంటులో భోజనం చేయడానికి మేం మూడు గంటలు ఎదురుచూశాం. కానీ, మీ వెయిటర్ జోషువా సిల్వర్మాన్ మా అమ్మతో అత్యంత దురుసుగా ప్రవర్తించారు. జాతి వివక్షపూరిత వ్యాఖ్యలు చేశారు. ఇది అస్సలు సరైంది కాదు. వెరీ రేసిస్ట్’’ అంటూ సింగర్, బిర్లా కుటుంబ వారసురాలు అనన్య బిర్లా అమెరికన్ రెస్టారెంటులో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి నెటిజన్లతో పంచుకున్నారు. తమ పట్ల జాతి వివక్ష చూపిన రెస్టారెంటు నిర్వాహకులకు సోషల్ మీడియా వేదికగా చురకలు అంటించారు. (చదవండి: ట్రోలింగ్: ‘సంజూ గ్రేట్.. పంత్ నువ్వు హల్వా, పూరీ తిను’ ) కాగా ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్, బిలియనీర్ కుమార్ మంగళం బిర్లా కూతురైన అనన్య బిర్లా గాయనిగా, ఆర్టిస్టుగా తనకంటూ సొంత గుర్తింపు దక్కించుకుంటున్న విషయం తెలిసిందే. శనివారం ఆమె తన తల్లి నీరజా బిర్లా, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి కాలిఫోర్నియాలోని ప్రముఖ ఇటాలియన్- అమెరికన్ రెస్టారెంటుకు వెళ్లారు. ఈ క్రమంలో భోజనం ఆర్డర్ చేసిన తమను, గంటల కొద్దీ వెయిట్ చేయించారని, కస్టమర్లన్న కనీస మర్యాద లేకుండా అనుచితంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెఫ్ ఆంటోనియా లొఫాసో నేతృత్వంలోని ఇటాలియన్ మూలాలున్న సదరు రెస్టారెంటు నిర్వాహకుల తీరును నెటిజన్ల దృష్టికి తీసుకువచ్చారు. ఇక కూతురి ట్వీట్‌పై స్పందించిన నీరజా బిర్లా సైతం.. ‘‘ఇది నిజంగా షాకింగ్‌గా ఉంది.. అత్యంత అనుచితంగా ప్రవర్తించారు. కస్టమర్లతో ఇలా వ్యవహరించేందుకు మీకు ఎలాంటి హక్కు లేదు’’అంటూ రెస్టారెంట్లు నిర్వాహకుల తీరును ఎండగట్టారు. అనన్య సోదరుడు ఆర్యమన్ బిర్లా కూడా ఈ విషయంపై స్పందించాడు. గతంలో తమకు ఎన్నడూ ఇలాంటి రేసిస్ట్ అనుభవాలు ఎదురుకాలేదని, జాతి వివక్ష ఉందన్న విషయాన్ని ఇంకా నమ్మలేకపోతున్నానని చెప్పుకొచ్చాడు. This restaurant @ScopaRestaurant literally threw my family and I, out of their premises. So racist. So sad. You really need to treat your customers right. Very racist. This is not okay. — Ananya Birla (@ananya_birla) October 24, 2020 We waited for 3 hours to eat at your restaurant. @chefantonia Your waiter Joshua Silverman was extremely rude to my mother, bordering racist. This isn’t okay. — Ananya Birla (@ananya_birla) October 24, 2020 Very shocking ..absolutely ridiculous behaviour by @ScopaRestaurant . You have no right to treat any of your customers like this. https://t.co/szUkdxAgNh — Neerja Birla (@NeerjaBirla) October 24, 2020 I have never experienced anything of this sort. Racism exists and is real. Unbelievable. @ScopaRestaurant https://t.co/FU0NE8e7Qu — Aryaman Birla (@AryamanBirla) October 24, 2020 -
ముగిసిన మాటల పోరు!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు జరిగే ప్రెసిడెన్షియల్ డిబేట్స్‌లో చివరి డిబేట్ హోరాహోరీగా ముగిసింది. అయితే తొలి డిబేట్‌తో పోలిస్తే ఈసారి వ్యక్తిగత దూషణలు, మాటలకు అడ్డం పడడాలు చాలావరకు తగ్గాయి. ముఖ్యంగా అభ్యర్థుల మైక్‌ను మ్యూట్ చేసే ఆప్షన్ బాగా ఉపయుక్తమయింది. ట్రంప్, బైడెన్లు డిబేట్లో కరోనా, జాత్యహంకారం, పర్యావరణం, వలస విధానం తదితర అంశాలపై తమ వైఖరులను వివరించారు. నాష్‌విల్లేలోని బెల్మాట్ యూనివర్సిటీలో సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ డిబేట్లో కరోనా వైరస్ కట్టడి విషయంలో ఒకరినొకరు దుయ్యబట్టుకున్నారు. డిబేట్‌కు ఎన్బీసీ న్యూస్‌కు చెందిన క్రిస్టిన్ వెల్కర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అయితే ఎన్ని కట్టడులు చేసినా ట్రంప్, బైడెన్ ఒకరి వ్యక్తిగత విషయాలను మరొకరు విమర్శించడం మానలేదు. తొలి డిబేట్ అనంతరం ట్రంప్ కరోనా బారిన పడి కోలుకోవడంతో ఈ చివరి డిబేట్ ఆసక్తికరంగా మారింది. వివిధ అంశాలపై అభ్యర్థుల వాదనలు... కరోనా వైరస్: ట్రంప్: ఇది ప్రపంచవ్యాప్త సమస్య. కానీ, దీన్ని ఎంతో సమర్ధవంతంగా ఎదుర్కొన్నానని పలు దేశాలు ప్రశంసించాయి. చైనా కారణంగానే ఈ వైరస్ ప్రబలింది. టీకా అతి త్వరలో అందుబాటులోకి రానుంది. కొన్ని వారాల్లోనే దీనిపై ప్రకటన రావచ్చు. ప్రభుత్వం వ్యాక్సిన్ సత్వర పంపిణీకి తయారుగా ఉంది. బైడెన్: ట్రంప్ విధానాలతో కరోనా కారణంగా దేశంలో లక్షల మరణాలు సంభవించాయి. అమెరికా త్వరలో మరో డార్క్‌వింటర్‌ను(తీవ్రమైన చలికాలం అని ఒక అర్థం కాగా, అమెరికాపై జరిగే బయోవెపన్ యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు సంసిద్ధమయ్యే ప్రాజెక్ట్ అని మరో అర్థం) చూడనుంది, కానీ, ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్లాన్ లేదు. వచ్చే ఏడాది మధ్య వరకు ఎలాంటి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేలా కనిపించడంలేదు. కరోనాతో జీవించడాన్ని ప్రజలు నేర్చుకుంటున్నారని ట్రంప్ చెబుతున్నాడు, కానీ ప్రజలు దీంతో చావును నేర్చుకుంటున్నారు. నా వద్ద కరోనా కట్టడికి మంచి ప్రణాళిక ఉంది. జాత్యహంకారం.. ట్రంప్: నల్లజాతీయుల చాంపియన్ నేనే. అబ్రహం లింకన్ తర్వాత నల్లజాతీయులకు అనేక ప్రయోజనాలు చేకూర్చిన ప్రెసిడెంట్ సైతం నేనే. ఇక్కడున్న వారందరిలో అతితక్కువ జాత్యహంకారం ఉన్న వ్యక్తిని కూడా నేనే! బైడెన్: ఆధునిక అమెరికా చరిత్రలో అత్యంత జాత్యహంకార అధ్యక్షుల్లో ట్రంప్ ఒకరు. ప్రతి జాతి ఘర్షణలో ఆజ్యం పోస్తాడు. గత డిబేట్లో సైతం తన జాత్యహంకార బుద్ధిని ప్రదర్శించాడు. వలసవిధానం.. ట్రంప్: అక్రమ వలసదారుల పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరుచేయడం సబబే. ప్రభుత్వం వారిని సురక్షితంగా చూసుకుంది. బైడెన్: పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరు చేయడం అమెరికా పాటించే విలువలకే అవమానం. హెల్త్‌కేర్.. ట్రంప్: ఒబామా కేర్ కన్నా మెరుగైన ఆరోగ్య విధానాన్ని తీసుకొచ్చాను. దీన్ని ఇంకా మెరుగుపరుస్తాను. బైడెన్: ఉత్తమమైన ఒబామా కేర్‌ను తీసివేసిన అనంతరం సరైన హెల్త్‌కేర్ పాలసీని ట్రంప్ తీసుకురాలేకపోయారు. పర్యావరణం.. ట్రంప్: చైనా, ఇండియా, రష్యాలు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఏమీ చేయట్లేదు. చైనాను చూడండి ఎంత మురికిగా ఉందో. ఇండియా, రష్యాలు కూడా అంతే. ఆ దేశాల్లో గాలి శ్వాసించలేనంత కలుషితంగా ఉంది. పర్యావరణ పరిరక్షణ పేరిట అమెరికా వృ«థా ఖర్చును నివారించేందుకు పారిస్ డీల్ నుంచి బయటకు వచ్చాము. ఆ ఒప్పందం కారణంగా మన వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం ఆధ్వర్యంలో అమెరికా ఉద్గార గణాంకాలు 35 ఏళ్లలోనే ఉత్తమంగా ఉన్నాయి. బైడెన్: మరింత ఎకోఫ్రెండ్లీ ఆర్థిక వ్యవస్థగా అమెరికాను మార్చే ప్రణాళిక ఉంది. దీనివల్ల మరిన్ని ఉద్యోగాలు వస్తాయి. ప్రపంచ పర్యావరణానికి గ్లోబల్ వార్మింగ్ ముప్పు. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలి. అవినీతి ట్రంప్: బైడెన్ లాగా నేను చైనా నుంచి అక్రమ సొత్తు సంపాదించలేదు. ఉక్రెయిన్ నుంచి లంచాలు తీసుకోలేదు. రష్యా నుంచి ముడుపులు స్వీకరించలేదు. బైడెన్: చైనా నుంచి ముడుపులు తీసుకుంది నా కుమారుడు కాదు. ట్రంపే ముడుపులు స్వీకరించాడు. హంటర్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణల్లో ఎలాంటి తప్పులు జరిగినట్లు తేలలేదు. అమెరికాను మరోమారు అగ్రగామిగా నిలుపుతానని ట్రంప్ పేర్కొనగా, ఈ ఎన్నికల ఫలితాలపై అమెరికా భవిష్యత్ ఆధారపడి ఉంటుందని బైడెన్ చెప్పారు. హోరాహోరీగా జరిగిన డిబేట్లో ఎవరూ పైచేయి సాధించలేదని, ఇరువురూ తమ తమ విధానాలను గట్టిగా సమర్ధించుకున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. సీఎన్ఎన్ మాత్రం తాము జరిపిన పోల్ ప్రకారం డిబేట్లో బైడెన్‌దే పైచేయిగా 53 శాతం మంది భావించినట్లు తెలిపింది. చాలావరకు ప్రశాంతం.. తొలి డిబేట్‌తో పోలిస్తే మలి డిబేట్ చాలావరకు ప్రశాంతంగా జరిగిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పలు అంశాలపై ఇరువురూ తీవ్రంగా విభేదిస్తూ వాదించుకున్నా, ఒకరికొకరు అడ్డంపడి మాట్లాడటం చాలావరకు తగ్గింది. చాలామంది గతంతో పోలిస్తే ట్రంప్ ఈ దఫా చాలా హుందాగా ప్రవర్తించారని భావించారు. ఉదాహరణకు డిబేట్‌కు ముందు వ్యాఖ్యాతపై పలు నెగెటివ్ వ్యాఖ్యలు చేసిన ట్రంప్ డిబేట్ అనంతరం ఆమెను ప్రశంసించారు. డిబేట్‌ను చాలా బాగా నిర్వహించారన్నారు. కరోనా కారణంగా డిబేట్ చూసేందుకు ప్రత్యక్షంగా 200 మందిని మాత్రమే అనుమతించారు. అభ్యర్థ్ధులకు మధ్య గ్లాస్ గోడలు పెట్టాలని నిర్ణయించినా చివరకు ఏర్పాటు చేయలేదు. డిబేట్‌కు ముందు ఇరువురికీ కరోనా పరీక్ష నిర్వహించగా నెగెటివ్ వచ్చింది. ఈసారి ట్రంప్ కుటుంబసభ్యులతో సహా ప్రేక్షకులంతా మాస్కులు ధరించారు. -
బీఎల్ఎమ్ స్థానంలో నో రూమ్ ఫర్ రేసిజమ్
లండన్: నేటి నుంచి ఆరంభమయ్యే ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో పాల్గొనే జట్లు ‘జాత్యహంకారానికి తావు లేదు (నో రూమ్ ఫర్ రేసిజమ్)’ అనే బ్యాడ్జీలతో బరిలోకి దిగనున్నాయి. ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్స్ (బీఎల్ఎమ్)’ స్థానంలో ఈ నినాదాన్ని వాడనున్నట్లు ఈపీఎల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ మాస్టర్స్ తెలిపారు. ఈ ఏడాది మేలో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ అమెరికాలో పోలీసుల దౌర్జన్యానికి బలి కావడంతో ‘బీఎల్ఎమ్’ ఉద్యమం ఊపిరిపోసుకుంది. ఈ ఉద్యమానికి సంఘీభావంగా ఈపీఎల్ జట్లు తమ జెర్సీలపై ‘బీఎల్ఎమ్’ లోగోను ముద్రించుకొని గత సీజన్లో మ్యాచ్‌లను ఆడాయి. 2020–21 సీజన్లో నినాదం మారినా... వివక్ష ఏ రూపంలో ఉన్నా అది అంతం కావాలనే మేం కోరుకుంటామని రిచర్డ్ పేర్కొన్నారు. గతంలోలాగే మ్యాచ్ ఆరంభానికి ముందు ఆటగాళ్లు మోకాలిపై కూర్చొని జాత్యహంకారానికి నిరసన తెలియజేస్తారని ఆయన తెలిపారు. (చదవండి: సెరెనా మరో ‘సారీ’) ‘బ్లాక్ లైవ్స్...ముగిసిపోయిందా’ మాంచెస్టర్: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్లపై వెస్టిండీస్ పేస్ దిగ్గజం, కామెంటేటర్ మైకేల్ హోల్డింగ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్స్ (బీఎల్ఎమ్)’ ఉద్యమానికి చరమగీతం పాడారా...! అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు, ఐర్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లలో ‘బీఎల్‌ఎమ్‌కు’ మద్దతుగా మ్యాచ్‌కు ముందు మోకాలిపై ఉన్న ఆటగాళ్లు... ఇప్పుడు అలా ఎందుకు చేయడం లేదంటూ ప్రశ్నించారు. కనీసం ‘బీఎల్ఎమ్’ లోగోలను కూడా తమ జెర్సీలపై ధరించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వెస్టిండీస్ జట్టు తమ పర్యటనను ముగించుకొని స్వదేశానికి వెళ్లిపోగానే ‘బీఎల్ఎమ్’ ముగిసిపోయిందని మీరు భావిస్తున్నారా... అంత నిర్లక్ష్య ధోరణి తగదంటూ వారికి హితవు పలికారు. ‘ఇది ఎంత మాత్రం నల్లజాతీయులకు, శ్వేత జాతీయులకు మధ్య జరిగే పోరాటం కాదు. ఇది మానవత్వానికి, సమాన హక్కులకు సంబంధించినది. అంతేకాకుండా ‘బీఎల్ఎమ్’ అనేది అమెరికాకు మాత్రమే పరిమితం కాదు. అలా అనుకుంటే మీరు భ్రమలో ఉన్నట్లే’ అని హోల్డింగ్ పేర్కొన్నారు. ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు ముందు ఒక సమావేశంలో మాట్లాడిన ఆసీస్ కెప్టెన్ ఫించ్... మ్యాచ్‌కు ముందు తాము మోకాలిపై ఉండబోమని స్పష్టం చేశాడు. నిరసన కంటే దాని గురించి వ్యక్తుల్లో అవగాహన పెంచడం ముఖ్యమంటూ అతడు వ్యాఖ్యానించాడు. దీనిపై స్పందించిన హోల్డర్ ‘నీకు మద్దతు ఇవ్వాలని ఉంటే ఇవ్వు... లేదంటే ఊరికే ఉండు. అంతే కానీ కుంటి సాకులు చెప్పకు’ అంటూ ఘాటుగా బదులిచ్చారు. -
అరుంధతి రాయ్‌పై విమర్శలు వెల్లువ
న్యూఢిల్లీ: ప్రముఖ రచయిత్రి, బుకర్ ప్రైజ్ గ్రహీత అరుంధతి రాయ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్రాహ్మణిజం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో కులరహిత సమాజాన్ని ఆకాంక్షించే మేధావులు అరుంధతి తీరును తప్పుబడుతున్నారు. ‘‘ఆజాదీ: ఫ్రీడం, ఫాసిజం, ఫిక్షన్’’పేరిట అరుంధతి రాయ్ రచించిన కొత్త పుస్తకం విడుదల సందర్భంగా యూనివర్సిటీ ఆఫ్ న్యూ మెక్సికో అసిస్టెంట్ ప్రొఫెసర్ నిక్ ఎజ్ వీడియో కాన్పరెన్స్తో ద్వారా ఆమెను ఇంటర్వ్యూ చేశారు. ఈ క్రమంలో భారత్‌లో ఉన్న కుల వ్యవస్థను, అమెరికాలోని జాతి వివక్ష భావనలను ఒకే విధంగా చూస్తారా అని ప్రశ్నించారు. (చదవండి: ‘మనం బుల్లెట్లు ఎదుర్కోవడానికి పుట్టలేదు’) అదే విధంగా తన తల్లిదండ్రుల మతతత్వ గుర్తింపు గురించి ఆమె చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ‘‘మిమ్మల్ని మీరు బ్రాహ్మిణ్ అనుకుంటున్నారా’’అని ప్రశ్నలు సంధించారు. ఇందుకు స్పందించిన అరుంధతీ రాయ్.. ‘‘మా అమ్మ క్రిస్టియన్. మా నాన్న బ్రహ్మ సమాజంలో సభ్యులు. అంతేగానీ ఆయన బ్రాహ్మిణ్ కాదు. నిజానికి తర్వాత ఆయన క్రిస్టియన్‌గా మారిపోయారు. ఇక కుల వ్యతిరేక ఉద్యమం అనగానే అందరూ బ్రాహ్మణిజం అనే పదాన్ని వాడుతూ ఉంటారు. అయితే బ్రాహ్మణుల గురించి కాదు. కుల వ్యవస్థ గురించి మాట్లాడే వారు ఈ పదాన్ని వాడతారు. కాబట్టి బ్రాహ్మణిజం పాటించే బ్రాహ్మణుల గురించి మాత్రమే కాదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక జాతి వివక్ష గురించి మాట్లాడాల్సి వస్తే.. కులం ఓ వ్యక్తికి తమకిష్టమైన మతాన్ని పాటించే అవకాశం ఇచ్చింది’’ అని చెప్పుకొచ్చారు. (చదవండి: మైనారిటీలు మారారు.. గుర్తించారా?) ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పలువురు మేధావులు అరుంధతి వ్యాఖ్యలను విమర్శిస్తున్నారు. ‘‘బ్రాహ్మణిజం బ్రాహ్మణుల గురించి కాదని అరుంధతి రాయ్ చెబుతున్నారు. మరి బ్రాహ్మణిజం అంటే ఏమిటి? కుల వ్యవస్థను నిర్వచించడానికి ఇంతకంటే మంచి పదం ఉంటే మీరే సూచించండి’’ అని తేజస్ హరాద్ అనే నెటిజన్ కామెంట్ చేయగా.. ‘‘తను బ్రాహ్మిణ్ కాదంటూ అరుంధతి రాయ్ అబద్ధాలు చెబుతున్నారు. ఆమె హావభావాలు, గొంతు మారిన విధానం ఎవరైనా గమనించారా? నయ వంచనకు పరాకాష్ట’’ అంటూ మరొకరు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అరుంధతి నిజంగానే బ్రాహ్మిణ మహిళా? చాలా మంది అరుంధతిని బ్రాహ్మిణ్ అంటూ ఉంటారు. అయితే తాను బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన దానిని కాదని, తన తండ్రి బ్రహ్మ సమాజం సభ్యుడని, తన తల్లి మలయాళీ సిరియన్ క్రిస్టియన్ అని గతంలో అనేకసార్లు చెప్పారు. అయినప్పటికీ ఆమెపై విమర్శలు మాత్రం ఆగడం లేదు. -
‘ట్రంప్ ఓ రేసిస్ట్’
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉంటారని భావిస్తున్న జో బిడెన్ గురువారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్రంప్ వైట్‌హౌస్‌కు ఎంపికైన తొలి రేసిస్ట్ అని మండిపడ్డారు. కరోనా మహమ్మారిని తరచూ చైనా వైరస్ అని అధ్యక్షుడు పేర్కొనడాన్ని ప్రస్తావిస్తూ ప్రజలను వారి రంగు, జాతీయత ఆధారంగా చూసే ట్రంప్ తీరును జో బిడెన్ తప్పుపట్టారు. గతంలో ఏ అధ్యక్షుడు ట్రంప్‌లా వ్యవహరించలేదని దుయ్యబట్టారు. ‘ఏ రిపబ్లికన్, డెమొక్రటిక్ అధ్యక్షుడు ఇలా వ్యవహరించలేదు..వర్ణవివక్ష, జాతివివక్షతో కూడిన ఎందరో అధ్యక్ష పదవి చేపట్టాలని ప్రయత్నించారు..ఆ ప్రయత్నంలో ఎన్నికైన తొలి అధ్యక్షుడు ట్రంప్’అని వ్యాఖ్యానించారు. చదవండి : అగ్రదేశాల దౌత్య యుద్ధం అమెరికన్లను ఏకతాటిపైకి తీసుకురావడాన్ని విస్మరించి ప్రజలను, దేశాన్ని విభజించేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. ట్రంప్ అన్నిటికీ చైనాను టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కాగా బిడెన్ వ్యాఖ్యలు నల్ల జాతీయుల మేథస్సును అవమానించేలా ఉన్నాయని ట్రంప్ క్యాంపెయిన్ సీనియర్ సలహాదారు కట్రినా పియర్సన్ అన్నారు. గతంలో బరాక్ ఒబామా మెరుగైన పనితీరు కనబరిచే తొలి ఆఫ్రికన్ అమెరికన్ అంటూ చేసిన వ్యాఖ్యలపై జో బిడెన్ క్షమాపణలు కోరిన విషయాన్ని కట్రినా ప్రస్తావించారు. అధ్యక్షుడు ట్రంప్ ప్రజలందరినీ అభిమానిస్తారని, అమెరికన్ల సాధికారత కోసం శ్రమిస్తున్నారని, నల్లజాతీయుల నుంచి ఏ రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్ధికీ లభించని మద్దతు ఆయనకు లభిస్తోందని చెప్పుకొచ్చారు. జో బిడెన్ నుంచి వర్ణ వివక్షపై ఏ ఒక్కరూ పాఠాలు నేర్చుకునే పరిస్థితిలో లేరని అన్నారు. -
చాలా సార్లు విన్నా: మేరీ ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్-పదం(నల్లజాతీయులు) అని వాడటం చాలా సార్లు విన్నానని ఆయన సోదరుడి కూతురు మేరీ ట్రంప్ ఆరోపించారు. ‘టూ మచ్ అండ్ నెవర్ ఎనఫ్: హౌ మై ఫ్యామిలీ క్రియోటెడ్ ది వరల్డ్స్ మోస్ట్ డెంజరస్ మ్యాన్’ అనే పేరుతో తన కుటుంబ నేపథ్యంపై మేరీ పుస్తకం రచించారు. ఈ పుస్తకం గత వారం విడుదలైన సందర్భంగా మేరీ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ... తన అంకుల్(డొనాల్డ్ ట్రంప్) జాత్యాహంకార భావాలు ఉన్న వ్యక్తి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తీవ్రమైన జాతి అహంకారం ఉన్న కుటుంబంలో పెరిగానని కూడా పేర్కొన్నారు. (చదవండి: మాస్కులు ధరించమని ఆదేశించలేను: ట్రంప్) అంతేగాక ‘వాస్తవానికి మా అంకుల్(ట్రంప్) చాలా సార్లు ఎన్ -పదం వాడటం నేను విన్నాను. ఆయన ఎంత జాతి అహంకారం ఉన్న వ్యక్తో తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. ఆయన ఎన్-పదం(నల్లజాతీయులు), సెమిటిక్ ఆంటీ స్లర్ల్ పదాలను ఎప్పుడూ ఉపయోగిస్తుంటారు’ అని ఆమె వెల్లడించారు. మేరీ ట్రంప్ వ్యాఖ్యలను వైట్ హౌజ్ ప్రతినిధి సారా మాథ్యూస్ ఖండించారు. మేరీ ట్రంప్ రాసింది అబద్ధాల పుస్తకమని, ట్రంప్ ఎప్పుడు అలాంటి పదాలను వాడరని మాథ్యూస్ పేర్కొన్నారు. మేరీ ట్రంప్(55) డోనాల్డ్ ట్రంప్ సోదరుడు ఫ్రెడ్ జూనియర్ కూతురు. వారసత్వ వివాదం, కుటుంబంలో నెలకొన్న మనస్ఫర్థల కారణంగా చాలా కాలం క్రితమే మేరీ ట్రంప్ తన కటుంబం నుంచి విడిపోయారు. (చదవండి: ట్రంప్ సర్కార్‌పై ఫేస్బుక్ సీఈఓ ఆరోపణలు) -
భారతీయురాలినని బస్సులో నుంచి దింపేశారు
మెల్బోర్న్: తాను కూడా జాతి వివక్షకు గురైన బాధితురాలినేనంటూ విచారం వ్యక్తం చేసింది టీవీ నటి చాందిని భగ్వనాని. ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఉంటున్న ఆమె తనకు ఎదురైన చేదు సంఘటన గురించి సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది. దీని ప్రకారం.. ఆమె మెల్బోర్న్ నుంచి ఓ ప్రదేశానికి వెళ్లేందుకు బస్సు ఎక్కింది. అయితే అక్కడ బస్సు ప్రయాణం ఆమెకు అదే తొలిసారి. బస్సు ఎన్నో మలుపులు తిరుగుతుండటంతో గాబరా పడ్డ ఆమె డ్రైవర్ దగ్గరకు వెళ్లి ఇది సరైన స్థానానికే వెళ్తుందా? అని అడిగింది. కానీ అతని వైపు నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఆ తర్వాత ఇతర ప్రయాణికులు సైతం ఇంచుమించు ఇలాంటి ప్రశ్నలే కురిపించగా వారికి సున్నితంగా, గౌరవంగా జవాబిచ్చాడు. ఇంతకుముందు తాను అడిగింది వినలేదేమోనని ఆమె మరోసారి ప్రయత్నం చేయగా నిశ్శబ్ధమే రాజ్యమేలింది. (నా చర్మం రంగు విలువ ఎంత?) దీంతో మరింత కంగారుపడిన చాందిని అసలు ఎందుకు స్పందించడం లేదని అడగ్గానే డ్రైవర్ ఆగ్రహంతో ఊగిపోతూ కసురుగా వెళ్లిపొమ్మన్నాడు. "నేను చాలా మర్యాదగా అడిగాను కానీ అతను వెళ్లిపొమ్మంటూ అరుస్తూనే ఉన్నాడు. 'చెత్త భారతీయులారా..ఇక్కడి నుంచి వెళ్లిపొండి' అని బూతులు మాట్లాడాడు. దీంతో ఒక్కసారిగా షాక్ తిన్నాను. అతనిపై ఎలా స్పందించాలో, అప్పుడు ఏం చేయాలనేది తోచలేదు. వణుకుతూనే బస్సు దిగిపోయాను. జాతి వవక్ష ఇంకా ఉంది అనడానికి నాకు జరిగిన ఈ అనుభవమే నిదర్శనం" అని తెలిపింది. కాగా చాందిని కొన్ని ప్రోగ్రాములు చేయడం కోసం ఆమె ఆస్ట్రేలియాకు వెళ్లింది. అయితే లాక్డౌన్ వల్ల అక్కడే చిక్కుకుపోయింది. ఆమె చివరిసారిగా "సంజీవని" వెబ్‌సిరీస్‌లో కనిపించింది. (రేసిజానికి అర్థం మార్చేసింది!) #racism #notcool #ptv #Melbourne smallest act of racism is as serious as another major act of racism pic.twitter.com/aysID8Wg9r — Chandni Bhagwanani (@chandnib21) July 9, 2020 -
'ఇంగ్లండ్‌కు ఆడితే కాల్చేస్తామన్నారు'
లండన్ : అమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్ ప్లాయిడ్ హత్య అనంతరం వర్ణ వివక్షపై మరోసారి దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. ఇప్పటికి అతని మృతి పట్ల ప్రపంచంలో ఏనదో ఒక మూల వర్ణ వివక్షపై నిరసనజ్వాలలు కొనసాగుతూనే ఉన్నాయి. వర్ణ వివక్ష అనేది ప్రతీ అంశంలోనూ సామాన్యంగా మారిపోయింది. ఇక క్రీడా ప్రపంచంలోనూ వర్ణ వివక్షకు చోటు ఉందనడంలో సందేహం లేదు. మొన్నటికి మొన్న ఐపీఎల్ సందర్భంగా తాను వర్ణ వివక్ష వ్యాఖ్యలు ఎదుర్కొన్నానంటూ విండీస్ క్రికెటర్ డారెన్ సామి పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఫిలిప్ డీఫ్రెటిస్ తాను క్రికెట్ ఆడిన రోజుల్లో వివక్షను ఎదుర్కొన్నానంటూ తన అనుభవాలను గుర్తు చేసుకున్నాడు.('కోహ్లి అత్యుత్తమ ఆటగాడనేది అందుకే') 'జాతీయ జట్టుకు ఆడుతున్న సమయంలో రెండు, మూడు సార్లు బెదిరింపులు వచ్చాయి. ఇంగ్లండ్ జట్టుకు ఆడితే.. కాల్చి చంపుతామంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఏకంగా సొంత కారు మీద ఉన్న నా పేరును తీసేసుకునేలా చేశారంటే ఏ స్థాయిలో వివక్ష ఎదుర్కొన్నానో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఆటపై దృష్టి పెట్టడం కష్టం. అయినా నా ప్రతిభతో అలాంటి వారిని దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు. ఇంగ్లండ్‌కు ఆడుతున్న రోజుల్లో నాకు ఎలాంటి మద్దతు లభించలేదు. ప్రతి మ్యాచ్‌లోనూ ఏం జరుగుతుందో అనే భయంతోనే ఆడేవాడిని' అంటూ చెప్పుకొచ్చాడు. మంచి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఫిలిప్ డీఫ్రెటిస్ 1986-97 మధ్య కాలంలో ఇంగ్లండ్ తరపున 44 టెస్టులు, 103 వన్డేలు ఆడాడు. -
రెస్టారెంట్ ధ్వంసం.. విద్వేషపూరిత రాతలు
వాషింగ్టన్: న్యూ మెక్సికోలోని సాంటే ఫే నగరంలో ఒక భారతీయ రెస్టారెంట్‌ను గుర్తు తెలియని వ్యక్తులు నామరూపాలు లేకుండా ధ్వంసం చేశారు. రెస్టారెంట్ గోడల మీద విద్వేషపూరిత సందేశాలను రాశారు. ఇండియా ప్యాలెస్ అనే ఈ రెస్టారెంట్ ఓ సిక్కు వ్యక్తిది అని స్థానిక మీడియా తెలిపింది. రెస్టారెంట్‌కు జరిగిన నష్టం 1,00,000 డాలర్లుగా ఉంటుందని సమాచారం. ఈ సంఘటనను సిక్కు అమెరికన్ లీగల్ డిఫెన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్ (ఎస్ఏఎల్డీఈఎఫ్- సాల్డెఫ్) తీవ్రంగా ఖండించింది. ఈ రకమైన ద్వేషం, హింస ఆమోదయోగ్యం కాదని తెలిపింది. అమెరికాలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి భద్రత కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలి అని సాల్డెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిరణ్ కౌర్ గిల్ అన్నారు. అంతేకాక శాంటా ఫే ఒక ప్రశాంతమైన పట్టణం అని.. సిక్కు సమాజం గత 60 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎంతో సంతోషంగా జీవిస్తుందని తెలిపారు. ఈ క్రమంలో యజమాని మాట్లాడుతూ.. ‘దుండగులు రెస్టారెంట్‌లోని టేబుల్స్‌ని విరగ్గొట్టారు. గాజు సామానును ముక్కలు ముక్కలు చేశారు. వైన్ ర్యాక్‌ను ఖాళీ చేశారు. ఓ దేవత విగ్రహాన్ని శిరచ్ఛేదన చేశారు. కంప్యూటర్లను ఎత్తుకెళ్లారు. వంటగదిని కూడా పూర్తిగా నాశనం చేశారు. ఆహారాన్ని వేడి చేసే పరికరాలు ధ్వంసం చేశారు. గోడల మీద ‘వైట పవర్’.. ‘ట్రంప్2020’.. ‘ఇంటికి వెళ్లు’ అని రాసి ఉంది. ఇవన్ని చూసి అసలు ఇక్కడ ఏం జరిగిందో నాకు ఇంకా అర్థం కావడం లేదు’ అని వాపోయాడు. దీని గురించి స్థానిక పోలీసులు, ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ‘బ్లాక్ లైవ్స్ మేటర్’ ఉద్యమంలో భాగంగా స్పానిష్ వలసవాదులతో సంబంధం ఉన్న విగ్రహాలను తొలగించడంతో ఇటీవల ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు చెలరేగాయి. అంతేకాక ఈ ఏడాది ఏప్రిల్ 20న కొలరాడోలోని లాక్వుడ్లో ఎరిక్ బ్రీమాన్ అనే వ్యక్తి.. సిక్కు అమెరికన్ లఖ్వంత్ సింగ్‌పై దారుణంగా దాడి చేశాడు. నాటి నుంచి ఈ ద్వేషపూరిత నేరాలలో గణనీయమైన పెరుగుదల కనిపించిందని సాల్డెఫ్ తెలిపింది. లఖ్వంత్ సింగ్‌పై దాడి చేస్తున్నప్పుడు సదరు వ్యక్తి.. ‘మీ దేశానికి తిరిగి వెళ్ళు’ అని బెదిరించాడని తెలిపారు. అయితే దాడి చేసిన వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. -
'జగ్మీత్ సింగ్ అంశం నన్ను బాధించింది'
కెనడా : న్యూ డెమొక్రాటిక్ పార్టీ (ఎన్డీపీ) అధినేత జగ్మీత్ సింగ్ బ్లాక్ క్యూబెకోయిస్ పార్టీకి చెందిన సభ్యుడి పట్ల వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేసినందుకు బుధవారం పార్లమెంటు నుంచి బహిష్కరణకు గురయ్యారు. కాగా జగ్మీత్సింగ్కు తాను మద్దతుగా ఉన్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గురువారం తెలిపారు. కెనడాలో ఫెడరల్ పార్టీకీ నాయకత్వం వహించిన మొదటి సిక్కు సభ్యుడిగానూ, మైనారిటీగానూ జగ్మీత్ సింగ్ నిలిచారు. కాగా దేశంలోని ఫెడరల్ పోలీస్ ఫోర్స్ దైహిక జాత్యహంకారాన్ని గుర్తించడానికి ఎన్డీపీ మోషన్లో సంతకం చేయాలంటూ వేర్పాటువాద సంస్థ బ్లాక్ క్యూబెకోయిస్ పార్టీకి చెందిన నేతను బుధవారం జగ్మీత్ సింగ్ అడిగారు. మోషన్లో సంతకం చేయడానికి బ్లాక్ క్యూబెకోయిస్ పార్టీ ఒప్పుకోకవడంతో జగ్మీత్ గొడపడ్డారు. దీంతో జగ్మీత్ పార్లమెంట్ నుంచి తాత్కాలిక బహిష్కరణకు గురయ్యారు. ఈ అంశంపై ట్రూడో స్పందిస్తూ..' బ్లాక్ క్యూబెకోయిస్ పార్టీ వర్ణ వివక్షపై సంతకం చేయడానికి నిరాకరించడం నిరాశపరిచింది. మన దేశంలో ప్రతి భాగంలోనూ, ప్రతి సంస్థలోనూ దైహిక జాత్యహంకారం ఉంది. ఆ వివక్షతను గుర్తించి, దాన్ని పరిష్కరించడమే మొదటి అడుగుగా భావించాలి.దీనిపై ఎన్డీపీ నేత జగ్మీత్ సింగ్ చేసిన సూచనకు తాను మద్దతుగా ఉన్నా. ఒకే దేశంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే ఇలాంటి మంచి విషయాలు చర్చించాల్సిన అవసరం ఉంది. ఎన్డీపీ మోషన్‌పై సంతకం చేయడానికి నిరాకరించిన బ్లాక్ క్యూబెకోయిస్ పార్టీకి చెందిన నేతతో జగ్మీత్ గొడవపడ్డారు. దీంతో క్షమాపణ చెప్పడానికి నిరాకరించిన జగ్మీత్‌ను పార్లమెంట్ చాంబర్ నుంచి బహిష్కరించారు. జగ్మీత్ క్షమాపణ చెబుతారనే అనుకుంటున్నా.. ఒకవేళ ఆయన క్షమాపణ చెప్పకపోతే హౌస్ ఆఫ్ కామన్ అధ్యక్షుడు కఠిన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. పరిస్థితి అంతదూరం వెళ్లదనే నేను అనుకుంటున్నా.' అంటూ తెలిపారు. ('ఆ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి చైనా సిద్ధం') మొత్తం 338 సీట్లలో జగ్మీత్ నేతృత్వంలోని ఎన్డీపీకి 24 సీట్లు, వేర్పాటువాద సంస్థ బ్లాక్ క్యూబెకోయిస్ పార్టీకి 32 సీట్లు ఉన్నాయి. గత నెలలో జాత్యంహకార దాడిలో పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన జార్జ్ ప్లాయిడ్‌కు మద్దతుగా వర్ణ వివక్షను రూపుమాపాలని, కెనడియన్ పోలీస్ వ్యవస్థలోనూ మార్పులు తీసుకురావాలంటూ పార్లమెంట్లో ఎన్డీపీ తన పోరాటం కొనసాగిస్తుంది. -
పోలీసు సంస్కరణలకు ట్రంప్ ఓకే
వాషింగ్టన్: ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మరణంతో కొద్ది వారాల పాటు జాతి వివక్షకు వ్యతిరేకంగా అగ్రరాజ్యం నిరసనలతో హోరెత్తిపోవడంతో ట్రంప్ ప్రభుత్వం పోలీసు శాఖలో భారీ సంస్కరణలను చేపట్టింది. అమెరికా పోలీసులు మరింత బాధ్యతా యుతంగా ప్రవర్తించేలా సంస్కరణలు తెస్తూ రూపొందించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై రోజ్ గార్డెన్లో జరిగిన ఒక కార్యక్రమంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. అయితే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన జాతి వివక్ష అంశంపై అందులో ఎలాంటి ప్రస్తావన లేదు. ఈ సంతకం చేసే కార్యక్రమానికి ముందు పోలీసుల దాష్టీకానికి బలైపోయిన నల్లజాతీయుల కుటుంబాలను ట్రంప్ వ్యక్తిగతంగా కలుసుకున్నారు. వారి కుటుంబ సభ్యుల మరణాల పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆ తర్వాత పోలీసుల్ని కలుసుకున్న ట్రంప్ తన స్వరం మార్చారు. ప్రజలందరినీ సురక్షితంగా ఉంచడానికి రేయింబగళ్లు కష్టపడుతున్న పోలీసులకి గౌరవం ఇవ్వాలన్నారు. పోలీసు అధికారుల్లో అత్యధికులు నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తారంటూ కొనియాడారు. -
గతంతో ఘర్షిస్తేనే అమెరికాకు భవిష్యత్తు
నల్లజాతీయులపై అమెరికాలో కొనసాగుతున్న జాతివివక్షాపరమైన దాడులు, హత్యలు శతాబ్దాలుగా కొనసాగుతున్న బానిసత్వ సంస్కృతి గతం నుంచి ఆ దేశం ఏమాత్రం బయటపడలేదని ప్రపంచానికి చాటి చెబుతున్నాయి. మినియాపోలీస్, సియాటిల్‌లో ఇద్దరు నల్లజాతీయులను పోలీసు అధికారులు దారుణంగా హత్య చేసిన ఘటన అటు అమెరికాలో, ఇటు గ్రేట్ బ్రిటన్‌లో ఒక సరికొత్త సాంస్కృతిక విప్లవానికి నాంది పలుకుతోంది. గతచరిత్ర తప్పిదాలతో ఘర్షణ పడటం ద్వారానే అమెరికా ఒక సరికొత్త, వివక్షారహితమైన సంస్కృతి పథంలో పయనించగలదు. 1970లో, పలువురు వృద్ధ తరం జర్మన్లు గతంలో నాజీలు తలపెట్టిన నేరాలకు గానూ ప్రపంచానికి క్షమాపణ తెలియజేస్తూ వార్సా ఘెట్టో స్మారక స్తూపం వద్ద మోకాళ్లు వంచి నిలబడటం చరిత్రకెక్కింది. జాతివివక్ష, జాతీయ, సామ్రాజ్యవాద భ్రమల్లో మునిగితేలుతున్న వారు తమ సమాజం సుదూర గతంలో చేసిన తప్పులను అంగీకరించడం అంటే అది తమ బలహీనతే అని భావిస్తారు. అయితే అదేసమయంలో అవమానకరమైన గత చరిత్రతో ఘర్షించి కొత్త మార్గం చేపట్టడం అనేది ఏ జాతికైనా, సమాజానికైనా అతిగొప్ప బలానికి చెందిన వనరుగానే ఉంటుంది. ఇప్పుడు గ్రేట్ బ్రిటన్, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అక్షరాలా ఒక సాంస్కృతిక విప్లవం చెలరేగుతోంది. బానిస యజమానుల విగ్రహాలను కూల్చివేస్తున్న నిరసనకారులు తమపట్ల శ్వేతజాతీయులు గతంలో చేసిన పాపాలకు గాను నైతిక నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ వీధుల్లోకి వస్తున్నారు. బానిసత్వం, సామ్రాజ్యవాదం అనేవి ప్రపంచంలోనే అత్యంత ప్రధానమైన దేశాల్లో సంపదకు, అధికారవర్గాలకు మద్దతుగా నిలుస్తున్నాయని, అదేసమయంలో కోట్లాదిమంది నల్లజాతి ప్రజలను తరాలపాటు దారిద్య్రంలోకి నెడుతూ అవమానిస్తున్నాయని నిరసనకారులు ఎలుగెత్తి చాటుతున్నారు. తాజాగా విగ్రహాలను విధ్వంసం చేస్తున్నవారు చాలావరకు ప్రజాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. కెంట్‌లో డెమొక్రాటిక్ పార్టీకి చెందిన శాసనసభ్యులు జాతిపరమైన హింసాకాండకు బలవుతున్న బాధితుల పట్ల సంఘీభావం ప్రదర్శిస్తూ మోకాళ్లమీద నిలబడుతూ ఒక అరుదైన దృశ్యాన్ని ఆవిష్కరించడం నిజంగా నమ్మలేని విషయమే. అసంఖ్యాకంగా వ్యక్తులు, సంస్థలు జాతిపరమైన న్యాయానికి మద్దతుగా ముందుకువస్తున్నారు. జాతి సమానత్వాన్ని ఉల్లంఘిస్తున్నవారిని పేరుపెట్టి మరీ అగౌరవపరుస్తున్నారు. అయితే ప్రత్యేకించి కరోనా వైరస్ విధ్వంసం శిథిలాల నుంచి లేచి నిలబడాలని చూస్తున్న అమెరికా, బ్రిటన్ దేశాల్లో సరికొత్త జాతీయ గుర్తింపునకు సంబంధించి మరింత లోతుగా, దృఢంగా సాగుతున్న సమరం ఇప్పుడే ప్రారంభమైంది. తిరిగి మార్చడానికి వీల్లేనంత వైవిధ్యపూరితంగా ఉంటున్న అమెరికన్ సమాజంలో దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మూర్తీభవించిన శ్వేతజాతి దురహంకారానికి తిరుగులేని నిదర్శనంగా కనిపిస్తున్నారు. అలాగే విన్స్టన్ చర్చిల్‌పై ఇప్పటికీ బ్రిటన్‌లో కొనసాగుతున్న ఆరాధనా భావం బోరిస్ జాన్సన్ హయాంలో సంఖ్యరీత్యా మరింతగా పెరుగుతోందే తప్ప జాత్యహంకార ధోరణి తగ్గుముఖం పడుతున్న సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. బానిస యజమానులకు సంబంధించి ససాక్ష్యంగా నేటికీ మిగిలివున్న వాస్తవాలు.. ప్రస్తుతం అమెరికాలో అసంఖ్యాక ప్రజలను ఆకర్షించనట్లుగానే, బ్రిటిష్ సామ్రాజ్యంపై, అలనాటి రవి అస్తమించని సామ్రాజ్య వైభవంపై, దాని విస్తార అధికారంపై భావోద్వేగపరంగా పెంచుకుంటూ వస్తున్న అనుబంధం కూడా టోరీ ప్రభుత్వ అప్రయోజకత్వాన్ని కాపాడలేదు. బ్రెగ్జిట్ నుంచి ఎలా బయటపడాలన్న విషయంపై టోరీ ప్రభుత్వం ఇప్పుడు మల్లగుల్లాలు పడుతోంది. జాతివివక్షానంతర, సామ్రాజ్యవాద అనంతర గుర్తింపు కోసం ప్రస్తుతం శోధిస్తున్న అమెరికా, బ్రిటన్ దేశాలు.. రెండు ప్రపంచ యుద్ధాల్లో తమకు రాజీపడని శత్రువుగా నిలిచిన జర్మనీ నుంచి తెలివైన పాఠాలు నేర్చుకోవలసి ఉంది. ఒకవైపు అమెరికాలోని వర్జీనియాలోని కార్లోటెస్విల్లీలో ‘మా నేల, మా నెత్తురు’ అంటూ స్వస్తిక్ బేనర్లు ధరించి మరీ శ్వేతజాతి దురహంకారులు నినదిస్తుండగా, బ్రెగ్జిట్ మార్గంలో వలసప్రజలపై తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేయడానికి బ్రిటన్‌లో రాజకీయ నాయకులు, జర్నలిస్టులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ గతంలో జాత్యహంకారానికి మారుపేరుగా నిలిచిన జర్మనీ మాత్రం పదిలక్షల మందికిపైగా వలస ప్రజలకు స్వాగతం పలుకుతూ కొత్త్త సంస్కృతికి తలుపులు తెరిచింది. ఇదే విషయాన్ని సుసాన్ నీమన్ సకాలంలో రాసిన ’లెర్నింగ్ ఫ్రమ్ ది జర్మన్స్’ పుస్తకం ఈ పరిణామాన్ని రెండో ప్రపంచ యుద్ధానంతరం జర్మనీలో తలెత్తిన అతి పెద్ద, విస్తృత సామాజిక ఉద్యమంగా వర్ణించింది. ప్రపంచ యుద్ధానంతరం జర్మనీలో విజయవంతంగా ఉనికిలోకి వచ్చి నిలిచిన పచ్చిమితవాద పార్టీ ది ’ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ’ ఈ సరికొత్త జర్మనీ చైతన్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించింది. కానీ చిన్న ప్రజాపునాది మాత్రమే కలిగి ఉన్న ఈ పార్టీ అంతర్యుద్ధం, కరోనా వైరస్ వ్యూహం మధ్య ప్రస్తుతం కొట్టుమిట్టులాడుతూ తమ ప్రాభవాన్ని చాలావరకు కోల్పోయింది. పైగా, దేశ నాజీ గతాన్ని తిరస్కరించడం కానీ, తగ్గించడానికి ప్రయత్నించడం కానీ చేస్తున్న ఈ పార్టీ దేశంలో పెరుగుతున్న జాత్యహంకార వ్యతిరేక మనోభావాలను బలోపేతం చేయడానికి తోడ్పడింది. జాతి దురహంకారతత్వం నుంచి స్థిరంగా, విస్తృతంగా బయటపడినందువల్లే, ఇటీవలి సంవత్సరాల్లో ఆంగ్లో–అమెరికాను ధ్వంసం చేసిన విషఫూరిత రాజకీయాలనుంచి పూర్తిగా బయటపడే ప్రక్రియలో జర్మనీ అత్యున్నత స్థాయికి చేరుకుంది. అయితే ఇది ఒక్కరాత్రిలో సంభవించింది కాదు. అమెరికా దక్షిణ ప్రాంతంలో పూర్తిగా విడిపోయిన జాతుల మధ్య పెరిగిన తత్వవేత్త నీమన్, చాలాకాలం బెర్లిన్‌లో నివసిస్తూ, ఒక గొప్ప వ్యాఖ్య చేశాడు. ’’చరిత్రలో అత్యంత దారుణమైన నేరాలకు పాల్పడిన వారు తమ నేరాలను అంగీకరించడానికి దశాబ్దాల కఠిన కృషి అవసరమైంది. ఆ తర్వాతే వారు తమ నేరాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడం మొదలెట్టారు.’’ అమెరికా నుంచి వచ్చి పశ్చిమజర్మనీలో నివసిస్తున్న వారు నాజీ సంస్కృతిని రద్దు చేయాలంటూ చేసిన డిమాండ్ పాక్షికంగా మాత్రమే ఫలవంతమైంది. అనేకమంది నాజీ నేరస్తులు ప్రచ్ఛన్నయుద్ధ సమయంలో సోవియట్ కమ్యూనిజానికి వ్యతిరేకంగా బ్రహ్మాండంగా ఉపయోగపడ్డారని అమెరికా నిఘా సంస్థలు కనుగొన్నాయి. నిజానికి 1960లలో జర్మనీలో చెలరేగిన విద్యార్థి తిరుగుబాటును నాజీ అనుకూలురైన వ్యక్తులు, సంస్థలు రెచ్చగొట్టారు. నాజీల శకంలో ఓ వెలుగు వెలిగిన ప్రభుత్వ అధికారులు, పారిశ్రామికవేత్తలు, బ్యాంకర్లు, ప్రొఫెసర్లు తమ ప్రాభవాన్ని తిరిగి సంపాదించుకోవడానికి ఇలా ప్రయత్నించారు. అనేకమంది జర్మన్లు నేటికీ తాము బాధితులమేనని తలుస్తుంటారు. దశాబ్దాల తర్వాత సైతం ఒక అలనాటి నాజీ సంస్కృతిని స్మరించుకోవడం, వేడుకలు జరపటం జర్మనీలో తరగతి గదుల్లో, వెలుపల కూడా జరుగుతూ వచ్చింది. నాజీ నేరాలకు బలైన బాధితులు పెద్ద, చిన్న స్మారక చిహ్నాలు జర్మనీ వ్యాప్తంగా నెలకొన్నాయి. బెర్లిన్‌లోని నాటి మారణహోమానికి చిహ్నంగా నిర్మించిన స్మారక చిహ్నం కానీ, స్థానిక వీధుల్లో నెలకొల్పిన శిలా విగ్రహాలు కానీ ఒకప్పుడు తమతో జీవించి తర్వాత నాజీలతో బలవంతంగా తరలించబడిన వారి పేర్లు, తేదీలను నమోదు చేశాయి. 1970లో, పలువురు వృద్ధ తరం జర్మన్లు నాజీ నేరాలకు గానూ ప్రపంచానికి క్షమాపణ తెలియజేస్తూ వార్సా ఘెట్టో స్మారక స్తూపం వద్ద మోకాళ్లు వంచి నిలబడటం చరిత్రకెక్కింది. కానీ ఆనాటి ఆ దృశ్యం అసాధారణమైన బలాన్ని కలిగి ఉంది. నైతిక అంతర్ముఖత్వం, చారిత్రక విచారణ ద్వారా పునరుత్తేజం చెందిన ఒక సమాజం, సంస్కృతి సరికొత్త రూపాన్ని అది ప్రతిబింబించింది. జర్మనీలోని ఈ సరికొత్త సంస్కృతితో ఆంగ్లో–అమెరికన్ ప్రవృత్తులను పోల్చి చూద్దాం. వామపక్ష భావాలున్న నాటి బ్రిటన్ ప్రధాని గోర్డాన్ బ్రౌన్ 2005లో తూర్పు ఆఫ్రికాలో పర్యటించినప్పుడు బ్రిటన్ తన వలసవాద గతానికి గానూ క్షమాపణ చెప్పే రోజులు శాశ్వతంగా ముగిసిపోయాయి అని ప్రకటించాడు. వాస్తవానికి బ్రిటన్ తన వలసపాలన దురాగతాలకు ఎన్నడూ క్షమాపణ చెప్పింది లేదు. తన జాతివివక్షకు సంబంధించిన గతంతో ఘర్షణపడి మారిపోయిన జర్మనీ తరహా ప్రవర్తన ఆంగ్లో–అమెరికా ప్రాంతంలో సమీప భవిష్యత్తులో కూడా ఏర్పడే సూచనలు కనిపించడం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫాక్స్ న్యూస్‌కి చెందిన పచ్చి మితవాద జర్నలిస్టు టక్కర్ కార్ల్సన్ వంటి అసంబద్ధ ప్రేలాపనలు చేస్తున్నవారు తాజాగా ప్రదర్శిస్తున్న పశ్చాత్తాపమన్నదే ఎరుగని జాత్యహంకార ధోరణి.. బ్రిటన్, అమెరికాలను ఆవరిస్తున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక విషమ పరిస్థితులను మరింతగా పెంచి పోషించగలదు. జాతివివక్ష, జాతీయ, సామ్రాజ్యవాద భ్రమల్లో మునిగితేలుతున్న వారు తమ సమాజం సుదూర గతంలో చేసిన తప్పులను అంగీకరించడం అంటే అది తమ బలహీనతే అని నిస్సందేహంగా భావిస్తారు. అయితే అదేసమయంలో అవమానకరమైన గత చరిత్రతో ఘర్షించి కొత్త మార్గం చేపట్టడం అనేది ఏ జాతికైనా, సమాజానికైనా అతిగొప్ప బలానికి చెందిన వనరుగానే ఉంటుంది. పంకజ్ మిశ్రా వ్యాసకర్త రచయిత, కాలమిస్ట్ -
సియాటిల్‌లో ఆందోళనలకు భారతీయురాలి సారథ్యం
వాషింగ్టన్/లండన్: అమెరికాలో మరోసారి జాతివివక్షకు నిరసగా ఆందోళనలు మొదలయ్యాయి. పోలీసుల దురుసు ప్రవర్తనతో చివరకు ఇద్దరు నల్లజాతీయులు జార్జ్ ఫ్లాయిడ్, రేషార్డ్ బ్రూక్స్ ప్రాణాలు కోల్పోయిన ఉదంతంలో నిరసనలు ఎక్కువయ్యాయి. సియాటిల్‌లో జరుగుతున్న ‘బ్లాక్‌లైవ్స్ మ్యాటర్’ ఆందోళనలకు 46 ఏళ్ల భారతీయ అమెరికన్ క్షమా సావంత్ నేతృత్వం వహిస్తున్నారు. సియాటెల్ డౌన్‌టౌన్ నుంచి పోలీసులను తొలగించాలన్న డిమాండ్‌పై ఆమె ఆందోళన చేస్తున్నారు. పుణేలో పుట్టి ముంబైలో చదువుకున్న క్షమా సావంత్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు. సమాజంలోని ఆర్థిక అసమానతలను గమనించిన తాను ఆర్థిక శాస్త్రాన్ని చదివానని అందులోనే పీహెచ్డీ చేశానని ఆమె తెలిపారు. 2006లో సోషలిస్ట్ ఆల్టర్నేటివ్‌లో చేరి 2013లో సిటీ కౌన్సిల్ ఉమెన్‌గా ఎన్నికయ్యారు. బ్రిటన్‌లో జాతివివక్షపై కమిషన్.. బ్రిటన్‌లో జాతివివక్ష సమస్యను సమర్థంగా ఎదుర్కొనేందుకు కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. జాతివివక్షకు ఫుల్స్టాప్ పెట్టే విషయంలో చేయాల్సింది ఎంతో ఉందని ఆయన పేర్కొన్నారు.. జార్జి ఫ్లాయిడ్ హత్యను నిరసిస్తూ అమెరికాలోని లాస్ఏంజెలెస్లోని హాలీవుడ్లో ‘ఆల్ బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ప్రదర్శనలో పాల్గొన్న వందలాది మంది ఆందోళనకారులు -
ఇది కాదు మనం చేయాల్సింది.. అందమైన ఫొటో!
ఆడా.. మగా..? నలుపా.. తెలుపా..? ఆధిపత్య వర్గమా.. అణగదొక్కబడిన సమూహమా? ఈ తారతమ్యాలేవీ లేకుండా ‘మనిషి’గా జీవించినపుడే మానవత్వం అనే మాటకు అర్థం ఉంటుందని నిరూపించాడు పాట్రిక్ హచ్కిన్సన్ అనే వ్యక్తి. తమ నిరసనను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగి గాయపడిన ‘ప్రత్యర్థి’ని కాపాడాడు. ‘ఇది కాదు మనం చేయాల్సింది’ అంటూ భుజాలపై మోసుకెళ్లి మరీ అతడిని రక్షించాడు. సెంట్రల్ లండన్‌లోని వాటర్లూ బ్రిడ్జి వద్ద శనివారం ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాలు.. శ్వేతజాతి పోలీసు చేతిలో మే 25న అమెరికాలో హత్యకు గురైన ఆఫ్రో- అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతంపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో లండన్‌లోని వాటర్లూ బ్రిడ్జి వద్ద ఈ జాత్యహంకార చర్యను వ్యతిరేకిస్తూ కొంతమంది శాంతియుత నిరసనకు దిగారు. ఇంతలో వీరికి వ్యతిరేకంగా శ్వేతజాతీయులు సైతం అక్కడే ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ గొడవలో ఓ శ్వేతజాతీయుడు కిందపడిపోయాడు. అతడి ముఖానికి గాయాలయ్యాయి. (ప్రత్యేక విమానం.. బోనస్.. గ్రేట్ సర్!) ఈ విషయాన్ని గమనించిన పాట్రిక్.. అతడిని భుజాలపై వేసుకుని.. ఆస్పత్రికి తరలించాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న రాయిటర్స్ ఫొటోగ్రాఫర్ డిలన్ మార్టినెజ్ ఈ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించారు. ఈ విషయం గురించి మార్టినెజ్ మాట్లాడుతూ.. ఈ ఫొటో తీయడం తన అదృష్టంగా భావిస్తున్నారు. ఇక ఈ ఘటనపై స్పందించిన బ్రిటీష్ జర్నలిస్టు పీర్స్ మోర్గాన్.. ‘‘అన్ని వికారాల మధ్య.. మానవత్వాన్ని పరిమళింపజేసిన అందమైన క్షణం’’ అని ట్విటర్లో ఫొటో షేర్ చేశారు. కాగా పాట్రిక్ పర్సనల్ ట్రెయినర్‌గా పనిచేస్తున్నాడని.. బాధితుడి వివరాలు మాత్రం వెల్లడి కాలేదని రాయిటర్స్ పేర్కొంది. మరోవైపు.. ఈ ఘటన గురించి మాట్లాడేందుకు పాట్రిక్ అందుబాటులో లేకపోవడంతో అతడి స్నేహితుడు బ్రిటీష్ చానెల్ 4తో ఆదివారం మాట్లాడాడు. సదరు శ్వేతజాతీయుడిని కాపాడింది పాట్రికేనని ధ్రువీకరించినట్లు సంస్థ తెలిపింది. ఇదిలా ఉండగా.. యాంటీ రేసిస్ట్ నిరసనల్లో గత వారం మొత్తం 113 మంది అరెస్టయ్యారని, 23 మంది అధికారులు గాయపడినట్లు స్థానిక పోలీసులు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. వాటర్లూ బ్రిడ్జి వద్ద ఘర్షణలు చోటుచేసుకున్న సమయంలో అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టినట్లు తెలిపారు. -
‘యూ ఫర్ అగ్లీ’.. టీచర్లు సస్పెండ్
కోల్‌కతా: ఆఫ్రో-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్యతో మరోసారి జాత్యాంహకార వ్యతిరేక ఆందోళనలు తెర మీదకు వచ్చాయి. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇద్దరు మహిళా ఉపాధ్యాయులను సస్పెండ్ చేసింది. తూర్పు బుర్ద్వాన్ జిల్లాలోని స్థానిక మున్సిపాలిటీ స్కూల్‌కు చెందిన ఈ టీచర్లు నలుపు రంగు వ్యక్తులను అవమానించే విధంగా ఉన్న పాఠాలను ప్రీ ప్రైమరీ పిల్లలకు భోదించడంతో వీరిని సస్పెండ్ చేశారు. ఆంగ్ల వర్ణమాలను భోదించే ఈ పుస్తకంలో యూ అక్షరం దగ్గర అగ్లీ అని రాసి ఉంది. పక్కనే నలుపు రంగు పిల్లవాడి బొమ్మ ఉంది. లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం పాఠశాలలు ముసి వేశారు. ఈ క్రమంలో ఓ విద్యార్థి తండ్రి పిల్లవాడి చేత అక్షరాలు వల్లే వేయిస్తూ.. ‘యూ’ ఫర్ ‘అగ్లీ ’అని రాసి ఉండటం గమనించాడు. దీని గురించి ఇతర తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. అందరు కలిసి ఈ విషయాన్ని విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులు సదరు టీచర్లను సస్పెండ్ చేశారు. అనంతరం ఓ అధికారి దీని గురించి మాట్లాడుతూ.. ‘సదరు పుస్తకం విద్యాశాఖ ప్రచురించే పాఠ్యపుస్తకం కాదు. పాఠశాల సొంతంగా రూపొందించుకున్న బుక్. విద్యార్థుల మనస్సుల్లో పక్షపాతాన్ని కలిగించే చర్యలను మేం సహించం. ప్రస్తుతం ఆ ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేశాం. ప్రాథమిక దర్యాప్తు ముగిసిన తర్వాత కఠిన చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు. -
రేసిజానికి అర్థం మార్చేసింది!
చేర్పు మొక్కకి శ్రద్ధగా అంటు కడతారు. కలిసిపోవాలి. కొత్తవి వికసించాలి. యూ.ఎస్.లో అలా లేదు. శ్రద్ధగా అంటు విడగొడుతున్నారు! ‘‘షిట్.. నల్లవాళ్లను కలుపుకోవడమా!’’ సి..స్ట..మే..టì...క్.. రేసిజం!! పైకి కనిపించని జాత్యహంకారం. డిక్షనరీలో ఇంత లోతైన అర్థం లేదు. పాతను తీసి, ఇప్పుడా లోతును చేర్చబోతోంది వెబ్‌స్టర్. అదీ ఒక విద్యార్థిని మాట మీద! యూనివర్సిటీ నుంచి కెన్నెడీ మిచమ్ ఫ్రెష్‌గా బయటికి వచ్చిందని చెప్పడానికి లేదు. నల్లజాతి అమ్మాయి. స్కూల్లో, కాలేజ్‌లో, యూనివర్సిటీలో నలిగి నలిగి.. ‘అమ్మ దేవుడా’ అని డిగ్రీతో బయటపడింది. తెల్ల చూపులు, తెల్ల మాటలు, తెల్ల సోషల్ డిస్టెన్స్లు.. అన్నీ అయి, అయోవాలోని డ్రేక్ విశ్వవిద్యాలయం నుంచి అకడమిక్ క్యాప్‌తో గేటు దాటగానే.. మినియాపలీస్లో పెద్ద పిడుగు. అదిరిపడింది. జార్జి ఫ్లాయిడ్ విషాద మరణం! అదురుపాట్లు మిచమ్కు కొత్తేం కాదు. జాత్యహంకారానికి అలవాటు పడలేకపోతోంది. మిస్సోరీలోని ఫ్లోరిసెంట్లో ఉంటుంది తను. అక్కడికి దగ్గర్లోనే ఫెర్గూసన్. 2014లో మైఖేల్ బ్రౌన్ అనే పద్దెనిమిదేళ్ల నల్లజాతి యువకుడిని ఒక పోలీసు అధికారి కాల్చి చంపింది ఫెర్గూసన్లోనే. నేటి ‘బ్లాక్ లైవ్స్ మేటర్’ ఉద్యమానికి నాంది అది. మిచమ్కి అప్పుడు పదహారేళ్లు. ఇంటికొచ్చాక పెద్దవాళ్లను అడిగింది.. ‘ఒక మనిషిని అలా ఎలా చంపేస్తారు?’ అని. ‘రేసిజం’ అన్నారు. ఆ మాటకు అర్థం కోసం ‘మెరియం వెబ్‌స్టర్’ డిక్షనరీలో వెతికింది. పుట్టిన జాతి నుంచి సంక్రమించే ఆధిక్యభావన అని ఉంది! ఆ అర్థం కరెక్టు కాదనిపించింది మిచమ్కు. ఆధిక్యభావన ఉంటే ఉండొచ్చు.. మనిషిని మనిషిలా చూడాలి కదా.. అనుకుంది. అమెరికాలో అత్యధికంగా విక్రయం అయ్యే నూటా ఎనభై ఐదేళ్ల నాటి మెరియం వెబ్‌స్టర్ డిక్షనరీని గొప్ప భాషా పండితులే రూపొందించి ఉండొచ్చు. కానీ బయట కనిపించే రేసిజానికి, డిక్షనరీలో కనిపిస్తున్న అర్థం సరిపోవడం లేదు ∙∙ ‘రేసిజం’ అంటే డిక్షనరీలో ఉన్న అర్థం కరెక్టేనా అని ప్రొఫెసర్లను అడిగింది మిచమ్. ‘అవును కరెక్టే కదా’ అన్నారు. ‘పైపై అర్థం కాదు సర్, వాస్తవ పరిస్థితికి ఆ అర్థం సరిపోతుందా?’ అని మళ్లీ అడిగింది. రెండోసారి వాళ్లు సమాధానం చెప్పలేదు. సోషల్ మీడియాలో ఈ టాపిక్‌ని తెచ్చింది. ‘నీకర్థం కాదులే’ అని కొందరన్నారు. ‘చదువుకోడానికి నీకు రిజర్వేషన్ ఉంది కదా. అదే రేసిజం’ అని నవ్వారు కొందరు. వాళ్ల మాటలు కూడా మిచల్కు రేసిజంలానే అనిపించాయి. కానీ అవి డిక్షనరీ అర్థం పరిధిలోకి రానివి! వాళ్ల మాటల్నే సరిగా నిర్వచించలేనప్పుడు జార్జిఫ్లాయిడ్‌ను చంపేసిన పోలీసు మోకాలిలోని జాత్యహంకారానికి మెరియం వెబ్‌స్టర్ సరైన అర్థాన్ని ఎలా చెప్పగలుగుతుంది? ఫ్లాయిడ్ మే 25న చనిపోయాడు. మిచల్ మే 28న ఆ డిక్షనరీ పబ్లిషర్లకు మెయిల్ పెట్టింది. ‘‘మీ డిక్షనరీలో రేసిజం అనే మాటకు ఉన్న అర్థం తప్పు. దానిని మార్చాలి’’ అని తను అనుకున్న అర్థం ఏమిటో రాసి పంపింది. వెంటనే వెబ్‌స్టర్ ఎడిటర్ ఆమెకు రిప్లయ్ ఇచ్చారు. ‘‘ఆగస్టులో మార్కెట్లోకి వచ్చే డిక్షనరీలో రేసిజానికి మా పాత అర్థాన్ని తొలగించి, మీ కొత్త అర్థాన్ని చేరుస్తున్నాం’’ అని తెలిపారు! ‘ఐ వాజ్ సూపర్ హ్యాపీ’ అంటోంది మిచమ్ ఆ రిప్లయ్‌ని చూసినప్పుడు తనకేం అనిపించిందో చెబుతూ. రేసిజాన్ని వెబ్‌స్టర్ ‘ఆధిక్య భావన’ అంది. మిచమ్ ‘అల్పులనే భావన’ అంది. అల్పులు అనే భావన మనసులో లేకపోతే అధిక్యం అనే భావనే ఉండదని మిచమ్ ఉద్దేశం. నల్లవాళ్లకు ఎందులోనూ అధికారం లేకుండా చేసేందుకు, ఒక ప్రణాళిక ప్రకారం (సి..స్ట..మే..ట...క్..గా) సాగుతున్న వివక్షే రేసిజం అనే అర్థం రావాలని మిచమ్ తపన. ఆ తపనని మెరియం వెబ్‌స్టర్ డిక్షనరీ గుర్తించి, గౌరవించింది. -
దక్షిణాది ప్లేయర్లపైనే వర్ణ వివక్ష: పఠాన్
న్యూఢిల్లీ: దేశవాళీ క్రికెట్లో దక్షిణాది ప్లేయర్లు వర్ణ వివక్షకు గురవుతారని భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తెలిపాడు. ఉత్తరాది, పశ్చిమ ప్రాంతాలకు మ్యాచ్‌ల నిమిత్తం వెళ్లినపుడు వారు వర్ణానికి సంబంధించిన వ్యాఖ్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నాడు. ఈ అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరముందని పఠాన్ అభిప్రాయపడ్డాడు. ‘దక్షిణాది నుంచి వచ్చిన క్రికెటర్లలో కొందరు ఉత్తర భారతంలో వర్ణ వివక్షకు గురవుతుంటారు. అక్కడి ప్రజలు జాత్యహంకారులు కాదు కానీ ఏదో ఒకటి చేసి, ఎవరో ఒకర్ని వింత పేరుతో పిలవడం ద్వారా అందరిలో గుర్తింపు తెచ్చుకోవాలని అలా ప్రవర్తిస్తారు’ అని పఠాన్ అన్నాడు. మరోవైపు ఐపీఎల్ సందర్భంగా విండీస్ ప్లేయర్ డారెన్ స్యామీ వర్ణ వివక్ష వ్యాఖ్యలకు గురైన అంశం తనకు తెలియదని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. ‘2014లో స్యామీతో పాటు నేనూ సన్‌రైజర్స్‌కు ఆడాను. అప్పట్లో ఈ అంశంపై ఎలాంటి చర్చ జరుగలేదు. ఇది నిజంగా జరిగి ఉంటే కచ్చితంగా చర్చనీయాంశమయ్యేది. కాబట్టి నాకు దీనిపై అవగాహన లేదు’ అని ఇర్ఫాన్ వివరించాడు. అప్పట్లో రైజర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన పార్థివ్ పటేల్, వేణుగోపాలరావు కూడా స్యామీపై చేసిన వర్ణ వివక్ష వ్యాఖ్యలు తమ దృష్టికి రాలేదని పేర్కొన్నారు. -
ఆగని ఆందోళనలు
వాషింగ్టన్/ఫిలడెల్ఫియా: ఆఫ్రికన్–అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మరణంపై వెల్లువెత్తిన ఆగ్రహావేశాలు క్రమేపీ తగ్గి ప్రజలు శాంతియుత నిరసనల బాట పడుతున్నారు. వ్యవస్థలో మార్పు రావాలని కోరుకుంటున్నారు. మినియాపొలిస్‌లో పోలీసుల దమనకాండకు ఫ్లాయిడ్ బలి కావడంపై అమెరికాలో వారం రోజులుగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. శనివారం రాజధాని వాషింగ్టన్లో జరిగిన ర్యాలీలో మునుపెన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. కాంగ్రెస్ భవనం క్యాపిటోల్, ఆ చుట్టుపక్కల ప్రాంతంలో పెద్ద సంఖ్యలో చేరుకుని నినాదాలు చేశారు. అధికారులు ముందు జాగ్రత్తగా అధ్యక్ష భవనం చుట్టూ కొత్తగా ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతోపాటు అదనపు భద్రతా చర్యలు తీసుకున్నారు. సియాటెల్‌లో నిరసనకారులు రాళ్లు, సీసాలు విసరడంతో పోలీసులకు గాయాలయ్యాయి. సినిమా రంగానికి ప్రసిద్ధి చెందిన హాలీవుడ్, బార్లు, రెస్టారెంట్లకు పేరుగాంచిన నాష్విల్లే, శాన్ఫ్రాన్సిస్కోలోని గోల్డెన్ గేట్ బ్రిడ్జి, న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ బ్రిడ్జి వంటి ప్రముఖ ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. జార్జి ఫ్లాయిడ్ పుట్టిన ఊరుకు దగ్గరలోని రెఫోర్డ్ బాప్టిస్ట్ చర్చిలో ప్రైవేట్ మెమోరియల్ సర్వీస్ జరిగింది. యూకేలోని లండన్, ఫ్రాన్సులోని మార్సెయిల్స్‌లో జరిగిన ర్యాలీల్లో కొట్లాటలు చోటుచేసుకున్నాయి. -
'నన్ను చాలా దారుణంగా అవమానించారు'
జమైకా : వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామి వర్ణ వివక్షతపై తన ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సన్‌రైజర్స్‌కు ఆడినప్పుడు తనపై జాత్యంహకార వ్యాఖ్యలు చేశారని మండిపడ్డాడు. అమెరికాలో జాత్యహంకార దాడిలో ప్రాణాలు కోల్పోయిన జార్జి ప్లాయిడ్‌కు మద్దతుగా అక్కడి స్థానికులతో కలిసి నిరసన వ్యక్తం చేసిన సామి ఇలాంటివి జరగడం దారుణమని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా తాను కూడా వర్ణ వివక్ష వ్యాఖ్యలు ఎదుర్కొన్నట్లు ఇన్స్టాగ్రామ్ ద్వారా సామి పేర్కొన్నాడు.('ఆరోజు రితికా అందుకే ఏడ్చింది') 'నేను ఐపీఎల్లో సన్‌రైజర్స్ జట్టుకు ఆడేటప్పుడు నాతో పాటు శ్రీలంక ఆటగాడు తిసార పెరీరాను 'కలు' అనే పదంతో పిలిచేవారు.అప్పట్లో కలు అంటే బలమైన నల్ల మనిషి అని అనుకున్నా. ఆ సమయంలో వారు నన్ను పొగుడుతున్నారని భావించాను. కానీ ఇప్పుడు ఆ పదానికి అసలైన అర్థం ఏంటో తెలుసుకున్నా. తనతో పాటు పెరీరాపై జట్టులోని ఆటగాళ్లు జాత్యహంకార పదం ఉపయోగించారు. వారు నన్ను చాలా దారుణంగా అవమానించారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి వారిపై చాలా కోపంగా ఉంది.' అంటూ చెప్పుకొచ్చాడు. (షికారుకని వచ్చి షార్క్‌కు చిక్కాడు) అంతకుముందు ట్విటర్ వేదికగా అమెరికాలో జాత్యహంకారానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలంటూ ఐసిసి, ఇతర క్రికెట్ బోర్డులకు సామి విజ్ఞప్తి చేశాడు. 'ఐసిసితో పాటు ఇతర బోర్డులకు ఒక విజ్ఞప్తి.. నాలాంటి నల్లజాతి వారికి ఏమి జరుగుతుందో మీరు చూడడం లేదా? ఈరోజు అమెరికాలో జరిగిన సంఘటన ప్రపంచంలో ఎక్కడైనా జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు నిశబ్ధంగా ఉండాల్సిన సమయం మాత్రం కాదు. సామాజిక అన్యాయంపై స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది' అంటూ పేర్కొన్నాడు. కాగా విండీస్ స్టార్ ఓపెనర్ క్రిస్ గేల్ కూడా ఫ్లాయిడ్ మరణానికి సంతాపం తెలిపాడు .తాను కూడా జాత్యహంకారానికి గురయ్యాడని ఒక ప్రకటనలో తెలిపాడు. క్రికెట్లో జాత్యహంకారం లేదనేది ఒక అపోహ మాత్రమే అని గేల్ చెప్పుకొచ్చాడు. -
జాతి వివక్ష అంతమే లక్ష్యం
వాషింగ్టన్/బెర్లిన్: ఆఫ్రికన్ అమెరికన్ జార్జి ఫ్లాయిడ్ పోలీసుల దౌర్జన్యానికి బలి కావడంతో ఆగ్రహంతో ప్రారంభమైన ప్రదర్శనలు ఇప్పుడు జాతి వివక్ష అంతమే లక్ష్యంగా కొనసాగుతున్నాయి. అమెరికాలో ఫ్లాయిడ్ పుట్టిన ప్రాంతం నార్త్ కరొలినాలో కుటుంబ సభ్యులు రెండో సంస్మరణ సభ నిర్వహించారు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ 1963లో చేసిన పేరుపొందిన ప్రసంగం ‘ఐ హేవ్ ఏ డ్రీం’ను పురస్కరించుకుని వాషింగ్టన్లో వచ్చే ఆగస్టులో స్మారక ర్యాలీ నిర్వహించనున్నట్లు రెవరెండ్ అల్ షార్ప్టన్ చెప్పారు. ‘అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో మొత్తం న్యాయ వ్యవస్థ మారాలంటూ ప్రజా ఉద్యమానికి ఊపిరి పోస్తాం. అలా చేయకుంటే మరో ఏడాది గడిచిపోతుంది. ఆ తర్వాత మిమ్మల్ని ఎవరూ గుర్తుపెట్టుకోరు. ఎవరూ పట్టించుకోరు’అని ఓ ఇంటర్వ్యూలో నల్ల జాతీయులనుద్దేశించి పేర్కొన్నారు. అమెరికా నుంచి ఆస్ట్రేలియా దాకా.. ఆస్ట్రేలియా, యూరప్, ఆసియా దేశాల్లో నిరసనలు మిన్నంటుతున్నాయి. జాతి వివక్షను ఇక సహించబోమంటూ నిరసనకారులు గొంతెత్తి నినదిస్తున్నారు. ఆస్ట్రేలియాలో కస్టడీ మరణాలకు వ్యతిరేకంగా సిడ్నీలో భారీ ప్రదర్శనలు జరిగాయి. ‘కరోనా వైరస్‌తో మరణించకపోతే, పోలీసులు క్రూరత్వానికి మేము బలైపోతాం’అన్న నినాదాలు హోరెత్తిపోయాయి. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో వరసగా రెండో రోజు కూడా ఫ్లాయిడ్ మృతికి వ్యతిరేకంగా నిరసనకారులు ప్రదర్శనలు నిర్వహించారు. నల్ల మాస్కులు, టీ షర్టులు ధరించిన వారంతా బ్లాక్స్‌కి కొరియన్స్ మద్దతు ఉంటుందని అంటూ నినదించారు. జపాన్ రాజధాని టోక్యోలో వందలాది మంది శాంతియుత నిరసనలు చేశారు. మేమూ మారాలి: ఇండో అమెరికన్ అడ్వొకసీ గ్రూప్ జార్జ్ ఫ్లాయిడ్, ఇతర ఆఫ్రికన్ అమెరికన్ల మరణాలతో అగ్రరాజ్యంలో నల్లజాతీయులపై కొనసాగుతున్న వివక్ష ఎంత భయానకంగా ఉంటుందో ప్రపంచ దేశాలకు తెలిసి వచ్చిందని ఇండియన్ అమెరికన్ న్యాయవాదుల గ్రూప్ తెలిపింది. ఇలాంటి సమయంలోనూ భారత్, ఇతర దక్షిణాసియా దేశాల నుంచి వచ్చిన వారిలో చాలా మంది మౌనంగా ఉండడమే మంచిదన్న అభిప్రాయంలో ఉంటారని, ఈ ధోరణి మారాలని ఇండియన్ అమెరికన్ ఇంపాక్ట్ ఫండ్ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఇండియన్ అమెరిన్లను రాజకీయాల్లోకి చేర్చేందుకు సహకరించే ఈ సంస్థ మైనార్టీల దారుణ మరణాలపై తీవ్రంగా స్పందించింది. ‘కచ్చితంగా చెప్పాలంటే మేమేమీ నిరపరాధులం కాదు’అని ఆ ప్రకటనలో పేర్కొంది. ‘నల్లజాతీయులు, ఇతర పౌర హక్కులు అమెరికా ఇమిగ్రేషన్ కోసం నిరంతర పోరాటం చేయడం వల్ల మేము ఇప్పడు ఈ దేశంలో ఉన్నాం. వారు చేసిన కృషి ఫలితాలను అనుభవిస్తున్నాం. అయినప్పటికీ జాతి వివక్షకి సంబంధించిన దారుణాలు వెలుగులోకి వచ్చినప్పుడు భారతీయులు మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. అది మారాలి’అని ఆ ప్రకటన వివరించింది. బెర్లిన్‌లో నిరసన ప్రదర్శనలో పాల్గొన్న యువతి -
‘నా కూతురికి సమాధానం చెప్పగలగాలి’
వాషింగ్టన్: సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్ రెడిట్ కో ఫౌండర్, టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ భర్త అలెక్సిస్ ఒహానియాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవి నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. ఆ స్థానంలో ఓ నల్ల జాతీయుడిని నియమించాలని కోరారు. ఆన్లైన్ పోస్ట్‌లో తన రాజీనామా గురించి తెలిపారు ఒహానియాన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నువ్వు ఏం చేస్తున్నావు అని దీని గురించి భవిష్యత్తులో నా కుమార్తె ప్రశ్నించినప్పుడు.. నేను సమాధానం చెప్పగలగాలి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని తెలిపారు. ఒహానియాన్, సెరెనా విలియమ్స్ మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె ఉంది. (హ్యాండ్సప్.. డోంట్ షూట్!) జాతి విద్వేషాలను అరికట్టడమే కాక నల్లజాతి సమాజానికి సేవ చేయడానికి సంస్థలో తన వాటాపై భవిష్యత్తులో వచ్చే లాభాలను ఉపయోగించుకుంటానని అలెక్సిస్ ఒహానియాన్ తెలిపారు. జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడిని అమెరికా పోలీసులు చిత్రహింసలు పెట్టి చంపిన సంగతి తెలిసిందే. ఈ హత్యోదంతంపై అమెరికాలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఒహానియాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాక మాజీ ఎన్ఎఫ్ఎల్ స్టార్ కోలిన్ కైపెర్నిక్ యొక్క ‘నో యువర్ రైట్స్’ క్యాంప్‌కు మిలియన్ డాలర్లు ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. -
‘ఇక్కడ జరిగే అన్యాయాలు కనబడవా?’
నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్‌పై అమెరికా పోలీసుల దమనకాండకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సినీ సెలబ్రిటీలు వర్ణ వివక్షను వీడాలంటూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే తారాలోకం అమెరికా నల్లజాతీయులకు అండగా నిలువడంపై ప్రశంసలు కురుస్తున్నా.. మరోవైపు దేశంలో జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించకుండా ద్వంద ప్రమాణాలు పాటిస్తున్నారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇక బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్ కూడా హిందీ సినీ తారల ద్వంద ప్రమాణాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘మనకు వలస కార్మికుల జీవితాలు కూడా ముఖ్యమే. మైనారిటీల జీవితాలు కూడా అత్యంత ప్రధానం. పేదల జీవితాల గురించి కూడా మనకు పట్టింపు ఉండాలి. ఇప్పుడు మేల్కొన్న భారతీయ సినీ సెలబ్రిటీలు అమెరికాలో జరుగుతున్న జాత్యహంకారానికి వ్యతిరేకంగా మద్దతు తెలుపుతున్నారు. కానీ వారికి వారి సొంత పెరట్లో జరిగే అన్యాయాలు కనబడవు’ అంటూ అభయ్ చురకలు అంటించారు. నెటిజనులు అభయ్కు మద్దతు తెలుపుతున్నారు. (‘అల్లర్ల వెనుక అతివాద గ్రూపులు’) View this post on Instagram Maybe it’s time for these now? Now that “woke” indian celebrities and the middle class stand in solidarity with fighting systemic racism in America, perhaps they’d see how it manifests in their own backyard? America has exported violence to the world, they have made it a more dangerous place, it was but inevitable that it would come back karmically. I’m not saying they deserve it, I’m saying look at the picture in it’s totality. I’m saying support them by calling out the systemic problems in your own country, because they turn out to be one and the same thing. I’m saying follow their lead but not their actions. Create your own actions, your own movement, relevant to your own country. That is what the black lives matter movement is all about! In the larger picture, there is no “us” and “them”. There is not a country that’s real. But a planet in peril. #migrantlivesmatter #minoritylivesmatter #poorlivesmatter Black Lives Matter (find out why not to use the hashtag and still support the movement). A post shared by Abhay Deol (@abhaydeol) on Jun 2, 2020 at 8:24pm PDT ఇదే కాక ప్రస్తుతం అభయ్ తన సోషల్ మీడియా ఖాతాలు ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఫెయిర్‌నెస్ క్రీం ఉత్పత్తులకు వ్యతిరేకంగా ఓ క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ‘భారతీయ సెలబ్రిటీలు ఇప్పటికైనా ఫెయిర్‌నెస్ క్రీముల ప్రకటనల్లో నటించడం మానేస్తారా’ అంటూ ఓ ప్రశ్నను లేవనెత్తారు. అంతేకాక గత కొన్నేళ్లుగా భారతదేశంలో ఫెయిర్‌నెస్ ఉత్పత్తుల మార్కెట్ ఎలా ఉందో ఉదాహరణలతో సహా పోస్ట్ చేశారు. ఫెయిర్‌నెస్ క్రీమ్‌లకు అంబాసిడర్లుగా నటించిన పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలను అభయ్ విమర్శించారు. ఈ జాబితాలో షారూఖ్ ఖాన్, దీపికా పదుకొనే, సోనమ్ కపూర్ వంటివారు ఉన్నారు. View this post on Instagram Overall analysis Fairness creams in India have evolved over the years, from being fairness creams to now using euphemisms like “skin brightening/ whitening”, or “lightening creams”. Most brands no longer want to be associated directly with being termed as 'fairness creams’. So now we have brands selling “HD glow”, “White beauty”, “white glow”, “fine fairness”, and so on. Over the years these companies have turned their attention towards the Indian Men, who are now trying to be "fair and handsome", and have dedicated power white ranges for them too. The hunt for fairness: Neutrogena fine fairness: Could not locate it on their global websites but it is available on Amazon and other sellers:https://www.amazon.in/Neutrogena-Fine-Fairness-Cream-SPF20/dp/B00BSPOXMW/ Ponds have a white beauty range: The range includes products like anti-spot fairness cream which is available on affiliate websites like Amazon and Nykaa. On their own website could locate just the White beauty cream. https://www.ponds.com/ph/products/collection/white-beauty/day-cream-for-normal-skin.html* Loreal white perfect day cream: Apparently reduces the melanin level in the skin, gives a rosy appearance to your skin and is suitable for all Indian skin types. "reduce skin darkening and boost anti-spot whitening for a brighter & younger look"https://www.lorealparis.co.in/products/skin-care/day-cream/white-perfect-clinical-day-cream/ Recently, Procter & Gamble skincare brand Olay announced that it will no longer retouch skin in its advertising by 2021 because it reflects an idea of beauty which is almost impossible to achieve. The statement was made during an event in New York. In March 2019, Olay also came up with a creative campaign #FaceAnything with @masabagupta @kubbrasait , @lilly, @bikewithgirl and @_payalsoni_ #Fairandlovely #prejudice #racism #fairskinobsession #fairnesscreams #kalagora #flawlessskin #hdglow #whiteness #complexion #skintone #shades #pearlextracts #microcrystals #ayurveda A post shared by Abhay Deol (@abhaydeol) on Jun 5, 2020 at 4:39am PDT -
నా చర్మం రంగు విలువ ఎంత?
నిన్నటికంటే ఇవ్వాళ పరిస్థితులు మెరుగవుతాయా? కచ్చితంగా అవుతాయి. కానీ ఈ వాస్తవానికి కొలమానం కాస్త అహేతుకంగానే ఉంటుంది. దశాబ్దాల క్రితం నల్లజాతీయులను పోలీసులు బాదటం, లేదా చంపడం అనేవి స్థానిక వార్తలుగానే వచ్చేవి. కాని ఇప్పుడు అలాంటి వార్తలు జాతీయ ప్రాధాన్యత పొందుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ అవుతున్నాయి. దేశంలో ఏ ప్రాంతంలో అవి జరుగుతున్నాయి అనే అంశంతో పనిలేకుండా ప్రాచుర్యం పొందుతున్నాయి. ప్రభుత్వ పోలీసు విభాగాలను మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎలా మార్చాలి? అన్నదే కీలకం. మారణాయుధాలను ఎందుకు ఉపయోగించకూడదు అనే అంశంపై సుదీర్ఘ సాంస్కృతిక శిక్షణ అవసరం. ఇతరుల ఊపిరి తీయడాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదని పోలీసులకు నేర్పాలి. చర్మం రంగు బట్టి మనుషులతో వ్యవహరించకూడదన్న గ్రహింపు బలగాలకు ఉండాలి. ఒక్కటి మాత్రం నిజం. ఆధునిక కాలంలో సురక్షిత సమాజం కోసం మనం కొన్ని స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కోల్పోవాల్సి ఉంటుంది. అందువల్ల పోలీసు తనిఖీలు తప్పనిసరి కావచ్చు. కానీ, ఆ క్రమంలో రాత్రింబవళ్లు రహదారులపై తనిఖీ చేసే అమెరికా పోలీసులు భౌతిక శాస్త్రజ్ఞుల పట్ల ద్వేషభావంతో ఉంటున్నారా అని మేం ఆలోచిస్తుంటాం. అమెరికాలో అత్యున్నత విద్యావంతులైన పీహెచ్‌డీలు చేసిన సైంటిస్టులు తమ జీవితాల్లో ఇంతగా పోలీసుల తనిఖీలకు ఎలా లోనవుతుంటారనేది పెద్ద ప్రశ్న. పోలీసులు మాపట్ల కొన్ని ముద్రలతో వ్యవహరిస్తున్నారేమో.. బహుశా అది మా చర్మపు రంగు కావచ్చేమో.. నల్లవారు కారు డ్రైవ్ చేయడం, నల్లవారు నడవటం, నల్లవారు నల్లవారుగా మాత్రమే ఉండటం ఉల్లం ఘనల కిందికి వస్తాయా అనేది మాలో ఏ ఒక్కరికీ తెలీని విషయమే. అయితే పోలీసులు మమ్మల్ని ఆపిన సందర్భాల్లో మాలో ఓ ఒక్కరినీ వారు విచక్షణారహితంగా చితకబాదలేదు. మాలో ఏ ఒక్కరినీ వారు కాల్చలేదు. కానీ పోలీసులు ఎదురైనప్పుడు నల్లవారు ప్రాణాలు కోల్పోవడం ఎందుకు జరుగుతోంది అన్నదే ప్రశ్న. ప్రతి సంవత్సరం అమెరికాలో పోలీసులు 100 కంటే ఎక్కువమంది నిరాయుధులైన నల్ల వారిని కాల్చి చంపుతున్నారు. ఈ వ్యాసం నేను టైప్ చేస్తున్న సమయానికి మన్హట్టన్లో నా ఇంటి కిటికీ గుండా చూస్తే 10 వేలకుపైగా నిరసనకారులు నినాదాలు చేస్తూ సాగడం కనిపించింది. జార్జి ఫ్లాయిడ్ హత్యా ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా లూటీలు, ఇతర హింసాత్మక చర్చలు ప్రబలిపోవడంతో రాత్రిపూట కర్ఫ్యూను రాత్రి 11 గంట లనుంచి 8 గంటలకు ముందుకు జరిపారు. నిరసనకారులు పట్టుకున్న ప్లకార్డుల్లో ‘నల్లవారి ప్రాణాలు కూడా ముఖ్యమైనవే’ అనేదే ఎక్కువగా కనబడుతూ వచ్చింది. పోలీసు అధికారి వెనక్కి చేతులు మడిచి, బేడీలు వేసి మెడపై కాలు వేసి తొక్కిన ఘటనలో తనకు ఊపిరాడటంలేదు అని ఆర్తనాదం చేస్తూనే చనిపోయిన జార్జి ఫ్లాయిడ్ పేరు ఉన్న ప్లకార్డును చాలామంది పట్టుకున్నారు. కాగా పోలీసు అధికారుల కస్టడీలో ఉంటున్న నల్లవారి గతి పట్ల బాధ, ఆందోళనను ప్రదర్శిస్తూ జాతీయ ఫుట్‌బాల్ స్టార్ కోలిన్ కపెర్నిక్ ఫుట్ బాల్ గేమ్ ప్రారంభానికి ముందు మోకాలు వంచి చూపిన భంగిమ విపరీతంగా ప్రజలను కదిలించింది. ఆ సమయంలో అతడు అమెరికా జాతీయగీతం పట్ల నిరసన వ్యక్తం చేశాడని ఒక మీడియా వార్త ప్రచురించడంతో ఆగ్రహావేశాలు చెలరేగాయి. దీంతో 2017లో ఫుట్ బాల్ సీజన్ పొడవునా అతడిని ఏ ఫుట్ బాల్ టీమ్ కూడా జట్టులో చేర్చుకోకుండా అతడి బతుకుపై వేటు వేశాయి. రెండేళ్ల తర్వాత చూస్తే శాంతియుతంగా మోకాలు మడిచి కోలిన్ ప్రదర్శించిన భంగిమను దాటి, నిజంగానే పోలీసు అధికారి మోకాలికింద నలిగి నల్లజాతీయుడు మరణించడం వరకు ముందుకొచ్చేశాం. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై టియర్ గ్యాస్, పెప్పర్ గ్యాస్ ప్రయోగించడం, వీధుల్లోనే చితకబాదటం వంటి దృశ్యాలు చూస్తున్నప్పుడు వీరు ఏదో చట్టవిరుద్ధమైన, అమెరికనేతర చర్యలకు పాల్పడుతున్నట్లు మీరు భావించవచ్చు. కానీ అమెరికన్ రాజ్యాంగంలో ‘.. పత్రికా స్వేచ్ఛను అణిచిపెట్టే ఏ చట్టాన్నీ కాంగ్రెస్ రూపొందించదు. అలాగే శాంతియుతంగా ప్రజలు గుమికూడే హక్కును కూడా రాజ్యాంగం అణిచిఉంచదు. అలాగే సమస్యల పరి ష్కారం కోరుతూ ప్రభుత్వానికి పిటిషన్ పెట్టుకునే హక్కును కూడా రాజ్యాంగం తోసిపుచ్చదు‘ అని రాసుకున్నాం. ఈ సవరణ అమెరికా రాజ్యాంగానికి చేసిన తొలి సవరణ. అంటే అమెరికన్ జాతి నిర్మాతలు సమస్యల పరిష్కారం కోసం నిరసన తెలుపడం అనేది అమెరికన్ లక్షణాల్లో అత్యంత కీలకమైనది అని భావించి దానికి సాధికారత కల్పిం చారు. మీరు పోలీసు అయితే కాస్సేపు ఆగి శాంతియుత ప్రదర్శనలకు చోటు కల్పించిన దేశ రాజ్యాంగం ఎంత గొప్పదో ఆలోచిస్తే మంచిది. పోలీసు అధికారుల నుంచి మనం వాస్తవానికి ఆశిస్తున్నది ఏమిటి? శాంతిని కాపాడి దుర్మార్గులను బంధించడమే అని నా భావన. అయితే అవసరమైనప్పుడు వారు మారణాయుధాలను ఉపయోగించవలసి రావచ్చు. కానీ ఆ ఆయుధాలను ఎప్పుడు, ఎలా ఉపయోగించాలి, ఉపయోగించకూడదు అనే విషయంలో తగిన శిక్షణ వారికి అవసరం. మిన్నియాపోలిస్కు చెందిన పోలీస్ అకాడమీ కఠిన శిక్షణ నాలుగు నెలలపాటు ఇస్తారు. అంతకుమించిన కఠిన శిక్షణను న్యూయార్క్ పోలీస్ అకాడెమీ 6 నెలలపాటు ఇస్తుంది. కానీ ఒక మంచి పాకశాస్త్ర నిపుణుడు తన వృత్తికి సంబంధించిన ధ్రువపత్రం పొందాలంటే కనీసం 8 నెలలు శిక్షణలో ఉండాలి. వృత్తిలో ఖచ్ఛితత్వం రావాలంటే అంత సమయం అవసరం మరి. పోలీసు నియామకాల్లో కూడా అధికారులు తయారు కావాలంటే మరింత అదనపు సమయం శిక్షణ అవసరం ఎంతైనా ఉంది. 1991లో రాడ్నీ కింగ్ అనే పాతికేళ్ల యువకుడిని నలుగురు పోలీసు అధికారులు నేలకేసి తొక్కుతూ తమ లాఠీలతో చితకబాదుతున్న దృశ్యాన్ని వీడియో బయటపెట్టినప్పుడు యావత్ అమెరికన్లు షాక్‌కు గురయ్యారు. కానీ అ సమయంలో నేను పెద్దగా షాక్‌కి గురికాలేదు. ఎందుకంటే నా తల్లిదండ్రులు చిన్నప్పటినుంచి నాకు, నా తోబుట్టువులకు.. పోలీసులు మిమ్మల్ని కాల్చకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ప్రతి వారం, ప్రతినెలా పాఠాలు చెప్పేవారు. మిమ్మల్ని అటకాయించినప్పుడు పోలీసు అధికారి అన్ని వేళల్లోనూ మీ చేతులను చూస్తాడు. అలాంటప్పుడు మీరు అస్సలు కదలొద్దు. ముందస్తుగా వారికి చెప్పకుండా మీ ప్యాకెట్లలో చేతులు పెట్టవద్దు. మీరు కదిలినప్పుడు ఎందుకు కదులుతున్నారో ఆ అధికారికి ముందే చెప్పాలి అని పాఠం చెప్పేవారు. అప్పట్లో నేను మిడిల్ స్కూల్ విద్యార్థిని. ప్రపంచం గురించి తెలుసుకోవాలని ప్రయత్నించేవాడిని కానీ నా చర్మపు రంగు గురించి నేను ఏనాడు ఆలోచించలేదు. ప్రపంచం గురించి ఆలోచించేటప్పుడు మనిషి చర్మం రంగు గురించి తట్టేది కాదు. కానీ నా ముందు తలుపునుంచి నేను నిష్క్రమిస్తున్న ప్పుడు నేను అనుమానిత నేరస్తుడిని అవుతున్నాను. ఈ మధ్య అమెరికా సమాజంలో వైట్ కాలర్ క్రైమ్ అనే పదబంధం వాడుకలోకి వచ్చింది. ఒక అమాయకుడైన నల్లజాతీయుడు అమాయకత్వానికి సంబంధం లేని పని ఏదో చేయవచ్చని భావిస్తున్న తెల్లవారు వెంటనే భయంతో పోలీసులకు కాల్ చేయడాన్ని ఈ పదబంధం సూచిస్తుంది. నిన్నటికంటే ఇవ్వాళ పరిస్థితులు మెరుగవుతాయా. కచ్చితంగా అవుతాయి. కానీ ఈ వాస్తవానికి కొలమానం కాస్త అహేతుకంగానే ఉంటుంది. దశాబ్దాల క్రితం నల్లజాతీయులను పోలీసులు బాదటం, లేదా చంపడం అనేవి స్థానిక వార్తలుగానే వచ్చేవి. కానీ, ఇప్పుడు అలాంటి వార్తలు జాతీయ ప్రాధాన్యత పొందుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ అవుతున్నాయి. దేశంలో ఏ ప్రాంతంలో అవి జరుగుతున్నాయి అనే అంశంతో పనిలేకుండా ఇవి ప్రాచుర్యం పొందుతున్నాయి. మరి రాజ్యానికి సంబంధించిన ఈ సంస్థలను మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎలా మార్చాలి? పోలీసు విభాగాలను ప్రశ్నిస్తున్న డిమాండ్లు ఇవి. నా సూచనలు కొన్ని ఇక్కడ చెబుతాను. విధాన నిర్ణేతలు వీటిని పరిగణనలోకి తీసుకోవచ్చు. 1. మారణాయుధాలను ఎందుకు ఉపయోగించకూడదు అనే అంశంపై శిక్షణనిచ్చే సాంస్కృతిక చైతన్యాన్ని నెలలపాటు పోలీసు అకాడమీలకు కలిగిస్తూ పోవాలి. 2. పోలీసు అకాడమీ ఆమోదం, తిరస్కరణతో పనిలేకుండా పక్షపాతదృష్టిని ప్రదర్శించిన పోలీసు అధికారులందరినీ తనిఖీ చేయాలి. 3. మనం కూడా పక్షపాత దృష్టిని కలిగి ఉండవచ్చు కానీ మనలో చాలామంది ఇతరుల ఊపిరి తీయడాన్ని మన చేతుల్లోకి తీసుకోం. 4. నిరసన ప్రదర్శనల సమయంలో ఆస్తులను, ప్రాణాలను కాపాడాలి. మీరు హింసకు పాల్పడని నిరసనకారులపై దాడి చేశారంటే మీరు అమెరికన్ కానట్లే. పోలీసులు నిరసన కారులను కాకుండా లూటీదారులను మాత్రమే అరెస్టు చేస్తే ఇక కర్ఫ్యూలతో పనిలేదు. 5. పోలీసు అధికారులు అనైతికమైన, హింసాత్మకమైన ప్రవర్తనను ప్రదర్శించడాన్ని మీరు చూస్తే వెంటనే అడ్డుకోండి. దాన్ని ఎవరైనా వీడియోతీసి పంపితే మనకు మనమే పోలీసులం అనే ఆత్మవిశ్వాసం మనకు కలుగుతుంది. 6. మరో ముఖ్యమైన సూచన ఏదంటే విధినిర్వహణలో ఉండి మరణించిన వారికి జరిపేలా జార్జి ఫ్లాయిడ్‌కి కూడా పూర్తి అధికార లాంఛనాలతో మిన్నియా పోలిస్ విభాగం అంత్యక్రియలు ఎందుకు చేయకూడదు? తన దారుణ మృతి వంటి ఘటన మరెవరికీ జరగకూడదని ఎందుకు ప్రతిజ్ఞ చేయకూడదు? 7. చివరగా, నల్లజాతి పిల్లలు మీకు కనబడినప్పుడు వాళ్లు ఎలాంటివారు అని మీకు మీరే నిర్ధారణకు రాకుండా వారు ఎవరై ఉండవచ్చు అనే దృష్టితో ఆలోచించాలి. నీల్ డెగ్రాస్ టైసన్, వ్యాసకర్త ఖగోళ భౌతిక శాస్త్రజ్ఞుడు, ప్రిన్స్టన్ యూనివర్సిటీ -
జాతి వివక్ష : సుందర్ పిచాయ్ కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ/వాషింగ్టన్: భారత సంతతికి చెందిన టెక్ దిగ్గజం, ఆల్ఫాబెట్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ (47) మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. జాత్యహంకారంపై పోరాడటానికి ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ 37 మిలియన్ డాలర్లు ఇస్తుందని సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు. ఆఫ్రికన్-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు వ్యతిరేకంగా అమెరికాలో దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగిన నేపథ్యంలో పిచాయ్ ఈ ప్రకటన చేశారు. ఇప్పటికే ఈ ఘటనను ఖండించిన పిచాయ్ తాజాగా జాతి వివక్ష వ్యతిరేక పోరాటానికి అండగా నిలబడేందుకు ముందుకొచ్చారు. అంతేకాదు ప్రాణాలు కోల్పోయిన నల్ల జాతీయుల పట్ల గౌరవ సూచనగా 8 నిమిషాల 46 సెకన్ల పాటు మౌనం పాటించాలని గూగుల్ , ఆల్ఫాబెట్ ఉద్యోగులను కోరారు. ఈ మేరకు ఆయన ఉద్యోగులకు ఒక ఈ-మెయిల్ సందేశం పంపారు. (జార్జ్ హత్య : సత్య నాదెళ్ల స్పందన) అలాగే జాతి సమానత్వం కోసం పనిచేసే సంస్థలకు కంపెనీ 12 మిలియన్ డాలర్లు, జాతి వివక్ష సమాచారాన్ని అందించే సంస్థలకు యాడ్ గ్రాంట్లలో 25 మిలియన్ డాలర్లు నిధులను గూగుల్ ఇస్తుందని పిచాయ్ చెప్పారు. మొదటి గ్రాంటుగా ఒక మిలియన్ డాలర్లు చొప్పున సెంటర్ ఫర్ పోలీసింగ్ ఈక్విటీ, ఈక్వల్ జస్టిస్ ఇనిషియేటివ్ సంస్థలకు అందిస్తామని చెప్పారు. అలాగే తమ ప్రోగ్రామ్ ద్వారా వారికి కావాల్సిన సాంకేతిక సహాయాన్ని అందిస్తామని ప్రకటించారు. గత ఐదేళ్లలో 32 మిలియన్ల డాలర్లు ఇందుకు విరాళంగా ఇచ్చామని పిచాయ్ చెప్పారు. "నల్లజాతి సమాజం బాధపడుతోంది. మనలో చాలామంది మనం నమ్మేవాటి కోసం నిలబడటానికి మార్గాలు వెతుకుతున్నాం. అలా సంఘీభావం చూపే, ఇష్టపడే వ్యక్తులను మనం చేరుకోవాలి'' అని పిచాయ్ వ్యాఖ్యానించారు. కొంతమంది నల్లజాతి నాయకుల బృందంతో మాట్లాడానని, ఈ పోరాటంలో గూగుల్ తరపున ఎలా సహకరించగలం అనే దానిపై చర్చించామనీ, దీనిపై మరింత కృషి చేస్తున్నామని ఉద్యోగులకు అందించిన సమాచారంలో సుందర్ పిచాయ్ వెల్లడించారు. (మరోసారి పెద్ద మనసు చాటుకున్న సుందర్ పిచాయ్) చదవండి : జార్జ్‌ది నరహత్యే ! -
నాది కూడా అభినవ్ వర్ణ వివక్ష స్టోరీనే
బెంగళూరు: మళ్లీ జాతి వివక్ష అంశం తీవ్రమైంది. అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడిని శ్వేత జాతి పోలీస్ అధికారి విచక్షణారహితంగా చంపిన నేపథ్యంలో ఆ దేశంలో నిరసన జ్వాలలు మిన్నంటాయి. దీనిపై ఇప్పటికే పలువురు క్రీడా దిగ్గజాలు విరుచుకుపడుతుండగా, గతంలో ఎవరైతే ఇలా వర్ణ వివక్షకు గురయ్యారో వారు ముందుకొస్తున్నారు. ఈ కోవలో భారత మాజీ క్రికెటర్ దొడ్డా గణేశ్‌తో పాటు తమిళనాడుకు చెందిన టాపార్డర్ బ్యాట్స్‌మన్ అభివన్ ముకుంద్‌లు ఉన్నారు. దీనిపై ముందుగా అభినవ్ ముకుంద్ తన స్వరం వినిపించగా, అందుకు దొడ్డా గణేశ్ మద్దతుగా నిలిచాడు.(‘గుండెలపై చేయి వేసుకొని చెప్పగలరా?’) ‘నేను జాతి వివక్ష బారిన పడ్డా. కొంతమంది నన్ను టార్గెట్ చేసి తీవ్ర స్థాయిలో నాపై విమర్శలు చేశారు. నా వర్ణాన్ని కించపరుస్తూ అవహేళన చేశారు. వారిని నియంత్రణలో పెట్టడం అనేది మన చేతుల్లో ఉండదు. మనిషి రంగును బట్టి గుణం ఉండదు. అది అందానికి సంబంధించినది కాదు. ఎవరైతే ఇలా వివక్షకు గురయ్యారో వారంతా వారి వారి అనుభవాల్ని షేర్ చేసుకుంటే మంచిది’ అని తెలిపాడు. కాగా, ఆ సమయంలో ఎందుకు మాట్లాడలేదని ముకుంద్‌ను జర్నలిస్టు ప్రశ్నించగా, అది సరైన సమయం కాదనే తాను మాట్లాడలేదన్నాడు. 2017 శ్రీలంకతో వారి దేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్ మధ్యలో ఉండగా ఆ ఘటన జరిగింది. దాంతో నేనేమీ మాట్లాడలేదు’ అని ముకుంద్ పేర్కొన్నాడు. ఈ మేరకు తన ట్వీటర్ అకౌంట్ ఒక లేఖను సైతం అభినవ్ పోస్ట్ చేశాడు. తాను క్రికెటర్‌గా చాలా చోట్లకు తిరుగుతూ ఉండేవాడినని, ఈ క్రమంలోనే కొన్ని సందర్భాల్లో వర్ణ వివక్షకు గురైన విషయాన్ని తెలిపాడు. మనలోని స్వచ్ఛత అనేది రంగును బట్టి ఏమీ ఉండదనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ తెలుసుకుంటే మంచిదనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ విషయాన్ని చెబుతున్నానన్నాడు. ఇకనైనా ఇలా వివక్ష వ్యాఖ్యలు చేసేవారి మైండ్ సెట్ మారుతుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు. (రవిశాస్త్రి పోస్ట్‌కు రణ్వీర్ రిప్లై) నాది కూడా అభినవ్ స్టోరీనే అభివన్ ముకుంద్ పోస్ట్ చేసిన లేఖపై కర్ణాటకకు చెందిన భారత మాజీ పేసర్ దొడ్డా గణేశ్ స్పందించాడు. తాను కూడా అభినవ్ తరహాలోనే వర్ణ వివక్షకు గురైనట్లు తెలిపాడు. ‘అభినవ్ స్టోరీ నాకు ఎదురైన అనుభవాన్ని గుర్తు చేసింది. నేను భారత్‌కు ఆడుతున్న సమయంలో ఎక్కువగా వర్ణ వివక్షకు గురయ్యా. దానికి ఒక భారత లెజండరీ క్రికెటరే సాక్ష్యం. ఇలా విమర్శించడం నన్ను ధృఢంగా చేసింది అలాగే దేశానికి ఆడటాన్ని కూడా దూరం చేయలేదు. నిజాయితీగా చెప్పాలంటే 90వ దశకంలో వర్ణ వివక్ష సీరియస్‌నెస్ గురించి నాకు పెద్దగా తెలియదు. అప్పుడు మనం ఏమైనా చెప్పుకోవడానికి ఇప్పుడున్నట్లు సోషల్ మీడియా లేదు. భవిష్యత్తులో ఏ భారత క్రికెటర్ ఇలా వర్ణ వివక్షకు గురి కాడనే ఆశిస్తున్నా’ అని దొడ్డా గణేశ్ తెలిపాడు. భారత్ తరఫున నాలుగు టెస్టులు, ఒక వన్డే మ్యాచ్‌ను గణేశ్ ఆడాడు. ఇక రంజీ ట్రోఫీ విషయానికొస్తే కర్ణాటక తరఫున 100పైగా మ్యాచ్‌లు ఆడిన గణేశ్.. 365 వికెట్లు సాధించాడు. 2007లో తన అంతర్జాతీయ కెరీర్‌కు గణేశ్ వీడ్కోలు చెప్పాడు. This story of @mukundabhinav, reminded me of the racial jibes I went through in my playing days. Only an Indian legend was witness to it. It only made me strong & didn’t deter me from playing for Ind & ovr 100 mts for Karnataka @StarSportsKan ಕಪ್ಪಗಿರೋರು ಮನುಷ್ಯರೇ. ಮೊದಲು ಮಾನವರಾಗಿ. pic.twitter.com/ZV8c8YPmpM— ದೊಡ್ಡ ಗಣೇಶ್ | Dodda Ganesh (@doddaganesha) June 3, 2020 -
నాటి నుంచే నీగ్రోలపై దారుణాలు
సాక్షి, న్యూఢిల్లీ : ఆఫ్రికా మూలాలు కలిగిన అమెరికన్ నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్‌ను శ్వేత జాతీయుడైన పోలీసు అధికారి అన్యాయంగా చంపేయడంతో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగుతున్న విషయం తెల్సిందే. అమెరికాలో నల్ల జాతీయులను శ్వేత జాతీయులైన పోలీసు అధికారులు చంపేయడం, హింసించడం ఇప్పుడే కొత్త కాదు. అమెరికా చరిత్రలో కోకొల్లలుగా జరుగుతూ వస్తున్నాయి. అమెరికా పోలీసు చట్టం కూడా అందుకు కొంత దోహద పడుతోంది. (చదవండి: జార్జ్‌ది నరహత్యే !) 1700 శతాబ్దంలో మొదలైన ‘స్లేవ్ పెట్రోల్స్’ కాలం నాటి నుంచి నల్లజాతీయులకు వ్యతిరేకంగా అమెరికా పోలీసుల అరాచకాలు కొనసాగుతున్నాయి. నాడు బానిసత్వంలో మగ్గుతున్న నల్లజాతీయులపైనా శ్వేతజాతీయ పౌరులు, పోలీసు అధికారులు ‘స్లేవ్ పెట్రోల్స్’ పేరిట దారుణాలకు పాల్పడేవారు. బానిసత్వానికి వ్యతిరేకంగా 1739, 1741లో నల్లజాతీయులు చేసిన తిరుగుబాట్లను అమెరికా పోలీసులు దారుణంగా అణచివేశారు. అమెరికాలో అంతర్యుద్ధం (1861–65) ముగిశాక ‘స్లేవ్ పెట్రోల్స్’కు సంబంధించిన చట్టాలను అమెరికా రద్దు చేసింది. అయినప్పటికీ నల్ల జాతీయులకు వ్యతిరేకంగా జరుగుతున్న దాడులకు తెర పడలేదు. ‘1965లో వాట్స్ రైట్స్’ అందుకే జరిగాయి. మార్క్వెట్ ఫ్రై అనే నల్ల జాతీయుడు తన తల్లి, సోదరుడితో కలిసి కారులో వేగంగా వెళుతుండగా, శ్వేత జాతీయుడైన కాలిఫోర్నియా హైవే పెట్రోల్ ఆఫీసర్ ఆపి, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కింద అరెస్ట్ చేసి హింసించారు. 1991, మార్చి మూడవ తేదీన రోడ్నీ కింగ్ అనే నల్లజాతీయుడు కారులో వేగంగా వెళుతుండగా, శ్వేతజాతి పోలీసు అధికారులు ఆపి, కారులో నుంచి గుంజీ రోడ్నీ కింగ్‌ను చితక్కొట్టారు. ఆ కేసులో అరెస్టయిన నలుగురు పోలీసు అధికారులు 1992, ఏప్రిల్ నెలలో నిర్దోషులుగా విడుదలయ్యారు. అందుకు వ్యతిరేకంగా నిరసనలు, అల్లర్లు కొనసాగాయి. 2014, ఆగస్ట్‌లో 18 ఏళ్ల మైకేల్ బ్రౌన్ అనే నల్లజాతీయ యువకుడిని పోలీసు అధికారి అన్యాయంగా కాల్చి వేయడంతో దానికి వ్యతిరేకంగా ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమం పుట్టుకొచ్చింది. అయినప్పటికీ సదరు పోలీసు అధికారికి శిక్ష పడలేదు. ఆ తర్వాత ఇప్పుడు జార్జ్ ఫ్లాయిడ్ అన్యాయంగా బలయ్యారు. అమెరికా పోలీసు చట్టం శ్వేత జాతీయులైన పోలీసులను అనుకూలంగా ఉండడమేనని విమర్శకులు చెబుతున్నారు. పోలీసు వ్యవస్థలో కూడా నల్లజాతీయుల పట్ల ఎంతో వివక్షత ఉందని వారంటున్నారు. (చదవండి: జార్జ్ హత్య : సత్య నాదెళ్ల స్పందన) -
‘గుండెలపై చేయి వేసుకొని చెప్పగలరా?’
న్యూఢిల్లీ: జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతియుడిని శ్వేత జాతి పోలీసు అధికారి కాలితో తొక్కి చంపిన నేపథ్యంలో అమెరికాలో తీవ్ర ఆగ్రహజ్వాలలు ఎగిసిపడుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఆందోళనలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌వద్ద భారీ స్థాయిలో నిరసనలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇక తాజాగా జాత్యహంకారంపై క్రీడా లోకం కూడా మండిపడుతోంది. ఇప్పటికే ఫార్ములావన్ రేసర్లు, క్రికెట్, గోల్ఫ్ ఆటగాళ్లు వర్ణ వివక్ష హత్యపై మండిపడ్డారు. తాజాగా ఫ్లాయిడ్ మరణంపై అమెరికన్ ఫుట్ బాలర్ డీఅండ్రీ ఎడ్లిన్ స్పందించాడు. (క్రికెట్ ప్రపంచం గళం విప్పాల్సిందే) ‘జార్జ్ ఫ్లాయిడ్ మరణం అనంతరం మా తాత ఒక సందేశం పంపారు. అమెరికాలో నివసించనందుకు చాలా సంతోషంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే నాకు ఏమైనా అవుతుందో అనే భయం ఆయనలో నెలకొంది. ఎందుకంటే నేను కూడా నల్లజాతీయుడినే కదా. చిన్నప్పుడు స్కూళ్లో చేసిన ప్రతిజ్ఞ గుర్తుతెచ్చుకుంటే.. అందరికీ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, న్యాయం అంటూ చివర్లో చదువుతాం. ఇప్పుడు అమెరికన్లు అందరూ గుండెలపై చేతులు వేసుకొని ఇక్కడ అందరికీ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, న్యాయం ఉందా అని చెప్పగలారా?’ అంటూ ఓ భావోద్వేగ సందేశాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. (జార్జ్ హత్య : సత్య నాదెళ్ల స్పందన) -
క్రికెట్ ప్రపంచం గళం విప్పాల్సిందే
కింగ్స్టన్: జాత్యహంకారంపై క్రీడా లోకం మండిపడుతోంది. సోమవారం ఫార్ములావన్ రేసర్లు గళం విప్పగా... మంగళవారం క్రికెట్, గోల్ఫ్, బాక్సింగ్, ఫుట్‌బాల్ వర్గాలు శ్రుతి కలిపాయి. వెస్టిండీస్ క్రికెట్ మాజీ కెప్టెన్ డారెన్ స్యామీ వర్ణ వివక్ష హత్యపై ఘాటుగా స్పందించాడు. గతవారం అమెరికాలో ఓ శ్వేతజాతి పోలీస్ అధికారి కర్కశంగా ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ ఊపిరి తీశాడు. దీన్ని ఫార్ములావన్ చాంపియన్ హామిల్టన్ ఖండించాడు. తాజాగా స్యామీ మాట్లాడుతూ ‘అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)తో పాటు సభ్యదేశాలన్నీ ఈ దారుణ దురాగతాన్ని ఖండించాలి. లేదంటే ఈ జాత్యహంకారంలో వీళ్లంతా భాగస్వాములేనని భావించాల్సి వస్తుంది’ అని తీవ్ర స్థాయిలో ట్వీట్ చేశాడు. ఇది కేవలం అమెరికాకే పరిమి తం కాలేదని, జాతి వివక్ష అనేది ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సామాజిక పిశాచి అని పేర్కొన్నాడు. తను కూడా ఈ వివక్షకు గురైనట్లు డాషింగ్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ చెప్పాడు. శ్రీలంక మాజీ కెప్టెన్ సంగక్కర మాట్లాడుతూ పక్షపాతానికి, జాత్యహంకారానికి చోటు లేని సంస్కృతి కోసం మనమంతా కృషి చేయాలన్నాడు. నిజమైన స్వేచ్ఛ, సమానత్వం ఉన్న ప్రపంచాన్ని నిర్మించాలని, అమెరికాలో ప్రస్తు తం ఎగిసిపడుతున్న నిరసన జ్వాలలు మనందరికీ ఓ గుణపాఠం లాంటిదని అన్నాడు. దిగ్గజ గోల్ఫర్ టైగర్ వుడ్స్ మౌనం వీడి మాట కలిపాడు. ‘నేను ఎల్లప్పుడూ చట్టాన్ని గౌరవిస్తాను. శాంతిభద్రతల కోసం సుశిక్షితులైన అధికార్లు ఇలా తమ పరిధిని నిర్దయగా అతిక్రమించడం నన్ను తీవ్రంగా బాధిస్తోంది. ఫ్లాయిడ్ హత్య నన్ను కలచివేసింది. అతని కుటుంబసభ్యుల మీదే నా ధ్యాస, సానుభూతి వెళుతోంది’ అని ట్వీట్ చేశాడు. బాక్సింగ్ లెజెండ్, అజేయ చాంపియన్ ఫ్లాయిడ్ మేవె దర్... జాత్యహంకారానికి బలైన జార్జ్ అంతి మ సంస్కారాల్లో పాల్గొంటానని, ఖర్చులు భరిస్తానని చెప్పాడు. దీనికి జార్జ్ కుటుంబసభ్యులు అంగీకరించారు. ఈ నెల 9న అతని అంత్యక్రియలు జరుగుతాయి. అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) నిరసన గళమెత్తే ఆటగాళ్లను నిరోధించరాదని, మ్యాచ్‌లకు అనుమతించాలని కోరింది. ప్రజల్లో బలమైన ఈ సెంటిమెంటును అణచివేయరాదని కోరింది. జర్మనీలో ఈ వారాంతంలో మ్యాచ్‌లు జరగను న్నాయి. కొందరు ఆటగాళ్లు జార్జ్‌కు న్యాయం చేయాలని నల్ల రిబ్బన్లతో బరిలోకి దిగనున్న నేపథ్యంలో ‘ఫిఫా’ ఇలా స్పందించింది. -
జార్జ్ హత్య : సత్య నాదెళ్ల స్పందన
వాషింగ్టన్ : ఆఫ్రికన్-అమెరికన్ పౌరుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యపై టెక్ దిగ్గజాలు, గూగుల్, మైక్రోసాఫ్ట్ తమ విచారాన్ని, సంతాపాన్ని వ్యక్తం చేశాయి. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల జాతి వివక్షను, జాత్యంహకారాన్ని ఖండించారు. నల్లజాతి సమాజానికి తమ సంఘీభావం తెలిపిన సత్య నాదెళ్ల సమాజంలో ద్వేషానికి, జాత్యహంకారానికి చోటు లేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికే దీనిపై సానుభూతి, పరస్పర అవగాహన మొదలైనప్పటికీ, ఇంకా చేయాల్సిన అవసరం వుందని ఆయన అన్నారు. (జార్జ్‌ది నరహత్యే !) ఇప్పటికే జార్జ్ ప్లాయిడ్ మృతిపట్ల సెర్చ్ ఇంజీన్ దిగ్గజం గూగుల్ సానుభూతిని ప్రకటించింది. ఈ సంఘటన పట్ల భాధ, కోపం, విచారం, భయంతో ఉన్న వారెవ్వరూ ఏకాకులు కాదు.. జాతి సమానత్వానికి మద్దతుగా నిలబడతామని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి గూగుల్ , యూట్యూబ్ హోమ్‌పేజీ స్క్రీన్ షాట్ ను ఆయన ట్విటర్లో షేర్ చేసిన సంగతి తెలిసిందే. (దేశీయ ఉగ్రవాద చర్యలు: రంగంలోకి సైన్యం) There is no place for hate and racism in our society. Empathy and shared understanding are a start, but we must do more. I stand with the Black and African American community and we are committed to building on this work in our company and in our communities. https://t.co/WaEuhRqBho — Satya Nadella (@satyanadella) June 1, 2020 Today on US Google & YouTube homepages we share our support for racial equality in solidarity with the Black community and in memory of George Floyd, Breonna Taylor, Ahmaud Arbery & others who don’t have a voice. For those feeling grief, anger, sadness & fear, you are not alone. pic.twitter.com/JbPCG3wfQW — Sundar Pichai (@sundarpichai) May 31, 2020 -
అంత సులభంగా ఎలా మాట్లాడతారో!
లండన్: ‘జాతి వివక్ష’ అంశాన్ని తేలిగ్గా పరిగణించరాదని, వ్యాఖ్యలు చేసే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఇంగ్లండ్ యువ పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ అన్నాడు. గతంలో తనకు ఎదురైన అనుభవాల గురించి మంగళవారం ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించాడు. ‘ఒక వ్యక్తిని ఉద్దేశించి అంత సులభంగా జాతి వివక్ష వ్యాఖ్యలు ఎలా చేస్తారో అర్థం కాదు. ఇలా చేయడం వల్ల వారేం పొందుతారో! మరెవరికీ తరచుగా ఈ అనుభవం ఎదురై ఉండదేమో. ఇలాంటి చర్యలపై కూడా నేను చాలా ఆలోచించాకే స్పందిస్తుంటా. ఇది ఎంతమాత్రం ఆమోదించదగినది కాదు. దీనిఐ సరైన రీతిలో చర్యలు తీసుకోవాల్సిందే’ అని 24 ఏళ్ల ఆర్చర్ పేర్కొన్నాడు. గతేడాది న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఓటమి అనంతరం స్టేడియంలో ప్రేక్షకుడు ఒకరు ఆర్చర్‌పై అదే పనిగా జాతి వివక్ష వ్యాఖ్యలకు తెగబడ్డాడు. దీంతో అతనిపై రెండేళ్లపాటు న్యూజిలాండ్‌లో జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్‌లు చూడకుండా నిషేదం విధించారు. (చదవండి: మ్యాక్స్‌వెల్ ‘భారతీయ నిశ్చితార్థం’) (‘కోహ్లికి అలా సూచించడంలో అర్థం లేదు’) -
కిడ్నాప్ చేసి వెబ్ సిరీస్ చూపించాడు
న్యూయార్క్ : అమెరికాలో తీవ్ర స్థాయిలో ఉన్న వర్ణ వివక్షపై అలెక్స్ హేలీ అనే రచయిత 'రూట్స్' అనే నవల రాశారు. ఆ నవలలో ఆఫ్రికా నుంచి తీసుకొచ్చిన నల్లజాతి వారిని బానిసలుగా విక్రయించడాన్ని రచయిత వివరించారు. ఆ క్రమంలో వారిని చిత్రహింసలకు గురిచేసే తీరు.. అమెరికాకు తీసుకొచ్చాక వారిపై సాగించే దురాగతాలను కళ్లకు కట్టినట్లు ఆ పుస్తకంలో వివరించారు. ఇప్పటికీ అమెరికాలో ఎక్కడో ఒక చోట వర్ణ వివక్ష ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా అమెరికాలో మాత్రం ఒక విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఆఫ్రో అమెరికన్ రాబర్ట్ నోయెస్ (52) తనకు పరిచయం ఉన్న ఒక తెల్లజాతి మహిళను కిడ్నాప్ చేశాడు. ఆమెను కిడ్నాప్ చేసి తన ఇంటికి తీసుకెళ్లిన రాబర్ట్.. విచిత్రమైన శిక్షను అమలు చేశాడు. అదేంటంటే.. ఏకధాటిగా 9 గంటలు 'రూట్స్' మినీ వెబ్ సిరీస్‌ను చూడాలని బలవంతం చేశాడు. అయితే సదరు యువతి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా.. ఆమెను పట్టుకొని టీవీ ముందు నుంచి కదిలావంటే శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి చంపేస్తానని బెదిరించాడు. వర్ణ వివక్ష అనేది ఎంతలా ఉందనేది ఆమెకు అర్థమయ్యేందుకే రాబర్ట్ 'రూట్స్' సిరీస్ చూపించినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. కాగా రాబర్ట్ నోయెస్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. అలెక్స్ హేలీ రాసిన ప్రసిద్ద 'రూట్స్' నవల 1977లో టీవీ సిరీస్‌గానూ రూపుదిద్దుకొంది. తన మూలాలను వెతుక్కుంటూ ఏడు తరాల బానిస గోసను హేలీ కళ్లకు కట్టినట్టుగా వివరించారు. స్వేచ్ఛ నుంచి సంకెళ్లకు, సంకెళ్ల నుంచి విముక్తికి సాగిన రూట్స్ నవలను ఏడు తరాల ప్రస్థానంగా అభివర్ణించవచ్చు. -
ముస్లింలుగా భావించినందువల్లే...దుశ్చర్య
వాషింగ్టన్ : కాలిఫోర్నియాకు చెందిన ఓ వ్యక్తి జాత్యహంకార చర్యకు పాల్పడ్డాడు. ముస్లిం వర్గానికి చెందిన వారిగా భావించి ఓ కుటుంబం మొత్తాన్ని కారుతో ఢీకొట్టాడు. మంగళవారం శాన్ ఫ్రాన్సిస్కోలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఇసయ్యా పీపుల్స్ (34) శాన్ ఫ్రాన్సిస్కోలో ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా తన ముందు ఉన్న గుంపుపైకి కారు ఎక్కించాడు. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మిగిలిన వారు స్వల్పగాయాలతో బయటపడ్డారు. కాగా బాధితులను ముస్లింలుగా భావించిన కారణంగానే ఇసయ్య ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడని సన్నీవేల్ పబ్లిక్ సెక్యూరిటి విభాగం తన ప్రకటనలో పేర్కొంది. వారిని చంపడమే లక్ష్యంగా అతడు ఈవిధంగా ప్రవర్తించాడనడానికి తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నట్లు తెలిపింది. అయితే బాధితుల కమ్యూనిటీ, జాతీయతకు సంబంధించిన విషయాలను మాత్రం వెల్లడించలేదు. ఇక ఈ విషయం గురించి ఇసయ్య లాయర్ మాట్లాడుతూ.. గతంలో మిలిటరీ ఆఫీసరుగా పనిచేసిన ఇసయ్య ప్రస్తుతం మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడని వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఓ సైక్రియార్టిస్ట్ దగ్గర చికిత్స కూడా తీసుకుంటున్నాడని పేర్కొన్నారు. మానసిక ఒత్తిడితోనే ఈ విధంగా ప్రవర్తించాడని తెలిపారు. -
మృతుల్లో ఐదుగురు భారతీయులు
క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్‌లోని క్రైస్ట్ చర్చ్ నగరంలో శుక్రవారం రెండు మసీదుల వద్ద జరిగిన కాల్పుల్లో మరణించిన వారిలో ఐదుగురు భారతీయులున్నారని న్యూజిలాండ్‌లోని భారత హై కమిషన్ ఆదివారం ధ్రువీకరించింది. ఆస్ట్రేలియాలో జన్మించిన బ్రెంటన్ టారంట్ అనే వ్యక్తి జాత్యహంకారంతో అల్ నూర్, లిన్‌వుడ్ మసీదుల వద్ద ఈ కాల్పులు జరపగా, 50 మంది మరణించారు. మరో 50 మంది గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత క్రైస్ట్‌చర్చ్‌లో 9 మంది భారతీయుల ఆచూకీ గల్లంతైందని శుక్రవారమే హై కమిషన్ కార్యాలయం వెల్లడించింది. ఐదుగురు భారతీయులు ఈ కాల్పుల్లో చనిపోయారని తాజాగా ధ్రువీకరించింది. మరణించిన భారతీయులను మహబూబ్ ఖోఖర్, రమీజ్ వోరా, అసీఫ్ వోరా, అన్సీ అలిబవ, ఓజైర్ ఖదీర్‌గా గుర్తించామంది. వీరిలో ఓజైర్ ఖదీర్ హైదరాబాద్ వాసి. కాగా, మరో ఇద్దరు హైదరాబాదీలు హసన్ ఫరాజ్, మహ్మద్ ఇమ్రాన్ ఖాన్లు కూడా మృతి చెందినట్లు శనివారం సమాచారం వచ్చినా, ఆదివారం హై కమిషన్ విడుదల చేసిన జాబితాలో వీరి పేర్లు లేకపోవడం గమనార్హం. క్రైస్ట్ చర్చ్ బాధితుల కుటుంబ సభ్యులకు వీసాలను త్వరగా మంజూరు చేసేందుకు న్యూజిలాండ్ ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చిందని హై కమిషన్ కోరింది. కాగా, తమ కుటుంబ సభ్యుడు టారంట్ ఇలాంటి ఘాతుకానికి పాల్పడటం తమకు విభ్రాంతి కలిగించిందనీ, తాము ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నామని అతని కుటుంబ సభ్యులు అంటున్నారు. ప్రస్తుతం టారంట్ సోదరి, తల్లిపై ఎవరూ దాడి చేయకుండా పోలీసులు వారికి రక్షణ కల్పిస్తున్నారని టారంట్ నానమ్మ చెప్పారు. కాగా, టారంట్ కాల్పుల ఘటనను ఫేస్బుక్లో ప్రత్యక్ష ప్రసారం చేయడాన్ని అడ్డుకోలేకపోవడంపై ఫేస్బుక్, ఇతర సామాజిక మాధ్యమ సంస్థల నుంచి సమాధానాల కోసం వేచి చూస్తున్నానని ప్రధాని జసిండా తెలిపారు. బుల్లెట్లు లేని తుపాకీతో తరిమాడు కాల్పుల సమయంలో ధైర్య సాహసాలు ప్రదర్శించి గుండ్లు లేని తుపాకీతో హంతకుడిని తరిమిన ఓ వ్యక్తిపై ప్రస్తుతం ప్రశంసలు కురుస్తున్నాయి. అఫ్గానిస్తాన్ నుంచి వచ్చి న్యూజిలాండ్‌లో శరణార్థిగా ఉంటున్న అబ్దుల్ అజీజ్.. లిన్‌వుడ్ మసీదులో హంతకుడు టారంట్ మరింత మందిని కాల్చకుండా నిలువరించి ఈ ఘటనలో హీరోగా నిలిచాడు. కాల్పుల శబ్దం వినపడగానే అజీజ్ తొలుత కేవలం క్రెడిట్ కార్డులను స్వైప్ చేసే మిషన్‌ను తీసుకెళ్లి టారంట్ పైకి విసిరి అతని దృష్టిని మళ్లించాడు. అనంతరం టారంట్ కాల్పులు జరిపి, బుల్లెట్లు అయిపోవడంతో పడేసిన తుపాకీ ఒకటి అతనికి దొరికింది. ఆ తుపాకీతో అజీజ్ బెదిరించడంతో టారంట్ తన తుపాకీని కింద పడేశాడు. టారంట్‌ను అజీజ్ వెంటాడుతూ వెళ్లి, కారులో పారిపోతుండగా, కారు వెనుక అద్దాన్ని పగులగొట్టాడు. అజీజ్ ఈ సాహసం చేయకపోయుంటే మరింతమంది ప్రాణాలు కోల్పోయేవారంటూ అందరూ ప్రశంసిస్తున్నారు. -
తిరుమల చరిత్రపై గొప్ప పరిశోధన
ఇంతవరకు తిరుమల చరిత్రపై వివిధ భాషల్లో వెలువడ్డ పుస్తకాలకు భిన్నంగా పరిపూర్ణంగా చరిత్రను పునాదిగా చేసుకుని రాసిన విశిష్ట గ్రంథమిది. చెట్లనీడలో, చెదల పుట్టల నడుమ కప్పబడి ఉన్న వెంకటేశుని ప్రతిమను తొండమాన్ చక్రవర్తి వెలికి తీయించి పునఃప్రతిష్ట గావించి శిలాస్తంభాలతో మండపరీతి ఆలయాన్ని నిర్మించింది మొదలుకుని ఆళ్వారులు ఎంతో కష్టంతో కొండల నడుమన ఉన్న వేంకటేశుని దర్శించి తాము సేకరించిన వివరాలను పాటగట్టి ఆ భక్తితత్వాన్ని ప్రచారం చేసిన చరిత్రను ఆచార్య దేవిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి ఈ పుస్తకంలో వివరించారు. 2 వేల సంవత్సరాల చరిత్ర క్రమంలో తిరుమల చరిత్రను ఆధార సహితంగా వెలికి తీసి మనముందు ఉంచిన పరిశోధక స్థాయి కలిగిన గ్రంథమిది. ఈ పుస్తకంలో మహిమలు, భక్తి ప్రచారాలు. వేంకటేశ్వరుడి లీలలు కానరావు. అయితేనేం, మనిషి తమకు మంచి చేసినవారిని దేవుళ్లగా, చెడు చేసిన వారిని రాక్షసులుగా భావించి కొందరికి దైవత్వం, కొందరికి దానవత్వం ఎందుకు ఆపాదిస్తూ వచ్చాడో పరిణామ క్రమంలో వివరిస్తూ వచ్చిన ఈ గ్రంథం అందరూ తప్పక పఠించి తీరాల్సినది. గాడ్స్ ఆన్ అర్త్; తిరుమల చరిత్ర పుటలు: 310; వెల రూ. 300; ప్రతులకు: ప్రొ. దేవిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి 303, బి1 బ్లాక్, వరరూప హోమ్స్, శ్రీ సాయి అపార్ట్మెంట్స్, తుమ్మలగుంట, తిరుపతి–517502. ఫోన్: 9849584324 ఈమెయిల్:dsreddy.svu@gmail.com – రాజశేఖర రాజు మానవుడు నిరంతర జిజ్ఞాశువు. అన్నింటినీ తెలుసుకోవాలనుకునే మానవుని తృష్ణకు సంపూర్ణంగా లొంగనిదా ఆత్మ. కారణం, అది అటు విశుద్ధశక్తి రూపంలోనూ, ఇటు దృశ్యమాన ప్రపంచరూపంలోనూ కలగలిసి ఉండటమే. అంతేగాక, విరుద్ధ లక్షణాలు ఆ ఆత్మ సొంతం. ఆత్మ ఎంత సూక్ష్మమో, అంత విస్తృతం. ఎంత తేలికో, అంత భారయుతం. ఎంతటి సరళమో, అంతటి సంక్లిష్టతమం. ఎంతటి నిర్లిప్తమైనదో, అంతటి చైతన్యమైనది. ఎంతటి స్థిరమైనదో, అంతటి పరిణామశీలి. అందుకే, ఉపనిషత్తులు ఆత్మను ‘సవితా’ అని పేర్కొన్నాయి. ఆత్మ సాంద్రత అనంతమవడం వల్ల ఆ ఆత్మలో ఎక్కడైనా భారీ లేక అతి భారీ నక్షత్రాలు, నక్షత్ర సముదాయాలు రూపొందుతున్నాయి. అలాగే, అంతే ప్రాంతంలో సూక్ష్మాతిసూక్ష్మమైన పదార్థాలు కూడా. ఆత్మ పరిణామతత్వం వల్లనే నిర్జీవులకు విఘటనం, జీవులకు మరణం తప్పదు. విఘటనం చెందిన నిర్జీవి ఏ రకంగా నైతే తిరిగి తన రూపాన్ని పొందదో, అలాగే జీవి మరణాంతరం తన రూపాన్ని తిరిగి పొందదు. ఎందుకంటే ఈ ఆత్మకు తిరిగి చూసుకునే అవసరమూ లేదు, అవకాశమూ లేదు. ఆత్మసాంద్రత అనిర్వచనీయమైనందువల్ల, అదే తిరిగి తిరిగి అన్ని రూపాల్లో పుడుతుందని, ఆ ఆత్మే తానని ఆత్మ జ్ఞానం పొందినవాడు గుర్తెరిగి, గతంలో, వర్తమానంలో, భవిష్యత్తులో ఉద్భవించేది తానేనని నిర్ధారించుకుంటాడు. తద్వారా మరణభీతిని జయిస్తాడు. అతన్ని మాత్రమే అరిషడ్వర్గాలు చేరలేవు. ఆత్మజ్ఞాని ఓ విశ్వమానవుడు ఆత్మజ్ఞాని ఓ విశ్వమానవుడు. అతనికి కులం లేదు, మతం లేదు, అసలు భేదమే లేదు. జీవుల్లోనే కాదు, నిర్జీవుల్లో కూడా భేదాన్ని గుర్తించలేడు. అభేదమే మనసుగా మారిపోగా, అదే ఆనందానికి మాతృకగా పరిణమిస్తుంది. మానవ సమాజం కూడా ఈ విషయాన్ని గుర్తిస్తే సమాజంలో భేదాభిప్రాయాలకు తావు ఉండదు. మతవాదం, కుల వాదం, జాతివాదం మొదలైనవే కాకుండా మానవుడే ఒక ఉన్నతజీవి అనే దురభిమానం కూడా పోతుంది. ఈ ప్రకృతిలో తనదొక విశిష్టమైన బాధ్యతాయుత జన్మ అని గుర్తిస్తుంది. ప్రకృతిలో ఇతర జీవాలను తోబుట్టువులుగా చూడడం జరుగుతుంది. ఆధిపత్య ధోరణి పోయి బాధ్యతాయుత జీవన విధానం ప్రారంభమవుతుంది. మానసిక శుభ్రతయే కాక, పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ మొదలైన ప్రాకృతిక కార్యకలాపాలు మొదలై ఓ చక్కటి సమాజం సాకారమౌతుంది. ప్రతీ గ్రామం ఓ మున్యాశ్రమంగా రూపుదిద్దుకుంటుంది. అయం నిజః పరోవేతి గణనా లఘు చేతసామ్ ఉదార చరితానాంతు వసుధైక కుటుంబకామ్ అన్నట్టుగా వసుధ అంతా ఒకే కుటుంబమై విరాజిల్లుతుంది. – గిరిధర్ రావుల -
‘జూలో ఉండే జంతువు ఎవరో కాదు.. ఈ జూనియరే’
వాషింగ్టన్ : శరణార్థులుగా అమెరికాకు వచ్చే వారిని జంతువులతో పోలుస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ జాత్యహంకారం ప్రదర్శించారు. జీరో టాలరెన్స్ పేరిట శరణార్థులు, వారి పిల్లలను వేరు చేస్తూ డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే విమర్శల పాలవుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు వలసవాదులను అడ్డుకునేందుకు మెక్సికో సరిహద్దులో గోడ నిర్మించేందుకు ట్రంప్ అడిగిన (500 కోట్ల డాలర్ల) డబ్బుపై ఏ నిర్ణయమూ తీసుకోకుండానే కాంగ్రెస్ వాయిదా పడింది కూడా. ఈ క్రమంలో మెక్సికో గోడ నిర్మాణం ఆవశ్యకతను వివరిస్తూ.. ‘ జూలో ఓరోజు మొత్తం ఎందుకు ఎంజాయ్ చేస్తారో తెలుసా. అక్కడ గోడలు ఉంటాయి కాబట్టి’ అని ట్రంప్ జూనియర్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చారు.(‘నా పిల్లలు బతికి ఉంటే చాలు.. ఇంకేం వద్దు’) కాగా జంతువుల బారి నుంచి ప్రజలను కాపాడాలంటే గోడ కట్టక తప్పదు కదా అనే అర్థం వచ్చేలా ఉన్న జూనియర్ రాతలపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ‘జాతి అహంకారానికి ఇది నిదర్శనం’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ‘జూలో ఉండే జంతువు మరెవరో కాదు ఈ జూనియరే’ అంటూ మరొకరు ఘాటుగా స్పందించారు. గతంలో కూడా ఇదే రీతిలో సిరియా శరణార్థులపై జూనియర్ జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడు. ఇక ఇటీవలే ఆయన తండ్రి ట్రంప్ కూడా వలసవాదుల గురించి ప్రస్తావిస్తూ.. ‘వీళ్లంతా చాలా చెత్త మనుషులు. అయినా వీళ్లని మనుషులు అనకూడదు. జంతువులు అనాలి’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.