జాత్యహంకారం ఓ రుగ్మత: ట్రంప్
వాషింగ్టన్: జాత్యహంకారం ఓ రుగ్మతని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం అన్నారు. వర్జీనియాలోని చార్లట్స్ విల్ నగరంలో శనివారం నాటి ఘర్షణలో పాల్గొన్న శ్వేతజాతీయవాదులు, నయా నాజీ బృందాల సభ్యులు నేరస్తులని వ్యాఖ్యానించారు. జాత్యహంకార హింస, భయాలు దరిచేరకుండా ప్రతి అమెరికా బాలుడు స్వేచ్ఛగా ఎదిగేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. చార్లట్స్‌విల్‌లో గుంపుపైకి కారు దూసుకొచ్చిన ఘటనలో నేరస్తులకు శిక్ష తప్పదని పేర్కొన్నారు.