‘యూ ఫర్‌ అగ్లీ’.. టీచర్లు సస్పెండ్‌ | 2 Bengal Teachers Suspended For Teaching U For Ugly | Sakshi
Sakshi News home page

పశ్చిమ బెంగాల్‌లో వెలుగు చూసిన సంఘటన 

Published Fri, Jun 12 2020 12:05 PM | Last Updated on Fri, Jun 12 2020 12:09 PM

2 Bengal Teachers Suspended For Teaching U For Ugly - Sakshi

కోల్‌కతా: ఆఫ్రో-అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్యతో మరోసారి జాత్యాంహకార వ్యతిరేక ఆందోళనలు తెర మీదకు వచ్చాయి. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం ఇద్దరు మహిళా ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేసింది. తూర్పు బుర్ద్వాన్ జిల్లాలోని స్థానిక మున్సిపాలిటీ స్కూల్‌కు చెందిన ఈ టీచర్లు నలుపు రంగు వ్యక్తులను అవమానించే విధంగా ఉన్న పాఠాలను ప్రీ ప్రైమరీ పిల్లలకు భోదించడంతో వీరిని సస్పెండ్‌ చేశారు. ఆంగ్ల వర్ణమాలను భోదించే ఈ పుస్తకంలో యూ అక్షరం దగ్గర అగ్లీ అని రాసి ఉంది. పక్కనే నలుపు రంగు పిల్లవాడి బొమ్మ ఉంది. లాక్‌డౌన్‌ కారణంగా ప్రస్తుతం పాఠశాలలు ముసి వేశారు. ఈ క్రమంలో ఓ విద్యార్థి తండ్రి పిల్లవాడి చేత అక్షరాలు వల్లే వేయిస్తూ.. ‘యూ’ ఫర్‌ ‘అగ్లీ ’అని రాసి ఉండటం గమనించాడు. దీని గురించి ఇతర తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. అందరు కలిసి ఈ విషయాన్ని విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. 

ఈ క్రమంలో ఉన్నతాధికారులు సదరు టీచర్లను సస్పెండ్‌​ చేశారు. అనంతరం ఓ అధికారి దీని గురించి మాట్లాడుతూ.. ‘సదరు పుస్తకం విద్యాశాఖ ప్రచురించే పాఠ్యపుస్తకం కాదు. పాఠశాల సొంతంగా రూపొందించుకున్న బుక్‌. విద్యార్థుల మనస్సుల్లో పక్షపాతాన్ని కలిగించే చర్యలను మేం సహించం. ప్రస్తుతం ఆ ఇద్దరు టీచర్లను సస్పెండ్‌ చేశాం. ప్రాథమిక దర్యాప్తు ముగిసిన తర్వాత కఠిన చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement