వాషింగ్టన్ : ఆఫ్రికన్-అమెరికన్ పౌరుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యపై టెక్ దిగ్గజాలు, గూగుల్, మైక్రోసాఫ్ట్ తమ విచారాన్ని, సంతాపాన్ని వ్యక్తం చేశాయి. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల జాతి వివక్షను, జాత్యంహకారాన్ని ఖండించారు. నల్లజాతి సమాజానికి తమ సంఘీభావం తెలిపిన సత్య నాదెళ్ల సమాజంలో ద్వేషానికి, జాత్యహంకారానికి చోటు లేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికే దీనిపై సానుభూతి, పరస్పర అవగాహన మొదలైనప్పటికీ, ఇంకా చేయాల్సిన అవసరం వుందని ఆయన అన్నారు. (జార్జ్‌ది నరహత్యే !)
ఇప్పటికే జార్జ్ ప్లాయిడ్ మృతిపట్ల సెర్చ్ ఇంజీన్ దిగ్గజం గూగుల్ సానుభూతిని ప్రకటించింది. ఈ సంఘటన పట్ల భాధ, కోపం, విచారం, భయంతో ఉన్న వారెవ్వరూ ఏకాకులు కాదు.. జాతి సమానత్వానికి మద్దతుగా నిలబడతామని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి గూగుల్ , యూట్యూబ్ హోమ్‌పేజీ స్క్రీన్ షాట్ ను ఆయన ట్విటర్‌లో షేర్ చేసిన సంగతి తెలిసిందే. (దేశీయ ఉగ్రవాద చర్యలు: రంగంలోకి సైన్యం)
There is no place for hate and racism in our society. Empathy and shared understanding are a start, but we must do more. I stand with the Black and African American community and we are committed to building on this work in our company and in our communities. https://t.co/WaEuhRqBho
— Satya Nadella (@satyanadella) June 1, 2020
Today on US Google & YouTube homepages we share our support for racial equality in solidarity with the Black community and in memory of George Floyd, Breonna Taylor, Ahmaud Arbery & others who don’t have a voice. For those feeling grief, anger, sadness & fear, you are not alone. pic.twitter.com/JbPCG3wfQW
— Sundar Pichai (@sundarpichai) May 31, 2020
Comments
Please login to add a commentAdd a comment