George Floyd
-
ఎట్టకేలకు న్యాయం.. 22 ఏళ్ల జైలు శిక్ష
సంచలనం సృష్టించిన జార్జ్ ఫ్లాయిడ్(46) హత్య ఉదంతంలో ఎట్టకేలకు న్యాయం జరిగింది. మెడను కాలితో నొక్కిపట్టి ఊపిరి ఆడకుండా చేసి అతడి మరణానికి కారణమైన పోలీస్ మాజీ అధికారి డెరిక్ చౌవిన్ (45)కు కఠిన శిక్ష విధించింది కోర్టు. డెరిక్‌ను ఇదివరకే దోషిగా నిర్ధారించిన మిన్నియపొలిస్ కోర్టు గత రాత్రి అతడికి శిక్షను ఖరారు చేస్తూ తీర్పును వెలువరించింది. మొత్తం ఇరవై రెండున్నర సంవత్సరాల జైలు శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది. పోయినేడాది మే 25న జార్జ్ ఫ్లాయిడ్‌ను నడిరోడ్డుపై డెరిక్ చౌవిన్ మోకాలితో నొక్కి అదిమిపట్టాడు. తనకు ఊపిరి ఆడడం లేదని, కాలు తీయాలని ఫ్లాయిడ్ వేడుకున్నా డెరిక్ కనికరించలేదు. ఆ తర్వాత ఫ్లాయిడ్‌ను ఆసుపత్రికి తరలించగా మరణించాడు. ఇందుకు సంబంధించి వీడియోలు, పొటోలు అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ‘భావోద్వేగంలోనో లేదంటే సానుభూతితోనో డెరిక్‌కు ఈ శిక్ష విధించడం లేదు’ అని తీర్పు సందర్భంగా జడ్జి పీటర్ కాహిల్ ప్రకటించారు. కాగా, తీర్పు వెలువరించే ముందు డెరిక్.. లేచి నిలబడి ఫ్లాయిడ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించాడు. సూటిగా జడ్జి కళ్లలోకి చూసి మాట్లాడకపోగా.. ఆ ఒక్కముక్క మాట్లాడి వెంటనే కూర్చున్నాడు. ఇక డెరిక్ తల్లి వ్యవహారంపై పలువురు మండిపడుతున్నారు. తన కొడుకు అమాయకుడంటూ, ఫ్లాయిడ్ హత్యలో అనవసరంగా ఇరికించారంటూ ఆమె కంటతడితో స్టేట్మెంట్ ఇచ్చింది. మరోవైపు ఫ్లాయిడ్ కుటుంబం తరపున అతని ఏడేళ్ల కూతురు తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ మాట్లాడిన మాటల్ని రికార్డుగా కోర్టు పరిగణలోకి తీసుకుంది. తీర్పు తర్వాత ప్రెసిడెంట్ బైడెన్ సహా పలువురు సెలబ్రిటీలు, ప్రముఖులు స్పందించారు. ఫేక్ డాలర్ నోట్ల అనుమానంతో డెరిక్, అతని ముగ్గురు సహాచర అధికారులు జార్జ్ ఫ్లాయిడ్‌ను ముందుగా అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతన్ని తరలించే క్రమంలో క్రూరంగా వ్యవహరించగా.. ప్రాణాలు కోల్పోయాడు. జాత్యాహంకార హత్యగా ఇది ప్రపంచాన్ని కుదిపేసింది. కాగా, ఈ ఘటనను డార్నెల్లా ఫ్రాజెయిర్ అనే అమ్మాయికి ఈ ఏడాది పులిట్జర్ గౌరవ పురస్కారం దక్కింది కూడా. కాగా, అమెరికాలో పోలీసుల చేతిలో హత్యలకు గురైన ఉదంతాలు తక్కువేం కాదు. ఫ్లాయిడ్ ఉదంతం నాటికి 1,129 మంది పౌరులు, పోలీసుల చేతిలో చంపబడ్డారని నివేదికలు వెల్లడించాయి కూడా. Judge Peter Cahill just sentenced #DerekChauvin to 270 months that’s 22.5 years in the murder of #GeorgeFloyd. pic.twitter.com/6sRoJBHjW1 — Sara Sidner (@sarasidnerCNN) June 25, 2021 చదవండి: నాన్న ఫ్లాయిడ్ ప్రపంచాన్నే మార్చేశాడు! -
‘యూకేలో పెరిగితే ఇంతకాలం బతికేవాడిని కాను’
జోహెన్నెస్‌బర్గ్: మాజీ వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ మైకెల్ హోల్డింగ్ జాత్యహంకార ధోరణిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అదృష్టవశాత్తు తాను ఇంగ్లండ్‌లో పెరగలేదని.. లేదంటే యువకుడిగా ఉన్నప్పుడే తాను మరణించేవాడినని పేర్కొన్నాడు. యవ్వనంలో ఉండగా తాను చాలా దూకుడుగా వ్యవహరిచేంవాడినని.. ఆ సమయంలో తాను ఇంగ్లండ్‌లో ఉంటే కచ్చితంగా ఈపాటికే మరణించేవాడినన్నాడు మైకెల్. అమెరికాలో చోటు చేసుకున్న జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతం తర్వాత వచ్చిన బ్లాక్‌లైవ్స్ మ్యాటర్ ఉద్యమంలో మైకెల్ చురుకుగా వ్యవహరిస్తున్నాడు. జాత్యాహంకార ధోరణిపై మైకెల్ ‘‘వై వీ నీల్, హౌ వి రైజ్’’ అనే పుస్తకాన్ని రాశాడు. త్వరలోనే ఇది విడుదల కానుంది. ఈ క్రమంలో మైకెల్ మాట్లాడుతూ.. ‘‘నేను జమైకాలో పెరిగాను. కనుక ఎప్పుడు జాత్యహంకారాన్ని చవి చూడలేదు. కానీ అక్కడ నుంచి వేరే దేశాలకు వెళ్లిన ప్రతి సారి నేను నేను దాన్ని ఎదుర్కొన్నాను. ప్రతిసారి నాకు నేను సర్ది చెప్పుకునేవాడిని.. ఇది నీ దేశం కాదు.. త్వరలోనే నీవు నీ స్వస్థలం వెళ్తావు. అక్కడ నీకు ఇలాంటి చెడు అనుభవాలు ఎదురుకావని నాకు నేనే నచ్చచెప్పుకునేవాడిని’’ అని తెలిపాడు. ‘‘ఇక యువకుడిగా ఉన్నప్పుడు నేను చాలా దూకుడుగా ఉండేవాడిని. నేను న్యూజిలాండ్ (1980) లో ఉండగా మైదానం నుంచి ఒక స్టంప్‌ను బయటకు తన్నాను. అదృష్టం కొద్ది నేను ఇంగ్లండ్‌లో పెరగలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే ఆనాటి నా ప్రవర్తన తర్వాత నేను ఇంతకాలం బతికి ఉండేవాడినే కాదు” అని హోల్డింగ్ ది టెలిగ్రాఫ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. “ఈ విషయంలో నేను ఓ స్టాండ్ తీసుకుంటే నా కెరీర్ ఇప్పుడున్నంత కాలం ఉండేది కాదు. అలానే నాకు ఈ సుదీర్ఘ టెలివిజన్ కెరీర్ కూడా ఉండేది కాదు. తమ హక్కుల కోసం నిలబడి అన్యాయాన్ని ఎదిరించిన నల్లజాతీయులు బాధితులవుతున్నారని మేము చరిత్ర ద్వారా తెలుసుకున్నాము. ఒకవేళ నేను కూడా ఈ జాత్యహంకార ధోరణి గురించి మాట్లాడి ఉంటే వారు ‘మరో యువకుడు మనల్ని ఎదరిస్తున్నాడు.. అతనిని వదిలించుకోండి’ అని చెప్పేవారు. అప్పుడు నేను పేడ కుప్పలో మరొక వ్యక్తిగా ఉండేవాడిని” అన్నాడు హోల్డింగ్. -
డార్నెల్లా ఫ్రెజర్.. నిప్పులా ఉద్యమాన్ని రాజేసింది!
ధైర్యం ఏ రూపంలో ఉంటుంది? ఘనమా? ద్రవమా? వాయువా? శబ్దమా? నిశ్శబ్దమా? ఇవన్నీ కలిసిన రూపమా? అయితే ఆ రూపానికి డార్నెల్లా ఫ్రెజర్ అని పేరు పెట్టాలి. తెల్లజాతి పోలీసు మోకాలి కింద బిగుసుకుపోతున్న గొంతుతో ఊపిరందక 9 నిముషాల పాటు ‘ఐ కాంట్ బ్రీత్’ అని మూలుగుతూ గిలగిల కొట్టుకుంటున్న నల్లజాతి మనిషి జార్జి ఫ్లాయిడ్‌ను తన ఫోన్లో షూట్ చేసిన 17 ఏళ్ల నల్ల అమ్మాయే డార్నెల్లా ఫ్రెజర్. కళ్ల ముందరి ఘాతుకానికి ఆ అమ్మాయి హృదయం చెంపల మీదకు ద్రవీభవించింది. ఆవేదన ఆమె గుండెల్లో ఘనీభవించింది. గొంతులోంచి పోతున్నది తన ప్రాణవాయువే అని ఆమెకు అనిపించింది. శబ్దానికి ముందరి నిశ్శబ్దంలా ఇంటికి వెళ్లి ఆ రోజు అర్ధరాత్రి దాటాక ఆ వీడియోను ఫేస్బుక్ లో అప్ లోడ్ చేసింది డార్నెల్లా. మొన్న మంగళవారం ఆ వీడియో సాక్ష్యంతో కోర్టు ఆ పోలీసు అధికారిని దోషిగా నిర్ధారించింది. అతడికి 40 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఏడాదిగా జరుగుతున్న ఈ కేసు విచారణకు కీలక సాక్ష్యాన్ని అందజేసి నల్లజాతి ఉద్యమానికి మళ్లీ కాస్త ఊపిరి తెచ్చింది డార్నెల్లా ఫ్రెజర్. డార్నెల్లా ఫ్రేజర్ కనుక ఆ రోజు పాదరసంలా ఆలోచించి ఉండకపోతే డెరెక్ చావిన్ ఈరోజుకీ మినియాపొలిస్ పోలీస్ ఆఫీసర్‌గానే కొనసాగుతూ ఉండేవారు. ∙∙ ఈ స్టోరీ.. పై వాక్యంతో తప్ప ఇక ఎలానూ ప్రారంభం అవడానికి లేదు. సుమారు ఏడాదిగా అత్యున్నతస్థాయి పోలీస్ ఆఫీసర్ డెరెక్ చావిన్‌పై జరుగుతున్న విచారణ మంగళవారం ముగిసింది. కోర్టు అతడికి 40 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది! విచారణలో నల్లజాతి పౌరుడు జార్జి ఫ్లాయిడ్ దుర్మరణానికి ఈ తెల్ల పోలీసు కారణమైనట్లు నిరూపించే ఏ ఒక్క గట్టి సాక్ష్యాధారమూ లేకపోయింది. ఆఖరుగా మిగిలింది పద్దెనిమిదేళ్ల నల్లజాతి టీనేజర్ డార్నెల్లా ఫ్రేజర్ అప్రయత్నంగా తన సెల్ ఫోన్లోంచి ఆనాటి ఘటనను షూట్ చేసిన వీడియో క్లిప్పింగ్! కోర్టు హాల్లో ఆ క్లిప్‌ను ప్రదర్శించారు. జార్జి ఫ్లాయిడ్ గొంతును మోకాలితో తొక్కుతున్నప్పుడు తన సెల్‌ఫోన్ లోంచి షూట్ చేస్తున్న డార్లెల్లా, ఆమె కజిన్ (కుడి వైపు నుంచి మూడు, రెండు స్థానాల్లో). సీసీ ఫుటేజ్ అందులో డెరెక్ చావిన్ తొమ్మిది నిముషాల పాటు జార్జి ఫ్లాయిడ్ గొంతు మీద మోకాలిని అదిమిపట్టి ఉంచడం డార్నెల్లా తీసిన పది నిముషాల వీడియోలో మొత్తం రికార్డయి ఉంది. డార్నెల్లా వీడియో తీస్తున్నప్పటి వీడియో ఫుటేజ్‌ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి తెప్పించుకుని జడ్జి చూశారు. 2020 మే 25న ఆ ఘటన జరగడానికి కొద్ది నిముషాల ముందు వరకు జార్జి ఫ్లాయిడ్ ఎవరో, డార్నెల్లా ఫ్రేజర్ ఎవరో ప్రపంచానికి తెలియదు. ఒకరికొకరు కూడా తెలియని సాధారణ పౌరులు. ఆ సాయంత్రం.. మినియాపొలిస్ నగరంలోని చికాగో అవెన్యూలో.. 38వ వీధిలో ఉన్న ‘కప్ ఫుడ్స్’ షాపింగ్ మాల్కి తొమ్మిదేళ్ల వయసున్న తన కజిన్‌తో కలిసి వచ్చింది డార్నెల్లా. అక్కడికి దగ్గర్లోనే ఒక అపార్ట్మెంట్లో ఉంటారు వాళ్లు. వచ్చిన కొద్ది నిముషాలకు నలుగురు పోలీసులు ఒక నల్లజాతి వ్యక్తిని (జార్జి ఫ్లాయిడ్) పెడరెక్కలు విరిచి తీసుకెళ్లడం ఆ కూడలి లో ఉన్నవారు చూశారు. ఆ పోలీసులలో ఒకరైన డెరెక్ చావిన్.. జార్జి ఫ్లాయిడ్‌ని కింద పడేసి, అతడి గొంతుపై తన మోకాలును నొక్కిపెట్టాడు. అప్పుడు చూసింది డార్నెల్లా.. తనకు ఐదడుగుల దూరంలో ఆ దృశ్యాన్ని. జార్జి ఊపిరి అందక విలవిల్లాడుతున్నాడు. ‘ఐ కాంట్ బ్రీత్. లీవ్ మీ’ అంటున్నాడు. పోలీస్ ఆఫీసర్ వినడం లేదు. దారుణం అనిపించింది డార్నెల్లాకు. వెంటనే తన సెల్ ఫోన్ తీసి షూట్ చేయడం మొదలు పెట్టింది. జరుగుతున్న ఒక అన్యాయాన్ని మాత్రమే తను షూట్ చేస్తున్నానని అనుకుంది కానీ.. నల్లజాతిపై అమెరికన్ల జాత్యహంకారానికి వ్యతిరేకంగా అప్పటికే కొనసాగుతున్న ‘బ్లాక్ లైవ్స్ మేటర్’ అనే ఒక ఉద్యమానికి తనొక చోదకశక్తి కాబోతున్నానని అప్పుడు ఆమె అనుకోలేదు. చివరికి నేరస్థుడైన ఆ పోలీస్ ఆఫీసర్ కు శిక్ష పడేందుకు కూడా డార్నెల్లానే కారణం అయింది. అయితే కోర్టు తీర్పును డార్నెల్లా.. జార్జి ఫ్లాయిడ్‌కి జరిగిన న్యాయంగానే చూస్తోంది తప్ప, పోలీస్ ఆఫీసర్‌కు పడిన శిక్షగా కాదు. ‘‘థ్యాంక్యూ గాడ్. థ్యాంక్యూ థ్యాంక్యూ థ్యాంక్యూ. జార్జి ఫ్లాయిడ్.. నీకు న్యాయం జరిగింది’’ అని బుధవారం ఆమె తన ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. జార్జి ఫ్లాయిడ్‌ను మోకాలితో తొక్కుతున్న పోలీస్ అధికారి డెరెక్ చావిన్. ఇతడిపై నేరం రుజువైంది. ఏడాది క్రితం జార్జి ఫ్లాయిడ్ ఊపిరిపోతున్న క్షణాలను చిత్రీకరించిన రోజు డార్నెల్లాకు ఆ రాత్రి నిద్రపట్టలేదు. బాగా పొద్దుపోయేవరకు మేల్కొని ఆలోచిస్తూనే ఉంది. ఆమె హృదయం ఆక్రోశిస్తోంది. ఆమె నేత్రాలు వర్షిస్తున్నాయి. ఆమె పిడికిళ్లు బిగుసుకుంటున్నాయి. పోలీసులైతే మాత్రం ఇంత అమానుషమా అనిపించింది. తను తీసిన వీడియోను ఏం చేయాలో తోచలేదు. కళ్ల ముందే ఒక మనిషి చనిపోవడాన్ని తీసిన వీడియో అది! అది తన దగ్గరుంది. కొన్ని గంటల మౌనం తర్వాత ఫేస్ బుక్ ఓపెన్ చేసి వీడియోను అప్లోడ్ చేసింది. ‘‘ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను’’ అని రెండు ముక్కలు రాసింది. కొన్నాళ్ల వరకు ఆ వీడియోను ఎవరూ నమ్మలేదు. జార్జి ఫ్లాయిడ్ మరణానంతరం నల్లజాతి ఉద్యమకారులు ఆయనపై వేసిన పోస్టర్లలో ఒకటి. అది నిజం అని తెలిశాక ఒక్కసారిగా ప్రఖ్యాత అమెరికన్ న్యూస్ చానళ్లు సి.ఎన్.ఎన్., ఎ.బి.సి., ఫాక్స్, ఎన్.బి.సి., సి.బి.ఎస్. డార్నెల్లా కోసం వచ్చాయి. ఆ వీడియో రేపిన భావోద్వేగాలు అమెరికాలోని యాభై నగరాలలో, ప్రపంచ దేశాలలో జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమానికి ఆజ్యం అయ్యాయి. ఐక్యరాజ్య సమితి సైతం జార్జి ఫ్లాయిడ్ హత్యోదంతాన్ని నిరాకరించ తగని, నిర్లక్ష్యం చేయకూడని పరిణామంగా పరిగణించింది. నల్లజాతి ఉద్యమ భాషలో నిప్పు రవ్వ అని జార్జి ఫ్లాయిడ్ ను అంటున్నాం కానీ.. నిప్పులా ఉద్యమాన్ని రాజేసింది మాత్రం డార్నెల్లా ప్రేజరేనన్నది కాదనలేని సత్యం. లేత మనసుకు అయిన గాయం కన్నీటిగా ఉబికి, జ్వలించింది. ఉద్యమజ్వాల అయింది. తాజాగా కోర్టు తీర్పు రాగానే అమెరికా అధ్యక్షుడు జార్జి బైడెన్ ‘బ్రేవ్ యంగ్ ఉమన్’ అని డార్నెల్లాను అభినందించారు! -
ఆ పోలీసు అధికారి దోషి
వాషింగ్టన్: అమెరికా సహా ప్రపంచ దేశాల్లో సంచలనం సృష్టించిన ఆఫ్రికన్ అమెరికాన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో మాజీ పోలీసు అధికారి డెరెక్ చౌవిన్‌ను దోషిగా తేలుస్తూ స్థానిక కోర్టు తీర్పు చెప్పింది. 12 మంది జ్యూరీ సభ్యులున్న కోర్టు ఈ ఘటనను ఉద్దేశపూర్వకంగా చేయని సెకండ్ డిగ్రీ మర్డర్, థర్డ్ డిగ్రీ మర్డర్ అని మంగళవారం వెలువరించిన తీర్పులో పేర్కొంది. చౌవిన్ బెయిల్‌ని రద్దు చేసింది. మూడు వారాల పాటు 45 మంది సాక్షుల్ని విచారించిన కోర్టు సోమవారం 10 గంటలకు పైగా తుది విచారణ జరిపింది. అయితే శిక్షను న్యాయస్థానం వాయిదా వేసింది. న్యాయమూర్తి పీటర్ కాహిల్ 8 వారాల్లో శిక్ష ఖరారు చేసే అవకాశం ఉందని వెల్లడించారు. కాగా అమెరికా చట్టాల ప్రకారం చౌవిన్‌కు 40 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి. తీర్పు వెలువరించిన సమయంలో డెరెక్ చౌవిన్‌కు ముఖానికి సర్జికల్ మాస్కు ధరించి ఉండడంతో అతని ముఖంలో భావాలేవీ బయటకు రాలేదు. మరోవైపు ఫ్లాయిడ్ మృతితో జాతి వివక్షకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమించిన వారు, ఫ్లాయిడ్ మద్దతు దారులు న్యాయస్థానం తీర్పు చెప్పినప్పుడు కోర్టు హాలు బయటే వేచి ఉన్నారు. తీర్పు వెలువడగానే పెద్ద పెట్టున హర్షాతిరేకాలు చేశారు. అతనికి ఉరిశిక్ష వేయాలంటూ నినదించారు. ఈ తీర్పు ఓ ముందడుగు: బైడెన్ జాతి వివక్షకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న పోరాటంలో ఈ తీర్పు అతి పెద్ద ముందడుగు అవుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. తీర్పు వచ్చిన తర్వాత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో కలిసి వైట్ హౌస్నుంచి ఆయన మాట్లాడారు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలకి కాంగ్రెస్ సభ్యులందరూ ఇంకా కృషి చేయాలన్నారు. ‘‘ఈ తీర్పు చాలదు. మనం ఇక్కడితో ఆగిపోకూడదు. అయితే న్యాయవ్యవస్థలో ఇదో పెద్ద ముందడుగు’’అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఫ్లాయిడ్ కుటుంబ సభ్యులతో మాట్లాడిన బైడెన్ ఎంతో కొంత న్యాయం జరిగిందన్నారు. ఈ తీర్పు తో తాను ఊరట పొందానని అన్నారు. ఐ కాంట్ బ్రీత్ అన్న జార్జ్ ఫ్లాయిడ్ ఆఖరి మాటలు అందరూ గుర్తుంచుకోవాలన్నారు. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఇది కేవలం నల్లజాతీయుల సమస్య కాదని, ప్రతీ అమెరికన్ సమస్యని అన్నారు. అందరికీ న్యాయం అని తాము కంటున్న కలల్ని జాతి వివక్ష దూరం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఊపిరి పీల్చుకున్నాం : ఫ్లాయిడ్ సోదరుడు పోలీసు అధికారి డెరెక్ చౌవిన్‌ను న్యాయస్థానం దోషిగా తేల్చడంతో తామంతా ఊపిరిపీల్చుకున్నామని ఫ్లాయిడ్ సోదరుడు ఫిలోనైస్ అన్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన అనుకూలంగా తీర్పు వచ్చినా జాతివివక్షకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఊపిరి ఆడట్లేదు... కాలు తీయండి నల్లజాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్ మిన్నియాపాలిస్‌లోని ఒక దుకాణంలో నకిలీ 20 డాలర్ల నోటుతో సిగరెట్లు కొనుగోలు చేశాడన్న ఆరోపణలు వచ్చాయి. ఆ దుకాణంలో పని చేసే ఉద్యోగి ఫిర్యాదు మేరకు పోలీసు అధికారిగా ఉన్న శ్వేతజాతీయుడు డెరెక్ చౌవిన్ 2020, మే 25 రాత్రి ఫ్లాయిడ్‌ను అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు అత్యంత కర్కశంగా వ్యవహరించాడు. 46 ఏళ్ల వయసున్న ఫ్లాయిడ్‌ను రోడ్డుమీదకి ఈడ్చుకొచ్చాడు. తన మోకాలితో ఫ్లాయిడ్ మెడపై గట్టిగా నొక్కి పెట్టి ఉంచాడు. ఫ్లాయిడ్ ఊపిరి ఆడడం లేదంటూ ఎంత మొరపెట్టుకున్నా చౌవిన్ కర్కశ హృదయం కరగలేదు. తొమ్మిది నిమిషాలు పైగా అలా తొక్కి పెట్టి ఉంచాడు. దీంతో ఫ్లాయిడ్ గిలగిల కొట్టుకుంటూ ప్రాణాలు వదిలాడు. దీనికి సంబంధించిన వీడియో బయటకి రావడంతో ప్రజలు ఆగ్రహోద్రిక్తులయ్యారు. ‘‘ఐ కాంట్ బ్రీత్. ఐ కాంట్ బ్రీత్’’అన్న ఫ్లాయిడ్ చివరి మాటలు విన్న వారి హృదయాలు కరిగి నీరయ్యాయి. -
జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో దోషిగా డెరిక్ చౌవిన్
-
నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో అమెరికా కోర్టు తీర్పు
-
జార్జ్ ఫ్లాయిడ్ హత్యకేసు: అతడే దోషి
వాషింగ్టన్: అమెరికాలో సంచలనం సృష్టించిన జార్జ్ ఫ్లాయిడ్ మృతి కేసులో ప్రధాన నిందితుడైన పోలీస్ అధికారి డెరెక్ చౌవిన్‌ను స్థానిక కోర్టు దోషిగా తేల్చింది. ఈ మేరకు మంగళవారం తీర్పు వెలువరించింది. ఏడుగురు మహిళలు, ఐదుగురు పురుషులతో కూడిన జ్యూరీ మూడువారాల పాటు విచారణ జరిపి మూడు కేసుల్లో అతడిని దోషిగా నిర్దారించింది. సెకండ్ డిగ్రీ మర్డర్, థర్డ్ డిగ్రీ మర్డర్, ఊపిరాడకుండా చేసి చంపేయడం వంటి నేరాలు నిరూపితమైనట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో, హెనెపిన్ కౌంటీ జడ్జీ పీటర్ చాహిల్, డెరెక్‌ను దోషిగా తేలుస్తూ ఏకగ్రీవ తీర్పును వెలువరించారు. కాగా స్థానిక చట్టాల ప్రకారం అతడికి 40 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ తీర్పు కోసం ఎంతోకాలంగా నిరీక్షిస్తున్న జార్జ్ ఫ్లాయిడ్ మద్దతుదారులు, జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడే వారు కోర్టు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఫ్లాయిడ్ సోదరుడు సీఎన్ఎన్తో మాట్లాడుతూ... ‘ఈ క్షణం తను జీవించిలేకపోవచ్చు. కానీ ఎల్లప్పుడూ నాలోనే ఉంటాడు’ అంటూ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ తీర్పు తమలాంటి ఎంతో మంది బాధితులకు ఊరటనిస్తుందని పేర్కొన్నాడు. కాగా గతేడాది మే 25న మినియాపోలిస్‌లో డెరెక్ చౌవిన్ అనే శ్వేతజాతీయ పోలీస్, ఆఫ్రో- అమెరికన్ జార్జ్‌ను అరెస్ట్ చేసే క్రమంలో అతడి గొంతుపై గొంతుపై మోకాలితో తొక్కిపెట్టగా, ఊపిరి ఆడక మరణించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో జార్జ్ ప్లాయిడ్‌కు మద్దతుగా వేలాదిమంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేయడంతో, అగ్రరాజ్యంలో ఆందోళనలు మిన్నంటాయి. జార్జ్ మృతికి కారణమైన చౌవిన్‌ను వెంటనే ఉరి తీయాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో చౌవిన్‌తోపాటు మరో ముగ్గురు అధికారులపై కేసు నమోదు కాగా బెయిలుపై విడుదలయ్యారు. అయితే, ప్రధాన నిందితుడైన డెరెక్‌ను దోషిగా నిర్దారిస్తూ కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా న్యాయస్థానం ప్రాంగణంలో భద్రత కట్టుదిట్టం చేశారు. చదవండి: రెబల్స్‌తో పోరు.. చాద్ అధ్యక్షుడి దారుణ హత్య -
జార్జి ఫ్లాయిడ్ కుటుంబానికి 196 కోట్ల పరిహరం
మినియాపొలిస్: అమెరికాలో తీవ్ర అలజడులకు, నిరసనలకు కారణమైన జార్జి ఫ్లాయిడ్ మరణ ఉదంతంలో మరో పరిణామం చోటుచేసుకుంది. నల్లజాతీయుడైన బాధితుడి కుటుంబానికి 27 మిలియన్ డాలర్ల (సుమారు రూ.196 కోట్లు) భారీ మొత్తాన్ని పరిహారంగా చెల్లించేందుకు మినియాపొలిస్ నగర కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఫ్లాయిడ్ కుటుంబ న్యాయవాది బెన్ క్రంప్ తాజా పరిణామంపై స్పందిస్తూ.. కేసు విచారణకు ముందు జరిగిన అతి పెద్ద సెటిల్మెంట్ ఇదేనన్నారు. ఈ సెటిల్మెంట్కు ఫ్లాయిడ్ కుటుంబం ఒప్పుకుందని కూడా ఆయన చెప్పారు. ఫ్లాయిడ్ మృతికి కారకులైన చౌవిన్, ఇతర మాజీ పోలీసులపై కోర్టులో కొనసాగుతున్న విచారణకు ఈ పరిణామానికి ఎలాంటి సంబంధం లేదని న్యాయ నిపుణులు అంటున్నారు. 2020 మే 25వ తేదీన డెరెక్ చౌవిన్ అనే పోలీసు అధికారి అనుమానంతో జార్జిఫ్లాయిడ్‌ను కిందపడేసి మెడపై తొమ్మిది నిమిషాల పాటు మోకాలితో నొక్కి ఉంచడంతో ఊపిరాడక చనిపోయిన ఘటన అమెరికాలో ఆగ్రహ జ్వాలకు కారణమైంది. -
ఆ వీడియో లేకపోతే... నిజం తెలిసేది కాదు!!
న్యూయార్క్: యావత్ ప్రపంచాన్ని కుదిపేసిన అమెరికా నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణాన్ని వెలుగులోకి తెచ్చిన యువతికి ప్రతిష్టాత్మక అవార్డు దక్కనుంది. జార్జ్ ఫ్లాయిడ్ పై పోలీసుల జాత్యహంకార హత్య ఘటనను చిత్రీకరించిన డార్నెల్లా ఫ్రాజియర్(17) బెనెన్సన్ కరేజియస్ సాహసోపేత అవార్డుకు ఎంపికయ్యారు. డార్నెల్లా సాహసానికి,తెగువకుగాను ఈ పురస్కారాన్ని అందజేయనున్నట్టు అమెరికాలోన ప్రముఖ సాహిత్య, మానవ హక్కుల సంస్థ పెన్ బుధవారం వెల్లడించింది. (అమెరికా ఆత్మను తట్టిలేపిన జార్జ్) ధైర్యంతో, కేవలం ఒక ఫోన్ ద్వారా డార్నెల్లా అమెరికా చరిత్రనే మార్చేసిందని పెన్ అమెరికా సీఈఓ సుజాన్ నోసెల్ వెల్లడంచారు. ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా.. ఎంతో ధైర్యంగా ఆమె ఈ వీడియోను తీసి ఉండకపోతే.. జార్జ్ ఫ్లాయిడ్ హత్య గురించి ప్రపంచానికి ఎప్పటికీ నిజం తెలిసి ఉండేది కాదన్నారు. తద్వారా జాతివివక్ష, హింసను అంతం చేయాలని కోరుతూ సాహసోపేతమైన ఉద్యమానికి నాంది పలికారని ప్రశంసించారు. డిసెంబర్ 8న వర్చువల్ గాలా సందర్భంగా ఆమెకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఈ ఏడాది మే 25న మిన్నెపొలిస్‌లో తెల్ల పోలీసు అధికారుల చేతిలో ఆఫ్రో-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. దాదాపు పది నిమిషాల పాటు మోకాళ్లతో జార్జ్ ఫ్లాయిడ్ మెడను అదిమి పెట్టడంతో ఊపిరాడక అతడు మరణించాడు. అయితే, ఈ దుర్మార్గాన్ని డార్నెల్లా తన ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. దీంతో అమెరికాతో సహా ప్రపంచ వ్యాప్తంగా శ్వేతజాతి దురహంకారంపై నిరసనలు వెల్లువెత్తాయి. ఐ కాంట్ బ్రీత్ అంటూ రోదించిన జార్జ్‌ఫ్లాయిడ్ చివరి మాటలే నినాదంగా అమెరికన్ యువత పోరు బాట పట్టింది. అలాగే 'బ్లాక్ లైవ్స్ మేటర్' అంటూ జాతి వివక్షపై ఉద్యమం రాజుకున్న సంగతి విదితిమే. -
1 మిలియన్ డాలర్ల పూచీకత్తుపై బెయిలు
వాషింగ్టన్: అమెరికాలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన ఆఫ్రో- అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతి కేసులో ప్రధాన నిందితుడైన పోలీస్ అధికారి డెరెక్ చౌవిన్‌కు బెయిలు మంజూరైంది. మిలియన్ డాలర్ల పూచీకత్తుతో స్థానిక కోర్టు అతడికి జైలు నుంచి విముక్తి కల్పించింది. కాగా మే 25న మినియాపోలిస్‌లో డెరెక్ ఛావెన్ అనే శ్వేతజాతీయుడైన పోలీస్, జార్జ్‌ను అరెస్ట్ చేసే క్రమంలో అతడి గొంతుపై గొంతుపై మోకాలితో తొక్కిపెట్టగా, ఊపిరి ఆడక అతడు మరణించిన విషయం తెలిసిందే. (చదవండి: లవ్ యూ.. నేను చచ్చిపోతున్నా: ఫ్లాయిడ్ చివరి క్షణాలు) ఈ నేపథ్యంలో నల్ల జాతీయుడు జార్జ్ ప్లాయిడ్‌కు మద్దతుగా వేలాదిమంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేయడంతో, అగ్రరాజ్యం ఆందోళనలతో అట్టుడికిపోయింది. జార్జ్ మృతికి కారణమైన చౌవిన్‌ను వెంటనే ఉరి తీయాలంటూ ఆందోళనకారులు నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చారు. ఈ క్రమంలో చౌవిన్‌తోపాటు మరో ముగ్గురు అధికారులపై కేసు నమోదైంది. ఇక ఈ నేరం రుజువైతే వాళ్లకు 12 ఏళ్ల వరకు జైలు శిక్షపడే అవకాశముండగా.. చౌవిన్ బుధవారం బెయిలుపై విడుదలయ్యాడు. -
గాంధీజీ విగ్రహాన్నీ వదల్లేదు
వాషింగ్టన్: నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణానంతరం హింసాకాండకు పాల్పడిన నిరసనకారులను ‘బందిపోటు ముఠా’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. చివరకు వారు, వాషింగ్టన్ డీసీలోని మహాత్మాగాంధీ విగ్రహాన్నీ విడిచిపెట్టలేదన్నారు. శ్వేతజాతి పోలీసు అధికారి డెరెక్ చౌవిన్ మే 25న జార్జ్ ఫ్లాయిడ్ మెడపైన మోకాలితో తొక్కిపట్టగా, ఊపిరాడక ఫ్లాయిడ్ మరణించారు. ఈ విషయం వీడియో ద్వారా వెలుగులోకి వచ్చింది. దీనిపై అమెరికాలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. కొందరు ఆందోళనకారులు దేశవ్యాప్తంగా విధ్వంసానికి పాల్పడ్డారు. దీనిపై, అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా మిన్నెసోటాలో ట్రంప్ మాట్లాడారు. ఆందోళనకారులను ఉద్దేశించి ‘వారు అబ్రహం లింకన్ విగ్రహాన్ని కూల్చివేశారు. గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. వారు ఏం చేస్తున్నారో వారికే తెలియలేదు. మన గత చరిత్రని వారు ధ్వంసం చేస్తున్నారు. నేను అధికారంలో ఉన్నంత కాలం అమెరికా చరిత్రను వారేమీ చేయలేరు’ అని వ్యాఖ్యానించారు. అందుకే విగ్రహాల విధ్వంసానికి పాల్పడే వారికి పదేళ్ళు జైలు శిక్ష విధించేలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌పై సంతకం చేసినట్లు ట్రంప్ వెల్లడించారు. దీంతో విగ్రహాల విధ్వంసం ఆగిపోయిందని ట్రంప్ అన్నారు. కూల్చి వేసిన గాంధీ విగ్రహాన్ని భారత ఎంబసీ సాయంతో పునర్నిర్మించినట్టు తెలిపారు. -
'గాయాలు బాధిస్తున్నాయి.. కానీ బతకాలనుంది'
-
'గాయాలు బాధిస్తున్నాయి.. కానీ బతకాలనుంది'
న్యూయార్క్ : 'ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుంది.. నా వీపుకు తగిలిన గాయాలు నన్ను బాధిస్తున్నాయి.. రోజులో ఉండే 24 గంటలు కేవలం నొప్పిని మాత్రమే గుర్తు చేస్తున్నాయి.. అయినా సరే నాకు బతకాలనిపిస్తుంది.. ఎందుకంటే నేను జీవితంలో సాధించాల్సి చాలా ఉంది.. అంటూ జాకబ్ బ్లాక్ అనే నల్ల జాతీయుడు షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అమెరికాలో జాతి వివక్ష గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొన్ని దశాబ్దాలుగా నల్లజాతీయులు అక్కడి తెల్ల జాతీయుల చేతిలో జాత్యంహకారానికి బలవుతూనే ఉన్నారు. జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతం అమెరికాను అట్టుడికేలా చేసింది. ఇప్పటికి నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినా నల్ల జాతీయులపై దాడులు ఆగడం లేదు. (చదవండి : మరో నల్లజాతీయుడిని కాల్చి చంపిన పోలీసులు) ఇదే కోవలో ఆగస్టు 23న విస్కాన్సిన్ నగరానికి కూతవేటు దూరంలో ఉన్న కెనోషా అనే ప్రాంతంలో 29 ఏళ్ల జాకబ్ బ్లేక్స్ అనే వ్యక్తి ఇంటికి వెళదామని తన కారు దగ్గరకు వచ్చాడు. ఇంతలో తెల్లజాతీయులైన ఇద్దరు పోలీసులు వచ్చి జాకబ్ బ్లేక్‌ను అడ్డుకొని ఏదో అడిగారు. ఆ తర్వాత అతన్ని కిందపడేసి విచక్షణారహితంగా కొట్టారు. అనంతరం తుపాకీతో ఏడు నుంచి ఎనిమిది బులెట్లను జాకబ్ వీపులోకి కాల్చారు. బులెట్ల దాటికి అతని శరీరం చిద్రమైంది. ఆ సమయంలో జాకబ్ ముగ్గురు పిల్లలు కారులోనే ఉన్నారు. క్షణాల్లో చోటుచేసుకున్న ఈ ఉదంతంతో అక్కడున్నవారు ఆశ్చర్యపోయారు. వెంటనే బ్లేక్‌ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం జాకబ్ బ్లేక్ కదల్లేని స్థితిలో పడి ఉన్నాడు. బులెట్ల దాటికి వీపు భాగం మొత్తం దెబ్బతింది. బ్లేక్ కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని డాక్టర్లు పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆసుపత్రి బెడ్‌పై నుంచే ప్రపంచానికి తన బాధను చెప్పుకోవాలని బ్లేక్ అనుకున్నాడు. డాక్టర్ల సహాయంతో తన మాటలను ఒక వీడియో రూపంలో విడుదల చేశాడు. 'నాకు ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది... 24 గంటలు నొప్పిని మాత్రమే చూస్తున్నా.. తిండి తినాపించడం లేదు.. నిద్ర రావడం లేదు.. జీవితం చాలా విలువైనది.. అందుకే నేను బతకాలి.. నా కుటుంబసభ్యులను కలుసుకోవాలి.. అందుకే ఒకటి చెప్పదలచుకున్నా.. మీ జీవితాలను మార్చుకోండి... ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో చెప్పలేం.. బతికినంత కాలం డబ్బు సంపాధించడంతో పాటు మనుషులను ప్రేమించడం అలవాటు చేసుకోండి.. ఇవన్నీ ఇప్పుడు నేను అనుభవించే స్థితిలో లేను' అంటూఉద్వేగంతో చెప్పుకొచ్చాడు.(చదవండి : నావల్నీ విషప్రయోగం కేసుపై రష్యా స్పందన) జాకబ్ బ్లేక్ పలికిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బ్లేక్‌కు మద్దతుగా విస్కాన్సిన్ నగరంలో పౌరులు ఆందోళనలు చేస్తున్నారు. బ్లేక్‌కు న్యాయం జరగాలంటూ నినాదాలు చేస్తున్నారు. అయితే జాకబ్‌ను కాల్చిన పోలీసులను విస్కాన్సిన్ సిటీ పోలీస్ విధుల నుంచి తొలగించింది. సస్పెండ్ చేస్తే చాలదని.. వారికి తగిన శిక్ష వేయాలంటూ అక్కడి ప్రజలు కోరుతున్నారు. -
మరో నల్లజాతీయుడిని కాల్చి చంపిన పోలీసులు
వాషింగ్టన్ డీసీ: అమెరికాలో మరోసారి ఒక నల్లజాతీయుడిని పోలీసులు కాల్చి చంపారు. ఇందుకు సంబంధించిన బాడీ కెమెరా ఫుటేజీలను పోలీసులు విడుదల చేశారు. 18 ఏళ్ల డియోన్ కే అనే యువకుడిని పోలీసులు వెంబడించి అతని ఛాతీలో కాల్చారు. అతనిని ఒక వీధి రౌడీగా పోలీసులు పేర్కొన్నారు. ఈ వీడియోలో పోలీసులు ఒక అపార్ట్మెంట్ దగ్గరకు కారులో వెళతారు. అప్పుడు అక్కడి నుంచి ఒక వ్యక్తి పరిగెడుతూ కనిపిస్తాడు. అతడిని వెంటాడిన ఒక పోలీసు అధికారి అతని ఛాతీలో కాలుస్తాడు. వెంటనే అతను కింద పడిపోతాడు. అక్కడ కొంచెం సేపు వీడియో బ్లర్‌గా కనిపిస్తోంది. తరువాత కొంతసేపు వీడియో ఆగిపోతుంది. తరువాత డియోన్ కే తన చేతిలో ఉన్న గన్ను దూరంగా విసురుతాడు. అది దూరంగా ఉన్న గడ్డిలో పడుతుంది. ఇంకో పోలీస్ ఆఫీసర్ గడ్డిలో ఆ గన్ కోసం వెతుకుతాడు. అయితే ఆ గన్ కెన్ ఉన్న ప్రదేశం నుంచి 96 మీటర్ల దూరంలో పడిందని, అంత దూరం పడటం అసాధ్యమని కొంత మంది తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. డియోన్ కే చేతిలో ఆ గన్ ఎందుకు ఉంది, దానిని ఉపయోగించి పోలీసులపై దాడి చేయాలనుకున్నాడా లేదా గన్ను విసిరేయాలనుకున్నాడా అన్నది ఆ వీడియోలో స్పష్టంగా తెలియడం లేదు. నల్లజాతీయుల మీద దాడులకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో చట్టాలలో కొన్ని మార్పులు తెచ్చారు. అయినప్పటికీ ఇలాంటి సంఘటనలు జరగడంతో పలువురు నల్లజాతీయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. యువకుడిని కాల్చి చంపిన పోలీసు అధికారిని 2018 లో డిపార్ట్మెంట్లో చేరిన అలెగ్జాండర్ అల్వారెజ్గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతనిని అడ్మినిస్ట్రేటివ్ సెలవులో ఉంచారు. కేసును విచారిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడిని చంపడంతో అమెరికాలో గతంలో నిరసనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. చదవండి: పోలీసు సంస్కరణలకు ట్రంప్ ఓకే -
చుట్టుముట్టి కాల్చి చంపారు!
-
ఘోరం: చుట్టుముట్టి కాల్చి చంపారు!
వాషింగ్టన్: అమెరికాలో నల్లజాతీయులపై పోలీసుల తుపాకీ గుళ్ల వర్షం కొనసాగుతోంది. జార్జ్ ఫ్లాయిడ్ కాల్చివేతపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన జ్వాలలు ఎగిసినా పోలీసుల దుందుడుకు చర్యలు తగ్గడం లేదు. తాజాగా మరో నల్లజాతీయుడిని పోలీసులు కాల్చి చంపారు. మృతున్ని ట్రేఫోర్డ్ పెల్లెరిన్గా గుర్తించారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి లుసియానాలోని లఫయెట్టే ప్రాంతంలో చోటుచేసుకుంది. బెన్ క్రంప్ అనే పౌర హక్కుల న్యాయవాది దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్ అయింది. (చదవండి: బ్రిటన్‌లో మరో జార్జ్ ఫ్లాయిడ్!) ‘ఓ నల్ల జాతీయుడిని చట్టుముట్టిన పోలీసులు అతనిపై కాల్పులు జరిపి పొట్టనబెట్టుకున్నారు. దాదాపు 10 రౌండ్ల కాల్పులు జరిపారు. మారణాయుధం (కత్తి) ధరించిన సదరు వ్యక్తి తమ మాటల్ని లెక్కచేయకుండా ముందుకు వెళ్లడంతో కాల్పులు జరిపామని పోలీసులు చెప్పడం అత్యంత అమానవీయం. కత్తిని కలిగి ఉంటే చంపేస్తారా?’అని ఆయన ట్విటర్లో బెన్ క్రంప్ పేర్కొన్నారు. కాగా, జార్జ్ ఫ్లాయిడ్ కుటుంబం తరపున ఆయన కోర్టులో వాదిస్తున్నారు. (చదవండి: ట్రంప్ నిజంగా మూర్ఖుడు.. అబద్దాల కోరు) -
బ్రిటన్‌లో మరో జార్జ్ ఫ్లాయిడ్!
లండన్: యావత్ ప్రపంచాన్ని కుదిపేసిన అమెరికా నల్లజాతీయుడు జార్జ్‌ఫ్లాయిడ్ మరణంతో ‘ఐ కాంట్ బ్రీత్’ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఆ తరహా ఘటన బ్రిటన్‌లో జరిగింది. బ్రిటన్‌లోని ఇస్లింగ్టన్ ప్రాంతంలో ఓ నల్లజాతీయుడు కత్తి కలిగి ఉన్నాడనే నెపంతో ఇద్దరు పోలీసు అధికారులు నట్టనడి వీధిలో, ప్రజలంతా చూస్తుండగానే అతని చేతులకు బేడీలు వేసి, గొంతుపై కాలువేసి ఊపిరిసలపకుండా చేశారు. ఆ వ్యక్తి తన మెడపై కాళ్ళు తీయమని పదే పదే వేడుకున్నాడు. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో గుమిగూడిన జనం దీన్ని నిరసిస్తూ ఆ నల్లజాతీయుడిని రక్షించేందుకు పూనుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అందుకు కారణమైన ఒక స్కాట్లాండ్ యార్డ్ పోలీసు అధికారిని సస్పెండ్ చేశారు. మరో పోలీసు అధికారిని విధుల నుంచి తప్పించారు. జనం అడ్డుకోకపోతే ఇతడిని జార్జ్ ఫ్లాయిడ్‌ని చంపినట్టే చంపేసేవారని ప్రత్యక్ష సాక్షులు మీడియాతో చెప్పారు. -
కిందపడేసి మెడ మీద మోకాలు పెట్టి..
లండన్: అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ మృతి తర్వాత ‘బ్లాక్‌లైవ్స్ మ్యాటర్’ ఉద్యమం ఉధృతంగా కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి లండన్‌లో చోటు చేసుకుంది. పోలీసు అధికార్లు మారణాయుధాన్ని కలిగి ఉన్నాడనే నెపంతో ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఓ అధికారి అతడిని కిందపడేసి మెడ మీద మోకాలు పెట్టి కూర్చున్నాడు. దాంతో ఆ వ్యక్తి ‘నా మెడ మీద నుంచి లేవండి’ అంటూ వేడుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో బ్రిటీష్ పోలీసులు ఇందుకు బాధ్యులైన వారిలో ఒక అధికారిని సస్పెండ్ చేశారు. మరొకరిని విధుల నుంచి తొలగించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ‘పోలీసు శిక్షణలో మేం ఇలాంటి పద్దతులను బోధించలేదు. ఇప్పుడు వీరు ఉపయోగించే పద్దతులు చూస్తే నాకు చాలా ఆందోళన కల్గుతుంది’ అన్నారు. (‘అలాంటి వారికి ట్రంప్ తోడయ్యారు’) -
నా పిల్లలకు చెప్పు వాళ్లని ప్రేమిస్తున్నానని
వాషింగ్టన్: అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతం ఎంతటి ప్రకంపనలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెల్లజాతి పోలీసు కాళ్ల కింద నలిగిపోయి, ఊపిరాడక తుదిశ్వాస విడిచిన జార్జ్ ఫ్లాయిడ్‌కు సంబంధించి ఓ ఆడియో టేప్ బుధవారం రిలీజైంది. దీని ప్రకారం.. అతను ప్రాణాలు విడిచే కొద్ది క్షణాల ముందు తనన చంపవద్దంటూ అధికారులను పదేపదే వేడుకున్నాడు. మరోవైపు అతను పోలీసులను చూసి వణికిపోతూనే వారికి సహకరించాడు. కారు నుంచి కింద పడేసే క్రమంలో అతని నోటి నుంచి రక్తం వచ్చినట్లు కనిపిస్తోంది. అయినప్పటికీ అవేమీ పట్టించుకోని పోలీస్ ఆఫీసర్ డెరెక్ చావిన్ అతని మెడపై మోకాలితో గట్టిగా అదుముతూ క్రూరత్వం ప్రదర్శించాడు. దీంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారిన అతను తనకు కరోనా ఉందని, చచ్చిపోతానేమోనని భయంగా ఉందన్నాడు. "నువ్వు మాట్లాడగలుగుతున్నావ్.. కాబట్టి బాగానే ఉన్నావ్లే" అంటూ సదరు పోలీసు కాఠిన్యంగా మాట్లాడాడు. (జాతి వివక్ష అంతమే లక్ష్యం) 'ఆక్సిజన్ ఎక్కువగా తీసుకుంటున్నందున ఈ మాత్రమైనా మాట్లాడుతున్నా'నని సమాధానమిస్తూనే సాయం చేయమని అర్థించాడు. అప్పటికీ ఆ పోలీసు వెనక్కు తగ్గకపోవడంతో "వీళ్లు నన్ను చంపబోతున్నారు, నన్ను చంపేస్తారు" అంటూ ఆర్తనాదాలు చేశాడు. "మామా.. ఐ లవ్ యూ... నా పిల్లలకు చెప్పు వాళ్లంటే నాకు ఎంతో ప్రేమ" అని చెప్పాడు. అనంతరం కొన్ని క్షణాల్లోనే అతని ప్రాణం గాల్లో కలిసిపోయింది. జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు మిన్నియా పోలీసులు అలెగ్జాండర్ కుంగ్, థామస్ లేన్ దగ్గర లభ్యమైన కెమెరాల ద్వారా ఈ ఆడియో క్లిప్ వెలుగులోకి వచ్చింది.ఈ కేసులో వీరితోపాటు చావిన్, టై థావో నిందితులుగా ఉన్నారు. మే 25న పోలీస్ అధికారి ఫ్లాయిడ్ మెడపై సుమారు ఎనిమిది నిమిషాల 46 సెకన్లపాటు మోకాలిని నొక్కిపెట్టి ఉంచడంతో అతడు మరణించిన విషయం తెలిసిందే. (జార్జ్ ఫ్లాయిడ్‌కు ఘన నివాళి ) -
‘అలాంటి వారికి ట్రంప్ తోడయ్యారు’
వాషింగ్టన్: సామాజిక అంశాల పట్ల గళమెత్తే ఉదారవాదులను అణచివేసేందుకు ప్రయత్నించే కొన్ని వర్గాలకు అమెరికా అధ్యక్షుడి స్థానంలో ఉన్న శక్తిమంతమైన వ్యక్తులు తోడయ్యారని పలువురు రచయితలు, విద్యావేత్తలు డొనాల్డ్ ట్రంప్‌ను విమర్శించారు. అలాంటి వారితో ప్రజాస్వామ్యానికి పెను ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగించేలా వ్యవహరించే వారిని ఉపేక్షించకూడదని.. అయితే ఏకాభిప్రాయం కుదరనంత మాత్రాన లిబరల్స్ మధ్య విభేదాలు తలెత్తడం విచారకరమన్నారు. ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన జేకే రౌలింగ్, సల్మాన్ రష్దీ, మార్గరెట్ అట్వుడ్ వంటి దాదాపు 150 మంది రచయితలు సంతకం చేసిన లేఖను ప్రఖ్యాత ‘హార్పర్స్ మ్యాగజీన్’ మంగళవారం ప్రచురించింది.(మెలానియా విగ్రహం ధ్వంసం) ఆఫ్రో- అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ పోలీసుల చేతిలో దారుణ హత్యకు గురైన నేపథ్యంలో అమెరికాలో వెల్లువెత్తిన నిరసనలు, పోలీసు వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలనే డిమాండ్లు సహా ఇతర సామాజిక అంశాలపై ధైర్యంగా పోరాడుతున్న వారిపై అణచివేత ధోరణి అధికమవుతున్న వేళ ఈ మేరకు పలువురు తమ అభిప్రాయాలను లేఖలో పంచుకున్నారు. స్వేచ్ఛగా అభిప్రాయాలు వెల్లడిస్తున్న వారిపై పెరిగిపోతున్న అసహనం, సెన్సారియస్నెస్(పదే పదే విమర్శించడం) పై ఆందోళన వ్యక్తం చేశారు. (చైనాపై కఠిన చర్యలకు సిద్ధమైన అమెరికా!) ‘‘అభివృద్ధి జరిగినపుడు ప్రశంసించే మేము.. అలా జరగని పక్షంలో గొంతెత్తేందుకు సిద్ధంగా ఉంటాం. ఉదారవాదులపై అక్కసు వెళ్లగక్కే కొన్ని శక్తులకు డొనాల్డ్ ట్రంప్ వంటి వ్యక్తులు తోడయ్యారు. ప్రస్తుత సమాజంలో స్వేచ్ఛగా అభిప్రాయాలు వ్యక్తపరచడం సహా ఆలోచనలు పంచుకోవడం కష్టంగా మారింది. కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. రైట్‌వింగ్ రాడికల్ శక్తులు నైతిక హక్కులు కాలరాసేలా ప్రవర్తిస్తున్నాయి. వాటి కారణంగా మీడియా, కళారంగం వారు స్వేచ్చగా భావాలు వెల్లడించలేకపోతున్నారు. జీవనోపాధి కోల్పోతామనే భయం, కొన్ని ఒప్పందాల కారణంగా జర్నలిస్టులు భయపడాల్సి వస్తోంది. ఇక రచయితలు, ఆర్టిస్టులు ఇప్పటికే అనేక రకాలుగా మూల్యం చెల్లించి ఉన్నారు’’ అని లేఖలో పేర్కొన్నారు. కాగా ఈ లేఖపై కూడా సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన రావడం గమనార్హం. ముఖ్యంగా ట్రాన్స్జెండర్ల పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జేకే రౌలింగ్ కూడా ఈ లెటర్‌పై సంతకం చేయడం విశేషమంటూ పలువురు విమర్శిస్తున్నారు.(హిజ్రాలంటే నాకిష్టం: నటి) -
ఇక నుంచి ‘గ్లో అండ్ లవ్లీ’
సాక్షి, న్యూఢిల్లీ: ‘హిందుస్థాన్ యూనిలివర్’ కంపెనీ నుంచి వెలువడుతున్న ‘ఫేర్ అండ్ లవ్లీ’ అనే ఉత్పత్తి బ్రాండ్ ప్రజల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన విషయం తెల్సిందే. ఈ బ్రాండ్ ప్రచారం కోసం కంపెనీ మొదటి నుంచి ఎన్నో కోట్ల రూపాయలను ఖర్చు పెడుతూ వస్తోంది. తాజాగా ‘ఫేర్ అండ్ లవ్లీ’ పేరును మారుస్తూ హిందూస్తాన్ యూనిలివర్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఫేర్ అండ్ లవ్లీ’ పేరు స్థానంలో ‘గ్లో అండ్ లవ్లీ’తో ఫేర్నెస్ క్రీమ్‌ను మార్కెట్ చేయనున్నట్లు ఆ సంస్థ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికాలో చోటు చేసుక్ను వర్ణవివక్ష హత్య ఉదంతం తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు హిందూస్థాన్ యూనిలివర్ సంస్థ పేర్కొంది. (ఇక ‘ఫెయిర్’కు గుడ్‌బై..) ఇక ‘ఫేర్ అండ్ లవ్లీ’ బ్రాండ్ పేరు నుంచి ఫేర్ అనే పదం మాయం కానుంది. ఫేర్ అనే పదం మనిషి చర్మం తెలుపు రంగును సూచిస్తున్న విషయం తెల్సిందే. హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ తమ ఉత్పత్తుల బ్రాండ్ పేర్ల నుంచి, వాణిజ్య ప్రకటనల నుంచి ఫేర్, ఫేర్నెస్ పదాలతోపాటు ‘వైటెనింగ్, లైటనింగ్’ అనే పదాలను కూడా తొలగించాలని నిర్ణయించింది. ’ఫేర్ అండ్ లవ్లీ’ బ్రాండ్ పేరు నుంచి ఫేర్ పదాన్ని తొలగిస్తానని చెప్పిన కంపెనీ ఆ ఉత్పత్తిని ఉపసంహరించుకుంటున్నట్లు ఎక్కడా తెలియజేయలేదు. చర్మ రంగును తెలుపు చేస్తుందన్న ప్రచారంతోని ఆ కంపెనీ ఆ ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఆ ఉత్పత్తి అలాగే కొనసాగించాలనుకుంటే ‘చర్మ సౌందర్యం కోసం’అని మార్చుకోవచ్చు. అదే విధంగా ‘స్కిన్ వైటెనింగ్’ ఉత్పత్తులను ఉపసంహరించుకొంటున్నామని ప్రముఖ కాస్మోటిక్ కంపెనీ ‘జాన్సన్ అండ్ జాన్సన్’ కూడా ప్రకటించింది. వాటి ఉత్పత్తులకు మరిన్ని మిశ్రామాలను జోడించి, మరింత మెరుగ్గా మరో పేరుతో మార్కెట్లోకి తీసుకొస్తామని ఆ కంపెనీ తెలిపింది. ఆ కంపెనీ ‘చర్మ సౌందర్యం కోసం’ అంటుందా, మరో పేరు పెడుతుందా ? చూడాలి. ఈ రెండు కంపెనీల తరహాలోనే ‘వైటెనింగ్’ పేరిట లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న ఇతర కొస్మోటెక్ కంపెనీలు కూడా చర్మం రంగును తెలియజేసే పదాలన్నింటిని తామూ ఉపసంహరించుకుంటామని, వాటికి ‘స్కిన్ కేర్’ అని పేర్లు పెడతామని చెబుతున్నాయి. వాస్తవానికి ఆ ఉత్పత్తులేవీ కూడా స్కిన్ కేర్ కిందకు రావు. ‘బ్లాక్ ఈజ్ బ్యూటీ (నలుపే అందం)’ అన్న ప్రచారం భారత్‌లో ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఎన్నడూ స్పందించని ఈ కంపెనీలు ఇప్పుడు స్పందించడానికి అమెరికాలో కొనసాగుతున్న ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ అనే ఉద్యమమే కారణం. జార్జి ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడిని ఓ శ్వేత జాతీయుడైన అమెరికా పోలీసు అన్యాయంగా చెప్పడంతో అక్కడ ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమం ఉధృతమైంది. పుట్టుకతో వచ్చే మనిషుల చర్మం రంగు మధ్యలో మారదని, మనిషి ఒక చోటు నుంచి మరో చోటుకు మరినప్పుడు అక్కడి ఉష్ణ లేదా శీతల పరిస్థితుల్లో చర్మం రంగులో కొంత మార్పు వస్తుందిగానీ, మందులతో మార్పు రాదని వైద్య విజ్ఞానం మొదటి నుంచి చెబుతున్నా నలుపును తెలుపు చేస్తామంటున్న వ్యాపారం మాత్రం జోరుగా కొనసాగుతూ వస్తోంది. -
పోలీసుల దాష్టీకానికి మరో వ్యక్తి బలి
చెన్నై: పోలీసుల కస్టడీలో తండ్రీ కొడుకులు(జయరాజ్, బెనిక్స్) మరణించిన ఘటనపై దేశ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు చల్లారటం లేదు. ఈ దారుణాన్ని మరువకముందే తమిళనాడులో మరో ఉదంతం చోటు చేసుకుంది. టెంకాశీ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి పోలీసుల దెబ్బలు తాళలేక శనివారం ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతాన్ని తలపించడంతో రాష్ట్రంలో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టెంకాశీకి చెందిన కుమారేశన్(30) ఆటో నడుపుకుంటున్నాడు. గత నెల ఓ వివాదం కేసులో పోలీసులు అతడికి సమన్లు ఇచ్చారు. దీంతో మే 10న పోలీస్ స్టేషన్లో హాజరైన కుమారేశన్‌ను పోలీసులు తీవ్రంగా కొట్టారని బాధిత తండ్రి అధికారులకు ఫిర్యాదు చేశారు. తొడలపై నిలబడి, పిడిగుద్దులు కురిపిస్తూ, బూట్లతో తన్నుతూ, లాఠీలతో కొడుతూ చిత్రహింసలు పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. (ఇండియా ‘జార్జి ఫ్లాయిడ్’లు) తీవ్ర గాయాలపాలైన అతడిని తొలుత ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అనంతరం తిరునల్వేలి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స తీసుకుంటూ శనివారం తుదిశ్వాస విడిచాడు. పోలీసులు తీవ్రంగా హింసించారని, ఆ దెబ్బలు తాళలేకే మరణించాడని బాదిత కుటుంబం ఆరోపిస్తోంది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితుడి బంధువులు ఆందోళనలు చేపట్టారు. మరోవైపు దీన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సబ్ ఇన్స్పెక్టర్, ఓ కానిస్టేబుల్‌ను అనుమానితుల లిస్టులో చేర్చారు. దీనిపై దర్యాప్తు చేపడతామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని టెంకాశీ పోలీసు అధికారి సుగన సింగ్ తెలిపారు. (తండ్రీకొడుకుల అనూహ్య మరణం!) -
ఇండియా ‘జార్జి ఫ్లాయిడ్’లు
చెన్నై: తమిళనాడు పోలీసుల రాక్షసత్వంపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో తండ్రీకొడుకుల్ని హింసించి చంపడంపై జనం మండిపడుతున్నారు. వీరిని ఇండియన్ ‘జార్జ్ ఫ్లాయిడ్’లు అంటూ నెటిజన్లు సోషల్‌మీడియాలో వ్యాఖ్యాని స్తున్నారు. తమిళనాడులోని శాంతాకులం ప్రాంతానికి పి.జయరాజ్ (62) జూన్ 19న తన దుకాణాన్ని లాక్డౌన్ నిబంధనల ప్రకారం సాయంత్రం 7 గంటలకు మూసివేయకపోవడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తండ్రి గురించి కనుక్కోవడానికి వెళ్లిన జయరాజ్ కొడుకు బెనిక్స్‌నూ అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలిసి వారి బంధువులు 20న స్టేషన్‌కెళ్లారు. అప్పుడే వారిద్దరి నడుము భాగాల కింద తీవ్రంగా రక్తస్రావం అవుతుండడాన్ని గుర్తించారు. 21న వీరిద్దరూ రిమాండ్‌లోనే కన్నుమూశారు. ప్రైవేటు భాగాల్లోకి లాఠీలు దూర్చారు 19న రాత్రంతా పోలీసులు వీరిద్దరిని తీవ్రంగా హింసించారని ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు చెప్పారు. వారి ప్రైవేటు భాగాల్లోకి లాఠీలు దూర్చారని తెలిపారు. ఈ ఘటనను సుమోటోగా తీసుకొని విచారించనున్నట్లు తమిళనాడు హైకోర్టు ప్రకటించింది. తమిళనాడు పోలీసుల అమానుషత్వాన్ని అమెరికాలో నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ ఉదంతంతో పోలుస్తూ గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ ట్వీట్ చేశారు. -
‘జార్జ్ ఫ్లాయిడ్స్ ఆఫ్ ఇండియా’
చెన్నై: తమిళనాడులో తండ్రి కొడుకుల కస్టడీ మృతిపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు హింసించడంతో తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి సమీపంలోని సాత్తానుకులం ప్రాంతానికి చెందిన జయరాజ్(59), ఆయన కొడుకు బెనిక్స్(31) మరణించినట్టు ఆరోపణలు వచ్చాయి. వీరి మరణానికి కారకులైన దోషులను చట్టప్రకారం శిక్షించాలన్న డిమాండ్ దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. సోషల్ మీడియాలోనూ #JusticeForJayarajandBennicks హ్యష్‌టాగ్‌తో ప్రముఖులు, నెటిజనులు న్యాయం కోసం నినదిస్తున్నారు. మాకు వాస్తవాలు కావాలి ‘జయరాజ్, బెనిక్స్ మరణవార్త విని హతశురాలిని అయ్యాను. చాలా కోపం వచ్చింది. ఇలాంటి క్రూరత్వానికి ఎవరూ పాల్పడరాదు. దోషులు తప్పించుకోకుండా చూడాలి. మాకు వాస్తవాలు కావాలి. ఇద్దరిని కోల్పోయిన మృతుల కుటుంబ సభ్యుల బాధను ఊహించడానికి కూడా సాహసించలేకపోతున్నాను. వారికి న్యాయం జరిగే వరకు మనమంతా సమైక్యంగా #JusticeForJayarajandBennicks హ్యష్‌టాగ్‌తో గళం వినిపిద్దామ’ని ప్రముఖ హీరోయిన్ ప్రియాంక చోప్రా ట్వీట్ చేశారు. హృదయ విదారకం గుజరాత్‌కు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని ఈ సంఘటనను అమెరికాలో ఆఫ్రికన్-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్యతో పోల్చారు. ‘ప్రియమైన బాలీవుడ్ ప్రముఖులారా, తమిళనాడులో ఏం జరిగిందో మీరు విన్నారా లేదా మీ ఇన్స్టాగ్రామ్ యాక్టివిజం ఇతర దేశాలకు మాత్రమే విస్తరించిందా? జార్జ్ ఫ్లాయిడ్స్ ఆఫ్ ఇండియా చాలా ఎక్కువ మందే ఉన్నారు. ఇటువంటి పోలీసు హింస, లైంగిక వేధింపుల కథ హృదయ విదారకం’ అంటూ మేవాని ట్వీట్ చేశారు. (‘మై డాడీ ఛేంజ్డ్ ద వరల్ట్’) తమిళనాడు పోలీసుల కస్టడీలో తండ్రి, కొడుకుల మృతిపై ప్రముఖ క్రికెటర్ శిఖర్ ధవన్ కూడా ట్విటర్లో స్పందించాడు. ‘తమిళనాడులో జయరాజ్, బెనిక్స్ పై జరిగిన దారుణం గురించి విని భయపడ్డాను. మృతుల కుటుంబానికి న్యాయం జరిగేలా మనమంతా బలంగా గళం విన్పించాల’ని ధవన్ ట్విటర్లో పేర్కొన్నాడు. చట్టానికి ఎవరూ అతీతులు కారని, ఈ అమానవీయ చర్యకు పాల్పడిన వారిని శిక్షించి.. బాధితులకు న్యాయం చేయాలని తమిళ హీరో జయం రవి ట్విటర్లో డిమాండ్ చేశారు. అసలేం జరిగింది? అనుమతించిన సమయానికి మించి తమ మొబైల్ దుకాణాన్ని తెరిచివుంచారన్న కారణంతో పి జయరాజ్, అతని కుమారుడు బెనిక్స్ను గత శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగు రోజుల తర్వాత ఆసుపత్రిలో వారిద్దరూ ఒకరి తర్వాత ఒకరు మరణించారు. సాత్తానుకులం పోలీస్‌స్టేషన్‌లో పోలీసు సిబ్బంది తీవ్రంగా కొట్టడం వల్లే జయరాజ్, అతడి కొడుకు చనిపోయారని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా, తాము అడిగిన సెల్ఫోన్లను ఇవ్వలేదన్న అక్కసుతోనే జయరాజ్, బెనిక్స్‌లపై పోలీసులు దాష్టీకాన్ని ప్రదర్శించినట్టు విచారణలో వెల్లడైంది. తండ్రి కొడుకుల లాకప్‌డెత్‌కు నిరసగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా వర్తకులు దుకాణాల బంద్ పాటించారు. జయరాజ్, బెనిక్స్లను కొట్టి చంపిన పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. కస్టడీ మరణాలను తీవ్రంగా పరిగణించిన మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం ఈ ఘటనపై మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించింది. (‘సెల్’ కోసమే దాష్టీకమా?) -
యూనిలీవర్ బాటలోనే లోరియల్ కూడా..
న్యూఢిల్లీ: పోలీసుల కస్టడీలో చనిపోయిన నల్లజాతి వ్యక్తి జార్జ్ ఫ్లాయిడ్ మృతికి వ్యతిరేకంగా అమెరికాలో ప్రారంభమైన నిరసనల సెగ ప్రపంచ ప్రసిద్ధ సౌందర్య ఉత్పత్తుల సంస్థలకు తగిలింది. ఈ నేపథ్యంలో హిందూస్తాన్ యూనిలీవర్ కంపెనీ తన ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ ఫెయిర్‌నెస్ క్రీం పేరులో నుంచి ‘ఫెయిర్’ పదాన్ని తొలగిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో ప్రసిద్ధ సౌందర్య ఉత్పత్తుల సంస్థ లోరియల్ కూడా యూనిలీవర్ బాటలోనే పయనిస్తుంది. ఈ క్రమంలో చర్మ సౌందర్యాన్ని పెంచే తమ ఉత్పత్తుల ప్యాక్‌ల మీద ‘వైట్, ఫెయిర్, లైట్’ పదాలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ మహిళా ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారు. (ఇక ‘ఫెయిర్’కు గుడ్‌బై..) ఆసియా, ఆఫ్రికన్, కరేబియన్ దేశాలలో తెల్లని మేనిఛాయే సౌందర్యానికి ప్రామాణికమనే భావన ఏన్నో ఏళ్లుగా పాతుకు పోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని యూనిలీవర్, లోరియల్ కంపెనీలు స్కిన్ వైట్నింగ్ క్రీములను ఉత్పత్తి చేస్తాయి. ఈ విషయంలో గ్లోబల్ మార్కెట్లో ఈ కంపెనీల ఉత్పత్తులకు ఎంతో డిమాండ్ ఉన్నది. లోరియల్ ఉత్పత్తులలో గార్నియర్ స్కిన్ నేచురల్స్ వైట్, కంప్లీట్ మల్టీ యాక్షన్ ఫెయిర్‌నెస్ క్రీమ్స్ ఉన్నాయి. మరో కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ ఇప్పటికే ఆసియా, మధ్యప్రాచ్య దేశాలలో విక్రయించే తన స్కిన్ వైటనింగ్ క్రీమ్స్ న్యూట్రోజెనా, క్లీన్ అండ్ క్లియర్ ఉత్పత్తులను అమ్మడం మానేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఫెయిర్‌నెస్ క్రీమ్ అమ్మకాలు నిలిపివేత
సాక్షి,న్యూఢిల్లీ : అమెరికా హెల్త్‌కేర్, ఎఫ్ఎంసీజీ దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ (జే అండ్ జే) మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్య తరువాత ఊపందుకున్న ‘బ్లాక్ లైవ్స్ మేటర్’ ఉద్యమానికి మద్దతుగా స్కిన్ వైట్నింగ్ (చర్మం తెల్లబడే) క్రీమ్‌ల అమ్మకాలను నిలిపి వేస్తున్నట్టు ప్రకటించింది. వీటితోపాటు న్యూట్రోజెనా ఫెయిర్‌నెస్ క్రీమ్‌ల అమ్మకాన్ని కూడా ఆపివేసినట్టు వెల్లడించింది. భారతదేశం సహా ఇతర ప్రాంతాల్లో క్లీన్ అండ్ క్లియర్ ఫెయిర్‌నెస్ ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేస్తామని జేజే తెలిపింది. ఆసియా, మధ్యప్రాచ్యంలో విక్రయించే న్యూట్రోజెనా ఫైన్ ఫెయిర్‌నెస్ క్రీమ్స్ అమ్మకాలు ఉండవని పేర్కొంది. అయితే స్టాక్ ఉన్నంత వరకు క్లీన్ అండ్ క్లియర్ ఫెయిర్‌నెస్ ఉత్పత్తులను విక్రయిస్తామని చెప్పింది. నల్లమచ్చల్ని తొలగించుకొని అందంగా, తెల్లగా అవ్వమంటూ తమ ఉత్పత్తి పేర్లు లేదా ప్రచారం సాగిందని, మీ సొంత స్కిన్ టోన్ కంటే మెరిసిపోవాలంటూ తెల్ల రంగును హైలైట్ చేసిందని తెలిపింది. నిజానికి తమ ఉద్దేశం అది కాదని "ఆరోగ్యకరమైన చర్మం అందమైన చర్మం" అని కంపెనీ తెలిపింది. సాహసోపేతమైన తమ నిర్ణయాన్ని సానుకూల దృష్టితో చూడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. అయితే కంపెనీ వ్యాపారంపై ఇది పెద్దగా ప్రభావం చూపదని ఎందుకంటే దాని మార్కెట్ వాటా చాలా తక్కువ అని జేజే ప్రతినిధి చెప్పారు. మరోవైపు జాన్సన్ అండ్ జాన్సన్ నిర్ణయం తరువాత ఇతర కంపెనీలు ఇలాంటి ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేసే ధైర్యం చేస్తాయా అనే ప్రశ్నకు విశ్లేషకులు పెదవి విరిచారు. దేశీయ ఫెయిర్‌నెస్ క్రీమ్ మార్కెట్లో 2019లో సుమారు 450 మిలియన్ల డాలర్ల మార్కెట్ వాటా వున్న, ఇతర ఎఫ్ఎంసీజీ కంపెనీలు దీనిని అనుసరించకపోవచ్చన్నారు. బ్రిటిష్-డచ్ బహుళజాతి సంస్థ అనుబంధ కంపెనీ హిందూస్తాన్ యూనిలీవర్, మరో విదేశీ సంస్థ ప్రొక్టర్ అండ్ గాంబుల్, గార్నియర్ (లోరియల్) ఈ విభాగంలో మార్కెట్ ను ఏలుతున్న సంగతి తెలిసిందే. బయోటిక్, లోటస్ హెర్బల్, హిమాలయ వంటి అనేక భారతీయ కంపెనీల ఫెయిర్‌నెస్ ఉత్పత్తులు కూడా భారీ విక్రయాలనే నమోదు చేస్తున్నాయి. మనదేశంలో అత్యధికంగా అమ్ముడుబోయే ఫెయిర్‌నెస్ క్రీమ్ ఫెయిర్ అండ్ లవ్లీ. హిందూస్తాన్ యునిలివర్ కు అత్యంత విజయవంతమైన ఈ క్రీమ్ 2012 నాటికి, కంపెనీ మార్కెట్లో 80 శాతం ఆక్రమించిందంటే దీని డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. దీనికితోడు గత దశాబ్ద కాలంగా పురుషుల ప్రత్యేక ఫెయిర్‌నెస్ ఉత్పత్తులు మార్కెట్లో హల్ చల్ చేస్తున్నాయి. బాలీవుడ్ తారలు షారూఖ్ ఖాన్, జాన్ అబ్రహం వీటికి ప్రచారకర్తలుగా ఉన్నారు. అయితే ఫెయిర్‌నెస్ ఉత్పత్తుల వ్యాపారం చాలా సంవత్సరాలుగా విమర్శలను ఎదుర్కొంటోంది. సౌందర్య సాధన పేరుతో జరుగుతున్న ఇలాంటి అమ్మకాలను నిషేధించాలంటూ ఇటీవల ఆన్లైన్ పిటిషన్ కూడా సర్క్యులేట్ అయింది. యూరోమోనిటర్ ఇంటర్నేషనల్ ప్రకారం, గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఫెయిర్‌నెస్ క్రీములు, మచ్చల నివారణ, యాంటీ ఏజింగ్ ఉత్పత్తులతో సహా సుమారు 6,277 టన్నుల స్కిన్ లైట్నర్ అమ్ముడుబోయిందట. -
అమెరికాలో కాల్పుల కలకలం
న్యూయార్క్/మినియాపొలిస్/అస్టిన్: నల్ల జాతీయుడు జార్జి ఫ్లాయిడ్ హత్యోదంతంతో అట్టుడుకుతున్న అగ్రరాజ్యం అమెరికాలో తాజాగా కాల్పులు తీవ్ర కలకలం సృష్టించాయి. మిన్నెసొటా, న్యూయార్క్, టెక్సాస్ రాష్ట్రాల్లో గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతిచెందగా 25 మంది గాయపడ్డారు. మిన్నెసొటా రాష్ట్రం మినియాపొలిస్‌లో ఆదివారం తెల్లవారుజామున ఓ కార్యక్రమంలో జరిగిన కాల్పుల్లో ఒకరు మరణించగా 11 మంది గాయపడ్డారు. సెంట్రల్ న్యూయార్క్‌లో శనివారం రాత్రి ఓ వేడుకలో పాల్గొన్న వారిపై కాల్పులు జరగడంతో 9 మంది గాయపడ్డారు. టెక్సాస్ రాజధాని అస్టిన్‌లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. -
పోలీసు సంస్కరణలకు ట్రంప్ ఓకే
వాషింగ్టన్: ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మరణంతో కొద్ది వారాల పాటు జాతి వివక్షకు వ్యతిరేకంగా అగ్రరాజ్యం నిరసనలతో హోరెత్తిపోవడంతో ట్రంప్ ప్రభుత్వం పోలీసు శాఖలో భారీ సంస్కరణలను చేపట్టింది. అమెరికా పోలీసులు మరింత బాధ్యతా యుతంగా ప్రవర్తించేలా సంస్కరణలు తెస్తూ రూపొందించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై రోజ్ గార్డెన్లో జరిగిన ఒక కార్యక్రమంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. అయితే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన జాతి వివక్ష అంశంపై అందులో ఎలాంటి ప్రస్తావన లేదు. ఈ సంతకం చేసే కార్యక్రమానికి ముందు పోలీసుల దాష్టీకానికి బలైపోయిన నల్లజాతీయుల కుటుంబాలను ట్రంప్ వ్యక్తిగతంగా కలుసుకున్నారు. వారి కుటుంబ సభ్యుల మరణాల పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆ తర్వాత పోలీసుల్ని కలుసుకున్న ట్రంప్ తన స్వరం మార్చారు. ప్రజలందరినీ సురక్షితంగా ఉంచడానికి రేయింబగళ్లు కష్టపడుతున్న పోలీసులకి గౌరవం ఇవ్వాలన్నారు. పోలీసు అధికారుల్లో అత్యధికులు నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తారంటూ కొనియాడారు. -
హారియట్ టబ్‌మన్ బానిసల ప్రవక్త
వారు నివసించిన ఖండాన్ని చీకటి ఖండం అన్నారు. వారి జీవితాలను సదా చీకటితో నింపారు. నల్ల పుట్టుక పుడితే బానిస అని అన్నారు. సంకెలలతో బంధించి హింసించారు. తెల్లవారి సేవకు ఆఫ్రికా నుంచి తరలింపబడ్డ నల్లవారు అమెరికాలో తమ స్వేచ్ఛ కోసం, గౌరవం కోసం యుగాలుగా పెనుగులాడుతూనే ఉన్నారు. జార్జ్ ఫ్లాయిడ్ ఘటన నేపథ్యంలో ఆ స్వేచ్ఛాపోరాటాలను గుర్తు చేసుకుంటున్నారు. ‘హారియట్ టబ్‌మన్’ ఇప్పుడు పదేపదే ప్రస్తావనకు వస్తున్నారు. బానిసగా పుట్టి బానిసల విముక్తి కోసం జీవితాన్ని ధారపోసిన ధీర ఆమె. 2019లో ఆమెపై వచ్చిన బయోపిక్ ‘హారియట్’ పరిచయం ఇది. ‘ఇక్కడి నుంచి తర్వాతి సురక్షితమైన చోటు 25 మైళ్ల దూరంలో ఉంది. అంత దూరం ఒక్కదానివే ఎలా నడుస్తావు?’ అని అడుగుతాడు మిత్రుడు. ‘ఏం పర్లేదు. నేను దేవుడితో పాటు నడుస్తాను’ అంటుంది హారియట్. ‘బానిసల మొర దేవుడు వినడు’ అని ఆమె సోదరుడు ఒక సందర్భంలో హారియట్తో అంటాడు ఈ సినిమాలో. కాని హారియట్ ఎప్పుడూ దేవుడు తమ మిత్రుడని అనుకుంది. దేవుడు తన దగ్గరగా నిలబడి తనను నడిపిస్తున్నాడు అనుకుంది. దేవుడు తనకు చూపిన మార్గమే బానిసల విముక్తి అని అనుకుంది. ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు దశాబ్దాల పాటు ఆమె బానిసల విముక్తి కోసమే పోరాడింది. వారి కోసం కత్తి పట్టుకుంది. తుపాకీని పేల్చింది. యుద్ధమే చేసింది. అమెరికా సమాజం నేటికీ సగౌరవంగా తలిచే ఆ నల్లవనిత హారియట్ టబ్‌మన్ (1822– 1913) జీవితం మీద ఎన్నో పుస్తకాలు సినిమాలు వచ్చాయి. 2019 వచ్చిన ‘హారియట్’ ఆస్కార్ నామినేషన్ల వరకూ వెళ్లింది. బానిసల రాష్ట్రంలో అమెరికాలో 19వ శతాబ్దపు తొలి దశకాలు ఘోరమైన బానిస వ్యవస్థకు సాక్ష్యంగా నిలిచాయి. పారిశ్రామికీకరణ ఉన్న ఉత్తరాది రాష్ట్రాలు బానిస వ్యవస్థను అసహ్యించుకుంటే శారీరక శ్రమ అవసరమైన వ్యవసాయ ఆధారిత దక్షిణాది రాష్ట్రాలు బానిసల వ్యవస్థను స్థిరపరుచుకోవడానికి ఎంతకైనా తెగించే వరకూ వెళ్లాయి. ఈ ‘స్లేవ్ స్టేట్స్’, ‘ఫ్రీ స్టేట్స్’కు మధ్య నలిగి ఇక్కడి నుంచి అక్కడికి పారిపోవడానికి ప్రయత్నించిన ఆఫ్రికన్ అమెరికన్ల కథలు వేనవేలు. అలాంటి వారిలో ఒకరు మన కథానాయిక హారియట్ టబ్‌మన్. బానిసల రాష్ట్రాలలో ఒకటైన మేరీల్యాండ్‌లో ఆమె కథ మొదలవుతుంది. ఆమె తల్లిదండ్రులు బానిసలు. అయితే తల్లి ఒక యజమాని దగ్గర తండ్రి ఒక యజమాని దగ్గర విడిగా ఉంటూ పని చేసే దురవస్థ ఆ రోజుల్లో ఒక విషాదకర వాస్తవం. హారియట్కు ఆరేళ్లు వచ్చి ఊహ తెలిసే సమయానికి ఆమెకు స్ఫురణకు వచ్చిన ఒకే ఒక్క విషయం– తన వైపు దిగులుగా చూస్తూ వేరే యజమానికి అమ్ముడుపోయి వెళ్లిపోయిన అక్క ముఖం. ఆ రోజుల్లో బానిసల యజమానులు తమ దగ్గర ఉన్న బానిసలను వేరే యజమానుల దగ్గరకు డబ్బు కోసం కిరాయికి పంపేవారు. టబ్‌మన్ అలా ఎనిమిదేళ్ల వయసులో కిరాయికి వెళ్లి ఒక్కర్తే అనుభవించిన వేదన ఆమెకు ఆ వయసులోనే బానిస వ్యవస్థ పట్ల ఏహ్యతను కలిగించింది. అమ్మకానికి సిద్ధం హారియట్ ఇప్పుడు వయసుకు వచ్చింది. పెళ్లి కూడా చేసుకుంది. ఆమె భర్త స్వతంత్రం పొందిన నల్లవాడు. ఈమె ఇంకా బానిసే. ఈమెకు రేపు పిల్లలు పుడితే ఆ పిల్లలు కూడా బానిసలే అవుతారు. స్వేచ్ఛ పొందే వీలు లేదు. ఇదంతా ఆలోచించే కొద్దీ ఆమెకు గుక్క తిప్పుకోకుండా ఉంటుంది. యజమాని కొడుకు ఇది గమనిస్తాడు. ఈమె ఉంటే ప్రమాదం అని తలచి అమ్మకానికి ప్రకటన విడుదల చేస్తాడు. అమ్మకం అంటే ఇక భర్తను వదిలి తల్లిదండ్రులను తోబుట్టువులను వదిలి ఎక్కడకు వెళ్లాలో. ఎవరు కొనుక్కుంటే వారి దగ్గరకు. ‘నేను బతికితే స్వేచ్ఛగా బతుకుతాను. లేదా చస్తాను. నేను ప్రాణాలతో ఉండగా నన్నెవరూ బానిసగా ఉంచలేరు’ అని ప్రకటిస్తుంది హారియట్. కెనడాను అప్పట్లో ‘ప్రామిస్డ్ ల్యాండ్’ అనేవారు. అంటే బానిసల స్వేచ్ఛా ప్రాంతం. అక్కడి వరకూ పారిపోవాలి. లేదా ఉత్తరాన ఉన్న ఫిలడల్ఫియాకు పారిపోగలిగినా చాలు. అది ఫ్రీ స్టేట్. హారియట్ ఫిలడల్ఫియాకు పారిపోతుంది. ఒక్కత్తే. అర్ధరాత్రి. ‘ఆకాశంలో నార్త్స్టార్ని చూడు. దానిని చూస్తూ దానివైపు పరిగెత్తు’ అని చెబుతాడు చర్చి ఫాదర్. చీకటి బతుకులో మినుకు మినుకుమనే నక్షత్రమే పెద్ద ఆశ. అండర్‌గ్రౌండ్ రైల్రోడ్ స్లేవ్ స్టేట్స్ నుంచి ఫ్రీ స్టేట్స్కు పారిపోవడానికి ఒక రహస్య వ్యవస్థ ఉండేది. దీనిని ‘అండర్‌గ్రౌండ్ రైల్రోడ్’ అనేవారు. అంటే గమ్యం చేరడానికి అవసరమైన అడ్డదార్లు, దారి మధ్యలో రహస్య షెల్టర్లు, ఆశ్రయం ఇచ్చే వ్యక్తులు వీరితో నిండిన వ్యవస్థ అన్నమాట. ఇందులో నల్లవాళ్లు ఉండేవారు, బానిసల పట్ల సానుభూతి ఉన్న తెల్లవారూ ఉండేవారు. ఆ వ్యవస్థను సమర్థంగా ఉపయోగించుకున్న ఏకైక బానిస నిర్మూలనకర్త హారియట్. ఫిలడల్ఫియాకు చేరుకున్న తర్వాత ఆమె తన జీవితం, స్వార్థం చూసుకోలేదు. దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న బానిసల విముక్తి కోసం అలసట లేనట్టుగా పని చేసింది. తన జీవితకాలంలో 13 సార్లు ఉత్తరాది నుంచి దక్షిణాదికి రహస్య ప్రయాణం చేసి 70 మంది బానిసలను అర్ధరాత్రి ప్రయాణాలతో విముక్తి కలిగించింది. ‘నేను ఒక్కసారి కూడా దారి తప్పలేదు. ఒక్క బానిస ప్రాణం కూడా పోనివ్వలేదు’ అని గర్వంగా చెప్పుకుందామె. జనం క్రమంగా ఆమెను ‘మోసెస్’ అని పిలవడం మొదలెట్టారు. నాడు ప్రజలను విముక్తం చేయడానికి వచ్చిన ప్రవక్త మోసెస్. నేడు నల్లవారిని విముక్తికి వచ్చిన ప్రవక్త హారియట్. సివిల్ వార్ బానిసల వ్యవస్థ ఉండాలని దక్షిణాది రాష్ట్రాలు, నిర్మూలించాలని ఉత్తరాది రాష్ట్రాలు సివిల్ వార్ (1861–65)కు దిగినప్పుడు అదే అదనుగా హారియట్ ఒక గెరిల్లా సైన్యమే తయారు చేసింది. 150 మంది నల్లవారితో ఆమె దళం ఉండేది. హారియట్ స్వయంగా తుపాకీ పట్టి ఈ సేనను నడిపించేది. ఆమె తన దళంతో దక్షణది రాష్ట్రాలపై చేసిన ఒక పెద్ద దాడిలో 750 మంది బానిసలు ఒకే సమయంలో స్వేచ్ఛను పొందారు. ఇది ఒక వీరోచిత గాథ. ఇంతా చేస్తున్నది ఒక ఆజానుబాహురాలు కాదు. కేవలం ఐదు అడుగుల ఎత్తు ఉండే పిట్టంత మనిషి. కాని ఆమె గుండె ధైర్యం ఒక ప్రామిస్డ్ ల్యాండ్ అంత. చివరి రోజులు హారియట్ తన చివరి రోజులు న్యూయార్క్‌లో గడిపింది. తన 91వ ఏట అయినవారందరి సమక్షంలో ప్రశాంతంగా వీడ్కోలు తీసుకుంది. అమెరికా ఆమె గౌరవార్థం స్మారక స్థూపాలు, చిహ్నాలు ఏర్పాటు చేసింది. ఆమె నివసించిన స్థలాలు, ఆమె పారిపోయిన అడవి దారి దర్శనీయ స్థలాలుగా మారాయి. ఆమె ముఖచిత్రంతో 20 డాలర్ల నోటు విడుదల అయ్యింది. డాక్యుమెంటరీలు, సినిమాలు అనేకం వచ్చాయి. కాని ఆమె గురించి నిజంగా బయట వారికి తెలియడం తక్కువ. ఈ బానిసల ముక్తిదాయిని గురించి తీసిన సినిమా ‘హారియట్’లో ఆమె పాత్రను గొప్ప నటి సింథియా ఇరివో పోషించింది. నటి కశి లెమొన్స్ దర్శకత్వం వహించింది. నల్లవారి గురించి చర్చ జరుగుతున్న ఈ సమయంలో ఈ సినిమా వీక్షణం ఒక చరిత్ర దర్శనమే. – సాక్షి ఫ్యామిలీ -
‘మై డాడీ ఛేంజ్డ్ ద వరల్ట్’
స్కూల్లో చేరే టైమ్ వచ్చేసింది. సీటివ్వడానికి స్కూళ్లన్నీ రెడీగా ఉన్నాయి. యూనివర్శిటీలు కూడా స్కాలర్షిప్ సిద్ధం చేసి పెట్టాయి!! డిస్నీ షేర్స్ కానుకగా వచ్చాయి. డాలర్లు లక్షల్లో జమ అవుతున్నాయి. చిట్టి చిలకమ్మడల్గానే ఉంది. ‘అమ్మ కొట్టిందా? అని అడగలేం. నాన్నను పోలీసులు కొట్టిన సంగతి మనకు తెలియకపోతే కదా!! ‘మై డాడీ ఛేంజ్డ్ ద వరల్ట్’. జార్జి ఫ్లాయిడ్ నివాళి ప్రదర్శనలో ఆయన ఆరేళ్ల కూతురు జియానాను తన భుజాలపైకి ఎక్కించుకుని, ఆమె చేతుల్ని తన చేతులతో పైకి లేపుతూ.. డైరెక్టర్ స్కిప్ట్జ్ ఆ చిన్నారి చేత పదే పదే చెప్పించిన మాట.. మై డాడీ ఛేంజ్డ్ ద వరల్డ్. ‘మా నాన్న ప్రపంచాన్ని మార్చేశాడు’. నిజమే. ఫ్లాయిడ్ ఈ ప్రపంచాన్ని మార్చేశాడు. జాత్యహంకార దేశాలన్నీ మళ్లొకసారి నల్లజాతి వారి మనోభావాలకు తగ్గట్టు నడుచుకోవడమెలా అని నేర్చుకోవడం మొదలుపెట్టాయి! పోలీసు హింస, జాతి అసమానతలకు వ్యతిరేకంగా అమెరికన్ కాంగ్రెస్‌లో ఒక బిల్లు కూడా ప్రతిపాదనకు వచ్చింది. అయితే ఫ్లాయిడ్ మార్చదలచుకున్నది తన కూతురు జీవితాన్ని మాత్రమే. ఆమెకు మంచి భవిష్యత్తును ఇవ్వాలని ప్లాన్ గీసుకుంటుండగా పోలీసుల అమానుషత్వానికి ఊపిరి ఆడక కుప్పకూలిపోయింది ఆ ఆశలసౌధం. జియానాకు ఇప్పుడు తండ్రి లేడు. కానీ ప్రపంచం జియానా పక్కన ఉంది. జియానాను అక్కున చేర్చుకుంది. తల్లి, బంధువులు ఆమెకు తండ్రి లేని లోటు తెలియకుండా ఉండటం కోసం తండ్రి ఎంత గొప్పవాడో ఆమెఏడుపు మొదలుపెట్టబోయే ప్రతిసారీ తెలియబరుస్తున్నారు. జియానాకు తండ్రి గొప్పదనం తెలుస్తూనే ఉంది కానీ, తండ్రి భుజాలెక్కి తిరిగే తన గొప్పతనాన్ని కోల్పోయింది. మనసు లోపలి ఆ కోల్పోయిన భావాన్ని ఎలా చెప్పగలదు భాషైనా పూర్తిగా రాకుండానే. ఇంట్లో ఇలా ఉంటే.. బయట జియానాను తమ చైల్డ్‌గా సొంతం చేసుకుంటున్న తెల్లజాతి కుటుంబాలూ ఉన్నాయి. ‘‘ఫ్లాయిడ్ కూతురుకు నేను ఏనాటికైనా సమాధానం చెప్పుకోవలసి వస్తుంది’’ అంటూ సెరీనా భర్త అలెక్స్ ఇప్పటికే తన ‘రెడిట్’ కంపెనీ బోర్డులో తన స్థానం నుంచి వైదొలగి, ఆ స్థానాన్ని నల్లజాతి వారికి రిజర్వు చేశారు. ఫ్లాయిడ్ మరణంతో ఇంతవరకు జరుగుతూ వస్తున్నదంతా నల్లజాతి వారిని ప్రతి స్థాయిలోనూ గుర్తించి, గౌరవించడం. ఇక ఇప్పుడు జరుగుతున్నది ఆయన కూతుర్ని చేరదీయడం. ప్రముఖ అమెరికన్ గాయని, సీనియర్ నటి, నిర్మాత బార్బ్రా స్ట్రయిశాండ్ (78) జియానా పేరిట డిస్నీలాండ్ స్టాక్స్ కొని జియానాకు కానుకగా ఇచ్చారు. దాంతో జియానా ఇప్పుడు డిస్నీలాంyŠ కంపెనీలో యాజమాన్య హక్కులు గల ఒక భాగస్వామి అయింది! ఆ స్టాక్ సర్టిఫికెట్‌ను చిరునవ్వుతో రెండుచేతుల మధ్య పెట్టుకుని తీయించుకున్న ఫొటోను జియానా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి.. ‘ఐ యామ్ నౌ ఎ డిస్నీ స్టాక్హోల్డర్. థ్యాంక్యూ’ అని బార్బ్రాకు ధన్యవాదాలు తెలిపింది. ఇటీవలే మొదలైన జియానా ఇన్‌స్టాగ్రామ్‌లో 36 వేలమందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఓఫ్రా విన్ఫ్రే, మిషెల్ ఒబామా వంటి ప్రముఖులు కూడా ఈ చిన్నారిని ఫాలో అవుతున్నారు. సోమవారం ఆమె ఇన్‌స్టాలో ఆమెరికన్ ర్యాప్ సింగర్ కాన్యే వెస్ట్ ప్రత్యక్షం అయ్యాడు. తన కాలేజీ చదువుకయ్యే ఖర్చంతా సేవ్ చేసి ఉంచుతానని హామీ ఇచ్చిన కాన్యేకు ధన్యవాదాలు తెలుపుతో జియానా ఒక పోస్ట్ పెట్టింది. టెక్సాస్ సదరన్ యూనివర్సిటీ పూర్తి స్కాలర్‌షిప్‌తో జియానాను చదివించుకుంటామని గతవారం తన వెబ్సైట్లో ప్రకటించింది! జియానా కోసం ఏర్పాటైన ‘గో ఫండ్ మీ’కి ఇప్పటి వరకు 20 లక్షల డాలర్లకు పైగా విరాళాలు జమ అయ్యాయి. ఈ సహాయాలన్నిటికీ జియానా థ్యాంక్స్ చెబుతూనేమధ్య మధ్య ‘స్టాప్ కిల్లింగ్ ఫాదర్స్’ అంటూ తన ఇన్స్టాగ్రామ్ విజ్ఞప్తులను పోస్ట్ చేస్తోంది. చేతిలో డిస్నీ స్టాక్స్‌తో , తండ్రి, తను ఉన్న ఫొటోతో -
సియాటిల్‌లో ఆందోళనలకు భారతీయురాలి సారథ్యం
వాషింగ్టన్/లండన్: అమెరికాలో మరోసారి జాతివివక్షకు నిరసగా ఆందోళనలు మొదలయ్యాయి. పోలీసుల దురుసు ప్రవర్తనతో చివరకు ఇద్దరు నల్లజాతీయులు జార్జ్ ఫ్లాయిడ్, రేషార్డ్ బ్రూక్స్ ప్రాణాలు కోల్పోయిన ఉదంతంలో నిరసనలు ఎక్కువయ్యాయి. సియాటిల్‌లో జరుగుతున్న ‘బ్లాక్‌లైవ్స్ మ్యాటర్’ ఆందోళనలకు 46 ఏళ్ల భారతీయ అమెరికన్ క్షమా సావంత్ నేతృత్వం వహిస్తున్నారు. సియాటెల్ డౌన్‌టౌన్ నుంచి పోలీసులను తొలగించాలన్న డిమాండ్‌పై ఆమె ఆందోళన చేస్తున్నారు. పుణేలో పుట్టి ముంబైలో చదువుకున్న క్షమా సావంత్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు. సమాజంలోని ఆర్థిక అసమానతలను గమనించిన తాను ఆర్థిక శాస్త్రాన్ని చదివానని అందులోనే పీహెచ్డీ చేశానని ఆమె తెలిపారు. 2006లో సోషలిస్ట్ ఆల్టర్నేటివ్‌లో చేరి 2013లో సిటీ కౌన్సిల్ ఉమెన్‌గా ఎన్నికయ్యారు. బ్రిటన్‌లో జాతివివక్షపై కమిషన్.. బ్రిటన్‌లో జాతివివక్ష సమస్యను సమర్థంగా ఎదుర్కొనేందుకు కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. జాతివివక్షకు ఫుల్స్టాప్ పెట్టే విషయంలో చేయాల్సింది ఎంతో ఉందని ఆయన పేర్కొన్నారు.. జార్జి ఫ్లాయిడ్ హత్యను నిరసిస్తూ అమెరికాలోని లాస్ఏంజెలెస్లోని హాలీవుడ్లో ‘ఆల్ బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ప్రదర్శనలో పాల్గొన్న వందలాది మంది ఆందోళనకారులు -
ఇది కాదు మనం చేయాల్సింది.. అందమైన ఫొటో!
ఆడా.. మగా..? నలుపా.. తెలుపా..? ఆధిపత్య వర్గమా.. అణగదొక్కబడిన సమూహమా? ఈ తారతమ్యాలేవీ లేకుండా ‘మనిషి’గా జీవించినపుడే మానవత్వం అనే మాటకు అర్థం ఉంటుందని నిరూపించాడు పాట్రిక్ హచ్కిన్సన్ అనే వ్యక్తి. తమ నిరసనను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగి గాయపడిన ‘ప్రత్యర్థి’ని కాపాడాడు. ‘ఇది కాదు మనం చేయాల్సింది’ అంటూ భుజాలపై మోసుకెళ్లి మరీ అతడిని రక్షించాడు. సెంట్రల్ లండన్‌లోని వాటర్లూ బ్రిడ్జి వద్ద శనివారం ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాలు.. శ్వేతజాతి పోలీసు చేతిలో మే 25న అమెరికాలో హత్యకు గురైన ఆఫ్రో- అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతంపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో లండన్‌లోని వాటర్లూ బ్రిడ్జి వద్ద ఈ జాత్యహంకార చర్యను వ్యతిరేకిస్తూ కొంతమంది శాంతియుత నిరసనకు దిగారు. ఇంతలో వీరికి వ్యతిరేకంగా శ్వేతజాతీయులు సైతం అక్కడే ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ గొడవలో ఓ శ్వేతజాతీయుడు కిందపడిపోయాడు. అతడి ముఖానికి గాయాలయ్యాయి. (ప్రత్యేక విమానం.. బోనస్.. గ్రేట్ సర్!) ఈ విషయాన్ని గమనించిన పాట్రిక్.. అతడిని భుజాలపై వేసుకుని.. ఆస్పత్రికి తరలించాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న రాయిటర్స్ ఫొటోగ్రాఫర్ డిలన్ మార్టినెజ్ ఈ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించారు. ఈ విషయం గురించి మార్టినెజ్ మాట్లాడుతూ.. ఈ ఫొటో తీయడం తన అదృష్టంగా భావిస్తున్నారు. ఇక ఈ ఘటనపై స్పందించిన బ్రిటీష్ జర్నలిస్టు పీర్స్ మోర్గాన్.. ‘‘అన్ని వికారాల మధ్య.. మానవత్వాన్ని పరిమళింపజేసిన అందమైన క్షణం’’ అని ట్విటర్లో ఫొటో షేర్ చేశారు. కాగా పాట్రిక్ పర్సనల్ ట్రెయినర్‌గా పనిచేస్తున్నాడని.. బాధితుడి వివరాలు మాత్రం వెల్లడి కాలేదని రాయిటర్స్ పేర్కొంది. మరోవైపు.. ఈ ఘటన గురించి మాట్లాడేందుకు పాట్రిక్ అందుబాటులో లేకపోవడంతో అతడి స్నేహితుడు బ్రిటీష్ చానెల్ 4తో ఆదివారం మాట్లాడాడు. సదరు శ్వేతజాతీయుడిని కాపాడింది పాట్రికేనని ధ్రువీకరించినట్లు సంస్థ తెలిపింది. ఇదిలా ఉండగా.. యాంటీ రేసిస్ట్ నిరసనల్లో గత వారం మొత్తం 113 మంది అరెస్టయ్యారని, 23 మంది అధికారులు గాయపడినట్లు స్థానిక పోలీసులు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. వాటర్లూ బ్రిడ్జి వద్ద ఘర్షణలు చోటుచేసుకున్న సమయంలో అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టినట్లు తెలిపారు. -
అట్లాంటా పోలీసు చీఫ్ రాజీనామా
అట్లాంటా: ఆఫ్రో అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్యపై ఆందోళనలు పూర్తిగా చల్లారకముందే.. మరొక నల్ల జాతి వ్యక్తి అట్లాంటాలో పోలీసుల చేతిలో మరణించిన ఘటన ఉద్రిక్తతలకు దారి తీసింది. ఒక రెస్టారెంట్ ముందు వినియోగదారులకు ఇబ్బంది కలిగిస్తున్నాడన్న ఫిర్యాదుపై అరెస్ట్ చేసే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో శుక్రవారం రాత్రి రేషర్డ్ బ్రూక్స్ అనే నల్లజాతి యువకుడు గాయపడ్డారు. అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ సమాచారం వెల్లడైన వెంటనే స్థానికంగా ఆందోళనలు చెలరేగాయి. ఘటన జరిగిన ప్రాంతంలోని వెండీ రెస్టారెంట్‌ను ధ్వంసం చేశారు. అక్కడి హైవేను దిగ్బంధించారు. ఈ నేపథ్యంలో, ఈ కాల్పులకు బాధ్యత వహిస్తూ అట్లాంటా పోలీస్ చీఫ్ ఎరిక్ షీల్డ్ శనివారం రాజీనామా చేశారు. తాజాగా, ఆదివారం గారెట్ రాల్ఫ్ అనే పోలీసు అధికారిని విధుల నుంచి తొలగిం చారు. డేవిడ్ బ్రాస్నన్ అనే మరో అధికారిని పరిపాలన విధులకు బదిలీ చేశారు. ఘటన జరిగిన సమయంలో ఆ ఇద్దరు అధికారుల శరీరాలపై ఉన్న కెమెరా ఫుటేజ్‌ను కూడా అధికారులు విడుదల చేశారు. ఆందోళనల్లో పాల్గొన్న వారిలో 36 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాల్పుల ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు. వెండీ రెస్టారెంట్ డ్రైవ్ ఇన్ మార్గానికి అడ్డుగా కారు పెట్టి నిద్ర పోతున్నాడని ఫిర్యాదు రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లారని, కారులో మద్యం మత్తులో ఉన్న బ్రూక్స్‌ను అదుపులోకి తీసుకునే క్రమంలో కాల్పులు జరిగాయని అధికారులు అంటున్నారు. -
జుకర్ బర్గ్ దంపతుల సంచలనం : ట్రంప్‌కు షాక్
శాన్ ఫ్రాన్సిస్కో: ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ప్లాయిడ్ హత్య, అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ వైఖరిపై ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్, ఆయన భార్య ప్రిస్కిల్లా చాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ వైఖరి చాలా విచారకరమైంది, అసహ్యకరమైందంటూ పేర్కొన్నారు. ట్రంప్ మెసేజ్ రెచ్చగొట్టేదిగా ఉందని తాను గానీ, తన పాలసీ టీమ్ గానీ భావించడంలేదని ఇప్పటిదాకా సమర్ధించిన మార్క్ తాజాగా వివాదాస్పద పోస్టులపై మొట్టమొదటి సారి ప్రత్యక్షంగా ఘాటు విమర్శలు చేయడం గమనార్హం. చాన్ జుకర్‌బర్గ్ ఇనిషియేటివ్ కు నిధులు సమకూర్చిన 270 మంది శాస్త్రవేత్తలు ఫేస్బుక్ ప్లాట్‌ఫామ్‌లపై తప్పుడు సమాచారం, ద్వేషపూరిత పోస్ట్‌లను అరికట్టాలంటూ డిమాండ్ చేశారు. ట్రంప్ పోస్ట్ హింసను ప్రేరేపించే స్పష్టమైన ప్రకటన అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విమర్శలకు సమాధానమిస్తూ తమ దేశ చరిత్రలో అసాధారణమైన, బాధాకరమైన ఇన్ఫ్లేషన్ సమయమని మార్క్ దంపతులు వ్యాఖ్యానించారు. జార్జ్ ఫ్లాయిడ్ మరణానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో ట్రంప్ చేసిన బాధాకరమైన వ్యాఖ్యలు తమను కదిలించాయని పేర్కొన్నారు. దేశానికి చాలా ఐక్యత అవసరమైన సమయంలో అధ్యక్షుడు ట్రంప్ విభజన వాదం విచారకరమంటూ వీరు ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ఫేస్బుక్, చాన్ జుకర్‌బర్గ్ ఇనిషియేటివ్ రెండూ వేర్వేరు సంస్థలని తెలిపారు. (ఉద్యోగిపై వేటు : ఫేస్‌బుక్‌తో విసిగిపోయా!) అలాగే ట్రంప్ పోస్ట్ ను తొలగించకపోవడంపై స్పందిస్తూ సైన్యాన్ని మోహరిస్తామన్న ట్రంప్ హెచ్చరికలు ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతోనే అలా ఉంచామని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఫ్లాయిడ్ మరణం తరువాత ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న బ్లాక్ లైవ్స్ మేటర్ ఉద్యమానికి జుకర్ బర్గ్, చాన్ మద్దతు తెలపడం విశేషం. NEW — Mark Zuckerberg & Priscilla Chan have responded to the 270+ scientists at the @ChanZuckerberg Initiative who called on Zuckerberg to curb misinformation. Zuckerberg says he and Chan are "deeply shaken and disgusted by President Trump’s divisive and incendiary rhetoric." pic.twitter.com/j5ziU15Ik9 — Teddy Schleifer (@teddyschleifer) June 12, 2020 -
ఉద్యోగిపై వేటు : ఫేస్‌బుక్‌తో విసిగిపోయా!
శాన్ ఫ్రాన్సిస్కో: జార్జ్ ఫ్లాయిడ్ హత్య, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ వివాదంలో మరో కీలక పరిణామం చేసుకుంది. సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ పై విమర్శలు చేసిన ఉద్యోగిపై సంస్థ వేటు వేసింది. మార్క్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఇంజనీర్ బ్రాండన్ డైల్ ను విధులనుంచి తొలగించింది. దీనిపై వివరణ ఇస్తూ డైల్ ట్విటర్ లో ఒక పోస్ట్ పెట్టారు. బ్లాక్ లైవ్స్ మేటర్ ఉద్యమానికి మద్దతుకు నిరాకరించిన సహోద్యోగిని బహిరంగంగా తిట్టినందుకు తనను తొలగించినట్లు సియాటెల్ యూజర్ ఇంటర్ఫేస్ ఇంజనీర్ బ్రాండన్ డైల్ ట్వీట్ చేశారు. జాత్యహంకార వ్యతిరేక ఉద్యమానికి మద్దతుగా ప్రకటన చేయకపోవడం వెనుక రాజకీయ కోణం దాగి వుందన్న జూన్ 2 నాటి తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని డైల్ స్పష్టం చేశారు. తనను అన్యాయంగా తొలగించారని అనను కానీ సంస్థ వైఖరితో విసిగిపోయానని పేర్కొన్నారు. ట్రంప్ ను సమర్దించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన కొంతమంది ఇంజనీర్ల బృందంలో డైల్ కూడా ఒకరు. మరోవైపు డైల్ తొలగింపును ఫేస్బుక్ కూడా ధృవీకరించింది. కానీ అంతకుమించి స్పందించేందుకు నిరాకరించింది. (జార్జ్ హత్య: మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల లేఖ) కాగా నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా ఆందోళనలు, నిరసన తెలుపుతున్న వారిని ఉద్దేశించి లూటీ చేస్తే..షూట్ చేస్తామంటూ ట్రంప్ హెచ్చరికలు ఫేస్బుక్లో వివాదాన్ని రగిలించాయి. దీనిపై ఆగ్రహాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేసిన పలువురు ఉద్యోగులు ఒక సమావేశంలో సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ ను నిలదీశారు. ట్రంప్ బెదిరింపు ధోరణి కంపెనీ పాలసీలను ఉల్లంఘించేదిగా ఉందని ఆరోపించారు. అయితే ట్రంప్ షేర్ చేసిన పోస్టులను అలా వదిలివేయాలన్న తన నిర్ణయంలో మార్పు ఉండదని జుకర్ బెర్గ్ స్పష్టం చేశారు. ట్రంప్ మెసేజ్ రెచ్చగొట్టేదిగా ఉందని తాను గానీ, తన పాలసీ టీమ్ గానీ భావించడం లేదని ఆయన వెల్లడించడంతో వివాదం మరింత ముదిరింది. ఇదే వివాదంలొ ఇప్పటికే తిమోతీ అనే ఉద్యోగి ఈ నెల 1 న రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. In the interest of transparency, I was let go for calling out an employee’s inaction here on Twitter. I stand by what I said. They didn’t give me the chance to quit 😅 https://t.co/zMw8ARMwZt — Brandon Dail (@aweary) June 12, 2020 -
‘ట్రంప్.. తిరిగి బంకర్లోకి వెళ్లు’
వాషింగ్టన్: సీటెల్ మేయర్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తిరిగి బంకర్లోకి వెళ్లాలంటూ ఎద్దేవా చేశారు. సీహాజ్(క్యాపిటల్ హిల్ అటానమస్ జోన్)లో జోక్యం చేసుకుంటానంటూ ట్రంప్ చేసిన హెచ్చరికలపై స్పందిస్తూ.. సీటెల్ మేయర్ ఈ వ్యాఖ్యలు చేశారు. జార్జ్ ఫ్లాయిడ్ నరహత్యకు నిరసనగా అమెరికా వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగిన సంగతి తెలిసిందే. నిరసనకారులు రెచ్చిపోతుండటంతో వైట్ హౌస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అప్రమత్తమయ్యారు. పరిస్థితులు చేయి దాటకముందే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను రహస్య బంకర్లోకి తీసుకెళ్లారు. ఈ సంఘటనను ఉద్దేశిస్తూ.. సీటెల్ మేయర్ ‘ట్రంప్ తిరిగి బంకర్లోకి వెళ్లు’ అంటూ వ్యాఖ్యానించాడు. జార్జ్ ఫ్లాయిడ్ నరహత్య వ్యతిరేక నిరసనల నేపథ్యంలో ఆందోళనకారులు సీటెల్‌ను ఆక్రమించుకున్నారు. వారిని ట్రంప్ దేశీయ ఉగ్రవాదులు అని వ్యాఖ్యానించారు. నిరసనకారులను వెనక్కి పివలకపోతే సీహాజ్లో జోక్యం చేసుకుంటానంటూ మేయర్ జెన్నీ దుర్కాన్వా, షింగ్టన్ రాష్ట్ర గవర్నర్ జే ఇన్స్లీలను ట్రంప్ హెచ్చరించారు. (బంకర్ బాయ్) Radical Left Governor @JayInslee and the Mayor of Seattle are being taunted and played at a level that our great Country has never seen before. Take back your city NOW. If you don’t do it, I will. This is not a game. These ugly Anarchists must be stopped IMMEDIATELY. MOVE FAST! — Donald J. Trump (@realDonaldTrump) June 11, 2020 -
రేసిజానికి అర్థం మార్చేసింది!
చేర్పు మొక్కకి శ్రద్ధగా అంటు కడతారు. కలిసిపోవాలి. కొత్తవి వికసించాలి. యూ.ఎస్.లో అలా లేదు. శ్రద్ధగా అంటు విడగొడుతున్నారు! ‘‘షిట్.. నల్లవాళ్లను కలుపుకోవడమా!’’ సి..స్ట..మే..టì...క్.. రేసిజం!! పైకి కనిపించని జాత్యహంకారం. డిక్షనరీలో ఇంత లోతైన అర్థం లేదు. పాతను తీసి, ఇప్పుడా లోతును చేర్చబోతోంది వెబ్‌స్టర్. అదీ ఒక విద్యార్థిని మాట మీద! యూనివర్సిటీ నుంచి కెన్నెడీ మిచమ్ ఫ్రెష్‌గా బయటికి వచ్చిందని చెప్పడానికి లేదు. నల్లజాతి అమ్మాయి. స్కూల్లో, కాలేజ్‌లో, యూనివర్సిటీలో నలిగి నలిగి.. ‘అమ్మ దేవుడా’ అని డిగ్రీతో బయటపడింది. తెల్ల చూపులు, తెల్ల మాటలు, తెల్ల సోషల్ డిస్టెన్స్లు.. అన్నీ అయి, అయోవాలోని డ్రేక్ విశ్వవిద్యాలయం నుంచి అకడమిక్ క్యాప్‌తో గేటు దాటగానే.. మినియాపలీస్లో పెద్ద పిడుగు. అదిరిపడింది. జార్జి ఫ్లాయిడ్ విషాద మరణం! అదురుపాట్లు మిచమ్కు కొత్తేం కాదు. జాత్యహంకారానికి అలవాటు పడలేకపోతోంది. మిస్సోరీలోని ఫ్లోరిసెంట్లో ఉంటుంది తను. అక్కడికి దగ్గర్లోనే ఫెర్గూసన్. 2014లో మైఖేల్ బ్రౌన్ అనే పద్దెనిమిదేళ్ల నల్లజాతి యువకుడిని ఒక పోలీసు అధికారి కాల్చి చంపింది ఫెర్గూసన్లోనే. నేటి ‘బ్లాక్ లైవ్స్ మేటర్’ ఉద్యమానికి నాంది అది. మిచమ్కి అప్పుడు పదహారేళ్లు. ఇంటికొచ్చాక పెద్దవాళ్లను అడిగింది.. ‘ఒక మనిషిని అలా ఎలా చంపేస్తారు?’ అని. ‘రేసిజం’ అన్నారు. ఆ మాటకు అర్థం కోసం ‘మెరియం వెబ్‌స్టర్’ డిక్షనరీలో వెతికింది. పుట్టిన జాతి నుంచి సంక్రమించే ఆధిక్యభావన అని ఉంది! ఆ అర్థం కరెక్టు కాదనిపించింది మిచమ్కు. ఆధిక్యభావన ఉంటే ఉండొచ్చు.. మనిషిని మనిషిలా చూడాలి కదా.. అనుకుంది. అమెరికాలో అత్యధికంగా విక్రయం అయ్యే నూటా ఎనభై ఐదేళ్ల నాటి మెరియం వెబ్‌స్టర్ డిక్షనరీని గొప్ప భాషా పండితులే రూపొందించి ఉండొచ్చు. కానీ బయట కనిపించే రేసిజానికి, డిక్షనరీలో కనిపిస్తున్న అర్థం సరిపోవడం లేదు ∙∙ ‘రేసిజం’ అంటే డిక్షనరీలో ఉన్న అర్థం కరెక్టేనా అని ప్రొఫెసర్లను అడిగింది మిచమ్. ‘అవును కరెక్టే కదా’ అన్నారు. ‘పైపై అర్థం కాదు సర్, వాస్తవ పరిస్థితికి ఆ అర్థం సరిపోతుందా?’ అని మళ్లీ అడిగింది. రెండోసారి వాళ్లు సమాధానం చెప్పలేదు. సోషల్ మీడియాలో ఈ టాపిక్‌ని తెచ్చింది. ‘నీకర్థం కాదులే’ అని కొందరన్నారు. ‘చదువుకోడానికి నీకు రిజర్వేషన్ ఉంది కదా. అదే రేసిజం’ అని నవ్వారు కొందరు. వాళ్ల మాటలు కూడా మిచల్కు రేసిజంలానే అనిపించాయి. కానీ అవి డిక్షనరీ అర్థం పరిధిలోకి రానివి! వాళ్ల మాటల్నే సరిగా నిర్వచించలేనప్పుడు జార్జిఫ్లాయిడ్‌ను చంపేసిన పోలీసు మోకాలిలోని జాత్యహంకారానికి మెరియం వెబ్‌స్టర్ సరైన అర్థాన్ని ఎలా చెప్పగలుగుతుంది? ఫ్లాయిడ్ మే 25న చనిపోయాడు. మిచల్ మే 28న ఆ డిక్షనరీ పబ్లిషర్లకు మెయిల్ పెట్టింది. ‘‘మీ డిక్షనరీలో రేసిజం అనే మాటకు ఉన్న అర్థం తప్పు. దానిని మార్చాలి’’ అని తను అనుకున్న అర్థం ఏమిటో రాసి పంపింది. వెంటనే వెబ్‌స్టర్ ఎడిటర్ ఆమెకు రిప్లయ్ ఇచ్చారు. ‘‘ఆగస్టులో మార్కెట్లోకి వచ్చే డిక్షనరీలో రేసిజానికి మా పాత అర్థాన్ని తొలగించి, మీ కొత్త అర్థాన్ని చేరుస్తున్నాం’’ అని తెలిపారు! ‘ఐ వాజ్ సూపర్ హ్యాపీ’ అంటోంది మిచమ్ ఆ రిప్లయ్‌ని చూసినప్పుడు తనకేం అనిపించిందో చెబుతూ. రేసిజాన్ని వెబ్‌స్టర్ ‘ఆధిక్య భావన’ అంది. మిచమ్ ‘అల్పులనే భావన’ అంది. అల్పులు అనే భావన మనసులో లేకపోతే అధిక్యం అనే భావనే ఉండదని మిచమ్ ఉద్దేశం. నల్లవాళ్లకు ఎందులోనూ అధికారం లేకుండా చేసేందుకు, ఒక ప్రణాళిక ప్రకారం (సి..స్ట..మే..ట...క్..గా) సాగుతున్న వివక్షే రేసిజం అనే అర్థం రావాలని మిచమ్ తపన. ఆ తపనని మెరియం వెబ్‌స్టర్ డిక్షనరీ గుర్తించి, గౌరవించింది. -
నల్లజాతీయులపై ఆరాచకాలకు ఇప్పటికైనా అడ్డుకట్ట పడాలి
-
అలసిపోయాం.. ఇక ఆపండి!
వాషింగ్టన్: తన సోదరుడిలా నల్లజాతీయులెవరూ అమెరికా పోలీసుల దాష్టీకాలకు బలికాకుండా చూడాలని ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ తమ్ముడు ఫిలోనిస్ ఫ్లాయిడ్ కోరుకున్నారు. జార్జ్ హత్య విచారణలో భాగంగా అమెరికా చట్టసభ(కాంగ్రెస్) ఎదుట ఆయన వాంగ్మూలం ఇచ్చారు. అగ్రరాజ్యంలో నల్లజాతీయులపై దారుణాలు కొనసాగుతుండటం పట్ల ఫిలోనిస్ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉద్వేగానికి లోనయ్యారు. ‘నేను అలిసిపోయాను. ఇప్పుడు అనుభవిస్తున్న బాధతో నేను విసిగిపోయాను. ఎటువంటి కారణం లేకుండా నల్లజాతీయులు చంపబడిన ప్రతిసారీ అనుభవిస్తున్న బాధతో నేను వేసారిపోయాను. దీన్ని ఆపమని మిమ్మల్ని అడగడానికి నేను ఈ రోజు ఇక్కడకు వచ్చాను. ఈ బాధలు ఇక వద్దు’ అని ఫిలోనిస్ ఫ్లాయిడ్ గద్గత స్వరంతో అన్నారు. జార్జ్ తమ్ముడి మాటలతో విచారణ గది నిశ్శబ్దంగా మారిపోయింది. ఒక నల్లజాతీయుడి ప్రాణం విలువ 20 వేల డాలర్లా? ఇది 2020. ఇక చాలు’ అన్న ఫిలోనిస్ ఆవేదన అందరినీ కదిలించింది. (ఫ్లాయిడ్‌కు కన్నీటి వీడ్కోలు) ఆ వీడియో బాధ కలిగిస్తోంది.. ‘మంచి పనులు చేస్తూ ఈ దేశానికి, ప్రపంచానికి అవసరమైన నాయకులుగా ఉండండి. పోలీసు హింస, అన్యాయానికి జార్జ్ ఫ్లాయిడ్ మరణం ప్రపంచ ప్రతీక నిలిచింది. కానీ జీవితంలో అతడు తండ్రి, సోదరుడు, సౌమ్యుడైన దిగ్గజం’ అని చట్టసభ సభ్యులతో ఫిలోనిస్ అన్నారు. జార్జ్ ఫ్లాయిడ్ మెడపై ఒక పోలీసు అధికారి మోకాలు ఉంచి ఊపిరాడకుండా చేసిన వీడియో న్యాయం కోసం చేసే ఉద్యమాలకు కొత్త ఊపిరి పోసినప్పటికీ.. పదేపదే జార్జ్ చివరి క్షణాలను గుర్తుచేయడం తమ కుటుంబానికి చాలా క్షోభ కలిగిస్తోందన్నారు. ‘నేను ఆ వీడియో గురించి పదే పదే ఆలోచిస్తాను. మనుషులతో ఎవరూ అలా ప్రవర్తించరు. జంతువులను కూడా అలా చేయరు’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తన సోదరుడి చావుకు కారణమైన పోలీసులను శిక్షించి తమకు న్యాయం చేయాలన్నారు. పోలీసు వ్యవస్థను ఇప్పటికైనా సంస్కరించాలని అమెరికా చట్టసభకు విన్నవించారు. తన సోదరుడి మరణం వృధా కాకుండా ఉండాలంటే వైట్‌హౌస్ సమీపంలోని వీధికి పెట్టిన ‘బ్లాక్ లైవ్స్ మేటర్’ పేరును కొనసాగించాలని ఫిలోనిస్ కోరారు. (అమెరికా ఆత్మను తట్టిలేపిన జార్జ్ ) కరోనా కారణంగా వర్చువల్ విధానంలో విచారణ చేపట్టారు. ఫ్లాయిడ్ కుటుంబం తరపు న్యాయవాది బెంజమిన్ క్రంప్, పౌర హక్కుల నాయకులు, చట్టసభ సభ్యులు సహా కొంతమంది మాత్రమే ముఖానికి మాస్కులతో విచారణకు హాజరయ్యారు. పోలీసులు అనుసరిస్తున్న పద్ధతులు, జవాబుదారీతనంలో సంస్కరణలు చేపట్టాలని బెంజమిన్ క్రంప్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా, పోలీసు విభాగానికి బడ్జెట్‌ను కోత పెట్టాలని, ఈ నిధులను సామాజిక సేవకు వినియోగించాలని ఆందోళకారులు డిమాండ్ చేస్తున్నారు. (పోలీస్ విభాగం రద్దుకు ఓటు) -
సత్య నాదెళ్లకు ఉద్యోగుల ఈమెయిల్
వాషింగ్టన్: ఆఫ్రికన్-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ (46) హత్యోదంతంతో అమెరికా అట్టుడుకుతోంది. నిరాయుధులైన నల్లజాతీయులను పోలీసులు హత్య చేయడంపై జాత్యహంకార వ్యతిరేక నిరసనలు మిన్నంటాయి. ఈ నిరసనలకు ఐటీ దిగ్గజాలు కూడా మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు తమ సీఈవో సత్య నాదెళ్లకు పంపించిన ఈమెయిల్ సందేశం ఆసక్తికరంగా మారింది. సియాటెల్ పోలీసు విభాగం, ఇతర చట్ట అమలు సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని కోరారు. ఈ మేరకు 200 మందికి పైగా మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు సీఈఓ సత్య నాదెళ్ల, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కర్ట్ డెల్బెన్‌లను ఉద్దేశించి అంతర్గత ఇ-మెయిల్ ద్వారా విజ్ఙప్తి చేశారు. (జార్జ్ హత్య : సత్య నాదెళ్ల స్పందన) వన్‌జీరో.మీడియం నివేదిక ప్రకారం "మా పొరుగు ప్రాంతాన్ని వార్‌జోన్‌గా మార్చారు" అనే పేరుతో ఈ సందేశాన్ని పంపారు. సియాటెల్ పోలీసు విభాగం (ఎస్పీడి) ఇతర చట్ట సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయడంతోపాటు బ్లాక్ లైవ్స్ మేటర్ (బీఎల్ఎమ్) ఉద్యమానికి అధికారికంగా మద్దతు ఇవ్వాలని కోరారు. అలాగే సియాటెల్ నగర మేయర్ రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమలో ప్రతి ఒక్కరం ఎస్పీడీ అమానవీయ దాడులకు బాధితులమని లేఖలో పేర్కొన్నారు. -
‘గతాన్ని గుర్తు చేస్తున్నాయి.. తొలగించండి’
లండన్: జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల ప్రభావం బ్రిటన్ మీద కూడా పడింది. ‘బ్లాక్‌లైవ్స్ మాటర్’ నిరసన సెగ దేశవ్యాప్తంగా ఉన్న బానిస వ్యాపారులు, వలసవాదుల విగ్రహాలకు తాకింది. మంగళవారం ఆందోళనకారులు లండన్ మ్యూజియం బయట ఉన్న 18వ శతాబ్దానికి చెందిన బానిసల వ్యాపారి రాబర్ట్ మిలిగాన్ విగ్రహాన్ని తొలగించారు. ఈ క్రమంలో లండన్ మేయర్ సాదిక్ ఖాన్ ‘మన నగరం, దేశ సంపద బానిస వ్యాపారం నుంచి ఉద్భవించిది అనేది వాస్తవం. బహిరంగ ప్రదేశాల్లో ఇందుకు సంబంధించిన వేడుకలు జరుపుకోనవసరం లేదు. ఈ విగ్రహాలు, రహదారి పేర్లు, బహిరంగ ప్రదేశాల పేర్లు పూర్వ యుగాన్ని ప్రతిబింబిస్తాయి. వీటి గురించి ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది’ అంటూ ట్వీట్ చేశారు. నిరసనల నేపథ్యంలో లండన్ వ్యాప్తంగా వలసవాదులు, బానిస వ్యాపారుల పేర్ల మీద ఉన్న విగ్రహాలు, వీధుల పేర్లను సమీక్షించేందుకు గాను ఓ కమిటిని నియమించినట్లు సాదిక్ ఖాన్ తెలిపారు. ఆదివారం నిరసనకారులు బ్రిస్టల్‌లోని ఇంగ్లీష్ పోర్టు సిటిలో ఉన్న ఓ బానిసల వ్యాపారి కోల్స్టోన్ విగ్రహాన్ని రేవులో పడేశారు. సోమవారం ఆక్స్‌ఫర్డ్‌లో 1,000 మందికి పైగా ప్రదర్శనకారులు వలసవాది సిసిల్ రోడ్ విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో టవర్ హామ్లెట్స్ మేయర్ జాన్ బిగ్స్ రాయిటర్స్‌తో మాట్లాడుతూ.. ‘విగ్రహాలను తొలగించడం మంచి పద్దతి కాదు. కానీ నిరసకారుల ఆందోళన వల్ల ప్రస్తుతం ఈ విగ్రహాలను తొలగించి స్టోర్ రూమ్‌లో భద్రపరిచి.. ఏం చేయాలనే దాని గురించి తర్వాత నిర్ణయం తీసుకుంటాం’ అన్నారు. (‘నువ్వు మమ్మల్ని కాలుస్తావా?’) ‘ప్రజలు ఇన్నాళ్లు విగ్రహాలు నిలబెట్టిన వ్యక్తులందరిని గొప్ప వ్యాపారవేత్తలుగా భావించారు. వారంతా దేశ ఉన్నతికి తోడ్పడ్డారని అనుకున్నారు. కానీ లోతుగా తరచి చూస్తే తెలిసే వాస్తవం ఏంటంటే వారంతా బానిస వ్యాపారులు. అందుకే ఎడ్వర్డ్ కోల్స్టోన్ విగ్రహాన్ని తొలగిస్తున్న నిరసనకారులను బ్రిస్టల్ పోలీసులు అడ్డుకోలేదు’ అన్నారు బిగ్స్. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మాత్రం ఎడ్వర్డ్ కోల్స్టోన్ విగ్రహాన్ని తొలగించడాన్ని నేరంగా వర్ణించారు. -
ఫ్లాయిడ్‌కు కన్నీటి వీడ్కోలు
హ్యూస్టన్/వాటికన్ సిటీ: పోలీస్ అధికారుల దాష్టీకానికి బలైన ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ అంత్యక్రియలు మంగళవారం ఘనంగా ముగిశాయి. వందలాది మంది మద్దతుదారులు ముఖానికి మాస్కులు ధరించి మరీ హ్యూస్టన్‌లోని ఓ చర్చిలో ఫ్లాయిడ్‌కు అంతిమ వీడ్కోలు పలికారు. కుటుంబ సభ్యులు, మిత్రులు ఫ్లాయిడ్‌తో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతం కాగా.. అమెరికాలో జాతివివక్షకు ఇకనైనా చరమగీతం పాడాల్సిందేనని పిలుపునిచ్చారు. గత నెల 25న మినియాపోలిస్‌లో డెరెక్ ఛావెన్ అనే శ్వేతజాతీయుడైన పోలీస్ అధికారి అరెస్ట్ చేసే క్రమంలో గొంతుపై మోకాలిని ఉంచడం.. దీంతో ఊపిరిఆడక ఫ్లాయిడ్ మరణించడం తెలిసిందే. ప్రజల సందర్శనార్థం ఒక రోజంత ఉంచిన తరువాత మంగళవారం తల్లి సమాధి పక్కనే ఫ్లాయిడ్‌ను ఖననం చేశారు. ఫ్లాయిడ్ హత్యపై స్పందించిన పోప్: ఫ్లాయిడ్ హత్య అనంతరం జరిగిన ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఆందోళనల్లో అమెరికా బిషప్ ఒకరు పాల్గొని, ప్రార్థనలు చేయడాన్ని పోప్ ఫ్రాన్సిస్ సమర్ధించారు. ఈ సందర్భంగా జార్జ్ ఫ్లాయిడ్ పేరును రెండు సార్లు ప్రస్తావించారు. సాధారణ పరిస్థితుల్లో శ్వేతజాతి పోలీసు అధికారి చేతుల్లో జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు గురవడం, దానిపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగడం తదితర ఘటనలపై వాటికన్ అంతగా స్పందించదు. కానీ, ప్రస్తుతం అమెరికాలో ఎన్నికల సంవత్సరం నడుస్తోంది. అధ్యక్షుడు ట్రంప్ మరోసారి బరిలో నిలిచారు. ఈ సమయంలో జాత్యహంకార వ్యతిరేక ప్రదర్శలకు పోప్ తదితరులు మద్దతివ్వడం ఆసక్తికరంగా మారింది. ఈ సారి అమెరికన్ కేథలిక్స్ ఎవరికి మద్దతివ్వనున్నారనేది చర్చనీయాంశమైంది. (అతడు ఈ ప్రపంచాన్ని మార్చబోతున్నాడు) -
అమెరికా ఆత్మను తట్టిలేపిన జార్జ్
అమెరికాలో ప్రస్తుతం ఉంటున్న వారిలో ఏ ఒక్కరు కూడా ప్రస్తుత పరిణామాలు మునుపెన్నడైనా జరిగి ఉంటాయని గుర్తించలేకపోతున్నారు. ఇది నిజంగానే ఆ దేశ చరిత్రలో ఒక అపూర్వమైన మహనీయ గాథ. అన్నిజాతులకు చెందిన యువ అమెరికన్లు కోవిడ్–19 బారినపడే ప్రమాదాన్ని కూడా పట్టించుకోకుండా.. వేలాదిగా వీధుల్లోకి వచ్చి ఊరేగింపు తీస్తున్నారు. మినియాపోలిస్‌లో నిరాయుధుడైన నల్లజాతీయుడిని క్రూరంగా హత్య చేసిన ఘటన అమెరికాలో అసాధారణ పర్యవసానాలకు దారి తీసింది. ప్రజలను విడదీస్తున్న రాజకీయాలకు కాలం చెల్లిపోవచ్చునని ఈ పరిణామాలు తెలిపాయి. అయితే ఈ పరిణామాలు ఒక్క అమెరికాకు మాత్రమే పరిమితం కావని మనం ఆశించవచ్చు. ప్రస్తుతం భారతదేశంలో, అమెరికాలో కనిపిస్తున్న దృశ్యాల మధ్య అసంఖ్యాకమైన పోలికలు కనిపిస్తున్నాయి. ఈ రెండు దేశాల రాజధాని భూభాగాలకు ఆ పోలికల్లో ప్రత్యేక స్థానం ఉందని చెప్పాల్సి ఉంటుంది. ఢిల్లీ పూర్తి స్థాయి రాష్ట్రం కాదు. ఇక వాషింగ్టన్ డీసీ విషయానికి వస్తే అమెరికన్ సెనేట్‌లో దానికి కనీస స్థానం కూడా లేదు. ఇకపోతే ప్రతినిధుల సభలో ఉంటున్న దాని ఏకైక ప్రతినిధికి ఓటు హక్కు కూడా లేదు. జాతిపరమైన సమానత్వం కోసం అమెరికాలోని ప్రతి నగరంలో జరుగుతున్నట్లే, వాషింగ్టన్ డీసీ నగరంలోని జనం కూడా తన కళ్లముందే, తనకు బిగ్గరగా వినబడేటట్లు నిరసన ప్రదర్శనలు చేస్తుండటంపై దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహంతో ఊగిపోయారు. ఇటుక తరువాత ఇటుకను పేర్చినట్లుగా, బ్యారికేడ్ తర్వాత బ్యారికేడ్ పెట్టినట్లుగా వైట్ హౌస్ వాస్తవ సరిహద్దులను విస్తరింపచేయడానికి ట్రంప్ ప్రయత్నించారు. అయితే మనం 2020వ సంవత్సరంలో ఉంటున్నందున ట్రంప్ అసహ్యకరమైన ప్రయాసను ప్రపంచం మొత్తం గమనించింది. శ్వేతసౌధం పక్కనే ఉన్న చర్చి ముందు ఫోటో దిగుతూ ట్రంప్ పొందిన దురవస్థ కానీ, తన భద్రత కోసం వైట్‌హౌస్ బంకర్లోకి దిగిపోవడం కానీ ప్రపంచం చాలాకాలంపాటు గుర్తుంచుకుంటుంది. ట్రంప్ అబద్దాలను ఎలా గుప్పిస్తారో (వాటిలో ప్రతి ఒక్కదాన్ని ట్రంప్ వీడియోనే ఖండించింది) ఉల్లాసకరంగా గమనించిన తర్వాత, ట్రంప్‌ను పూర్తిగా విశ్వసించే వారు కూడా వైట్ హౌస్ బంకర్‌ని కేవలం తనిఖీ మాత్రమే చేశానని తాను చెప్పిన కథను నమ్మడానికి ఇబ్బందిపడ్డారనే చెప్పాల్సి ఉంటుంది. వచ్చే నవంబర్‌లో ట్రంప్ భంగపాటు, పతనం, బహుశా గద్దె దిగిపోవడం కూడా అమెరికాలో ఈరోజు ప్రధాన వార్త కాదు. సమానత్వం కోసం నేడు సాగుతున్న నిరసనల పరిమాణం, వాటి సర్వవ్యాపకత, అనంతత్వం, జాతిపరమైన వైవిధ్యత మాత్రమే నేడు అమెరికాలో అసలైన వార్తలుగా ఉంటున్నాయి. అమెరికాలో ప్రస్తుతం ఉంటున్న వారిలో ఏ ఒక్కరు కూడా ఇలాంటి పరిణామాలు మునుపెన్నడైనా జరిగి ఉంటాయని గుర్తించలేకపోతున్నారు. ఇది నిజంగానే ఆ దేశ చరిత్రలో ఒక అపూర్వమైన మహనీయ గాథ. నిరసన ప్రదర్శనలకు సంబంధించి నేను సూచించిన నాలుగు లక్షణాల్లో చివరి రెండింటికి మాత్రమే అత్యంత ప్రాధాన్యముంది. అన్నిజాతులకు చెందిన యువ అమెరికన్లు కోవిడ్–19 బారిన పడే ప్రమాదాన్ని కూడా పట్టించుకోకుండా.. వేలాదిగా వీధుల్లోకి వచ్చి ఊరేగింపు తీస్తున్నారు. నిరాయుధుడైన నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్‌ని మినియాపోలిస్ అధికారి హత్య చేసిన దృశ్యాన్ని అయిదడుగుల దూరంలోనుంచి కళ్లకు కట్టినట్లుగా చూపించిన ఆ తొమ్మిది నిమిషాల వీడియోను, 17 సంవత్సరాల యువతి డార్నెల్లా ఫ్రేజర్ చిత్రించింది. ఆ వీడియోను ఆమె పోస్ట్ చేసిన తర్వాతే అమెరికా వ్యాప్తంగా కనీవినీ ఎరుగని రీతిలో నిరసన ప్రదర్శనలు చెలరేగాయి. దాని ప్రతిధ్వనులు ప్రపంచమంతా వినిపించాయి. ఆ నిరసనల క్రమంలో లూటీ, కొన్ని హింసాత్మక ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. కానీ ఆ వీడియోను చూశాక పీడితులైన నల్లజాతీయులకు వ్యతిరేకంగా నిరంతరం జరుగుతున్న అన్యాయంపట్ల రగిలిన ఆగ్రహానుభూతులే హింసాత్మక చర్యలకు కారణమయ్యాయి కానీ నిరసనకారుల్లో మెజారిటీ వాటికి ఆమోదం తెలపలేదన్నది వాస్తవం. కానీ నిరసనకారుల్లో చాలామంది న్యాయాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూనే చాలావరకు శాంతియుతంగా మెలగాలని నిర్ణయించుకున్నారు. హింసాత్మక ఘటనలకు పాల్పడిన వారి ముఖాలు, వారి నేపథ్యాలు, ఉద్దేశాల గురించి దర్యాప్తులో బయటపడవచ్చు. కానీ ఇలా హింసకు పాల్పడిన వారు సమానత్వాన్ని, న్యాయాన్ని కోరుకున్నారనేందుకు ఎలాంటి సంకేతమూ లేదు. అశాంతిని కఠినంగా అణిచివేయడానికి మద్దతు సాధించడం కోసం కూడా కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఇలా చేసి ఉంటారా? ఇది నిజమే అయితే అలాంటివారు ఘోరంగా విఫలమైనట్లే లెక్క. తాను అమెరికా శాంతి భద్రతలు కాపాడే అధ్యక్షుడినని ట్రంప్ ప్రకటించడమే కాకుండా.. డెమోక్రాట్ల ఆధిపత్యంలో ఉన్న నగరాలు, రాష్ట్రాల్లో సాగుతున్న అరాచకత్వాన్ని అణిచివేయడానికి ఫెడరల్ సైన్యబలగాలను పంపడానికైనా వెనుకాడనని హెచ్చరించారు. తన హెచ్చరికను నొక్కి చెప్పడానికా అన్నట్లుగా, ప్రస్తుత అమెరికా త్రివిధ దళాల జాయింట్ చెఫ్‌ల చైర్మన్‌గా వ్యవహరిస్తున్న జనరల్ మార్క్ మిల్లేని కూడా వైట్ హౌస్ పక్కనే ఉన్న దెబ్బతిన్న చర్చికి నడిచివెళ్లేటప్పుడు ట్రంప్ తన వెంట తీసుకుపోయారు. అయితే ట్రంప్ చేసిన హెచ్చరికను ట్రంప్ రక్షణమంత్రిగా రెండేళ్లు పనిచేసిన మాజీ మెరైన్ చీఫ్ జేమ్స్ మ్యాటిస్ తిప్పికొట్టారు. దేశానికి ఐక్యత అతిగొప్ప అవసరంగా ఉంటున్న తరుణంలో ట్రంప్ దేశాన్ని నిలువునా చీల్చివేస్తున్నాడని జేమ్స్ ఏకిపడేశారు. పాలనాపరంగా స్పందించాల్సిన అంశాన్ని సైనికపరం చేయాలన్న ఆలోచనను అమెరికా సైన్య మాజీ అధిపతులు కూడా వ్యతిరేకించారు. ట్రంప్‌తోపాటు చర్చికి నడుచుకుంటూ వెళ్లిన ప్రస్తుత రక్షణమంత్రి మార్క్ ఎస్పర్ కూడా ట్రంప్ హెచ్చరికకు మద్దతునివ్వకపోగా, అమెరికా సైన్యం జోక్యం చేసుకోవలసిన పరిస్థితులు ఇప్పుడు లేవని చెప్పేశారు. అయితే కీలకమైన రాష్ట్రాల్లో తన ప్రత్యర్థి జో బిడెన్ తనకంటే ముందు ఉన్నారని పోల్స్ సూచించిన రోజున ట్రంప్ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవలసి వచ్చింది. మళ్లీ నిరసన ప్రదర్శనల వద్దకు వెళదాం. అమెరికాలో ప్రస్తుత ప్రదర్శనలు 2019 చివరినెలలు, 2020 ప్రారంభంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా భారత్‌లో కనిపించిన దృశ్యాలను నాకు గుర్తుకు తెచ్చాయి. కేంద్రప్రభుత్వం పౌరసత్వనిర్ధారణపై తీసుకొస్తున్న కొత్త చట్టం నుంచి ముస్లింలను పక్కకు పెట్టడాన్ని నిరసిస్తూ దేశంలోని అన్ని నగరాల్లోని హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లు పెద్ద ఎత్తున ముస్లింలతో కలిసి భారీ నిరసనలకు సిద్ధమయ్యారు. భారత్, అమెరికాలకు సంబంధించి ఇతర రాజకీయ పోలికలు లేక లింకుల గురించి కూడా సులువుగా ఆలోచించవచ్చు. ఉదాహరణకు అమెరికా వీధుల్లో ఈ రోజు జరుగుతున్న అహింసాత్మక నిరనసలు భారత్‌లో చాలా కాలం జరిగిన ఇదే రకమైన పోరాటాలను గుర్తు చేస్తున్నాయని భారతీయులు భావించవచ్చు. భారత్‌లో గాంధీ నిర్వహించిన కేంపెయిన్లనుంచి గ్రహించిన అంశాలనే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అతని అనుయాయులు నల్లజాతి హక్కుల ఉద్యమంలో ఉపయోగించిన విషయాన్ని కూడా భారతీయులు ఇప్పుడు గుర్తుకు తెచ్చుకోవచ్చు. అదృష్టవశాత్తూ అమెరికా వీధుల్లో సమానత్వం కోసం ఇస్తున్న పిలుపుల్లో భారతీయుల స్వరాలు కూడా అక్కడక్కడా వినిపించవచ్చు. కానీ అమెరికాలోని ఇతర భారతీయులు హౌస్టన్‌లో ట్రంప్‌కి బ్రహ్మాండంగా స్వాగతమిచ్చారు. దీన్ని అలా పక్కనుంచండి. భారత్‌లో దళితులు, మైనారిటీలు ప్రతి నిత్యం ఘర్షిస్తున్న తీరు అమెరికాలో నల్లజాతీయులు అవిరామంగా సాగిస్తున్న ఘర్షణలకు ఏమాత్రం భిన్నంగా లేదు. అందుకే ఈ రోజు అమెరికాలో జరుగుతున్న ఘటనలనుంచి భారత్‌లో నిర్లక్ష్యానికి గురైన మైనారిటీలు ప్రేరణ పొందవచ్చు. అయితే అదే సమయంలో రెండు దేశాల మధ్య వ్యత్యాసాలు కూడా ఉంటున్నాయని కూడా గమనించాలి. జార్జి హత్యాఘటన నేపథ్యంలో ఇప్పుడు అమెరికాలోని పలు నగరాలు పూర్తి ఆశావాదాన్ని కలిగివుండి, న్యాయంకోసం డిమాండ్ చేస్తున్న అన్ని రకాల జాతులకు చెందిన యువతీయువకులతో నిండి ఉంటున్నాయి. భారతదేశంలోని వీధులు మాత్రం ఇప్పటికీ భయకంపితులవుతున్న, ఆకలితో అలమటిస్తున్న వలస కార్మికులతో నిండి ఉంటున్నాయి. భారత్‌తో పోలిస్తే అమెరికాలోని యూనివర్సిటీలు, కోర్టులు, వార్తాపత్రికలు, టీవీ చానల్స్ వంటివి సమానత్వ హక్కును, వాక్ స్వేచ్ఛా హక్కును ఎత్తిపట్టాలంటూ డిమాండ్ చేయడంలో ఎంతో సాహసాన్ని ప్రదర్శిస్తున్నాయి. పైగా, అమెరికాలో నేడు తలెత్తిన తీవ్ర నిరసనల ధోరణి రేపు కూడా కొనసాగుతుందని గ్యారంటీ ఏమీ లేదు.అదే సమయంలో మినియాపోలిస్‌లో నిరాయుధుడైన నల్లజాతీయుడిని క్రూరంగా హత్య చేసిన ఘటన అమెరికాలో అసాధారణ పర్యవసానాలకు దారి తీసింది. నాణ్యత, పాలన అనేవి ఎంతో విలువైనవని, ప్రజలను విడదీస్తున్న రాజకీయాలకు కాలం చెల్లిపోవచ్చునని ఈ పరిణామాలు తెలిపాయి. అయితే ఈ పరిణామాలు ఒక్క అమెరికాకు మాత్రమే పరిమితం కావని మనం ఆశించవచ్చు. రాజ్‌మోహన్ గాంధీ వ్యాసకర్త ప్రొఫెసర్,ఇలినాయిస్ యూనివర్సిటీ,యూఎస్ -
అమెరికాలో మరో నల్ల జాతీయుడి నరహత్య
వాషింగ్టన్: అమెరికా పోలీసుల చేతిలో దారుణ నరహత్యకు గురయిన జార్జ్ ఫ్లాయిడ్ ఘటన మరవక ముందే అలాంటి సంఘటన మరోకటి వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఏ అండ్ ఈ నెట్‌వర్క్‌లో వచ్చే రియల్ టైమ్ పోలీస్ షో ‘లైవ్ పీడీ’ కోసం పోలీసులు ఈ వీడియోను ఏడాది క్రితం చిత్రీకరించారు. ఈ ఘటనలో మరో నల్ల జాతీయుడు మరణించాడు. జార్జ్ ఫ్లాయిడ్ మరణం తర్వాత ఈ వీడియో, ఇందుకు సంబంధించిన నివేదిక వెలుగులోకి వచ్చింది. టెక్సాస్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ క్రింద ఈ నివేదిక వెల్లడయ్యింది. వివరాలు.. జావియర్ అంబ్లెయర్ అనే వ్యక్తి స్నేహితులతో కలిసి పోకర్ ఆడి ఇంటికి వెళ్తుండగా విలియమ్సన్ కౌంటీ డిప్యూటీ జేజే జాన్సన్ అతడిని అడ్డగించాడు. అంబ్లర్ హెడ్‌లైట్స్ అధికంగా ఫోకస్ చేస్తున్నాడని ఆరోపించాడు. జాన్సన్ తన తుపాకీని గీసి, అంబ్లర్ను తన కారు నుంచి దిగమని డిమాండ్ చేశాడు. దాంతో అతను కారు బయటకు వచ్చి చేతులు పైకి లేపి నిలబడ్డాడు. ఆ తర్వాత అంబ్లర్ తన కారు వద్దకు వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా.. జాన్సన్ టేజర్‌తో అతడిని కింద పడేస్తాడు. దాంతో అంబ్లర్ మోకాలి మీద నిల్చుని పైకి లేచేందుకు ప్రయత్నిస్తాడు. ఈలోపు వైట్ విలియమ్సన్ కౌంటీ షెరీఫ్ డిప్యూటీ తన “లైవ్ పీడీ” సిబ్బందితో వచ్చి టేజర్‌ను అంబ్లర్ వీపుకు గురి పెడతాడు. ఇద్దరి మధ్య చిన్న పొరాటం లాంటి జరుగుతుండగా మరో ఆస్టిన్ పోలీసు అధికారి ఒకరు సంఘటన స్థలానికి వచ్చి అంబ్లర్కు హ్యాండ్‌కఫ్స్ వేస్తాడు. తనను వదిలివేయాల్సిందిగా అంబ్లర్ వేడుకోవడం వీడియోలో వినవచ్చు. ‘సార్ నేను మీరు చెప్పినట్లు చేయగలను. కానీ నా గుండె చాలా బలహీనంగా ఉంది. అందుకే మీరు చెప్పినట్లు చేయలేకపోతున్నాను. నేను మిమ్మల్ని వ్యతిరేకించడం లేదు. సార్ నాకు ఊపిరి ఆడటం లేదు. దయచేసి.. దయచేసి నన్ను వదిలి పెట్టండి. నన్ను కాపాడండి’ అని వేడుకుంటాడు అంబ్లర్. పోలీసులు మేం చేప్పినట్లు చేయాలని డిమాండ్ చేస్తారు. అందుకు అంబ్లర్ తాను అలా చేయలేనని చెబుతూ ప్రాణం వదులుతాడు. చేతులు వేళ్లాడేస్తాడు. (ఆగని ఆందోళనలు) ఈ లోపు అధికారి మరోసారి టేజర్‌తో కాల్పులు జరుపుతాడు. అంబ్లర్ స్పృహ తప్పిపోవడం గమనించిన పోలీసులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్తారు. వైద్యులు అంబ్లర్ అప్పటికే మరణించాడని తెలిపారు. గుండెకు రక్త ప్రసరణ ఆగిపోవడం వల్లే అతడు మరణించినట్లు నివేదిక వెల్లడించింది. స్టేట్ అటార్నీ జనరల్ కార్యాలయానికి చేసిన నివేదిక ప్రకారం అంబ్లర్ది నరహత్యగా పేర్కొంది. పోస్టు మార్టమ్ నివేదికలో గుండెకు రక్తప్రసరణ ఆగిపోవడం, రక్తపోటు హృదయ సంబంధ వ్యాధులతో అంబ్లర్ మరణించాడని వెల్లడించింది. (‘అతడు ఈ ప్రపంచాన్ని మార్చబోతున్నాడు’) -
‘అతడు ఈ ప్రపంచాన్ని మార్చబోతున్నాడు’
వాషింగ్టన్: శ్వేత జాతీ పోలీసుల చేతిలో దారుణ హత్యకు గురయిన ఆఫ్రో-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ స్వస్థలమైన హ్యూస్టన్‌లో మంగళవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. తన తల్లి సమాధి పక్కనే ఆయన మృతదేహాన్ని కూడా ఖననం చేశారు. ఆరు రోజుల సంతాప దినాల తర్వాత మూడు నగరాల్లో ఫ్లాయిడ్ మృతదేహాన్ని ప్రదర్శించారు. ఫ్లాయిడ్ పుట్టిన నార్త్ కరోలినాలోని రేఫోర్డ్, అతను పెరిగిన హ్యూస్టన్, అతడు మరణించిన మిన్నియాపాలిస్ నగరాల్లో ప్రదర్శించారు. వేలాది మంది ఫ్లాయిడ్ మృతదేహానికి నివాళులర్పించేందుకు తరలి వచ్చారు. వీరిలో నటులు జామీ ఫాక్స్, చాన్నింగ్ టాటమ్, రాపర్ ట్రే థా ట్రూత్, రిపబ్లిక్ షీలా జాక్సన్ లీ, హూస్టన్ పోలీస్ చీఫ్ ఆర్ట్ అసేవెడో, హ్యూస్టన్ మేయర్ సిల్వెస్టర్ టర్నర్, గ్రామీ విజేత నే-యో కూడా ఉన్నారు. మాజీ వైస్ ప్రెసిడెంట్, డెమొక్రాటిక్ ప్రెసిడెంట్ అభ్యర్థి జో బిడెన్, ఫ్లాయిడ్ ఆరేళ్ల కుమార్తెను ఉద్దేశిస్తూ.. ‘ఏ పిల్లలు అడగలేని చాలా ప్రశ్నలు నీ మదిలో తలెత్తుతున్నాయని నాకు తెలుసు. తరాలుగా నల్ల జాతి పిల్లలంతా ఈ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. జాత్యాంహకారాన్ని రూపమాపడానికి.. సమ న్యాయం చేయడానికి. భవిష్యత్తులో మన పిల్లలు ఎందుకు ఇలా జరిగింది అంటే మనం సమాధానం చెప్పగలగాలి’ అన్నారు. అయితే ఆయన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి ఎలాంటి విమర్శలు చేయలేదు. మరి కొందరు మాత్రం ట్రంప్‌పై విమర్శల వర్షం కురిపించారు. ‘అధ్యక్షుడు మిలిటరీని తీసుకురావడం గురించి మాట్లాడుతుంటాడు. కాని 8 నిమిషాల 46 సెకన్ల పాటు జరిగిన జార్జ్ ఫ్లాయిడ్ హత్య గురించి అతను ఒక్క మాట కూడా మాట్లాడలేదు’ అని పౌర హక్కుల కార్యకర్త రెవ. అల్ షార్ప్టన్ అన్నారు. ట్రంప్ మానవ హక్కుల గురించి చైనాను సవాలు చేస్తాడు. కానీ జార్జ్ ఫ్లాయిడ్ మానవ హక్కు గురించి మాట్లడడు అన్నారు. (బంకర్ బాయ్) -
జార్జ్ ఫ్లాయిడ్‌కు ఘన నివాళి
హ్యూస్టన్: పోలీసు అధికారి చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్‌ఫ్లాయిడ్‌కు సోమవారంవేలాది మంది అమెరికన్లు ఘన నివాళి అర్పించారు. హ్యూస్టన్‌లోని ఓ చర్చిలో మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచగా.. వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు ఐదు వేల మంది ఫ్లాయిడ్‌కు అంతిమ వీడ్కోలు పలికారు. సుమారు ఆరుగంటల పాటు మండే ఎండలనూ తట్టుకుని మద్దతుదారులు ఫ్లాయిడ్ శవపేటిక ముందు మౌనం దాల్చి శ్రద్ధాంజలి ఘటించారు. గత నెల 25న మినియాపోలిస్‌లో డెరెక్ ఛావిన్ అనే పోలీస్ అధికారి ఫ్లాయిడ్ మెడపై తన మోకాలిని ఉంచి అరెస్ట్ చేసే ప్రయత్నం చేయడం.. సుమారు ఎనిమిది నిమిషాల 46 సెకన్లపాటు మెడపై మోకాలు ఉండిపోవడంతో ఊపిరి ఆడక 46 ఏళ్ల ఫ్లాయిడ్ మృతి చెందడం తెల్సిందే. ఈ మరణం కాస్తా అమెరికాలో జాతి వివక్ష, పోలీస్ సంస్కరణల డిమాండ్లతో భారీ ఉద్యమానికి బీజం పడేలా చేసింది. -
జార్జ్ ఫ్లాయిడ్ హత్య; నిందితుడికి బెయిల్
వాషింగ్టన్: అమెరికాను అతలాకుతలం చేసిన ఆఫ్రికన్–అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్యతో సంబంధం ఉన్న పోలీసు అధికారి డెరెక్ చౌవిన్‌కి మిన్నియాపాలిస్ కోర్టు న్యాయమూర్తి మిలియన్ డాలర్ల (ఇండియన్ కరెన్సీలో రూ.7,55,25,050.00) పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేశారు. మే 25న జరిగిన ఘటనలో చౌవిన్, ఫ్లాయిడ్ మెడపై మోకాలుతో నొక్కి అతడి మరణానికి కారణమయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం మిన్నెసోటా రాష్ట్ర కోర్టు వీడియో ద్వారా చౌవిన్‌కు రెండవ డిగ్రీ హత్య, మూడవ డిగ్రీ హత్య, నరహత్య నేరాలకు శిక్ష విధించింది. ఈ క్రమంలో హెన్నెపిన్ కౌంటీ డిస్ట్రిక్ట్ కోర్ట్ న్యాయమూర్తి జెన్నిస్ రెడింగ్, చౌవిన్‌కు షరతులుతో 1 మిలియన్ డాలర్ల పూచీకత్తుతో, షరతులు లేకుండా 1.25 మిలియన్ డాలర్ల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేశారు. చౌవిన్ వద్ద ఉన్న ప్రభుత్వ ఆయుధాలను తిరిగి ఇచ్చేయడమే కాక.. లా ఎన్ఫోర్స్మెంట్, సెక్యూరిటీ విభాగాల్లో పని చేయకూడదని కోర్టు ఆదేశించింది. అంతేకాక ఫ్లాయిడ్ కుటుంబంతో ఎలాంటి సంబంధం ఉండకూడదని హెచ్చరించింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ కేసులో చౌవిన్‌తో పాటు ఉన్న మరో ముగ్గురు పోలీసులు హత్యకు సహకరించారనే అభియోగం మీద స్థానిక జైలులో ఉన్నారు. (పోలీస్ విభాగం రద్దుకు మినియాపోలిస్ సిటీ కౌన్సిల్ తీర్మానం) -
పోలీస్ విభాగం రద్దుకు ఓటు
హ్యూస్టన్/వాషింగ్టన్: ఆఫ్రో అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మరణించిన నేపథ్యంలో అమెరికా వ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలిప్పుడు శాంతియుత ప్రదర్శనలుగా మారిపోయాయి. పోలీసు సంస్కరణలే ప్రధాన డిమాండ్‌గా ఈ ప్రదర్శనలు జరుగుతూండటంతో పోలీసులు కూడా దుడుకు చర్యలకు పాల్పడకుండా సంయమనం పాటిస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్లాయిడ్‌తో పోలీసు అధికారి వ్యవహరించిన తీరును నిరసిస్తూ మినియాపోలిస్ సిటీకౌన్సిల్ సభ్యులు పోలీస్ విభాగం మొత్తాన్ని రద్దు చేయాలని తీర్మానించారు. దీని స్థానంలో సరికొత్త పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, ప్రజలను సురక్షితంగా ఉంచేలా పనిచేసే కొత్త మోడల్‌ను ప్రవేశపెడతామని సిటీ కౌన్సిల్ అధ్యక్షుడు లిసా బెండర్ తెలిపారు. ప్రస్తుత వ్యవస్థ సమాజానికి ఏమాత్రం రక్షణ కల్పించడం లేదన్నారు. పోలీస్ విభాగం రద్దుకు సిటీ కౌన్సిల్ సభ్యులు అత్యధికం మద్దతిస్తున్నారని కౌన్సిలర్ అలోండ్రా కానో తెలిపారు. గత నెల 25న మినియాపోలిస్ పోలీస్ అధికారి డెరెక్ చావెన్ దాష్టీకం కారణంగా ఫ్లాయిడ్ మరణించిన విషయం తెలిసిందే చర్చిలో ప్రజల సందర్శనార్థం జార్జ్ ఫ్లాయిడ్ అంత్యక్రియలకు రంగం సిద్ధమైంది. హ్యూస్టన్‌లో తల్లి సమాధి పక్కనే ఫ్లాయిడ్ మృతదేహాన్ని మంగళవారం ఖననం చేయనున్నట్లు కుటుంబం తరఫు మీడియా ప్రతినిధి ఒకరు ప్రకటించారు. హిల్‌క్రాఫ్ట్ అవెన్యూలోని ‘ద ఫౌంటేన్ ఆఫ్ ప్రెయిస్’చర్చిలో ఫ్లాయిడ్ మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారని, ఆ తరువాత అంత్యక్రియలు నిర్వహిస్తారని తెలిసింది. అమెరికా అధ్యక్ష పదవికి డెమొక్రాట్ల తరఫున పోటీ చేస్తున్న జో బైడెన్ ఫ్లాయిడ్ కుటుంబాన్ని కలుస్తారని ఆయన సహాయకుడొకరు తెలిపారు. సియాటెల్‌లో జరిగిన నిరసన ప్రదర్శనలో ఆందోళనకారులు సీసాలు, రాళ్లతో దాడులకు దిగారు. ఆదివారం రాత్రి ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరుపుతూ తన వాహనాన్ని ఆందోళనకారులపైకి నడిపించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనలో ఒకరికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఇలా ఉండగా ఫ్లాయిడ్ మరణానికి కారణమైన అధికారి డెరెక్ ఛావెన్ సోమవారం కోర్టు ముందు హాజరు కానున్నాడు. -
నల్లజాతి నినాదం సారాపై ట్రోలింగ్
All lives matter అని పోస్ట్ చేసినందుకు సారా అలీఖాన్‌పై ట్రోలింగ్ జరుగుతోంది. #Blacklivesmatter అనే నల్లజాతి నినాదంలోని Black అనే మాటను ఎర్రగీతతో కొట్టేసి, దానిపైన అ అని రాసి సారా షేర్ చేసిన ఆ పోస్టులో అసలు నినాద చిత్రంలో ఉన్నవిధంగా పిడికిలి బిగించి ఒక తెల్ల చెయ్యి, ఒక గోధుమ రంగు చెయ్యి, ఒక నల్ల చెయ్యి ఉంటాయి. వాటి పక్కన సారా అదనంగా ఏనుగు తొండాన్ని మరొక పిడికిలిలా యాడ్ చేశారు. చేసి, జీవులందరి ప్రాణాలూ ముఖ్యమైనవే అనే అర్థంలో అ అనే మాటను పెట్టారు. ఇటీవల కేరళలో ఒక ఏనుగును అమానుషంగా చంపడాన్ని దృష్టిలో పెట్టుకుని సారా అలా చేశారు. అయితే అది వివాదం అయింది. సహనటుడు కరణ్వీర్ బోరా.. సారాకు మద్దతుగా ఆమె ఉద్దేశాన్ని విడమరిచి చెబుతూ ఒక పోస్ట్ పెట్టవలసి వచ్చింది. సారా అలీఖాన్, కరణ్వీర్ బోరా -
ఆగని ఆందోళనలు
వాషింగ్టన్/ఫిలడెల్ఫియా: ఆఫ్రికన్–అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మరణంపై వెల్లువెత్తిన ఆగ్రహావేశాలు క్రమేపీ తగ్గి ప్రజలు శాంతియుత నిరసనల బాట పడుతున్నారు. వ్యవస్థలో మార్పు రావాలని కోరుకుంటున్నారు. మినియాపొలిస్‌లో పోలీసుల దమనకాండకు ఫ్లాయిడ్ బలి కావడంపై అమెరికాలో వారం రోజులుగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. శనివారం రాజధాని వాషింగ్టన్లో జరిగిన ర్యాలీలో మునుపెన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. కాంగ్రెస్ భవనం క్యాపిటోల్, ఆ చుట్టుపక్కల ప్రాంతంలో పెద్ద సంఖ్యలో చేరుకుని నినాదాలు చేశారు. అధికారులు ముందు జాగ్రత్తగా అధ్యక్ష భవనం చుట్టూ కొత్తగా ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతోపాటు అదనపు భద్రతా చర్యలు తీసుకున్నారు. సియాటెల్‌లో నిరసనకారులు రాళ్లు, సీసాలు విసరడంతో పోలీసులకు గాయాలయ్యాయి. సినిమా రంగానికి ప్రసిద్ధి చెందిన హాలీవుడ్, బార్లు, రెస్టారెంట్లకు పేరుగాంచిన నాష్విల్లే, శాన్ఫ్రాన్సిస్కోలోని గోల్డెన్ గేట్ బ్రిడ్జి, న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ బ్రిడ్జి వంటి ప్రముఖ ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. జార్జి ఫ్లాయిడ్ పుట్టిన ఊరుకు దగ్గరలోని రెఫోర్డ్ బాప్టిస్ట్ చర్చిలో ప్రైవేట్ మెమోరియల్ సర్వీస్ జరిగింది. యూకేలోని లండన్, ఫ్రాన్సులోని మార్సెయిల్స్‌లో జరిగిన ర్యాలీల్లో కొట్లాటలు చోటుచేసుకున్నాయి. -
అమెరికాలో కొనసాగుతున్న ఆందోళనలు
-
జాతి వివక్ష అంతమే లక్ష్యం
వాషింగ్టన్/బెర్లిన్: ఆఫ్రికన్ అమెరికన్ జార్జి ఫ్లాయిడ్ పోలీసుల దౌర్జన్యానికి బలి కావడంతో ఆగ్రహంతో ప్రారంభమైన ప్రదర్శనలు ఇప్పుడు జాతి వివక్ష అంతమే లక్ష్యంగా కొనసాగుతున్నాయి. అమెరికాలో ఫ్లాయిడ్ పుట్టిన ప్రాంతం నార్త్ కరొలినాలో కుటుంబ సభ్యులు రెండో సంస్మరణ సభ నిర్వహించారు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ 1963లో చేసిన పేరుపొందిన ప్రసంగం ‘ఐ హేవ్ ఏ డ్రీం’ను పురస్కరించుకుని వాషింగ్టన్లో వచ్చే ఆగస్టులో స్మారక ర్యాలీ నిర్వహించనున్నట్లు రెవరెండ్ అల్ షార్ప్టన్ చెప్పారు. ‘అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో మొత్తం న్యాయ వ్యవస్థ మారాలంటూ ప్రజా ఉద్యమానికి ఊపిరి పోస్తాం. అలా చేయకుంటే మరో ఏడాది గడిచిపోతుంది. ఆ తర్వాత మిమ్మల్ని ఎవరూ గుర్తుపెట్టుకోరు. ఎవరూ పట్టించుకోరు’అని ఓ ఇంటర్వ్యూలో నల్ల జాతీయులనుద్దేశించి పేర్కొన్నారు. అమెరికా నుంచి ఆస్ట్రేలియా దాకా.. ఆస్ట్రేలియా, యూరప్, ఆసియా దేశాల్లో నిరసనలు మిన్నంటుతున్నాయి. జాతి వివక్షను ఇక సహించబోమంటూ నిరసనకారులు గొంతెత్తి నినదిస్తున్నారు. ఆస్ట్రేలియాలో కస్టడీ మరణాలకు వ్యతిరేకంగా సిడ్నీలో భారీ ప్రదర్శనలు జరిగాయి. ‘కరోనా వైరస్‌తో మరణించకపోతే, పోలీసులు క్రూరత్వానికి మేము బలైపోతాం’అన్న నినాదాలు హోరెత్తిపోయాయి. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో వరసగా రెండో రోజు కూడా ఫ్లాయిడ్ మృతికి వ్యతిరేకంగా నిరసనకారులు ప్రదర్శనలు నిర్వహించారు. నల్ల మాస్కులు, టీ షర్టులు ధరించిన వారంతా బ్లాక్స్‌కి కొరియన్స్ మద్దతు ఉంటుందని అంటూ నినదించారు. జపాన్ రాజధాని టోక్యోలో వందలాది మంది శాంతియుత నిరసనలు చేశారు. మేమూ మారాలి: ఇండో అమెరికన్ అడ్వొకసీ గ్రూప్ జార్జ్ ఫ్లాయిడ్, ఇతర ఆఫ్రికన్ అమెరికన్ల మరణాలతో అగ్రరాజ్యంలో నల్లజాతీయులపై కొనసాగుతున్న వివక్ష ఎంత భయానకంగా ఉంటుందో ప్రపంచ దేశాలకు తెలిసి వచ్చిందని ఇండియన్ అమెరికన్ న్యాయవాదుల గ్రూప్ తెలిపింది. ఇలాంటి సమయంలోనూ భారత్, ఇతర దక్షిణాసియా దేశాల నుంచి వచ్చిన వారిలో చాలా మంది మౌనంగా ఉండడమే మంచిదన్న అభిప్రాయంలో ఉంటారని, ఈ ధోరణి మారాలని ఇండియన్ అమెరికన్ ఇంపాక్ట్ ఫండ్ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఇండియన్ అమెరిన్లను రాజకీయాల్లోకి చేర్చేందుకు సహకరించే ఈ సంస్థ మైనార్టీల దారుణ మరణాలపై తీవ్రంగా స్పందించింది. ‘కచ్చితంగా చెప్పాలంటే మేమేమీ నిరపరాధులం కాదు’అని ఆ ప్రకటనలో పేర్కొంది. ‘నల్లజాతీయులు, ఇతర పౌర హక్కులు అమెరికా ఇమిగ్రేషన్ కోసం నిరంతర పోరాటం చేయడం వల్ల మేము ఇప్పడు ఈ దేశంలో ఉన్నాం. వారు చేసిన కృషి ఫలితాలను అనుభవిస్తున్నాం. అయినప్పటికీ జాతి వివక్షకి సంబంధించిన దారుణాలు వెలుగులోకి వచ్చినప్పుడు భారతీయులు మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. అది మారాలి’అని ఆ ప్రకటన వివరించింది. బెర్లిన్‌లో నిరసన ప్రదర్శనలో పాల్గొన్న యువతి -
ఫ్లాయిడ్ మృతికి నిరసనగా అమెరికాలో ఆందోళనలు
-
జార్జ్‌కు న్యాయం జరగాలి: కెనడా ప్రధాని
ఒట్టావా: ఆఫ్రికన్- అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతాన్ని వ్యతిరేకిస్తూ శాంతియుతంగా జరుగుతున్న నిరసన కార్యక్రమంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పాల్గొన్నారు. అంగరక్షకులు వెంటరాగా.. నలుపు రంగు మాస్కు ధరించి.. మోకాళ్లపై కూర్చుని జార్జ్‌కు న్యాయం జరగాలన్న నిరసనకారులకు సంఘీభావం ప్రకటించారు. పార్లమెంటు ఆవరణలో జరిగిన ‘‘నో జస్టిస్- నో పీస్’’(న్యాయం జరగకుంటే శాంతి ఉండదు) కార్యక్రమానికి హాజరైన ట్రూడో ప్రసంగించకుండానే తిరిగి వెళ్లిపోయారు. అయితే జాతి వివక్షకు వ్యతిరేకంగా ఉపన్యసించిన పలువురు వక్తలను ఆయన ప్రశంసించినట్లు సీఎన్ఎన్ వెల్లడించింది. కాగా తొలుత ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటారా లేదా అన్న ప్రశ్నకు బదులివ్వని ట్రూడో.. ఒక్కసారిగా అక్కడకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరచడం విశేషం. అయితే ఆయన అక్కడకు చేరుకోగానే కొంతమంది.. ‘‘స్టాండప్ టూ ట్రంప్’’ అని నినదించడం గమనార్హం. (‘నువ్వు మమ్మల్ని కాలుస్తావా?’) ఇదిలా ఉండగా.. జార్జ్ ఫ్లాయిడ్ హత్యపై ఆందోళనలు మిన్నంటుతున్న తరుణంలో వారికి మద్దతు తెలిపిన ఒట్టావా పోలీసులు.. తాము తమ పౌరుల హక్కులను కాపాడతామంటూ ప్రకటన విడుదల చేశారు. ‘‘ప్రజలకు భద్రత కల్పించడమే మా పని. మా ప్రజలు, కమ్యూనిటీ సభ్యుల హక్కులను గౌరవిస్తాం. అన్యాయాలను ఎదురించేందుకు వారు గళమెత్తిన సమయంలో సంయమనంతో వ్యవహరిస్తాం. వారి ఆవేదన, విసుగును మేం అర్థం చేసుకోగలం’’అని పేర్కొన్నారు. కాగా అమెరికాలోని మినియాపోలిస్‌లో ఓ పోలీస్ అధికారి ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మెడపై కాలితో నొక్కిపెట్టడంతో ఊపిరాడక మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జాత్యహంకార దాడిని నిరసిస్తూ అగ్రరాజ్యంలో నిరసనలు భగ్గుమంటున్నాయి.(జార్జ్ ఒక నేరస్థుడు.. రెండో వైపు కూడా చూడండి) -
‘నువ్వు మమ్మల్ని కాలుస్తావా?’
-
‘నువ్వు మమ్మల్ని కాలుస్తావా?’
న్యూయార్క్ : నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతంతో అగ్రరాజ్యం అట్టుడుకుతోంది. జాతి వివక్షను నిరసిస్తూ దేశవ్యాప్తంగా జనం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనసును టచ్ చేసే చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియా వైరల్‌గా మారుతూనే ఉన్నాయి. తాజాగా నిరసనల్లో పాల్గొన్న చిన్నారులకు సంబంధించిన వీడియోలు రెండు వైరల్‌గా మారాయి. ( జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతం మరవకముందే..) ‘న్యాయం జరక్కపోతే.. శాంతి ఉండదు’ ‘న్యాయం జరక్కపోతే.. శాంతి ఉండదు’ అంటూ ఓ చిన్నారి నినాదాలు చేయటం నెట్టింట చక్కర్లు కొడుతోంది. స్కాట్ బ్రిన్టన్ అనే వ్యక్తి తన ట్విటర్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ ఉద్యమ భవిష్యత్తు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం సున్నితమైన ఉద్యమంలో చిన్నారి పాల్గొనటాన్ని తప్పుబడుతున్నారు. హక్కుల కోసం పోరాడుతూ బాల్యాన్ని వృధా చేసుకోవటం మంచిది కాదని హితవు పలుకుతున్నారు. ‘నువ్వు మమ్మల్ని కాలుస్తావా?’ శుక్రవారం హూస్టన్ రోడ్డుపై జరిగిన నిరసన కార్యక్రమంలో తల్లితో పాటు నడుస్తున్న ఓ చిన్నారి ఏడుస్తోంది. అది గమనించిన ఓ పోలీసు చిన్నారి దగ్గరకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో ఆ చిన్నారి ‘నువ్వు మమ్మల్ని కాలుస్తావా?’ అంటూ ఆ పోలీసును అడిగింది. దీంతో ఆశ్చర్యపోయిన పోలీసు చిన్నారిని దగ్గరకు తీసుకున్నాడు. అలా ఏం జరగదని చిన్నారికి హామీ ఇచ్చాడు. -
‘నా కూతురికి సమాధానం చెప్పగలగాలి’
వాషింగ్టన్: సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్ రెడిట్ కో ఫౌండర్, టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ భర్త అలెక్సిస్ ఒహానియాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవి నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. ఆ స్థానంలో ఓ నల్ల జాతీయుడిని నియమించాలని కోరారు. ఆన్లైన్ పోస్ట్‌లో తన రాజీనామా గురించి తెలిపారు ఒహానియాన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నువ్వు ఏం చేస్తున్నావు అని దీని గురించి భవిష్యత్తులో నా కుమార్తె ప్రశ్నించినప్పుడు.. నేను సమాధానం చెప్పగలగాలి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని తెలిపారు. ఒహానియాన్, సెరెనా విలియమ్స్ మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె ఉంది. (హ్యాండ్సప్.. డోంట్ షూట్!) జాతి విద్వేషాలను అరికట్టడమే కాక నల్లజాతి సమాజానికి సేవ చేయడానికి సంస్థలో తన వాటాపై భవిష్యత్తులో వచ్చే లాభాలను ఉపయోగించుకుంటానని అలెక్సిస్ ఒహానియాన్ తెలిపారు. జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడిని అమెరికా పోలీసులు చిత్రహింసలు పెట్టి చంపిన సంగతి తెలిసిందే. ఈ హత్యోదంతంపై అమెరికాలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఒహానియాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాక మాజీ ఎన్ఎఫ్ఎల్ స్టార్ కోలిన్ కైపెర్నిక్ యొక్క ‘నో యువర్ రైట్స్’ క్యాంప్‌కు మిలియన్ డాలర్లు ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. -
నిరుద్యోగరేటుకు ఫ్లాయిడ్‌కు ముడి.. ట్రంప్‌పై ఆగ్రహం
వాషింగ్టన్ : అసందర్భంగా ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ ప్రస్థావన తీసుకొచ్చినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ నిప్పులు చెరిగారు. అమెరికాలో ఆర్థికవేత్తల అంచనాలను మించి, ఊహించనదానికన్నా నిరుద్యోగిత రేటు అదుపులోకి రావడంపై ట్రంప్ శుక్రవారం హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జార్జ్ పైనుంచి ఇదంతా గమనిస్తున్నాడని, దేశానికి ఇదొక గొప్ప రోజు, జార్జ్‌కి ఇది గొప్ప రోజు, సమానత్వపరంగా ఇది గొప్ప రోజు అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.(2 మిలియన్ల వ్యాక్సిన్లు సిద్ధం: ట్రంప్) నిరుద్యోగిత రేటుకు, జార్జ్‌కు లింకుపెడుతూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తుచ్చమైనవని జో బిడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ట్రంప్ ప్రభుత్వంలో అన్యాయంగా హత్యకు గురైన జార్జ్ గురించి మాట్లాడుతున్నామన్నారు. ఫ్లాయిడ్‌ను పోలీసులు అరెస్టు చేసే క్రమంలో మరణించడంతో గత వారం నుంచి అమెరికాలో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 40 నగరాల్లో కర్ఫ్యూ విధించినా, జనాలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో కూడా సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ ఈ నిరసనలకు మద్దతు తెలుపుతూ పోస్ట్‌లు చేస్తున్నారు. అయితే అధ్యక్షుడి వ్యాఖ్యలను కొన్ని వార్తా సంస్థలు ఉద్దేశపూర్వకంగా వక్రీకరించాయని ట్రంప్ ప్రచార కమ్యూనికేషన్స్ డైరెక్టర్ టిమ్ ముర్తాగ్ అన్నారు. (జార్జియాలో కూలిన విమానం; ఐదుగురు మృతి) -
ఈ ఘటన దురదృష్టకరం
వాషింగ్టన్: అమెరికా రాజధానిలోని భారతీయ దౌత్యకార్యాలయం ఎదుట ఉన్న గాంధీ విగ్రహాన్ని ఆగంతకులు ధ్వంసం చేయడాన్ని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తోపాటు పలువురు రాజకీయ నేతలు తీవ్రంగా ఖండించారు. ఇలాంటి సంఘటనలు ప్రజలను ఏకం చేయవని వారు స్పష్టం చేశారు. ఈ ఘటన దురదృష్టకరమైందని అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. వాషింగ్టన్‌లోని భారత దౌత్యకార్యాలయం సమీపంలో ఉన్న ఈ విగ్రహాన్ని కొందరు దుండగులు బుధవారం ధ్వంసం చేసి, రంగులు పూసిన విషయం తెలిసిందే. ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మరణం నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్న తరుణంలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. అయితే, ఈ ఘటనకు ఆందోళనలతో సంబంధం లేదని మార్కో రూబియో అనే సెనెటర్ గురువారం తెలిపారు. నార్త్ కరొలినా సెనేటర్ టామ్ టిల్లిస్ కూడా ఇది అమర్యాదకరమైందని అభివర్ణించారు. శాంతికి మారుపేరుగా చెప్పుకునే గాంధీ ప్రతిరూపాన్ని ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ట్రంప్ సలహాదారు కింబర్లీ గుయిఫోలే చెప్పారు. మా గొంతులపై మీ మోకాళ్లు తీయండి.. ‘‘మా గొంతులపై మీ మోకాళ్లు తొలగించం డి’’అన్న నినాదాల మధ్య మినియాపోలిస్‌లో గురువారం జార్జ్ ఫ్లాయిడ్ సంస్మరణ సభలు జరిగాయి. శవపేటిక చుట్టూ గుమికూడిన పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నేతలు ఫ్లాయిడ్ మృతికి సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఒకవైపు ఈ సభ జరుగుతూండగా కొంత దూరంలోనే ఉన్న న్యాయస్థానంలో ఫ్లాయిడ్ హత్యకు కారణమైన ముగ్గురు పోలీసు అధికారులకు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేస్తూ.. పూచీకత్తుగా సుమారు రూ.5 కోట్ల చొప్పున చెల్లించాలని ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా.. ఫ్లాయిడ్ ఘటనకు నిరసనగా ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. ప్యారిస్, లండన్, సిడ్నీ, రియో డిజెనిరోల్లో నిరసనలు జరిగాయి. అదే సమయంలో ఆమెరికాలోని కాలిఫోర్నియాలో ఇప్పటివరకూ ఉన్న కర్ఫ్యూను సడలించారు. కొన్ని చెదురుమ దురు సంఘటనలు మినహా అమెరికా నగరాల్లో ప్రశాంతత నెలకొంది. కొన్నిచోట్ల శాంతియుత ప్రదర్శనలు జరిగాయి. ట్రంప్ ట్వీట్‌కు కత్తెర... సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మధ్య జరుగుత్ను పరోక్ష యుద్ధంలో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఫ్లాయిడ్‌కు నివాళులర్పిస్తూ ట్రంప్ విడుదల చేసిన ఓ ప్రచార వీడియోను ట్విట్టర్ బ్లాక్ చేసింది. ఈ వీడియోపై ట్విట్టర్ ఒక లేబుల్‌ను పెడుతూ వీడియో తమదని ఇతరులు ఫిర్యాదు చేసిన కారణంగా దాన్ని బ్లాక్ చేస్తున్నట్లు పేర్కొంది. జోధ్‌పూర్‌లో ‘ఫ్లాయిడ్’ ఘటన! జో«ద్‌పూర్: జార్జ్ ఫ్లాయిడ్ తరహా ఘటనే భారత్‌లోనూ చోటు చేసుకుంది. రాజస్తాన్‌లోని జోధ్‌పూర్ నగరంలో ఓ పోలీస్ అధికారి ఒక వ్యక్తిని కిందకు పడదోసి మోకాళ్లతో అదిమి పట్టుకున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. మాస్కు లేకుండా బయట తిరుగుతున్న ముఖేష్ ప్రజాపతి అనే వ్యక్తిని పోలీసులు ప్రశ్నించగా అతడు తీవ్రంగా ప్రతిఘటించాడు. ఈ మేరకు ప్రతాప్‌నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. -
రెండో వైపు కూడా చూడాలి
అమెరికాలో ప్రస్తుతం సాగుతున్న జాత్యంహకార దాడులకు కారణమైన ఘటనలో బాధితుడైన ఫ్లాయిడ్‌ను అమరుడిగా చిత్రించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయా! దీని వెనుక రాజకీయ కోణం ఉందా! కొన్ని ప్రశ్నలకు సమాధానం ఉండదు. పరిస్థితులు, పరిణామాలను బట్టి అర్థం చేసుకోవాల్సిందే. కొన్ని విషయాలలో ఎవరికి వారు సొంత భాష్యాలు చెప్పుకుంటుంటారు. ఇప్పటి వరకూ జార్జ్ ఫ్లాయిడ్ అమరుడంటూ అమెరికాలో ఉన్న నల్ల జాతీయులు నీరాజనాలు పట్టారు. ఇప్పుడు ఇందుకు భిన్నమైన కోణం ఆవిష్కృతమైంది. అది కూడా ఒక ఆఫ్రికన్ అమెరికన్ నోటినుంచి రావటం విశేషం. ‘ఆయనను అమరుడిని చేయకండి, ఆయన ఒక కరడుగట్టిన నేరస్థుడు’ అంటూ కన్సర్వేటివ్ కామెంటేటర్ క్యాన్డేస్ ఓవెన్స్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు అమెరికాలో సంచలనాన్ని సృష్టిస్తోంది. ‘అతడో క్రిమినల్. అతడిపై ర్యాప్ షీట్ ఉంది. అతడు మరణించే వరకు నేరస్థుడుగానే ఉన్నాడు’ అంటూ తన వీడియోలో వివరించారు ఆమె. నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్లే అన్ని అంశాలలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి. ఫ్లాయిడ్‌లో కూడా మంచిచెడులు ఉన్నాయి. కాకపోతే చెడు కాస్తంత కాదు బాగా ఎక్కువగానే ఉంది... అంటూ ఫ్లాయిడ్ చేసిన అరాచకాలను, అకృత్యాలను ఏకరువు పెట్టారు ఓవెన్స్. అదే సమయంలో ఫ్లాయిడ్‌ను హత్య చేయటాన్ని తాను సమర్థించటం లేదని కూడా అంటున్నారు ఓవెన్స్. ఎవరి ఊహకూ అందని విధంగా ఫ్లాయిడ్ పైశాచిక హత్యకు గురయ్యాడు. అతని మెడను ఓ తెల్ల పోలీసు కాలితో నొక్కి పెట్టడంతో ఊపిరాడక మరణించాడన్న విషయం తెలిసిందే. ‘కారణం ఏదైతేనేం, నేరస్థుల్ని రాత్రికి రాత్రే హీరోలను చేయటం ఐదారు సంవత్సరాలుగా ఒక ఫ్యాషన్‌గా మారింది. నేను ఇటువంటి వాటికి వ్యతిరేకం. అయోగ్యులను యోగ్యులుగా మార్చేయటం నా మనసుని కలచి వేస్తోంది. ఇలా చూపించే ట్రెండ్ నాకు నచ్చట్లేదు. ఎక్కడ అన్యాయం జరిగినా నా మనసు గాయపడుతుంది. ఫ్లాయిడ్ విషయంలో ‘అతడిది వీరోచితమైన జీవితం’ అంటూ అందరూ అతడిని పొగుడుండటం నాకు నచ్చలేదు. అతడి నేర చరిత్ర గురించి తెలిసి కూడా ఇలా మాట్లాడటం బాధ కలిగించింది. ఆయుధాలతో దాడి చేసి, ఒక మహిళ ఇంట్లో దొంగతనం చేసిన నేరానికి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. అక్కడ నుంచి విడుదలయ్యాక, జీవనం కోసం సిగరెట్లు అమ్మాడు. వాటిలో డ్రగ్స్ నింపాడని అతడి మీద అభియోగం ఉంది. అయితే అతడు ఎంతటి దుర్మార్గుడైనా, అంత క్రూరంగా చంపటాన్ని సమర్థించను. ఇన్ని నేరాలు చేసిన ఫ్లాయిడ్‌ని అమరుడిని చేయటం మాత్రమే సరికాదని చెబుతున్నాను.’ అంటూ బాధతో నిండిన గొంతుతో పద్దెనిమిది నిమిషాల వీడియో విడుదల చేశారు క్యాన్డేస్ ఓవెన్స్. ఈ వీడియో మీద పలు విమర్శలు, ప్రశంసలూ కూడా వచ్చాయి. ఒక వ్యక్తి జీవితంలో ఉన్న రెండు కోణాలనూ చర్చించాలనేది ఓవెన్స్ అభిప్రాయం. అతని అభిప్రాయాన్ని అందరూ అంగీకరించాలని కానీ ఏకీభవించాలని కానీ లేదు. కుక్కను చంపాలంటే అది పిచ్చిదని ముద్రవేయాలనే సూత్రం అందరికీ తెలిసిందే. అమెరికాలో ఇందుకు రివర్స్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు. రాజకీయ ప్రయోజనం పొందటానికి ఫ్లాయిడ్ వంటి నేరస్థుడిని అమరుడిగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నారనేది ఓవెన్స్ అభిప్రాయం. -
జార్జ్ ఫ్లాయిడ్ లాంటి ఘటన
-
మెడపై కాలేసి తొక్కిపట్టిన పోలీసు!
జైపూర్: అమెరికాలో ఆందోళనలకు కారణమైన మినియాపొలిస్ జార్జ్ ఫ్లాయిడ్ లాంటి ఘటనే రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీస్ అధికారి ఒకరు ముకేష్‌కుమార్ ప్రజపతి అనే వ్యక్తి మెడపై మోకాలితో తొక్కిపెట్టిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. బలదేవ్నగర్కు చెందిన ముకేష్‌కుమార్ మాస్క్ లేకుండా బయట తిరుగుతున్నందుకు పోలీసులు చలాన్ విధించారు. అయితే జరిమానా కట్టేందుకు నిరాకరించిన ముకేష్.. పోలీసులతో వాగ్వాదానికి దిగడంతోపాటు వారిపై దాడికి తెగబడ్డాడు. దీంతో అతడిని అరెస్ట్ చేసే క్రమంలో ఓ పోలీసు అధికారి ముకేష్ మెడపై మోకాలితో నేలకు నొక్కిపెట్టాడు. ఇది జార్జ్‌ఫ్లాయిడ్ ఘటనను గుర్తుచేస్తున్నా...ఇక్కడ ముకేష్ తిరిగి పోలీసులపై దాడి చేశాడు. అంతేకాదు స్క్రూ డ్రైవర్‌తో తండ్రి కంటికి గాయం చేసిన కేసులో గతంలో ఒకసారి అరెస్ట్ అయిన రికార్డ్ కూడా అతనికి ఉంది. (చదవండి: అమెరికా: పోలీసుల చర్యతో తల పగిలింది!) -
నిరసనకారుడిని ఒక్కసారిగా తోసేయడంతో..
న్యూయార్క్: ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతిపై అమెరికా వ్యాప్తంగా గురువారం కూడా నిరసనలు కొనసాగాయి. ఈక్రమంలో నిరసనలను అదుపు చేసేందుకు రంగంలోకి దిగిన న్యూయార్క్ బఫెలో పోలీసులు ఓ వ్యక్తిని తోసేసిన వీడియో వైరల్ అయింది. నిరసన తెలుపుతున్న ఓ తెల్ల జుట్టు వ్యక్తి బఫెలో పోలీసుల కవాతుకు అడ్డుగా వచ్చి ఏదో చెప్పబోయాడు. దాంతో కవాతులోని ఓ పోలీసు అతన్ని లాఠీతో నెట్టేశాడు. మరో పోలీసు కూడా చేత్తో బలంగా తోయడంతో అతను ఒక్కసారిగా కిందపడిపోయాడు. అతను బలంగా నేలను తాకడంతో తలకు బలమైన గాయమై రక్తం స్రావమైంది. (చదవండి: అతివాద గ్రూపులపై అమెరికా టార్గెట్) అయినప్పటికీ ఆ పోలీసులు కనికరించలేదు. అతనిపై దాడికి యత్నించారు. అంతలోనే మిగతా పోలీసులు వారిని వారించి అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఇక ఈ దృశ్యాన్ని స్థానిక రేడియా స్టేషన్ డబ్ల్యూఎఫ్‌ఓ వీడియో తీసి.. ట్విటర్లో పోస్టు చేసింది. సమీపంలో ఉన్న మెడికల్ సిబ్బంది స్పందించి అతన్ని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారని డబ్ల్యూఎఫ్‌ఓ పేర్కొంది. కాగా, తెల్ల జుట్టు వ్యక్తిని నెట్టేసిన పోలీసులను పై అధికారులు సస్పెండ్ చేసినట్టు వెల్లడించింది. గాయపడిన వ్యక్తి పరిస్థితి నిలకడ ఉందని డబ్ల్యూఎఫ్‌ఓ తెలిపింది. (చదవండి: ఉద్యమ నినాదం.. 8.46) -
నిరసనకారుడిని తోసేసిన పోలీసులు
-
‘అల్లర్ల వెనుక అతివాద గ్రూపులు’
వాషింగ్టన్ : పోలీస్ కస్టడీలో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణానికి నిరసనగా అమెరికా అంతటా నిరసనలు కొనసాగుతున్న క్రమంలో, అల్లర్ల వెనుక అతివాద సంస్థల కుట్ర దాగుందని అగ్రరాజ్యం ఆరోపించింది. నిరసనల మాటున అతివాద సంస్థలు హింసను ప్రేరేపించాయని అమెరికన్ అటార్నీ జనరల్ విలియం బార్ పేర్కొన్నారు. శాంతియుతంగా జరుగుతున్న నిరసనలను అతివాద ఆందోళనకారులు అవకాశంగా మలుచుకున్నారని ఆరోపించారు. యాంటిఫా వంటి ఇతర అతివాద గ్రూపులు పలు రాజకీయ అనుబంధం కలిగిన నటులు హింసాత్మక ఘటనల్లో పాల్గొంటూ ఇతరులను అందుకు ప్రేరేపించారని చెప్పేందుకు ఆధారాలున్నాయని బార్ పేర్కొన్నారు. అయితే, ఈ హింసాత్మక నిరసనలకు అతివాదులు కారణం కాదని, ఇది అవకాశవాదుల పనేనని అమెరికా అంతర్గత భద్రతా వ్యవహరాల శాఖ నిఘా నివేదిక పేర్కొన్న క్రమంలో బార్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. అల్లర్ల వెనుక యాంటిఫా హస్తం ఉందని బార్‌తో పాటు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ సంస్థను తప్పుపడుతున్నారు. ఈ నిరసనల నేపథ్యంలో హింస, విధ్వంసానికి ‘భూగలూ’ ఉద్యమ సభ్యులు కుట్ర పన్నారని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. చదవండి : ఉద్యమ నినాదం.. 8.46 -
ఆ పద్ధతి ప్రమాదకరం!
లీ పెక్(ఫ్రాన్స్): ఫ్లాయిడ్ హత్యతో ప్రపంచవ్యాప్తంగా పోలీసుల దాష్టీకాలు, అనుమానితులతో వారు వ్యవహరించే తీరు తీవ్ర చర్చనీయాంశమైంది. ఫ్లాయిడ్ విషాధ ఘటన జరిగిన మూడు రోజులకే ఫ్రాన్స్‌లోని పారిస్‌లోనూ అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఒక నిందితుడిని పోలీసులు రోడ్డుపై బోర్లా పడుకోబెట్టి, మెడపై మోకాలు ఆన్చి, చేతులకు సంకెళ్లు వేశారు. అరెస్ట్ చేయాలనుకునే వ్యక్తులను ఎటూ కదలకుండా ఉంచడం కోసం మోకాళ్లతో వారిని అణచిపెట్టడం ప్రపంచవ్యాప్తంగా పోలీసులంతా సాధారణంగా అనుసరించే విధానమే. అయితే, నిరాయుధులను, ఎలాంటి వ్యతిరేకత చూపని వారిని అలా నిర్బంధించడం, లొంగిపోయేందుకు అవకాశం ఇవ్వకుండా, ఊపిరాడకుండా చేసి, వారు చనిపోయేందుకు కారణం కావడంపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ‘పోలీసులు ఇలా వ్యవహరించడం మా వద్ద కూడా జరుగుతుంది’అని ఫ్రాన్స్ ఎంపీ ఫ్రాంకోయిస్ రుఫిన్ వ్యాఖ్యానించారు. హాంకాంగ్‌లోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నవారిపై అక్కడి పోలీసులు ఇలాంటి హింసాత్మక విధానాలనే అవలంబిస్తుంటారు. మెడపై ఒత్తిడి చేసి, శ్వాస అందకుండా చేయడమనే విధానం మా వద్ద లేదని ఇజ్రాయెల్ పోలీస్ విభాగ అధికార ప్రతినిధి మికీ రోజెన్ఫీల్డ్ స్పష్టం చేశారు. -
ఉద్యమ నినాదం.. 8.46
మినియాపోలిస్/వాషింగ్టన్: అమెరికాలో పోలీసుల దౌర్జన్యానికి, వివక్షకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి ‘8.46’అన్న అంకె నినాదంగా మారుతోంది. ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్‌ను మే 25న మినియాపోలీస్ పోలీసు అధికారి డెరెక్ చెవెన్ నేలకు అదిమిపెట్టి ఉంచిన సమయం 8 నిమిషాల 46 సెకన్లు అని విచారణ సందర్భంగా తెలియడంతో ఉద్యమకారులు ఆ అంకెను నినాదంగా మార్చారు. ఈ సమయాన్ని ఇంత కచ్చితంగా ఎలా నిర్ధారించారన్న అంశంపై స్పష్టత లేకపోయినప్పటికీ ఆందోళనకారుల్లో మాత్రం బాగా ప్రాచుర్యం పొందింది. బోస్టన్, టాకోమా, వాషింగ్టన్లలో జరిగిన ప్రధర్శనలు 8.46 నిమిషాలపాటు జరగడం.. హ్యూస్టన్‌లో చర్చిల్లో ప్రార్థనలు నిర్వహించే వాళ్లు చేతుల్లో మైనపు వత్తులు పెట్టుకుని అంతే సమయం మోకాళ్లపై పాకుతూ నిరసన వ్యక్తం చేయడం ఈ అంకెకు ఏర్పడిన ప్రాధాన్యానికి సూచికలు. టెలివిజన్ చానళ్లు వయాకామ్‌సీబీఎస్ గతవారం ఫ్లాయిడ్‌కు నివాళులు అర్పిస్తూ 8.46 నిమిషాలపాటు ప్రసారాలు నిలిపివేసింది. గూగుల్ సీఈఓ నివాళి 8 నిమిషాల 46 సెకన్లపాటు మౌనం వహించడం ద్వారా ఫ్లాయిడ్‌కు నివాళులు అర్పించాలని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఉద్యోగులకు రాసిన లేఖలో కోరారు. జాతివివక్షపై జరిగే పోరుకు గూగుల్ సుమారు రూ.210 కోట్లు విరాళంగా ఇవ్వనుందన్నారు. జాతి అసమానతల నివారణ కోసం పనిచేస్తున్న సంస్థలకు కోటీ ఇరవై లక్షల డాలర్ల నగదు సాయం అందిస్తామని, సంస్థలు జాతి వివక్షపై పోరాడేందుకు, కీలకమైన సమాచారం అందించేందుకు 2.5 కోట్ల డాలర్ల విలువైన ప్రకటనలను గ్రాంట్ రూపంలో ఇస్తామని పిచాయ్ వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా సెంటర్ ఫర్ పోలీసింగ్ ఈక్విటీ అండ్ ఈక్వల్ జస్టిస్ ఇనిషియేటివ్‌కు పది లక్షల డాలర్ల విరాళం ఇవ్వనున్నట్లు తెలిపారు. జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతం తరువాత అమెరికా వ్యాప్తంగా అల్లర్లు చెలరేగుతున్న నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా రాజకీయంగా చురుకుగా మారారు. నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఒబామా మరోసారి ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేస్తూండటం గమనార్హం. ‘సమాజంలోని సమస్యలను ఎత్తి చూపడం ద్వారా అధికారంలో ఉన్న వారిపై ఒత్తిడి పెంచాలి. అదే సమయంలో ఆచరణ సాధ్యమైన చట్టాలు, పరిష్కార మార్గాలు సూచించాలి’’అని అన్నారు. గాంధీ విగ్రహం ధ్వంసం అమెరికాలో జరుగుతున్న ఆందోళనల్లో భారతీయ దౌత్య కార్యాలయం వద్ద ఉన్న గాంధీజీ విగ్రహం ధ్వంసమైంది. జూన్ 2వ తేదీ రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చునని దౌత్యకార్యాలయ సిబ్బంది భావిస్తున్నారు. ఈ అంశంపై అమెరికా విదేశీ వ్యవహారాల శాఖకు సమాచారం అందించామని, స్థానిక పోలీసు అధికారులు సంఘటనపై విచారణ ప్రారంభించారని అధికారులు తెలిపారు. శాంతి, అహింసలకు మారుపేరుగా భావించే గాంధీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడంపై భారత్‌లో అమెరికా రాయబారి కెన్ జుస్టర్ క్షమాపణలు కోరారు. ఫ్లాయిడ్‌కు కరోనా? ఫ్లాయిడ్ రెండు నెలల క్రితం కోవిడ్ బారిన పడినట్లు తెలిసింది. హెన్నిపిన్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ చేసిన శవపరీక్ష నివేదికలో ఈ విషయాన్ని పేర్కొన్నట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది. మినసోటా ఆరోగ్య శాఖ అధికారులు ఫ్లాయిడ్ నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు జరిపారని కరోనా సోకినట్లు ఏప్రిల్ 3న నిర్ధారించారని ఆండ్రూ బేకర్ అనే ప్రఖ్యాత మెడికల్ ఎగ్జామినర్ తెలిపినట్లు కథనం తెలిపింది. అయితే అతడి మరణానికి కరోనాకు సంబంధం లేదని స్పష్టం చేసింది. ఫ్లాయిడ్‌కు కరోనా సోకినట్లు తనకు సమాచారం లేదని కుటుంబసభ్యుల కోరిక మేరకు శవపరీక్ష నిర్వహించిన మైకెల్ బాడెన్ తెలిపారు. అంత్యక్రియల నిర్వాహకులకు ఈ విషయం చెప్పలేదని దీంతో చాలామంది ఇప్పుడు కోవిడ్ పరీక్షలు చేయించుకుంటున్నారని అన్నారు. -
నా చర్మం రంగు విలువ ఎంత?
నిన్నటికంటే ఇవ్వాళ పరిస్థితులు మెరుగవుతాయా? కచ్చితంగా అవుతాయి. కానీ ఈ వాస్తవానికి కొలమానం కాస్త అహేతుకంగానే ఉంటుంది. దశాబ్దాల క్రితం నల్లజాతీయులను పోలీసులు బాదటం, లేదా చంపడం అనేవి స్థానిక వార్తలుగానే వచ్చేవి. కాని ఇప్పుడు అలాంటి వార్తలు జాతీయ ప్రాధాన్యత పొందుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ అవుతున్నాయి. దేశంలో ఏ ప్రాంతంలో అవి జరుగుతున్నాయి అనే అంశంతో పనిలేకుండా ప్రాచుర్యం పొందుతున్నాయి. ప్రభుత్వ పోలీసు విభాగాలను మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎలా మార్చాలి? అన్నదే కీలకం. మారణాయుధాలను ఎందుకు ఉపయోగించకూడదు అనే అంశంపై సుదీర్ఘ సాంస్కృతిక శిక్షణ అవసరం. ఇతరుల ఊపిరి తీయడాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదని పోలీసులకు నేర్పాలి. చర్మం రంగు బట్టి మనుషులతో వ్యవహరించకూడదన్న గ్రహింపు బలగాలకు ఉండాలి. ఒక్కటి మాత్రం నిజం. ఆధునిక కాలంలో సురక్షిత సమాజం కోసం మనం కొన్ని స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కోల్పోవాల్సి ఉంటుంది. అందువల్ల పోలీసు తనిఖీలు తప్పనిసరి కావచ్చు. కానీ, ఆ క్రమంలో రాత్రింబవళ్లు రహదారులపై తనిఖీ చేసే అమెరికా పోలీసులు భౌతిక శాస్త్రజ్ఞుల పట్ల ద్వేషభావంతో ఉంటున్నారా అని మేం ఆలోచిస్తుంటాం. అమెరికాలో అత్యున్నత విద్యావంతులైన పీహెచ్‌డీలు చేసిన సైంటిస్టులు తమ జీవితాల్లో ఇంతగా పోలీసుల తనిఖీలకు ఎలా లోనవుతుంటారనేది పెద్ద ప్రశ్న. పోలీసులు మాపట్ల కొన్ని ముద్రలతో వ్యవహరిస్తున్నారేమో.. బహుశా అది మా చర్మపు రంగు కావచ్చేమో.. నల్లవారు కారు డ్రైవ్ చేయడం, నల్లవారు నడవటం, నల్లవారు నల్లవారుగా మాత్రమే ఉండటం ఉల్లం ఘనల కిందికి వస్తాయా అనేది మాలో ఏ ఒక్కరికీ తెలీని విషయమే. అయితే పోలీసులు మమ్మల్ని ఆపిన సందర్భాల్లో మాలో ఓ ఒక్కరినీ వారు విచక్షణారహితంగా చితకబాదలేదు. మాలో ఏ ఒక్కరినీ వారు కాల్చలేదు. కానీ పోలీసులు ఎదురైనప్పుడు నల్లవారు ప్రాణాలు కోల్పోవడం ఎందుకు జరుగుతోంది అన్నదే ప్రశ్న. ప్రతి సంవత్సరం అమెరికాలో పోలీసులు 100 కంటే ఎక్కువమంది నిరాయుధులైన నల్ల వారిని కాల్చి చంపుతున్నారు. ఈ వ్యాసం నేను టైప్ చేస్తున్న సమయానికి మన్హట్టన్లో నా ఇంటి కిటికీ గుండా చూస్తే 10 వేలకుపైగా నిరసనకారులు నినాదాలు చేస్తూ సాగడం కనిపించింది. జార్జి ఫ్లాయిడ్ హత్యా ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా లూటీలు, ఇతర హింసాత్మక చర్చలు ప్రబలిపోవడంతో రాత్రిపూట కర్ఫ్యూను రాత్రి 11 గంట లనుంచి 8 గంటలకు ముందుకు జరిపారు. నిరసనకారులు పట్టుకున్న ప్లకార్డుల్లో ‘నల్లవారి ప్రాణాలు కూడా ముఖ్యమైనవే’ అనేదే ఎక్కువగా కనబడుతూ వచ్చింది. పోలీసు అధికారి వెనక్కి చేతులు మడిచి, బేడీలు వేసి మెడపై కాలు వేసి తొక్కిన ఘటనలో తనకు ఊపిరాడటంలేదు అని ఆర్తనాదం చేస్తూనే చనిపోయిన జార్జి ఫ్లాయిడ్ పేరు ఉన్న ప్లకార్డును చాలామంది పట్టుకున్నారు. కాగా పోలీసు అధికారుల కస్టడీలో ఉంటున్న నల్లవారి గతి పట్ల బాధ, ఆందోళనను ప్రదర్శిస్తూ జాతీయ ఫుట్‌బాల్ స్టార్ కోలిన్ కపెర్నిక్ ఫుట్ బాల్ గేమ్ ప్రారంభానికి ముందు మోకాలు వంచి చూపిన భంగిమ విపరీతంగా ప్రజలను కదిలించింది. ఆ సమయంలో అతడు అమెరికా జాతీయగీతం పట్ల నిరసన వ్యక్తం చేశాడని ఒక మీడియా వార్త ప్రచురించడంతో ఆగ్రహావేశాలు చెలరేగాయి. దీంతో 2017లో ఫుట్ బాల్ సీజన్ పొడవునా అతడిని ఏ ఫుట్ బాల్ టీమ్ కూడా జట్టులో చేర్చుకోకుండా అతడి బతుకుపై వేటు వేశాయి. రెండేళ్ల తర్వాత చూస్తే శాంతియుతంగా మోకాలు మడిచి కోలిన్ ప్రదర్శించిన భంగిమను దాటి, నిజంగానే పోలీసు అధికారి మోకాలికింద నలిగి నల్లజాతీయుడు మరణించడం వరకు ముందుకొచ్చేశాం. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై టియర్ గ్యాస్, పెప్పర్ గ్యాస్ ప్రయోగించడం, వీధుల్లోనే చితకబాదటం వంటి దృశ్యాలు చూస్తున్నప్పుడు వీరు ఏదో చట్టవిరుద్ధమైన, అమెరికనేతర చర్యలకు పాల్పడుతున్నట్లు మీరు భావించవచ్చు. కానీ అమెరికన్ రాజ్యాంగంలో ‘.. పత్రికా స్వేచ్ఛను అణిచిపెట్టే ఏ చట్టాన్నీ కాంగ్రెస్ రూపొందించదు. అలాగే శాంతియుతంగా ప్రజలు గుమికూడే హక్కును కూడా రాజ్యాంగం అణిచిఉంచదు. అలాగే సమస్యల పరి ష్కారం కోరుతూ ప్రభుత్వానికి పిటిషన్ పెట్టుకునే హక్కును కూడా రాజ్యాంగం తోసిపుచ్చదు‘ అని రాసుకున్నాం. ఈ సవరణ అమెరికా రాజ్యాంగానికి చేసిన తొలి సవరణ. అంటే అమెరికన్ జాతి నిర్మాతలు సమస్యల పరిష్కారం కోసం నిరసన తెలుపడం అనేది అమెరికన్ లక్షణాల్లో అత్యంత కీలకమైనది అని భావించి దానికి సాధికారత కల్పిం చారు. మీరు పోలీసు అయితే కాస్సేపు ఆగి శాంతియుత ప్రదర్శనలకు చోటు కల్పించిన దేశ రాజ్యాంగం ఎంత గొప్పదో ఆలోచిస్తే మంచిది. పోలీసు అధికారుల నుంచి మనం వాస్తవానికి ఆశిస్తున్నది ఏమిటి? శాంతిని కాపాడి దుర్మార్గులను బంధించడమే అని నా భావన. అయితే అవసరమైనప్పుడు వారు మారణాయుధాలను ఉపయోగించవలసి రావచ్చు. కానీ ఆ ఆయుధాలను ఎప్పుడు, ఎలా ఉపయోగించాలి, ఉపయోగించకూడదు అనే విషయంలో తగిన శిక్షణ వారికి అవసరం. మిన్నియాపోలిస్కు చెందిన పోలీస్ అకాడమీ కఠిన శిక్షణ నాలుగు నెలలపాటు ఇస్తారు. అంతకుమించిన కఠిన శిక్షణను న్యూయార్క్ పోలీస్ అకాడెమీ 6 నెలలపాటు ఇస్తుంది. కానీ ఒక మంచి పాకశాస్త్ర నిపుణుడు తన వృత్తికి సంబంధించిన ధ్రువపత్రం పొందాలంటే కనీసం 8 నెలలు శిక్షణలో ఉండాలి. వృత్తిలో ఖచ్ఛితత్వం రావాలంటే అంత సమయం అవసరం మరి. పోలీసు నియామకాల్లో కూడా అధికారులు తయారు కావాలంటే మరింత అదనపు సమయం శిక్షణ అవసరం ఎంతైనా ఉంది. 1991లో రాడ్నీ కింగ్ అనే పాతికేళ్ల యువకుడిని నలుగురు పోలీసు అధికారులు నేలకేసి తొక్కుతూ తమ లాఠీలతో చితకబాదుతున్న దృశ్యాన్ని వీడియో బయటపెట్టినప్పుడు యావత్ అమెరికన్లు షాక్‌కు గురయ్యారు. కానీ అ సమయంలో నేను పెద్దగా షాక్‌కి గురికాలేదు. ఎందుకంటే నా తల్లిదండ్రులు చిన్నప్పటినుంచి నాకు, నా తోబుట్టువులకు.. పోలీసులు మిమ్మల్ని కాల్చకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ప్రతి వారం, ప్రతినెలా పాఠాలు చెప్పేవారు. మిమ్మల్ని అటకాయించినప్పుడు పోలీసు అధికారి అన్ని వేళల్లోనూ మీ చేతులను చూస్తాడు. అలాంటప్పుడు మీరు అస్సలు కదలొద్దు. ముందస్తుగా వారికి చెప్పకుండా మీ ప్యాకెట్లలో చేతులు పెట్టవద్దు. మీరు కదిలినప్పుడు ఎందుకు కదులుతున్నారో ఆ అధికారికి ముందే చెప్పాలి అని పాఠం చెప్పేవారు. అప్పట్లో నేను మిడిల్ స్కూల్ విద్యార్థిని. ప్రపంచం గురించి తెలుసుకోవాలని ప్రయత్నించేవాడిని కానీ నా చర్మపు రంగు గురించి నేను ఏనాడు ఆలోచించలేదు. ప్రపంచం గురించి ఆలోచించేటప్పుడు మనిషి చర్మం రంగు గురించి తట్టేది కాదు. కానీ నా ముందు తలుపునుంచి నేను నిష్క్రమిస్తున్న ప్పుడు నేను అనుమానిత నేరస్తుడిని అవుతున్నాను. ఈ మధ్య అమెరికా సమాజంలో వైట్ కాలర్ క్రైమ్ అనే పదబంధం వాడుకలోకి వచ్చింది. ఒక అమాయకుడైన నల్లజాతీయుడు అమాయకత్వానికి సంబంధం లేని పని ఏదో చేయవచ్చని భావిస్తున్న తెల్లవారు వెంటనే భయంతో పోలీసులకు కాల్ చేయడాన్ని ఈ పదబంధం సూచిస్తుంది. నిన్నటికంటే ఇవ్వాళ పరిస్థితులు మెరుగవుతాయా. కచ్చితంగా అవుతాయి. కానీ ఈ వాస్తవానికి కొలమానం కాస్త అహేతుకంగానే ఉంటుంది. దశాబ్దాల క్రితం నల్లజాతీయులను పోలీసులు బాదటం, లేదా చంపడం అనేవి స్థానిక వార్తలుగానే వచ్చేవి. కానీ, ఇప్పుడు అలాంటి వార్తలు జాతీయ ప్రాధాన్యత పొందుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ అవుతున్నాయి. దేశంలో ఏ ప్రాంతంలో అవి జరుగుతున్నాయి అనే అంశంతో పనిలేకుండా ఇవి ప్రాచుర్యం పొందుతున్నాయి. మరి రాజ్యానికి సంబంధించిన ఈ సంస్థలను మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎలా మార్చాలి? పోలీసు విభాగాలను ప్రశ్నిస్తున్న డిమాండ్లు ఇవి. నా సూచనలు కొన్ని ఇక్కడ చెబుతాను. విధాన నిర్ణేతలు వీటిని పరిగణనలోకి తీసుకోవచ్చు. 1. మారణాయుధాలను ఎందుకు ఉపయోగించకూడదు అనే అంశంపై శిక్షణనిచ్చే సాంస్కృతిక చైతన్యాన్ని నెలలపాటు పోలీసు అకాడమీలకు కలిగిస్తూ పోవాలి. 2. పోలీసు అకాడమీ ఆమోదం, తిరస్కరణతో పనిలేకుండా పక్షపాతదృష్టిని ప్రదర్శించిన పోలీసు అధికారులందరినీ తనిఖీ చేయాలి. 3. మనం కూడా పక్షపాత దృష్టిని కలిగి ఉండవచ్చు కానీ మనలో చాలామంది ఇతరుల ఊపిరి తీయడాన్ని మన చేతుల్లోకి తీసుకోం. 4. నిరసన ప్రదర్శనల సమయంలో ఆస్తులను, ప్రాణాలను కాపాడాలి. మీరు హింసకు పాల్పడని నిరసనకారులపై దాడి చేశారంటే మీరు అమెరికన్ కానట్లే. పోలీసులు నిరసన కారులను కాకుండా లూటీదారులను మాత్రమే అరెస్టు చేస్తే ఇక కర్ఫ్యూలతో పనిలేదు. 5. పోలీసు అధికారులు అనైతికమైన, హింసాత్మకమైన ప్రవర్తనను ప్రదర్శించడాన్ని మీరు చూస్తే వెంటనే అడ్డుకోండి. దాన్ని ఎవరైనా వీడియోతీసి పంపితే మనకు మనమే పోలీసులం అనే ఆత్మవిశ్వాసం మనకు కలుగుతుంది. 6. మరో ముఖ్యమైన సూచన ఏదంటే విధినిర్వహణలో ఉండి మరణించిన వారికి జరిపేలా జార్జి ఫ్లాయిడ్‌కి కూడా పూర్తి అధికార లాంఛనాలతో మిన్నియా పోలిస్ విభాగం అంత్యక్రియలు ఎందుకు చేయకూడదు? తన దారుణ మృతి వంటి ఘటన మరెవరికీ జరగకూడదని ఎందుకు ప్రతిజ్ఞ చేయకూడదు? 7. చివరగా, నల్లజాతి పిల్లలు మీకు కనబడినప్పుడు వాళ్లు ఎలాంటివారు అని మీకు మీరే నిర్ధారణకు రాకుండా వారు ఎవరై ఉండవచ్చు అనే దృష్టితో ఆలోచించాలి. నీల్ డెగ్రాస్ టైసన్, వ్యాసకర్త ఖగోళ భౌతిక శాస్త్రజ్ఞుడు, ప్రిన్స్టన్ యూనివర్సిటీ -
తెల్ల చర్మం... నల్ల మచ్చలు..
తెలుపును శాంతికి చిహ్నంగా భావిస్తాం. అయితే చాలాకాలంగా ‘మేం తెల్లవాళ్లం, మీరు నల్లవాళ్లు’ అనే జాత్యహంకారం అందుకు పూర్తి విరుద్ధంగా నడుస్తోంది. వ్యక్తుల మధ్య దూరాన్ని మరింత పెంచుతోంది. ఇటీవలే అమెరికాలో ఒక పోలీసు నల్ల జాతీయుడైన ఫ్లాయిడ్‌ని మోకాలితో మెడ మీద నొక్కి ఊపిరాడకుండా చేసిన వీడియో ఎంతటి కల్లోలాన్ని సృష్టిస్తోందో చూస్తున్నాం. ఇప్పుడు అటువంటిదే మరో సంఘటన న్యూయార్క్‌లో జరిగింది. అది న్యూయార్క్ సెంట్రల్ పార్క్... సెంట్రల్ పార్క్‌కి చాలామంది వాకింగ్ చేయటానికి వస్తుంటారు. ఈ పార్కు 843 ఎకరాల విస్లీర్ణంలో ఉంది. ఈ పార్కుని ఏడాదికి 38 మిలియన్ల మంది వీ„ì స్తుంటారు. సినిమా షూటింగులు ఎక్కువగా జరుగుతుంటాయి. 1858లో ఈ పార్కు ఓపెన్ అయ్యింది. అంతటి చరిత్ర ఉన్న పార్కుకి ఎవరెవరో రావటం, వారికి కావలసిన సుందర దృశ్యాలను ఆనందించటమో, కెమెరాలో బంధించటమో, సినిమా తీయటమో జరుగుతూనే ఉంటాయి. ఆ పార్కుకి వారం రోజుల క్రితం అమీ కూపర్ అనే తెల్లజాతి మహిళ తన డాల్మేషియన్ డాగ్‌ను తీసుకుని వచ్చింది. ఎక్కువమంది తిరిగే ప్రదేశాలకు వచ్చినప్పుడు, కుక్కకు బెల్టు పెట్టి, ఎక్కడకూ పరుగులు తీయకుండా చూడవలసిన బాధ్యత యజమానిదే. ఇందుకు విరుద్ధంగా అమీ కూపర్ కుక్క మెడకు తగిలించవలసిన పొడవాటి తాడును తన చేత్తో పట్టుకుని, కుక్క మెడకు ఉన్న బెల్టును ఒడిసి పట్టుకుంది. అది తప్పించుకు పోవటానికి తెగ ప్రయత్నిస్తోంది. సరిగ్గా అదే సమయంలో తన వీడియో కెమెరాలో పక్షులను బంధిస్తున్న క్రిస్టియన్ కూపర్ (వీరిద్దరికీ సంబంధం లేదు) అనే ఒక నల్లజాతీయుడు తనను, తన కుక్కను వీడియో తీస్తున్నాడని ఆమెకు ఎందుకో అనుమానం వచ్చింది. అది రూఢి చేసుకోకుండానే, ‘‘నువ్వు నన్ను వీడియో తీస్తున్నావు, నా కుక్కను బెదిరిస్తున్నావు...’’ అంటూ గట్టిగా అరుపులు ప్రారంభించింది. ‘పోలీసులను పిలుచుకో’ అన్నాడు క్రిస్టియన్ కూపర్. వెంటనే పోలీసులకి ఫోన్ చేసి, భయంతో అరుస్తూ, ఒక నల్ల జాతీయుడు తనను బెదిరిస్తున్నాడని, అతని బారినుంచి తనను కాపాడమని చెప్పింది. దాంతో అప్పటిదాకా పక్షులను వీడియో తీస్తున్న నల్ల జాతీయుడు ఆమె చేష్టలను వీడియోలో బంధించాడు. ‘నేను వీడియో తీయకపోతే, పోలీసులు వచ్చినప్పుడు వారికి చూపటానికి నా దగ్గర సాక్ష్యాలు ఉండవు కదా’ అంటున్నారు క్రిస్టియన్ కూపర్. పోలీసులు వచ్చి విషయం అడిగారు. తనను చిత్రీకరిస్తున్నాడని, తన కుక్కను బెదిరిస్తున్నాడనీ చెప్పింది అమీ. తాను పక్షులను చూస్తున్నాననీ, తనను నల్లజాతీయుడు అనటం తన మనసును గాయపరచిందన్నాడు కూపర్. వీడియో చూసిన పోలీసు, అమీదే తప్పని తేల్చాడు. సారీ చెప్పమన్నాడు. అమీ బహిరంగంగా అందరి ముందు పలుసార్లు సారీ చెప్పింది. అమె ఎన్నిసార్లు సారీలు చెప్పినా అతడి మనసు కుదుటపడినట్లు అనిపించడం లేదు. ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. -
మంచి మనిషి
జార్జి ఫ్లాయిడ్‌కి కూతురంటే ప్రాణం. మంచి లైఫ్‌ని ఇవ్వాలని ఇల్లొదిలి వచ్చాడు. చెమటోడ్చిన ప్రతి డాలర్.. అదనంగా ప్రతి పని గంట.. కూతురి కళ్లలో మెరుపుల కోసమే. ‘కాంట్ బ్రీత్.. ప్లీజ్’ అంటున్నప్పుడు.. కూతురు కళ్ల ముందుకొచ్చే ఉంటుంది. ఆయన భార్య ఇప్పుడు.. కూతుర్ని ప్రపంచం ముందుకు తెచ్చింది. ‘‘ఫ్లాయిడ్ మంచి మనిషి.. కూతుర్ని చూసి చెప్పొచ్చు’’ అంటోంది. ప్రతి మనిషిలో గుట్టు చప్పుడు కాకుండా ఒక హీరో ఉంటాడు. మే 25న మినియాపలిస్లోని ఒక పోలీస్ ఆఫీసర్ తన మోకాలితో తొక్కిపట్టి ఉంచినప్పుడు ఊపిరి ఆడక చనిపోయిన జార్జి ఫ్లాయిడ్ కూడా ఒక హీరోనే. కూతురికి హీరో డాడీ. భార్యకు హీరో హస్బెండ్. హ్యూస్టన్‌లో తన కాలనీవాళ్లకు హీరో నైబర్. మరికాస్త వెనక్కి వెళితే.. జాక్ యేట్స్ హైస్కూల్లో హీరో ఫుట్‌బాలర్, కాలేజ్‌లో హీరో బాస్కెట్‌బాలర్. కూతురికి మరింత మెరుగైన జీవితాన్ని ఇవ్వడం కోసం ఫ్లాయిడ్ టెక్సాస్ నుంచి మినియాపలిస్ వచ్చాడు. ఇరవై డాలర్ల నోటు మారుస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దొంగనోటు అది! అరెస్ట్ చేశారు. చేతులకు సంకెళ్లు వేశారు. పెనుగులాడాడు ఫ్లాయిడ్. ఆ నోటు ఎలా వచ్చిందో తనకూ తెలీదన్నాడు. పోలీసులతో ఘర్షణ పడ్డాడు. కింద పడ్డాడు. అప్పుడే డెరెక్ షువాన్ అనే పోలీస్ అధికారి అతడి గొంతును మోకాలితో తొక్కిపట్టాడు. తొమ్మిదో నిముషంలో ఫ్లాయిడ్ చనిపోయాడు! కూతురుతో రాక్సీ; ఇన్సెట్లో ఫ్లాయిడ్ గుండె ఆగిపోయినంత పనైంది రోక్సీ వాషింగ్టన్కు. టెక్సాస్‌లోని తన ఇంట్లో టీవీ చూస్తోంది ఆవిడ. టీవీ చూడ్డం కాదు, టీవీలో తన భర్తను చూస్తోంది. నేలపై పడి ఉన్నాడు. అతడి నోట్లోంచి నాలుక బయటికి వచ్చింది. పోలీస్ ఆఫీసర్ తన మోకాలితో భర్త గొంతును నొక్కి ఉంచిన క్లిప్‌ను పదే పదే టీవీలో చూపిస్తున్నారు. ‘‘డాడీకి ఏమైంది మమ్మీ?’’.. గియానా వచ్చి అడిగింది. ఆరేళ్లు తనకు. ‘‘ఊపిరి ఆడట్లేదు’’ అని చెప్పింది కూతుర్ని దగ్గరకు లాక్కుని. తల్లి చెప్పలేకపోయినా అమెరికాలో ఉవ్వెత్తున ఎగసిపడిన నిరసన జ్వాలలు గియానాకు చెప్పాయి.. తన హీరో డాడీని పోలీసులు చంపేశారని! ‘పోలీసులు’ అన్నంత వరకే ఆ చిన్నారికి తెలుసు. ‘తెల్ల పోలీసులు’ అనే స్పృహ ఇంకా రాలేదు. బుధవారం మినియాపలిస్లో నల్లజాతి నిరసనకారులతో కలిసి రోక్సీ మీడియా ముందుకు వచ్చారు. భర్త మరణించాక మొదటిసారి ఆమె బయటికి రావడం. కన్నీరు ఆమెను మాట్లాడనివ్వడం లేదు. భర్తను తలచుకుంటూ కూతుర్ని హత్తుకుని ఉంది. ఫ్లాయిడ్ తన కూతురు ఎదుగుతున్న ఏళ్లను చూడలేడు. ఫ్లాయిడ్ తన కూతురు గ్రాడ్యుయేట్ అవడాన్ని చూడలేడు. ఫ్లాయిడ్ తన కూతుర్ని పెళ్లి కూతురుగా చెయ్యి పట్టి నడిపించలేడు. గియానాకు అన్నీ ఉన్నాయి. తండ్రి మాత్రం లేడిప్పుడు. భుజాలపై ఎక్కించుకుని తిప్పిన తండ్రి. కారు స్టీరింగ్ ముందు కూర్చోబెట్టుకుని మురిసిపోయిన తండ్రి. ‘‘పోలీసులకూ భార్యాబిడ్డలు ఉంటారు. డ్యూటీ నుంచి ఇంటికి రాకపోతే ఎదురుచూస్తుంటారు. ఫ్లాయిడ్ కోసం మేం ఎదురుచూస్తుంటామని వాళ్లెందుకు అనుకోలేకపోయారు’’ అని రోక్సీ అడుగుతున్నారు. ‘‘ఫ్లాయిడ్ మంచి మనిషి. అందుకు సాక్ష్యంగా గియానా పసి ముఖాన్ని మాత్రమే నేను చూపించగలను’’ అని అన్నారు.. తండ్రి అమాయకత్వానికి ప్రతిరూపంలా ఉన్న కూతుర్ని దగ్గరకు తీసుకుంటూ. ఫ్లాయిడ్ గొంతుపై డెరెక్ షువాన్ ఫ్లాయిడ్ బాహుబలిలా ఉంటాడు. ‘జెంటిల్ జెయింట్’ అనేవారు హ్యూస్టన్‌లో అతడిని. బతుకు తెరువు కోసం ఒక రెస్టారెంట్లో కొన్నాళ్లు సెక్యూరిటీగా పని చేశాడు. ‘ఇలాంటి ఒక మనిషి మన వెనుక ఉంటే నిశ్చింతగా ఉండొచ్చు’ అనే పేరొచ్చింది ఫ్లాయిడ్‌కి. ఇంకా చిన్న చిన్న పనులేవో చేసేవాడు. పార్ట్ టైమ్‌గా ఫుట్‌బాల్ కోచింగ్, అప్పుడప్పుడు ట్రక్ డ్రైవింగ్. వచ్చే డబ్బులన్నీ తన కూతురివే! డబ్బులో ఓ ఇరవై డాలర్ల నకిలీ నోటు అతడి అరెస్టుకు, అతడి మరణానికి దారి తీసిందంటే అది పోలీసుల కట్టుకథలానే అనిపిస్తుంది. వెనుక ఇంకేదో ఉంది. విచారణ జరుగుతోంది. తన గురించి చెప్పుకోని ఈ హీరో గురించి చెప్పడానికి అమెరికా అంతటా ఎంతమంది అయినవాళ్లు లేరు? నాకీ భర్త వద్దు కెల్లీ మే.. డెరెక్ షువాన్ భార్య జార్జి ఫ్లాయిడ్‌ను చంపిన పోలీసు అధికారి డెరెక్ షువాన్ భార్య కెల్లీ మే విడాకులకు పిటిషన్ పెట్టుకున్నారు. తన పేరు పక్క నుంచి భర్త పేరును తొలగించమని కూడా అందులో విజ్ఞప్తి చేశారు. డెరెక్‌కి, కెల్లీకి పదేళ్ల క్రితం పెళ్లయింది. ఒక వ్యక్తిని తన భర్త చంపడాన్ని నేటికీ ఆమె జీర్ణించుకోలేక పోతున్నారు. విడాకుల అనంతరం చట్టపరంగా భర్త నుంచి సంక్రమించే ఆస్తులు, భరణాలను కూడా ఆమె వద్దనుకున్నారు. కైలీ మాజీ అందాలరాణి. ‘మిసెస్ మిన్సెసోటా అమెరికా’ టైటిల్ విజేత. బాల్యంలోనే లావోస్ నుంచి కుటుంబంతో పాటు యు.ఎస్. వచ్చింది. -
జాతి వివక్ష : సుందర్ పిచాయ్ కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ/వాషింగ్టన్: భారత సంతతికి చెందిన టెక్ దిగ్గజం, ఆల్ఫాబెట్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ (47) మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. జాత్యహంకారంపై పోరాడటానికి ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ 37 మిలియన్ డాలర్లు ఇస్తుందని సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు. ఆఫ్రికన్-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు వ్యతిరేకంగా అమెరికాలో దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగిన నేపథ్యంలో పిచాయ్ ఈ ప్రకటన చేశారు. ఇప్పటికే ఈ ఘటనను ఖండించిన పిచాయ్ తాజాగా జాతి వివక్ష వ్యతిరేక పోరాటానికి అండగా నిలబడేందుకు ముందుకొచ్చారు. అంతేకాదు ప్రాణాలు కోల్పోయిన నల్ల జాతీయుల పట్ల గౌరవ సూచనగా 8 నిమిషాల 46 సెకన్ల పాటు మౌనం పాటించాలని గూగుల్ , ఆల్ఫాబెట్ ఉద్యోగులను కోరారు. ఈ మేరకు ఆయన ఉద్యోగులకు ఒక ఈ-మెయిల్ సందేశం పంపారు. (జార్జ్ హత్య : సత్య నాదెళ్ల స్పందన) అలాగే జాతి సమానత్వం కోసం పనిచేసే సంస్థలకు కంపెనీ 12 మిలియన్ డాలర్లు, జాతి వివక్ష సమాచారాన్ని అందించే సంస్థలకు యాడ్ గ్రాంట్లలో 25 మిలియన్ డాలర్లు నిధులను గూగుల్ ఇస్తుందని పిచాయ్ చెప్పారు. మొదటి గ్రాంటుగా ఒక మిలియన్ డాలర్లు చొప్పున సెంటర్ ఫర్ పోలీసింగ్ ఈక్విటీ, ఈక్వల్ జస్టిస్ ఇనిషియేటివ్ సంస్థలకు అందిస్తామని చెప్పారు. అలాగే తమ ప్రోగ్రామ్ ద్వారా వారికి కావాల్సిన సాంకేతిక సహాయాన్ని అందిస్తామని ప్రకటించారు. గత ఐదేళ్లలో 32 మిలియన్ల డాలర్లు ఇందుకు విరాళంగా ఇచ్చామని పిచాయ్ చెప్పారు. "నల్లజాతి సమాజం బాధపడుతోంది. మనలో చాలామంది మనం నమ్మేవాటి కోసం నిలబడటానికి మార్గాలు వెతుకుతున్నాం. అలా సంఘీభావం చూపే, ఇష్టపడే వ్యక్తులను మనం చేరుకోవాలి'' అని పిచాయ్ వ్యాఖ్యానించారు. కొంతమంది నల్లజాతి నాయకుల బృందంతో మాట్లాడానని, ఈ పోరాటంలో గూగుల్ తరపున ఎలా సహకరించగలం అనే దానిపై చర్చించామనీ, దీనిపై మరింత కృషి చేస్తున్నామని ఉద్యోగులకు అందించిన సమాచారంలో సుందర్ పిచాయ్ వెల్లడించారు. (మరోసారి పెద్ద మనసు చాటుకున్న సుందర్ పిచాయ్) చదవండి : జార్జ్‌ది నరహత్యే ! -
జార్జ్ ఫ్లాయిడ్‌కు కరోనా పాజిటివ్
వాషింగ్టన్: అమెరికా పోలీసుల చేతిలో నరహత్యకు గురైన నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ పూర్తి శవపరీక్ష నివేదికను వైద్యులు బుధవారం విడుదల చేశారు. అనేక క్లినికల్ వివరాలను వెల్లడించిన ఈ నివేదిక ఫ్లాయిడ్‌కు కరోనా పాజిటివ్‌గా తేల్చింది. హెన్నెపిన్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్స్ కార్యాలయం విడుదల చేసిన ఈ 20 పేజీల నివేదిక జార్జ్ కుటుంబం అనుమతితో వెల్లడయ్యంది. ఈ సందర్భంగా చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ ఆండ్రూ బేకర్ మాట్లాడుతూ.. ‘మెడపై తీవ్రమైన ఒత్తిడి వల్లే ఫ్లాయిడ్ మరణించాడు. అతడు మరణించిన తీరును బట్టి దీన్ని నరహత్యగా పేర్కొనవచ్చు’ అని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాక ఏప్రిల్ 3న ఫ్లాయిడ్‌కు కరోనా పాజిటివ్‌గా పరీక్షించారు, కాని లక్షణ రహితంగా ఉన్నాడని వెల్లడించారు. మరణించిన సమయంలో ఫ్లాయిడ్ ఊపిరితిత్తులు ఆరోగ్యంగా కనిపించాయని తెలిపారు.(జార్జ్‌ది నరహత్యే !) గతంలో అమెరికా పోలీసులు ఇచ్చిన నివేదికలో ఫ్లాయిడ్ ‘ఫెంటనిల్ ఇన్‌టాక్సికేషన్’, ‘మెథమ్‌ఫెటమైన్’ అనే డ్రగ్స్ తీసుకున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఫెంటనిల్ ఇన్‌టాక్సికేషన్ వల్ల తీవ్రమైన శ్వాసకోశ మాంద్యం, మూర్ఛ లక్షణాలు ఉంటాయని.. కానీ ఫ్లాయిడ్‌లో ఇవేవి కనిపించలేదని నివేదికలో తెలిపారు. ఊపిరాడకపోవడం వల్లే ఫ్లాయిడ్ మరణించాడని ఆండ్రూ బేకర్ తెలిపారు. -
ఫ్లాయిడ్ ఆత్మ.. గగన నినాదం
అమెరికన్ పోలీసు జాత్యహంకారానికి ప్రాణాలు కోల్పోయిన జార్జి ఫ్లాయిడ్ చివరి మాటలు అమెరికన్ గగనతలంలో బ్యానర్లపై రెపరెపలాడుతున్నాయి. తన గొంతుపై ఆ పోలీసు మోకాలిని తొక్కిపెట్టి ఉంచినప్పుడు ఫ్లాయిడ్ ఊపిరాడక.. ప్లీజ్ ఐ కాంట్ బ్రీత్.. మై స్టొమక్ హర్ట్స్.. దె ఆర్ గోయింగ్ టు కిల్ మీ.. మై నెక్ హర్ట్స్.. అని మూలుగుతూ ప్రాణాలు పోయేముందు కొన్ని నిముషాల పాటు విలవిలాడాడు. ఆ మాటలను జామీ హోమ్స్ అనే ఆర్టిస్టు బ్యానర్ల పై రాసి యూఎస్‌లోని ఐదు నగరాలలో (డెట్రాయిట్, మయామి, డాలస్, లాస్ ఏంజలెస్, న్యూయార్క్) ఎగరేశారు. వాటి రూపంలో నింగిలోనూ ఊపిరి కోసం కొట్టుకుంటున్నట్లుగా కనిపిస్తున్న ఫ్లాయిడ్ ఆత్మ ఇప్పట్లో అమెరికాను నిద్రపోనివ్వక పోవచ్చు. -
ఊపిరి పీల్చుకుంటున్న అగ్రరాజ్యం
-
వాషింగ్టన్లో మహాత్మ గాంధీ విగ్రహం ధ్వంసం
వాషింగ్టన్ : నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతికి నిరసనగా ఆందోళనలతో అమెరికా అట్టుడుకిపోతోంది. ఈ అల్లర్ల నేపథ్యంలో వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయం వెలుపల మహాత్మా గాంధీ విగ్రహాన్ని కొందరు దుండగలు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై అమెరికన్ అధికారులు దర్యాప్తును చేపట్టారు. మినియాపొలిస్ నగరంలో మే 25న పోలీస్ కస్టడీలో ఫ్లాయిడ్ మరణించిన అనంతరం అమెరికా అంతటా నిరసనలు హోరెత్తిన సంగతి తెలిసిందే. కాగా, నిరసనకారులు వెనక్కితగ్గకుంటే శాంతిభద్రతలు కాపాడేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన కలకలం రేపింది. జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతంపై ఆందోళనలతో అట్టుడుకుతున్న అమెరికాలో ఇప్పటికే 40 నగరాల్లో కర్ఫ్యూ విధించగా.. సుమారు 150 నగరాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఆరు రాష్ట్రాలతోపాటు 13 నగరాల్లో అత్యవసర పరిస్థితిని విధించారు. చదవండి : హ్యాండ్సప్.. డోంట్ షూట్! -
నీడనిచ్చి ఆదుకున్న మన హీరో!
వాషింగ్టన్: అపరిచితులకు ఆశ్రయమిచ్చి, పోలీసుల నుంచి సుమారు 70 మందిని రక్షించినందుకు భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త రాహుల్ దూబేను మీడియా హీరోగా కొనియాడుతోంది. అమెరికాలోని మినియాపోలిస్‌లో గత వారం ఒక పోలీస్ అధికారి చేతిలో ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతి చెందగా.. దానికి నిరసనగా దేశవ్యాప్తంగా అల్లర్లు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. వాషింగ్టన్లో రాహుల్ దూబే ఇంటికి సమీపంలో కొంతమంది ఆందోళనలు నిర్వహిస్తూండగా.. కర్ఫ్యూ సమయం సమీపిస్తున్న తరుణంలో పోలీసులు వారిని చుట్టుముట్టారు. ఆ సమయంలో రాహుల్ వారందరినీ తన ఇంట్లోకి రావాల్సిందిగా కోరారు. వాషింగ్టన్లో 17 ఏళ్లుగా ఉంటున్న రాహుల్ అల్వారేజ్ దూబే ట్రేడింగ్ కంపెనీని నడుపుతున్నారు. ఇంట్లోకి వచ్చిన అపరిచితులకు ఆహారం ఇవ్వడంతోపాటు రాత్రంతా ఉండేందుకు, తద్వారా వారు పోలీసుల చేత చిక్కకుండా కాపాడారని పలు పత్రికలు కథనాలు ప్రచురించాయి. ‘దాదాపు 75 మంది ఉన్నారు. కొందరు సోఫాల్లో సర్దుకున్నారు. వచ్చిన వాళ్లలో తల్లీ బిడ్డలతో కూడిన కుటుంబం ఉంది. వాళ్లు నా కొడుకు గదిలో విశ్రాంతి తీసుకున్నారు’అని 44 ఏళ్ల దూబే చెప్పారు. చేసింది గొప్ప పనేమీ కాదు: రాహుల్ తాను కొంతమందికి ఆశ్రయం కల్పించడం గొప్ప పనేమీ కాదని రాహుల్ వ్యాఖ్యానించారు. ‘రాత్రి 8.30 గంటలపుడు పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అకస్మాత్తుగా వారందరూ మా ఇంటివైపు పరుగెత్తుతూ వచ్చారు. వచ్చినవాళ్లను వచ్చినట్లే లోపలకు లాగేసుకున్నాం’అని రాహుల్ చెప్పారు. -
హ్యాండ్సప్.. డోంట్ షూట్!
హ్యూస్టన్: జార్జ్ ఫ్లాయిడ్‌కు సంఘీభావంగా హ్యూస్టన్‌లో జరిగిన ర్యాలీలో సుమారు అరవై వేల మంది పాల్గొన్నారు. పోలీసుల దాష్టీకానికి బలైన ఫ్లాయిడ్‌కు నివాళులు అర్పించేందుకు ఉద్దేశించిన ఈ ర్యాలీలో ఫ్లాయిడ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నగర మేయర్ సిల్వస్టర్ టర్నర్, ఎంపీ షీలా జాక్సన్, లిజ్జీ ఫ్లెచర్, సిల్వియా గార్సియా అల్ గ్రీన్‌లతోపాటు కొంతమంది ర్యాప్ గాయకులు ర్యాలీలో పాల్గొని తమ నివాళులు అర్పించారు. ‘హ్యాండ్స్ అప్.. డోంట్ షూట్’, ‘నో జస్టిస్, నో పీస్’అని నినదిస్తూ ర్యాలీ హ్యూస్టన్ నగరం గుండా సాగింది. డిస్కవరీ గ్రీన్ పార్క్ నుంచి సిటీహాల్ వరకూ ఉన్న మైలు దూరం ఈ ర్యాలీ నడిచింది. అయితే సూర్యాస్తమయం తరువాత ఈ ర్యాలీ కాస్తా ఆందోళనలకు దారితీసిందని, ఖాళీ నీటిబాటిళ్లతో విసరడంతో పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేశారని వార్తలు వచ్చాయి. ర్యాలీ ప్రారంభానికి ముందు అందరూ మోకాళ్లపై నిలబడి కాసేపు ప్రార్థనలు చేయగా హ్యూస్టన్ పోలీస్ అధికారులు ఇదే తరహాలో వ్యవహరించడం విశేషం. పోలీస్ అధికారి ఆర్ట్ ఎసివిడో ఆందోళనకారులను ఉద్దేశించి మాట్లాడుతూ పోలీసు వ్యవస్థలో సంస్కరణలు తెస్తామని హామీ ఇచ్చారు. జార్జ్ ఫ్లాయిడ్ భార్య రాక్సీ వాషింగ్టన్ మాట్లాడుతూ ఆరేళ్ల తన కుమార్తె గియానా మంచి తండ్రిని కోల్పోయిందన్న విషయాన్ని ప్రపంచం గుర్తించాలని వాపోయింది. వీధుల్లో ప్రశాంతత.. వారం రోజులపాటు అల్లర్లు, ఆందోళనలు, హింసాత్మక ఘటనలతో అట్టుడికిన అమెరికన్ నగర వీధుల్లో ఎట్టకేలకు కొంత ప్రశాంతత నెలకొంది. మంగళవారం ప్రదర్శనలు జరిగినా చాలావరకూ అవి శాంతియుతంగా సాగాయి. ఆందోళనలకు సంబంధించి బుధవారంనాటికి మొత్తం 9,000 మందిని పోలీసులు అరెస్ట్‌చేశారు. పౌరహక్కుల విచారణ.. జార్జ్ ఫ్లాయిడ్ మృతికి సంబంధించి మినసోటా రాష్ట్రం మినియాపోలిస్ పలీస్ విభాగంపై పౌర హక్కుల విచారణ చేపట్టింది. మినసోటా మానవహక్కుల విభాగం కమిషనర్ రెబెకా లూసిరో, గవర్నర్ టిమ్ వాల్ట్జ్ ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. ఈ విచారణ ద్వారా పోలీసుల వివక్షాపూరిత చర్యలను గుర్తించి తాత్కాలికంగానైనా పరిష్కార చర్యలను అమల్లోకి తేవచ్చునని భావిస్తున్నట్లు తెలిపారు. అందరికీ న్యాయం అందించాలన్న అమెరికా సిద్ధాంతం ఎక్కడ? ఎందుకు విఫలమైందో పరిశీలించాల్సిన సమయం వచ్చిందని, జార్జ్ ఫ్లాయిడ్ మరణోదంతం ఇందుకు కారణమని అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. ‘లారా (బుష్ భార్య)తోపాటు నేను ఫ్లాయిడ్ ఉదంతంపై ఎంతో బాధపడ్డాం. అన్యాయమైన వ్యవహారాలు దేశం ఊపిరి తీసేస్తున్నాయి. అయినాసరే.. ఇప్పటివరకూ మాట్లాడకూడదనే నిర్ణయించాం. ఎందుకంటే ఇది లెక్చర్ ఇచ్చే సమయం కాదు. వినాల్సిన సమయం’అని బుష్ తన ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికా తన వైఫల్యాలను పరిశీలించాల్సిన సమయం ఇదేనని ఆయన అన్నారు. శాంతియుతంగా ఉండాలి: మెలానియా ఫ్లాయిడ్ మృతికి నిరసనగా జరుగుతున్న ఆందోళనలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా స్పందించారు. ప్రజలు శాంతియుతంగా వ్యవహరించాలని, కర్ఫ్యూ నిబంధనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని వర్గాలవారు, పౌరులందరూ సురక్షితంగా ఉండాలంటే శాంతి ఒక్కటే మార్గమని ఈ దిశగా ప్రయత్నాలు జరగాలని మెలానియా ట్వీట్ చేశారు. ఒక రోజు ముందు మెలానియా ఇంకో ట్వీట్ చేస్తూ.. ఫ్లాయిడ్ మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించారు. ట్రంప్ మతం ముసుగులో తనకు మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా అమెరికా పత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి. సాధారణ పరిస్థితుల్లో ట్రంప్ మతవిశ్వాసాలు కలిగిన వ్యక్తి ఏమీ కాదని, ప్రస్తుతం పదేపదే చర్చిలకు వెళ్లడం, బైబిల్ పట్టుకుని పోజులు ఇవ్వడం మత విశ్వాసాలు ఉన్న వారిని తమవైపు ఆకర్షించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలుగా మీడియా విమర్శిస్తోంది. -
కంటతడి పెట్టిస్తోన్న జార్జ్ ఫ్లాయిడ్ వీడియో
-
కంటతడి పెట్టిస్తోన్న జార్జ్ ఫ్లాయిడ్ వీడియో
వాషింగ్టన్: జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడిని అమెరికా పోలీసులు చిత్రహింసలు పెట్టి చంపిన సంగతి తెలిసిందే. అతని మరణంతో అమెరికా అట్టుడికిపోతోంది. అమెరికాలో నల్లజాతీయులపై దాడులకు నిరసనగా ఆందోళనకారులు వీధుల్లోకి వస్తూ నిరసనలు చేపడుతున్నారు. ముఖ్యంగా జార్జ్ మరణం ఆ కుటుంబాన్ని తీవ్రంగా కుంగదీసింది. జార్జ్ పంచప్రాణాలైన అతని ఆరేళ్ల కుమార్తె జియాన తండ్రి లేని బిడ్డగా మారింది. తాజాగా వీరిద్దరి ఆప్యాయత, ప్రేమానురాగాలకు ప్రతీకగా ఉన్న ఓ వీడియోను మాజీ ఎన్బీఏ ఆటగాడు, జార్జి ఆప్త స్నేహితుడు స్టీఫెన్ జాక్సన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో ఆ చిన్నారి తండ్రి భుజాలపై కూర్చుని "డాడీ చేంజ్డ్ ద వరల్డ్" (నాన్న ప్రపంచాన్నే మార్చివేశాడు) అంటూ కిలకిల నవ్వుతూ చెప్తోంది. (అమెరికాలో ఆందోళనలు; ఒబామా స్పందన) 'నిజంగానే డాడీ లోకాన్ని మార్చేశాడం'టూ స్టీఫెన్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు భావోద్వేగానికి లోనవుతున్నారు. 'ఇది చూస్తుంటే సంతోషం, కన్నీళ్లు ఒకేసారి తన్నుకొస్తున్నాయి' అంటూ ఓ నెటిజన్ పేర్కొన్నాడు. కాగా మే 25న మిన్నెసొటాలో ఓ పోలీసు.. జార్జ్ ఫ్లాయిడ్ వేడుకుంటున్నా వినకుండా అతని మెడపై ఎనిమిది నిమిషాలకుపైగా మోకాలితో నులుముతూ అత్యంత దారుణంగా చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రజాగ్రహం పెల్లుబికడంతో శుక్రవారం సదరు పోలీసును అధికారులు అరెస్ట్ చేశారు. (నలుగురు పోలీసులకు శిక్ష పడాలి: జార్జ్ భార్య) -
జార్జ్ ఫ్లాయిడ్ నిరసనలు.. ట్రంప్‌కు షాక్
వాషింగ్టన్: జార్జ్‌ఫ్లాయిడ్ హత్యోదంతంపై అమెరికాలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే 40 నగరాల్లో కర్ఫ్యూ విధించగా.. సుమారు 150 నగరాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఆరు రాష్ట్రాలతోపాటు 13 నగరాల్లో అత్యవసర పరిస్థితిని విధించారు. ఇక జార్జ్‌ఫ్లాయిడ్ మృతికి నిరసనగా చేపట్టిన ఆందోళనలకు మైక్రోసాప్ట్ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్ కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ మద్దతు పలికిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిన్న కూతురు టిఫనీ ట్రంప్ జార్జ్‌ఫ్లాయిడ్ హత్యపై చెలరేగుతున్న నిరసనలకు మద్దతు పలికారు. ఈ మేరకు ఆమె తన ఇన్స్టాగ్రామ్ తాఖాలో ఒక బ్లాక్ ఫొటోను పోస్ట్ చేశారు. (నలుగురు పోలీసులకు శిక్ష పడాలి: జార్జ్ భార్య) ‘ఒంటరిగా మనం చాలా తక్కువ సాధించగలము, కలిసి మనం చాలా సాధించగలము’ అని హెలెన్ కెల్లర్ చెప్పిన మాటను కామెంట్‌గా జతచేశారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా #బ్లాక్‌ఆవుట్ ట్యూస్డే, #జస్టిస్ ఫర్ జార్జ్‌ఫ్లాయిడ్. అనే హాష్‌ట్యాగ్‌లతో సోషల్ మీడియాలో నెటిజన్లు జార్జ్‌ఫ్లాయిడ్ హత్య నిరసనలకు మద్దతుగా నిలుస్తున్నారు. జార్జ్‌ఫ్లాయిడ్ హత్య, జాత్యహంకారానికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమాలను పలు రాష్ట్రాలు అణచివేయడంలో విఫలమైతే సైన్యాన్ని రంగంలోకి దింపేందుకూ వెనుకాడనని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వయంగా ట్రంప్ చిన్న కూతురు టిఫనీ సోషల్ మీడియా వేదికగా జాత్యహంకార వ్యతిరేక నిరసనలకు మద్దతు పలకడం సర్వత్రా చర్చనీయం అంశంగా మారింది. View this post on Instagram ”Alone we can achieve so little; together we can achieve so much.”- Helen Keller #blackoutTuesday #justiceforgeorgefloyd A post shared by Tiffany Ariana Trump (@tiffanytrump) on Jun 2, 2020 at 8:52am PDT -
అందుకే అమ్మ ప్రేమ వెలకట్టలేనిది
లండన్ : ప్రపంచంలో ఏ దేశమైనా సరే తల్లి ప్రేమ అనేది మాత్రం వెలకట్టలేనిది. లాక్డౌన్ నేపథ్యంలో వైద్యసిబ్బంది తమ ఇంటిని, పిల్లలను వదిలిపెట్టి కరోనా బాధితులకు చికిత్సనందించేందుకు ఆసుపత్రులనే తమ ఇళ్లుగా మలచుకొని వారికి సేవలందిస్తున్నారు. తాజాగా ఇంగ్లండ్‌కు చెందిన సూసి అనే మహిళ క్వీన్ ఎలిజబెత్ ఆసుపత్రిలో హెల్త్‌కేర్ వర్కర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు హెట్టి(7), బెల్లా(9) ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కరోనా నేపథ్యంలో బాధితులకు చికిత్సనందించేందుకు 9వారాల పాటు ఇంటికి దూరం కావాల్సి వచ్చింది. ఈ సమయంలో ఆమె తన పిల్లలను కజిన్ ఇంట్లో పెట్టింది. అయితే ప్రస్తుతం విధులకు కొంత విరామం దొరకడంతో సూసీ వెంటనే తన పిల్లలను చూడాలని భావించింది.(కరోనా బారిన పడిన ఓ తల్లి భావోద్వేగం) రెండు నెలల పాటు పిల్లలకు దూరమైన ఆ తల్లి వారికి చిన్న సర్ప్రైస్ ఇవ్వాలనుకుంది. ఈ నేపథ్యంలో సూసీ కజిన్ ఇంటికి వెళ్లింది. అప్పటికే హెట్టి, బెల్లాలు సోఫాలో కూర్చొని టీవీ వీక్షిస్తున్నారు. సూసీ చడీ చప్పుడు లేకుండా పిల్లలు కూర్చున్న సోఫా వెనుకకు వచ్చి నిలుచుంది. వారు టీవీలో ఏదో సీరియస్‌గా చూస్తూ కూర్చుండిపోయారు. అయితే బెల్లా అనుమానమొచ్చి ఒకసారి వెనుకకు తిరిగింది. అంతే ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతూ మమ్మీ... అంటూ ఆనందంతో కేక వేసింది. దీంతో హెట్టీ కూడా వెనుకకు తిరిగి సూసీ ఒడిలో వాలిపోయింది. అసలే తన పిల్లలను చూడక 9వారాలు కావడంతో సూసీ ఆనందం పట్టలేక తన ఇద్దరు పిల్లలను దగ్గరికి హత్తుకొని గట్టిగా ఏడ్చేసింది. ఆ ఆనందక్షణాలను పిల్లలతో కలిసి ఎంజాయ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ వీడియోనూ 2.2 మిలియన్ మంది వీక్షించారు.(రిమూవ్ చైనా యాప్స్ తొలగించిన గూగుల్) -
‘ఆమె భవిష్యత్తును చూడలేడు’
వాషింగ్టన్: జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడిని ఫోర్జరీ కేసులో అరెస్ట్ చేసిన అమెరికా పోలీసులు.. అతడిని చిత్రహింసలకు గురిచేసి దారుణంగా కొట్టి చంపిన సంగతి తెలిసిందే. జార్జ్ మరణం ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలచి వేస్తోంది. అతడి కుమార్తె ఆరేళ్ల జియానా ‘నా తండ్రి చాలా మంచివాడు. పోలీసు అధికారుల కర్కశత్వానికి బలయ్యాడు.. పేవ్మెంట్ మీద ప్రాణాలు విడిచాడు. పోలీసులు నాకు తండ్రిని దూరం చేశారు’ అంటూ విలపిస్తోంది. జార్జ్ భార్య వాషింగ్టన్ ‘వారు ఇంటికి వెళ్లి వారి కుటుంబాలతో కలిసి ఉంటారు. కానీ నా బిడ్డ జియానాకు తండ్రి లేడు. ఆమె ఎదుగుదలను.. ఉన్నత విద్యను అతడు చూడలేడు.. ఇక అతడు ఎన్నటికి ఆమెతో కలిసి నడవలేడు’ అంటూ కుమార్తె జియానాను గుండెలకు హత్తుకున్నారు. అంతేకాక ఫ్లాయిడ్ మరణంతో సంబంధం ఉన్న నలుగురు అధికారులను శిక్షించాలని.. అప్పుడే తనకు న్యాయం జరుగుతుందని వాషింగ్టన్ తెలిపారు.(భర్తతో తెగదెంపులు: పేరు తొలగించండి) జార్జ్ చనిపోయిన విషయం తెలిసిన వెంటనే వాషింగ్టన్ మొదట తన బిడ్డను తల్చుకున్నారు. ‘జార్జ్ జియానాను ఎంతో ప్రేమించాడు’ అని తెలిపారు. ‘నేను నా బిడ్డ కోసం ఇక్కడ ఉన్నాను. నేను జార్జ్ కోసం ఇక్కడ ఉన్నాను. నేను అతనికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. తను చాలా మంచివాడు అందుకే నేను అతనికి న్యాయం చేయాలనుకుంటున్నాను. ఎవరు ఏమనుకున్నా, అతను చాలా మంచివాడు’ అన్నారు. ఈ ఘటన అమెరికాలో తీవ్ర నిరసనలకు కారణమైంది. తొలుత మిన్నియాపోలిస్ నగరంలో కొంతమంది యువకులతో మొదలైన ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి.. జార్జ్‌ను కొట్టిచంపిన పోలీసులను విధులనుంచి తొలగించినా.. ఆగ్రహ జ్వాలలు మాత్రం ఆరలేదు. నలుగురు పోలీసులను ఉరి తీయాలంటూ పెద్ద ఎత్తన ప్రజానీకం ఆందోళన బాటపడ్డారు. ట్రంప్ సైన్యాన్ని దించుతానంటూ హెచ్చరికలు జారీ చేశాడు. -
అమెరికాలో ఆందోళనలు; ఒబామా స్పందన
జార్జి ఫ్లాయిడ్ హత్యకు, సమాజంలో కొనసాగుతున్న అసమ న్యాయం సమస్యకు వ్యతిరేకంగా అమెరికాలో లక్షలాదిమంది ప్రజలు వీధుల్లోకి వచ్చి గళమెత్తుతున్నారు. ఈ సందర్భంగా అమెరికా ఎదుర్కొంటున్న ఈ సమస్యలో నిజమైన మార్పు తీసుకొచ్చేలా ఈ ఉద్వేగాలను ఎలా కొనసాగించాలి అని చాలామంది నన్ను ప్రశ్నిస్తున్నారు. అంతిమంగా ఈ సమస్యకు ఉత్తమ పరిష్కారం లభించేలా వ్యూహాలను తీర్చిదిద్దవలసిన బాధ్యత తదుపరి తరం కార్యకర్తల మీదే ఉంటుంది. అయితే గతంలో ఈ విషయంపై జరిగిన ప్రయత్నాలనుంచి గ్రహించవలసిన కొన్ని ప్రాథమిక పాఠాలు మనకు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. మొదటగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా వెల్లువలా పెల్లుబుకుతున్న ప్రజా నిరసన కార్యక్రమాలు అనేవి.. పోలీసుల పనితీరులో, నేర న్యాయవ్యవస్థలో విస్తృత ప్రాతిపదికన సంస్కరణలు తీసుకురావడంలో అమెరికాలో దశాబ్దాలుగా సాగుతున్న వైఫల్యం పట్ల నిజమైన, సహేతుకమైన నిరాశా నిస్పృహలను ప్రతిబింబిస్తున్నాయి. ఈ నిరసనల్లో పాల్గొంటున్న వారిలో చాలామంది శాంతియుతంగా, సాహసోపేతంగా, బాధ్యతాయుతంగా ఉంటూ స్ఫూర్తి కలిగిస్తున్నారు. కనుక వీరి నిరసనలను ఖండించడానికి బదులుగా మనందరం గౌరవించాలి. మద్ధతుగా నిలవాలి. నిజానికి కామ్డెన్, ఫ్లింట్ వంటి నగరాల్లోని పోలీసులు ఈ వాస్తవాన్ని అర్థం చేసుకున్నందుకు వారిని ప్రశంసించాలి కూడా. మరోవైపున, అనేకరూపాల్లో హింసకు పాల్పడిన అతి చిన్న మైనారిటీ బృందాలు నిజమైన ఆగ్రహంతో లేక కేవల అవకాశవాదంతో అలా చేస్తున్నప్పటికీ అమాయకులను వీరు ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. ఇప్పటికే తమ పొరుగున ఉన్న వారికి ఈ హింసాత్మక చర్యల ద్వారా కనీస సేవలు కూడా అందకుండా చేసేలా వీరి చర్యలు ఉంటున్నాయి. పైగా దీర్ఘకాలిక లక్ష్య సాధన నుంచి ఇలాంటి చర్యలు పక్కదోవ పట్టిస్తాయి. నిన్ననే కన్నీళ్లు పెట్టుకున్న ఒక నల్లజాతి మహిళ ఇంటర్వ్యూను చూశాను. తన పొరుగునే ఉన్న కిరాణా దుకాణాన్ని ధ్వంసం చేయడం ఆమెను విషాదంలో ముంచెత్తింది. నిజానికి ఆ దుకాణం మళ్లీ యథాస్థితికి వచ్చి సేవలందించాలంటే సంవత్సరాల సమయం పడుతుంది. కాబట్టే హింసను మనం సమర్థించవద్దు, దాన్ని హేతుబద్ధం చేయవద్దు లేక దాంట్లో పాల్గొనకుండా జాగ్రత్తపడదాం. మన నేర న్యాయవ్యవస్థ కానీ, అమెరికన్ సమాజం కానీ అత్యున్నత నైతిక నియమావళితో పనిచేయాలని మనం కోరుకుంటున్నట్లయితే అలాంటి నైతిక నియమావళిని ముందుగా మనం ఆచరించి చూపాల్సి ఉంది. రెండో విషయం, మన నేరన్యాయ వ్యవస్థలో పదేపదే సాగుతున్న జాతివివక్షా ధోరణిని ఇలాంటి నిరసనలు, ప్రత్యక్ష పోరాటం మాత్రమే మార్చగలుగుతాయని.. ఓట్లు వేయడం, ఎన్నికల రాజకీయాల్లో పాల్గొనడం శుద్ధ దండగమారి వ్యవహారమని కొంతమంది సూచిస్తుండటాన్ని కూడా నేను విన్నాను. ఈ అభిప్రాయాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నాను. ప్రజల్లో జాగరూకత పెంచడం, అన్యాయాన్ని అక్కడికక్కడే ఎత్తి చూపడం, అధికారంలో ఉన్నవారికి అసౌకర్యం కలిగించడమే నిరసనల లక్ష్యంగా ఉండాలి. అమెరికా చరిత్ర పొడవునా ఇలాంటి ప్రజా నిరసనలు, సహాయ నిరాకరణకు స్పందించడం వల్లే, దేశంలోని రాజకీయ వ్యవస్థ అణగారిన బృందాల సమస్యల పట్ల ఆసక్తి చూపిందని గుర్తుంచుకోవాలి. కాబట్టే ప్రజల ఆకాంక్షలు, వారి ఉద్వేగాలు నిర్దిష్ట చట్టాలుగా, సంస్థాగత ఆచరణగా పరివర్తన చెందాయి. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో మన డిమాండ్ల పట్ల స్పందించేవారిని మనం ఎన్నుకున్నప్పుడు మాత్రమే ఇది సాకారమవుతుంది. అంతకంటే మించి, మన నేరన్యాయ వ్యవస్థపై, పోలీసుల పనితీరుపై ఎలాంటి ప్రభుత్వం అత్యధిక ప్రభావం వేయగలుగుతుందో మనం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మనం రాజకీయాల గురించి ఆలోచిస్తున్నప్పుడు, మనలో చాలామంది అధ్యక్షుడు, ఫెడరల్ ప్రభుత్వం పట్ల మాత్రమే ఆసక్తి పెంచుకుంటూ ఉంటారు. నిజమే. మన సమాజంలో జాతి వివక్ష పాటిస్తున్న అణచివేత స్వభావాన్ని వాస్తవంగానే అర్థం చేసుకుని దానిపై ఏదో ఒక చర్య తీసుకోవాలంటే.. అధ్యక్షుడు, కాంగ్రెస్, అమెరికన్ న్యాయ విభాగం, ఫెడరల్ న్యాయవ్యవస్థ మనకు తప్పకుండా ఉండితీరాలి. అయితే రాష్ట్ర, స్థానిక స్థాయిల్లో ఎన్నికైనవారే చాలావరకు పోలీసు శాఖలో, నేరన్యాయవ్యవస్థలో సంస్కరణల గురించి చాలా ఎక్కువగా పట్టించుకుంటూ ఉంటారని మాత్రం మర్చిపోవద్దు. చాలావరకు పోలీసువిభాగం అధిపతులను మేయర్లు, కౌంటీ కార్యనిర్వాహకులే ఎక్కువగా నియమిస్తుంటారు, పోలీసు యూనియన్లతో సమష్టి ఒప్పందాలపై చర్చిస్తుంటారు. పోలీసుల దుష్ప్రవర్తనపై విచారించాలా వద్దా, అంతిమంగా వారిపై నేరారోపణ చేయాలా వద్దా వంటి విధులను జిల్లా అటార్నీలు, రాష్ట్రాల అటార్నీలు నిర్వహిస్తుంటారు. వీరంతా ఎన్నికైనవారే. కొన్ని చోట్ల పోలీసుల వ్యవహార శైలిని పర్యవేక్షించే అధికారాన్ని పోలీసు సమీక్షా మండళ్లకు ఉంటుంది. కానీ ఈ స్థానిక పోటీల్లో పాల్గొనే ఓటర్ల సంఖ్య.. ప్రత్యేకించి యువతీయువకుల సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. సామాజిక న్యాయానికి సంబంధించిన సమస్యలపై నేరుగా ప్రభావం చూపే ఇలాంటి పదవులను పట్టించుకోకపోవడం తెలివిలేని పని. పైగా.. ఈ కీలకమైన స్థానాల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనే అంశాన్ని కొన్ని వేలమంది ఓటర్లు లేక కొన్ని వందలమంది ఓటర్లు మాత్రమే నిర్ణయిస్తుంటారు. కాబట్టి నిజమైన మార్పు తీసుకురావాలని మనం కోరుకుంటున్నట్లయితే, అలాంటి అవకాశం నిరసనలు లేక రాజకీయాల్లో ఏదో ఒకదానిపై ఆధారపడి ఉండదు. ఈ రెండూ మనకు కావాలి. ప్రజల్లో జాగరూకతను పెంచడానికి మనం జనాల్ని కూడగట్టాలి. పాలనా సంస్కరణలు తీసుకురాగల అభ్యర్థులను మాత్రమే మనం ఎన్నుకునేలా మన ఓటుహక్కును వినియోగించుకునేలా మనం సంఘటితం కావాలి. చివరగా నేర న్యాయవ్యవస్థలో, పోలీసు విభాగంలో సంస్కరణలపై మనం నిర్దిష్టంగా డిమాండ్లు పెట్టాలి, దీన్ని ముందుకు తీసుకురానట్లయితే ఎన్నికైనవారు ఈ కీలకమైన సంస్కరణ పట్ల నామమాత్రంగా మాత్రమే స్పందిస్తూ, ప్రజా నిరసనలు తగ్గుముఖం పట్టాక యధావిధిగా తమ తమ రోజువారీ పనుల్లో మునిగిపోతారు. కాబట్టి సంస్కరణల ఎజెండా విషయం వివిధ సామాజిక బృందాలకు సంబంధించినంతవరకూ వేరువేరుగా ఉంటుంది. మహానగరం విషయంలో ఒక తరహా సంస్కరణలు అవసరం కావచ్చు. గ్రామీణ ప్రజానీకానికి మరో తరహా సంస్కరణలు అవసరం కావచ్చు. కొన్ని ప్రాంతాలకు పూర్తిగా పునరావాసం అవసరం కావచ్చు. ఇతరులకు కొన్ని సంస్కరణలే అవసరం కావచ్చు. అందుకే ప్రతి శాసన అమలు విభాగం కూడా స్పష్టమైన విధానాలు కలిగి ఉండాలి. ఎక్కడైనా దుష్ప్రవర్తనకు సంబంధించిన పరిశీలనకు స్వతంత్ర విభాగం అవసరం కూడా దీనిలో భాగమే. ప్రతి కమ్యూనిటీ అవసరాలకు తగినట్లుగా సంస్కరణలను మార్చాలంటే స్థానిక కార్యకర్తలు, సంస్థలు పరిశోధనలు చేసి ఎలాంటి వ్యూహాలు చేపడితే ఉత్తమంగా ఉంటుంది అనే విషయంపై తోటి పౌరులను చైతన్యవంతం చేయాల్సి ఉంటుంది. దీనికి ప్రారంభ ఘట్టంగా, నేను వైట్‌హౌస్‌లో ఉన్నప్పుడు ఏర్పర్చిన ‘21వ శతాబ్ది విధానాలపై టాస్క్‌ఫోర్స్’ చేసిన కృషిపై ఆధారపడి పౌర, మానవ హక్కులపై లీడర్షిప్ కాన్ఫరెన్స్ అభివృద్ది చేసిన టూల్ కిట్, దానిగురించిన నివేదికను ముందుగా పరిశీ లించాలి. నిర్దిష్ట చర్యలు తీసుకోవడంపై మీకు శ్రద్ధాసక్తులు ఉంటే, ఒబామా ఫౌండేషన్‌లో ఒక నిబద్ధత కలిగిన సైట్‌ను రూపొందిం చాము. సంవత్సరాలుగా స్థానిక, జాతీయ స్థాయిల్లో మంచికోసం పోరాడుతూ వస్తున్న సంస్థలకు, వ్యక్తులకు ఇది ఉపయోగకరమైన వనరుగా ఉంటుంది. గత కొన్ని నెలలుగా అమెరికా కఠిన పరిస్థితులను ఎదుర్కొందని, సమాజంలో స్ఫూర్తి కాస్త తగ్గుముఖం పట్టిందని నేను గుర్తిస్తున్నాను. కరోనా సాంక్రమిక వ్యాధి తీసుకొచ్చిన భయం, విషాదం, అనిశ్చితి, కష్టభూయిష్టమైన పరిస్థితులు వంటివి.. అమెరికా సామాజిక జీవితం ఇప్పటికీ దురభిప్రాయాలు, అసమానత్వంతో నిండివుందని విషాదకరంగా మనందరికీ గుర్తు తెస్తున్నాయి. కానీ గత కొన్ని వారాలుగా ప్రతి జాతిలో, ప్రతి ప్రాంతంలో మన యువతీయువకుల క్రియాశీలతను ఎత్తిపడుతున్న ఘటనలను చూస్తున్నప్పుడు మాత్రం నాకు పరిస్థితి పట్ల ఆశావహంగానే ఉంది. మనం ముందుకు పోవాలంటే మన ధర్మాగ్రహాన్ని శాంతిమార్గంవైపు మళ్లించాలి. నిలకడతో కూడిన సమర్థ కార్యాచరణను చేపట్టాలి. అప్పుడు మాత్రమే మన అత్యున్నత లక్ష్యాలకు అనుగుణంగా మన దేశం సాగించే సుదీర్ఘ ప్రయాణంలో ప్రస్తుత ఘట్టం నిజమైన మూలమలుపు అవుతుంది. బరాక్ ఒబామా, అమెరికా పూర్వ అధ్యక్షుడు -
జార్జ్ హత్య : సత్య నాదెళ్ల స్పందన
వాషింగ్టన్ : ఆఫ్రికన్-అమెరికన్ పౌరుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యపై టెక్ దిగ్గజాలు, గూగుల్, మైక్రోసాఫ్ట్ తమ విచారాన్ని, సంతాపాన్ని వ్యక్తం చేశాయి. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల జాతి వివక్షను, జాత్యంహకారాన్ని ఖండించారు. నల్లజాతి సమాజానికి తమ సంఘీభావం తెలిపిన సత్య నాదెళ్ల సమాజంలో ద్వేషానికి, జాత్యహంకారానికి చోటు లేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికే దీనిపై సానుభూతి, పరస్పర అవగాహన మొదలైనప్పటికీ, ఇంకా చేయాల్సిన అవసరం వుందని ఆయన అన్నారు. (జార్జ్‌ది నరహత్యే !) ఇప్పటికే జార్జ్ ప్లాయిడ్ మృతిపట్ల సెర్చ్ ఇంజీన్ దిగ్గజం గూగుల్ సానుభూతిని ప్రకటించింది. ఈ సంఘటన పట్ల భాధ, కోపం, విచారం, భయంతో ఉన్న వారెవ్వరూ ఏకాకులు కాదు.. జాతి సమానత్వానికి మద్దతుగా నిలబడతామని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి గూగుల్ , యూట్యూబ్ హోమ్‌పేజీ స్క్రీన్ షాట్ ను ఆయన ట్విటర్లో షేర్ చేసిన సంగతి తెలిసిందే. (దేశీయ ఉగ్రవాద చర్యలు: రంగంలోకి సైన్యం) There is no place for hate and racism in our society. Empathy and shared understanding are a start, but we must do more. I stand with the Black and African American community and we are committed to building on this work in our company and in our communities. https://t.co/WaEuhRqBho — Satya Nadella (@satyanadella) June 1, 2020 Today on US Google & YouTube homepages we share our support for racial equality in solidarity with the Black community and in memory of George Floyd, Breonna Taylor, Ahmaud Arbery & others who don’t have a voice. For those feeling grief, anger, sadness & fear, you are not alone. pic.twitter.com/JbPCG3wfQW — Sundar Pichai (@sundarpichai) May 31, 2020 -
జార్జ్‌ది నరహత్యే!
వాషింగ్టన్ : జార్జ్ ఫ్లాయిడ్ (46) మరణంపై అమెరికా అట్టుడుకుతున్న సమయంలో కీలక మైన అధికారిక పోస్ట్‌మార్టం నివేదిక వెలువడింది. అతని మెడపై బలమైన ఒత్తిడి వలనే చనిపోయాడని, ఇది నరహత్య అని మినియాపోలిస్‌లోని హెన్నెపిన్ కౌంటీ వైద్యులు నిర్ధారించారు. పోలీసులు అదుపులో ఉండగా అతడు గుండెపోటుకు గురైనట్లు నివేదిక తెలిపింది. (నల్లజాతి ప్రతిఘటన) అటు ఫ్లాయిడ్ కుటుంబం ఏర్పాటు చేసిన ప్రైవేట్ పరీక్షల విచారణలోనూ ఇది పోలీసుల హత్యగానే నిర్ధారణ అయింది. ఫ్లాయిడ్ కుటుంబానికి చెందిన న్యాయవాది బెంజమిన్ క్రంప్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు జార్జ్‌ని నిరోధిస్తున్నపుడే..గుండె కొట్టుకోవడం ఆగిపోయిందన్నారు. మెడపై ఒత్తిడి కారణంగా మెదడుకు రక్త ప్రవాహం ఆగిపోవంతో మరణించాడని పరీక్షల్లో తేలినట్టు క్రంప్ చెప్పారు. పోలీసుల అమానుషంతోనే అతను మరణించాడని, అంబులెన్సే జార్జ్‌కు పాడెగా మారిందని వ్యాఖ్యానించారు. (దేశీయ ఉగ్రవాద చర్యలు: రంగంలోకి సైన్యం) కాగా మినెసోటా రాష్ట్రంలోని మినియాపోలిస్‌లో గత సోమవారం జార్జ్ ఫ్లాయిడ్ అనే ఓ నల్ల జాతి వ్యక్తిని అదుపులోకి తీసుకునే క్రమంలో తెల్ల జాతి పోలీస్ అధికారి డెరెక్ షావిన్ అతని మెడపై మోకాలితో బలంగా నొక్కుతుండగా ప్రాణాలు కోల్పోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నిరాయుధుడైన ఆఫ్రికన్-అమెరికన్ పౌరుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణానికి పోలీసులే కారణమంటూ ఎగిసిన నిరసనలతో అమెరికా అతలాకుతలమవుతున్న సంగతి తెలిసిందే.